ఆటొనగర్ సూర్య : పాత్రలు - ఔచిత్యాలు - ఒక విశ్లేషణ




ఆటొనగర్ సూర్య : పాత్రలు - ఔచిత్యాలు  - ఒక విశ్లేషణ 

నీ అతి కాక పోతే ఆ టైటిల్ ఏంటి? ఔచిచ్యాలు ఏంటి? తొక్కలో విజ్ఞాన ప్రదర్శనా? దుంపల బడి మోహము నువ్వు - అలాంటి టైటిల్ చూశాక ఇలాంటి రియాక్షన్స్ సర్వసాధారణం, అయినాసరే ఇంగ్లీష్ మీడియం వ్యవస్థ లో చదివిన వాళ్ళ తెలుగు విజ్ఞానం పై ఈ చెన్నై- అన్నానగర్  హరి ఎక్కుపెట్టిన అక్షర బాణం. నేను తలపడేది ఎప్పుడు నాతోనే, ఎందుకంటే, నా దృష్టిలో "తెలుగు లో చదవటానికి భయపడే వాడు, తెలుగు లో రాసి భయపెట్టే వాడు, అనామకులతో సమానం". అర్ధం కాలేదు కదూ? దీని అర్ధం లాస్ట్ లో చెప్తాను లెండి కానీ, ఇక ఈ హింస ఇక్కడితో ముగిస్తూ ముందుకి పోదాం. 

దేవా కట్టా ఏదో ఇంటర్వ్యూ లో తన సినిమా లో పాత్రలు రాసుకోటానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, ప్రతి పాత్ర కి కథ రాసుకుంటాను అన్నారు, మరి అంత హోంవర్క్ చేసే అయన సినిమా కథ - కథనం ని అయన రాసుకున్న పాత్రల విశ్లేషణ ద్వారా ప్రెజెంట్ చేద్దాం అని చేస్తున్న ప్రయత్నమే ఈ ఆర్టికల్. "సినిమా చూడని వాళ్ళు, చూడాలి అనుకునే వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిది" ఆ తర్వాత మీ ఇష్టం మరి.

ఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు 

ఊహ తెలియని వయసులో తల్లితండ్రులని పోగొట్టుకొని, ఊహ తెలిసాక తను చెయ్యని తప్పు కి  మేనమామ ఇంటి నుంచి తరిమేయ్యబడతాడు సూర్య. ఆత్మాభిమానంతో ఆటో నగర్ లో జీవనం సాగిస్తున్న సూర్య అనుకోని పరిస్థితుల్లో జైలు కి వెళ్ళినా బయటికి వచ్చాక అక్కడి పరిస్థితులకి తిరగబడి  మనిషే వ్యవస్థ అని నమ్మిన సూర్య వ్యవస్థ పై పోరాటం చేస్తాడు, ఈ ప్రాసెస్ లో తన పేరెంట్స్ ని చంపిన వ్యక్తిని అంతమోదించి ఆటోనగర్ సమస్య ని దూరం చేస్తాడు. ఈ కథ ని ఇలాగె వింటే ఏ యంగ్ హీరో అయినా తన కెరీర్ కి బాగా హెల్ప్ అయ్యే సబ్జెక్టు అనుకోని ఒప్పెసుకుంటాడు, పేపర్ మీద బాగానే ఉన్న ఈ కథ కి తగ్గట్టు గా పాత్రల రూపకల్పన ఉందొ లేదో  చూద్దాం

ఆటోనగర్ సూర్య: నాకు ఏమైనా పని ఇస్తేనే నేను ఇది తింటాను అనే చెప్పే డైలాగ్ తో క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసి, డీజిల్ ఇంజిన్ సక్సెస్ అయినప్పుడు సెటిల్ అయిపోయాడు అనే ఫీలింగ్ కలిగించి, అనుకోని పరిస్థితుల్లో జైలు కి వెళ్ళినా బయటికి వచ్చే వరకు అంతా సజావుగా ఉన్నా కూడా, అక్కడ నుంచి బాటరీ కార్ కి, ప్రేమ కి, తిరుగుబాటు కి మద్య సింక్ కుదరక, అసలు వీడు ఎం చేద్దాం అనుకుంటున్నాడు అనిపించేలా సాగుతుంది, ఉదాహరణ కి :  కళ్ళ ముందు యూనియన్ లీడర్ మర్డర్ జరిగినా స్పందించని పాత్ర, తనకి అన్యాయం జరిగినప్పుడు ఆటో నగర్ యూనియన్ జనల కోసమే అన్నట్టు స్పీచ్ ఇస్తుంటే కొంచెం కన్ఫ్యూషన్ రాక ఏమవుతుంది. ఒక స్టేజి లో, ఆటోనగర్ లో ఆదిపత్యం ని బ్రేక్ చేసే అవకాసం రావటం (ఇంటర్వెల్ ముందు) ఆ అవకాశం ని ఉపయోగించుకొని సూర్య ముందుకి వెళ్ళటం, టెండర విషయం లో తిరగబడటం వరకు అంతా బాగానే ఉంటుంది. సూర్య తిరగబడటం మొదలు పెట్టక సినిమా లో ఊపు వస్తుంది, అప్పటి వరకు ప్రేక్షకులు కోరుకున్నది కూడా అదే, అందుకే అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు సినిమా పై హోప్ వస్తుంది. "నా దృష్తి లో, భయపడే వాడు, భయపెట్టే వాడు ఇద్దరు శవాలే" లాంటివి  ఇంటర్వెల్ ముందు పడితే ఏ ఫాన్స్ కి అయినా ఊపు వస్తుంది, కానీ తను తీసుకున్న గోతిలో తనే పడ్డట్టు అవుతుంది అని కట్టా ఊహించి ఉండరు. యూనియన్ మీటింగ్ లో అంత పెద్ద స్పీచ్ ఇచ్చిన తర్వాత జనాల్లో మార్పు వచ్చి వోట్ వేసారు అనుకునేరు, వాళ్ళ నాన్న సైడ్ మన కులం, అమ్మ సైడ్ మన కులం అని వేసారు అంట :) హీరోయిజం అనుకోవాలేమో దీనిని. ఆటోనగర్ లో సీజ్ లు జరిగి పట్టు కోల్పోయినప్పుడు, అదే సూర్య, విలన్ ని బయపెట్టడం కోసం, భయపెట్టి తన పని చేయించుకోవటం కోసం కిడ్నాప్ చెయ్యటం చూస్తే, సూర్య బ్రతికి ఉన్నా శవం ఏమో అనుకోవాల్సి వస్తుంది అని, తన బేసిక్ పంచ్ డైలాగ్ కి తన క్యారెక్టర్ కి వ్యతిరేకం అని ఎవరూ ఆలోచించరు అనుకున్నారేమో కట్టా గారు.  అదే సీన్ లో అజయ్ ని ఎసేసి ఉంటె, జనాలు సూర్య పక్కన నిలబడితే, అప్పటి నుంచి పోరు స్టార్ట్ అయితే సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్ లో రాసుకోటానికి వీలు ఉండేది.  అప్పటి వరకు ఎదురు లేకుండా ఎదిగిన పాత్ర, ఎదుగుతనే ఉంటుంది, కాకపోతే ప్రోయాక్టివ్ గా ఉండాల్సిన పాత్ర రియాక్టివ్ గా డిజైన్ చేసారు, అవతలి వాళ్ళు ఏదైనా స్టెప్ తీసుకున్నాక సర్ రియాక్ట్ అవుతారు అంతే. మనం ఎన్నో సినిమాలలో చూసేసిన అవే పాత మైండ్ గేమ్స్ తో. ఫైనల్ గా కొడుకిని అప్పగించాల్సి వచ్చినప్పుడు, అంత పెద్ద విలన్ కి ఆ ఆలోచన అంత వరకు ఎందుకు రాలేధబ్బా అని ప్రేక్షకుడు ఆలోచించే అవకాశమే లేదు అనుకున్నారు ఏమో. వార్నింగ్ ఇచ్చినా, ధైర్యం చెప్పాల్సి వచ్చినా, లవ్ చెప్పాలి అనుకున్నా, మాములుగా మాట్లాడినా కూడా, భారి డైలాగ్ తోనో తత్త్వం తోనో డైలాగ్ చెప్తుంటే, ఈ పాత్ర శేకర్ కమ్ముల స్కూల్ నుంచి వచ్చింది ఏమో అనుకోవాలి (వాళ్ళకి కట్టా స్కూల్ అని ఒకటి ఓపెన్ అయ్యింది అని సినిమా అయ్యాక తెలుస్తుంది లెండి). ముగ్గురు వ్యక్తులే వ్యవస్థ అని నమ్మి, వాళ్ళని అంతమోదిస్తే వ్యవస్థ మారిపోతుంది అనుకునే ఆలోచన చాలా సిల్లీ గా అనిపిస్తుంది. అప్పటికి ఛత్రపతి సినిమా వచ్చి ఉంటె, వీడు పోతే వాడు, వాడు పోతే వాడెమ్మ మొగుడు వస్తాడు అని సూర్య కి తెలిసేది. ఈ కథ కి చత్రపతి ఫస్ట్ హాఫ్ కి ఉండే అంత దమ్ము ఉన్నప్పటికీ, అలంటి పరిస్థితులు, వ్యక్తులు సూర్య కి ఎదురుగా లేక పోవటం వలన తన పోరాటం కూడా ఏదో జరుగుతుంది అన్నట్టు మిగిలిపోతుంది. ఇలాంటి సినిమాలకి లెక్చర్ ఇచ్చే పద్ధతి కంటే ముల్లు ని ముల్లు తోనే తీయాలి అనే పద్ధతి కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే పద్ధతి. వయసుకి మించిన పాత్ర లో తన వంతు న్యాయం చేసిన నాగ చైత్యన ఇలాంటి జెండర్ సినిమాలని పక్కన పెట్టడం ఆయనకి మనకి మంచిది. 


సూర్య మరదలు: కారణం లేక పోయినా సూర్య ని ప్రేమిస్తూ పెళ్లి అంటే తనతోనే అని ఫిక్స్ అయిపోయిన మరదలు, ఎందుకు ఏమిటి అని అడగకుండా, అసలు డెవలప్ చెయ్యకుండా వదిలేసిన పాత్ర. అనాథ అయిన హీరో తో సినిమా మొత్తం ట్రావెల్ చెయ్యకుండా సెకండ్ హాఫ్ లో పాటలకి క్లైమాక్స్ లో గ్రూప్ ఫోటో కి పరిమితమైన పాత్ర. అనవసరం అయిన నస లాంటి కామెడీ ట్రాక్ బదులు, అదే కామెడీ తో లవ్ డెవలప్ చేసినా ఎంతో కొంత ఉపయోగం ఉండేది ఏమో. ఇలాంటి పాత్ర లో పెర్ఫార్మన్స్ చెయ్యటానికి స్కోప్ కూడా లేక పోవటం వలన సమంతా ఏదో సినిమా లో ఉంది అనిపించుకుంది. 

సూర్య గ్యాంగ్: సూర్య కోసం ప్రాణాలైనా ఇచ్చే అంత బాండింగ్ లేక పోయినా సూర్య వలన ప్రాణాలు కోల్పోయే స్నేహితులు ఉన్న గ్యాంగ్. మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిన నందు లో ని నెగటివ్ రోల్ ని బాగా ప్రెసెంట్ చేసినా కథనం ఇంకా గ్రిప్పింగ్ గా ఉండేది ఏమో. సినిమా లో కొంత లో కొంత కామెడీ ని పండించింది వీళ్ళే లెండి

సూర్య మేనమామ: ఇష్టం లేని కులాంతర వివాహం చేసుకున్న చెల్లిని చంపే అంత కోపం ఒక కారణం గా, ట్రాజెడీ తో ఇంటికి వచ్చిన మేనల్లుడిని వదిలించుకొని తన బ్రతుకు తను బ్రతుకుతూ ఎదగాలనుకునే పాత్ర. మేనల్లుడు కష్టం లో పలుపంచుకోక పోగా, తనకి సాయం చేసిన తర్వాత కూడా చేరదీయక పొగా, యూనియన్ ప్రెసిడెంట్ గా మేనల్లుడి పై పెద్దగ ప్రభావం కూడా చూపెట్టలేక పాసివ్ గా మిగిలిపోయిన ఒక పాత్ర. కనీసం సూర్య కి హెల్ప్ చేసినందుకు ఈ పాత్ర కి కష్టాలు వస్తే రియాక్షన్ అయినా పండేది. ఈ పాత్ర తన తప్పు రియలైజేషన్ కూడా ఏదో సినిమా అయిపోతుంది కాబట్టి అన్నట్టు చూపెట్టేసారు. కథ కి ఈ పాత్ర ఎంత వరకు అవసరం? కథ లో కీలక మలుపుల్లో ఈ పాత్ర ప్రభావం ఎంత? చూసిన వాళ్ళు ఆలోచించుకోండి. ఇలాంటి పాత్రలు సాయి కుమార్ నటన గురుంచి ఎంచటానికి ఏముంటుంది. ఎప్పటిలా బాగా చేసారు. 

బ్రాహ్మి, వేణు, భరత్, బ్రహ్మాజీ: కామెడీ కోసం సృష్టించిన ఈ పాత్రలు సరైన థ్రెడ్ లేక చూస్తున్న జనాల్ని ఇబ్బంది పెట్టాయి. ఉన్నంత లో సడన్ గా పుట్టుకొచ్చే బ్రహ్మాజీ పాత్ర బెటర్, ఏ పాత్ర కి సరైన స్టార్ట్ కానీ ముగింపు కానీ లేక పోవటం వలన ఈ పాత్రలకి రాసుకున్న కథ ఏంటో కట్టా గారే చెప్పాలి 

కార్పొరేటర్ అండ్ అతని తమ్ముడు; మేయర్ కింద ఉంటూ ఆటో నగర్ ని శాసించే పాత్రలు. క్రూరత్వం కి ప్రతిరూపం గా ఉండాల్సిన పాత్రలు, అరాచకాలు, అన్యాయాలు చేస్తూ ప్రేక్షకులని సైతం తిరగబడే మూడ్ తీసుకు రావాల్సిన పాత్రలు. ఏ మాత్రం ఇంపాక్ట్ కలిగించేలా లేక పోగా, కామెడీ కోసం వాడుకోవటం అనేది అతి పెద్ద తప్పు.  క్రూరత్వం గురుంచి అంత గా ప్రస్తావించిన కట్టా గారు జె పి గెటప్ విషయం లో ఎందుకు అంత సిల్లి గా డిజైన్ చేసుకున్నారు?సినిమా లో  మెయిన్ విలన్ వేరే ఉన్నాడు అని ముందే తెలిసినప్పుడు ఈ పాత్రలు క్లైమాక్స్ వరకు ఉండటం లో అర్ధం ఉండదు. అన్ని ఇయర్స్ గా అక్కడ పాతుకు పోయిన వాళ్ళు, ఒకడు తిరగాబడిత్ అణిచి వెయ్యాలి కానీ వాడి నెక్స్ట్ స్టెప్ కోసం వెయిట్ చెయ్యకూడదు. మర్డర్ లు అవలీల గా చెయ్యగలిగే తమ్ముడు హీరోయిన్ దగ్గరికి వచ్చే సరికి తెలిపోకూడదు అవసరం అయితే రేప్ చేసేలా ఉండాలి. క్రూరత్వం మిస్ అయ్యాం అని తెలుసుకున్న వాళ్ళు క్రూరులు గా మారాలి కానీ కామెడీ లు చెయ్యకూడదు.మెయిన్ గా ఈ పాత్రలకి ఉండాల్సిన దమ్ము రైటింగ్ లో లేదు, తెర మీద కనపడలేదు. ఉదాహరణ కి చత్రపతి లో బాజీ రావు కింద ఉంది అన్ని చూసుకునే కాట్రాజ్ లాంటి పాత్రలు. అక్కడ మైగ్రేట్ క్యాంపు అయితే ఇక్కడ ఆటోనగర్. అక్కడ కాట్రాజ్ కి హెడ్ ఉన్నట్టే ఇక్కడ వీళ్ళకి మేయర్. కాట్రాజ్ మనకి ఇప్పటికి గుర్తుండిపోయాడు, మరి వీళ్ళు? JP అండ్ అజయ్ ఇద్దరు రొటీన్ గా చేసారు.


మేయర్: సూర్య పాత్ర గురుంచి ఎంత మాట్లాడుకున్నమో, అతని టార్గెట్ అయిన వ్యవస్థ ని రిప్రేసేంట్ చేసే మేయర్ పాత్ర గురుంచి అంతే మాట్లాడుకోవాలి, కానీ దురదృష్టవశాస్తూ  మనకి ఆ అవకాసం కట్టా గారు కలిగించలేదు. ఎంతో క్రూరుడు గా పరిచయం చేసిన ఈ పాత్ర, ఇంత క్రూరుడు వ్యవస్థ అయితే జనాలని ఇంకా ఎంత హింస పెడతాడో అనే భావన కలిగించినా, అక్కడక్కడ వచ్చి పోతూ, భారి డైలాగ్ లు చెప్పటం వరకే పరిమితం అయిపోవటం వలన మెయిన్ విలన్ పాసివ్ విలన్ అయిపోయాడు. ఈ పాత్ర కి రాసుకున్న డైలాగ్లు కానీ, వాటిని మధు చెప్పిన తీరు కానీ ప్రసంసించకుండా ఉండలేం, అవి అలా ఉండటానికి కారణం అవి తక్కువ గా ఉండటమే. స్క్రీన్ టైం ఏ తక్కువ ఉండటం వలన చెప్పిన ఆ కొద్ది డైలాగ్లు బాగా పండాయి. సూర్య విషయం లో కూడా గొప్ప డైలాగ్లు లిమిటెడ్ గా వాడి ఉంటె ఎంత బావుండేదో అనిపించేలా చేసాయి. తన సామ్రాజ్యం లో తిరుగులేని ఆదిపత్యం ప్రదర్శిస్తున్న చక్రవర్తి కి, సామంత రాజ్యం లో తిరుగుబాటుని ఆది లోనే తున్చేయ్యాలి అనిపించక పోవటం (ఏ వ్యవస్థ లో అయినా ఒక్కడి పిడికిలి దాటితే ఆర్డర్ మొత్తం మారిపోతుంది అని తెలిసిన కూడా - తన డైలాగ్ ఏ), ఇంకా చాల దారులు ఉన్నప్పటికీ తానే డైరెక్ట్ గా దిగిపోయి ఒక్క దెబ్బకే చచ్చి పోవటం ఈ పాత్ర లో మధు పండించిన క్రూరత్వం ని తెల్చేసేలా చేసిన రచనా  బలహీనతలు.

ఒక సోషల్ ఇష్యూ తో స్టార్ట్ అయిన సినిమా, ఒకరి హత్య తో ముగిస్తే అది వ్యవస్థ గురుంచి తీసిన సినిమా అవుతుందా? సూర్య కి సంబందించినంత వరకు మేయర్ అండ్ కో మాత్రమే వ్యవస్థ అనుకోవాలా? జైలు నుంచి వచ్చిన సూర్య పేపర్ లో కాని, టీవీ లో కాని, పోస్టర్ లో కాని మేయర్ ని చూసి ఉండడు అంటారా? క్లైమాక్స్ లోనే చూడాలి ఏమో.  ఒక మేయర్ అంతలా చేస్తుంటే, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకోరు ఎందుకు? ఇంతకు సూర్య వ్యవస్థ పై చేసిన పోరాటం ఏమయినట్టు, మేయర్ నో, అతని అనుచరులనో చంపితే వ్యవస్థ మారిపోతుందా?  వ్యవస్థ లో భాగస్వామ్యులు అయ్యి కీలు బొమ్మలు లాంటి కమీషనర్ అండ్ కలెక్టర్ పాత్రలు, అటు సీరియస్ గా ను లేక ఇటు కామెడీ ని పండించలేక వాస్తవ పరిస్థితుల నుంచి దూరం వేల్లిపోయినట్టేగా? మేయర్ ని చంపాక అతని దాడి లో బలి అయిపోయిన చిన్న పిల్ల కళ్ళలో ఆనందం చూపిస్తారు కానీ చనిపోయిన పేరెంట్స్ కి ఆనందం లేనట్టేనా? ఇది రివెంజ్ కాదు అని చెప్పటమా? ఇంతకి ఆ క్లైమాక్స్ వలన కథ కి ఇచ్చిన ముగింపు కి అర్ధం ఏమిటి? 1990 లలో జరిగిన సినిమా కి అదే టైం లో వచ్చిన మూవీస్ టైపు లో (ఉత్ప్రేరక పాత్రలు screenplay బాష లో Catalyst క్యారెక్టర్ అయిన  యూనియన్ ప్రెసిడెంట్ గా ధర్నా చేస్తూ చంపివేయబడ్డ లీడర్ మూడ్ ని చేంజ్ చెయ్యటానికి ఉపయోగిన పడినా, సెకండ్ హాఫ్ లో జనాల్లో చైతన్యం తీసుకొచ్చే అతని వైఫ్ క్యారెక్టర్ పరమ రొటీన్ అయిపోయి తేలిపోయింది) ప్రెసెంట్ చేస్తూ  2014 లో చూసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని ఎలా అనుకున్నారు? 

కథ లో విషయం లేనప్పుడు , కథనం బలహీనం గా ఉన్నప్పుడు, పాత్రలు డిజైన్ పైన చెప్పినట్టు ఉన్నప్పుడు నటీనటులు మాత్రం ప్రత్యేకం గా చేసేది ఏమి ఉండదు, బాగా చేసారు కదా అనే ఫీలింగ్ కలిగించటం తప్ప. వాటితో పేజిలు పేజిలు డైలాగ్లు, అర్ధం కాని పద ప్రయోఘం తో చెప్పించినా ఉపయోగం ఉండదు, డైలాగ్ లు బావున్నాయి కదా అనే ఫీలింగ్ కలిగించటం తప్ప.   డైలాగ్ లు సందర్భం ని బట్టి, పాత్ర ని బట్టి ఉపయోగించాలి కానీ, మనకి వచ్చు అని, ఇంతకు ముందు రాసిన దానికి ప్రశంశలు వచ్చాయి కాబట్టి అని రాసేస్తే.. ఈ ఆర్టికల్ ఫస్ట్ పారాగ్రాఫ్ లో రాసుకునట్టే ఉంటాయి రియాక్షన్స్. "అవును నేను తెలుగులో రాసి భయపెట్టే వాడినే, కానీ అనామకుడిని  కాదు, నా పేరు హరి, చెన్నై నగర్ హరి :)" అక్కడ నేను చేసిన అసంధర్బ ప్రదర్శన లాగే ఈ సినిమా కూడా ఉంది అని చెప్పటానికే ఆర్టికల్ ని అలా స్టార్ట్ చేశాను తప్ప అందులో వేరే ఉద్దేశం ఎం లేదండోయ్. ఇంతకి ఈ సినిమా స్టార్టింగ్ లో "నేను అనాధ నే కాని అనామకుడిని కాదు" డైలాగ్ తో నేరేషన్ మొదలు అయ్యే టైం కి, అంటే సినిమా ప్రకారం అప్పటికి మామ రియలైజేషన్ అండ్ కూతురిని పెళ్లి చేసుకో అని అడగటం కూడా అయిపోతాయి కదా... అయినా హీరో ఇంకా నేను  అనాధ అంటాడు ఎందుకబ్బా?

ఫైనల్ గా:  సగం విస్కీ సగం సోడా కలిపితే సోడా అయిపోదు మేయర్...... విస్కీ ఏ అవుతుంది* - అలాగే - కొన్ని మంచి డైలాగ్ లు కొన్ని మంచి  సీన్ లు కలిపేస్తే మంచి/హిట్/కంప్లీట్ సినిమా అయిపోదు యువర్ హానర్..... ఆటోనగర్ సూర్యగా మిగిలిపోతుంది. 
* పాలు విషం కలిపే లాజిక్ కన్నా విస్కీ సోడా లాజిక్ ఏ బెటర్ కదా :)


8 comments:

Anonymous said...

5th Para & Conclusion lo POINTs peaks, especially Cast, Heroism, Krurathvam points bagunnayi..

The DOUBTS raised about the film were more than JUSTIFIED.

Anonymous said...

Aditya

Correct ga cheppav baa, Nakau adhey anipinchindi ajay ni murder chesi unte peaks ki velledhi interval episode, and heroism ante inka okkade antha cheyalani evaru cheptaro vellaki, nuvvu cheppinattu, public and inka higher authorities like mla or mp help tho politics lo ki vacchi gelichinattu aa paristhithi marchinattu choopiste chaala manchi cinema ga anipinchedhi

btw aa murder jarigetapudu react aite adhi regular cinema laga aipotundhi anukunnadu emo, anduke prajalani kooda tidagadu ga nuvu cheppina aa union president murder and wife thread, but 2nd half lo eppudaite aa kidnap drama start aindho akkade padi poindhi cinema

and baa okkati cheppu chaitu ela chesadu neeku nacchinda performance

just for chaitu and first half kosam, 2 times choosa inkokkasari choosta kooda :D

ajay routine role aina baga chesadu le :)

Anonymous said...

aditya

Correct ga cheppav baa, Nakau adhey anipinchindi ajay ni murder chesi unte peaks ki velledhi interval episode, and heroism ante inka okkade antha cheyalani evaru cheptaro vellaki, nuvvu cheppinattu, public and inka higher authorities like mla or mp help tho politics lo ki vacchi gelichinattu aa paristhithi marchinattu choopiste chaala manchi cinema ga anipinchedhi

btw aa murder jarigetapudu react aite adhi regular cinema laga aipotundhi anukunnadu emo, anduke prajalani kooda tidagadu ga nuvu cheppina aa union president murder and wife thread, but 2nd half lo eppudaite aa kidnap drama start aindho akkade padi poindhi cinema

and baa okkati cheppu chaitu ela chesadu neeku nacchinda performance

just for chaitu and first half kosam, 2 times choosa inkokkasari choosta kooda :D

ajay routine role aina baga chesadu le :)

Anonymous said...

aditya

Correct ga cheppav baa, Nakau adhey anipinchindi ajay ni murder chesi unte peaks ki velledhi interval episode, and heroism ante inka okkade antha cheyalani evaru cheptaro vellaki, nuvvu cheppinattu, public and inka higher authorities like mla or mp help tho politics lo ki vacchi gelichinattu aa paristhithi marchinattu choopiste chaala manchi cinema ga anipinchedhi

btw aa murder jarigetapudu react aite adhi regular cinema laga aipotundhi anukunnadu emo, anduke prajalani kooda tidagadu ga nuvu cheppina aa union president murder and wife thread, but 2nd half lo eppudaite aa kidnap drama start aindho akkade padi poindhi cinema

and baa okkati cheppu chaitu ela chesadu neeku nacchinda performance

just for chaitu and first half kosam, 2 times choosa inkokkasari choosta kooda :D

ajay routine role aina baga chesadu le :)

aditya said...

asalu sai kumar character rasukoadam edho variations unnattu rasukunnadu like family mana, caste biased and villains mundu metaka vadi laga but asalu hero ni enduk vaddantado, em choosi realise avutado no claity but sai kumar tana performance tho cover chesadu esp samantha ni kotte scene

ajay,jp characters ala unnapudu interval avagane villain scene lo ki vacchi unte aipoyedhi inka Lakshmi narasimha lo choopinchinattu mayer avadaniki mayer aina entho peddavalla back hand undhi type establish chesina bagundedhi

and inka sam love matter lo kooda logic aa :D, bava ni chinnapatinundhi premistundhi, okarakamga hero career start kavadaniiki ame ga kaaranam :)

nandu role ki negative twist okay but okka nimisham lo aipoye daniki aa twist enduko adhedo pre climax lo pettukuni appudu pakka friend chacchinattu choopinchina aipoyedhi some thing like pre climax mosam kabadi prajala chavu ki karanam aina hero etc etc :D

annitikante highlith anta tuppas climax pettukuni cinema ni climax thon open cheyatam :D

HKR said...

and baa okkati cheppu chaitu ela chesadu neeku nacchinda performance//

performance wise parledu kani.... larger than life role lo aa bhari dialogues suit avvaledu...

Anonymous said...

aditya,

ageki ekkuva aindi antav anthey na :)

Anonymous said...

review ante ila vundali keep it up anna.

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views