అఖిల్ సినిమా : పోస్ట్ మార్టంఅఖిల్ సినిమా :  పోస్ట్ మార్టం  

సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ఏ చూసినా రివ్యూ రాయటం కుదరలేదు, సరే పోనీ ఎప్పటిలాగానే విశ్లేషణ అయినా రాసేద్దాం లే అనుకుంటే, ఎడతెరిపి లేని వర్షాలు, పని చెయ్యని ఇంటర్నెట్ ఆ పని చెయ్యనివ్వలేదు. సినిమా రిజల్ట్ కళ్ళముందే కనపడుతుంటే, రిలీజ్ అయిన పది రోజులకి పైన చెప్పుకున్న రెండూ ఎం రాయగలం? అందుకే సింపుల్ గా ఈజీ గా ఉంటుంది అని ఇది రాసేసుకోటం బెటర్ అనిపించి మొదలు పెడుతున్నా..... కర్ణుడి చావు కి వంద కారణాలు, తెలిసి చేసినా తెలియక చేసినా అయన చావు ఆయనే ఫిక్స్ చేసుకున్నాడు. అన్ని విద్యలు వచ్చిన వాడికి ఇంపార్టెంట్ టైం లో ఏవి అక్కరకు రాలేదు. అఖిల్ ఏదో మహాబారతం అని, అఖిల్ కుర్రాడు కర్ణుడు అని కాదు కానీ, ఈ సినిమా డిసాస్టర్ అవ్వటానికి కారణాలు వెతుక్కునే ప్రాసెస్ లో పైన చెప్పిన ఉదాహరణ ఎందుకో మ్యాచ్ అయినట్టు అనిపించింది. అదేంటో లాస్ట్ లో చూద్దాం. 

ఇప్పటి వరకు స్టార్ హీరో ల పిల్లల లాంచ్ బొమ్మలు చూసుకుంటే కృష్ణ గారి అబ్బాయి కమర్షియల్ గా లాంచ్ అయిపోయాడు. చిరంజీవి గారి తమ్ముడు, కొడుకు కూడా తన మాస్ ఇమేజ్ కి తగ్గట్టు లాంచ్ అయ్యారు. నాగార్జున గారి పెద్ద అబ్బాయి మెసేజ్ ఓరియెంటెడ్ యూత్ సినిమా తో రాగా, ప్రొడక్షన్ తరుపున అంత గా అంచనాలు లేని అల్లు అర్జున్, సుమంత్, రానా వాళ్ళకి తగ్గట్టు గా వచ్చారు. ఇంక అఖిల్  విషయానికి వస్తే, నాన్న గారి లా ట్రెండ్ సెట్టింగ్ సబ్జెక్టు లేక అన్నలాగ మెసేజ్ ఓరియెంటెడ్ కాకుండా, రావటం రావటం బ్లాక్బస్టర్ లాంటి కమర్షియల్ బొమ్మ తో నే అని ప్లాన్ చేసుకున్నారు. మరి మాస్ లో వాళ్ళ బేస్ ని బేరీజు వేసుకున్నారో లేదో ? జనరల్ ఆడియన్స్ అయితే మాత్రం వాళ్ళ పేరెంట్ హీరో కి షాడో గానే చూస్తారు అట్లీస్ట్ మొదటి రెండు మూడు సినిమాలు వరకు. చరణ్ నుంచి లీడర్ లాంటి బొమ్మ, మహేష్ నుంచి ప్రేమ కథ లాంటి బొమ్మ ఎదురు చూడరు, చిరుత - రాజకుమారుడు లాంటివే కోరుకుంటారు, మరి నాగార్జున గారి అబ్బాయి నుంచి ఎం ఆశిస్తారు?

జనరల్ ఇన్ఫర్మేషన్
సినిమా పేరు ; అఖిల్
s / o : శ్రేష్ట మూవీస్
వయసు : ప్రొడక్షన్ A 
అడ్రస్ : మీ అభిమాన థియేటర్స్ 
పొడవు : 2 గంటల 10 నిముషాలు 
స్పెషల్ ఐడెంటిఫికేషన్ : డెబ్యూ సినిమా 
బాహ్య స్వరూపం : కమర్షియల్ సినిమా 
అంతర్గత పరిశీలన : లవ్, డ్రామా, యాక్షన్, ఎమోషనల్, సోషియో ఫాంటసీ థ్రిల్లర్  
ముందుగా జరిగిన గాయాలు : ట్రైలర్ అండ్ డైలాగ్ ప్రోమోలు

డిటైల్డ్ రిపోర్ట్ : 

కథ : జనరల్ గా డెబ్యూ సినిమా కథలు పెద్ద కాంప్లికేటెడ్ గా ఉండవ్, సింపుల్ లవ్ స్టొరీ లు తీసుకొని, రివెంజ్ ఆడ్ చేసి, సాంగ్స్ ఫైట్ కామెడీ అంటూ షో రీల్ గా లాగేస్తారు. అప్పటి విక్రం నుంచి, మొన్న రాజకుమారుడు తో సహా నిన్నటి చిరుత వరకు "కమర్షియల్" హీరోస్ ఆడిన సేఫ్ గేమ్ అది. చాల వరకు ఫస్ట్ సినిమాలో కుర్రోడు ఎలా ఉన్నాడు అని చూడటానికే వస్తారు కాని అద్బుతాలు ఆశించరు. ఇక్కడ ఎన్నో కథలు విన్న తర్వాత, లేట్ అవ్వటానికి కారణం ఏంటి అంటే? వస్తే ఒక బ్లాక్బస్టర్ కంటెంట్ తో నే మీ ముందుకి వస్తాను అని బాబు హామీ ఇచ్చిన తర్వాత ఆ కంటెంట్ ఏంటి అనే కుతూహలం కూడా కలిగింది. కథ లోకి వెళ్తే, సూర్య గ్రహణం టైం లో వచ్చే తొలి కిరణాలూ  భూమికి చేటు చేస్తాయి అని అప్పట్లో మన వాళ్ళు లోహాలతో చేసినా ఒక గోళం ని (జువా అంటారు) ఆఫ్రికా లో భూమధ్య రేఖ పై ప్రతిష్టించి, దాని రక్షణ అక్కడ లోకల్ వాళ్ళకి అప్పచేప్తారు. అది దక్కించుకోవాలని ఒక రష్యా విలన్ , ఇండియన్ విలన్ అయిన హీరోయిన్ తండ్రి ద్వారా ప్రయత్నిస్తూ ఉంటె, ఆ దారికి అడ్డుపడ్డ హీరో ఈ భూమిని ఎలా కాపాడాడు అనేది కథ. డెబ్యూ సినిమా అనేది పక్కన పెడితే కొంచెం ఉత్సాహం రేకెత్తించే లైన్ ఏ అనుకోవచ్చు. వినటానికి, ఇలా చిన్నగా ఒక లైన్ లో చెప్పుకోటానికి బావుంది, కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక డెబ్యూ మూవీ కి ఇది హెవీ అయిపోదా? అంజి లో చిరంజీవి, దేవి పుత్రుడు లో వెంకటేష్, శక్తి లో ఎన్టీఆర్ లాంటి సీనియర్ లు జూనియర్ లే ప్రపంచాన్ని "కమర్షియల్" గా కాపాడలేక పోయారు కదా? ఇది నా వల్ల అయ్యే పనేనా అని కాంపౌండ్ లో ఒక్కరు కూడా ఆలోచించలేదా ?  

హీరో ప్రేమ గురుంచో, ఫ్యామిలీ గురుంచో, రివెంజ్ కోసమో విలన్ తో పోరాడటం ఓకే, బాగా పర్సనల్ గా ప్రాబ్లం ఉంటె ఇంకా బాగా కనెక్ట్ అయ్యే అవకాసం ఉంటుంది. అసలు తను ఎం చేస్తున్నాడో, ఎందుకు చేస్తాడో క్లైమాక్స్ వరకు హీరో కె తెలియక పోతే ? ఎలాగేలగా అని కథనం లో చూద్దాం

కథనం: వెలిగొండ శ్రీనివాస్ గారు ఇచ్చిన కథకి కథనం వ్రాసుకున్న వినాయక్ కి కాని మాటలు వ్రాసిన కోన సర్ కి కాని తెలియదా? "కథలేని సినిమా కి అయినా కథనమే పునాది, అవి రెండూ సరిగ్గా లేని సినిమా సమాధి". మెయిన్ పాయింట్ లో ని విషయాన్ని పూర్తి సినిమా గా మార్చటం లో ఏ రూట్ లో వెళ్ళాలి అనే దానిపై క్లారిటీ మిస్ అయినట్టే అనిపిస్తుంది. అసలు జువా కి హీరో కి సంబంధం ఏంటి? సూర్యుడి లాకెట్ అని మాత్రం చెప్పకండి. కనీసం ఇలాంటి కథలో పలానా జాతకం వాడో, వంశం వాడో కాపాడటం అనే లింక్ ఉంటుంది, ఇక్కడ అది కూడా లేకుండా చేసారు. అసలు హీరో ఎవడు? స్ట్రీట్ ఫైట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఫ్రెండ్స్ తో తిరిగే ఒక అనాధ. హీరోయిన్ ని ప్రేమిస్తాడు, అబద్దం చెప్పి ప్రేమలో దించుతాడు, హీరోయిన్ కి తెలిసి ఛీ కొడుతుంది, విలన్ హీరోయిన్ ని ఎత్తుకు పోతాడు, హీరో వెళ్లి తీసుకొస్తాడు, హీరోయిన్ తండ్రి ని విలన్ లాక్ చేస్తాడు, హీరో వెళ్లి కాపాడుతాడు, ఎలాగు అంత దూరం వెళ్ళాను కదా అని జువా ని ప్లేస్ లో పెట్టేస్తాడు. ఆ ఒక్క లైన్ కథని ఇలా ఔటర్ లైన్ లా చెప్పుకున్నా కూడా తేడా కొడుతుంది, ఇంకా డిటైల్డ్ గా చెప్పుకోవాలి అంటారా? తీసుకున్న పాయింట్ కి వ్రాసుకున్న కథనం కి తోడు స్కోప్ లేని పేలవమైన కామెడీ సహన పరీక్ష గా మిగిలాయి. 

ఈ సినిమా లో హీరోయిజం పండక పోవటానికి, అసలు ఎలివేషన్ అనేది పడక పోవటానికి కారణం అయితే మాత్రం హీరో కి ప్రాబ్లం పర్సనల్ కాకపోవటం, తన ఆశయం తనకి తెలియక పోవటం, హీరోయిన్ కోసం వెళ్ళే టైం కి అసలు హీరోయిన్ కి తనపై ప్రేమ లేక పోవటం (అసలు ఇద్దరి మద్య ప్రేమ ఉన్నది సాంగ్స్ లో మరియు ఫస్ట్ హాఫ్ లో పావుగంట మాత్రమె), అన్నిటికి తోడు అసలు విలన్ అనే వాడిని క్లైమాక్స్ వరకు ఎదురు పడకపోవటం.   

పెట్టుబడి / బిజినెస్ : ఎంచుకున్న కథకి తగ్గట్టు గానే ఖర్చు కూడా బాగానే పెట్టారు. ఇంతోటి కథ కథనం చేతిలో పెట్టుకొని అసలు ఆఫ్రికా వరకు వెళ్ళిపోవటం ఎందుకు మన పావురాల గుట్ట లో పెట్టుకోవచ్చు కదా? నార్త్ ఇండియన్ విలన్ సరిపోతాడు కదా? ఒకవేళ ఇలా పెట్టి ఉంటె హీరో ఫైట్ చేసి వోడిపోయి లక్షలు సంపాదించి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చి మరీ ఫ్లైట్ ఎక్కటం కుదరదు అని ఒక ఫైట్ పెట్టె ఛాన్స్ మిస్ అయిపోతం అని అనుకున్నారేమో. సాంగ్స్ కూడా ఫారిన్ లో తీసే అవకాశం ఉండదు అని ఫీల్ అయ్యారేమో.  ఫస్ట్ సినిమా తో హీరో స్టామినా ని మార్కెట్ కి పరిచయం చెయ్యాలి అని అనుకోని ఉంటె ఇంత ఖర్చు పెట్టేవారు కాదు. అంతకి అమ్మే వారు కాదు. కొనేవాళ్ళు ఉండగా అమ్మటానికి ఏంటి ప్రాబ్లం ? అయినా హీరో కి ఆ క్రేజ్ రాబట్టే కదా అంత బిజినెస్ జరిగింది? అని అడిగేవాళ్ళు ఒక సారి ఇప్పుడు కలెక్షన్స్ గురుంచి కూడా మాట్లాడాలి అని మనవి. డిసాస్టర్ అయ్యి ఉండక పోతే, బ్లాక్బస్టర్ అయ్యి ఉంటె అని ఏమైనా అడిషనల్ ప్రశ్నలు కూడా ఉంటె సింపుల్ కథ ని చిన్న బడ్జెట్ లో చేస్తే ప్రాఫిట్స్ ఇంకా ఎక్కువ ఉండేవి ఏమో కదా? అని కూడా ఆలోచించుకోవాలి. ఇంకా ఏమైనా వాదించాలి అనుకునే వాళ్ళకి దీని ప్రభావం నెక్స్ట్ సినిమా టైం కి కాని అర్ధం కాదు. అఖిల్: కుర్రాడు కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, వాయిస్ బావుంది, ఫైట్ లు బాగా చేసాడు, డాన్సు లు కుమ్మేసాడు, అక్కినేని అభిమానులు అంచనాలకు మించి డాన్సు లు అందించాడు, కెమెరా అంటే ఫియర్ లేదు కాని  డిక్షన్ అండ్ యాక్షన్ లో ఇంప్రూవ్ అవ్వల్సింది చాలా ఉంది. తెలుగు ని తెలుగు లా పలకటం కోసం తెలుగు ట్రైనింగ్ ఇప్పించాలి. తెలుగు సినిమాల వరకు హీరోయిన్ కి లిప్ సింక్ మిస్ అవ్వటం పెద్ద మేటర్ కాదు కానీ అదే హీరో కి అయితే బాగోదు. ఈ కథ వలనో ఏమో కానీ కుర్రోడు బాగా లేత గా ఉన్నాడు. ఇంకొన్ని రోజులు ఆగి ఈ గ్యాప్ లో ట్రైనింగ్ తీసుకుని ఉంటె ఇంకా బావుండేది అనిపించింది. రియాక్షన్ ఇవ్వాల్సిన సీన్స్ లో ఎం చెయ్యాలో తెలియనట్టు గా అయోమయం గా చూస్తూ ఉండటం, ఎక్కువ సేపు నోరు వదిలేసి ఉండటం, డాన్సు చేస్తున్నప్పుడు స్టెప్స్ చుసుకుంటునట్టు గా అప్పచేప్పేస్తునట్టు  చెయ్యటం లాంటివి రాబోయే సినిమాల్లో కరెక్ట్ చేసేసుకుంటాడు అనే అనుకుంటున్నా. ఫస్ట్ సినిమా కే కమర్షియల్ గా జెండా పాతేన్గే అనే ఆటిట్యూడ్ అయితే కనిపించింది, ఈ కసి కి కొంచెం హార్డ్ వర్క్ కూడా తోడు అయితే రాబోయే రోజుల్లో  ర్యాంకింగ్ సిస్టం మారే అవకాశం ఉండొచ్చు.  ఇది ఇంకా ఫస్ట్ సినిమా నే కాబట్టి ఇంకో రెండు బొమ్మలు పడ్డాక క్లారిటీ వస్తుంది. 

వినాయక్:  సొంత బ్యానర్ కాదని బయట ప్రొడ్యూసర్ చేతుల్లో కొడుకు సినిమా పెట్టినా, అభిమానులు అన్ని అంచనాలు పెంచుకున్నా, డిస్ట్రిబ్యూటర్ లు అంత రేట్స్ పెట్టినా, వెనక "వినాయక్" గారు ఉన్నారు అనే ఒక నమ్మకం. కమర్షియల్ గా మినిమం గ్యారంటి బొమ్మ ఇస్తారు అనే నమ్మకం. సాంగ్స్ డాన్సు చూసుకో అవసరం లేదు, ఫైట్ లు ఎలాగు చేస్తాడు, కామెడీ కి వినాయక్ సర్ ట్రేడ్ మార్క్ ఈ మాత్రం చాలదా? కామన్ ప్రేక్షకుడు కూడా పాజిటివ్ గా సినిమా కి వెళ్ళటానికి. కానీ ప్రెషర్ ఫీల్ అయ్యారో, లేక ఇంతకి మించి చెయ్యలేరో కాని, వినాయక్ నుంచి ఒకరు ఆశించే సినిమా అయితే కాదు ఈ అఖిల్. ఫస్ట్ హాఫ్ వరకు సాంగ్స్ తో ఫైట్ ల తో నేట్టుకోచ్చేసిన వినాయక్ గారు మేజిక్ చెయ్యాల్సిన సెకండ్ హాఫ్ లో చేతుకు ఎత్తేశారు. ఇంటర్వెల్ అవ్వాగానే రేచ్చిపోవాల్సిన కథనం పేలవమైన కామెడీ తో దశ దిశ లేక ఆఫ్రికా అడవుల్లో తప్పిపోయింది. కథ కథనం పక్కన పెడితే అఖిల్ ని ప్రెసెంట్ చెయ్యటం లో కూడా వినాయక్ మార్క్ మిస్ అయ్యింది. సీనియర్ డైరెక్టర్ అయ్యి ఉండి, కుర్రాడి యాక్షన్, రెస్పాన్స్, లిప్ సింక్ లాంటివి చూసుకోక పోతే నమ్మి చేతుల్లో పెట్టిన వాళ్ళకి ఎం న్యాయం చేసినట్టు? అన్న్తికి మించి ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందొ అది వినాయక్ సినిమాల్లోనే తలమానికం. ఆ సెటప్ కి పూర్ గ్రాఫిక్స్ తోడై నాసి రకం క్లైమాక్స్ గా చేసేసాయి. అప్పటి వరకు ఉన్న అంతో ఇంతో గుడ్ ఫీల్ ని బలవంతం గా లాగేసుకున్నారు ఇలాంటి క్లైమాక్స్ తో. 

అంచనాలు / (ధుర)అబిమానులు : నాగార్జున వరకు ఒకటి అరా సినిమాలతో నేట్టుకోచేస్తున్నా, నాగ చైతన్య కెరీర్ అంచనాలకు అందని అగమ్య గోచరం గా ఉండటం తో, అఖిల్ తెరంగేట్రం పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. హీరో అంటేనే కలెక్షన్స్ అనే రేంజ్ లో ఉన్న ఈ రోజు ర్యాంకింగ్ సిస్టం లో, మా హీరో కలెక్షన్స్ తో నే సమాధానం చెప్తాం అనుకున్నారు. ఏ నాగ్ ఫ్యాన్ ని అడిగినా శివ, గీతాంజలి, అంతం, అన్నమయ్య - ట్రెండ్ సెట్టర్, కొత్తదనం అంటారు కానీ, చాలా మంది ఫాన్స్ మాత్రం కొడుకు అఖిల్ విషయం కి వచ్చేసరికి కొత్తదనం ఉన్న యూత్ ఫిలిం విత్ కొత్త డైరెక్టర్ ని కోరుకోలేదు, బ్లాక్ బస్టర్ విత్ మినిమం 50 కోట్లు అని ఆశించారు/కోరుకున్నారు?  జరిగిన బిజినెస్ కి, పెట్టిన రిలీజ్ కి, మనం లో చూసినప్పుడు వచ్చిన రెస్పాన్స్ కి, సాంగ్స్ లో వేసిన డాన్సు కి వాళ్ళు అంచనాలు పెట్టుకోవటం తప్పే కాదు. ఇవన్ని చూసుకొని, ఒక అడుగు ముందుకేసి మిగతా ఫాన్స్ ని కవ్వించటం మొదలు పెట్టారు? దాని వలన రిలీజ్ కి ముందే కొంత మంది అభిమానుల కంటే ఎక్కువగా ఈ సినిమా కోసం వెయిట్ చెయ్యాల్సి వచ్చింది. ఈ ఫాన్స్ వార్స్ సినిమా రేంజ్ ని ఇంకొంచెం కిందకి లాగటానికె తప్ప ఎందుకు పనికిరాలేదు. జనరల్ గా బయట వినిపించిన కామెంట్ "పాపం అఖిల్ సినిమా కి కలెక్షన్స్ లేవు అంట ? - వాళ్ళకి అలాగే అవ్వాలి లే అప్పుడు నేల మీదకి వస్తారు" ఫాన్స్ మద్య ఇవన్ని ప్రతి సినిమాకి ఉండేవే అయినా, ఆశీర్వదించాల్సిన మొదటి సినిమా కే దురభిమానులని కూడా సంపాదించి పెట్టారు 

నివేదిక: ది కాజ్ అఫ్ థిస్ రిజల్ట్ టు ది బెస్ట్ అఫ్ మై నాలెడ్జే అండ్ బిలీఫ్ ఈస్ పూర్ రైటింగ్, బాడ్ ఎక్షిక్యూషన్, పాథటిక్ క్లైమాక్స్ అండ్ ది డీటెయిల్స్ యాస్ సెడ్ అబోవ్. బీటింగ్ టు ఆడియన్స్ ఇస్ అస్ సివియర్ అస్ షౌన్ ఇన్ ది వాల్ పేపర్.  ఇందాక కర్ణుడు అని చెప్పుకుంది వినాయక్ సర్ (అఖిల్ సినిమా) ని ఉద్దేశించే, మంచి ప్రొడ్యూసర్, కోన వెంకట్ , సాంగ్స్, డాన్సులు ఫైట్ లు చేసే పెద్ద హీరో కిడ్, అమోల్ రాథోడ్, గౌతం రాజు గారు,  ఎన్నో కమర్షియల్ సినిమాలు తీసిన అనుభవం అన్ని ఉన్నా కూడా అఖిల్ కి వచ్చేసరికి ఏవి అక్కరకు రాలేదు. అయన కెరీర్ లో నే ఎపిక్ డిసాస్టర్ అయ్యింది. 


ఆన్: 18/11/2015 ఎట్ ; చెన్నై
డిపార్టుమెంటు అఫ్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఆడియన్స్
తెలుగు సినిమా


చివరిగా : ఈ సినిమా లో ఒక డైలాగ్ "ఈ జెనరేషన్ లో ప్రతి వాడు హీరో అనే అనుకుంటాడు, కానీ గెలిచిన వాడినే ఈ జెనరేషన్ హీరో అంటుంది. గేమ్ ఎప్పుడైనా గెలుపు నాదే" లాంటి కాన్ఫిడెన్సు మంచిదే కాని అదొక్కటి సరిపోదు, గెలుపు పొందాలి అంటే ఇంకాస్త హార్డ్ వర్క్, ఇంకాస్త మంచి కథ, ఇంకాస్త మంచి కథనం కూడా అవసరం అవుతాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ సినిమా తో మా ముందుకి వచ్చినప్పుడు డిసైడ్ చేస్తాం హీరో - బెటర్ లక్ ఇన్ నెక్స్ట్ గేమ్ - ఇట్లు ఈ జెనరేషన్. 

1 comments:

aditya said...

Antha baagane undi baa, but madhyalo aa fans war/statements assalu avasarame ledu anipincinidhi expect cheyaledu nuvvu ala raastavani

movie ki vaste just plot fine but execution emi ledu nuvvu cheppinatt hero ki link sariga lene ledu last varaku asalu em cheyalo teliyadu, at least hero ne villains ki aa jua tecchice vaadu ga choopinchi madhaylo asalu vishayam telisi reverse ainattu choopinchina konchem baagundedhi .

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views