Attarintiki Daredi - Katha, Kathanam - Oka Vishleshanaఅత్తారింటికి దారేది -  కథ, కథనం -  ఒక విశ్లేషణ

జనరల్ గా రివ్యూ అనో సమీక్ష అనో మై టేక్ అనో ఉంటుంది గా టైటల్ ఇది ఏంటి కొత్తగా అని ఎవరు అయినా అనుకుంటే వాళ్ళ కోసం ముందు మాట. ఇది రివ్యూ కాదు, టైమ్ లో రివ్యూ రాసే ఆలోచన కూడా లేదు. పోస్ట్మార్టెమ్ అంత కంటే కాదు. సినిమా లో నెగిటివ్స్  ని పాయంట్ ఔట్ చేసి రాయాలి అని లేదుఅలా అని సినిమా విజయం పై రాసింది కాదు, సినిమా కి సంబందించి హీరో ని ఆకాశం కి ఎత్తెస్తూ సైట్ హిట్స్ కోసం ఫాన్స్ ని ఉద్దేశించి రాసింది కానే కాదు. కేవలం నేను చూసిన సినిమా కథ కి , నాకు అర్ధం అయిన సినిమా కథనం ని విపులం గా ప్రయోగాత్మకం గా రాస్తున్న ఒక ఆర్టికల్ అంతే. రెగ్యులర్ గా రేటింగ్స్ మాత్రమే చూసే వాళ్ళు, పై పైన రివ్యూ లు చదివేసే వాళ్ళు, పవన్ సినిమా గురుంచి అనుకోని పరిగెత్తుకు వచ్చిన ఫాన్స్ లాంటి వాళ్ళు ఆర్టికల్ నుంచి ఏమీ ఆశించాల్సింది లేదు టైమ్ వేస్ట్ అయ్యింది అని తర్వాత ఫీల్ అవ్వటమ్ తప్ప. అంతో ఇంతో సినెమాలని ఇంట్రెస్ట్ గా ఫాలొ అవుతూ "సినిమా అంటే పిచ్చి" అని చెప్పుకునే నా లాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితం గా చదివాలి అని కోరుకుంటున్నా , ఎందుకంటే ఇది చదివి మీరు మీకు తెలిసిన విషయాలు ఇక్కడ షేర్ చేసుకుంటే నాకు ఎంతో కొంత ఉపయోగ పడుతుంది అనే అత్యాశ .. ఇక సొది ని ఆపి అసలు సొది మొదలు పెడతా..

ఎప్పుడు చెప్పేదే అయినా సినిమా ముందు వేసే ముకేశ్ రీల్ టైపు లో, సినిమా చూసిన వాళ్ళకి మాత్రమే ఆర్టికల్, చూడాలి అనుకునే వాళ్ళు చూసిన తర్వాత చదవండి, చూడని వాళ్ళు చదివినా ఉపయోగం ఉండక పోవచ్చు, అయినా ప్రభంజనం ని చూడని వాళ్ళు ఇంకా ఉన్నారు అని అయితే అనుకోవటం లేదుఇంతకు ముందు రివ్యూస్ లో ౩ Act స్ట్రక్చర్ గురుంచి చాలా సార్లు చెప్పుకున్నాం, ఈ మద్యనే రాసిన సినిమా సినిమా సినిమా ఆర్టికల్ లో కూడా డిస్కస్ చెయ్యటం జరిగింది, మిస్ అయిన వాళ్ళు ఇక్కడ చదవగలరు. ఆ ౩ Act స్ట్రక్చర్ లో అత్తారింటికి దారేది సినిమా కథనం ని రాసుకుందాం అని చేసిన చిన్న ప్రయత్నం ఈ ఆర్టికల్

కథ: అత్తారింటికి దారేది సినిమా ని ఈ టైమ్ కే అందరు చూసేసి ఉంటారు కాబట్టి సినిమా కథ ఏంటి అని డీటేల్డ్ గా చెప్పుకోవాల్సిన పని లేదు అనుకుంటూ సినిమా లో కొన్న ముఖ్యమైన డైలాగ్ల ద్వా పైపైన్ చెప్పుకుందాం. (కొత్త గా ఉంటుంది అనుకుంటున్నా చెత్త గా ఉంటే మన్నించాలి)

తాత:  ఈ చైర్స్ అన్ని నిండి పోవాలి, నా కూతురు, అల్లుడు, మానవారాళ్లతో  వాళ్ళ నవ్వులతో ఈ రూమ్ అంతా నిండిపోవాలి (Theme)
మనవడు: రాముడు సముద్రం దగ్గరకి వెళ్ళాక బ్రిడ్జ్ ఎలా కట్టాలి అని ప్లాన్ చేశాడు కానీ అడవిలో ఉండగా బ్రిడ్జ్ ప్లాన్ గీసుకొని సముద్రం దగ్గరకి వెళ్లలేదు (main character’s attitude)
ఎమ్ ఎస్ : చేతులు పట్టుకొని థాంక్స్ చెప్తుంది అనుకుంటే కాలర్ పట్టుకొని కరిచేసింది ఏంటండి , మనవడు: ఆవిడ ఆగి ఆలోచించే వ్యక్తి అయితే మనం ఇంత దూరం రావల్సిన అవశరం ఏముంది. (establishing problem)
మనవడు : ఇప్పుడు రోజు మా మావయ్య తాగేసి వచ్చి రోజు మా అత్తయ్య ని చితకొడుతున్నాడు అనుకో ఎందుకు రా మావాళ్ళని వదిలేసి వచ్చాను అని రోజు కూర్చొని ఏడ్చేది. కానీ ఇక్కడ అలా లేదే, బంగారు సింహాసనం వేసి కూర్చోబెట్టారు (challenges)
మామయ్య : తెగిపోయే అప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయే అప్పుడే భందం విలువ తెలుస్తుంది (realization)
అత్త: నా వాళ్ళెవరూ లేరమ్మ, ఎప్పుడో పోయారు  (catalyst)
మనవడు: ఆవిడకి ఎప్పుడో తెలుసు నేనే గౌతమ్ అని, మనమే ఫ్లడ్ లైట్స్ వేసి ఉన్న గ్రౌండ్ లో దాగుడు మూతలు ఆడెశామ్ (stuck point)
మామయ్య: మంచి విషయాలని కూడా ఎందుకు వదిలేసుకోవాలో నాకు ఇప్పుడు అర్ధం అవుతుంది, నువ్వు మెడిసిన్ లాంటి వాడివి, కానీ దానికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది, నేను చెప్పింది నీకు అర్ధం అయ్యింది అనుకుంటా  (developing sympathy on main character)
మనవడు: నా మాట నేను నిలబెట్టుకుంటాను అప్పటి వరకు బ్రతికి ఆయన మాట ఆయన్ని నిలబెట్టుకోమని చెప్పు  (increasing curiosity in audience)
మారదలు: I LOVE U (turning point)
అత్త: వెళ్లు... ఈ ఇంట్లోంచి.... మా జీవితాల లోంచి (all  is lost/ dead end)
మనవడు: మీరు చేస్తే ఆదర్శం వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. బావుండటం అంటే బాగా ఉండటం కాదు నలుగురితో ఉండటం నవ్వుతూ ఉండటం  (conclusion)
తాత: డెవిల్ ఈస్ బ్యాక్

కథనం: పైన చెప్పుకున్న కథ ని పక్కన పెట్టి మనం చూసిన కథ కి కథనం ని ౩ ఆక్ట్ పద్దతిలో "ACT 1 : సెటప్" "  ACT 2: కాన్ఫ్రంటేషన్ " అండ్ " ACT 3: రెసల్యూషన్" అని  వివరించుకుంటే

సినిమా ని ఓపెన్ చెయ్యటమే మైన్ క్యారక్టర్ పాయంట్ ఆఫ్ వ్యూ (అంటే హీరొ లేక హీరోయిన్ పాయంట్ ఆఫ్ వ్యూ) లో ఓపెన్ చేశారు, ఇదొక రకమైన స్టోరీ టెల్లింగ్, జనరల్ గా మనం గౌతమ్ మీనన్ సినెమాలలో ఇది తరచుగా చూస్తూ ఉంటాం, కానీ ఆయన చాలా పకడ్బందీ గా రాసుకుంటారు చాలా వరకు, అందరికి ఆది కుదరదు ఎందుకంటే ఈ పాయంట్ ఆఫ్ వ్యూ లో స్టోరీ ని ఓపెన్ చేస్తే కథలో లాజిక్ చాలా వరకు దొరకదు, ఎలా  అంటే కథ చెప్తున్న క్యారక్టర్ సినిమా లో లేని సీన్స్ తనకి ఎలా తెలిసి పోయాయి అని సరిగ్గా చెప్పలేక పోతే కామన్ ఆడియెన్స్ కి కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఈ సినిమా లో కూడా అదే జరిగింది, సమంతా స్టోరీ ఓపెన్ చేసే టైమ్ కి అంటే కిడ్నాప్ ఐన టైమ్ కి హీరొ జీవితం లో జరిగిన సన్నివేశాలు అసలు ఎలా తెలిసాయి అనే దానికి సమాధానం ఉండదు. ఉదాహరణకి: ఆయన ఇంటికెళ్లి మాట్లాడుకోటం, అలీ ని కొట్టడం, బాబా వేషాలు లాంటివి ఎన్నో ప్రశ్నలే అయినప్పటికీ సినిమా ని ఎక్కడా బోర్ కొట్తకుండా నడిపించటం వలన అవేవీ చర్చించుకునే విషయాలు కాలేక పోయాయి.

ACT 1: ప్రారంభం: పైన చెప్పుకున్న పాయంట్ ని పక్కన పెడితే, హీరొ ఫ్యామిలీ కంపనీ లో ఒక ప్రాబ్లమ్, దానిని హీరొ సాల్వ్ చేసి సెటిల్ చేసిన విధానం తో డబ్బుతో పాటు మట్టి కరిపించే బలం తో పాటు సింపుల్ గా ఉండే తత్వం (ఛంపకుండా ఆనందం వెతుక్కొమనే సలహా ఇవ్వటం) కూడా ఉంది అని ఎస్ట్యాబ్లిష్ చేశారు.
అక్కడ నుంచి డైరెక్ట్ గా థీమ్ ని టచ్ చేస్తూ తాత ఆనందం కోసం అనే కాన్సెప్ట్ తో అసలు కథ ని ఓపెన్ చేశారు.  అత్తారింటికి దారిని, అత్తని తీసుకొచ్చే భాద్యత ని సెట్ చేసుకొని హీరొ బయల్దేరతాడు. దేనినే సెట్ అప్ అని ప్రతిస్తాపన అని అంటారు అంటే కథ లో ని సమస్య ని లేదా హీరొ కి రాబోయే సమస్య ని ఎస్ట్యాబ్లిష్ చెయ్యటం మరియు ఆ సమస్య ఎంత తీవ్రమైందో చెప్పటం. అలా చెప్పటానికి పాత్రల పరిచయం తో మొదలు పెట్టారు. కొన్ని సినిమాలలో పరిచయాలు అయ్యాక సమస్య ని చూపిస్తారు ఇక్కడ అటుది ఇటు అన్నమాట.

సమస్య మొదలైన తర్వాత మొదటి అంకం లో కావాల్సిందీ క్యాటలిస్ట్ (ఉత్ప్రేరకం), అంటే సమస్య లో కి వెళ్లే ముందు దానికి దారి తీసే పరిస్థితులు కావొచ్చు లేదా సమస్య ని జయించటానికి దొరికే మొదటి అవకాశం కావొచ్చు. ఈ సినిమా లో "ఏ ప్లాన్ లేని హీరొ కి మావయ్య ని కాపాడే అవకాశం దొరకటం"  గుడ్ ఇంప్రెషన్ తో పాటు అత్త ఫ్యామిలీ కి దగ్గరయ్యే అవకాశం అన్నమాట. ఆ అవకాశం ని ఎంత వరకు సద్వినియోగం చేసుకున్నాడు దాని వలన దారి తెన్నూ లేని తన ప్రయాణం ఎలా ఒక దరిలోకి వచ్చింది అని చూపించటం తో ఈ ACT ని ముగించి 2nd ACT కి ఎంటర్ అవుతుంది కథనం.

ఇక్కడ గమనించాల్సిన విషయం మనం ఇంతకు ముందు ఆర్టికల్ లో చెప్పుకున్నట్టు  ఇంచు మించు తెలుగు సినిమాలు అన్నింటిలో  పరిచయాలు, సమస్య ఎస్ట్యాబ్లిష్ చేసుకోటానికి సుమారు 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ఇక్కడ 30 నిమిషాలు పట్టింది

Act 2: సమస్యాత్మకం : చాలా సినిమా ల లో ఈ 2nd ACT వచ్చే టైమ్ ని ఈజీ గా గుర్తు పట్టొచ్చు, ఈ టైమ్ లో నే ఒక కొత్త సెట్ అప్ లో కి ఎంటర్ అవుతాం, అసలు కథ ఇంక మొదలయ్యింది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, ఈ సినిమా విషయానికి వస్తే దేవ దేవం పాట బ్యాక్‌గ్రౌండ్ లో కార్ లో హీరొ సునంధ నిలయం లో కి ఎంటర్ అవుతాడు. ఇక నుంచి ఎలా ఉండబోతుందో ఎం చేస్తాడో అనే ఒక క్యూరీయాసిటీ ప్రేక్షకులకి కలుగుతుంది

 1st ACT లో మిగిలిపోయిన పరిచయాలు అన్ని ఇక్కడ అయ్యాక, ఉప కథ ( B - Story) మొదలయ్యేది కూడా ఇక్కడే. సినిమా థీమ్ తో ఈ కథ కి దగ్గర సంబందం ఉంటుంది అలాగే సెకెండ్ ఆక్ట్ ని మొత్తం నడిపించేది ఈ ఉప కథ నే, జనరల్ గా ప్రేమ కథ,  కామెడీ టైమ్, పాటలు, సరదాలు అలా అలా ముందుకి నడిపిస్తాయి. (ఈ ఉప కథ లు సినిమా థీమ్ నుంచి దూరం గా ఉంటే మనకి ఏదో సెపరేట్ కామెడీ ట్ర్యాక్ చూస్తున్నట్టు, సొది ఎక్కువైనట్టు అనిపిస్తుంది.) ఇక్కడ ప్రణీత తో చేసే కామెడీ తో ఉప కథ మొదలు అవుతుంది. మద్య లో టైమ్ ఫిల్ చెయ్యటానికి అన్నట్టు పబ్ సాంగ్, అలీ కామెడీ తో కథనం నడుస్తూనే అత్త కి ఉన్న ప్రాబ్లమ్ ని, హీరొ ఒంటరి గా ఉన్నప్పుడు ఆలోచించే ఫ్ల్యాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో (ఈ సినిమా లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని ఒకే సారి కాకుండా పార్ట్స్ గా చెప్పే విధానం అబ్బుర పరుస్తుంది, జనరల్ గా సెకెండ్ హాఫ్ లో మొదలై ఒకే సారి అయిపోవటమో లేదా ఫర్స్ట్ హాఫ్ లో మొదలై ఇంటర్వల్ ముందు కరెంట్ స్టోరీ కి వచ్చి మళ్లీ ఇంటర్వల్ అవ్వగానే కంటిన్యూ అవుతూ ఒకే సారి అయిపోతుంది. ఇక్కడ అలా చేసి ఉంటే మూవీ టెంపో బాగా డౌన్ అయిపోయే ప్రమాధం ని ముందు గా ఊహించి ఇలా ప్లాన్ చేసినట్టు ఉన్నారు, అందువలన ఆడియెన్స్ ని కూడా ఎక్కడా బోర్ కొట్తకుండా లీనం అయ్యేలా చేశారు, ఇదొక గొప్ప టెక్నీక్ అని న అభిప్రాయం) అసలు థీమ్ ని అప్పుడప్పుడు ప్రేక్షకులకి గుర్తు చేస్తూ ముందుకి సాగుతుంది. ఇంటర్వల్ బ్యాంగ్ మొదలు అయ్యే వరకు సాగుతూనే ఉంటుంది.

తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చూస్ ఎవర్ని అయినా ఇంటర్వల్ బ్యాంగ్ ఎప్పుడు మొదలవుతుంది అని అడిగినా చెప్పే సమాధానం ఒకటే మూడో పాట అయ్యాక అని, ఒక్కో సారి పాట అయ్యాక సడన్ గా ఊడిపడినట్టు సీన్స్ వచ్చేసి, టెంపో పెరిగిపోయి, పవర్‌ఫుల్ అయిపోయి ట్విస్ట్ తో బ్యాంగ్ ఉంటుంది, కానీ ఆది పద్దతి కాదు, మనకి ఉన్న టైమ్ లో ఆట పాటలతో పాటు ఇంటర్వల్ లో ఇవ్వాలి అనుకున్న థ్రిల్ కి కావలసిన సీడ్స్ (విత్తనాలు) నాటుకోవాలి. ఇక్కడ ఎలా అంటే, నాకు ఇదంతా ముందే తెలుసు అని అత్త ఇచ్చిన వివరణ లో సంధర్భాలు  అన్ని మన ముందు 2nd ACT లో జరిగినవే, (ఉదాహరణకి: పెట్రోల్ కొట్టించ  మంటే డబ్బులు అడగకుండా వెళ్లిపోవటం సీన్ ని ఫర్స్ట్ టైమ్ చూసినప్పుడు నోటీస్ చేసే వాళ్ళు ఎంత మంది ఉంటారు? అలా నోటీస్ చెయ్యకుండా ఉండటానికి ఇంపార్టెంట్ సీన్ లో సింపల్ గా కట్ చేశారు అదే సీడ్ అయ్యింది). మనకి ఇక్కడ ఇంటర్వల్ బ్యాంగ్ లాంటివి ఏమీ లేవు కానీ, 2nd ACT కి అవసరం ఒక మిడ్ పాయంట్ (Mid Point) అదే ఇంటర్వల్, అప్పటి వరకు సరదాగా సాగిపోతున్న ప్రయాణం కి ఒక అడ్దంకి కావాలి, నెక్స్ట్ ఎటు వెళ్ళాలి లేదా ఎలా వెళ్ళాలి అనే సిచుయేషన్ లో హీరొ క్యారక్టర్ పడితే అదే అనుభూతి ని ప్రేక్షకులు కూడా పోందితే ఫర్స్ట్ హాఫ్ కి ఒక పాసిటివ్ ఫీల్ ఉంటుంది. ఇక్కడ అదే జరిగింది, ఇంట్లో ఉండి సమయం చూసుకొని ఎందుకొచ్చానో చెప్పి అత్త ని తీసుకేళ్డాం అనుకున్న హీరొ కి ఆల్‌రెడీ తాను ఎవరు ఎందుకు వచ్చాడు అని అత్త తెలుసు అని చెప్పటం, నువ్వు నన్ను తీసుకెళ్లాలి అని వస్తే ఇక్కడ ఉండటం కూడా వేస్ట్ నేను రాను అని ఖరాఖండి గా చెప్పెయ్యటం, హీరొ నిజాయితీ గా చేసినవి కూడా ప్లాన్ ఏమో అని అనుమానం వ్యక్తం చెయ్యటం తో ఇంటర్వల్ కార్డ్ కి హీరొ మీద ప్రేక్షకులకి జాలి కలిగేలా చేశారు దర్శకుడు. దానితో పాటు ఇంట్రెస్ట్ కూడా కలిగించి సక్సెస్ అయ్యారు

ఇంటర్వల్ లో సెట్ చేసిన ప్రాబ్లమ్ కి ఒక దారి అన్నట్టు గా, ఇదే అసలు దారి అనిపించేస్తే ఇంక ౩ర్డ్ ఆక్ట్ కి ఎం చూపేడతాం, అందుకే ఒక చిన్న దారి లా గేట్ ఓపెన్ చెయ్యాలి, ఇక్కడ ఎమ్ ఎస్ గారు ఓపెన్ చేస్తారు, కూతుర్ని లవ్ చెయ్యమని సలహా ఇస్తారు, అలా దొరికిన దారిలో హీరొ ప్రయాణం మళ్లీ మొధలవుతుంది. ఆ విధం గా ఉప కథ మెయిన్ కథ లో కి ఎంటర్ అవుతుంది (ముందు చెప్పుకునట్టు ఉప కథ అండ్ మెయిన్ థీమ్ ఎంత దగ్గరగా ఉంటే ప్రేక్షకులు అంత కనెక్ట్ అవుతారు). ఇంతలోనే మలుపులు, ఆ దారి మూసుకు పోినట్టు అనిపించినా, స్వతహాగా మంచి వాడు అయిన హీరొ ప్రణీత కోసం ఫైట్ చేస్తాడు, మామూలుగా అయితే పవర్ స్టార్ సినిమా లో ఫైట్ లు ఫాన్స్ ని అలరించేలా డైలాగ్ లు పెట్టుకోటానికి ఒక అవకాశం, (ఇంకొక రకం గా చెప్పుకోవాలి అంటే ఒక సైడ్ ట్ర్యాక్ ని క్లోస్ చేసి ఇంకో సైడ్ ట్ర్యాక్ ని ఓపెన్ చెయ్యటానికి మద్య లో తెలివిగా హీరోయిజం ని చూపించటానికి రాసుకున్న సీన్ అన్నమాట, ఆ ముందు జరగబోయే అన్ని సన్నివేశాలకి ఇదొక ఉత్ప్రేరకం.) ఆ అవకాశం కూడా హీరొ కి ఇంకో దారి చూపించింది ఆ దారి పేరు సమంతా, అప్పటి వరకు సామంత  ఒక దారే కాదు అనుకోని ప్రణీత ద్వారా ప్రొసీడ్ ఆవుదాం అనుకున్న హీరొ కి దొరికిన కొత్త దారి, ముందు గా అనుకున్న ప్లాన్ (ప్రణీత తో ప్రేమ) ఫెయిల్ అయ్యిందీ అనుకునే టైమ్ కి అనుకోకుండా దొరికిన దారి. ప్రయాణం లో ఈ మలుపులు ప్రేక్షకులని కూడా లీనం చేసేలా ఇక్కడ కూడా చాలా పద్దతి గా రాసుకున్నారు దర్శకుడు (పద్దతి అని ఎంధుకు అంటున్నాను అంటే, మైన్ హీరోయిన్ అయిన సమంతా ఉండగా హీరొ ప్రణీత వెనక ఎందుకు పడటం అనే డౌట్ రాకుండా ఫర్స్ట్ హాఫ్ లో ప్రణీత అండ్ హీరొ మద్య వచ్చే సీన్స్ తో హీరొ కి కూడా పెద్ద మరదలు ని లైన్ లో పెట్టుకోవటమే మంచిది అని ప్రేక్షకులు కూడా ఫీల్ అయ్యేలా చేశారు, సడన్ గా ప్రణీత కి లవర్ ఏంటి అనే డౌట్ లేకుండా ఫర్స్ట్ హాఫ్ లో ఒక ఫైట్ పెట్టి సీడ్ (విత్తనం) వేసుకున్నారు), ఇంటర్వల్ అయిన తర్వాత ఇలాంటి మలుపులతో, కొత్త దారుల్లో ప్రయాణం బోలెడు కామెడీ కి ఆయన కల్పించుకున్న అవకాశం. ఇక్కడ ఒక విషయం, పెద్ద అమ్మాయి పెళ్లి గురుంచి అంత లా ఆలోచించిన అత్త చిన్న అమ్మాయిని వెంటనే కోటా కొడుక్కి ఇస్తాను అని ఒప్పెసుకోవటం ప్రేక్షకులకు కూడా అనుమానం రాకుండా స్టార్టింగ్ లో నే ఆవిడ క్యారక్టర్ ని చూపించినప్పుడు ఆగి ఆలోచించే టైప్ కాదు అనే డైలాగ్ ద్వారా సింపల్ గా ఎస్ట్యాబ్లిష్ చేసేసారు. దారులు మార్చుకుంటూ గమ్యం చెరదామ్ అనుకుంటున్న హీరొ కి మావయ్యె షాక్ ఇస్తాడు, వెళ్లిపో మంటాడు, ఇంకో పక్క నాన్న ఫోన్ చేసి తాతయ్య వి ఆఖరు క్షణాలు వచ్చెయ్ అంటాడు, నేను ఎలా అయినా తీసుకొస్తా అంత వరకు బ్రతికి ఆయన మాట నిలబెట్టుకోమన్ తండ్రికి చెప్పినా, ఒక్క అవకాశం దొరికితే చాలు అని ప్రార్డిస్తాడు

అలా ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది మళ్లీ బ్రాహ్మీ రూపం లో, ఇంకో పక్క సమంతా ప్రేమ కూడా చెప్పేసింది, కాబట్టి ఇప్పుడు అదొక కొత్త భాద్యత, ఈ మలుపులతో ఫ్యామిలీ సినిమా కాబట్టి సరదాగా ముందుకు పోతూ ఉంటుంది, ఇలాంటి టైమ్ లో నే, హీరొ కి ఆల్ ఇస్ లాస్ట్ అనే సిచుయేషన్ కల్పించాలి అంటారు స్క్రీన్ప్లే గురువులు, అంటే 3ర్డ్ ఆక్ట్ లో కి ఎంటర్ అవ్వటానికి పునాది అన్నమాట, ఇక్కడ కాటమ రాయుడు సాంగ్ అయ్యాక నదియా మమ్మల్ని వదిలి వెళ్లిపో అంటుంది, ఉన్న ఒక్క చాన్స్ కూడా పోయి హీరొ కథ మళ్లీ మొదటికీ వచ్చింది. ఇక్కడితో సెకెండ్ ఆక్ట్ ముగుస్తుంది.
టైమ్ పరం గా చూసుకుంటే 140th mintute టైమ్ కి ఈ సీన్ ఉంటుంది, 1st act 30 Minutes అండ్ 2nd Act 110 Minutes అన్నమాట, కానీ ఎక్కడ బోర్ కొట్తకుండా ముందుకి నడిపించటం వలన, ఉప కథ కూడా మెయిన థీమ్ తో పాటే ఉండటం వలన ఇంత టైమ్ అయ్యిందా అని మనకి తెలియ కుండానే అయిపోతుంది.

Act 3: ముగింపు: అంతా అయిపోయింది అనుకున్న హీరొ కి సమంత లేచి పోయి రావటం తో చక్కని అవకాశం దొరికి, ఫైనల్ గా తాను రీచ్ అవ్వాల్సిన గమ్యం కూడా కనిపిస్తుంది, అసలు దారి దొరికిన తర్వాత ఇంకా ఆలస్యం చెయ్యకుండా దూసుకు పోతాడు, అనుకున్న విధం గా అత్త మామ స్టేషన్ కి వచ్చినప్పుడు వాళ్ళు చేసింది తప్పు అన్నట్టు కాకుండా రెండు వైపులా ఉన్న తప్పు గురుంచి, దాని వలన జరిగిన పరిణామాల గురుంచి ఇటు ప్రేక్షకులు కూడా లీనం అయ్యే లా చెప్పించి సుఖాంతం గా శుభం కార్డ్ కి వెళ్తుంది. జనరల్ గా ఫ్లాష్ బ్యాక్ లు 2nd Act లో నే అయిపోయి 3rd act కి ముగింపు మాత్రమే ఉంటుంది, అలాంటిది 1st Act లో టచ్ చేసి, 2nd Act లో రివీల్ చేసి, 3rd Act లో ఫ్లాష్ బ్యాక్ అయిపోలేదు, ఇంకా ఉంది అని ఆ తర్వాత ఎం జరిగిందో హీరొ తో చెప్పించి 3rd Act కి ఇంకా బ్యూటీ ని అడ్ చేసి హీరొ పై సింపతీ ని అమాంతం పెంచేసి ప్రేక్షకులు కూడా కంట తడి పెట్టుకునేలా (ఇది కొంచెం అతిశయోక్తి) రాసుకున్న విధానం హర్షించదగ్గ విషయం. సినిమా మొత్తం అత్త క్యారక్టర్ కి కనీసం ఎదురు చెప్పని హీరొ క్యారక్టర్ కి ఒకే ఒక డైలాగ్ తో జస్టిఫికేషన్ ఇచ్చేశారు  "ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పొడు" అని అందుకే ఆ డైలాగ్ కి కూడా అంత రెస్పాన్స్ వచ్చింది, ఎందుకంటే అప్పటి వరకు ప్రేక్షకులు చూసింది హీరొ తగ్గి ఉండటమే కాబట్టి. అంత ఎమోషనల్ సీన్ తర్వాత బయటికి వచ్చే అప్పుడు నవ్వించాలి అనే కారణం తో సినిమా కథ ని సామంత తో ఓపెన్ చేయించారో ఏమో అనుకునే లా కామెడీ ముగింపు కూడా ఇచ్చారు. టైమింగ్స్ పరం గా, ACTS కొంచెం అటు ఇటు గా అయినా, 3rd Act అండ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ 2nd Act కొంచెం ఓవర్లాప్ అయినా 3 Act స్ట్రక్చర్ లో రాసుకోటానికి ఒక మంచి ఉదాహరణ అనిపించింది

ఏ సినిమా కి అయిన ఈ 3rd Act చాలా ఇంపార్టెంట్, సినిమా జాతకాన్నే మార్చేసే అంత పవర్‌ఫుల్. అప్పటి వరకు ఎం చూపించినా ఎలా చూపించినా ముగింపు అందరికి ఆమోధయోగ్యం గా ఉండేలా చూసుకోవటం దర్శకుడి భాద్యత. ఈ విషయం లో త్రివిక్రమ్ నూటికి నూరు మార్కులు సంపాదించుకున్నారు. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే 3rd Act ఒక్కటీ ఒక ఎత్తు. అప్పటి వరకు ఆవరేజ్ అనుకున్న వాళ్ళకి హిట్ ఫీలింగ్ ని, హిట్ అనుకున్న వాళ్ళకి సూపర్ హిట్ ఫీలింగ్ ని ఈ సినిమా మిగిల్చింది అంటే కారణం 3rd Act ఇంత బాగా పండటమే. ఏ సినిమా కథ కి అయినా అంధుకే ముందు గా ఎండింగ్ డిసైడ్ అవ్వమని చెప్తారు స్క్రీన్‌ప్లే గురువులు, అప్పుడు ఉన్న క్ల్యారిటీ తో కథనం ని చక్కగా పండించవచ్చు అనే దానికి నిదర్శనం ఈ అత్తరింటికి దారేది

నాకు ఉన్న లిమిటెడ్ నాలెజ్ లో నేను రాసింది ఎంత వరకు కరెక్ట్ అనేది నేను అయితే చెప్పలేను కానీ, ఈ ఆర్టికల్ చదివే అనుభవజ్ఞులు వారి అభిప్రాయాలు సూచనలు సలహాలు షేర్ చేసుకుంటే రుణ పడి ఉంటాను.

ఇట్లు 
మీ 

హరి కృష్ణ రాజు 

14 comments:

balu said...

nice reviewww... chala baaaga rasaru...ee three act idea chala bagundiii...

Gopinadh Sake said...

well studied..

Unknown said...

adbutam ga vundi andi,,,cinemani ela teyalo baga research chesinatuu vunnaru, mee aksharallo adi telustundhi,,,meeru director avalani aasisthu mee abimani "Naveen"

NARESHKOTA said...

article bagundhi annai ..

ikkada problem emiti ante pavan kalyan cinema ante ilagae undali ilanti character ilanti scenes ane setup lo nunchi trivikram tana mark kooda veyyataniki vipareetham gaa try chesaadu Jalsa lo fail ayina konnitiki dhooram gaa tana cinemallo undavu anukune chaala vatiki daggara jarigi attarintiki daredi antu thana ki anda kunda pothunna Blockbuster ki daari vesukunnadu.. Athadu cinema ni ee 3 act basis lo ne raasukunna length and climax kocche sariki kadhana balam baaga padipoyindi.. ade julayi lo cut shot trim aunukuntu nasa lekunda logic ki andakunda velle sariki bane undi daggara agipoyindi.. Anni kudaralsina content unna cinema Khaleja lo confusion drama ni janam enjoy chese la cheyyatam lo fail ayyadu..

Mottham mida Trivikram tana mark ni pakkana petti marinni kottha daarulu vethukuntu pothe real cinema lovers ki oka vishadam miguluthundhi anukuntunna..

Anywayz.. ee cinema ki third act chaala simple ga telehesthaadu emo anukuntu unte balam gaa rasukuni baledu anukuntunna vadiki bagundhi bane undi ane impressions ki create chesaadu.. ika iddaru followers and image unna valle kanuka oka decent project tho kooda prabhanjanam srustinchaaru but normal paristhithullo kanuka cinema vacchi unte intha prabhanjam undeda anedi million dollar question ee naa varaku..

ikameshp said...

Super hari garu. Excellent article.
Chaala baaga analysis chesaru.
Oka cinema ne yala chudalo ee article nunchi thelusukunam.
3vikram ki vandha ki vandha marklu ana point ki *claps*

HKR *Respect*

ikameshp said...

Super hari garu. Excellent article.
Chaala baaga analysis chesaru.
Oka cinema ne yala chudalo ee article nunchi thelusukunam.
3vikram ki vandha ki vandha marklu ana point ki *claps*

HKR *Respect*

Ranjith RanDy said...

e 3acts vishleshana adaitho undho xray tisinattu cheppaaru harikrishna garu... Intha vishleshana shakthi unavalu mamulu janallo kalsipoyi undatam chala pramadhakaram..veelainantha thondaraga directr ai pedthe..mi fan ga miko show chusi pedtha

Anonymous said...

ADITYA

chaala baga raasav, trivi contribution emi ledu annavallu chadivi telusukovali, trivi screenplay cinemaki 2nd heor after pk, nuvu chepinatu nadiya pkni gurtu pattindi anadaniki mundununche china hints icchadu ame ala observe cheyadam keys icchinapudu gaani ,posani scene appudu gani, and clmax inka cheppnakkarledu, cinema mottam pk emi anadu nadiyani, lastlo tappa, adhi baga workout aindhi :)

and samanta flashback narration gurinchi doubt ananvga

akkada manaki and aa kidnap batchki kadha idhi ani cheptundi, akkada anni aameki teliyali ani levu, idhi cinema kaabatti aameki teliyakunda idhi kooda jarigindhi ani manaki choopinchocchu :)

PS said...

Super Act way cheppinna theru first lo story narrate chesina viddanam terrific!!

ACT 1: Samantha point bagundi nenu adhe feel ayyanu (but... 2nd watch lo ;) )!!
ACT 2: Samantha temporary Amnesia point chala neat ga edit chesaru.. Heroine never says WHO AM I? like in every movie ;) Director uses his charisma makes the scene even funner by adding the ATTLA episode!!
ACT 3: Meeru cheppinate NO expected a sentimental scene.. adhe chaala plus..ayindi..

Hari bhaiya, the way you narrated the movie inspires me again to retry my attempt to write in TELUGU :)

BTW!! na limited brain ki ee pts theda ga anipinchayyi.. mee unlimited knowledge tho clarify koncham clarify cheyaru :)

1. Rao Ramesh pi ATTEMPT TO MURDER point ni cover chesina director, Raghunanda Siddhu mother ni champakka cover/realization scene elevate cheyaledhu. What happened there Arrested /got paralyzed instantly

2. family lo pedha ammayi Prameela ni track lo pettali anna thought bagunna, Bharath tho lechipoyye range lo premisthunna Prameela chilipi/flirting angle with Pawan angle asalu ela varnincha mantaru!! (ante amailu chesthe SUPER manam chesther CHEAPER anthena master!!)

3. director Second time siddhu ni intloki Brahmanandam PA ga chupisthadu, Kattama Rayunda song ayyaka Brahmanandam Sunanda ni REQUEST chese scene lo.. inka Siddhu Sunanda kosam work chesthunattu untundi.. ayina job ichina Brahmi chepaka poyina Siddhu velipothadu!!

4. Even after Siddappa's gang getting brutally beaten up, Siddappa never tries to KILL Siddhu and reaches sunanda's home for justice. Even then Siddapa shows his vigor while discussing the same point with Rao Ramesh(Suddenly Sunanda gets attracted to Siddappa's son asks his hand for Sushi). So its an ANGER MANAGEMENT technique ?

Thanks for your valuable article..
mee BIGGEST follower!!

Vasu said...

Incredible Analysis!!

Looks like you have a soft corner for Trivikram. Left out many scenes that don't add any value to the main thread.

Boman Irani keeps on hitting the cigar pipe on the table when he gets angry with Nadiya's decision. Nadiya mentioning that her father has the same mannerism as PK(to hit the wall with a stick when he is angry)is nothing special, but establishing that in the flashback is the class of Trivikram.

Raghava Tatolu said...

Excellent article hari garu,

Really helpful for upcoming script writers, normally people never get this type of articles for a Telugu Film.. :)))

Big Thanks...

Suraj said...

To PS, my observations for
point1) As an audienec,i feel that the scene was neatly edited and integrated in the climax portion. Any further drag/post murder scenes with boman irani will get the tempo down.

point2) It is believable that pramila is dumbo to behave that way ( she is such dumb that she even considers "piece of mind" as a dish

point3) when in sunanda`s house, brahmi automatically considers sunanda as his boss and asks for her approval (again believable)

point4) aagi alochinche rakam kani sunanda, its believable she took that decision all a sudden.

Chakri Kalyan said...

Explained well. nijamga meeku cinema antey pichchey...

Anonymous said...

babu hari
emi nayana ne review lu
ne vyaktheekarana bagundhi babu
kani 1 cinema ni boring bomma annavu adhi oppukovachemo kani atharintiki daredhi ni anthala akashaniki ethesavemi thandri..pawan kalyan range unna natudu cheyyavalasina comedy kadhu adhi...cheap cheaper cheapest...Trivikram range unna director cheyavalasina screenplay kadhu adhi...stupidest...
frankly speaking 1 is a far better movie compared to AD...nenu Iddariki fan ni kadhu nayanooo...nenu ne lage cinema pichi kaligina prani ni...cinemani oka vyapara konam lo visleshinchaku nayana...kala konam lo vislesinchu...length kuda baga ekkuvaidhi nayana...bore kottisthunnayi nee review lu...aithe chadavadhu antavemo...ikameedata chadavakudadhu ane anukuntunnanu le babu...unta mari...

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views