My Take on BALUPU


మాస్ మహారాజా రవి తేజ అప్పుడెప్పుడో మిరపకాయి తో అలరించిన తర్వాత వరసగా దొంగల ముఠా, వీర, నిప్పు,  దరువు, దేవుడ్కి చేసిన్కి మనుషూల్, సారోచ్చారు (డబల్ హ్యాట్రిక్లాంటి అద్బుతాలతో కెరీర్ లో నే వరస్ట్ ఫేజ్ లో ఉన్నపుడు, అంతకు ముందు డాన్ శీను తీసిన గోపించాంద్ దర్శకత్వం లో వస్తున్న బలుపు సినిమా అనగానేఅటు అంచనాలు కానీ అభిప్రాయాలు కానీ ఎలా ఉండబోతుందో అనే ఆలోచనలు కానీ దరిదాపులకి రానివ్వలేదు బలుపు. ట్రైలర్ లో ఉండాల్సిన పంచ్ లేక, పాటల్లో కిక్ లేక,  రవి నుంచి రాబోతున్న ఇంకో సినిమా - అంతే - అనుకునే టైం కి దిల్ రాజు గారు మంచి ప్రైస్ కి నైజాం రైట్స్ కొన్నారు అని మార్కెట్ లో కి న్యూస్ వచ్చాక బలుపు రిలీజ్ ఒక న్యూస్ అయ్యింది. రిలీజ్ కి రెండు రోజుల ముందు పాజిటివ్ టాక్ తో రిలీజ్ అయ్యి మార్నింగ్ షో కి అదే పాజిటివ్ మార్క్ సంపాదించుకొని హిట్ దిశగా దూసుకుపోతున్న బలుపు సినిమా లో ఏముంది? సినిమా పరంగా ఎలా ఉంది? ఒక లుక్ వేద్దామా

సినిమా చూసిన వాళ్ళు చూడని వాళ్ళు చూడాల్సిన వాళ్ళు అని తేడా లేకుండా ఓపిక ఉన్న ఎవరు అయినా చదివేయ్యోచు, చదివినంత మాత్రాన స్పాయిల్ అయిపోయే అనుభూతులు ఏవీ లేవు ఇక్కడకళాకారుల పనితీరు:

రవి తేజ: ముందు సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకు పోవటమే కాక ప్రతి సినిమా కి అదే ఎనర్జీ తో కృషి చెయ్యటం మెచ్చుకోవాల్సిన విషయం. వయసు దాచే స్టేజ్ ఎప్పుడో దాటిపోయాడు కాబట్టి టాపిక్ ని పక్కన పెట్టేద్దాం. డాన్స్ లో కూడా నాగార్జున స్టైల్ కి వచ్చేశాడు, ఇంత కంటే చెప్పేది లేదురవి ఎంత కామెడీ చేసినా, ఎన్ని సినిమాలలో చేసినా కొత్తగా చెయ్యటానికి ఎం ఉండదు, అదే కొట్టుడు, అవే తిట్లు, అవే బూతులు, కాక పోతే ఒక్కో సారి కామెడీ వర్కౌట్ అయిపోతే సినిమా నిలబడి పోతుంది. సారి బ్రహ్మి తో కలిపి రవి పండించిన కామెడీ బాగా పండింది. బాగా ఆరితేరిన టైమింగ్ అవ్వటం వలన చాలా సునాయాసం గా చేసేశాడు .  సీరియస్ రోల్ లో పెద్దగా చేసేయ్యటానికి ఎం లేదు, టైటిల్ లో ఉన్న బలుపు డైలాగ్స్ లో లేక క్యారెక్టర్ లో లేక సీరియస్ క్యారెక్టర్ బాగా తేలిపోయింది. ఇంతకు ముందు గెడ్డం తో కామెడీ ని పండించిన బాబు సారి సీరియస్ రోల్ కి గెడ్డం పెట్టాడు. అంటే కొత్తగా ట్రై చేసినట్టే అనుకోవాలి ఏమో.. 

శ్రుతి హాసన్: చాలా యాక్టివ్ గా ఉండే క్యారెక్టర్, కష్టపడి చేసినట్టు ఉంది, ఇంత కంటే చెయ్యలేదు ఏమో లే అని సరిపెట్టుకోవాల్సి వస్తుంది. డైలాగ్స్ ని ఏదోలా మేనేజ్ చేస్తున్నా రియాక్షన్ ఇవ్వాల్సిన సీన్స్ కి క్లోజ్ అప్ షాట్స్ వేసుకోవాల్సి వచ్చింది డైరెక్టర్ కి, నటన తో మనం చేసేది ఏమి లేదు అనుకుందో ఏమో సారి గ్లామర్ పై శ్రద్ధ పెట్టింది. అలా ఇలా ఎలాగోలా అలరిద్దాం అనుకున్నాపక్కన కామెడీ ఉండటం వలన సరిపోయింది కానీ లేక పోతే కష్టమే సుమీ

అంజలి: చిన్న రోల్ అయిన కూడా కొంచెం భరువైన రోల్, సింపుల్ గా చేసినా సీరియస్ గా  ఆలోచించాల్సింది డైలాగ్ డెలివరీ గురుంచి. సీతమ్మ అల్లరి పిల్ల కాబట్టి చెల్లిపోయింది కానీ ఇక్కడ రోల్ కి తగ్గట్టు సీరియస్ సన్నివేశాల్లో అదే మాడ్యులేషన్ తో నవ్వించింది. తను ఉన్నంత సేపు తప్ప మిగతా టైం లో కానీ సినిమా అయిపోయాక కానీ గుర్తుండే పాత్ర కాదు

బ్రహ్మానందం: రవి అండ్ బ్రాహ్మి ది ఒక బీబత్సమైన కాంబినేషన్, ప్రతి సారి తినేవి అవే దెబ్బలు తిట్లు అయినా కూడా నవ్వించారు. టైమింగ్ తో ఫుల్ లెంగ్త్ లో అలరిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో బ్రాహ్మి లేని లోటు క్లియర్ గా కనిపిస్తుంది అంటే ఆలోచించండి ఫస్ట్ హాఫ్ లో ఎంత రచ్చ చేశారో

ఇతరులు: ప్రకాష్ రాజ్ ఎప్పటి లాగానే, అశుతోష్ రొటీన్ గా చేశారు. మిగతా అందరూ ఏదో మేము కూడా ఉన్నాం అనే టైపు లో నే తప్ప చెప్పెసుకునే రేంజ్ లో పాత్రలు లేవు పెర్ఫార్మన్స్ లు లేవు

సాంకేతిక వర్గం

సంగీతం: ఇటు పాటలు కానీ అటు BGM కానీ ఇంప్రెస్ చెయ్యక పోగా విసిగించాయి.   ఇయర్ లో థమన్ కి ఇది 11 సినిమా (తెలుగు + తమిళ్ కలిపి), ఇదే స్పీడ్ లో ఇదే అవుట్ పుట్ ఇచ్చే కంటే టైం తీసుకొని కొంచెం గుర్తుండే లా సినిమాలు చేస్తే మంచిది మనకి తనకి కూడా 

సినిమాటోగ్రఫీ: బావుంది 

ఎడిటింగ్: గుడ్, సెకండ్ హాఫ్ ని ఇంకాస్త కుదిస్తే ఇంకా బావుండేది 

కథ - మాటలు : చెప్పుకోటానికి కథ అంటూ గొప్పగా ఎం లేదు, ఎంటర్టైన్మెంట్ ని మెయిన్ గా పెట్టుకొని యాక్షన్ కలిపి వండిన పులిహోర. మాటలు కామెడీ ని బాగా పండించగా ఎమోషనల్ మరియు యాక్షన్ సీన్స్ లో తేలిపోయాయి. పేస్ బుక్ రిఫరెన్స్ డైలాగ్ లు విసిగించగా పుల్కా డైలాగ్ లు నవ్వించాయి. సీరియస్ సన్నివేశాల్లో వచ్చే డైలాగ్ లు ఇంకా ఇంకా నవ్వుంచాయి

కథనం -  దర్సకత్వం : బాగా నలిగిపోయిన తెలుగు సినిమా కమర్షియల్ ఫార్ములా ని నమ్ముకొని కామెడీ జోడించి చుట్టేసిన కథనం అంతే. ఒక ట్విస్ట్ పెట్టుకొని, అది ఇంటర్వెల్ ముందే ఇవ్వాలి కాబట్టి అప్పటివరకు పుల్కా కామెడీ చేసి ఫస్ట్ హాఫ్ ని పాజిటివ్ ఫీల్ తో ముగించి, అసలు కథ సెకండ్ హాఫ్ లో ఓపెన్ చేసి, ఫ్లాష్ బ్యాక్ అయ్యే సరికి లాస్ట్ సాంగ్ అండ్ క్లైమాక్స్. కొత్తదనం ఏమాత్రం లేని లైన్ ని మనకి ఇంతకు ముందు వచ్చిన తెలుగు సినిమాల సక్సెస్ ఫార్ములా నమ్ముకొని లాగించేసారు. అటు ఫస్ట్ రెండు సినిమాలలో కనిపించని దర్శకత్వ ప్రతిభ సినిమా లో మాత్రం ఎందుకు ఉంటుంది ? అదే ఉంటె సెకండ్ హాఫ్ అలా ఎందుకు ఉంటుంది? బలుపు లాంటి పవర్ఫుల్ టైటిల్ కి రవి లాంటి ఎనర్జీ ఉన్న హీరో కి హీరోయిజం పండాలి అంటే విలనిజం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి గా? ఈడెవడో హీరో కోసం ఇంతలా వెతుకున్నాడు ఇద్దరూ ఎదురుపడితే యుద్ధాలే అనుకుందాం అంటే, అసలు ఒకప్పుడు వెతికినోడు బతికిందే హీరో మీద ఆధారపడి అని తెలిసినప్పుడు వార్ వన్ సైడ్ అయిపోలేదా? కొడుకుల్ని పోగొట్టుకొని ఉన్న ప్రతినాయకుడు దేశం మొత్తం వెతికి చివరకి దొరకాల్సిన వాడు దొరికాక ఎసేయ్యటం మానేసి మగాడివి అయితే అని డైలాగ్ కొట్టటం ఏంటి? ఇదే పాయింట్ మీద ఇంటర్వెల్ కీ అయిపోయిన సినిమా గురుంచి చర్చ ఏంటి???.. సరే సగం కె సినిమా అయిపొయింది అంటే సగం డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది అని సెకండ్ హాఫ్ ప్లాన్ చేశారు అనుకున్నా, సెకండ్ హాఫ్ లో బలుపు ఏది? లవ్ లో ఫీల్ ఏది? రౌడీయిజం ని వదిలేసిన ఫ్లాష్ బ్యాక్ ఉంచుకొని ఫస్ట్ హాఫ్ లో ఫైట్లు ఏందీ? దానికి మళ్ళి బలుపు ని వదలలేదు అనే జస్టిఫికేషన్ ఏంటి? సరే ఇది జరిగింది అని తెలుసుకున్నాక ఇంటర్వెల్ కి ముందు విలన్ డైలాగ్ ఎందుకు చెప్పాడు ఇద్దర్నీ వెసెయ్యక అనుకునే టైం లో మళ్ళి వచ్చిన హీరో బలుపు తో నాలుగు తన్ని తెల్చెయ్యక (అంటే  రౌడీయిజం ని వదిలేశాడు గా) మళ్ళి ఆత్మ గోల ఏంటి? పోనీ ఇంతా చేసి కొట్టడం మానేశాడ అంటే అదీ లేదు, ఫైనల్ గా కొట్టేసి మళ్ళి బలుపు డైలాగ్ తో ముగింపు వెయ్యటం ఏంటి.. అంటే ఇంతకు ముందు అనుకునట్టు ఇంటర్వెల్ లో ఒక సారి, ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక ఇంకో సారి అయిపోయిన సినిమా ని శుభం కార్డు పడే వరకు చూసాం అన్నమాట, అంత వరకు కూర్చొని చూసేలా చెయ్యటం సినిమా కి ప్లస్ అన్నమాట, ఇవన్ని నాకెందుకు..  వచ్చానా..  చూసానా..  వెళ్లానా.. అని అనుకోని ఉంటె రాస్తున్న నాకు చదువుతున్న మీకు ఎంత టైం కలిసోచ్చేది :) 

చివరిగా: ఇంకాస్త పట్టు ఉన్న సెకండ్ హాఫ్ అండ్ మంచి సాంగ్స్ తోడై ఉంటె బలుపు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేది, మధ్య కాలం లో రవి నుంచి వచ్చిన సరదా కాలక్షేపం లాంటి సినిమా. గొప్ప గాను లేదు చెత్త గాను లేదు, ఒక సారి చూడటం వలన మనకి పోయింది లేదు, సినిమా లో రవి చెప్పినట్టు LCD, LED , 3D లో ఇది LED టైపు.. చూసినవాళ్లు గుర్తు తెచ్చుకోండి చూడని వాళ్ళు చూసి తెలుసుకోండి.. చూసి కూడా మర్చిపోయిన వాళ్ళు ???? గుర్తుండి అర్ధం కాని వాళ్ళు?? మనం కామెంట్స్ లో మాటాడుకుందాం 

సరదాగా .. కాలక్షేపం కి ఒక ప్రయోగం .. బలుపు కథనం అనే పులిహోర ని బాగా సినిమాలు ఫాలో అయ్యే మూవీ లవర్స్  కథ ని ఎలా వండి ఉంటారు అని చేసే శోధన 

బలుపు అనే యాక్షన్ ఎంటర్ టయినర్ సినిమా కథ, ఇద్దరు హీరోయిన్ లు,  నాలుగు ఫైట్ లు, ఐదు పాటలు, మంచి కామెడీ ఉండాలి,   ప్లెయిన్ నెరేషన్ లో చెప్పుకుంటే.. అనగనగా ఒక హీరో .. అనాధ.. కమర్షియల్ సినిమా కి ఫ్లాష్ బ్యాక్ అవసరం కాబట్టి తనకి ఒక ఫ్లాష్ బ్యాక్, సో ప్రస్తుతం సింపుల్ లైఫ్ ని గడపాలి,  ఫ్లాష్ బ్యాక్ వైజాగ్ అనుకుందాం కాబట్టి ఇప్పుడు వేరే ప్లేస్.. బెంగుళూరు బావుంటుంది గా (ఎక్కడ ఎవరూ కన్నడ మాట్లాడక పోయినా, సైన్ బోర్డ్స్ కనిపించిక పోయినా ఆడియన్స్ నమ్మేస్తారు బెంగుళూరు అనే) సోలో  సాంగ్ పెట్టె అవకాశం లేదు - అసలే సింపుల్ లైఫ్ - ఫ  సో ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఒక ఫైట్ పెట్టి ఎంట్రన్స్ ఇచ్చి పాట పెట్టుకుందాం, సో ఒక బాడ్ బాయ్ అండ్ ఒక ఐటెం గాల్. బాడ్ బాయ్ అమ్మాయిని ఏదో చెయ్యబోతే హీరో కాపాడితే ఈడే హీరో అని జనాలకి అర్ధం అయిపోవాలి, కట్ చేస్తే, క్రికెట్ బాట్ తో ఫైట్. (ఏంటి రికవరీ ఏజెంట్ నైట్ టైం ఫ్లడ్ లైట్స్ లో ఫార్మల్ డ్రెస్ లో టై కట్టుకొని ఫార్మల్ షూ ఏసుకొని క్రికెట్ ఆడుతూ ఉండగా ఫైట్ - దర్శకత్వ ప్రతిభ).. అవును క్రికెట్ బాట్ తో నే చితక్కొట్టెశాక పాట, హీరో కి ఒక ఫాదర్.. జనరల్ గా ఫాదర్ ఉండటం కామన్ ఏ గా అమ్మని కూడా పెడదామా.. నో ఇది నేను ట్విస్ట్ కోసం రాసుకున్న క్యారెక్టర్ (అంటే అమ్మ లేక పోయిన.. ఫోటో లో కూడా చూపెట్టక పోయినా.. తండ్రి కొడుకులు అమ్మ గురుంచి మాటాడక పోయినా వీళ్ళు రియల్ ఫాదర్ అండ్ సన్ అనే సగటు ప్రేక్షకుడు అనుకుంటాడు అని ఎంత నమ్మకం) కాబట్టి ఓన్లీ ఫాదర్. హీరోయిన్ కామెడీ కోసం అన్నయ్య లేక మావయ్య.. ఇక్కడ యంగ్ కమెడియన్ కొరత ఉంది సో మావయ్య.. హీరో తో కలపాలి కాబట్టి హీరో ఫ్రెండ్ తో లింక్ పెడదాం.. (అంటే హీరో ఫ్రెండ్ బైక్ అమ్మేసినా.. ఎంత చేసినా .. చచ్చిపోదాం అనుకునే వరకు ఫ్రెండ్స్ కి మాట చెప్పడు.. వాళ్ళు అడగరు..  OKOK).. ఒక మూడు కామెడీ సీన్స్.. సొంగ్.. మళ్లి కామెడీ.. ఇంతలో ఫ్లాష్ బ్యాక్ హింట్ ఇవ్వక పోతే జనాలు మర్చిపోతారు సో అక్కడక్కడ హీరో కోసం వెతుకుతున్న విలన్.. ఈ సరి డ్యూయెట్  పాట పెట్టాలి అంటే హీరోయిన్ పడిపోవాలి కాబట్టి ముందు ఒక ఫైట్ పెడదాం.. ఈ ఫైట్ కి కోత్తోల్లు ఎందుకు, ఆల్రెడీ తన్నులు తిన్న ఫస్ట్ గ్యాంగ్ ఉంది గా, సిగ్గు లేకుండా ఎన్ని సార్లు అయినా తింటారు.. వాళ్ళతోనే టాయిలెట్ లో ఫైట్.. యా కొత్తగా ఉంటుంది లేడీస్ టాయిలెట్ లో పెడదాం (సినిమా లో లేడీస్ టాయిలెట్ అనే డైలాగ్ ఉంటుంది, వెనక లేడీస్ వెళ్తూ ఉంటారు కానీ ఫైట్ టైం కి మనకి జెంట్స్ రెస్ట్ రూం కనిపిస్తుంది - దర్శకత్వ ప్రతిభ). ఇక్కడ ఫస్ట్ ఫైట్ చేసినోడిని తెచ్చి హీరోయిన్ తో లింక్ పెడదాం (మనసులో వాట్ అ లింక్ అనుకుంటూ.. ఎంగేజ్మెంట్ అయిపోయి పది రోజుల్లో పెళ్లి ఉన్నా ఫోన్ కాదు కదా sms కూడా చేసుకొని జంట) ఇంకా సగాతీయటం ఎందుకు ట్విస్ట్ కి వచ్చేద్దాం. వెతుకుతున్న విలన్ కి, ఫైట్ లో దెబ్బ తిన్నోడికి హీరోయిన్ కి లింక్ పెడితేనే కానీ ట్విస్ట్ ఓపెన్ అవ్వదు కాబట్టి ఒక మాంచి ఫైట్ సెట్ చేద్దాం, ఈ మద్య మిర్చి లో పంచె ఫైట్ ఫేమస్ అయ్యింది గా, మన హీరో కి ఎంగేజ్మెంట్ కె పంచె కట్టించి ఫైట్ చెయించుదామ్. ట్విస్ట్ ఓపెన్.. భారి డైలాగ్.. ఫైట్.. విలన్ వెతుకుతున్న వాడు హీరో ఒకరే.. హీరో తో పాటు తన శత్రువు కూడా దొరికాడు, సో వాడిని పొడిచేసి బెడ్ మీద పడుకోబెడితే నే సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది (ఇద్దర్ని పోదిచేస్తే సినిమా అయిపోద్ది), మాగాదివైతే హీరోయిన్ ని తీసుకెళ్ళు అని వేసిన ఛాలెంజ్ లో.. ఆల్రెడీ మగాడు అని తెలిసిన హీరో తెల్లబోయి చూస్తుంటే ఇంటర్వెల్.. (ఇంత జరుగుతున్నా ఫస్ట్ హాఫ్ లో వచ్చిన కామెడీ గురుంచి మాట్లాడుకున్నారు తప్ప ఇంటర్వెల్ బాంగ్ గురుంచి మాట్లాడిన ఆడియన్స్ కనపడలేదు నాకు మరి) కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్.. బలుపు ఎంట్రన్స్.. ముందు నుంచి అనుకునట్టు వెతికే వాడికి హీరో కి ప్రొబ్లెమ్ అంటే సింపుల్ ప్లాట్ అయిపోతుంది, సో వెతికే వాడి గ్రూప్ లో చేరిన హీరో.. (సో ఫస్ట్ హాఫ్ లో కలిసి ఉన్న వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ శత్రువులు.. ఫస్ట్ హాఫ్ లో శత్రువుల అనుకున్న వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ లో  కలిసిఉన్నారు .. అసలు ఏంటి ఈ సింక్ ఇలా కుదిరిపోతుంది.. ఎలా చూసుకున్న విలన్ అనే వాడు ఎక్కడ ఉన్నట్టు).. గ్రూప్ లో గొడవ అవ్వాలి.. అవతలి వాడి తో కలవాలి.. సో వాడికి కూతురు గ్రూప్ లో విలన్ కి కొడుకు ని పెడదాం. డైరెక్ట్ కూతురు అంటే సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ ఉండదు కదా డాక్టర్ గా పరిచయం చేద్దాం, కామెడీ కి ఒకడ్ని పెడదాం అసలే మనది ఎంటర్ టయినర్.. ఆడితో మళ్ళి పని పడొచ్చు సో psychiatrist చేద్దాం. (psychiatrist లు ఎం చేస్తూ ఉన్తరు.. స్కూటీ ఏసుకొని తిరుగుతూ డ్యూటీ డాక్టర్ వెనక లవ్ చెయ్యమని తిరుగుతారు అది KGH లో .. - దర్శకత్వ ప్రతిభ). ఇప్పుడు ఉన్న గ్రూప్ లో గొడవ అవ్వాలి కాబట్టి విలన్ కొడుకు - సెకండ్ హీరోయిన్ ని - గోక బోతే - హీరో రివర్స్ అయితే- గొడవలో హీరోయిన్ పోతే - విలన్ కి కూడా నష్టం జరిగితే.. ఇవన్ని జరగాలి ఇది తెలుగు సినిమా జరుగుతుంది అని తెలిసినా జనాలు చూడక మానరు. అసలు ట్విస్ట్ బలుపు ఉన్న హీరో బలుపు ఉంచుకొని గొడవలు త్యాగం చేస్తాడు (ఏది నరసింహ నాయుడు లో బాలయ్య సిమ్రాన్ కోసం చేసినట్టు). ఫ్లాష్ బ్యాక్ అయిపొయింది సో పడుకున్న వాడిని లేపేసి హీరో కి నూరేసి ఫైనల్ సెటిల్ మెంట్ కి పంపెద్దాం.. అమ్మో స్టొరీ రొటీన్ అయిపోదు (ఇప్పటి వరకు బీబత్సం అయిన కొత్తదనం మరి), లాగు లాగు గట్టిగ లాగు ఏదో ఒకటి చేసి లాగు.. హమ్మయ్య క్లైమాక్స్ ఫైట్.. అరె ఫస్ట్ చెప్పిన నాలుగు ఫైట్ లు అయిపోయాయి సో యాక్షన్ పక్కన పెట్టి కొత్తగా ఆలోచిద్దాం.. ఈ మద్య ఫేమస్ ఏంటి? IPL అండ్ ఇద్దరంమ్మయిలతో ఇంటర్వెల్ ముందు ఫైట్.. వచ్చేసింది నాకు థాట్ వచ్చేసింది క్లైమాక్స్ లో ఎంటర్ టెయినర్ కి రియల్ మీనింగ్ చూపిస్తా.. (అంత బాగానే ఉంది  ట్యాగ్ లైన్ వరకు మరి బలుపు అనే అసలు టైటిల్ కి రియల్ మీనింగ్ ఎక్కడ దొరుకుతుంది ?


మీ    
హరి కృష్ణ రాజు 
1 comments:

Anonymous said...

LED ante enti bhayya ? nenu chusina naaku gurthuku raaledu . anyways nice review .

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views