సరైనోడు - కథ కథనం - విశ్లేషణ



సరైనోడు - కథ కథనం - విశ్లేషణ

అల్లు అర్జున్ / బన్నీ కెరీర్ లో బాగా బాలన్స్ గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. మొదటి నుంచి కూడా ఒక క్లాసు/యూత్ సినిమా, ఒక లవ్/ఫ్యామిలీ స్టొరీ, ఒక మాస్ సినిమా, మద్య మద్య లో గెస్ట్ రోల్స్ అనే టైపు లో, అన్ని రకాల ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగా ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎంతో మందికి కష్టమైన ఫ్యామిలీ ప్రేక్షకులకి ఆల్రెడీ దగ్గర అయిపోయాడు. యూత్ లో ముందు నుంచి స్టైలిష్ స్టార్ ఇమేజ్ ఎలాగు ఉంది. ఇంకా మాస్ అంటారా? ఎప్పుడు దగ్గర అయ్యాడో ఎలా అయ్యాడో తెలియదు కానీ,  బన్నీ, దేశముదురు నుంచి బద్రీనాథ్ మీదుగా ఇప్పుడు సరైనోడు వరకు సినిమా బన్నీ చేసిన మాస్  సినిమాల టాక్ కి కలెక్షన్స్ కి సంబంధం ఉండటం లేదు.  ప్రతి హీరో కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, బన్నీ కూడా ఉన్నాయి, అయినా కూడా ఒకే రకమైన మూసలో పడిపోకుండా సినిమా సినిమా కి వైవిద్యం చూపిస్తూ అలరిస్తున్నాడు. మొత్తం మీద ఒక కంప్లీట్ హీరో గా ఎదిగిపోతున్నాడు. ఈసారి ఏకంగా ఊర మాస్ అని చెప్పి మన మాస్ మసాలా బోయపాటి గారితో సరైనోడు గా వచ్చాడు. బన్నీ బాడీ లాంగ్వేజ్ కి బోయపాటి సరైనోడా? బోయపాటి లౌడ్ సినిమాలకి బన్నీ సరైనోడా? అసలు ఇది సరైన కాంబినేషన్ ఏనా? ఈ సినిమా వచ్చిన ఇన్నిరొజులకి ఇదంతా మాట్లాడుకోవటం సరైన విషయమేనా? ఈ సినిమా కి వచ్చిన టాక్ సరైనదేనా? చూపెడుతున్న కలెక్షన్స్ సరైనవేనా :) ? లాంటివి కాకుండా  ఈ సినిమా కథ కి ఈ కథనం ఎంత వరకు సరైనది? విశ్లేషించుకుందాం.......  

కథ : కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక, వాళ్ళని కొట్టి అయినా నష్టపోయే వాళ్ళకి న్యాయం చేసే కొడుకు, పెళ్లి అయితే దారిలో పడతాడు అని ఫ్రెండ్ కూతురు ని చూసి రమ్మని పంపిస్తాడు తండ్రి. వెళ్ళిన హీరో అక్కడ ఆపద లో ఉన్న ఆమెని కాపాడతాడు, కానీ తనకి తెలియకుండా తను ఇంకా పెద్ద ఆపద లో చిక్కుకుంటుంది, తనని వెతుక్కుంటూ వస్తుంది. దానికి కారణం అయిన విలన్ ఆట కట్టించి, అప్పటి వరకు విలన్ చేస్తున్న అక్రమాలకి అడ్డు తగిలి వాడిని అంతమోదించిన సరైనోడి స్టొరీ ఏ ఈ కథ. ఇదే కథ ని వన్ లైన్ లో బేసిక్ పాయింట్ గా చెప్పుకోవాలి అంటే "పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఉండి, జనాల భూములు లాక్కుంటూ, అడ్డం వచ్చిన వాళ్ళని చంపేసే విలన్ కి సరైనోడు ఎదురైతే...."

ఈ మద్య కాలం లో ల్యాండ్ గ్రాబింగ్ గురుంచి చాల సినిమాలు వచ్చాయి, బాగా రొటీన్ అయిన కథాంశం అయిపొయింది. జనరల్ గా మాస్ సినిమాల నుంచి మాస్ ప్రేక్షకులు అద్బుతమైన కథలు ఆశించరు, బేసిక్ ఎమోషన్ తో కనెక్ట్ అయ్యి హీరోయిజం ఉండే ఎపిసోడ్స్, దమ్మున్న డైలాగ్ లు, కొంచెం కామెడీ, మంచి ఫైట్ లు, అలరించే సాంగ్స్ ఉంటె చాలు. అది బోయపాటికి తెలియని విషయము కాదు. మరి ఈ కథ చుట్టూ అల్లిన కథనం ఎలా ఉంది అంటే........   


కథనం : కమర్షియల్ సినిమాలలో పెద్దగా లాజిక్లు ఉండవ్, సినిమాటిక్ లిబర్టీస్ కామన్ - కానీ ఏదైనా మోతాదు మించిపోతే నిట్టూర్పే

ఆక్ట్ 1 : ప్రారంభం: మెయిన్ పాత్రల పరిచయం తో ప్రారంభం అవుతుంది. శక్తివంతమైన విలన్ గా CM రెడ్డి గారి అబ్బాయి (మరి మన యువనేత ని మైండ్ లో పెట్టుకునట్టు అనిపిస్తుంది కొంచెం), ఒక మర్డర్ చేసి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలియ చెప్తాడు. అలాగే తనకి న్యాయం అనిపిస్తే ఎంత దూరం అయినా వెళ్ళే పాత్ర తో హీరో ఇంట్రడక్షన్. వీళ్ళిద్దరి మద్య వైరం ఈ సినిమా అనేది మనకి ఫస్ట్ రీల్ లో నే అర్ధం అయ్యేలా చెప్పేసారు. అక్కడ నుంచి అసలు వీళ్ళిద్దరూ ఎదురు పడితే ఎలా ఉంటుంది అనే ఉత్సాహం కలిగించినా ఆ సందర్భం ని మాత్రం లాస్ట్ వరకు సాగదీసారు. ముందు సీన్స్ కి కొనసాగింపు గా, సాయికుమార్ అండ్ ప్రకాష్ కలిసే సీన్, పెళ్లి సంబంధం గురుంచి ప్రస్తావన, హీరో మిలిటరీ నుంచి వచ్చేసాడు అని చెప్పించటం తో పరిచయ భాగం వరకు ఒక ఇమేజ్ సెట్ చేసారు సినిమాకి. ఎంత CM కొడుకు అయితే మాత్రం చీఫ్ సెక్రటరీ అండ్ మిగతా అధికారులు కూడా అంత వణికి పోతారా? అది ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా పవర్ కి? బోయపాటి బాగా వీక్ అయిన కామెడీ సెక్షన్ పై కొంచెం శ్రద్ధ పెట్టినట్టు ఉన్నారు, కొంచెం ఎక్కువ సమయమే కేటాయించారు, ఒకటి అరా నవ్వుల తప్ప పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది లెండి. 

ఆక్ట్ 2 : ఉప కథ : సమస్యాత్మకం: తన పెళ్లి చూపులకి వెళ్తూ వేరే అమ్మాయిని చూసి పడిపోవటం, MLA తో ప్రేమ పేరుతో చేసిన స్టాకింగ్, విసుగు తెప్పించటమె కాకుండా సహనం ని పరీక్ష చేసే వరకు వెళ్తాయి. మెయిన్ హీరోయిన్ తప్ప అందరు మన ముందు ఉంటారు. అసలు మెయిన్ హీరోయిన్ రకుల్ అయినప్పుడు ఈ MLA థ్రెడ్ ఇంత సేపు ఎందుకు పెట్టారు అనేది అంతుచిక్కని ప్రశ్న. ఇంక హోప్స్ అన్ని ఇంటర్వెల్ మీదనే అనుకునే టైం కి మంచి కోర్ట్ సీన్ అప్పటి వరకు ఉన్న అసహనం కి రిలీఫ్ అండ్ సినిమా పై ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. అటు వంటి హై ఇంటెన్సిటీ సీన్ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అనుకునే టైం కి ఒక సింపుల్ ఫైట్ తో తేల్చేసారు. ఆ తర్వాత అయినా సుమన్ గారి పార్టీ లో హీరో కి విలన్ కి ఫస్ట్ ముఖాముఖీ కలిగించటానికి సరైన ముహూర్తం ఇదే అని ఫీల్ అయ్యే టైం కి MLA తో సరసాలు డ్యూయెట్ లు ట్రాక్ ని పక్కన పడేసాయి. ఇంక ఇంటర్వెల్ ఈ దిక్కు అనుకునే టైం కి, బోయపాటి దమ్ము స్టైల్ టెంపుల్ దగ్గర కి షిఫ్ట్ అవుతుంది. బీబత్సమైన యాక్షన్ ఎపిసోడ్, హీరోయిజం, అరపులు, గోలలు, పేపర్లు పక్కన పెడితే, అసలు ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటి? అంతకు ముందు ఏమయ్యింది? ప్రేమించిన అమ్మాయి కి ఇవ్వాల్సిన మాట కూడా కాదు అనుకోని ఎందుకు ఫైట్ చేస్తున్నాడు? ప్రేక్షకుడు కి మినిమం అవగాహన ఉండదు.  అలాంటి సీన్ ఎంత ఇంటెన్సిటీ ఉన్నా కూడా మైండ్ లో రిజిస్టర్ అవ్వదు. అంత ఇంపార్టెంట్ ఘట్టం వెనక స్టొరీ ఏంటి అనేది హీరో కి హీరోయిన్ కి మాత్రం తెలిస్తే చాలా? ఎం చూపెట్టిన చూసేస్తారా? దమ్ము అయినా, లెజెండ్ అయినా, సింహ అయినా సినిమా లో ఇంటర్వెల్ టైం కి అక్కడ పరిస్థితులు మనకి బాగా తెలుసు, ఇక్కడ  కనీసం ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు కూడా హింట్ ఇవ్వలేదు. అటు విలన్ పాత్రని పెద్దగా బహిర్గతం చెయ్యలేదు, సాయి కుమార్ ఏమైపోయాడో చూపించలేదు, ఇవన్ని మానేసి మనకి సాంబార్ కామెడీ, లవ్ ట్రాక్ లు వేసి నస పెట్టారు. హోప్స్ ఎప్పుడు ఉండే ఇంటర్వెల్ ఎపిసోడ్ తేలిపోవటం తో, ఫస్ట్ ఫైట్ - కోర్ట్ సీన్ - ఇంటర్వెల్ ఫైట్ తప్ప ఫస్ట్ హాఫ్ లో ఏమి ఉన్నట్టు మనకి అనిపించదు. కనీసం ఎం జరిగి ఉంటుంది అని ఆలోచించే కుతూహలం కూడా ఉండదు. ఇంటర్వెల్ సీన్ చూసాక మనకి కీరవాణి గారి గొప్పతనం గుర్తొస్తుంది అంటే అతిశయోక్తి కాదు.

ఫ్లాష్ బ్యాక్ తో మొదలు అయిన సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ సాంగ్ తో ఊపు తెప్పిస్తుంది, డాడి ఫైట్ తో నవ్విస్తుంది, కనీసం ఇక్కడ ఐన విలన్ తో ముఖా ముఖి పడే సందర్భం వచ్చింది అనుకునే లోపు ఆశ-దోశ-అప్పడం-వడ అని ఈస్ట్ కి తిరగమన్నారు. అక్కడ నుంచి హత్య లు, అంత పవర్ ఫుల్ విలన్ ని చెంప దెబ్బ కొట్టిన  హీరోయిన్ ని కాల్చి పారెయ్యటం మానేసి "నాలుగు రోజులు" ఆవిడ వెంక జాగింగ్, అయినా వాడేమన్న ప్రాణాలతో అడిగాడా, లేపెయ్యమనే గా చెప్పాడు. ఏది ఏమైనా అప్పుడే అక్కడికి వచ్చిన హీరోయిన్ కూడా ఎవ్వరని అడ్రస్ అడగకుండా, GPS  హెల్ప్ కూడా లేకుండా, డైరెక్ట్ గా ఇంటికి కాకుండా టెంపుల్ దాకా వచ్చెయ్యటం శ్రుతి మించిన సినిమాటిక్ లిబర్టీ కి నిదర్శనం. ఇలాంటి కామెడీ ని బాగానే పండించారు. ఇది చూసాక, అర్ధం అయ్యింది ఇంటర్వెల్ ముందు ఇది చూపించేసి ఉంటె కనీసం అక్కడ వచ్చిన రెస్పాన్స్ కూడా వచ్చి ఉండేది కాదు అని దాచి పెట్టారు ఏమో అని. అప్పటి వరకు ప్రేమించిన MLA త్యాగం చెయ్యటం పోనీ ఒక అర్ధం ఉండి అనుకుందాం కానీ వెనక పడి ప్రేమించమని పట్టు బట్టిన హీరో కూడా దొరికిందే ఛాన్స్ అని రకుల్ తో డ్యూయెట్ వేసుకోవటం అనే ఊహ ఓన్లీ బోయా కే సాద్యం. ముప్పావు సినిమా అయిపోయినా అసలు ఇద్దరు అప్పటి వరకు కలవక పోవటం తో, ఇంక లాస్ట్ సాంగ్ అండ్ లాస్ట్ ఫైట్ ఎప్పుడు వస్తాయి? ఎండ్ టైటిల్స్ వేసేస్తే బోయా బాయ్ టిట్ బిట్స్ అయినా చూసుకోవచ్చు అని డిసైడ్ అయిపోతాం. అప్పుడు హీరోయిన్ కిడ్నాప్.  ఫస్ట్ రీల్ లో ఇచ్చిన ఇంట్రడక్షన్ కి, మళ్లీ లాస్ట్ ఆక్ట్ వరకు టచ్ చెయ్యక పోవటం ఒకింత నిరాశ కలిగించినా, అప్పటి వరకు ఎదురు చూసిన విషయం ని ఇంత కంటే సింపుల్ గా ఎవరు ముగించలేరేమో అనే విధం గా పెట్రోల్ సీన్ తీయటం జరిగింది. అప్పటి వరకు విలన్ కి ఉన్నా ఇమేజ్ ఏంటి? ఆ సీన్ ఏంటి? ఏకం గా శుభం కార్డు వేస్తే అయిపోయేది, కానీ ఆల్రెడీ తమన్ ఇచ్చేసిన సాంగ్, రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన హ్యాండ్ తో హ్యాండ్ ఫైట్ మిగిలిపోవటం వలన ఇంకో పావు గంట సాగింది.   


ఆక్ట్ 3  : ముగింపు : అప్పటి వరకు చూపించిన సినిమా కి ఇంక కొనసాగింపు అనవసరం. చావు భయం చూపించి చావు ని పరిచయం చేసేసిన హీరో ఆ తర్వాత మైండ్ గేమ్స్ ఆడాల్సిన అవసరం ఏముంది? దానికి అప్పుడే తను మగాడు అని గుర్తొచ్చిన సుమన్ సర్ జాయిన్ అవ్వటం, శ్రీకాంత్ కిడ్నాప్, కాల్చేయ్యటం, అది అడ్డం పెట్టుకొని కొట్టడం, హీరో తిరిగి కొట్టడం అసలు లాస్ట్ లో వేసే ఎండ్ టైటిల్స్ లో బోయా టిట్ బిట్స్ లేక పోయి ఉంటె లాస్ట్ సాంగ్ కే లేచి వెళ్ళిపోవాల్సిన సినిమా. అప్పటి వరకు ఇచ్చిన బిల్డప్‌ కి, ఆ క్లైమాక్స్ కి సినిమా మొదటి నుంచి చివరి వరకు తన బుజాలపై మోసిన బన్నీ శ్రమ ని చూసి జాలి తప్ప ఇంకోటి కలగదు. నేను కూడా మాస్ సినిమాలని ఆదరించే ప్రేక్షకుడినే, అయినత మాత్రాన ఎమోషన్ లేని ఫైట్ ని, ఎక్సైట్ చెయ్యలేని యాక్షన్ ని ఎంత సేపు అని భరించగలం?లాజిక్ లు గురుంచి సినిమాటిక్ లిబర్టీస్ గురుంచి అనుకున్నాం కాని, అయినా ఎంత CM కొడుకు అయినా మనుషుల్ని పెట్టి పని చేయించుకోవాలి కానీ అన్నిటికి తానే దిగిపోతాడా, బోయపాటి గారు డాన్ సినిమా చూసి ఉండరు, లేదంటే లారెన్స్ లా విలన్ కి రైట్ హ్యాండ్ రోల్ వేసేసి ఆయనే కానిచ్చేసి ఉండేవారు.

చివరిగా : బోయపాటి సినిమాలలో ఇంతకు ముందు ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఎమోషన్ ఉండేది, దాని చుట్టూ ఎంత అతి చేసినా చెల్లిపోయింది. భద్ర సినిమా లో హీరో లవ్ ట్రాక్ తీసేసి కొంచెం అటు ఇటు మారిస్తే సరైనోడు తయ్యారు అయినట్టు అనిపిస్తుంది. కనీసం ఆ లవ్ ట్రాక్ ఉన్నా కొంచెం ఎమోషన్ అండ్ అటాచ్మెంట్ ఉండేవి. కానీ ఇక్కడ బేసిక్ కథ లో ఎమోషన్ లేక, కథనం లో దమ్ము లేక, బన్నీ కష్టం అండ్ అలరించిన కొన్ని ఫైట్ లు తప్ప ఎం మిగలలేదు. ఈ మద్య కాలం లో వదిలేసిన డాన్సు మళ్లీ మొదలు పెట్టి రెండు సాంగ్స్ వరకు ఫాన్స్ తో పాటు అందర్నీ  అలరించాడు. ఎలాంటి స్క్రిప్ట్ లో అయినా ఇమిడిపోయే బన్నీ బోయా స్క్రిప్ట్/స్కూల్ కి సరిపోడు, స్టైలిష్ స్టార్ కి పూరి/వినాయక్ మాస్ ఓకే కానీ బోయా మాస్ నాట్ ఓకే. ఇవన్ని మరిపించే రేంజ్ స్క్రిప్ట్ పడి ఉంటె విషయం వేరేలా ఉండేది ఏమో. బోయా నుంచి వచ్చిన వీక్ బొమ్మ, ఫాన్స్ ని, కింద క్లాసు ని, ఫైట్ లవర్స్ ని మాత్రం అలరిస్తుంది.  

P.S : ఎక్కడ మిగతా నటీనటుల గురుంచి చెప్పలేదు అనుకుంటారు ఏమో, పేరు కి శ్రీకాంత్, సాయి కుమార్, జయప్రకాశ్ లాంటి ఎంతో మంది ఉన్నా కుడా, ఎవ్వరు అంతగా రిజిస్టర్ అవ్వరు, ఉన్నంత సేపు ఉన్నాం అనిపించుకున్నారు అంతే.

1 comments:

aditya said...

hahha interval scene analysis :D

asalu 4 rojulu paridatane undadamendho aa mla heroine ki edanna negative twist edanna petti naatakam love track petti unna bagundedhemo aa court scene taruvata iragadeese fight pettakunda tokkalo scating fight malli aa DGP party appudu kooda fight pettakunda party song endho ufff

aa sambar comedy aite raktha vanthulu baa naa yokka valla kaaled, bemmi ante at least scene em lekunna edho oka scene anna navvistadu ganee

inka hero-villain face off gurinchi perfect ga cheppav pre climax ayye varaku kalavaru akkade climax vacchestundi almost malli doodu doodu paata kosam aapinattu untadhi :D ainaa aa villain characterization ala evadu eduroste aadni champadam pedite inka hero-villain game ki chance eda untadhi ?? Ainaa anta bg unna villain 2 sarlu tana vallani kottina hero ni kanukkoleda ante boya mass anukovalemo mari :D

Bunny baga try chesadu performance fine but konni chotla forced ga undhi aa getup valla kooda minus aindhi konchem yes dance lu kasta concentrate chesadu

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views