కృష్ణం రాజు గారు మనం చెడ్డి లు ఏసుకోని టైం లో రెబెల్ స్టార్ అని విన్నాం, అప్పట్లో అలా కుమ్మేసారేమో, అయన వారసుడి గా వచ్చిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ని మాత్రం ఫస్ట్ సినిమా నుంచి చూస్తూనే ఉన్నాం, ఈ కటౌట్ కి ఒక మంచి మాస్ మసాల బొమ్మ పడితే నా సామి రంగా అనుకోవటమే తప్ప అలాంటి బొమ్మ కోసం అప్పటి నుంచి ఎదురు చూడటమే మన పని అయ్యింది. ఛత్రపతి ఫస్ట్ హాఫ్ ద్వారా సగం సంతృప్తి మాత్రమే దొరికినా ఫుల్ లెంగ్త్ లో ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తూనే ఉన్నాం, మద్యలో అడపా దడపా మాస్ బొమ్మలు చేసి చేతులు కాల్చుకున్న తర్వాత డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ ద్వారా మాస్ సినిమాల సంగతి తర్వాత చూద్దాం ముందు వచ్చిన క్లాసు హిట్స్ ని ఎంజాయ్ చేద్దాం అని ఒక మైండ్ సెట్ కి వచ్చేసాం, కానీ ఆ మాస్ రోల్ లో చూడాలి అనే కోరిక మాత్రం లోపలే ఉంది పోయింది, ఆ టైం లో మాస్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ తో సినిమా అనగానే ఓహో అనుకున్న సినిమా పేరు రెబెల్ అన్నాక మాత్రం కుమ్ము నా రాజా ఈ సారి ప్రభాస్ మాస్ స్టామిన కి సరి పడ్డ బొమ్మ దొరికింది అనుకున్నాం, పాటలు సగం నీరసం ఇచ్చినా పోస్టర్స్ అండ్ పెద్ద రిలీజ్ సినిమా ముందు రోజు రాత్రి ఎప్పుడెప్పుడు తెల్లరుతుందా అని వెయిట్ చేసేలా చేసాయి. అంత గొప్ప అంచనాల మద్య రిలీజ్ ఐన రెబెల్ ఎం చేసాడు? లారెన్స్ మన నమ్మకం కి ఎంత వరకు న్యాయం చేసాడు? పెద్ద రెబెల్ తో పటు వచ్చిన ప్రభాస్ కి దొరకాల్సిన సినిమా ఏ నా? కాస్ట్ మారి, క్రూ లో మెంబెర్స్ మారి, రెండు ఏళ్ళ తర్వాత వచ్చిన రెబెల్ సంగతి చూద్దామా?
వార్నింగ్ : ఈ సమీక్ష లెంగ్త్ కూడా సినిమా లెంగ్త్ లా ఎక్కువ ఉంటుంది, ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే చదవండి, ఓపిక లేని వాళ్ళు ఫైనల్ గా లాస్ట్ పేరా చదివి ఊరుకోండి సినిమా చూడని వాళ్ళు చదవాల్సిన అవసరమే లేదు.
కళాకారుల పనితీరు:
ప్రభాస్ : డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమా కి 200 % న్యాయం చేసాడు, అండర్ ప్లే చేసిన చోట్ల డార్లింగ్ లా, యాక్షన్ ఎపిసోడ్స్ లో మాచో రెబెల్ లా కుమ్మేసాడు. ఆ మద్య మర్చిపొఇన డాన్సులు కూడా చేసాడు. ఆవేశం తో డైలాగ్ లు అరిపించాడు. డ్రెస్ ల తో భయపెట్టకుండా వదిలేసాడు (లాస్ట్ సాంగ్ లో తప్ప). సాఫ్ట్ కొడుకు గా యాక్షన్ చేస్తూ నవ్వించాడు, అన్ని చేసినా ఎన్ని చేసినా కథని ఎంచుకోవటం తనకి రాదు అని మళ్ళి నిరూపించుకున్నాడు. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే లారెన్స్ ని గుడ్డిగా నమ్మేసాడు. ఇన్ని సినిమాలు చేసాక ఐన తన సినిమాలో తన రోల్ ని ఇలా ఉండాలి ఇలా కావాలి అని చెప్పుకునే స్టేజి కి రాలేదు, ఒక వేల వచ్చి ఉంటె ఇంకా బెటర్ అవుట్ పుట్ వచ్చేది. చాల చోట్ల అసహనం గా కదలటం, కొన్ని చోట్ల లిప్ సింక్ మిస్ అవ్వటం కొంచెం బాధాకరం. అతి అని అతి లా కాకుండా అరవ అతిలా చేసాడు, ఉదాహరణకి : పులి డైలాగ్ చెప్పే సీన్ అండ్ యముడు గా అరిచే సీన్. ఇలాంటివి తను నటన పరం గా చేసిన తప్పు లు అని చెప్పుకొనే కంటే లారెన్స్ అలా చేఇంచుకొని ఉంటాడు అని సర్ది చెప్పుకోవటం బెటర్. ఫాన్స్ కి కూడా ఈగో హార్ట్ అవ్వకుండా ఉంటుంది.
తమన్నా: మాములుగా మాస్ సినిమాలలో హీరోయిన్ కి పెద్దగ ఎం ఉండదు, పాటలకి వచ్చామ వెళ్ళామా, రెండు మూడు డైలాగ్ లు వేసుకున్నామ అని, కానీ ఇక్కడ తమన్నా కి కొంచెం ఎక్కువ లెంగ్త్ ఏ దొరికింది, జెనెరల్ గా రూపాయి కి రూపాయి పావలా చేసే వాళ్ళని చూసాం, ఈవిడ ఇంకొంచెం ముందుకెళ్ళి రూపాయి ముప్పావలా చేసింది. ఓవర్ యాక్షన్ అనే పదం కూడా అలోచించుకొనే రేంజ్ లో చేసింది. ఇంకా క్లియర్ గా తెలియాలి అని ఫస్ట్ హాఫ్ లో నేను అందం గా లేను అన్నాడు అనే సీన్, లాస్ట్ సాంగ్ కి ముందు ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తరవాత సీన్ జస్ట్ ఒక మోస్తరు ఉదాహరణలు, అటువంటివి సినిమా మొత్తం కోకొల్లలు. కోతగా చూపించినది ఏమి లేక పోఇన అవసరం ఉన్న లేక పోఇన అందాలు ఆరబోసింది. ఉన్న సోలో సాంగ్ లో డాన్సు బాగా చేసింది. అంతకంటే చెప్పుకోటానికి ఏమి లేదు. లాస్ట్ ఫైట్ వరకు ఉండగలిగితే మీకు తమన్నా పెర్ఫార్మన్స్ లో పీక్స్ చూడవచ్చు.
పెద్ద రెబెల్: ఆ రోజుల్లో ఎం చేసారో టీవి లో నే చూశాం, కానీ తెరపై ఈయన్ని చూసింది బావ బావమరిది, పల్నాటి పౌరుషం నుంచి మాత్రమె. కత్తందుకో జానకి, నాయాల్ది నరికేస్త అని చింత నిప్పుల లాంటి కళ్ళతో గంభీరం గా చెప్తుంటే టీవి ముందు కూర్చొని చప్పట్లు కొట్టేవాళ్ళం. ఇదంతా ఎందుకంటే ఆ రోజుల్లో ఆ వయసులో ఆ టైం కి అలా కుదిరింది కాబట్టి చెల్లింది, ఇప్పుడు ఒక గౌరవం ఐన స్టేజి లో ఉంటూ ఆ స్టేటస్ ని ఎంజాయ్ చెయ్యాలి కానీ ఇంకా బిల్లా అండ్ రెబెల్ లాంటి రోల్స్ చేస్తాను అంటే ఎలా సారూ? వైట్ అండ్ వైట్ లో వైట్ షూస్ లో వైట్ హెయిర్ తో నల్ల కళ్ళద్దాల తో అద్దం ముందు నిల్చొని చూసుకున్న ఎంత ఎటకారం గా ఉంటుంది అని తెలిసిపోతుంది. నడవటమే ఇబ్బంది గా ఉన్నప్పుడు మనకి ఒక ఫైటే ఉంది సినిమా లో అంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అలోచించి ఉండాల్సింది. మీరు కామెడీ చేసింది చూసి జనాలు ఏడుస్తున్నారు, మీ సీరియస్ యాక్షన్ కం డైలాగ్ ల కి నవ్వుతున్నారు, ఇంకా మీరు చెయ్యాలి అనుకుంటున్నది ఏమైనా ఉంటె చెప్పండి, మిమ్మల్ని తప్పుకోమని అనలేము కాబట్టి మేమే తప్పుకుంటాం.
దీక్షాసెట్: ఇంకా అవకాశాలు ఎలా వస్తున్నాయో అర్ధం కావటం లేదు. ఇంతకు ముందు సినిమా లలో యాక్షన్ చెయ్యక పోఇన జస్ట్ నవ్వు తప్ప ఇంకో ఫీలింగ్ ఇవ్వటం తెలియని తింగరి మొహం తో అలరించి వదిలేసింది. కాని ఇక్కడ ఈ సినిమాలో మనకి ఇంకో అదృష్టం ఉంది, రెండు మూడు పెర్ఫార్మన్స్ సీన్స్ పడ్డాయి, ముగ్గురు అమ్మలా సీన్, దీపాలి అని పెద్ద రెబెల్ కి తెలిసిపొఇన సీన్ అండ్ గుడిలో ప్రాణం విడిచే సీన్, తనకి యాక్షన్ రాదు అని ఇంతకు ముందు రాసిన క్రిటిక్స్ ని క్రికెట్ ఆదేసుకుందాం అని డిసైడ్ ఐనట్టు చేసింది అభినయం. సెకను కు ఒక భావాన్ని పలికించే ఆమె అభినయం సీన్స్ మాత్రమే కట్ చేసి మనకి బాగా కసి ఉన్న వాళ్ళ ని కట్టేసి చూపించేయ్యాలి, సాక్షం లేకుండా చచ్చిపోతారు.
మిగతా అందరు: కోవై సరళ గారి నటన కి పాదాభి వందనం చెయ్యాలి అనిపిస్తుంది, బ్రమ్మి కి చేతులెత్తి నమస్కరించాలి అనిపిస్తుంది, ఎందుకంటే దయ చేసి ఆపెయ్యండి, మా కోసం ఐన క్షమించి వదిలెయ్యండి అని అభ్యర్దించటానికి. హిప్ హాప్, స్విం సూట్ అనిర్వచనీయమైన సీన్స్ అవి, కంట తడి పెట్టిస్తాయి. ఉన్నంతలో ఆలి నవ్వించాడు, ఎం ఎస్ నారాయణ గారిని సరిగ్గా వాడుకోలేదు, సుప్రీత్ కి మంచి రోల్ దొరికినా ఎలా చెయ్యాలో తెలియక ఎప్పటి లాగానే చేసాడు, ఇంకా మిగత తెలిసిన ఆర్ తెలియని మొహాల్లో మనకి లారెన్స్ కనిపిస్తాడు.
సాంకేతిక వర్గం:
సంగీతం: పాటల గురుంచి మళ్ళి చెప్పే ఓపిక లేదు, (ఆడియో రివ్యూ చదవండి), బ్యాక్రౌండ్ మ్యూజిక్ అందించిన చిన్న ని ఏమి అనలేం కానీ, మణి శర్మ, కీరవాణి లాంటి వాళ్ళు అయితే సీన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే వారు, చిన్న మాత్రం ఎం చేస్తాడు, లారెన్స్ అడిగింది ఇవ్వటం తప్ప.
సినిమాటోగ్రఫీ: పర్వాలేదు అనేలా ఉంది, అక్కడక్కడ నాసిరకం అవుట్ పుట్ లా అనిపిస్తుంది
ఎడిటింగ్: కత్తెర మర్చిపొఇన క్షురకుడు బ్లేడ్ తో కటింగ్ చేసినట్టు ఉంది, అప్పుడప్పుడు అయితే లు సాగుతూ సాగుతూ సహన పరీక్ష పెడతాయి, సినిమా లో ఒక ఇరవై నిముషాలు అయిన లేపేసి ఉండాల్సింది సార్ మీరు. అయిన మీరు మాత్రం ఎం చెయ్యగలరు లెండి, అంతా లారెన్స్ గారి ఇష్టం కదా.
ఫైట్స్: ఆల్మోస్ట్ అన్ని ఫైట్స్ కి లీడ్ సీన్స్ బావుంటై, ఆ టైం లో కచ్చితం గా మాంచి ఫైట్ పడాలి అనిపిస్తాయి, ఇంకా చెప్పాలి అంటే ఫైట్ మొదలు ఐనప్పుడు కూడా బాగానే ఉంటుంది, అక్కడ నుంచి మాత్రం ఎప్పుడు అవుతుందా అనిపించేలా ఉంటుంది. సిక్స్ ఫీట్ ఉన్న కుర్రోడు ఇంకో మూడు అడుగులు పైకి ఎగరాల్సిన అవసరం ఏముంది బ్రదర్స్? గాలిలో గింగిరాలు కొడుతూ వచ్చి పొడిసే కంటే పరిగేతుకు వచ్చి పొడిస్తే ఎంత బావుండేది అని అనిపించలేదా మీకు, హైట్ ఉన్నోడికి లేనోడికి ఒకేలా చేస్తూ పోతే ఎలా రామ లక్ష్మణ? ఎలా ?
మాటలు: డార్లింగ్ సినిమా తో జనాలకి దగ్గరైన స్వామి కి మాస్ సినిమా కి రాసే అవకాసం వచినప్పుడే మనోడి లో టాలెంట్ తెలిసిపోతుంది లే అనుకున్నాం, కానీ రెండు ఏళ్ళ ఉపవాశం తర్వాత వస్తున్న పులి అని ట్రైలర్ లో హింట్ ఇచినక కానీ అర్ధం అవ్వలేదు. అర్ధం పర్దం లేని డైలాగ్ లు బోలెడు ఉన్నాయ్. దాక్కొని చెయ్యటం కాదు ముందు కొచ్చి చెయ్యమను అని హీరో అంటే అలాంటి పనులు ఎవరు పబ్లిక్ లో చెయ్యరు అని రైటర్ కి కూడా తెలియదేమో అనిపించింది. ఆవేశం తో ఆకలి కోసం పులి వేట చేస్తుంది కానీ ఆవేశం తో సెపరేట్ గా చేస్తుంది అని కూడా తెలియ చెప్పారు. పేరెంట్స్ ని చంపుతుంటే పక్కనుండి అరిచిన హీరోయిన్ నెక్స్ట్ సీన్ లో వాళ్ళని కాపాడలేక పోయాను అంటే ఆమె అరిచిన అరుపులకి చంపటం మానేసి పారిపోతారు అని కానీ ఏమైనా అనుకుందా సర్ ? ఏదో వీడియో చూసి నేను వెతుకున్న వాళ్ళు మీ నాన్నని చంపిన వాళ్ళు ఒకరే అని హీరో అన్నపుడు అసలు వాళ్ళు ఎవరో హీరో కి తెలియదు కదా సర్ అని లారెన్స్ కి చెప్పాలి అనిపించలేదా మీకు? సర్లెండి ఇంకా ఇక్కడ ఎందుకు లెండి రాసుకుంటూ పోతే మీరు సినిమా కి ఇచిన డైలాగ్ వెర్షన్ అన్ని పేజీలు కావాలి మాకు.
కథ, కథనం, సంగీతం, డాన్సు అండ్ దర్సకత్వం: అనగనగా ఒక గ్రూప్ డాన్సర్, ఒక స్టార్ టాలెంట్ ని గుర్తించి డాన్సు మాస్టర్ ని చేశారు, ఆ రోజుల్లో ఇరగేసిన తర్వాత ఎసినవే ఎస్తూ వచ్చాడు, స్టెప్స్, కొంత కాలానికి ఒక స్టార్ టాలెంట్ ని గుర్తించి డైరెక్టర్ ని చేశాడు, ఫస్ట్ సినిమా మాస్ తో హిట్ కొట్టిన దగ్గర నుంచి తీస్తూనే ఉన్నాడు, హిట్ ఇచిన పుణ్యానికి అవకాశం ఇచ్చిన హీరో ని ఏమి అనలేము కానీ, అదే హీరో ఈయన్ని సంగీత దర్శకుడి గా పరిచయం చేశాడు. పక్కన నిల్చోబెట్టిన పాపానికి చంక ఎక్కేసాడు మన లారెన్స్, ఇలా అయితే ఇంకా ఎవరు చాన్సులు ఇవ్వరు అనుకున్న టైం లో ఎం చెప్పాడో ఎలా చెప్పాడో కానీ ప్రభాస్ తో సినిమా పట్టేసాడు. అంతకు ముందు తీసిన డాన్ సినిమా కి చేసినట్టే ఈ సినిమా ని కూడా బాగా లేట్ చేసి, మద్య లో తన సినిమా తీసుకొని హిట్ కొట్టి, ఈ సినిమా బడ్జెట్ మాత్రం డబుల్ చేసేసాడు. ఇంత చేసి ఎం చెప్పాడు అంటే, వేసిన స్టెప్స్ ఏ వేసినట్టు తీసిన సినిమానే మళ్ళి తీసేసి మనమీదకి వదిలేసాడు. డైరెక్టర్ గా అవకాసం వచ్చిన మాస్ సినిమా ని, మ్యూజిక్ డైరెక్టర్ గారి అవకాసం ఇచిన డాన్ స్టైల్ లో కలిపేసి రెబెల్ అన్నాడు. ముందు చెప్పుకున్న రెండు సినిమాలలో కథ ఉండదు, కానీ ఒక దాంట్లో కథనం ఇంకోదంట్లో స్టైల్ ఉంటై, ఆ రెండు కలిపితే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చి ఉంటుంది మన లారెన్స్ కి, పెన్ పేపర్ తీసుకొని, తీసుకొని ఉండడు లెండి, ఆ రెండు సినిమాల డివిడి లు ఏసుకోని ఈ సినిమా రాసేసుకున్నాడు. ఇంత సేపు ఆ సినిమా లా గురుంచి ఎందుకు చెప్తున్నా అనేది కూడా లాస్ట్ లో చెప్తా. రెబల్ విషయానికి వస్తే, ఒక సాధారణమైన కమర్షియల్ రివెంజ్ సినిమా. కమర్షియల్ సినిమాకి లాజిక్ లు అవసరం లేదు అని ఎక్కడో చదివే ఉంటాడు లారెన్స్, అందుకే దాని జోలికి పోలేదు, ఇంకా లారెన్స్ కి తెలిసిన కమర్షియల్ సూత్రం , సినిమాలో మూడు నాలుగు మాంచి ఎపిసోడ్స్ ఉంచుకొని మిగతా అంతా అండర్ ప్లే చేస్తే సినిమా పే చేస్తుంది. ఈ విషయం అతని ముందు సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. దానికోసం అని చిల్లర కామెడీ రాసుకొని, అండర్ ప్లే చేస్తూ ఫస్ట్ గంట లాగించేసాడు, రెండో పాట అయ్యాక హీరో ఎలివేషన్ పెట్టుకున్నాడు, పెద్ద బ్యాంగ్ పెట్టి ఇంటర్వల్ ఇచాడు, మళ్ళి లాగించేసి గుడి దగ్గర ఫైట్ పెట్టాడు, మళ్ళి సాగించి మాస్ సాంగ్ నుంచి మొదలు పెట్టి లాస్ట్ లో మాంచి ఫైట్ సెట్ చేసుకున్నాడు. ఇంతకు మించి చేసింది ఏమి లేదు, ఈ ప్రాసెస్ లో చెప్పుకోవాల్సినవి ఇంటర్వల్ బ్యాంగ్, గుడి దగ్గర ఫైట్ అండ్ లాస్ట్ లో వచ్చే సీన్స్. ఈ మూడు మాత్రం కుమ్మి అవతలపాడేశాడు. ప్రభాస్ కట్ అవుట్ ని ఎలా ఉపయోగించుకోవాలో అలా పెర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. మాస్ పల్స్ ఎక్కడ పట్టాలో అక్కడ పట్టాడు, అందుకే అన్ని చోట్ల అతి చెయ్యల్సినంత చేసి మేము మాస్ అమ్మా అనిపించాడు. బి అండ్ సి సెంటర్స్ లో దేనికి ఎలా రెస్పాండ్ అవుతారో దానిని అలా అందించాడు. వాళ్ళకి కొత్తగా ఎం చూపించాడు అని అవసరం లేదు, ఎం చెప్దాం అనుకున్నాడు అని వాళ్ళు అడగరు, లాజిక్ లు పట్టించుకోరు, ఎమున్నాడు ర హీరో, ఎం కొట్టాడు రా, డాన్సు ఎం ఎశాడు రా, ఎంత స్టైల్ గా ఉంది రా, ఈ మాత్రం చాలేహే మళ్ళి సూసేయోచ్చు అంటారు, అంటున్నారు కూడా. (ఇదేదో వాళ్ళని కించపరచాలి అని చెప్పటం లేదు, అలాంటి సినిమాలని ఇంతకు ముందు ఆదరించారు కాబట్టి చెప్తున్నా). ఇంక అసలు విషయానికి వస్తే సుప్రీత్ రోల్ లారెన్స్ కోసం రాసుకున్నాటు ఉన్నాడు, ఇద్దరు సిక్స్ ఫీట్ రెబెల్స్ మద్య నలిగిపోతను అనుకున్నాడో, జనాలు నలిపెస్తారు అని భయపడ్డాడో తెలియదు కానీ వెయ్యలేదు, హమ్మయ్య అనుకోకండి, జస్ట్ ఆన్ స్క్రీన్ లేదు అంతే, ప్రతి పాత్ర లో ను పరకాయ ప్రవేశం చేసి ఎవర్ని చూసిన లారెన్స్ ని చూసినట్టే అనిపించేలా చేశాడు. ఉదాహరణ కి : తమన్నా కి తన మరదలి ని పరిచయం చేసే సీన్ లో మనం ప్రభాస్ ని చూస్తున్నామ లారెన్స్ ని చూస్తున్నామా అనే సందేహం కలగక మానదు, స్వతహాగా డాన్సు మాస్టర్ ఐన లారెన్స్ హిప్ హోప్ డాన్సు ని హత్య చేసి కామెడీ కి వాడుకున్న తీరు శోచనీయం. లారెన్స్ స్కూల్ లో విల్లన్స్ అంటే సూట్ లు వేసుకుంటారు అని , వాళ్ళ కింద పని చేసే వాళ్ళు జాకెట్స్ వేసుకోవాలి అని, ఇంట్లో ఐన గుడిలో ఐన షూస్ విప్పకూడదు అని, నైట్ ఐన గ్లాస్సెస్ తీయకూడదు అని ఊరి పెద్ద దగ్గర గన్స్ తో బాడి గార్డ్స్ ఉంటారని, పెద్దలు తలచుకుంటే పోలీసు స్టేషన్ కి తాళాలు వేసేయ్యగలరు అని, ఎవరో వచ్చి తంతారు అని పోలీసు స్టేషన్ లో తలుపు మూసుకొని పని చేస్తారు అని, కమర్షియల్ సినిమా లో హీరో కి లేక పోఇన హీరోయిన్ కి సోలో సాంగ్ ఉన్దోచు అని, స్లో మోషన్ అంటే హీరో ఒకడు స్లో గా నడిస్తే చాలు వెనక వాళ్ళు మాములుగా నడొచ్చు అని, హీరో ఫస్ట్ హాఫ్ లో టైం మారినా సీన్స్ మారినా ఒకే డ్రెస్ లో ఉంటాడని, ఫ్లాష్ బ్యాక్ మొత్తం విన్నాక కూడా ఆపిల్ తిని నిను ఏ తల్లి కన్నదో అనే సాంగ్ పాడాలి అని, దొరకాల్సిన వాళ్ళు దొరికేసాక నన్ను చంపుకోండి ఐదు నిమిషాల్లో అని టైం ఇవ్వోచు అని, గన్స్ వాడొద్దు అని హీరో టీచర్ లా చెప్తే బేసిక్ గా విల్లన్స్ కూడా స్టూడెంట్స్ లా ఫాలో అవుతారు అని, అబ్బో ఇట్టంటివి చాల చాలా తెలుసుకోవచ్చు మనం. ఐన చూసేసిన తర్వాత మనం ఎంత చేపుకున్న ఎం లాభం?
ఇందాక రెండు సినిమా గురుంచి ఎక్కువ చెప్పేసాను, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, సరదాగా మాస్ సినిమా గురుంచి మాట్లాడుకుందాం, ఫస్ట్ ఒక మర్డర్ అవుతుంది (అవుతుంది) , హీరో వైజాగ్ వస్తాడు, వచ్చి సత్య గాంగ్ గురుంచి అడుగుతాడు (ఇక్కడ హైడ్ వచ్చి స్టీఫెన్ రోబెర్ట్స్ గురుంచి అడుగుతాడు, ఇంతకు వాడు ఒకడ యిద్దర అని మనకి లాస్ట్ వరకు తెలియదు), చచ్చి పోఇన వాడి వైఫ్ కి మనకి వినపడకుండా ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు (DIG పిల్లలకి చెప్తాడు), మాస్ గా పరిచయం చేసుకొని వార్నింగ్ ఇస్తాడు (రెబెల్ గా పరిచయం చేసుకొని వార్నింగ్ ఇస్తాడు), ఒక ఫైట్ లో ఛార్మి కి నిజం తెలిసిపోతుంది( తమన్నా కి కూడా తెలిసిపోతుంది), ఇక్కడ అక్కడ ఇంటర్వల్. ఛార్మి నిలదీస్తే స్టొరీ చెప్తాడు (ఇక్కడ తమన్నా నిలదీస్తే సుప్రీత్ మొదలు పెడతాడు), హీరో అనాధ, హీరోయిన్ పడిపోతుంది (హీరోయిన్ అనాధ , హీరో పడిపోతాడు), ఫ్రెండ్ ని చంపేసి హీరోయిన్ ని తీసుకుపోతారు, పోయింది అనుకుంటాం మనం( ఫ్యామిలీ ని చంపేసి, హీరోయిన్ ని కూడా చంపేస్తారు), పగ తీర్చుకోటానికి హీరో వచాడు అని చెప్పి లాస్ట్ లో కి వెళ్తుంది సినిమా (ఇక్కడ మాత్రం వేరేల ఎందుకు ఉంటుంది), కిడ్నాప్ అని చెప్పి జ్యోతిక ట్విస్ట్ ఇస్తుంది (ఇక్కడ తమన్నా ఇస్తుంది), కట్ చేస్తే లాస్ట్ ఫైట్ (ఇక్కడ కట్ చెప్పేసాక కూడా ఫైట్ అవుతూనే ఉంటుంది). అది మాస్ = ఇది రెబల్. మీకు డాన్ లో లాస్ట్ ఫైట్ గుర్తుందా లారెన్స్ చనిపోతే, అనుష్క బంది గా ఉంటె నాగార్జున గాళ్స్ తో బోయ్స్ తో ఫైట్, (ఇక్కడ సుప్రీత్ చనిపోతే తమన్నా బంది గా ఉంటె ప్రభాస్ కూడా బాయ్స్ తో గాళ్స్ తో ఫైట్). ఇంతకు మించి సినిమా లో మీకు ఎమన్నా ఉంది అనిపిస్తే నాకు చెప్పండి. ప్లీజ్.
చివరిగా : ముందు చెప్పుకునట్టు మాస్ కి కావాల్సింది ఉంది సినిమాలో, మూడు మాంచి ఎపిసోడులు అందులో ఒక మంచి ఇంటర్వల్ బ్యాంగ్, డాన్సు లు, చిల్లర కామెడీ అన్ని వెరసి బి గ్రేడ్ రేంజ్ లో తీసిన రెబల్ బి అండ్ సి సెంటర్స్ లో తన బిజినెస్ తను చేసుకొని పోతుంది, అధిక రక్త పాతం, ఇబ్బంది పెట్టె కామెడీ లు ఫ్యామిలీ క్రౌడ్ ని కొంచెం దూరం గా ఉంచవచ్చు, మనలాంటి సిని జనం మాత్రం తోపు సినిమా అని చెప్పలేము కానీ ప్రభాస్ కోసం ఐన ఒక సారి చూసేయ్యోచ్చు.
అసలు సిసలైన కమర్షియల్ మాస్ hit కోసం వెయిట్ ఇంకా అవ్వలేదు, ఏదో ఒకరోజు మీరు మాస్ హిట్ కొడతారు రాజు గారు , మా కోసం కొడతారు... అంత వరకు మేము కొట్టిన్చుకుంటాం మీ సినిమాలతో.
అచ్చు తప్పులు ఉండవచ్చు... మన్నించగలరు.... మీ హరి కృష్ణ రాజు
6 comments:
nee reviews lo one of the best review hari
Review adhiripoyindi. Fight Masters tho nuv chesina action episode temple fight range lo vundi :D
Rating: 5/5 Aripinchesaav.
super anna
BAvundi hari nee review.. i didnt see the pic.. but choosina feeling kaligindi..
Vammo ...ela raasavo emo kaaani naku chaduvuthuntene oopiri theesukoravatle....gud review....
good review.. i enjoyed it.. hilarious
Post a Comment