కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - పవన్ కళ్యాణ్ - ఒక విశ్లేషణ


కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - పవన్ కళ్యాణ్ - ఒక విశ్లేషణ

అది వేసవికాలం - 2003, ధియేటర్ లో ఫాన్స్ కి పూనకాలు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ సినిమా ఉన్న రోజులు, యూత్ లో క్రేజ్ అనే పదానికి ప్రతీకగా పవన్ కళ్యాణ్ కి ఫాలోయింగ్ ఉన్న రోజులు, అంచనాలకి "ఆకాశమే హద్దు" లాంటి పదాలు కాకుండా కొత్త నిర్వచనాలు ఎంచుకుంటున్న రోజుల్లో, మాములుగా ప్రతి సినిమాలో రెండు మూడు సీన్స్, సాంగ్స్ తీస్తుంటేనే అరాచకాలు జరుగుతుంటే  ఫస్ట్ టైం సొంతం గా అఫీషియల్ గా దర్శకత్వం చెయ్యబోతున్న సినిమా అంటే ఎలా ఉండి ఉంటుంది?. రెండేళ్ళ నిరీక్షణ, కేక పెట్టించిన పాటలు, అద్బుతాలు చేసిన పబ్లిసిటీ, టికెట్ ముక్క ఖాయం చేసుకోటానికి నిద్ర లేని రాత్రులు, అభిమానుల ఆశలు, ప్రేక్షకుల అంచనాలు, కొన్న వాళ్ళ నమ్మఖాలు,న భూతో న భ‌విష్య‌తి అనిపించిన సంబరాల మద్య రిలీజ్ అయిన "జాని" మొట్ట మొదటి షో నుంచే ఎకగ్రీవ "డిజాస్టర్" టాక్ తెచ్చుకుంది. విశ్లేషకులు విరుచుకు పడ్డారు, దురభిమానులు పండగ చేసుకున్నారు, అభిమానులు భంగపడ్డారు, కొంత మంది మాత్రం మెచ్చుకున్నారు. కొన్ని సినిమాలు కమర్షియల్ గా ఆడక పోయినా కల్ట్ సినిమాలు గా మిగిలిపోతాయి, కాని నాకు తెలిసినంత వరకు జాని విషయం లో అది కూడా జరగలేదు. ఇంతటి ఘోరమైన ఫెయిల్యూర్ కి కర్త కర్మ క్రియ (కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం) గురుంచి విశ్లేషించుకునే ప్రయత్నమే ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం. రెగ్యులర్ గా వ్రాసే  విశ్లేషణలు, రివ్యూస్ లా కాకుండా, మన బ్లాగ్ లో ఉన్న "సినిమా సినిమా సినిమా" ఆర్టికల్స్ లో కంటెంట్ పరం గా విశ్లేషించుకుందాం. మరి కొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కథ స్క్రీన్ ప్లే అందించిన సర్దార్ మన ముందుకి రాబోతుంది కాబట్టి, ఒకప్పటి ఆ వర్క్ గురుంచి ఇప్పుడు కాక ఇంకెప్పుడు మాట్లాడతాం అని ఇది మొదలు పెట్టడం జరిగింది.

ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం అని గమనించగలరు.

కథ: ఈ సినిమా కథ ని రెండు మూడు వెర్షన్స్ లో చెప్పుకోవచ్చు. ఒకటి - చిన్నప్పుడే తల్లి చనిపోయి, తండ్రి పట్టించుకోక పోవటం వలన అనాధ గా పెరిగిన పేద అబ్బాయి లైఫ్  లో కి అమ్మాయి వస్తే? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని భవష్యత్తు గురుంచి ఎన్నో కలలు కంటున్న టైం లో ఆ అమ్మాయి కి కాన్సర్ ఉందని తెలిస్తే? తనని బ్రతికించు కోవటం కోసం ఎంత దూరం వెళ్ళాడు? రెండు - జాని అనే వ్యక్తి జీవితం లో మూడు దశలు, చిన్న తనం లో తల్లి చని పోవటం, తండ్రి నుంచి దూరం గా వచ్చెయ్యటం, తన కాళ్ళ మీద తను నిలబడి ప్రేమించి పెళ్లి చేసుకోవటం, పెళ్లి అయిన తర్వాత వైవాహిక జీవితం, కష్టాలు, పోరాటాలు. ఎలా చెప్పుకున్నా, మనకి తెరపై చూపించిన మూడు గంటల డ్రామా లో కనిపించే కథ అయితే మాత్రం "అనాధ అయిన జాని మార్షల్ ఆర్ట్స్ నేర్పుతూ ఉంటాడు, ఇంకో అనాధ అయిన గీత టీచర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. గీత కి బ్లడ్ కాన్సర్ అండ్ ట్రీట్మెంట్ కి బోలెడు డబ్బులు అవసరం. ఫైట్ లు చేసి డబ్బులు సంపాదిస్తాడు జాని". ఈ కథ లో కళ్యాణ్ ని అంత కదిలించిన పాయింట్ ఏంటి అనేది అంతుబట్టని విషయం. కానీ ఈ కథ ద్వారా తను చెప్పాలి అనుకున్న మెసేజ్ అయితే మాత్రం క్లియర్. "ఎన్ని కష్టాలు వచ్చినా, వెలుగు ఆరని సంకల్పం మన గుండెల్లో ఉంటె, చావునైన జయించవచ్చు" - ట్రై హార్డ్, డోంట్ లూస్ హోప్.

తెలుగు సినిమా కథ వరకు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు (ఇక్కడ చెప్పినట్టు)  - వినోదం/ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ వాల్యూస్, తెలుగుదనం/నేటివిటీ అండ్ ప్రేక్షకుడు.

ఈ సినిమా విషయం లో కళ్యాణ్ లోని స్టొరీ రైటర్ మిస్ అయిన అంశాలు ఏంటి అంటే? సందేశాత్మక సినిమా అయినా వినోదం తో పాటు చెప్పాల్సిందే, అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ సరైన మోతాదులో లేకపోతే? కష్టాలు, కన్నీళ్లు కమల్ సినిమా లో ఓకే కానీ కళ్యాణ్ సినిమాలో ఉంటె? పోనీ ఏదో కొంచెం సేపు అనుకుంటే పర్లేదు, సినిమాలో సగానికి పైగా అవే ఉంటె?

కమర్షియల్ వాల్యూస్/ప్రేక్షకుడు - హీరో ఇమేజ్ కి తగ్గట్టు గా కథ ఉండాలి. అప్పటి వరకు మనం చూసిన కళ్యాణ్ వేరు, జాని లో కళ్యాణ్ వేరు. పోలీస్ స్టేషన్ లో ఎవడెవడో చాచి పెట్టి కొడుతుంటే అయన ఇచ్చిన రియాక్షన్ కి రక్తం మరిగిపోయిన ఫాన్స్ ఉన్నారు. ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ? సినిమా మొత్తం ఒక రకమైన సూన్య భావం తో మొహం. అసలు కళ్యాణ్ సినిమా నుంచి ఎవరు అయినా ఎం ఆశిస్తారు అనేది ఈ కథ వ్రాసే ముందు బేరీజు వేసుకున్నారో లేదో ?

తెలుగుదనం/నేటివిటీ: సగానికిపైగా సినిమా లో అందరు హిందీ (హైదరాబాది / ముంబై) మాట్లాడుతూ ఉంటారు.  తెలంగాణా యాస ఎక్కడ చూసినా కనిపిస్తుంది. రియాలిటీ కి దగ్గరగా ఉంటుంది అని మనకి తెలిసిన పాత్రలు అయిన తిరుపతి ప్రకాష్ లాంటి వాళ్ళతో కూడా హిందీ లో మాట్లాడించారు. అర్ధం అవ్వక సగం మంది, సరిగ్గా వినపడక సగం మంది విసుక్కున్నారు. పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ లు తెలుగు మాట్లాడినా మేము అడగము కాని తెలుగు సినిమాలో హిందీ డామినేషన్ ని భరించలేక పోయాము. తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక పెద్ద స్టార్ (కమర్షియల్) హీరో సినిమా లో మాత్రం రియాలిటీ కంటే నేటివిటీ ముఖ్యం.

కథని పక్కన పెట్టి పాత్ర చిత్రణ గురుంచి చెప్పుకుంటే, ఇక్కడ జస్ట్ ప్రశ్నలు మాత్రం వదిలేస్తున్నా, జస్ట్ అలోచించి చూడండి, సినిమా థీమ్ కి ఈ క్యారెక్టర్ డిజైన్ కి ఉన్న సంబంధం? ఇలా లేక పోతే వచ్చే నష్టం? అసలు ఇలా ఉండటానికి గల కారణం? (ఇవన్ని ఎంత డిటైల్డ్ గా ఎస్టాబ్లిష్ చేస్తే అంత బాగా ఆ పాత్ర తో ట్రావెల్ చెయ్యగలం). కథ లో హీరో లక్ష్యం ఏంటి? అసలు హీరో లక్ష్యం కి బ్యాక్ గ్రౌండ్ అనగా మోటివేషన్ ఏంటి? అసలు ఆ గోల్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ప్రతికూలత ఎంత స్ట్రాంగ్ ? దానిని హీరో అధిగమించిన విధానం ఎంత అద్బుతం గా చెప్పబడింది? జాని క్యారెక్టర్ ని ఎనాలిసిస్ చేస్తే పై ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది.

స్క్రీన్‌ప్లే: అంతకు ముందు వచ్చిన కళ్యాణ్ బ్లాక్ బస్టర్  సినిమాలలో బాగా రెస్పాన్స్ వచ్చిన అంశాలు ఏంటి? ఫైట్ లు, పాటలు బాగా తీస్తాడు, సొంతం గా బిట్ సాంగ్స్ పాడతాడు, అమ్మాయిలని ఏడిపించే వాళ్ళ కి తన స్టైల్ లో బుద్ధి చెప్తాడు, ఎక్కడో ఒక దగ్గర చిరంజీవి రిఫరెన్స్ ఉండాలి, కామెడీ అండ్ మేనరిజంలు పండాలి. అవన్నీ పండిన రోజు ఎవరు కథ గురుంచి మాట్లాడలేదు. ఈ సినిమాలో కూడా పైన చెప్పుకున్న అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి  కానీ ఇంతకు ముందు పవర్ స్టార్ సినిమాలో ఉండాల్సిన ఎనర్జీ లేదు అందుకే అవేవి కూడా పెద్దగా అలరించలేదు. ఈయన సినిమా లో ఎనర్జీ అనేది కూర లో ఉప్పు లాంటిది.  ఇక అసలు విషయానికి వస్తే, ఇలాంటి కథ ని ఎంచుకున్నప్పుడు జనరల్ గా ఫాలో అయ్యే స్క్రీన్ ప్లే విధానం అయితే ఫోర్ షాడొయింగ్ - ఉదాహరణ కి ఖుషి టైపు లో ముందుగానే ఈ కథలో ఏముంటుందో చెప్పెయ్యటం, దాని వలన ప్రేక్షకుడు ప్రిపేర్ అవుతాడు, మనం చెప్పిన విధానం కి అనుగుణం గా అంచనాలు పెట్టుకుంటాడు. కనీసం గౌతం మీనన్ టైపు వాయిస్ ఓవర్ అయినా ఫాలో అయ్యి ఉండాల్సింది. దాని వలన సినిమా లో కథానాయకుడు చెప్పేదే స్టొరీ అవుతుంది, అన్ని మనకి చెప్పాలి అని లేదు కాబట్టి తనకి కావాల్సింది మాత్రమె చెప్పుకొని కథ ని కథనం ని రక్తి కట్టించవచ్చు. ఇక్కడ మాత్రం ఒక ప్లైన్ నేరేషన్ ని ఎంచుకున్నారు. 

చిన్నప్పటి ఎపిసోడ్స్ అయిన తర్వాత - ఒక బర్డ్, రన్నింగ్, కర్చీఫ్ - జాని గా పవన్ ఎంట్రన్స్. పవర్ఫుల్ ఎంట్రన్స్ అయిన తర్వాత బాస్కెట్ బాల్, కట్ చేస్తే పోలీస్ స్టేషన్, ఇంకెప్పుడు నాకు కనపడకు అని తండ్రి వార్నింగ్. అక్కడితో రఘువరన్ గారి థ్రెడ్ అయిపోనట్టే. మళ్లీ ఫ్యామిలీ తో కలవాలి అనే ఆశయం కాని లక్ష్యం కాని జాని కూడా లేవు, ఎక్కడ తాపత్రయ పడుతునట్టు కూడా కనిపించడు. మరి అసలు వీడి లక్ష్యం ఏమిటి? ఒక అరగంట అయ్యాక హీరోయిన్ ఎంట్రన్స్. అర్ధం కాని కరాటే సత్తి కామెడీ ఫైట్ - ఇది జస్ట్ ప్లాంటింగ్. మళ్లీ బాస్కెట్ బాల్, అమ్మాయిని ఏడిపించిన వాడికి బుద్ధి చెప్పటం, వెరసి హీరోయిన్ తో పరిచయం (మద్య లో మళ్లీ బాస్కెట్ బాల్). అప్పటి వరకు దారి తెన్ను లేని జీవితానికి ఒక ఆశ, ఒక కోరిక, ఒక ప్రేమ. ఇంతలో లింగం సాంగ్, సదరు పండుగ సాంగ్. ఎడిటింగ్ కొంచెం అసమగ్రం గా ఉండటం వలన, సీన్స్ మద్య ఒక్కో సారి లింక్ లు ఉండవ్, అసలు కొన్ని సీన్స్ ఎంతకీ అవ్వవ్. నటులు రియాక్ట్ అవ్వరు, ఒక్కోసారి ఎవరో కొట్టినట్టు స్పందిస్తారు. ఏ మాట కి ఆ మాట సినిమా మొత్తానికి సదరు పండుగ సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ పవన్ ఇంతకు ముందు సినిమాలకి వచ్చిన రెస్పాన్స్ కి పది రెట్లు ఎక్కువ. అసలు ఇది కదా మాకు కావాల్సిన ఎమోషన్ అనే రేంజ్ రెస్పాన్స్. కట్ చేస్తే, లవ్ ప్రోపోజల్, సాంగ్, పెళ్లి ప్రోపోజల్, కరాటే సత్తి ఫైట్ (మొదట్లో వేసిన ప్లాంట్ కి పే ఆఫ్), పెళ్లి - ఇంటర్వెల్. అసలు తెలుగు సినిమా వరకు ఇలాంటి ఇంటర్వెల్ అనేది ఒక షాక్. శుభం కార్డు వేసేసినా కూడా నష్టం లేని బ్లాక్. అప్పటి వరకు ఓపెన్ ఐటెం అనేది లేని ఫస్ట్ హాఫ్, విలన్ ఆట కట్టించేసాక, పెళ్లి కూడా అయిపోయాక ఇంకా ఎం ఉంది ఈ సినిమాలో అనే షాక్. కనీసం ఇంట్రెస్ట్ కలిగించలేని విధం గా మలచిన ఇంటర్వెల్ కి నిదర్సనం.  

ఇంటర్వెల్ అయ్యాక లవ్ సాంగ్, రావోయి మా ఇంటికి బిట్ సాంగ్, అప్పటికప్పుడు గుర్తొచ్చిన పెళ్లి, పెళ్లి సాంగ్ అంటూ ఒక క్లారిటీ వచ్చాక హీరోయిన్ కి కాన్సర్. ఇప్పుడే కదా లైఫ్ సంతోషం గా ఉంది అనుకునే టైం లో, ఈడి జాతకం ఏంటో, ఈ టికెట్ కొనుకున్న మన జాతకం ఏంటో అనుకునే రేంజ్ ట్విస్ట్. ఏదో ఉంది అని అప్పటికే ఆసలు వదిలేసుకున్న ప్రేక్షకులకి, అప్పటి వరకు ఫస్ట్ గేర్ లో వెళ్తున్న సినిమా యాక్షెలెరెటర్ తెగిపోయిన ట్విస్ట్. డబ్బులు లేని దారిద్యానికి కాన్సర్ రోగం వస్తే? ముంబై వెళ్ళాలి, అక్కడ ఇంట్లో తప్ప తెలుగు మాట్లాడే అవసరమే ఉండదు. పనిలో పని మరాఠీ డైలాగ్స్ వాడేసి ఉంటె రియాలిటి కి ఇంకా బ్యూటీ వచ్చేది, హిందీ తో సరిపెట్టేసారు. అలీ వచ్చి అలరించింది అయిదు నిమిషాలు అవ్వగా, యాక్షన్ మోడ్ కి ఎంటర్ అవుతుంది. వరస ఫైట్ లు, వరస విజయాలు, మద్య లో నీరసం, భగవంతుడా అనుకునేలోపు హాస్పిటల్ బెడ్ పై పడిపోయిన జాని. ఒక అమర కావ్యం గా మిగిలిపోతుంది అని భయపడే లోపు మళ్లీ బర్డ్, పరుగు, రమణ గోగుల సాంగ్, జాని కర్చీఫ్. ఆ లాస్ట్ లో వచ్చే సాంగ్ లిరిక్స్ ఈ ఈ సినిమా సారంశం. వీలైతే ఒకసారి వినండి. 

నీరసమైన కథ కి పేలవమైన కథనం తోడు అవ్వటం తో, రజిని కాంత్ గారు సాగర సంగమం చేసినట్టు, చిరంజీవి గారు గీతాంజలి చేసినట్టు, పవన్ కళ్యాణ్ గారు జాని ని తయ్యారు చేసి వదిలారు. కల్ట్ సినిమా గా ఆయినే మిగిలిపోయే అవకాశం ఈ సినిమా కి రాక పోవటానికి కారణం కూడా కథ - స్క్రీన్ ప్లే లో జరిగిన పొరపాట్లే అని నా అభిప్రాయం.


దర్శకత్వం: ఈ సినిమా వరకు పవన్ కళ్యాణ్ మనల్ని ఇంప్రెస్స్ చేసిన సెక్షన్ అంటే ఇదే. దర్శకుడి గా తన శైలి చూపించి మురిపించాడు. ఫ్రేమింగ్, షాట్ డివిజన్, కలర్స్, చెప్పి చేయించుకున్న సినిమాటోగ్రఫీ, సాంగ్స్ టేకింగ్, లాంటి విషయాలలో ప్రతిభ కనపరచి తన కలని వెండి తెరపై ఆవిష్కరించాడు. కొన్ని మొదట్లో అర్ధం కాక పోయినా రిపీట్ లో చూసినప్పుడు సూపర్ గా అనిపించే సీన్స్ ఉంటాయి. స్టార్ హీరో హోదా ని పక్కన పెట్టి క్రియేటివ్ నెస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. చేసే పని రిజల్ట్ గురుంచి అలోచించి ఉంటె అలా చేసేవాడు కాదేమో. బాస్కెట్ బాల్ సీన్స్ ద్వారా కూడా ఏదో చెప్పటానికి ట్రై చేసాడు ఏంటి అనేది అర్ధం కాలేదు కానీ ఆ సీన్స్ లో పవన్ ఫుల్ జోష్ లో ఉంటాడు. ఫస్ట్ లో వొడిపోయినప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళటం, తర్వాత గెలిచినప్పుడు హీరోయిన్ పరిచయం అవ్వటం ఇలా ఏదో లింక్ అయితే ఉంది . మాంటేజ్ సాంగ్స్ తీసిన విధానం సూపర్. ముఖ్యం గా కాన్సర్ తెలిసిన తర్వత హేండిల్ చేసిన సీన్స్, ఎమోషన్స్ అన్ని చక్కగా కుదిరాయి. కానీ సహనం ని పరీక్షించాయి అంతే. అసలు హీరో హీరోయిన్ ని కలిపింది జాని అమ్మ అని అనిపించేలా ఎంతో ఇష్టమైన కర్చీఫ్ పోవటం అది హీరోయిన్ కే దొరకటం లాంటి సీన్స్ ఆలోచిస్తే చాలా ఉన్నాయి సినిమాలో. ఆర్ట్ సినిమా కంటెంట్ ని, కమర్షియల్ వాల్యూస్ తో బాలన్స్ చేస్తూ స్టార్ హీరో గా మెప్పించటం అనేది తలలు పండిన అనుభవం ఉన్న వాళ్ళకే కత్తి మీద సాము అనటం చాలా చిన్న పదం. ఆ ప్రాసెస్ లో ఫెయిల్యూర్ లేక సక్సెస్ ని పక్కన పెట్టి ప్రయత్నాన్ని అభినందించటం తప్ప ఏమి చెయ్యలేం. కథ, కథనం విషయం లో ఫెయిల్ అయిన కళ్యాణ్ దర్శకుడిగా మంచి మార్క్స్ వేయించుకోవటం ఒక్కటే జాని విషయం లో ఊరట.

మళ్లీ వేసవి కాలం - 2016. గోపాల గోపాల లో రోల్ పక్కన పెడితే అత్తారింటికి దారేది వచ్చి త్రీ ఇయర్స్, జన సేన అంటూ జనంలోకి వచ్చి 2 ఇయర్స్, గబ్బర్ సింగ్ అంటూ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టి, ఒకప్పటి ఎనర్జీ ని చూపించి మళ్లీ ఫాం లోకి వచ్చిన తర్వాత దానికి కొనసాగింపు గా అన్నట్టు తనే కథ స్క్రీన్‌ప్లే అందించి సర్దార్ గబ్బర్ సింగ్ గా రాబోతున్నాడు. ట్రైలర్ అండ్ పోస్టర్స్ అండ్ సాంగ్స్ ప్రోమోస్ చూస్తుంటే - ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి లాంటి సెంటిమెంట్స్ పెట్టుకోకుండా - జనాదరణ పొందిన కాన్సెప్ట్ ని నమ్ముకున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. కథ - కథనం లో ఒక సారి ఫెయిల్ అయినా దర్శకుడిగా మంచి మార్క్స్ పొందిన దర్సకత్వం వదిలేసి రైటర్ గా ప్రూవ్ చేసుకోవాలనుకొనే ప్రయత్నానికి ఇప్పటికి అల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, మిగతాది సినిమా వచ్చాక మాట్లాడుకుందాం.


1 comments:

pk bhakthudu said...

kerchief concept highlight, mee review chadivakane telisindi andi inko sari choostha cinema ippudu

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views