Interstellar - చుక్కల లోకం - ఒక అవగాహనInterstellar - చుక్కల లోకం - ఒక అవగాహన  

ఇది రివ్యూ కాదు - అవగాహన (Understanding) మాత్రమె 

నోలన్ సినిమాలు ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత కూడా ఆ సినిమా గురుంచి మాట్లాడుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి అనే శాడిస్టిక్ మైండ్ సెట్ తో తీసినట్టు ఉంటాయి. డబ్బులు అండ్ టైం ఖర్చుపెట్టుకొని ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి వెళ్తాం కానీ రెండు మూడు సార్లు చూస్తేనే కాని అర్ధం కానీ విధం గా, క్లాసు రూం లో కుర్చునట్టు సినిమా హాల్ లో కూర్చోవాల్సిన విధం గా కూడా సినిమాలు ఉంటాయి అని నిరూపించిన వ్యక్తి నోలన్. నోలన్ ఈస్ నాట్ అ నేమ్, ఇట్స్ ఏ బ్రాండ్, అవసరం ఉన్నా లేక పోయినా స్టేటస్ కోసం ఐ ఫోన్ వాడే జనాలు ఉన్నట్టు, అర్ధం అయినా అవ్వక పోయినా - నోలన్ సినిమా చూడక పోతే నేల టికెట్ ఫెలో అనుకుంటారేమో అని భయపడి - ఈయన సినిమా లు చూసి సూపర్ అనే జనాలు కూడా ఉన్నారు. పరిచయం అవసరం లేని ఈయన గురుంచి ఎందుకులెండి కాని సినిమా విషయానికి వద్దాం.

Interstellar గురుంచి రాసే అంత తోపు అని కాదు కానీ (బేసిక్ గా తెలుగు సినిమాలే సరిగ్గా చూడటం రాని నాకు ఇంగ్లీష్ సినిమా చూడటం దాని గురుంచి రాయటం అనేది కత్తి మీద సాము అని గమనించగలరు) నాకు ఉన్న సినిమా పిచ్చ కి ఈ సినిమా ఎంత వరకు అర్ధం అయ్యింది, ఇంకా ఎలా అర్ధం చేసుకోవచ్చు, నేను మిస్ అయినవి వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు లాంటి స్వార్ధ పరమైన ఉద్దేశం తో రాస్తున్న ఆర్టికల్ ఇది. నాకు తెలిసిననంత వరకు, నాకు అర్ధం అయినంత వరకు రాస్తున్నా.. తప్పులు ఉన్నా లేక బూతులు ఉన్నా నా పూచి లేదు సుమీ. ఈ సినిమా ని తెలుగులో డబ్ చేస్తే టైటిల్  - "చుక్కల పల్లకిలో" అని పెట్టేవారేమో?

కథ; ఒక పల్లెటూరిలో కరువు వస్తే, ఇంకా అక్కడ బ్రతకటం కష్టం అని, తన ఫ్యామిలీ ని కాపాడుకోటానికి వేరే ఊరు వెళ్లి అక్కడ పరిస్థితులు చూసుకొని అప్పుడు ఫ్యామిలీ ని కూడా తీసుకేల్లోచ్చు అనుకోని బయల్దేరిన ఒక తండ్రి అక్కడికి వెళ్ళాక అక్కడ బ్రతకటానికి ఏమి లేదు అని తెలుసుకున్నాక, ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పటానికి మార్గం లేక పోగా, ఇంటికి తిరిగి వచ్చే అవకాసం లేక పోతే? అదే సమయం లో ఇంటికి తిరిగి వస్తాడు అని ఊరిలో ఎదురు చూస్తున్న కూతురు అసలు తండ్రి బ్రతికి ఉన్నాడో లేదో కూడా తెలుసుకోలేక పోతే? ఇన్ని గొప్ప ఎమోషన్స్ మద్య తర్వాత ఎం జరిగింది అనేది కథ. పల్లెటూరి ప్లేస్ లో భూమి, వేరే ఊరు ప్లేస్ లో చుక్కల లోకం ని పెట్టుకోవటమే

కథనం: లెక్క పరంగా 5 నుంచి 6 ఆక్ట్స్ ఉన్నఈ కథనం ని మనం 3 అక్ట్స్ లో చెప్పుకుందాం కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి. మన ఆలోచన కి అందనిది లేక మనకి సమాధానం కి దొరకనిది అంతా సైన్స్ అనుకోగలిగితే ఈ సినిమా అర్ధం అయిపోయినట్టే. 

ఆక్ట్ 1: ఒకప్పుడు నాసా లో డ్రైవర్ గా (అదే పైలట్) పని చేసి హీరో ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ తన కూతురు కొడుకు తో లైఫ్ గడిపేస్తూ ఉంటాడు. వ్యవసాయం కూడా అంతా ఆశాజనకం గా లేక పోవటం, ప్రకృతి వాళ్ళ లైఫ్ తో ఆడుకోవటం తో (అదేంటో వాళ్ళ ఇల్లు మాత్రమే ఎఫెక్ట్ ఐనట్టు చూపించారు, అది ప్రపంచం మొత్తం గా ప్రొజెక్ట్ చేసి ఉంటె బావుండేది) నిరాశ తో ఉన్న హీరో కి ఒక రోజులు తన కూతురి గదిలో కోడ్ కనపడుతుంది (X). ఆ కోడ్ చేదించిన హీరో కో ఆర్డినెట్స్ గా గుర్తుంఛి దాని కోసం వెళ్తూ అది నాసా ఫెసిలిటీ అని తెలుసుకుంటాడు. ఒకప్పటి తన బాస్ ని కూడా కలుస్తాడు. అక్కడ వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ గురుంచి తెలుసుకుంటాడు. ఈ ప్రపంచం లో మానవ జాతి మనుగడ కష్టం అని, అందువలన వేరే గ్రహం లో ఎక్కడ మనకి అనుకూలమైన వాతావరణం ఉందొ కనుక్కొటానికి 12 మంది బయల్దేరారు అని, వాళ్ళతో మనం మాట్లాడగలం కాని వాళ్ళు మనతో డైరెక్ట్ గా మాట్లాడలేరు అని, వాళ్ళు సిగ్నల్ మాత్రమె పంపగలరు అని, అలా 3 నుంచి సిగ్నల్స్ వచ్చాయి అని, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు. నాకేందుకోచ్చిన గోల నా వల్ల కాదు అన్న హీరో తో "నీ కూతురు జేనేరేషన్ ఏ లాస్ట్, ఆ తర్వాత ఎవరు బ్రతకరు, నువ్వొక మంచి డ్రైవర్ వి, అక్కడికి వెళ్లి ఈ ప్రపంచం అని కాపాడు" అని చెప్తారు. 

ప్లాన్ A : అక్కడ కి వెళ్లి వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా తో పెద్ద gravitation equation సాల్వ్ చేసి, ఇక్కడ ఉన్న జనాలని అందర్నీ అక్కడికి పంపెయ్యటం. 
ప్లాన్ B : ఒక వేల ఆ equation సాల్వ్ అవ్వక పోతే, లేదా అక్కడ potential homeworld దొరక టానికి టైం పట్టి ఈ లోపు భూమి మీద జనాలు పోతే, వెళ్ళిన వాళ్ళు అక్కడ ఒక కాలనీ డెవలప్ చేసి (రియల్ ఎస్టేట్ కాదు), మీ దగ్గర ఉన్న ఎగ్స్ తో మానవ జాతి ని పెంచండి.  

ఇందుకోసమే "వాళ్ళు" మనల్ని ఎంచుకున్నారు అని బాస్ చెప్పగా, నెక్స్ట్ జేనేరేషన్ కోసం తప్పదు అని హీరో వెళ్దాం అనుకుంటాడు. ఇప్పుడు వెళ్తే నువ్వు మల్లి ఎప్పుడు వస్తావో కూడా తెలియదు, నువ్వు వెళ్లొద్దు అని కూతురు గోల పెడుతుంది. "STAY" (Y) అని కూడా చెప్తుంది. అయినా కూడా వెళ్ళిపోతాడు హీరో. ఆక్ట్ 1 కె ఇంత రాసేసావ్ ఏంటి అనుకుంటారేమో, సినిమా లో కూడా ఈ ఆక్ట్ గంట ఉంది మరి. 

ఆక్ట్ 2: బయల్దేరిన తర్వాత వయా విజయవాడ మనం హైదరాబాద్ వెళ్లినట్టు, ముందుగా endurance కి కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి వయా Worm Hole కొత్త ప్రపంచం కి వెళ్ళాలి అన్నమాట. ఈ Worm Hole అనేది Saturn కి దగ్గరలో "వాళ్ళ" ద్వారా తయ్యారు చెయ్యబడింది. హీరో తో పాటు, బాస్ కూతురు, రోబోట్ అండ్ ఇంకో ఇద్దరు బయల్దేరతారు. భూమి నుంచి వస్తున్న మెసేజెస్ చూసుకునే అవకాసం ఉంటుంది కానీ కూతురు కోపం తో రాకపోవటం వలన కొడుకు మెసేజెస్ మాత్రమే చూసుకుంటూ ఉంటాడు హీరో. ఎందురన్సు (మన సుదర్శన చక్రం లా ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ఒక గేర్ వీల్ లా) కి కనెక్ట్ అయ్యాక Gravitational ఫోర్సు ని ఈక్వల్ టు ఎర్త్ మైంటైన్ చేస్తే టైం ఒకలాగే ఉంటుంది. ఇందాక చెప్పుకునట్టు 3 ప్లేసెస్ నుంచి సిగ్నల్స్ వచ్చాయి కాబట్టి ఆ మూడు ప్లేసెస్ కి వెళ్ళాలి. దాని కోసం బ్లాక్ హోల్ ఉంది గా. పక్కింట్లోకి వెళ్ళాలి అంటే మన గేటు తీసుకొని రోడ్ మీద అటు వెళ్లి వల్ల గేటు ఓపెన్ చేసి రూం లో కి వెళ్ళాలి, అదే Worm Hole మన కిటికీ లో నుంచి వల్ల కిటికీ లో కి దూకేయ్యటమే, సినిమాలో వేరేల చెప్పారు లెండి. బ్లాక్ హోల్ లో కి ఎంటర్ అయ్యాక హీరోయిన్ కి ఎవడో షేక్ హ్యాండ్ ఇస్తాడు (Z). ముందుగా మిల్లర్ ప్లానెట్ కి వెళ్తారు. అక్కడ వాటర్ ని చూసి హమ్మయ్య ఇక్కడ సమ్మర్ లో కూడా వాటర్ ప్రాబ్లం ఉండదు అనుకుతూ ముందుకు వెళ్తే అక్కడ వాటర్ తప్ప ఇంకా ఎం ఉండదు, మిల్లర్ డేటా తెచ్చుకుందాం అనుకునే టైం కి పెద్ద పెద్ద అలలు వచ్చి వీళ్ళలో ఒకడు పోతాడు. కానీ ఆ వాటర్ వలన వీళ్ళ తిరుగు ప్రయాణం కొంచెం లేట్ అవుతుంది, ఆ లేట్ మన భూమి మీద 23 ఇయర్స్ తో సమానం. 

మళ్లీ వచ్చి చూసుకుంటే కొడుకు కూతురు పెద్ద వాళ్ళు అయిపోవటం, కొడుకు వ్యవసాయం చేసుకోటం, కూతురు బాస్ దగ్గరే అసిస్టెంట్ గా చేరటం జరిగిపోతాయి. నేను ఇంటికెల్లిపోతా అంటాడు హీరో, కుదరదు మనకి ఒక ఆశయం ఉంది అంటారు జనాలు, దాని మొహం మనం కొంపకి పోయే సరికి వాళ్ళు పోతే అంటాడు హీరో, దానికోసం ప్లాన్ B ఉంది అంటారు. ఇంక తప్పదు అని ఉన్న రెండిట్లో దేనికి వెళ్ళాలా అని డిసైడ్ అవుతారు. ఇంతకు ముందు వెళ్ళిన 12 మందికి హెడ్ దగ్గరకి పోదాం అనుకుంటారు. మాన్ ప్లానెట్ కి వెళ్తారు. ఇందాక ప్లానెట్ లా ఇక్కడ టైం ప్రాబ్లం ఎం ఉండదు, దాని వలన పెద్దగా టైం కూడా మారిపోదు. వీళ్ళకి ఇంకో ఫెసిలిటీ ఉంది, హ్యాపీ గా పడుకోవచ్చు ఎప్పుడు కావలి అంటే అప్పుడు లేవోచ్చు.అలా ఎప్పుడో పడుకున్న మాన్ ని లేపుతారు. మాన్ ప్లానెట్ కి వెళ్ళగానే హీరో పాడడు కానీ మనం పాడుకోవాలి "అంతా ఐస్ మయం, ఈ జగమంతా ఐస్ మయం". అప్పుడు తెలుస్తుంది అసలు నిజం, అసలు ఆ ప్లానెట్ లో ఎవడు బ్రతకలేడు అని, మాన్ స్వార్ధం తో రాంగ్ సిగ్నల్స్ పంపించి అక్కడ నుంచి తప్పించుకుందాం అనుకున్నాడు అని, అక్కడ హీరో మీద హత్య ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇంతలో భూమి మీద బాస్ కి ఫైనల్ బెడ్ టైం వచ్చేస్తుంది, అప్పుడు అయన హీరో కూతురి కి నిజం చెప్తాడు, ఆ equation మన వల్ల కాదు, ప్లాన్ A  అనేది సాధ్యం కాదు, వాళ్ళు తిరిగి రారు అని చెప్పేసి బాస్ పోతాడు. అక్కడ ఎలాగోలా బ్రతికేసిన హీరో endurance  కి వెల్లిపోదాం అని అక్కడ నుంచి తప్పించుకుందాం అని చేసిన ప్రయత్నం లో వీళ్ళ బ్యాచ్ లో ఇంకొకరు పోతారు. Endurance  కి ఎంటర్ అవుదాం అని చేసిన ప్రయత్నం లో మాన్ పోతాడు.   పోతు పోతు Endurance  కి కావలసినంత డామేజ్ చేసి పోతాడు. ఇంక ఫ్యూయల్ ప్రాబ్లం, టైం ప్రాబ్లం, ఫ్యూచర్ ప్రాబ్లం ఒక వైపు, పైకి వెళ్ళిన తండ్రి ఇంక పైనే ఉండిపోతాడు అని తెలిసి కూడా నాకు అబద్దం చెప్పాడు అనే కూతురి ఫీలింగ్ ఇంకో వైపు.

ఆక్ట్ 3: మళ్లీ Endurance కి తిరిగి వచ్చిన హీరో అండ్ బ్యాచ్ కి  కూతురి వీడియో ద్వారా ప్లాన్ A గురుంచి నిజం తెలిసి ఇంక మిగిలింది ప్లాన్ B ఒకటే కాబట్టి, మూడో ప్లానెట్ ఎడ్మండ్ ప్లానెట్ కి వెళ్లి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అని డిసైడ్ అవుతారు. ఫ్యూయల్ కూడా తక్కువ ఉండటం వలన Gargantua  (ఇది కూడా బ్లాక్ హోల్ ఏ) దగ్గర నుంచి (లోపలకి వెళ్ళిపోకుండా) పుష్ చేసి ఎడ్మండ్ ప్లానెట్ కి వెళ్దాం అని ప్లాన్ వేసి, రోబోట్ ని బ్లాక్ హోల్ సెంటర్ కి పంపించి అక్కడ నుంచి భూమి మీదకి ఏమైనా మెసేజ్ పాస్ చేయ్యగాలవేమో ట్రై చేయి అని చెప్తాడు. ఉన్న ఫ్యూయల్ తో కిందకి రాలేరు అలా అని ఎడ్మండ్ ప్లానెట్ కి వెళ్ళలేరు.  ఇద్దరు ఉంటె వెయిట్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పి హీరో త్యాగం చేసి హీరోయిన్ ని సేఫ్ గా పంపిద్దాం అని Endurance నుంచి బయటికి వచ్చేస్తాడు. అలా వచ్చేసిన హీరో కింద పడిపోయి చచ్చి పోతాడేమో అనుకుంటే "వాళ్ళు" క్రియేట్ చేసిన Tesseract లో పడిపోతాడు.  ప్రేక్షకులకి నిజం గా చుక్కలి కనిపించేది ఇక్కడ నుంచే. అదొక 5 th  dimension స్పేస్, అక్కడ టైం తో సంబంధం ఉండదు, గతం - భవిష్యత్ లాంటివి ఉండవ్, ఇక్కడ రీఛార్జి చెయ్యబడును టైపు లో  అక్కడ గ్రావిటీ కంట్రోల్ చెయ్యబడుతుంది. ఆ 5 th  dimension  లో ఉన్న వాళ్ళు పాస్ట్ ని, ప్రెసెంట్ ని, ఫ్యూచర్ ని మానిటర్ చెయ్యగలరు కాని అందులోకి ఎంటర్ అవ్వలేరు. టైం ని స్పేస్ ని మానిప్యులేట్ చెయ్యగలరు, అందువలన వాళ్ళు క్రియేట్ చేసిన Tesseract  చిన్నప్పుడు కూతురు తన రూం లో ఘోస్ట్ ఉంది అది నాతో మాట్లాడుతుంది అని చెప్పిన దానిని కనెక్ట్ చేస్తూ ఆ ఘోస్ట్ ఎవరో కాదు హీరో ఏ అని చూపిస్తూ A B  అండ్ C సీన్స్ ని కనెక్ట్ చేసారు. ఈ టైం ట్రావెల్ ఒక pradox  లా మనకి ఎక్ష్ప్లైన్ చెయ్యకుండా ఇదిగో ఇలా ఎవడికి తోచింది వాడు రాసుకోవచ్చు అని వదిలేసారు (శాడిస్టిక్ అనక ఏమనాలి మరి). 

అసలు తను అక్కడే ఉన్నాడు అనే ఫీలింగ్ కూతురి కి కలిగించాక, రోబోట్ అందించిన సిగ్నల్స్ ని వాచ్ ద్వారా కూతురు కి పాస్ చేస్తాడు, equation కి సొల్యూషన్ దొరికిన ఆనందం లో యురేకా అంటుంది (ఆశ పడకండి బట్టలు ఎసుకొనే ఉంటుంది ఆర్కిమెడిస్ గెటప్ లో కాదు). అంత పెద్ద equation సాల్వ్ అయిపోతుంది. గ్రావిటీ ని మానిప్యులేట్ చేసే టెక్నాలజీ సహాయం తో ప్లాన్ A నిజం గా నిజం అవుతుంది.  గ్రావిటీ ని మేనేజ్ చెయ్యగలిగితే స్పేస్ స్టేషన్ క్రియేట్ చేసి జనాలని అక్కడికి పంపేసి, మళ్లీ హీరో లా కొంతమందిని బయటికి వదిలేసి రీసెర్చ్ కంటిన్యూ చెయ్యొచ్చు. కాపర్ స్టేషన్ క్రియేట్ చెయ్యబడుతుంది. మా బాబు ని ఎలాగైనా చూడాలి, నేను పడుకుంటాను మా బాబు వచ్చినప్పుడు నన్ను లేపండి అని చెప్పి కూతురు పడుకుంటుంది, tesseract లో టైం తో ఎలాగు సంబంధం లేదు కాబట్టి హీరో అక్కడ నుంచి బయటికి వచ్చాక కూడా అలాగే ఉంటాడు, కానీ దానికి పట్టిన టైం 68 ఇయర్స్ అని తెలుసుకుంటాడు. ఎట్టకేలకి కూతుర్ని కలుసుకుంటాడు. చనిపోతు, నువ్వు ఇక్కడ ఎం చేస్తావ్, పాపం హీరోయిన్ దగ్గరకి ఎల్లిపో అంటుంది కూతురు. ఎలాగు బ్లాక్ హోల్ కి అటు వైపే ఉంది కాబట్టి తను కూడా యంగ్ గానే ఉంటుంది అని మనకి గుర్తులేక పోయినా హీరో కి గుర్తొస్తుంది. రోబోట్ ని రెడీ చేసి హీరో డ్రైవర్ సీట్ లో కూర్చోగానే సినిమా అయిపొయింది మీరు ఎల్లిపొండి అనేసారు నోలన్ సర్. 

చివరిగా: వాళ్ళు వాళ్ళు అని సినిమా మొత్తం చెప్పింది ఎవరి గురుంచో కాదు. They are US , ఫ్యూచర్ హ్యూమన్. అసలు అక్కడికి వెళ్ళాలంటే worm hole ఉండాలి, అది క్రియేట్ చెయ్యాలి అంటే అక్కడికి వెళ్ళాలి,  మరి ఏది లేకుండా ఫ్యూచర్ హుమోన్ దానిని ఎలా క్రియేట్ చేసినట్టు? ఫ్యూచర్ లో కి వెళ్లి, క్రియేట్ చేసి తీసుకొచ్చి పాస్ట్ లో పెట్టినట్టు? 

చుక్కలు సినిమా లో తక్కువ మన బుర్ర లో ఎక్కువ కనిపిస్తాయి 

నాకు అర్ధం అయ్యిందే రాయటం వలన నాకు సమాధానం దొరకని ప్రశ్నలు నాలోనే ఉన్చేసుకున్నాను, రెండో సారి చూసిన తర్వాత వీలైతే అవి కూడా చేర్చుతాను. 

సీరియస్ సినిమా కదా అని మరీ సీరియస్ గా రాసేయ్యకుండా అక్కడక్కడ శ్రుతి మించి? కామెడీ ఆడ్ చెయ్యటం జరిగింది, బోర్ కొట్టించ కూడదు అనే ఉద్దేశం తో. 6 comments:

sidd said...

Bagundi andi mee style lo ��

Abhinav Varma said...

Interstellar aney cinema edhathey undho, adi Mechanical Engineer ga chusi anandhapadalo lekapothe, sakham sakham Rocket Science avagahan undi kuda cinema chusinandhuku anandha padalo, natho paatu goppalu cheppi theesikellina friends ki ardham kakaponandhuku badha padalo Ardham kaledhu..

Nolan cinema ante idi aney trademark kanipinchindhi..

Kiran said...

Cinemachudakapovadam valla story ardam chesukovadam chala kastam anipinchindhi. Ardham kuda kaledhu.

Kani asusual nee style lo nuvvu kummesav

aditya said...

Almost same Naa opnion nee view tho :)

aa Tesseract lo enter ainakadnunchi okarakamga tippaledu brain ni asalu D:

HYD Vacchava baa :) ???

anthey le memenduku gurtuntam :D :(

Nagaraja Reddy said...

Ee article chavina taravata cinema choosa, so kontha varaku artham ayindi cinema ledante address gallanthu ayyedi :) Mee passion and patience ki naa laal saalam comred! :)

నాగరాజ్ said...

నైస్ రివ్యూ అండీ. నేనూ ఓ సారి నా బుర్ర ఇలా బద్ధలు కొట్టుకున్నా నా బ్లాగులో.. ఓ లుక్కేయండి..

http://nagh002.blogspot.in/2014/12/interstellar.html

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views