ఆగడు - కథ కథనం - ఒక విశ్లేషణ
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో సందడి అలా ఇలా ఉండదు, ఒక్కొక్కరిది ఒక్కో ఉద్దేశం. 14 రీల్స్ వాళ్ళు చేసిన పబ్లిసిటీ హడావుడి, సినిమా కి వచ్చిన పెద్ద రిలీజ్ కి తోడు దూకుడు కాంబినేషన్ లో రాబోతున్న కమర్షియల్ సినిమా అనగానే అభిమానుల అంచనాలకి ఆకాశమే హద్దు అంటే అది అతిశయోక్తి కాదు. అభిమానుల అంచనాలు పక్కన పెడితే కోన వెంకట్ అండ్ గోపి మోహన్ లేని శ్రీను వైట్ల సత్తా ఏంటో తెలిపోద్ది అనే ఆత్రుత సగటు సినీప్రియులని కూడా ఆగడు కోసం వెయిట్ చేసేలా చేసింది. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ వచ్చిన బాక్స్ ఆఫీసు పెర్ఫార్మన్స్ గురుంచి మాట్లాడే ఉద్దేశం ఎలాగు లేదు ఎందుకంటే దాని గురుంచి ఆల్రెడీ బాక్స్ ఆఫీసు స్పెల్లింగ్ తెలియని (నా లాంటి) వాళ్ళు కూడా గత నాలుగు రోజులు గా మాట్లాడుతూనే ఉన్నారు కాబట్టి ఎప్పటిలాగే సినిమా కథ కథనం ని విశ్లేశించుకొనే ప్రయత్నమే ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం.
సినిమా కలెక్షన్స్ ని బట్టి ఇంకా ప్రత్యేకం గా ఈ సినిమా ని ఇకపై చూసే వాళ్ళు ఎంతో మంది ఉండరు అనే నమ్మకం తో - ఇంట్రెస్ట్ / ఓపిక / టైం ఉంటె సినిమా చూసిన చూడక పోయినా ఆర్టికల్ ని నిర్మొహమాటం గా చదువుకోవచ్చు
ఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు
కథ / థీమ్ : ఒక మనిషి క్యారెక్టర్ ని కొలవటానికి ఉన్న ఒకే ఒక కొలమానం కృతజ్ఞత. ఆటిట్యూడ్ + గ్రాటిట్యుడ్ = ఆగడు. చిన్నప్పుడే పేరెంట్స్ ని పోగొట్టుకున్న మహేష్ ని రాజేంద్ర ప్రసాద్ చేరదీసి సొంత కొడుకు లా పెంచుతాడు, చెయ్యని తప్పు ని తన మీద వేసుకొని జైలు కి వెళ్ళిన మహేష్ కస్టపడి CI అవుతాడు. సోను సూద్ అరచాకాలని అంతం చెయ్యటానికి ఆ ఊరికి వచ్చిన మహేష్ కి సోను వలన తన ఫ్యామిలీ కి జరిగిన నష్టం కూడా తెలుసుకొని అతని ఆట కట్టిస్తాడు. రెగ్యులర్ కథే అయినా కూడా కమర్షియల్ ఫార్మటు లో ఉండే ఈ కథ కి సరైన కథనం పడి ఉంటె మినిమం హిట్ అనిపించుకునే అవకాశాలు లేకపోలేదు, మరి కథనం తోడు అయిందా చేడు అయిందా?
కథనం: కృతజ్ఞత థీమ్ తో వచ్చిన పంజా లో కథానాయకుడి రూట్ వేరు, అదే కృతజ్ఞత పేరుతో కన్నింగ్ వేషాలు వేసినా క్యారెక్టర్ కి వచ్చే మచ్చ లేదు అనుకున్న ఈ కథానాయకుడి రూట్ వేరు. అసలు క్యారెక్టర్ లాంటి స్ట్రాంగ్ పదాలు మొదట్లో యూస్ చేసి ఉండాల్సింది కాదేమో? మనం రెగ్యులర్ గా చెప్పుకునే 3 ఆక్ట్ స్ట్రక్చర్ ఈ కథనం కి వర్తించదు, ఏ ఆక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎప్పుడు ఎండ్ అయ్యిందో బహుశా స్క్రీన్ప్లే రాసుకున్న వాళ్ళకి కూడా తెలిసి ఉండదు. పాత సినిమాలకి రాసుకున్న సీన్స్ మిగిలిపోతే ఫిల్లెర్స్ గా వాడేసుకొని నడిపించేసిన కథనం లా ఉంటుంది. ఈ సినిమా లో వచ్చిన సీన్స్ ఆధారం గా చెప్పుకుంటే -
దొంగలని పట్టించి, చేరదీసిన తండ్రి ని దేవుడి లా కొలిచి, ఆ కుటుంబం కి మచ్చ రాకూడదు అని చెయ్యని తప్పు ని తనపై వేసుకొని జైలు కి వెళ్ళటం వరకు చాల బాగా రాసుకున్నారు. ఎస్టాబ్లిష్ చెయ్యాలి అనుకున్నది చేసేసారు. కట్ చేస్తే. CI గా ఎంట్రీ ఇచ్చి, పంచ్ డైలాగ్స్ పేల్చి, ఫైట్ చేసి, సాంగ్ ఏసుకొని ఫస్ట్ డే ఫస్ట్ షో అభిమానులకి కావాల్సిన అన్ని హంగులు అందిచారు. ఫైట్ ల విషయం లో ప్రతి రివ్యూ లో ను చెప్పుకునేదే అయినా ఇంకా వాళ్ళు మారరు అని ఫిక్స్ అయిపోయి వాటి గురుంచి చెప్పుకొటం కూడా అనవసరం అని స్కిప్పింగ్. ఒక్క మాటలో చెప్పాలి అంటే " ఈ సినిమా లో ఫైట్ లు ఎలపరమ్ వచ్చేసేలా ఉన్నాయి". మహేష్ కెరీర్ లో నే బాలయ్య రేంజ్ లో చేయించిన ఫీట్ మాత్రం మరపురానిది.
ఎంట్రన్స్ వరకు ఎలా ఉన్న పర్లేదు కాబట్టి, ఆ తర్వాత ఎం చేసారు అని చూద్దాం. ఆల్రెడీ సిటీ లో రఫ్ ఆడించేసిన హీరో కి బుక్క పట్నం లో పోటుగాడి ఆట కట్టించే మిషన్. హైడ్ లో ఉన్నాడు ఆపరేషన్ ఇస్తాంబుల్ (దూకుడు) అంటే అందం, విల్లెజ్ కాప్, సిటీ లో (యముడు) రఫ్ ఆడిస్తే చందం కానీ ఇక్కడ ఏదో చిట్టెలుక మీద సింహం ప్రయోగం. మిషన్ కి వచ్చే ముందే హీరో అన్న చావు కి కారణం కూడా సోను ఏ అని తెలుసుకొని (ఫ్లాష్ బ్యాక్ లో తెలుస్తుంది లెండి మనకి) రేచ్చిపోవాల్సిన హీరో సోను చుట్టూ ఉన్న చిల్లర గ్యాంగ్ పై ద్రుష్టి పెడతాడు. అసలు బెట్టింగ్ లు, బెల్ట్ షాప్ లు, కల్తి వ్యాపారాలు అలంటి బఫూన్స్ కి అప్పచెప్పిన సోను క్యారెక్టర్ ఇంకా సూపర్. ఎంట్రన్స్ తో నే తేలిపోయే సోను క్యారెక్టర్ జరగబోయే విషయాల గురుంచి ఒక అవగాహనా కల్పిస్తుంది. చిల్లర గ్యాంగ్ ఆట కట్టించే విషయం లో పిట్ట కథలతో కామెడీ కి ట్రై చేసినా రెండు కథలు అయ్యాక చిరాకు తెప్పిస్తుంది. అనుకోకుండా ఒక డైలాగ్ లో "వాడు దూకుడు స్టొరీ చెప్పాడు, నువ్వు పంచ్ డైలాగ్స్ గుర్తు పెట్టుకొని స్టొరీ మర్చిపోయావ్" అని రాసేసుకున్నారు. అది ఎవర్ని ఉద్దేశించి అన్నారు అని మనకి సెకండ్ హాఫ్ చూసాక కానీ అర్ధం కాదు. అయినా అసలు కథ ముందు ఓపెన్ చేసి తర్వాత కామెడీ ఎంత చేసుకున్న లేక కామెడీ తో పాటు కథని ముందుకి నడిపించినా బావుంటుంది కానీ జస్ట్ కామెడీ పేరు తో ఎక్కువసేపు నడిపించటం కష్టం. కమర్షియల్ సినిమా లో సడన్ గా గుర్తోచినట్టు అరగంట తర్వాత హీరోయిన్ ఎంట్రీ ఎందుకు ప్లాన్ చేసారు అనేది అంతు పట్టని మిస్టరీ. హీరోయిన్ తో రాసుకున్న లవ్ ట్రాక్ లో ను విషయం ఉండదు. పెర్ఫార్మన్స్ పరం గా తమన్నా కి స్కోప్ లేదు, ఉన్న చోట కూడా రూపాయి పావలా యాక్షన్ తో సహన పరీక్ష తప్ప ఎం ఉండదు. సెకండ్ హాఫ్ లో అయితే హీరోయిన్ కేవలం పాటల కోసమే అనే ఫార్ములా ని ఫాలో అయిపోయారు. సోను వ్యాపారాలు దెబ్బ తీసే ప్రాసెస్ లో సక్సెస్ అయినా హీరో కి ఇంటర్వెల్ వరకు ఎదురు ఉండదు, ఇంటర్వెల్ లో కూడా ఉండదు, దాని వలన ప్రత్యేకం గా బాంగ్ గా చెప్పుకునే ఇంటర్వెల్ సీన్ పడలేదు. ఏకపక్షం గా సాగిన ఫస్ట్ హాఫ్ లో విషయం లేక పోయినా, మహేష్ నటన తో, బాడీ లాంగ్వేజ్ తో, డైలాగ్ డెలివరీ తో, అక్కడక్కడ వచ్చే కామెడీ తో, స్టెప్స్ వేసి సాంగ్స్ తో ఫస్ట్ హాఫ్ మొత్తానికి అన్ని తానై నడిపించాడు.
ఫస్ట్ హాఫ్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్, కామెడీ ఫైట్ లు, అంత్యాక్షరి టైపు లో ఇన్ఫర్మేషన్ రాబట్టుకొటనికి మీలో ఎవడు పోటుగాడు గేమ్, ఆ గేమ్ ఎండింగ్ లో డాన్సు లు, హీరోయిన్ వెంట పడటాలు ఎంత లేదు అనుకున్న గబ్బర్ సింగ్ ని గుర్తు చెయ్యటం సహజం
ఫస్ట్ హాఫ్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్, కామెడీ ఫైట్ లు, అంత్యాక్షరి టైపు లో ఇన్ఫర్మేషన్ రాబట్టుకొటనికి మీలో ఎవడు పోటుగాడు గేమ్, ఆ గేమ్ ఎండింగ్ లో డాన్సు లు, హీరోయిన్ వెంట పడటాలు ఎంత లేదు అనుకున్న గబ్బర్ సింగ్ ని గుర్తు చెయ్యటం సహజం
ఇంటర్వెల్ అయ్యాక అసలు కథ మొదలు పెట్టారు, పది నిమిషాల్లో మొత్తం చెప్పేసారు. హీరో తప్పు చెయ్యలేదు అని తెలిసిన తర్వాత కూడా రాజేంద్ర ప్రసాద్ మరి హీరో కోసం ఎందుకు వెతకలేదు? కొడుకు పోయాక అయినా ఈ కొడుకు గుర్తు రాలేదా? పోలీస్ అయి ఉండి, హీరో ని ట్రేస్ చెయ్యలేక పోయాడా? లేక ఆ టైం వరకు కథ చెప్పకూడదు అని డైరెక్టర్ డిసైడ్ అయిపోయాడు కాబట్టి రాలేదా? అప్పటికి మొత్తం తెలిసింది కాబట్టి ఇక నుంచి రెచ్చిపోతాడు హీరో అనుకుంటాం మనం, కానీ అసలు ట్విస్ట్ ఇక్కడ మొదలు అవుతుంది, ఆల్రెడీ చూసేసిన దూకుడు ఫార్మటు లో కి కథ ఎంటర్ అవుతుంది. దూకుడు కానీ ఇంతకు ముందు శ్రీను వైట్ల సినిమాలు కానీ సెకండ్ హాఫ్ లో హీరో అనేవాడు విలన్ ఇంట్లో తిష్ట వేసినా కూడా విలన్ కి తను వెతుకుతున్నది వాడె అని తెలియక పోవటం అండ్ హీరో ని చంపాలని ప్లాన్ చెయ్యటం అని ఏదో ఒక ఆశయం ఉండేది, అసలు ఇక్కడ హీరో వచ్చి సోను తో కలిసిపోతాను అన్న తర్వాత సోను కి హీరో మీద ఏ విధం అయిన ఆశయం లేదు? అసలు కథ లో కాన్ఫ్లిక్ట్ ఏ లేదు. క్లైమాక్స్ లో కూడా బ్రాహ్మి ఏ చేసాడు అనుకుంటాడు కానీ హీరో వచ్చి చెప్పేదాకా కాన్ఫ్లిక్ట్ లేని కథ కి రోటీన్ కామెడీ తోడు అయ్యి సెకండ్ హాఫ్ ని విషయం లేని నస గా తయ్యారు చేసాయి. వాటికీ తోడు బ్రాహ్మి ని బ్లాక్మెయిల్ చేసే వీడియో లు, గే కామెడీ, లిప్ రీడింగ్ లు ఏదీ ఆకట్టుకునేలా ఉండదు. అసలు డైలాగ్స్ ఎలా ఉన్నాయి అంటే ఒక డైలాగ్ అర్ధం చేసుకునే లోపు నెక్స్ట్ సీన్ కి వెళ్ళిపోతాం దాని వలన మంచి పంచ్ లు కూడా ఇంపాక్ట్ లేకుండా పోయాయి. సినిమా మొత్తానికి కడుపుబ్బా నవ్వుకున్న సన్నివేసం ఎంటబ్బ అంటే ఆలోచించుకోవాల్సి వస్తుంది అంటే కామెడీ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవాలి. కథ లో కానీ కథనం లో కానీ ఎక్కడ సీరియస్ నెస్ అనేది లేక ఎంత సేపు ఇదే కామెడీ తో నడిపిస్తారు అనిపించేలా ఉంటుంది. అసలు హీరో పోలీస్ అనే విషయం మనం కూడా మర్చిపోయేలా చేసారు సెకండ్ హాఫ్ లో.
సెకండ్ హాఫ్ లో విలన్ తో నే ఉంటూ బ్రాహ్మి ని ఉపయోగించుకొని ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చి చంపెయ్యటం దూకుడు ని తలపిస్తుంది అనటం లో సందేహం లేదు. అక్కడ బ్రాహ్మి కి ఏమి తెలియకుండా జరుగుతుంది ఇక్కడ అన్ని తెలిసిన ఏమి చెయ్యలేని పోసిషన్ లో జరుగుతుంది
మొత్తం మీద ఆటిట్యూడ్ + గ్రాటిట్యుడ్ మాట దేవుడు యెరుగు ఈ సినిమా గబ్బర్ సింగ్ + దూకుడు కదా అని మోత్తుకునేలా చేసింది
ఎప్పటి లాగానే శ్రీను వైట్ల సినిమా ఇండస్ట్రీ లో ఫ్రెండ్స్ పై చాలా పంచ్ లు ఎసేసారు. "రైటర్ ని కాదు ఫైటర్ ని, ప్రాఫిట్ వచ్చిన పేమెంట్ ఎగ్గొట్టిన ప్రొడ్యూసర్, ఆడియో ఫంక్షన్ లో ప్రొడ్యూసర్ హీరో ని పొగిడినత్తు పొగడకు, నువ్వు రచన సహకారం అందించినప్పుడే గెస్ చేసి ఉండాల్సింది వాంటెడ్ గా వెన్నుపోటు పొడిచెసావ్ అని, ఖాళీ గా ఉన్నప్పుడు ట్విట్టర్ లో వేసుకో, ఫాం హౌస్ లో పిట్టలు కొట్టుకుంటాడు, ప్రకాష్ రాజ్ కవిత" ఇంతకు ముందు సినిమాల్లో అన్ని వర్కౌట్ ఐనప్పుడు ఇలాంటి వాటికీ నవ్వినా ఇప్పుడు బేసిక్ కంటెంట్ తేలిపోవటం వలన కొత్త శత్రువులని సంపాదించి పెడుతుంది
సెకండ్ హాఫ్ లో విలన్ తో నే ఉంటూ బ్రాహ్మి ని ఉపయోగించుకొని ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చి చంపెయ్యటం దూకుడు ని తలపిస్తుంది అనటం లో సందేహం లేదు. అక్కడ బ్రాహ్మి కి ఏమి తెలియకుండా జరుగుతుంది ఇక్కడ అన్ని తెలిసిన ఏమి చెయ్యలేని పోసిషన్ లో జరుగుతుంది
మొత్తం మీద ఆటిట్యూడ్ + గ్రాటిట్యుడ్ మాట దేవుడు యెరుగు ఈ సినిమా గబ్బర్ సింగ్ + దూకుడు కదా అని మోత్తుకునేలా చేసింది
ఎప్పటి లాగానే శ్రీను వైట్ల సినిమా ఇండస్ట్రీ లో ఫ్రెండ్స్ పై చాలా పంచ్ లు ఎసేసారు. "రైటర్ ని కాదు ఫైటర్ ని, ప్రాఫిట్ వచ్చిన పేమెంట్ ఎగ్గొట్టిన ప్రొడ్యూసర్, ఆడియో ఫంక్షన్ లో ప్రొడ్యూసర్ హీరో ని పొగిడినత్తు పొగడకు, నువ్వు రచన సహకారం అందించినప్పుడే గెస్ చేసి ఉండాల్సింది వాంటెడ్ గా వెన్నుపోటు పొడిచెసావ్ అని, ఖాళీ గా ఉన్నప్పుడు ట్విట్టర్ లో వేసుకో, ఫాం హౌస్ లో పిట్టలు కొట్టుకుంటాడు, ప్రకాష్ రాజ్ కవిత" ఇంతకు ముందు సినిమాల్లో అన్ని వర్కౌట్ ఐనప్పుడు ఇలాంటి వాటికీ నవ్వినా ఇప్పుడు బేసిక్ కంటెంట్ తేలిపోవటం వలన కొత్త శత్రువులని సంపాదించి పెడుతుంది
తనకి గుర్తింపు లేదు అని కోనా వెంకట్ బయటికి వచ్చెయ్యటం, చేసింది అంతా నేను అయితే పేరు వేసుకుంటే తప్పు ఏంటి అని శ్రీను గారు అనటం, గొడవ టీవీ చానల్స్ వరకు, పేపర్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళటం, ఈ సినిమా కి రైటర్ గా శ్రీను వైట్ల గారికి లిట్మస్ టెస్ట్ అని ఫీల్ అయ్యారో ఏంటో, అవసరం ఉన్న లేక పోయిన పేజీ ల కొద్ది డైలాగ్స్ రాసేసారు. ఈ సినిమా లో తెలిసో తెలియకో ఫ్లో లో డైలాగ్ వదిలేసారు "కంటెంట్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది" అని, ఎంత గొప్ప పబ్లిసిటీ చేసినా విషయం లేనప్పుడు సాదించేది ఏమి ఉండదు సరికదా దొరికిపోయినప్పుడు పోసిషన్ కూడా సినిమా లో ఆశిష్ విద్యార్ధి పోసిషన్ లాగానే మిగిలిపొద్ది. చివరిగా సినిమా లో చిల్లర గ్యాంగ్ తో చెప్పించిన డైలాగ్ ప్రేక్షకులు కూడా "మెంటల్ ఎక్కి పోయింది, మైండ్ బ్లాంక్ అయి పోయింది, సౌండ్ కట్ అయిపొయింది"చెప్పుకునేల ఉంటుంది. అప్డేట్ అవ్వండ్రా అని పక్కొడికి చెప్పటం కాదు ముందు అప్డేట్ అవ్వాల్సింది మనం అని తెలుసుకోవాలి
అసలు ఇలాంటి సినిమా ని చేతిలో పెట్టుకొని, ఇంటర్వ్యూ లో మాత్రం "దూకుడు ఒక క్లాసిక్ అండి, అయితే ఆగడు డైరెక్టర్ గా టిల్ డేట్ నా బెస్ట్ వర్క్ - వైట్ల" పోనీ సినిమా రిలీజ్ కి ముందు పబ్లిసిటీ కోసం సవా లక్ష అంటాం అవన్నీ పట్టించుకుంటే ఎలా అనుకోవచ్చు కానీ "అక్కడ 10% ఏ వాడుకున్నాను ఇక్కడ 100% వాడుకున్నాను" అన్నప్పుడు అయినా అర్ధం చేసుకొని ఉండాల్సింది. ఎక్స్‌పెక్టేషన్స్ పీక్‌లో ఉంటాయి అని తెలిసి కూడా దానిని "ప్రెజర్‌గా కంటే ప్లెజర్‌లా" ఫీలయ్యాను అని అన్నప్పుడు అయినా ఎంత వొళ్ళు దగ్గర పెట్టుకొని తీసి ఉంటాడో మనకి ఒక అవగాహన వచ్చి ఉండాల్సింది. అయినా మన అంచనాలు మారలేదు అంటే అది మనకి అయన మీద ఉన్న నమ్మకం
చివరిగా: హిట్ అంటే తెలుసుకోటానికి దూకుడు ఉంది, ఫ్లాప్ అంటే చూసుకోటానికి అందరివాడు ఉంది కానీ క్యారెక్టర్ కి కృతజ్ఞత కొలమానం అయినప్పుడు మనల్ని నమ్మి డేట్స్ ఇచ్చిన హీరో కి, డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్స్ కి, అంచనాలు పెట్టుకున్న ఫాన్స్ కి, టికెట్ కొని ధియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడి కి ఇలాంటి కేర్లెస్ గా తీసిన ప్రొడక్ట్స్ ఇస్తే క్యారెక్టర్ దెబ్బతింటుంది ఏమో?.
మీ
హరి కృష్ణ రాజు
14 comments:
Kummaav baava....line to line perfect...good work
prati sari cheppedhe ayina malli malli chepthunna sir meru adbutham ga rasthunnaru. nenu entho kontha nerchukuntunna mee reviews nunchi
superb darling
Only mahesh babu cinemalakena... Anni cinemalaku rasthuntava.... Vere cinemalaku choosina aanavallu leve...!!!!
very well written article sir
Superb writing
As usual kummesav ga
naaku adhey anipinchid, Hero chepte gani idhanta plan ani climax varaku emi teliyani villain ni champite enta champakapote enta aa emotiona eda nundi vastundi :D
Mahesh Police ai undi anta ga aaradhinche tana tandri/family ela undi enti anedhi teluskoleda :D, asalu ajay tho elago manchi relation e undhi kabatti ajay tho contact lo unnatu choopinchi, ajay ni kakunda Rp character ki loss/death jariginattu choopiste bagundedi,
asalu all of a sudden RP vacchi shankar target miss kaadu, nuvve tappu cheyaledu anadam ento :D
aina Rao ramesh file icchinapudu ajay ni mosam chesindi SP/minister ani telisi malli SP ke file ivvadamenti maehsh comedy kakapote
chivarilo hero ki villain ki undalsina lanti scene brahmi ki villain ki pettaru :D
BTW, aa DKD Punch dialogue gurthettukuni story marichipoyav counter emanan cheppava LOL :D
అనుకోకుండా ఒక డైలాగ్ లో "వాడు దూకుడు స్టొరీ చెప్పాడు, నువ్వు పంచ్ డైలాగ్స్ గుర్తు పెట్టుకొని స్టొరీ మర్చిపోయావ్" అని రాసేసుకున్నారు. అది ఎవర్ని ఉద్దేశించి అన్నారు అని మనకి సెకండ్ హాఫ్ చూసాక కానీ అర్ధం కాదు. ROFL
Meeting review kos am wait chestunna especially for this movie.As usual kummesaru.Conclusion super andi as a film lover
very good article
keka anna mee telugu reviews ni kote valu leru
Suprrb abba.
Good review hari Gary keep it up.
Post a Comment