డిక్టేటర్ - కథ , కథనం - విశ్లేషణ





డిక్టేటర్ - కథ , కథనం - విశ్లేషణ 

సంక్రాంతి పండగ కి బాలయ్య సినిమా అంటే ఒకప్పుడు ఆ ఊపు ఏ వేరు, నాకు గుర్తుండి "పెద్దన్నయ్య, సమర సింహ రెడ్డి, వంశోద్ధారకుడు, నరసింహ నాయుడు, లక్ష్మి నరసింహ" లాంటివి టాక్ తో పాటు పండగకే పండగ ని తెచ్చాయి. "సీమ సింహం, ఒక్క మగాడు, పరమ వీర చక్ర" లాంటి మర్చిపోలేని సినిమా లు కూడా వచ్చాయి. కానీ మిగతా టైటిల్స్ ఎలా ఉన్నా పండగ కి వచ్చే బాలయ్య సినిమా టైటిల్ మాత్రం భలే భారి గా ఉంటాయి. చాల ఇయర్స్ తర్వాత మళ్ళి పండగ బరిలో బాలయ్య, అలాంటి టైటిల్స్ కి దీటుగా ఈ మద్య పెట్టుకుంటూ వస్తున్న లెజెండ్ , లయన్ లాంటి ఇంగ్లీష్ పదం "డిక్టేటర్" అనే భరువైన టైటిల్, 99 వ సినిమా అనే స్పెషల్, లౌక్యం తో తిరిగి ఊపందుకున్న శ్రీవాస్, అది కూడా సొంతం గా నిర్మిస్తూ, కోన వెంకట్ - గోపి మోహన్ ల స్క్రీన్ప్లే లో సినిమా అనేసరికి జనరల్ గా నే ఒక ఆత్రుత. పండగ సీజన్లో లో తన వంతు ఫ్యాన్స్ ని, మాస్ ప్రేక్షకులని అలరించి, తన కలెక్షన్స్ కొట్టేసుకొని, తన పెట్టుబడులు తను రాబట్టుకుంటూ తన పని తను చేసుకుపోతుంది సినిమా. ఈ సినిమా కథ కథనం గురుంచి .........  

సినిమా చూసినా చూడకపోయినా ఈ ఆర్టికల్ చదవటం వలన మీ అనుభూతి అయితే దెబ్బ తినదు అనే అనుకుంటున్నా, అయినా సరే, సినిమా చూసిన తర్వాత చదవమని ప్రార్ధన

కథ; స్పెషల్ థాంక్స్ టు సురేష్ కృష్ణ గారు అనో, పరుచూరి బ్రదర్స్ అనో ఆఖరికి చిన్ని కృష్ణ గారు అనో వేసి ఉంటె బావుండేది. ఒక సమర సింహ రెడ్డి, ఒక బాషా, ఒక నరసింహ నాయుడు, ఒక మాస్టర్, ఒక ఇంద్ర సేన రెడ్డి, ఒక డిక్టేటర్, ఒక 103, ఒక 109. అయినా సరే కథ సెక్షన్ అన్నాక చెప్పుకోవాలి కాబట్టి, అనగనగా ఒక అల్లుడు, నెమ్మదస్తుడు, ఏదో జాబు చేసుకుంటూ, అత్తారింట్లో ఉంటూ పెళ్ళాం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, ఇంతలో ఒక అమ్మాయి - ప్రాబ్లం లో ఉంటె - సహాయం చేస్తాడు, అలాగే పని చేస్తున్న ఆఫీసు లో కూడా సహాయం చేస్తాడు, అమ్మాయి వలన విలన్ లు, ఆఫీసు వలన ఇంకొకరు రంగం లో కి దిగుతారు, అందరు కలిపి మనకి చెప్పొచ్చేది ఏంటంటే - కట్ చేస్తే ఈయన ఫ్యారక్స్ బేబీ కాదు, ఢిల్లీ లో పెద్ద విలన్ అని బేబీ కి ఎక్ష్ అని.  

ఇది మనం అప్పటి సంక్రాంతి నుంచి చూస్తున్న కథ నే, దానిని అటు తిప్పి - ఇటు తిప్పి, తిప్పి తిప్పి మళ్ళీ తిప్పి, పీల్చి పిప్పి చేసేసారు ఇన్నాళ్ళు. అందులో కొన్ని పోయినా కూడా బాగా ఆడిన వాటినే మనం స్పూర్తిగా తీసుకుంటాం కాబట్టి, మళ్ళి దీనినే నమ్ముకున్నారు ఈ సంక్రాంతి కి మన మీదకి వదిలేసారు. 

కథనం : క్లాత్ ఫిక్స్, డిజైన్ ఫిక్స్ ఇంక టైలర్ ఎవరు అయితే ఏంటి అనుకోవచ్చు, కానీ ఇక్కడ రత్నం గారి మాటలు, సీపాన గారి రచన, కోన - గోపి ల స్క్రీన్ ప్లే జతకలిసాయి, ఎంతో కొంత నవ్యత - నాణ్యత ఆశించటం సగటు ప్రేక్షకుడు తప్పు అయితే కాదు. బేసిక్ గా ఈ టెంప్లేట్ కి ఒక ప్రయోజనం ఉంది, ఎక్కడ ఏ టైం లో ఎలేవేషణ్ పడాలి అని ఒక క్లారిటీ ఉంటుంది, అప్పటి వరకు ఫిల్లెర్స్ వేసుకుంటే చాలు, అసలు కథ ఫ్లాష్ బ్యాక్ లో చెప్పుకోవచ్చు. అది అయ్యాక ఎలాగు క్లైమాక్స్. ఈ టెంప్లేట్ కథ కి కుదిరిన కథనం ఎలా ఉంది అంటే... 

ఆక్ట్ 1 : ప్రారంభం : పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఒక డ్రగ్ మాఫియా, అందులో ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్న అమాయకుడు, ఎలాగోలా తప్పించుకున్నాడు - వాడు బ్రతికితే వీళ్ళకి కష్టం, కాబట్టి వెతికే పనిలో ఉన్నారు. ఇంతలో సాఫ్ట్ రోల్ లో హీరో ఇంట్రో, ఎలాగు ఫైట్ పెట్టనవసరం లేదు కాబట్టి డైరెక్ట్ గా సాంగ్. వెంటనే తన ఫ్యామిలీ, ఎక్కడ ఉంటున్నాడు, ఒక కాలనీ, ఎం చేస్తున్నాడు అని ఎస్టాబ్లిష్ చేసేసారు. భార్య అని హీరోయిన్ అంజలి - సోనాల్ కాకుండా ఇంక ఎవరో ఉన్నారంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది అని మనం అనుకోవాలి, వాళ్ళు అలా చూపించక పోతే ట్రైలర్ చూసి కూడా మళ్లీ మనం ఇదే అనుకుంటాం ఏమో అని. మిగతా టెంప్లేట్ ఎలాగు పాతదే అయినప్పుడు దానికి కొత్త డిజైన్ బటన్స్ ఎందుకు అనుకున్నారేమో, అప్పట్లో వచ్చిన కాలనీ బేస్డ్ కామెడీ నే ఎంచుకున్నారు. 

ఆక్ట్ 2 : అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న హీరో లైఫ్ లో కి ఇంకో హీరోయిన్ వచ్చింది, తనకి నటి అవ్వాలని ఆశ, మనం బయట విన్నట్టు షార్ట్ ఫిల్మ్స్ అనో, ఫొటోస్ అనో కాకుండా లైవ్ పెర్ఫార్మన్స్ తో వీడియో చేసుకుంటుంది, నటన గురుంచి కళాకారుల గురుంచి మంచి అభిప్రాయం ఉన్న హీరో కూడా ఆమెని ప్రోత్సహిస్తాడు. మనకి ఎలివేషన్ కి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకో పాట వేసుకోవచ్చు. ఆ అమ్మాయి లైఫ్ లో కి రావటం వలన హీరో కి ఎం అయ్యింది ? ఆ అమ్మాయే మనం మొదట్లో చూసిన అమాయకుడు చెల్లి. వెతుకుతున్న విలన్స్ వెంట పడగా మన హీరో ఉన్న కాలనీ లో కి వచ్చి పడుతుంది. అసలు ఇంకా కాలనీ బేస్డ్ కామెడీ లు, స్లీప్ వాక్ లు అంటే అంత మంది రైటర్స్ ఉండి రాసింది ఇదేనా అనిపిస్తుంది. పర్పస్ పక్కకి వెళ్ళిపోకుండా విలన్ తో హీరో కలవటం, ప్రశాంతం గా వెళ్ళిపోవటం. ఇదంతా ఒక ఎత్తు అయితే కాలనీ ఎలక్షన్ కి ఐటెం సాంగ్ పెట్టాలని క్రియేటివ్ థాట్ వచ్చిన వన్ అఫ్ ది టైలర్ ఎవరో కానీ పాదాభి వందనాలు చేసుకోవచ్చు. ఇంతలో హీరోయిన్ ప్రాబ్లం పెద్దది అవ్వటం, హీరో ఇన్వొల్వె అవ్వాల్సి రావటం ఒక పర్ఫెక్ట్ ఎలేవేషణ్ రాసుకున్నారు. పబ్ సీన్ కి, అక్కడ పడిన డైలాగ్ లకి, ఫైట్ కి అప్పటి వరకు పెట్టిన నస ని క్షమించేయ్యోచ్చు అనిపించేలా తీసారు. నేను భరిస్తేనే ఇలా ఉంది అంటే .. తెగిస్తే ఇంకా ఎలా ఉండేదో ఊహించుకో అని మొదలు పెడితే విజిల్ కొట్టని ఫాన్స్ ఎవరు? అక్కడ నుంచి ఇంటర్వెల్ వరకు సందేహాలు, సమస్య లు, ఒక కొత్త గ్రూప్ రావటం, హీరో కి ప్రాణాపాయం - వెరసి పర్ఫెక్ట్ కమర్షియల్ ట్రాక్ లో పడుతుంది సినిమా. అప్పుడు తెలుస్తుంది మనకి ఈయన నిజాయితి కి నిక్ నేమ్ అని. ఇదే టెంప్లేట్ లో ఫస్ట్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ నుంచి వచ్చిన ఎవరో ఒకరు నమస్కారం పెట్టడమో, కన్నీళ్లు పెట్టు కోవటమో జరుగుతూ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసేవి, ఆ ఫార్ములా ఎందుకు వదిలేసారో మన టైలర్స్

అప్పటి వరకు పెట్టిన నస వలన, అప్పుడు పడిన సీన్స్ మనకి ఆణిముత్యాలు లా కనపడతాయి, ఏదో ఉండబోతుంది అనే ఆశ రేపుతాయి,  అప్పటికే మనకి ఆల్రడీ ఫ్లాష్ బ్యాక్ ఉంది అని, ఇంకో హీరోయిన్ తో పాటలు ఉన్నాయి అని, మెయిన్ విలన్ ని ఇంకా మనం చూడలేదు అని తెలుసు కాబట్టి ఏ మాత్రం తీసినా చూసేయ్యోచు అనే నమ్మకం తో ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్ కొన్నుకొని సీట్ లో కుర్చోవచ్చు.

ఎక్కడ ఆగిందో అక్కడే మొదలు అయిన సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో కి వెళ్ళిపోతుంది. అసలు పాత్ర ఇంట్రడక్షన్ అదిరిపోతుంది. తన ఫ్యామిలి, బిజినెస్, ఎమోషన్స్, మరి ఆ రోజుల్లో "నాన్నగారు" డైలాగ్ లు ఒక రకమైన పాత ఫీలింగ్ ఏ కలిగించినా ఫ్లాష్ బ్యాక్ కి పర్ఫెక్ట్ స్టార్ట్ అనిపిస్తాయి. సొంత అన్నయ్య కి పెళ్లి ఈడుకి ఎదిగిన కూతురు ఉండి అంటే మిగతా లేడీస్ అందరు మన డ్యూడ్ ని ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడుగుతూ ఉంటె ఆయన సిగ్గు పడుతూ ఉంటారు. ఒక పక్క విలన్ తేలిపోగా, ఇంకో పక్క ప్రేమ థ్రెడ్ తేలిపోగా ఎటు పోతుందో తెలియని మూవీ నెమ్మదిగా పట్టు జారిపోతుంది. అంజలి లో పెళ్లి తతంగం చూసాక ఇంకా ఇది కోలుకునేలా లేదు అని డిసైడ్ అయిపోవాల్సి వస్తుంది. అక్కడ నుంచి సినిమా అయిపోయే వరకు, ఫస్ట్ హాఫ్ లో పడిన రేంజ్ సీన్ అయితే ఒకటి ఉంది - విలన్ తో కిడ్నాప్ థ్రెడ్ లో కాలు మీద కాలు వేసుకొని రఫ్ ఆడించిన సీన్ - ఇలాంటి ఎలేవేషణ్ లు, ఇంకా పవర్ ఉండాల్సిన సీన్స్ మిస్ అయ్యి ఫ్లాష్ బ్యాక్ ని ఎటు కాకుండా తెల్చేసాయి. తెలిసిపోయిన కథ కి, తేలిపోయిన కథనం తోడు అయ్యి మనం ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో నే ఉన్నాం అని గుర్తుకు వచ్చేసరికి వాచ్ చూసుకోవటం మన వంతు అవుతుంది. అంజలి కి తగిలిన గాయం తో మనం ప్రెసెంట్ లో కి వస్తాం

ఆక్ట్ 3: ముగింపు: అప్పటి వరకు అరచి అరచి పాపం డబ్బింగ్ చెప్పి బాలయ్య గుంతు కూడా బొంగురు పోయింది. ఎమోషన్ లేక రౌద్రం అంటే అరుపులు మాత్రమె కాదు అని ఎప్పుడు తెలుసుకుంటారో. ఫ్లాష్ బ్యాక్ ని అక్కడ కట్ చేస్తే మనం అంజలి బ్రతికి ఉండ చచ్చి పోయిందా అనే టెన్షన్ లో ట్విస్ట్ గా ఫీల్ అవుతాం అనుకున్నారు ఏమో కానీ చిట్టి చిట్టి గౌన్ సాంగ్ ట్రైలర్ లో చూసిన మనం అది నిజం గానే ట్విస్ట్ గా ఫీల్ అయ్యి ఆత్మ సంతృప్తి పొందాల్సిందే. బటన్స్ కూడా అయిపోయాక బట్టలకి ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్టు మళ్ళి మన డ్యూడ్ ఢిల్లీ వెళ్లి అందర్నీ అంతమొందిన్చాక కథ కంచికి ఎల్లిపోతుంది. 

చివరిగా : ఇంత మంది కలిసి కుట్టినా ఇంకా ఓపెన్ త్రేడ్ లు వదిలేసారు. మనం కూడా సోహన్ ఏమైనట్టు, లా అండ్ ఆర్డర్ ఎం చేస్తున్నట్టు లాంటివి ఆలోచించే అంత టైం స్పెండ్ చెయ్యం అనుకోండి. ఏది ఏమైనా డిక్టేటర్ లాంటి పవర్ఫుల్ టైటిల్ కి తేలిపోయిన లేడీ విలన్ అంటే ఎలా? విలన్ పవర్ఫుల్ గా ఉంటేనే కదా హీరో ఎంత పొటుగాడొ తెలిసేది. పండగక కి వచ్చిన మాస్ సినిమా అనే అడ్వాంటేజ్ తో, ఫాన్స్ ని పక్కన పెడితే, పైన చెప్పుకున్న మూడు నాలుగు సీన్స్, ఒక పది డైలాగ్ లు, మాస్ సాంగ్స్ అండ్ ఫైట్ లతో కొంత లో కొంత మాస్ ప్రేక్షకులని అలరిస్తుంది. సీజన్ హడావుడి లో కమర్షియల్ గా నేట్టుకేల్లిపోతుంది. ఈ సినిమాలో ఒక డైలాగ్ "నేను చేసే పనికి క్వచ్చిన్ మార్క్స్ ఉండవ్..  ఓన్లీ ఫుల్ స్టాప్". కానీ చేసే కథల్ని మాత్రం క్వచ్చన్ చెయ్యండి సర్ ప్లీజ్. 

నాకు ఈ పోస్ట్ కి పెట్టిన పోస్టర్ చాలా నచ్చింది... బోలెడు విషయం ఉంది అందులో 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సొంత పైత్యం: 
ఇంకా ఈ టెంప్లేట్ లో తీయటానికి స్కోప్ ఉందా? అని ఆలోచిస్తే ఈ కింద లైన్ తట్టింది. 

ఓపెన్ చేస్తే - హీరో ఒక ప్రైవేటు బస్సు లో కండక్టర్, కాలనీ నుంచి సిటీ కి బయల్దేరే బస్సు, కాలనీ వాళ్ళందరిలో ఒక ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోయే హీరో. ఏదో పండగ ఒక పాట. హీరో కి ఎక్కడ తమ వైఫ్ లు పడిపోతారేమో అని భయపడే అంకుల్స్ - రొమాంటిక్ కామెడీ. హీరోయిన్ అదే బస్సు లో రోజు వెళ్తూ ఉంటుంది. హీరో బస్సు వలన తమ బిజినెస్ పడిపోతుంది అని షేర్ ఆటోస్ వాళ్ళు గొడవ పెడతారు, హీరో క్లాసు పీకి బుద్ది చెప్తాడు. కండక్టర్ అంటే చీప్ అనేలా కాలనీ వాళ్ళు ఇమేజ్ డామేజ్ చేద్దాం అని ప్లాన్ చేస్తారు - "తన పండుగలు కూడా మానుకొని మీ పండగలకి మిమ్మల్ని మీ ఇంటి వాళ్ళ దగ్గరికి చేర్చే వాడేరా కండక్టర్ " - అని డైలాగ్. దెబ్బకి హీరోయిన్ ఫ్లాట్ ఒక సాంగ్. ఇంతలో ఒక రోజు నైట్ హీరో హీరోయిన్ డ్రైవర్ మాత్రమె వస్తున్నా బస్సు లో తాగేసి ఎక్కినా కొందరు రేప్ చెయ్యబోతే, వద్దు వద్దు అని బ్రతిమాలిన హీరో కోపం తో గేర్ రాడ్ విరిచేసి అక్కడే చంపేస్తాడు. చచ్చింది లోకల్ కమీషనర్ అండ్ మినిస్టర్ కొడుకులు - హీరో ని చంపెయ్యమని - ఎన్కౌంటర్ పోలీస్ ని పంపిస్తారు, అమ్మాయిని సేవ్ చేసిన న్యూస్ పేపర్ లో చూసి స్టేట్ లో ఉన్న అన్ని జిల్లాల నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మాన్ లు, అతి పెద్ద బిజినెస్ టైకూన్, సిటీ కి వచ్చేస్తారు. షూటింగ్ టైం లో ఫైట్ హీరో కి గాయం. కమీషనర్ కి చెప్తారు, అయన కండక్టర్ కాదు "ప్రేమకి పెట్ నేమ్, మానవత్వానికి మొనికేర్, ఎదురులేని ఎపితేట్" అని. ఇంటర్వెల్. 

ఫ్లాష్ బ్యాక్ లో చిన్నప్పుడే ఇంట్లో అన్నయ్య ల చదువు కోసం క్లీనర్ గా మారి డ్రైవర్ గా ఎదిగిన హీరో అన్నయ్య ని ప్రయోజకుడిని చేస్తాడు. ఒక సాంగ్. పండగలకి ప్రైవేటు బస్సు లు వసూల్ చేస్తున్న ఎక్స్ట్రా టికెట్ చార్జీలు, డిమాండ్ మీట్ అవ్వలేక పోతున్న RTC కష్టాలు చూసి ప్రైవేటు బస్సు సర్వీస్ RTC  కంటే చీప్ రేట్ లో మొదలు పెడతాడు. స్టేట్ మొత్తం మీద డ్రైవర్ లే ఓనర్ లు అనే నినాదం తో ఒక సంస్థ గా ఎదుగుతాడు. RTO బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇలా లంచగొండి వాళ్ళకి, మెయిన్ విలన్ కి బుద్ది చెప్పి రోల్ మోడల్ గా ఎదుగుతాడు. ప్రైవేటు ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మెయిన్ విలన్. తన బస్సు లో హీరోయిన్ కండక్టర్, ఒక రోజు డ్రైవర్ కి వొంట్లో బాగోక పోతే హీరో డ్రైవర్ గా వస్తాడు, కండక్టర్ ని ప్రేమిస్తాడు. హీరో సింపుల్ సిటీ కి హీరోయిన్ కూడా ప్రేమిస్తుంది - సాంగ్. కట్ చేస్తే పెళ్లి. హనీమూన్ కి మొత్తం ఫ్యామిలీ తో  తన సొంత బస్సు లో వెళ్తున్న హీరో పై ఎటాక్, హీరోయిన్ చచ్చిపోతుంది. నీ వల్లే ఇదంతా అని అన్నయ్య లు వెలి వేస్తారు. ఎం చెయ్యాలో తోచక వేరే ప్లేస్ కి వచ్చేసి, తన సొంత సంస్థ లోనే  హీరోయిన్ చేసిన కండక్టర్ జాబు చేస్తూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది, ఫస్ట్ హీరోయిన్ తో క్లైమాక్స్ సాంగ్ అండ్ అందరు విలన్స్ కి హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి బుద్ది చెప్తాడు. 


ఈ కథ కి టైటిల్ మీరే ఫిక్స్ చెయ్యండి. 




2 comments:

aditya said...

hahha climax lo Conductor story endhi Baa :D

navvaleka saccha esp తన పండుగలు కూడా మానుకొని మీ పండగలకి మిమ్మల్ని మీ ఇంటి వాళ్ళ దగ్గరికి చేర్చే వాడేరా కండక్టర్"" ee line matram ROFL asalu :D

Baa naa valla kaadhu SBDB lo esestunan emi anukoku ye :) :D

vicky said...

super fun article boss

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views