ధృవ - కథ కథనం – విశ్లేషణ

ధృవ - కథ కథనంవిశ్లేషణ
రీమేక్ సినిమాలు చెయ్యటమే సేఫ్ గేమ్ అనుకుంటే, ఉన్నది ఉన్నట్టుగా తీసెయ్యటం ఇంకాస్త ఎక్కువ సేఫ్ గేమ్ అవుతుంది. కానీ రీమేక్ సినిమాల వరకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఆల్రెడీ హిట్ ఐన సినిమా లో ఉన్న అతి కొద్దీ లోపాలు అయినా కరెక్ట్ చేసుకోవచ్చు, నేటివిటీ కి, హీరో ఇమేజ్ కి తగ్గట్టు పూర్తిగా మార్చుకోవచ్చు, కాక పోతే, ఇవి కొంచెం రిస్క్ తో కూడుకున్న వ్యవహారాలు అండ్ పూర్తిగా డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన విషయాలు. ఎందుకొచ్చిన రిస్క్ అనుకున్నారు ఏమో, డబ్బింగ్ చేసి ఉంటె సరిపోయేది కదా అనే రేంజ్ లో దించేశారు. ఏమైనా క్రిటికల్ మార్పులు చేసి ఉంటె రెండిటిని పోల్చి వ్రాసుకోవచ్చు, జయం రవి సినిమాని, రామ్ చరణ్ ఎంచుకోవటం అంటే ఇమేజ్ పరంగా వచ్చే ప్రాబ్లెమ్ కోసం ఏమైనా మార్చి ఉంటారు అనుకున్నాం కానీ ఇక్కడ అవకాశం కూడా లేదు కాబట్టి, డైరెక్ట్ గా ఒకసారి మాట్లాడేసుకుంటే సరిపోతుంది. ఎప్పటిలాగానే కమర్షియల్ రిజల్ట్ పక్కన పెట్టి, కథ కథనం ని విశ్లేషించుకునే ప్రయత్నమే....

"సినిమా చూడని వాళ్ళు, చూడాలి అనుకునే వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిది" అని నా అభిప్రాయం

కథ : ఒక లైన్ లో చెప్పుకునే కథ కాదు, కానీ సారాంశం ఏంటి అంటే - ఇదొక ఇద్దరు వ్యక్తుల కథ, ఇద్దరి సిద్ధాంతం ఒకటే - "జీవితం లో ఒక లక్ష్యం పెట్టుకో, లక్ష్యం నే నీ జీవితం చేసుకో" - కానీ ఆశయాలు వేరు. ధ్రువ లక్ష్యం సిద్దార్థ్ అభిమన్యు లాంటి క్రినిమల్ అయితే, సిద్దార్థ్ లక్ష్యం ని చేరుకోనివ్వని ప్రతిబంధకం ధృవ, వాళ్ళిద్దరి ఆశయ సాధనలో జరిగే సన్నివేశాలే - ధ్రువ. కానీ దీనిని ఒక కథ లా చెప్పుకోవాలి అంటే, టైటిల్ పెట్టినట్టు ఇది ధృవ కథ కాదు, సిద్దార్థ్ తో మొదలై అతని చావు తో ముగిసే అతని కథఇంకా చెప్పాలి అంటే, ధ్రువ శత్రువు ఎవరో మనకి తెలుసు - తన కెపాసిటీ ఏంటో మనం తెలుసుకోవాలి. అది ఎలా అనేది కథనం లో చెప్పుకుందాం. ఇద్దరు వ్యక్తుల కోణం లోనే కథనం విశ్లేషించుకుందాం అనిపించి, రెగ్యులర్ హెడింగ్స్ ని పక్కన పెట్టడం జరిగింది.

సిద్దార్థ్ అభిమన్యు : స్టేట్ ఫస్ట్ వచ్చిన ఒక సాధారణ పార్టీ కార్యకర్త కొడుకు, ఒక అసాధారణ నిర్ణయం తీసుకొని, లైఫ్ లో ఇలాగె ఉండిపోతే అది నా తప్పు అవుతుంది అని, కలిసి వఛ్చిన సందర్భం వాడుకొని జైలు కి వెళ్ళటానికి రెడీ అవుతాడు. న్యూస్ అప్పట్లో ఒక సంచలనం. తనకి ఎం కావాలి అని తనకి తెలుసు. తాను ఎం చెయ్యబోతున్నాడో తనకి తెలుసు ఇంకా సింపుల్ గా అప్పటినుంచే తన లక్ష్యం తనకి తెలుసు.


ధ్రువ: ఒక 15 సంవత్సరాల తర్వాత, IPS ట్రైనింగ్ లో ఉన్న ధృవ తన తోటి ట్రైనీస్ తో కలిసి అర్ధరాత్రులు డ్యూటీ చేస్తూ ఉంటాడు (పోలీస్ డ్యూటీ ఏ సుమీ). ఎదో బోర్డింగ్ హాస్టల్ స్టూడెంట్స్ రాత్రి పూట వార్డెన్ కంట పడకుండా సెకండ్ షో కి వెళ్తే పర్లేదు కానీ, ఎలాగూ కొన్ని రోజుల్లో పోలీస్ అయ్యే వాడికి తన కెరీర్ ఏ పణంగా పెట్టి ఈ సాహసాలు ఎందుకో? పై అధికారులకి తెలిస్తే, దొరికితే అసలు యూనిఫామ్ ని మర్చిపోవటం అటుంచి జైలు కి వెళ్ళేవాడు కదా, అయినా కూడా ఎందుకంటారు? ఫ్రెండ్స్ ఏ కాదు, వాళ్ళు లేనప్పుడు కూడా సింగల్ గా వెళ్తూ ఉంటాడు, ఎందుకు? సెకండ్ షో కి కాదు లెండి. అది ఎందుకో తెలుసుకునే లోపు ఒక వన్ సైడెడ్ లవ్ ఫ్లాష్ బ్యాక్. పోలీస్ అవ్వాలి అనేది తన లక్ష్యం. తన జీవితం లో ప్రేమ కి చోటు లేదు. మరి రాత్రుళ్ళు సింగల్ గా వెళ్ళటం దేనికి?  అది తెలుసుకునే లోపు చైన్ దొంగతనం అండ్ మర్డర్ సీన్, పట్టుకున్న నిందితుడు రెండు రోజుల్లోనే బయట తిరుగుతుంటే, మనం టార్గెట్ చెయ్యాల్సింది వీళ్ళని కాదు, వీళ్ళ వెనక ఉన్న వాడిని. అప్పటికి తాను నైట్ టైమ్స్ ఎం చేస్తున్నాడో చెప్పడు. కానీ ఇంకా చెప్పాల్సిన టైం వచ్చింది అని ఫిక్స్ అయ్యి నా ల్యాబ్ కి రండి అని చెప్పి, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటో ఒక లెక్చర్ ఇస్తాడు. అంత క్లాస్ పీకినా కూడా  తన శత్రువు ఎవడో చెప్పే పోసిషన్ లో ధృవ ఉండడు, కాబట్టి శత్రువు ఎవరో తెలియని ధ్రువ కెపాసిటీ కూడా మనకి తెలియదు.

సినిమాల వరకు ఎప్పుడు అయినా డైలాగ్స్ రూపం లో చెప్పించే కంటే, విజువల్స్ రూపం లో చూపిస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే సిద్దార్థ్ కి పడింది ఒక సీన్ అయినా క్లారిటీ ఉంటుంది, ధృవ పై 20 నిముషాలు పైగా గడిచినా మనకి క్లారిటీ ఉండదు.    

ధ్రువ: ఇచ్చిన లెక్చర్ లో ఒక పాయింట్ ఉంటుంది. తాను ఎంచుకున్న త్రీ క్రిమినల్స్ లో ఒకడు "జనరిక్ మెడిసిన్" గురుంచి మాట్లాడుతాడు. అదే మెయిన్ ప్లాట్ అనికి మనకి తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ముగ్గురిలో ఒకడిని సెలెక్ట్ చేసుకుంటా అంటాడు, అది ఎలా కుదురుతుంది అని, మనంఉన్నాం కదా ఇంకో ఇద్దర్ని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కడు ఒక్కొక్కడిని లేపేద్దాం అనుకోరు. మొత్తం మీద ముగ్గురి వెనక ఒకడు ఉన్నాడు అని తెలుస్తుంది. ఎందుకొచ్చిన కన్ఫ్యూషన్, ధృవ కి కావాల్సింది ఒక్కడే కాబట్టి, ఒక్కడితో ఆపేస్తే పోలా అని ఒక క్లారిటీ వస్తుంది. ఒక్కడినే కలిసే అవకాశం తన ట్రైనింగ్ లాస్ట్ లో వస్తుంది. రోజే నువ్వే నా టార్గెట్ అని హింట్ కూడా ఇస్తాడు, అప్పటికే స్మార్ట్ ఫోన్ లో బిజీ గా ఉన్న సిద్దార్థ్ క్యాచ్ చెయ్యడు. ప్లాట్ పాయింట్ ఎంత బలంగా ఉంటె క్లైమాక్స్ కూడా అంతే బలం గా ఉండే అవకాశం ఉంటుంది, ఇక్కడ ప్లాట్ పాయింట్ ఒక షాక్ హ్యాండ్ తో ఎండ్ అయిపోవటం వలన, ఫైనల్ గా క్లైమాక్స్ లో ఎం జరిగిందో చెప్పుకునే అప్పుడు డిస్కస్ చేసుకుందాం. విలన్ ఎమోషన్ కి ఒక అర్ధం ఉంది, కానీ హీరో ఆశయం కి భలమైన కారణం కనపడదు, అసలు బాక్గ్రౌండ్ కూడా మనకి తెలియదు. తమిళ్ లో ప్రీక్వెల్ తీస్తే అది తెలుగులో రీమేక్ చేస్తే తప్ప అర్ధం కాదు మనకి.

ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది, ప్రతి సారి చెప్పుకునే ఫస్ట్ ఆక్ట్ కిందకి వస్తుంది. సెకండ్ ఆక్ట్ - మిడిల్ - సమస్యాత్మకం ఇక పై మొదలు అవుతుంది.

మిడిల్ : డ్యూటీ ఎక్కగానే ప్రొబేషన్ కూడా లేని ఆఫీసర్ ధృవ ఆర్గనైజ్డ్ క్రైమ్ కి హెడ్ అయిపోయి, ఒక పెద్ద టాస్క్ నెత్తిన వేసుకుంటాడు. జనరిక్ మెడిసిన్ గురుంచి జరగబోయే ఒక అగ్రిమెంట్, దానిని ఆపటం కోసం సిద్దార్థ్ చేస్తున్న ప్రయత్నం, వాడిని ఫస్ట్ టైం కెలకటానికి ధృవ కి వచ్చిన అవకాశం తో ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ మొదలు అవుతుంది. ధృవ కి ఎం ప్రాబ్లెమ్ లేకుండా ఎం జరగాలో అది జరిగిపోతూ ఉంటుంది, మలేషియా బ్యాంక్స్ కూడా ఇక్కడ పోలీస్ అడిగాడు అని మనీ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు, అది కూడా చిన్న చితక అమౌంట్ కాదు. బ్లాక్ మనీ గురుంచి తెలుసుకోటం ఇంత సింపుల్ అని మనకి ఇప్పుడే తెలుస్తుంది. అసలు జెండర్ మూవీ లో లాజిక్స్ గురుంచి మాట్లాడుకున్న మాట్లాడక పోయినా థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ లాంటి సీరియస్ మూవీస్ లో లాజిక్స్ ఇంపార్టెంట్. ఫారిన్ డెలిగేట్ ప్లేస్ లో హీరోయిన్ ని పెట్టి సేవ్ చేసే ప్రాసెస్ తెలుగు కమర్షియల్ సినిమా ని గుర్తు తెస్తుంది. అక్కడ ఫస్ట్ దెబ్బ తిన్న అభిమన్యు వెంటనే తన రిటార్ట్ మొదలు పెడతాడు, వెళ్లిన పని పూర్తి చేస్తాడు, ఫారిన్ డెలిగేట్ ని చంపేస్తాడు, ధృవ ని షూట్ చేయిస్తాడు. పై చెయ్యి సాధిస్తాడు. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ మూవీ ని పరుగులు పెట్టిస్తుంది, లాజిక్స్ మర్చిపోయి తెరపై జరుగుతున్న సన్నివేశాల్ని ఎంజాయ్ చేసేలా చేస్తూ ఒక పాజిటివ్ ఫీలింగ్ మిగులుస్తుంది. కాక పోతే సిద్దార్థ్ మీద  మొదలు అయిన కథ, సిద్దార్థ్ పై చేయి సాధించటం తో విరామం కి వచ్చి ఇది మరొక్కసారి సిద్దార్థ్ సినిమా అని అనిపించేలా చేసింది.

ఇంటర్వెల్ గ్యాప్ లో అరవింద్ స్వామి పెర్ఫార్మన్స్ గురుంచి, చరణ్ బాడీ కోసం పడ్డ కష్టం గురుంచి, రకుల్ గ్లామర్ గురుంచి మాటాడేసుకొని, ఒక చేతితో పాప్ కార్న్ ఇంకో చేతితో కూల్ డ్రింక్ పట్టుకొని సెకండ్ హాఫ్ కి రెడీ అవుతాం.

అదే స్పీడ్ తో మొదలు అయిన సెకండ్ హాఫ్, కొరియన్ బొమ్మ సా డెవిల్ లో రివర్స్ లో వాడిన బగ్ ఎపిసోడ్ తో ఇంటరెస్టింగ్ గా తయారు అవుతుంది. ధృవ ఛాతి లో బగ్ పెట్టిన సిద్దార్థ్ ప్రతి ప్లాన్ కి కౌంటర్ వేసుకుంటూ ఉంటాడు, ఇక్కడ నిస్సహాయత లో ఎం జరుగుతుందో ఎలా జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి లో ధృవ. సెకండ్ ఆక్ట్ లో ఉండాల్సిన పర్ఫెక్ట్ సరంజామా. హీరో / కథానాయకుడు లక్ష్య సాధన లో అవరోధాలు, అన్ని కరెక్ట్ గా కుదిరిన ఎపిసోడ్. అందుకే సెకండ్ హాఫ్ మొదలు అయ్యాక, హీరో కి అసలు విషయం తెలిసే వరకు సినిమా ప్రేక్షకులని కట్టి పడేసేలా చెయ్యగలిగింది.

ఒక కొత్త ఇష్యూ, మెమరీ కార్డు తో మొదలు అవుతుంది. అవకాశం ని వదులుకోలేని ధ్రువ తన ప్రయత్నం మొదలు పెడతాడు, మొత్తం ముందే తెలిసిపోతున్న సిద్దార్థ తిప్పి కొడతాడు. ప్రాసెస్ లో ఫ్రెండ్ ని కోల్పోతాడు, అయినా కూడా ఎం జరుగుతుందో అర్ధం కాదు, ఇంతలో సిద్దార్థ తన దగ్గరకి వచ్చాడేమో అనే అనుమానం. వేలిముద్రల ఎపిసోడ్. అవును రోజు గన్ ఉన్న డబ్బా ఇచ్చినప్పుడు సిద్దార్థ్ కంటే ముందు బాక్స్ పట్టుకున్న వాళ్ళ వేలి ముద్రలు కూడా ఉంది ఉండాలి కదా? అని ఆలోచించకండి, అవి సిద్దార్థ్ వేలిముద్రలు, కానీ నేను ఆలోచించేది, అన్ని రోజులు గన్ ఒంట్లో వాడకుండా ఎందుకు వదిలేసాడు అని? బాక్స్ ని ఇంటికి కూడా గ్లౌజ్ లు వేసుకొనే తీసుకొచ్చాడు ఏమో మరి? ఇదిగో ఇలా పనికొస్తుంది ఏమో అని తర్వాత అర్ధం చేసుకున్నాను. అక్కడ నుంచి కథ సిద్దార్థ్ గర్ల్ ఫ్రెండ్ మీదకి వెళ్తుంది. ఆలా సిద్దార్థ్ ని వేరే ఇష్యూ లో ఎంగేజ్ చేస్తూ, తాను బగ్ గురుంచి కనుక్కుంటూ, అద్భుతమైన సీన్స్ తో సెకండ్ ఆక్ట్ - మిడిల్ ముగుస్తుంది. తర్వాత వచ్చే పాట గురుంచి మనం మర్చిపోదాం. ఒక సారి హీరో కి బగ్ గురుంచి తెలిసిపోయింది అంటే ఇంక సమస్య తీరిపోయినట్టే కాబట్టి కథ ఎండ్ లో కి వెళ్తుంది.

ఎండ్ - ముగింపు : బగ్ కనుక్కున్న ధృవ కౌంటర్ గేమ్ మొదలు పెడతాడు. ఇదొక బీభత్సమైన కమర్షియల్ ఐడియా. అప్పటి వరకు తన కష్టం మనం చూస్తాం కాబట్టి రివర్స్ గేమ్ ని మనం ఎంజాయ్ చేస్తాం. ముందు తన ఫ్రెండ్ ని కోల్పోయాడు కాబట్టి అకౌంట్ సెటిల్ చెయ్యాలి. సిద్దార్థ్ ని తప్పు దారి పట్టించి (రివర్స్ గేమ్ లో) సాక్ష్యం సంపాదిస్తాడు. ఎంటైర్ ప్రాసెస్ లో మనం ఆలోచించని ఇంకో విషయం, ఇంటర్వెల్ ముందు ఆపరేషన్ ఫెయిల్ అయ్యాక ధృవ పై ఎంక్వయిరీ వేసారా? అంత పెద్ద ఇష్యూ, ఒక ఫారినర్ కి ప్రొటెక్షన్ లో ఉన్న ఆఫీసర్, నెక్స్ట్ ప్రాసెస్ ఏమైంది? డిశ్చార్జ్ అయ్యాక డ్యూటీ లో జాయిన్ అయ్యాడా? డ్యూటీ లో నే ఉన్నాడా? ఒకవేళ ఉంటె, ఇలా చట్టం ని చేతుల్లోకి తీసుకొనే ఎపిసోడ్ ఏంటి? పోలీస్ ఫోర్స్ ని వాడుకోవచ్చు గా? సైబర్ టీం సపోర్ట్ ఉంటుంది గా? లేక నేను ఏమైనా మిస్ అయ్యానా? సరేలెండి, తన ఫ్రెండ్ ని ఎలా చంపాడో అలాగే డ్రగ్స్ పెట్టి చంపే అప్పుడు కూడా డ్యూటీ లో నే ఉన్నాడా? ఉంటె మరి అది మంచి ఆఫీసర్ చెయ్యాల్సిన పనేనా? జనరల్ గా చట్టం చేతులో మోసపోయిన వాడో, చట్టం వలన తన పని అవ్వలేదు అనే కసి తో ఉన్నవాడో చట్టం ని చేతుల్లోకి తీసుకుంటే ఒక అర్ధం పరమార్ధం. వద్దులెండి ఇంక ముందుకి వెళ్దాం. ప్రాసెస్ లో పోసాని గారి స్పీచ్ ఇష్యూ, సిద్దార్థ్ క్రూరత్వం కట్టలు తెంచుకోవటం. తన తండ్రి ని చంపించటం. CM కి వార్నింగ్ ఇవ్వటం. అరెస్ట్ అవ్వటం. మొత్తం ఎపిసోడ్ ఒక 15 మినిట్స్ రన్ టైం పెంచటానికి పనికొచ్చాయి. ఆల్రెడీ సాక్షాలు చేతులో ఉన్న ధృవ కి అరెస్ట్ ప్రాసెస్ పెద్ద మేటర్ కాదు కదా? పోనీ అరెస్ట్ చేస్తే పొలిటికల్ గా CM సపోర్ట్ ఉంది అనుకుంటే మరి సిద్దార్థ్ కేసు వాదించటానికి పర్సనల్ లాయర్స్ కూడా ఎవరు ఎందుకు రారు కోర్ట్ కి? తొక్కలో రెండు సాక్ష్యాలు - గట్టిగా వాదిస్తే "మనవాళ్ళు థె బ్రిఫెడ్ మీ, అం విత్ యు డోంట్ బాధేర్" లా వీగిపోయే కేసు ఇది. మీడియా హడావుడి చేస్తుంది అనుకున్న కూడా టీవీ ఇంటర్వ్యూ లో "వాట్ అం సెయింగ్ ఐస్" అని హ్యాపీ గా చెప్పుకోవచ్చు. తన లక్ష్యం కోసం అంతగా పాటుపడే సిద్దార్థ్ ఎందుకు సైలెంట్ అయ్యాడు, అక్కడే పాత్ర స్వభావం దెబ్బ తినింది. ఇంక ఎలాగైనా సినిమా కి ఎండ్ ఇవ్వాలి, హీరో ఈయన కాదు ధృవ అని ప్రూవ్ చెయ్యాలి అన్నట్టు ఉంటుంది తర్వాత జరిగేది.

ఇంకా కేసు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే, అసలు ఫారిన్ డెలిగేట్ ని చంపింది సిద్దార్థ్ అని ప్రూవ్ చెయ్యాలి, తన మీద జరిగిన అట్టాక్ సాక్ష్యం అయ్యి ఉండాలి, కానీ అది ఇంటర్వెల్ అవ్వగానే మనం పాప్ కార్న్ అండ్ కూల్ డ్రింక్ లో మర్చిపోయి ఉంటాం.

అసలు మన ఫ్రెండ్ ని చంపినందుకు వాడిని ఎన్కౌంటర్ చేస్తాం అంటాడు మిగతా టీం. భావి భారత IPS ఆఫీసర్స్ కూడా రాజ్యాంగం పై రెస్పెక్ట్ చూపించక పోతే ఎలా ? ఫైనల్ డీల్ మేకింగ్ గురుంచి వస్తే, అష్ట దిగ్బంధనం అంటాడు, బాగానే ఉంది కానీ, ఆడు కాలు మీద కాలు యేసుకు కూర్చుంటే, ఒరేయ్ నేను రా హీరో ని అని లాగి పెట్టి ఒకటి కొట్టడం మానేసి హవె డీల్ అంటాడు. అక్కడ కూడా సిద్దార్థ్ స్థాయి వేరు స్థానం వేరు అనుకోవాలి మనం. నిన్ను సేవ్ చేస్తాను డేటా ఇచ్చేయ్ అంటాడు. వీడియో ని ఎడిట్ చేశాను అని చెప్పేస్తాడు, అదొక్క పాయింట్ చాలు సిద్దార్థ్ కేసు నుంచి బయటికి వచ్చేయ్యటానికి. ఏది ఏమైనా డిసైడ్ అయిపో అని డేటా తీసుకోకుండానే జాకెట్ ఇచ్చేసి వస్తాడు ధృవ.బయటికి వచ్చేసి ధృవ పై రివర్స్ కేసు పెట్టి వాడి జాబ్ లో నుంచి తీసేసి అరెస్ట్ చేయించే అంత గొప్ప ఐడియా దొరికిన కూడా అయినా కూడా క్రిమినల్ మైండ్ సిద్దార్థ్ తానొక విలన్ అనే విషయాన్నీ మర్చిపోతాడు. చేతులు ఏతేస్తాడు. బట్ వై? హౌ? తన గర్ల్ ఫ్రెండ్ చేతిలో చచ్చిపోటానికి ఏమో...

సిద్దార్థ్ పుట్టుకతో మొదలు ఐన కథ సిద్దార్థ్ చావుతో ముగుస్తుంది. మధ్య లో ధృవ ఎం చేసాడు? అసలు తన ఆశయం ఏంటో స్థిరం గా ఉంటె కదా, ఎం సాధించాడు అని చెప్పుకోటానికి. మనం ముందుగా చెప్పుకున్నట్టు ప్లాట్ పాయింట్ బలం గా ఉంటేనే బలమైన క్లైమాక్స్ రాసుకునే వీలు ఉంటుంది. లేక పోతే ఇదిగో ఇలా ముగించుకోవాల్సి వస్తుంది. ఒక ఈజీ సొల్యూషన్ ఫర్ థిస్ స్క్రీన్ప్లే - సిద్దార్థ్ ని చంపెయ్యటం. అసలు ధృవ లక్ష్యం ఏంటి? చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని (డిపార్ట్మెంట్ లో ఉంది కూడా) సాధించింది ఏంటి? సిద్దార్థ్ ని చంపటమా? చట్టాన్ని చేతుల్లోకి తీసుకొటమే హీరోయిజం అనుకుందామా? ఆలా అయినా కూడా అసలు సిద్దార్థ్ డేటా ఇచ్చి ఉండక పోతే ధృవ పోసిషన్ ఏంటి? మళ్ళీ రీసెర్చ్ చేసి కొత్త శత్రువు ని వెతుక్కోవటమా? నా వరకు ఫైనల్ గా ధృవ కి ఎం చెప్తావ్ అంటే  "నీ శత్రువు గొప్పోడే కానీ నీ కెపాసిటీ మాత్రం ప్రూవ్ అవ్వలేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం"

చివరిగా: పైన చెప్పుకున్న అంశాలు ఏవి మనకి సినిమా చూస్తున్న అంత సేపు గుర్తు రావుచరణ్ నుంచి మాస్ ప్రేక్షకులు ఆశించే రెగ్యులర్ మాస్ మసాలా సినిమా కాదు కానీ సినిమా చూస్తున్నంత సేపు ఎంగేజ్ చేసే మెటీరియల్ ఉన్న సినిమా. చరణ్ కష్టం, అరవింద్ స్వామి స్క్రీన్ ప్రెజెన్స్, రకుల్ అందాలు, సినిమాటోగ్రఫీ, సురేందర్ గారి స్టైల్, కొంత వరకు BGM చూసిన వాళ్ళని ఎంటర్టైన్ చేస్తాయి. ఆల్రెడీ తమిళ్ వెర్షన్ చూసేసిన వాళ్ళకి పెద్దగా ఏమి అనిపించక పోవచ్చు కానీ, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి పర్వాలేదు బాగానే ఉంది అనిపించే సినిమా.

ఆటవిడుపు; చరణ్ కి తగ్గ సినిమా ధృవ, ఎందుకంటే పెద్దగా యాక్టింగ్ చెయ్యాల్సిన పని రాలేదు, ఎక్స్ప్రెషన్స్ పలికించాల్సిన అవసరం రాలేదు,  ఎప్పటిలాగానే సింగల్ ఎక్స్ప్రెషన్ చాలు, క్యారెక్టర్ అలాంటిది, అందుకే అయన ఫిజికల్ కష్టం గురుంచి మాత్రమే మాట్లాడుకుంటాం. (బోర్డు సీన్ లో లవ్ ఎక్ష్ప్రెస్స్ చేసే స్క్రీన్ షాట్ వేసి ఏమైనా ప్రూవ్ చేద్దాం అనుకునే ఫాన్స్ లైట్ తీసుకొని ఆరంజ్ సినిమా ఇంకోసారి చూడాల్సింది గా మనవి)


4 comments:

sikander m said...

ur logical analysis is outstanding.
expect more reviews from you.

aditya said...

Super baa

screenplay valla hero characeter ala debbadipoindi.. original lo workout aipoindi kabatti enduku risk ani suri kooda li8 teesukunnattunnadu..

same nakau adhey anipinchindi.. asalu villain ni lopalese episode baga work chesi hero ni heights lo lepalsindi.. GS Lanti reoutine mass movie lone chinna lock estaru hero ki JP Character dwaara nee meeda action tesukuni suspend cheyamannaru kanee naku nee gurinchi teludu kabatti just suspend ye chestunna ani..

alaga first ye ikkada dhruva ki kooda oka higher official first nundi constant ga help and powers icchinatu choopinchalsindhi..

Generic Medicine whole scam lo Siddharth em chesadu anedi aa angelina murder etc anni proofs tho saha hero case file chesi ,this is the end nee game over ani hero tho chepinchi unte ...apudu last lo nuvera naa shatruvu vi ane dialogue ki more justification undedhi

but movei chose time ki intha aalochinchakunda narration undhi adhey movie ki big plus point.. bug episode nundi audience inka baga connect aipotaru once hero chetiki bug dorikaaka inka next episode audience expectations ki taggatte nadustundi class lo mass type heroism tho ..satisfy aipotaaru..

inka hero probation details avanni minor issues le.. aa angelina save chese episode chala baga vachindi fight and last lo chinna fun..mundey chepinattu ee movie ki once in a while drag anipiyadam tappa start to end ala interest sustain ayyela teesaru danivalle idhi bagaledu ani cheppadaniki chance undadu..

Anonymous said...

the logical analysis is awesome

chiru abimani said...

Super analysis sir dayachesi khaidi no 150 ki maatram rayoddu ani manavi

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views