బాహుబలి - కథ, కథనం, పాత్రలు - ఒక విశ్లేషణబాహుబలి - కథ, కథనం, పాత్రలు - ఒక విశ్లేషణ

సృజనాత్మకత ఉన్న దర్శకుడి కల కి, భలమైన పాత్రలు దొరికితే, ఆ పాత్రలు కి తగ్గ తారాగణం కూడా మీ వెనుక మేము ఉన్నాం అని ముందుకి వచ్చి ఇంత సమయం ఈ ప్రాజెక్ట్ కోసమే కేటాయిస్తే, భారీతనం అందించే నిర్మాత తోడు అయితే, అద్బుతమైన సాంకేతిక వర్గం తనతో పాటు శ్రమిస్తే, ఆ కల ని వెండితెర పై ఆవిష్కరించిన రాజమౌళి చిత్రం "బాహుబలి" అయ్యింది. రెండు పార్ట్శ్ లో మొదటిది గా, అంచనాలు ఆకాశాన్ని మించిపోగా, భారి ఓపెనింగ్స్ తో, మన ముందుకి వచ్చిన "బాహుబలి ది బిగెనింగ్" అంచనాలు కి అందని కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీసు ని చెడుగుడు ఆడుకుంటుంది. కమర్షియల్ గా తెలుగు సినిమా స్థాయి ని పది మెట్లు పైకి ఎక్కించ బోతుంది. మొదటి రోజు, మొదటి వారాంతం కలెక్షన్స్ తో చాల సినిమాల ఫుల్ రన్ రికార్డ్స్ తుడిచిపెట్టుకుపోగా, అతి త్వరలో ఇతర బాషా పెద్ద చిత్రాల రికార్డ్స్ వేట మొదలవ్వబోతుంది. ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ స్థాయి కి ఈ సినిమా కలెక్షన్స్ ఉండబోతున్నాయి. ఇంతటి ఘనత కి కారణం "రాజమౌళి" అంటే అది అతిశయోక్తి కాదు. కలెక్షన్స్ పరం గా అద్బుతాలు సృష్టిస్తున్న ఈ సినిమా కంటెంట్ పరంగా ఎంత అద్బుతం అనిపించుకుంది? ఎంతో ఆశించిన ప్రేక్షకులకి ఎంత వరకు సంతృప్తి  కలిగించింది? నా వరకు అయితే ఈ సినిమా ఒక "గొప్ప చిత్రానికి", "మంచి ప్రయత్నం" కి మద్య ఉన్న అతి చిన్న మెట్టుకి ముందు ఆగిపోయింది - ఇలా అనిపించటానికి ఉన్న కారణాలు విశ్లేషించే ప్రయత్నమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఇంతమంది ఇన్ని రోజుల కష్టం ని నాలుగు మాటల్లోనో, మూడు ముక్కల్లోనో తేల్చేసే ఉద్దేశం కాదు కానీ, ప్రతి పెద్ద సినిమాకి రాసుకొనే ప్రాక్టీసు లో భాగమే ఈ ఆర్టికల్.

ఎప్పుడు చెప్పేదే అయినా, "సినిమా చూడని వాళ్ళు, చూడాలి అనుకునే వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిది" అని నా అభిప్రాయం. ఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు

కథ : రెండు పార్ట్శ్ గా ప్లాన్ చెయ్యటం వలన అనుకుంటా, ఈ పార్ట్ వరకు ఇది కథ అని ఖచ్చితం గా చెప్పేలా కథ అంటూ లేదు, సింపుల్ గా అయితే "శివుడు అనబడే మహేంద్ర బాహుబలి తన గురుంచి, తన తండ్రి అమరేంద్ర బాహుబలి గురుంచి తెలుసుకోటమే - ది బిగెనింగ్". అలా అని పూర్తిగా తెలసుకుంటాడు అనుకోటానికి లేదు, సగం తెలుసుకుంటాడు, మిగతా సగం రెండో పార్ట్ లో తనతో పాటు మనం తెలుసుకోవాలి, తండ్రి మరణానికి, తల్లి దుస్థితి కి కారణం తెలుసుకొని ఆ తర్వాత ఎం చెయ్యబోతున్నాడు అనేది రెండో పార్ట్ లోనే చూడాలి, వీటన్నిటి కోసం ఇంకో ఇయర్ వెయిట్ చెయ్యాలి.

కథనం: ఇదే సినిమా హాలీవుడ్ లో వస్తే మనం లాజిక్స్ వెతకం, నమ్మశక్యం కాక పోయిన ప్రశ్నించం, ఎందుకంటే అది హాలీవుడ్ సినిమా కాబట్టి అని సర్దిచేప్పుకుంటాం. అదే హాలీవుడ్ స్టాండర్డ్స్ కి సరితూగేలా వచ్చిన బాహుబలి లో కొన్నింటిని నేను ప్రశ్నించదలచుకోలేదు, ఫాంటసీ కథ ని దృష్టిలో పెట్టుకొని, నీటి కొండ ఎక్కటం లో ఫీట్ లు, మంచు కొండల్లో రాయిని తొసెయ్యటాలు, రాయిని పగలకొట్టి జారుడు బండిని చెసుకొటాలు, శివలింగాన్ని అవలీలగా మొసెయ్యటాలు, 100 అడుగుల విగ్రహాన్ని ఒంటి చేత్తో పడిపోకుండా పట్టుకోటాలు నేను ప్రశ్నించను. మీ ఇంగ్లీష్ సినిమా లాగానే, మా తెలుగు సినిమా లో హీరోయిజం పండించిన అంశాలు అని సర్దిచేప్పుకుంటాను. బాహుబలి అంటేనే బలమైన బాహువులు కలిగిన కథానాయకుడు ఆ మాత్రం చెయ్యక పోతే ఎలా అని ఎదురు ప్రశ్న వేస్తాను. కాబట్టి వీటి గురుంచి పక్కన పెట్టి కథనం గురుంచి మాట్లాడుకుందాం.

మొదటి అంకము: మాహిష్మతి సామ్రాజ్యం - కుంతల సామ్రాజ్యం - కుంతల సామ్రాజ్యపు గూఢ స్తావరం - కిందన వాటర్ ఫాల్స్.. రాజ మాత శివగామి చేతిలో పసి బిడ్డ తో, గాయం తో, భటులు వెంట తరుముతుంటే, వాళ్ళని చంపి, నేను చేసిన పాపాలకి నన్ను భలి తీసుకో, కానీ ఈ మహేంద్ర బాహుబలి బ్రతకాలి అని బిడ్డని రక్షించి కన్ను మూస్తుంది. అక్కడ గూడెం లో శివుడి గా పెరుగుతున్న బాహుబలి కి నీటి కొండ ఎక్కాలని, ఆ పైన ఏముందో చూడాలని కోరిక. ఎన్ని సార్లు ప్రయత్నించినా విఫలం అవుతూ ఉంటాడు. పైన చెప్పుకున్న ఎపిసోడ్ ఇంట్రడక్షన్ షాట్, సాంగ్ సినిమా కి ఇంత కంటే మంచి బెగినింగ్ ఇంకేం కావలి అనే రేంజ్ లో ఉంటాయి. సీట్ లో కూర్చున్న ప్రేక్షకుడు అద్బుతమైన అనుబూతి కి గురి అయ్యేలా చేస్తాయి. తను ఊహించుకున్న అమ్మాయి (అవాంతిక) కోసం కొండ ఎక్కేస్తాడు. ఒక సాంగ్ తో మంచి గ్రాఫిక్స్ తో చూపించినా కూడా ఈ ప్రాసెస్ లో అద్బుతం లోపించి సాధారణం గా తేలిపోతుంది. కొండ ఎక్కినా శివుడు కి తన ఊహల్లో ఉన్న అవాంతిక వేరు అని, అక్కడ ఉన్న తిరుగుబాటు దళం ఆశయం ఏదో ఉంది అని చూసి కూడా తన ప్రేమ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. అప్పటి వరకు కొండ ఎక్కటం ఆశయం అయితే అప్పటి నుంచి ప్రేమని పొందటం ఆశయం అవుతుంది.

రెండవ అంకము: తిరుగుబాటు దళం ఆశయం,  దేవసేన ని విడిపించటం అని చూపిస్తూ భళ్ళాలదేవ ని, కట్టప్ప ని పరిచయం చేస్తూ రాసుకున్న సీన్లు బాగా వచ్చాయి. దేవసేన కి భళ్ళాలదేవ కి మద్య డైలాగ్, కట్టప్ప కి దేవసేన కి మద్య సీన్ అద్బుతం గా మలిచారు. కానీ అక్కడ నుంచి కథనం లవ్ థ్రెడ్ మీదకి వెళ్తుంది. చాల పేలవమైన లవ్ ట్రాక్ ఇంట్రెస్ట్ కలిగించక పోగా, సహన పరీక్ష పెడుతుంది. పచ్చ బొట్టు సాంగ్ కూడా తోడు అవటం తో అసహనం కలిగిస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల వలన, దేవసేన ఎవరో నాకు తెలియదు, కానీ నీ కోసం తనని విడిపిస్తాను అని శివుడు మాట ఇస్తాడు. ప్రేమని గెలుచుకున్న శివుడు కి ఇచ్చిన మాట కొత్త ఆశయం అవుతుంది. (మాములుగా అయితే ఇక్కడ మొదటి అంకము పూర్తి అయ్యి రెండో అంఖం లోకి అడుగుపెట్టాలి). అప్పుడే మాహిష్మతి సామ్రాజ్యం కి వచ్చిన శివుడు ని అక్కడ ప్రజలు బాహుబలి అని పిలుస్తారు. ఇంటర్వెల్. మాములుగా రాజమౌళి సినిమాల్లో ఇంటర్వెల్ బాంగ్ ప్రత్యేకత గురుంచి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఈ సినిమా వరకు, ఇది ఒక బాంగ్ గా రిజిస్టర్ అవ్వదు. అప్పటి వరకు కథలో ముందుకి వెళ్లకపోవటం, హీరో అనే వాడికి - ఇది తను చెయ్యల్సింది - అని తెలియక పోవటం కారణాలు. అప్పటికి అది తను ప్రేమించిన అమ్మాయి ఆశయమే కాని, తన ఆశయం కాదు. అసలు ఆ ఆశయం వెనక ఉద్దేశం కూడా తనకి తెలియదు, ఒక మొండి ధైర్యం తో ముందుకి వెళ్తాడు అంతే. ఈ ఫస్ట్ హాఫ్ మొత్తం శివుడి పాత్ర పాసివ్ గా మిగిలిపొటానికి ఇదే కారణం. అంతే కాక అప్పటి వరకు ఏ ఒక్క క్యారెక్టర్ పూర్తిగా రిజిస్టర్ అవ్వదు. ఏదో ఉండబోతుంది అనే ఫీలింగ్ తో అప్పటి వరకు చూసిన ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది తప్ప అద్బుతం అనే ఫీలింగ్ ని కలిగించదు. కళ్ళ ముందు ఆకృత్యాలు కనిపిస్తున్నా కారణాలు తెలియక మనం కూడా పాసివ్ గా మిగిలిపోతాం.

కోట లోకి వెళ్ళిన శివుడు దేవసేన స్థితి ని చూసి చలించిపోతాడు, తనని కన్న తల్లి అని తెలియక పోయినా విడిపిస్తాడు. వెనక పడిన భద్రుడు ని చంపేస్తాడు, యువరాజు ని కాపాడలేక పోయిన కట్టప్ప శివుడు ని చంపుడం అనుకుంటూ ఉండగా తను శివుడు కాదు అని, బాహుబలి కొడుకు అని తెలుసుకుంటాడు, పాదం తలపై పెట్టుకుంటాడు. ఇదే కనుక ఇంటర్వెల్ బాంగ్ గా పడి ఉంటె ధియేటర్ లో రెస్పాన్స్ ఎలా ఉండేదో ఊహకి కూడా అందటం లేదు. సినిమా మొత్తం మీద రాజమౌళి మార్క్ ఎపిసోడ్ ఇది. మొదట్లో వచ్చిన ఎపిసోడ్స్ లేపేసి దీనిని ముందు కి జరిపి ఇంటర్వెల్ కార్డు వేసి ఉంటె దాని గురుంచి రాసుకొటనికి కొత్త పదాలు వెతుక్కోవాల్సి వచ్చి ఉండేది, ధియేటర్ లో రెస్పాన్స్ గురుంచి రాసుకొటనికి ఇంకో పేరాగ్రాఫ్ వాడాల్సి వచ్చి ఉండేది. ఇన్ని రోజులుగా అలవాటు అయిన రాజమౌళి సినిమా లో ఇంటర్వెల్ బాంగ్ అంటే ఇంతకంటే తక్కువ స్థాయి ని ఊహించుకోలేరు ప్రేక్షకులు. 

ఫ్లాష్ బ్యాక్ గా స్టార్ట్ అయ్యి, శివగామి పరిచయం, తిరగబడిన సామంతులని రాజ తంత్రం తో తిప్పి కొట్టడం, ఇద్దరు బిడ్డల్ని సమానం గా పెంచటం, వాళ్ళు కూడా సమ ఉజ్జీలు గా నిలవటం వరకు బాగా చూపించగలిగారు. అసలు కథ కి వెళ్ళాల్సిన టైం లో ఐటెం సాంగ్ ని పెట్టి అప్పటి వరకు ఉన్న మూడ్ అండ్ ఫీల్ ని కంప్లీట్ గా ఆఫ్ చేసేసారు. అక్కడ నుంచి యుద్ధం కి డైరెక్ట్ గా వెళ్ళిపోయారు. తెలుగు సినిమా తెరపై, అసలు ఇండియన్ సినిమా లో యుద్ధం సీన్స్ కి కొత్త నిర్వచనం పలికేలా ఉండబోతుంది అనే ఫీల్ వ్యూహాలతో కలిగించారు. అంత మందిని కో ఆర్డినేట్ చేసుకుంటూ, అసలు ఎలా తీసి ఉంటారో అనే రేంజ్ లో మొదలు పెట్టారు. కొన్ని షాట్స్ అయితే మనకి తెలియకుండానే మనతో చప్పట్లు కొట్టించాయి. ప్రభాస్ హార్స్ రైడింగ్ సీన్స్ అయితే అరాచకం . కానీ నిడివి బాగా ఎక్కువ అవటం వలన ఆ యుద్ధం సీన్స్ లో నే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ముఖ్యం గా మరణం డైలాగ్ తేలిపోయి అసలైన ఇంపాక్ట్ ని మిస్ చేసింది. దీనికి వేరే కారణం కూడా ఉంది, అసలు ఈ కాలకేయులు ఎవరు? మాహిష్మతి రాజ్యం పై ఎందుకు పడ్డారు? వారి ఆకృత్యాలు అన్ని డైలాగ్ రూపం లో చెప్పించారు కానీ, కొన్ని విజువల్స్ గా చూపించి ఉంటె ప్రేక్షకులకి కూడా ఇంపాక్ట్ ఉండేది. కేవలం రాజ్యాధికారం కట్టబెట్టడమే యుద్ధం ముక్య ఉద్దేశం గా మిగిలిపోయింది.  ఆ ఐటెం సాంగ్స్ ప్లేస్ లో కాలకేయలు గురుంచి చూపించి ఉంటె రియాక్షన్ వేరేలా ఉండేది. ఆ బాష కూడా పెద్దగా హెల్ప్ అవ్వలేదు, సీరియస్ గా ఉండాల్సింది కామెడీ అయ్యింది. కనీసం ఆ టైం లో శివగామి కి పిల్లలతో ఉన్న అనుభందం అయినా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది.  యుద్ధం అవ్వగానే ట్విస్ట్ ఇచ్చి శుభం కార్డు వేసేసారు.

మూడో అంకము అంటూ ఏమైనా ఉంటె అది సెకండ్ పార్ట్ ఈ అవ్వాలి ఇంక. ప్రేక్షకుడి కి మిగిలే వెలితి ఏంటంటే, మన తెలుగు సినిమాల వరకు ప్రతి సినిమా కి ప్రారంభం, మధ్యమం, ముగింపు అవసరం. ఈ సినిమా కి ఇంత కంటే గొప్ప ముగింపు ఉండక పోవచ్చు కానీ, కంప్లీట్ నెస్ అయితే లేకుండా పోయింది. అటు ఫ్లాష్ బ్యాక్ లో కథ కి, ఇటు ప్రెసెంట్ లో కథ కి, ఏ ఒక్క క్యారెక్టర్ కి కంప్లీట్ నెస్ అనేది లేదు. మొత్తం మీద రెండో అంఖం లో నే సినిమా అయిపొయింది. ఇంకా ఏదో ఉండబోతుంది అనుకునే లోపు సినిమా అయిపోవటం అనేది ఒక రకమైన అసంతృప్తి నే మిగులుస్తుంది. 

సినిమా అయ్యాక ప్రేక్షకుడి మదిలో మెదిలే కొన్ని ప్రశ్నలు - ఇప్పుడు ఇంతకి ఈ సినిమా లో ఈ పార్ట్ వరకు విలన్ ఎవరు? భళ్ళాలదేవ ? కాలకేయులు? భద్రుడు? లేక కట్టప్ప? అసలు దేవసేన కి ఆ స్థితి ఎందుకు వచ్చింది? తిరుగుబాటు బృందం ఎవరు? అవాంతిక ఎవరు? శివగామి ఎందుకు చనిపోయింది? బాహుబలి ని ఎందుకు చంపారు? వీధుల్లో కొందర్ని కట్టేసి కొడుతున్నారు కదా ఇంతకి వాళ్ళు ఎవరు ? ఇలా ఇంకా చాలా ఉండొచ్చు, అవన్నీ నెక్స్ట్ ఇయర్ డిస్కస్ చేసుకోవాల్సిందే. వీటి వలన సినిమా అయ్యాక బయటికి వచ్చే ప్రేక్షకులకి ఇంటర్వెల్ లో బయటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది తప్ప పూర్తి సినిమా చూసిన ఫీలింగ్ ఉండదు. కనీసం సెకండ్ పార్ట్ ఇంకో మూడు నెలల్లో వచ్చేసినా బావున్ను, లేదంటే అది వచ్చే ముందు ఇది ఇంకోసారి రిలీజ్ చెయ్యాల్సిందే. 

పాత్రలు : కథ పూర్తిగా తెలియక పోవటం వలన కథనం లో వచ్చిన అసంతృప్తి గురుంచి చెప్పుకున్నాం కాబట్టి, కొంత లో కొంత సంతృప్తి కలిగించిన పాత్రల గురుంచి కూడా మాట్లాడుకుందాం

బాహుబలి: తండ్రి పాత్ర లోను, కొడుకు పాత్రలోనూ భావోద్వేగాలు అంతగా పండించకుండా రెండో పార్ట్ కి అట్టిపెట్టారు. శివుడు తన గురుంచి తను తెలుసుకొనే పాత్రలో పాసివ్ గా మిగిలిపోతే, తండ్రి పాత్ర  రాజు కావటం తో ఆగిపోయింది. తండ్రి పాత్ర కి తన వెనక జరిగే కుట్ర గురుంచి తెలియక పాసివ్ గా మిగిలిపోయింది.  ప్రభాస్ కి రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలే అయినప్పటికీ ఈ పార్ట్ వరకు నటన కి పెద్దగా స్కోప్ లేదు. మనతో ఎక్కువ సేపు ట్రావెల్ చేసిన శివుడు పాత్ర ఒక సారి మన్యం బాష లో, ఇంకోసారి గోదావరి యాస లో, పవర్ఫుల్ డైలాగ్ లో ప్రభాస్ మాడ్యులేషన్ లో విచిత్రం గా ఉంటుంది. 

భళ్ళాలదేవ: నిజంగా తన మనసులో ఏముందో తెలుసుకోవటం మన తరం కాదు. రాజ్య కాంక్ష ఫ్లాష్ బ్యాక్ లో పండించినా, అసలు దేవసేన ని ఎందుకు భంది చేసాడో తెలియనివ్వలేదు. బాహుబలి పేరుకే ఉలిక్కి పడే పాత్ర లో భయం, పొగరు, కుతంత్రం, వినయం అన్ని రకాల వేరియేషన్స్ పలికించే అవకాశం అయితే ఈ పాత్ర కి దొరికింది. ఆ అవకాశం ని ఏ మాత్రం వదులుకోకుండా, పాత్ర కి ఎంత కి అవసరమో అంతే అందిస్తూ రానా కూడా రాణించాడు, మెప్పించాడు. 

దేవసేన: అసలు ఈ పాత్ర గురుంచి పూర్తి అవగాహన రానివ్వలేదు, అప్పట్లో యువరాణి గెటప్ లో చూపించారు కాబట్టి కుంతల దేశపు యువరాణి అనుకోవాలి. నన్ను కాదని వాడు చేసుకున్నావ్ అని రానా తో చెప్పించారు కాబట్టి వాళ్ళ మద్య ఎం జరిగిందో ఊహించుకోవాలి. చేసిన రంకు కి పాతికేళ్ళు శిక్ష అనుభవిస్తున్నా మగాన్ని చూసి ఆగలేక పోయావా అని భద్రుడు అన్నాడు కాబట్టి తనపై మోసిన నింద ఇది అని తెలుసుకోవాలి. తనని విడిపించటానికి కొడుకు వస్తాడు అని ఎదురు చూస్తుంది కాబట్టి, కొడుకు ని తప్పించిన టైం లో ఎం జరిగి ఉంటుందా అని ఆలోచించుకోవాలి. ఇవన్ని పక్కన పెడితే ఉన్న అతి చిన్న టైం లోనే, నటన కి అవకాశం తో పాటు స్ట్రాంగ్ ఇంపాక్ట్ కూడా కలిగించే పాత్ర లో అనుష్క బాగా చేసింది. 

అవాంతిక: ఈ పార్ట్ వరకు తేలిపోయిన పాత్ర అంటూ ఉంటె అది అవాంతిక పాత్ర. యోధురాలి గా చూపించినా తన ఆశయం కి కారణం కనిపించదు. అంతటి ఆశయం ని ఒక మగాడి స్పర్స తో చలించిపోయి మైమరచి పోవటం, పచ్చబొట్లు పొడుస్తున్నా తెలుసుకోలేక పోవటం ఒక ఎత్తు అయితే, ఆ ఆశయ సాధన దిశ గా ఏమి చెయ్యక పోవటం ఇంకో ఎత్తు. 

భిజ్జలదేవ: అవిటి తనం కారణం గా రాజ్యాధికారం  దక్కలేదు అనే బాధ ఒకపైవు, తనకు దక్కనిది, తన కొడుకు కి అయిన దక్కాలి అనే తపన ఇంకోవైపు, తన కొడుకు పరిపాలిస్తుంటే, తను మిస్ అయ్యింది దొరికినంత ఆనందం గా ఎంజాయ్ చేసే పాత్ర లో నాజర్ గారి అనుభవం తో రంజింపచేసారు. ఈ పాత్ర మెయిన్ రోల్ మనకి సెకండ్ పార్ట్ లో నే అర్ధం అవ్వాలి. 

శివగామి: ఎంత రాసుకున్న తక్కువే అనిపించే రేంజ్ పాత్ర. భర్త కి రాజ్యాధికారం లేక పోయినా, మరిది కొడుకు పురిట్లోనే తల్లిని పోగొట్టుకోగా, అటు రాజ్యం భాద్యతలని, ఇటు పిల్లల పెంపకం ని చూసుకుంటుంది. కన్న కొడుకు తో సమానం గా బాహుబలి కి కన్న తల్లి కంటే ఎక్కువై పెంచుతుంది. కీలకమైన నిర్ణయం తీసుకునే టైం లో కూడా పేగు భంధం, భర్త కోరిక అడ్డు పడనివ్వకుండా నీతి కి మారుపేరు గా నిలుస్తుంది. ఈ పాత్ర లో రమ్య కృష్ణ ని తప్ప ఇంకా ఎవర్ని ఊహించుకోలేము అనే రేంజ్ లో నటించి మెప్పించారు. ఇంత గొప్ప పాత్ర, తాను చేసిన పాపాలకి ప్రాయశ్చితం గా తనని తాను బలి తీసుకోవటం మనకి మొదట్లోనే మనకి ఒక లీడ్ ఇచ్చారు, ఇంతకి తను చేసిన పాపం ఏంటో గెస్ చెయ్యటం పెద్ద విషయం కాదేమో ? 

కట్టప్ప: సింహశనం కి బానిస, సైన్యాధ్యక్షుడు, చేసిన తప్పుకి చింతిస్తూ, అవకాశం దొరికితే దేవసేన ని విదిపిద్దాం అని ప్రయత్నిస్తూ ఉంటాడు. మనసుకి నచ్చినా నచ్చక పోయిన రాజు కి, తన కుటుంబానికి విధేయుడు గా ఉంటూ, వాళ్ళ ప్రాణానికి తన ప్రాణం అడ్డు పెడుతూ ఉoటాడు. ఎన్నో భావోద్వేగాలు ఉన్న ఈ పాత్ర లో సత్య రాజ్ జీవించారు. రాజు అయిన రానా కి, ఆఖరికి రానా కొడుకు ప్రాణాలు కూడా కాపాడటానికి వెనుకాడని కట్టప్ప, రాజు గా ఉన్న బాహుబలి ని ఎందుకు చంపినట్టు? రాజు కి, సింహాసనం కి విధేయుడు గా ఉండే కట్టప్ప నాజర్ మాట విని, రానా మాట విని అయితే చేసి ఉండడేమో? తను వినేది అంటే అప్పటి వరకు శివగామి కి, ఆ తర్వాత రాజు అయిన బాహుబలి కి అయ్యి ఉండాలి మరి అలాంటప్పుడు  బాహుబలి ని చంపమని తనకి ఆర్డర్ ఇచ్చింది ఎవరు? గెస్ చెయ్యకండి, సెకండ్ పార్ట్ లో మజా మిస్ అయిపోతారు ఏమో ? 

పాత్రలు బావున్నాయి, పాత్రల మద్య అల్లుకున్న కథ సగం వరకే తెలియటం వలన మిగతా సగం మీద కుతూహలం కూడా ఉంది. కాక పోతే ఫుల్ మీల్స్ ఆశించిన మాకు ప్లేట్ మీల్స్ పెట్టి పంపేసారు. ప్లేట్ మీల్స్ వలన ఆకలి తీరకపోవటం (సినిమా నచ్చక పోవటం) ఉండదు ఏమో కాని, సంతృప్తి మాత్రం ఒక వెలితి తో అసంతృప్తి గా మిగిలిపోతుంది. 

ఈ సినిమా బాగా ఆడుతుంది, ఇంకా బాగా ఆడాలి, కలెక్షన్స్ పొలికేక పెట్టించాలి,  ఆ కలెక్షన్స్ కొత్త ఉత్సాహం ఇవ్వాలి, ఆ ఉత్సాహం తో రెట్టించిన భాద్యత తో సెకండ్ పార్ట్ ని ఇంకా జాగ్రత్త గా మలచాలి. కలెక్షన్స్ ఈ పార్ట్ ని మించి ఉండటం తో పాటు, ఈ పార్ట్ మిగిల్చిన వెలితి ని పూరించి ఆ పార్ట్ తో పరిపూర్ణత తీసుకొచ్చి, మంచి ప్రయత్నం స్థాయి నుంచి గొప్ప సినిమా గా మలిచి సంతృప్తి చేస్తారు అని కోరుకుంటూ.., నెక్స్ట్ ఇయర్ రాబోయే రెండో పార్ట్ గురుంచి వెయిట్ చెయ్యటం కంటే ఇప్పటికి ఈ పార్ట్ కలెక్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ.....

మీ

హరికృష్ణ రాజు 
12 comments:

Anonymous said...

very good sir. cinema bavundi antune cinema lo kick miss aindi ani baga convey chesaru. as usual rock chesaru

raju said...

keka

kiran said...

as usual ga valid point discuss chesaru anna keep it up

aditya said...

Sivudu-Avantika love track inka better ga undalsindi, adi tappa oka flow lone undindi gamovie narration ??

Interval episode nacchaleda, best moments edanna share chestavemo anukunna movie lo :)

Sethuram said...

manasulo emanukunano adhe cheparu...well connected
very nice review

HKR said...

@Aditya

best moments mentions cheyyaka povatam enti ? aritlce motham chadavaledha :P

Anilkumar.Chintala said...

Nice Review.
Good Movie. Pride of Indian Cinema.

Anonymous said...

good one hari

Vijay said...

excellent summary and inferences!!

Anonymous said...

One of the best write ups on baahubali . keep it up hari krishna raju garu

kiran said...

Superb analysis sir

venkatesh venky said...

Intha knowledge undi ikkade review isthu aagipovadamenti , miru manchi story rasina cinema choodalani vundhi 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views