First Day First Show - Jr. NTR





ఈ సిరీస్ స్టార్ట్ చేసిన వెంటనే చాలా మంది అడిగిన ఆర్టికల్ ఇది, ఎప్పటికప్పుడు నెక్స్ట్ టైం సినిమా వచ్చినప్పుడు రాస్తాను అని ఇప్పటికి అడుగుతున్న ఫాన్స్ కి సర్ది చెప్పుతున్నా కానీ ఏదో ఒక రీసన్ తో కుదరేది కాదు. ఎట్టకేలకు టెంపర్ వచ్చేస్తుంది కాబట్టి, ఇప్పుడు కూడా రాయకపోతే ఇంక ఎప్పటికి రాయలేనేమో అనిపించి మొదలు పెడుతున్నా.

ఈ సిరీస్ గురుంచి తెలియని వాళ్ళ కోసం - ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది ఎంత మందికి ఇంపార్టెంట్ అనేది పక్కన పెడితే ఫాన్స్ కి మాత్రం పండుగ. మాములుగా ఫాన్స్ కి వాళ్ళ వాళ్ళ హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం పండుగ అయితే, సినీ ప్రియులకి అదే ఫాన్స్ మద్య కూర్చొని ఫస్ట్ డే ఫస్ట్ షో ని ఎంజాయ్ చెయ్యటం ఒక అద్బుతమైన ఫీలింగ్, అంటే నా వరకు అది ఖచ్చితం గా అద్బుతమైన ఫీలింగ్ ఏ. అలాంటి అనుభవాలు షేర్ చేసుకోటానికే ఈ  సిరీస్. ఇంతకు ముందు నాగార్జున మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ మూవీస్ ఎక్స్పీరియన్స్ చూశాం ఇప్పుడు జూనియర్ సినిమాల విశేషాల గురుంచి చూద్దాం.

ఇంతకు  ముందు  ఆర్టికల్స్  


ఈడు హీరో ఏంట్రా బాబు అని మొదలు పెట్టి, రెండో సినిమా నుంచి నటన ఇంటి పేరు గా, డాన్సు ఒంటి పేరు గా కుమ్మేసి ఏడో సినిమా కి - కమర్షియల్ సినిమాలలో నెక్స్ట్ చిరంజీవి అవుతాడేమో అనే స్టేజి కి ఎదిగి, ఇప్పుడు "పదేళ్ళకే అన్ని చూసేస్తే/చేసేస్తే పాతికేళ్ళకి ఎం చేస్తే చూస్తారో" అనే స్టేజి లో ఉన్న హీరో - కొంచెం ఘాటు గానే ఉన్నా కూడా, ఇప్పుడు ఉన్నవి - స్టామినా అనేది సెంటర్స్ నుంచి కలెక్షన్స్ కి మారిపోయిన రోజులు కాబట్టి తప్పటం లేదు.

స్టూడెంట్ నెo 1, బాలాజీ ధియేటర్, విజయనగరం : బాల రామాయణం పక్కన పెడితే, అసలు చూసే లాగా లేడు ఈడు హీరో ఏంట్రా బాబు  అని "నిన్ను చూడాలని" సినిమా చూడలేదు. ఆ తర్వాత సినిమాలు చూసాక ఫస్ట్ సినిమా ఎలా మిస్ అయ్యాను అబ్బ అని ఫీల్ అయ్యి ఫీలింగ్ తో ఒకటో నెంబర్ కుర్రాడు, గౌరవం లాంటి సినిమాలు కూడా చూడాల్సి వచ్చింది లెండి. మరి ఈ సినిమా ఎందుకు చూసాను అంటే, అప్పటికే సాంగ్స్ విపరీతం గా నచ్చేయ్యటం వలన, సినిమా కి వెళ్ళే టైం కి సాంగ్స్ లిరిక్స్ అండ్ మద్య లో వచ్చే మ్యూజిక్ తో సహా బట్టి పట్టేసే రేంజ్ లో అరగ్గోట్టాను. పెద్దగా హడావుడి ఎం లేదు, రెండు మూడు బ్యానేర్ లు, పెయింటింగ్ తప్ప, కొంచెం ముందుగా వెళ్ళటం వలన టికెట్స్ కూడా దొరికేసాయి ఈజీ గా. కూచిపూడి కైనా సాంగ్ దగ్గర విజిల్స్, మళ్లీ ఇంటర్వెల్ ముందు. ఇంటర్వెల్ బాంగ్ కి జనాల్లో ఊపు వచ్చింది, వామ్మో అనుకునే సినిమా రూట్ మారింది, నేను ఏమో లీనం అయిపోయి, ఆ కామెడీ కి కనెక్ట్ అయిపోయి "సెంట్రల్ జైలు" డైలాగ్ కి చప్పట్లు కొట్టేసి సెకండ్ హాఫ్ కి ప్రిపేర్ అయిపోయా. ఇంటర్వెల్ ఇచ్చిన ఊపు, సెకండ్ హాఫ్ నిలబెట్టింది, జైలు సీన్స్ కి పీక్స్ కి వెళ్ళింది, ఏమెట్టి టీ టీ టీ టీ కి ధియేటర్ ని గంతులు వేయించింది. ఫస్ట్ సినిమా అవ్వటం వలన మనిషి ఎలా ఉన్నా సినిమా సూపర్ గా నచ్చేసింది, అదే ధియేటర్ లో 5 టైమ్స్ చూసా, 100 రోజుల సెకండ్ షో సంబరాల్లో నేను భాగం అయిపోయా.

ఆది, రంజిని ధియేటర్, విజయనగరం ; మద్య లో సుబ్బు మార్నింగ్ షో మిస్ అయ్యాను, సాంగ్స్ విపరీతం గా నచ్చిన ఆ సినిమా ఈవెనింగ్ షో కి సరదా తీరిపోయింది లెండి. టక్కరి దొంగ ఖాలీ చేసిన ధియేటర్ అవ్వటం, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు ఇరగ ఆడేసిన ధియేటర్ అవ్వటం, ఇది ఫ్యాక్షన్ సినిమా అవ్వటం హడావుడి అలా ఇలా లేదు. బ్లాకు లో టికెట్స్ కొనుక్కున నాకు, టికెట్ డబ్బులకి డబల్ తృప్తి ఇచ్చిన ఎక్స్పీరియన్స్. చిన్నప్పటి సీన్స్ నుంచి, సాంగ్స్ లో డాన్సు లు, ఫైట్ లు, డైలాగ్ లు కి రెస్పాన్స్ సూపర్ అంటే సూపర్ అసలు. మెయిన్ గా సాంగ్స్ అల్లడిన్చేసాయి.  ఒక్క సారి తొడ కొట్టు చిన్నా, ట్రాక్టర్ లేచే సీన్ కి అయితే ధియేటర్ లో పూనకాలే. అన్ని పర్ఫెక్ట్ గా కుదిరిన బొమ్మ ని ఫస్ట్ డే మార్నింగ్ షో చూసే కంటే అదృష్టం ఇంకోటి ఉండదు ఏమో.  ఒక పెద్ద రేంజ్ కమర్షియల్ బొమ్మ ఇంకొంచెం పెద్ద హీరో కి పడితే ఇంక బావున్ను అనిపించింది అప్పట్లో, కానీ సినిమా రఫ్ ఆడించేసింది. 50 వ రోజు మరియు 100 వ రోజు సెకండ్ షో మిస్ అవ్వలేదు

అల్లరి రాముడు, మినర్వా ధియేటర్, విజయనగరం-  ఆది లాంటి సినిమా తర్వాత, బి గోపాల్ దర్సకత్వం లో సినిమా, తాత గారి సాంగ్ రీమిక్స్, అబ్బో అబ్బో అబ్బో, హడావుడి మాములుగా లేదు ఆ రోజు. ఇంకో వారం రోజుల్లో ఇంద్ర సినిమా ఉండటం కూడా ఒక కారణం అవ్వగా, ధియేటర్ ని బ్యానేర్స్ తో మున్చేసారు. మళ్లీ బ్లాకు ఏ గతి అయింది అండ్ ఆది కంటే ఎక్కువే అప్పు అయ్యింది. ఏదో ఒక పది నిమిషాల హడావుడి ఆ తర్వాత పాటల వరకు పరిమితం అయ్యింది. 2002 సాంగ్ కి అయితే కుమ్మి అవతలేసారు, అప్పటి వరకు నీరసం గా ఉన్నా ఫాన్స్ ని పీక్స్ కి తీసుకెళ్ళింది, అక్కడ నుంచి పడుకోబెట్టేసింది, మళ్లీ ఇందాక చెప్పినట్టు సాంగ్స్ వరకు నడిపించి, బయటికి వచ్చాక మాత్రం తొడలు కొట్టేల చేసింది. ఆ రోజు తర్వాత పోస్టర్ మరే వరకు మళ్లీ ఆ ధియేటర్ దగ్గరకి వెళ్ళలేదు.

సింహాద్రి, న్యూ పూర్ణ ధియేటర్, విజయనగరం  - ఒక్కడు హడావుడి లో , ప్రయాణం లో నాగ సినిమా మిస్ అయ్యాను. అంటే అప్పటికి మన్మధుడు రిపీట్ మోడ్ లో ఉండేవాడిని లెండి. బాగా లేట్ అవ్వటమే కాకుండా డైరెక్టర్ కూడా మారిన ప్రాజెక్ట్, సాంగ్స్ తో క్రేజ్ అయితే వచ్చేసింది. జానీ, నిజం, పలనాటి బ్రహ్మ నాయుడు ఇలా నెల కి ఒక సినిమా లేస్తుంటే ఇది కూడా లేచే బొమ్మ అనుకుంటూనే వెళ్ళిపోయా. బ్లాకు కూడా పెద్దగా ఎం లేదు, మార్నింగ్ షో లో ఎంట్రన్స్ తర్వాత చప్పగా ఉన్న ధియేటర్ చీమ చీమ సాంగ్ కి దద్దరిల్లింది. అక్కడ నుంచి ఊపు మీద కంటిన్యూ అయ్యింది, ఇంటర్వెల్ బాంగ్ కి మతి దొబ్బేసింది, పుష్కరాలు ఫైట్, గునపం దిగగానే ఇది రచ్చ తారా స్థాయి కి చేరుకుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో రెండు మాస్ సాంగ్స్ ఉన్నాయి, ఫ్లాష్ బ్యాక్ ఉంది ఈ సినిమా కి తిరుగు లేదు అని ఇంటర్వెల్ లో నే ఫోన్ చేసి చెప్పేసా ఫ్రెండ్స్ కి. సెకండ్ హాఫ్ కూడా పర్ఫెక్ట్ గా పండింది,సోడా బుడ్డి సాంగ్ కి చేసిన రచ్చ అప్పటి వరకు నేను చూసిన సినిమాల్లో అదే హైయెస్ట్. క్లైమాక్స్ ఎలా ఉన్నా కూడా పట్టించుకొనే స్టేజి లో లేని ఫాన్స్ ఆల్రెడీ ధియేటర్ బయట సంబరాలు స్టార్ట్ చేసేసారు. అప్పట్లో ఇదే సినిమా బాలయ్య చేసి ఉంటె ఇంకా కుమ్మేసేది అని ఫీల్ అయ్యే వాడిని అది వేరే విషయం అనుకోండి. ఎన్ టి అర్ సినిమాల్లో ఇదొక మరపురాని ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఆ తర్వాత 50, 100, 150 అండ్ 175 డేస్ సెకండ్ షౌస్ మిస్ అవ్వలేదు. మద్య లో ఒకటి రెండు సార్లు వెళ్ళినా డబ్బులు తిరిగి ఇచ్చేసి పంపించేసారు అనుకోండి :) 

ఆంధ్రావాలా, న్యూ పూర్ణ ధియేటర్, విజయనగరం: సింహాద్రి 175 డేస్ 31 డిసెంబర్ అవ్వటం, ఈ సినిమా 1 జనవరి రిలీజ్ అవ్వటం, ఒకటే ధియేటర్ అవ్వటం వలన ఆ న్యూ ఇయర్ ధియేటర్ లో నే అయిపొయింది. సింహాద్రి తర్వాత ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి జరిగిన రచ్చ, ఆడియో రెస్పాన్స్, థియేటర్స్ లో ప్లే చేసిన ట్రైలర్, అన్ని కలిపి మార్నింగ్ షో కి ఆ రోజుల్లోనే 120 లాగేసాయి. అసలు స్క్రీన్ కనిపిస్తే గా, ఫస్ట్ ఫైట్ అండ్ ఫైట్ సాంగ్ అయ్యే వరకు మూలన నిల్చొని చూడాల్సి వచ్చింది. అక్కడ నుంచి నెమ్మదిగా వచ్చి సీట్ లో కుర్చున్నంత సేపు పట్టలేదు నీరసం వచ్చేయ్యటానికి. పావలా శ్యామల అరుపులకి ధియేటర్ లో బూతులు మొదలు అయ్యాయి, స్టొరీ లేక, రక్షిత టార్చర్ భరించలేక ఫాన్స్ అలా బయటికి వెళ్లి వస్తు ఉండేవారు. ఇంటర్వెల్ కె సగం నీరసం వచ్చేసింది. ఫ్లాష్ బ్యాక్ కూడా తేలిపోవటం తో, సెకండ్ హాఫ్ మొత్తం ధియేటర్ లో బండ బూతుల పురాణం, మళ్లీ లాస్ట్ సాంగ్ గిచ్చి గిచ్చి కి గోల చేసేసి బాలన్స్ చూడకుండా వెళ్ళిపోయారు కొంత మంది. ఆ దెబ్బ నుంచి కోలుకోటానికి నైట్ ఠాగుర్ 100 డేస్ మినర్వా లో జరుపుకోవాల్సి వచ్చింది.

సాంబ, జగన్నాథ ధియేటర్, అనకాపల్లి : వినాయక్ సినిమా అవ్వటం, మాస్ సాంగ్స్ విపరీతం గా ఎక్కేయ్యటం, మా బావ ని బాగా ఇబ్బంది పెట్టి లాక్కేల్లిపోయా. అనకాపల్లి లో ఫస్ట్ టైం ఎన్ టి అర్ సినిమా అవ్వటం వలన ఎంతో ఎక్ష్పెక్త్ చేశా, ధియేటర్ లో గాలి లేక, సినిమా లో విషయం లేక, జనాల గోల ఒక పక్క, మా బావ దొబ్బుడు ఒక పక్క, చుక్కలు చూపించింది సినిమా. డైలాగ్ లు వినపడలేదు, సగం స్క్రీన్ కనపడలేదు. జనాల రచ్చ కి అనుకునేరు, సౌండ్ సిస్టం బాగోక అండ్ ముందు సీట్ లో ఎవడో పొడుగ్గా ఉండటం వలన. సాంగ్స్ వరకు నేను హమ్మయ్య అనుకున్న కూడా సినిమా మాత్రం అంచనాల మద్య సరదా తీర్చేసింది. అక్కడ నుంచి మా ఊరు వెళ్ళే వరకు మా బావ తిడతానే ఉన్నారు, అదెమ్ సినిమా రా బాబు అని. ఆ రోజు సినిమా కంటే మా బావ బూతులే బాగా గుర్తున్నాయి, అవి ఇక్కడ రాసే రేంజ్ లో అయితే లేవు మరి

నా అల్లుడు , శ్రీ సత్య ధియేటర్, అనకాపల్లి: పండగ సినిమా అవ్వటం, సాంగ్స్ అరాచకం గా ఉండటం, ఆంధ్రావాలా ద్వారా పోగొట్టుకున్న వాళ్ళ కోసం కసి గా తీసిన సినిమా అని స్టేట్మెంట్స్ ఇవ్వటం, మార్నింగ్ షో కి తీసుకేల్లిపోయాయి. సాంబ అనుభవం తో బావ కి చెప్పకుండా ఒక్కడినే వెళ్ళిపోయా. ధియేటర్ లో రెస్పాన్స్ అదిరింది. మాస్ కామెడీ కి చప్పట్లు, సాంగ్స్ కి ఈలలు గోల, నాకు ఏమో ఏమి అర్ధం కావటం లేదు, మరీ పథ సినిమా చూస్తున్నట్టు ఉంది అని నేను ఫీల్ అవుతుంటే, లోలాకుల జోక్ నుంచి ఒంగొని దూకే జోక్ వరకు పడి పడి నవ్వుతున్నారు జనాలు ధియేటర్ లో. మురుగన్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక ఇంకా ఎక్కువైంది హుంగామ, నేను సినిమా చూడటం మానేసి జనాల రియాక్షన్ ని ఎంజాయ్ చెయ్యటం మొదలు పెట్టాను. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఫాన్స్ సినిమా ని ఎంజాయ్ చెయ్యటం బహుశా ఈ సినిమా కె చూసాను ఏమో. పండగ రోజుల తర్వాత బైక్ మీద బావ తో వెళ్తుంటే ధియేటర్ ఖాళీ, అదేంటి ఎవడు లేడు అని నేను అంటే "ధియేటర్ ముందు కత్తి పట్టుకొని పరిగేట్టేల కట్ అవుట్ పెడితే జనాలు భయపడి పారిపోతారు కానీ ధియేటర్ కి ఎందుకు పోతారు" అని బావ సమాధానం. ఈయన మారడు అని నేను అనుకుంటుంటే ఈడు ఈ కత్తులు కొడవళ్ళు వదలడా అని అయన అడిగారు.  

రాఖి, మల్లికార్జున ధియేటర్, హైదరాబాద్: నరసింహుడు నేను ఫస్ట్ చెన్నై లో చూసిన ఎన్ టి అర్ సినిమా, పైలట్ ధియేటర్ లో ఈవెనింగ్ షో, అశోక్ కూడా ఈవెనింగ్ షో ఏ. ఇంక రాఖి విషయానికి వస్తే, 7 గంటలకి స్పెషల్ షో, పెద్ద బ్యాచ్ ఏ వాళ్ళం, మా నాని గాడితో ఫస్ట్ చూసిన స్పెషల్ షో ఇదే అనుకుంటా. ఫస్ట్ సాంగ్ వరకు కొంచెం హడావుడి, ఆ తర్వాత అక్కడక్కడ బ్రాహ్మి కామెడీ కి హడావుడి, మళ్లీ రాఖి రాఖి టైటిల్ సాంగ్ కి మంచి హడావుడి. ధియేటర్ అండ్ సౌండ్ సిస్టం అయితే అద్దిరింది, సినిమా కి కూడా ఆ షో కి మంచి టాక్ ఏ వచ్చింది. ఛార్మి ఓవర్ యాక్షన్ బావగారండి కి నాని రియాక్షన్ అయితే గుర్తుంది "ఒరేయ్ ఒరేయ్ ఆపరా అని". అంతకు మించి గుర్తులేదు 

యమదొంగ, జయప్రద ధియేటర్, చెన్నై - సెలవు రోజు అవ్వటం, ధియేటర్ జనాలతో కళకళ లాదిపోయింది. మాకు షో మద్యాహ్నం 1 కి పడింది, అప్పటికే హైలైట్స్ కూడా తెలిసిపోయాయి, 200 కి టికెట్. చెన్నై లో ఎన్ టి అర్ సినిమాలలో ఈ సినిమా కి రచ్చ పీక్స్ లో చేసారు. రాజమౌళి సినిమా అవ్వటం ఇంక హడావుడి అలా ఇలా లేదు, హైయెస్ట్ నెంబర్ అఫ్ బ్యానేర్స్ కట్టారు. పాలాభిషేకాలు, 10000 వాల లు, 10.30 నుంచి షో పడే వరకు హుంగమ చేస్తూనే ఉన్నారు, జై ఎన్టీఆర్ అని అరవటం, ఒక కూల్ డ్రింక్ తాగి రావటం. మొత్తం మీద సినిమా స్టార్ట్ అయ్యింది, ఎన్టీఆర్ ఎంట్రన్స్ కి వచ్చిన రెస్పాన్స్ అయితే అరాచకం, అక్కడ నుంచి సినిమా అంత గోల చేస్తూనే ఉన్నారు, సాంగ్స్ కి అయితే ధియేటర్ స్క్రీన్ దగ్గర రచ్చ రచ్చ చేసారు. ఇంటర్వెల్ డైలాగ్ కి పూనకలే, ఇంకా ఇంటర్వెల్ గ్యాప్ లో హడావుడి చూడాలి, జై ఎన్టీఆర్, జై బాలయ్య, జై పరిటాల రవి అన్న అరుపులతో మారుమోగి పోయింది. అదే ధియేటర్ లో పోకిరి తర్వాత ఈ రేంజ్ హుంగామ చూసింది ఈ సినిమా కె, సెకండ్ హాఫ్ కొంచెం కూడా తగ్గకుండా చేసిన క్లైమాక్స్ సాంగ్ అయిన తర్వాత ఇంక సైలెంట్ అయ్యారు. 

అప్పట్లో బ్యానేర్స్ హంగామా: HERE

అదుర్స్, సెన్సేషన్ ధియేటర్, హైదరాబాద్: కంత్రి సినిమా మల్టీప్లెక్స్ లో చూడటం వలన అసలు రాసుకునే అవసరం లేకుండా పోయింది. అదుర్స్ సినిమా మళ్లీ నాని తో హైడ్ లో చూడటం జరిగింది. హంగామా అని చెప్పను కానీ ధియేటర్ లో రెస్పాన్స్ మాత్రం కామెడీ సీన్స్ కి అరాచకం, మనం వాడుకోటానికి చాలా ఉంది ఈ కామెడీ అని డిసైడ్ అయిపోయాం ఆ రోజే.  ఈ కామెడీ కోసమే ఈజీ గా ఇంకో సరి చూసేయ్యోచు అనిపించింది. 

శక్తి, సత్యం ధియేటర్, చెన్నై: బృందావనం మార్నింగ్ షో మిస్ అయ్యాను, శక్తి అయితే ముందు రోజు ప్రెమిఎర్స్ అనౌన్స్ చేసారు, టికెట్స్ ముందుగానే బుక్ చేసేసుకున్నాం, సరిగ్గా సాయంత్రం అన్ని చోట్ల షౌస్ కాన్సిల్ అయ్యాయి, షో పడే వరకు టెన్షన్ ఏ, ఒక గంట ముందు సత్యం వాడు మాత్రం షో ఉంది అని ఫిక్స్ చేసాడు. శక్తి ఆల్బం నాకు ఇప్పటికి ఎంతో ఇష్టమైన ఆల్బం, ఆ సాంగ్స్ మీద పిచ్చి తోనే సినిమా ఎలా లేదన్న ఇరగ ఉంటుంది అని ఫిక్స్ అయిపోయా నేను కూడా. ఈ సినిమా ధియేటర్ లో కంటే మన బ్లాగ్ లో సంచలనాలు సృష్టించింది. ధియేటర్ లో ఫస్ట్ సాంగ్ వరకు బాగానే ఓపిక పట్టారు, అక్కడ నుంచి ఆ కామెడీ నస కి కామెడీ కామెంట్స్ తప్ప ఎం మిగలలేదు, ఇంటర్వెల్ బాంగ్ కి మాత్రం హడావుడి హైలైట్. గన్ తీసి షూటింగ్ మొదలు పెట్టగానే ధియేటర్ ఏ దద్దరిల్లింది. ఆ తర్వాత ఎం జరిగిందో మీకు తెలుసు నాకు తెలుసు, మనం ఇక్కడే ఆపెసుకుందాం. లైవ్ థ్రెడ్ కి బ్లాగ్ లో హైయెస్ట్ వ్యూస్ రికార్డు ఇప్పటికి అన్ బీటబుల్. 

రామయ్య వస్తావయ్య & రభస: ఊసరవెల్లి అండ్ దమ్ము మార్నింగ్ షో చూడటం కుదరలేదు, బాద్ షా కి ఎంతో ప్లాన్ చేసుకొని బెంగుళూరు లో కుమ్మేద్దాం అనుకున్నా అనుకోకుండా ట్రిప్ కాన్సిల్ అయ్యింది. రామయ్య సుందర్ సినిమాస్ లోను, రభస గోపాలకృష్ణ ధియేటర్ లో ను స్పెషల్ షౌస్ చూడటం జరిగింది, ఆ సినిమాల గురుంచి అప్పట్లోనే ట్విట్టర్ లో లైవ్ ట్వీట్స్ లో చెప్పటం వలన ఇక్కడ చెప్పుకోటానికి ఎం మిగల్లేదు.

ఇవన్నమాట  ఎన్టీఆర్ సినిమా ల ఫస్ట్ డే ఫస్ట్ షో విశేషాలు. లాజిక్ కి అందని సెంటిమెంట్ ఏంటంటే, ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే సినిమా రిజల్ట్ ఏంటి అనేది దొరకలేదు, చూసినవి అన్ని పోలేదు, చూడలేనివి కొట్టేయ్యలేదు, గ్యాప్ ఇచ్చి చూసిన, వరసగా చూసిన రిజల్ట్ కామన్ గా లేదు. లాస్ట్ రెండు సినిమాల సెంటిమెంట్ ప్రకారం టెంపర్ స్పెషల్ మార్నింగ్ షో చూడాలి అంటే భయం వేస్తుంది. అలా అని ఇంత మంచి బుజ్ ఉన్న సినిమా, ఒక వేల గబ్బర్ సింగ్ లా బ్రేక్ ఇచ్చే సినిమా అయి ఉండి, ఆ షో మిస్ అయితే? ఒకానొక స్టేజి లో కమర్షియల్ గా పెద్ద రేంజ్ కి వెళ్ళిపోతాడు అనుకున్న హీరో, రిపీట్ మోడ్ లో పడిపోయి, ఇప్పుడు ఎం చేసినా ఎలా చేసినా ఆ 50 కోట్లు కొల్లగోట్టలేక అదొక్కటే లోటు గా మిగిలిపోయాడు, సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా, ప్రతి సినిమా కి క్రేజ్ విషయం లో ఏ మాత్రం తగ్గని ఎన్టీఆర్ ఈ సారి పెద్ద హిట్ కొట్టి చాలా మందికి సమాధానం చెప్పాలని ఆశిస్తున్నా. 

ఎవర్ని హర్ట్  చేద్దామనో, కాకా పడదాం అనో , ఏదో  ఎటకారం  చేద్దాం  అనో  కాకుండా , ఆ టైం లో ఎలా ఫీల్ అయ్యానో ఎం జరిగిందో అది  రాసేసాను . దీని వలన ఎవరి మనోభావాలు అయిన హర్ట్ అయితే క్షమించగలరు.  

మీ 
హరి కృష్ణ రాజు  







3 comments:

Anonymous said...

Super sir

aditya said...

Mari inta open ayipoyav enti :D as usual kummesav

Anonymous said...

Independent unbiased voice... rare breed

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views