మహర్షి - కథ కథనం - విశ్లేషణ




మహర్షి - కథ కథనం - విశ్లేషణ

20 సంవత్సరాల హీరో ప్రయాణం - 25వ సినిమా గా మహర్షి. అయన ఫిల్మోగ్రఫీ చూసుకుంటే మొదట్లోనే గట్టిగా ప్రయోగాలు చేసేసారు. సెకండ్ సినిమాకే ఒక పిల్లోడికి తండ్రిలా తర్వాత తర్వాత  కౌబాయ్ మూవీ అని అండ్ బాబీ - నాని లాంటి సినిమాలు అయితే వేరే ఏ హీరో అయినా భయపడే వాడు చెయ్యటానికి. అతడు తర్వాత ప్రయోగాల బాట పక్కన పెట్టి కమర్షియల్ బాటలో ముందగుడు వేశారు. చాలా రోజుల తర్వాత నేనొక్కడినే లాంటి సినిమా తో ప్రయత్నించినా ఫలితం ఇచ్చిన నిరాశ వలన ఏమో మళ్ళీ నార్మల్ అయిపోయారు. ఇక సందేశాల జోలికి వస్తే,  శ్రీమంతుడు లో వర్కౌట్ అయ్యే సరికి సందేశాత్మకం కూడా ట్రై చెయ్యొచ్చు అని వరసగా చేసేస్తున్నారు. ఆఖరికి స్పైడర్ లాంటి మూవీ లో కూడా మైక్ పట్టేసుకొన్నారు అనేది గమనించాలి. ల్యాండ్ మార్క్ సినిమా కాబట్టి ఇది కూడా సందేశం తో కూడిన సినిమా అయితే బావుణ్ణు అనుకున్నారేమో, ఏదైతేనేం, వేరే వేరే కారణాల వలన ముగ్గురు ప్రొడ్యూసర్స్ కి కలిపి ఒకే సినిమాతో తేల్చేసారు. మహేష్ అండ్ మైక్ కామన్ అయిపోతున్న ఈ రోజుల్లో వచ్చిన ఇంకో మైక్ సినిమా మహర్షి అని టీజర్ వచ్చినప్పుడు పెదవి విరిచారు, అప్పటి వరకు వచ్చిన సినిమాలనే తిప్పి తీసే వంశీ పైడిపల్లి డైరెక్షన్ మీద కామెడిస్ మొదలు పెట్టారు,  సాంగ్స్ ని ఎగతాళి చేసారు, కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత ఒక్క సారిగా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ప్రొమోషన్స్ సరిగ్గా లేవు అని ఫాన్స్ కొంత కంప్లైంట్స్ చేసిన మాట వాస్తవమే అయినప్పిటికి రిలీజ్ అయిన తర్వాత ప్రొమోషన్స్ మొత్తం బాబు చూసుకోవటం అద్భుతమైన విషయం. ప్రతిష్టాత్మక సిల్వర్ జూబిలీ సినిమా రిలీజ్ అయ్యింది, టాక్ వచ్చింది, కలెక్షన్స్ వచ్చేసాయి, రేంజ్ గురుంచి క్లారిటీ వచ్చేసింది, ఒక పక్కన తన కెరీర్ లోనే  హైయెస్ట్ రెవిన్యూ అని చెప్పుకుంటున్నా,  చెయ్యాల్సిన దాని కంటే తక్కువే చేసింది అంటున్నారు, ఎక్కడ వరకు చేసింది అనేది మన మన సబ్జెక్టు కాదు కాబట్టి, మనం ఎప్పటి లాగానే కథ - కథనం గురుంచి నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం.

"సినిమా చూడని వాళ్ళు, చూడాలి అనుకునే వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిది" అని నా అభిప్రాయం. ఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు.


మహర్షి - జాయిన్ ది జర్నీ అఫ్ రిషి - రండి రిషి ప్రయాణం లో భాగస్వాములు కండి


"నీ కంటి రెప్పలంచునా, మనసు నిండి పొంగిన, ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద

 ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచెనో, అవన్నీ వెతుకుతూ పదా

ఇదే కదా ఇదే కదా నీ కథ.. ముగింపు లేనిదై సదా సాగదా"

 ఈ సాంగ్ మేము ఇనేసాం, శాలా బావుందండి బాబు, ఎందుకు సాగదు, సాగుతానే ఉంటుందండి, ఎందుకంటే ఇది కథ కాదు కదండీ, దీనిని గాధ అంటారు అండి, దీనికి ఫుల్స్టాప్ ఉండదండి, జస్ట్ కామా మాత్రమే అండి, కానీ మూడు గంటలకంటే ఎక్కువ సేపు అంటే తెరలు సింపుతారని అక్కడ ఆపేసి ఈ పాటేశారండి.  


ఒక వ్యక్తి జర్నీ గురుంచి చెప్పాలి అనుకున్నప్పుడు, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి, ప్రయాణం లో ఏమేం చూపించాలి అనేది కత్తి మీద సాము లాంటిది. అది బయోపిక్స్ విషయం లో అయితే మరీను, దీనికి ఉదాహరణలు యాత్ర, కథా - మహా నాయకుడు లాంటివి, అది అయితే అందరికి తెలిసేదే కాబట్టి పెద్దగా మార్పులు చేసే అవకాశం కూడా ఉండదు, కానీ ఒక ఇమాజినరీ క్యారెక్టర్ కథ లో మనకి కావాల్సినంత వెసులుబాటు ఉంటుంది, అడిగే వారు ఉండరు కాబట్టి చూపించేదే చూస్తారు, ఎలాగూ చూస్తారు కదా అని చెప్పి ఏది పడితే అది చూపిస్తాం అంటే ? సినిమా కథ - కథనం అన్నాక స్ట్రక్చర్ ఉండాలి, లక్ష్యం ఉండాలి, సంఘర్షణ ఉండాలి, అవి కూడా ఉండాల్సిన మోతాదు లో, రావాల్సిన టైం లో ఉండాలి, అప్పుడే ఆ కథ - కథనం కి కట్టి పడేసే గుణం ఉంటుంది. అసలు విషయం మొదలు పెట్టకుండా ఈ సోది ఏంటి అంటారేమో, అసలు విషయం మొదలు పెట్టకుండా, జర్నీ ఇప్పుడే బిగిన్స్ అని ఇంటర్వెల్ కార్డు ఏస్తే చూసేస్తారే, అదే డైరెక్టర్ స్టైల్ ఫాలో అయిపోతున్నట్టు ఉన్నాను.. సరే టాపిక్ కి వచ్చ్చేద్దాం. 


కథ: ఈ సినిమాలో కథా వస్తువు గురుంచి చెప్పాలి అంటే "ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకునే ఒక కుర్రాడు రిషి, తన జర్నీ లో, తాను ఇప్పుడు ఉన్న పొజిషన్ కి తన స్నేహితుడి త్యాగమే కారణం అని తెలుసుకొని, సక్సెస్ అంటే మన ఎదుగుదల మాత్రమే కాదు అని ఫీల్ అయ్యి, అతని కోసం ఎం చేసాడు" అప్పటి వరకు స్వార్థంగా తన లక్ష్యం కోసం ? దూసుకు పోతున్న రిషి, సాయం పొందిన వాడు కృతజ్ఞత చూపించక పోవటం తప్పు అని ఫీల్ అవ్వటం వలనో, తీసుకున్నది తిరిగి ఇచెయ్యక పోతే లావై పోతామేమో అనే భయం వలనో, ప్రత్యుపకారం చెయ్యటానికి బయల్దేరతాడు. అక్కడ తాను ఎదుర్కున్న సంఘటనలే సెకండ్ హాఫ్.  జర్నీ అని ఆల్రెడీ చెప్పేసుకున్నాక కథగా రెండు లైన్స్ లో, సినోప్సీస్ గానో చెప్పటం అనేది ఆ కథని మనం చూసిన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ముందుగా చెప్పుకున్నట్టు ఇది కథ కాదు, గాథ. కథలో స్ట్రక్చర్ తో కూడిన కథనం ఉంటె, గాథ లో ఎపిసోడ్స్ లాంటి కథనంతో ఓహో ఇలా జరిగిందా అనిపించేలా మాత్రమే ఉంటుంది, ఇలా జరగక పోతే ఏమై ఉండేదో అనే ఆత్రం కథలో మాత్రమే ఉంటుంది, గాథ కి దశ దిశా నిర్దేశాలతో పని లేకుండా నెవెర్ ఎండింగ్ లా సాగుతూ ఉండే స్వభావమే ఉంటుంది, ఎక్కడ కావాలి అంటే అక్కడ మనం ఆపేసుకొని అయిపోయింది అనిపించుకోటమే.

కథనం : ఋషి అంటే వైదికకాలం నాటి కవి, స్తోత్రాలు రచించినవారు, మహానుభావులు, సామాన్య ఋషి స్థాయిని దాటిన గొప్ప ఋషులను మహర్షి అంటారు. రిషి (పేరుకి మాత్రమే నే లేక ఆల్రెడీ ఋషి?) నుంచి మహర్షిగా  ప్రయాణం, దానికి దారి తీసిన పరిస్థితుల సమాహారం ఈ కథనం. ఒక పోర్న్ రంగడు - పాండురంగడు గా మారటం, రక్తి నుంచి భక్తి మార్గం పట్టిన అన్నమయ్య, ఒక బాడ్ పోలీస్ నుంచి గుడ్ హ్యూమన్ గా ఎదిగిన టెంపర్ దయా, అమ్మాయిల పిచ్చి ఉన్న గోకులం లో పవన్ కళ్యాణ్ నిజమైన ప్రేమికుడు గా మారటం, పెళ్లి అంటే అగ్రిమెంట్ అనుకునే పవిత్ర బంధం వెంకటేష్ అపురూపమైనదమ్ము ఆడజన్మ అని తెలుసుకోవటం, సెల్ఫిష్ గా ఉండాలనే మిస్టర్ పర్ఫెక్ట్ మనం కోరుకునే వాళ్ళకోసం రాజి పడటం తప్పు కాదు అని తెలుసుకోవటం... ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయ్, ఇవన్నీ ఏవో గొప్ప చిత్రాలు అని సర్టిఫికెట్ ఇచ్చేయను కానీ,  ఇవన్నీ క్యారెక్టర్ బేస్డ్ గా ఆర్క్ తో కూడుకున్న కథనాలు. ముందు నెగటివ్ గా ఎంత ముద్ర వెయ్యగలిగితే కలగబోయే మార్పు కి అంత జస్టిఫికేషన్ ఉంటుంది. మరి ఇక్కడ ఎం జరిగింది?

ఫ్లాష్ బ్యాక్ కథనం కాబట్టి, బిగినింగ్ తో కాకుండా మిడిల్ తో మొదలవుతుంది. 

మిడిల్ : USA లో ORIGIN కంపెనీ కి కొత్త CEO గా రిషి ఎంపికవ్వటం తో మొదలవుతుంది. ఇంట్రడక్షన్ సాంగ్ "నీ తలరాతను సొంతగ నువ్వే రాసుకుపోతున్నావు
- గెలుపుకే సొంతం అయ్యావు" ఇలా స్తుతిస్తూ పాడేకంటే, గెలుపే నా సొంతం అయ్యింది అని తనంతట తాను పాడుకొని ఉంటె తర్వాత వచ్చే సాంగ్స్ కి ఇంపాక్ట్ ఉండేది. గెలుపు గర్వం తో విర్రవీగే హీరో పాత్ర గా పరిచయం చెయ్యాల్సిన సందర్భం ఇది. ఎందుకో అది కల్పించలేక పోయారు.  కొలీగ్ ఆరెంజ్ చేసిన సర్ప్రైస్ పార్టీ లో తన కాలేజీ మేట్స్ అండ్ ప్రొఫెసర్ ని కలుస్తాడు. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ 


బిగినింగ్ : అప్పటికే ఫస్ట్ సాంగ్ టైం లో విసువల్ గా హీరో చిన్నతనం చూపించటం జరిగింది. చాలి చాలని జీతం తో, అప్పులవాళ్ళు నాన్నని అవమానిస్తుంటే తాను అనుభవించిన బాధ. తన తండ్రిలా మిగిలిపోకూడదు అని ఏదైనా సాదించాలి - ఈ ప్రపంచాన్ని ఎలెయ్యాలి అనే గోల్ ఏర్పర్చుకోటానికి నాంది. 


కట్ చేస్తే, మాస్టర్స్ చెయ్యటానికి రెడీ గా ఉన్న హీరో. అదే పోసిషన్ లో ఉన్న తన తండ్రి ని ఆఫీస్ లో ఎవరో తిడితే, వాడిని కొడతాడు. ఇంటికి వచ్చే సరికి తండ్రికి కాలనీ లో ఉన్న ఫాలోయింగ్ గురుంచి తన ఫ్రెండ్ తో చెప్పుకుంటాడు, కానీ తండ్రి మీద ద్వేషం తోనే ఉంటాడు. చదువుకోవాలి అంటాడు, US వెళ్ళాలి అంటాడు, లేదంటే తన తండ్రిలాగే మిగిలిపోతాను అని గుచ్చి మాట్లాడతాడు. బహుశా బయటి వాళ్ళు అవమానించినప్పుడు కూడా తన తండ్రి అంత బాధ పది ఉండడేమో. ఆలా అని రిషి ఇండిపెండెంట్ గా ఉండడు, తన తండ్రి జీతం తోనే తిండి చదువు తిరుగుళ్ళు, మరి ఆలా ఉండకూడదు అనేవాడు తనకి ఉన్న అపారమైన తెలివితేటలతో తన సంపాదన తానే చూసుకునేవాడు లా చూపించి ఉండాల్సింది. చిన్నప్పటి నుంచి పార్ట్ టైం చేసుకుంటూ తనపై తనకి కాంఫిడెన్స్ పెరిగేలా ఎదో సాదించాలి అనే తపన ఉన్నోడిలా చూపించి ఉండాల్సింది. అప్పుడు తండ్రిని ద్వేషిస్తూ విభేదిస్తే ఒక అర్ధం ఉంటుంది.  మనం చూసిన మిడిల్ టైం కి తండ్రి తనతో ఉండడు, అప్పటికి ఎదో జరిగింది అని మాత్రమే మనకి తెలుస్తుంది. 

బిగినింగ్ లో మిడిల్ - తన గోల్ కోసం ముందుగా కాలేజీ కి ఎంటర్ అవుతాడు, ఫస్ట్ సెషన్ లో నే సక్సెస్ గురుంచి స్పీచ్ లు ఇస్తాడు (మైక్ పట్టుకొని). ఇక్కడ హీరోయిన్ అండ్ నరేష్ పాత్రలు పరిచయం అవుతాయి. ఫోకస్డ్ గా మొదలు పెట్టినా అమ్మాయిల వెనక పడే కమర్షియల్ టచ్ ఇస్తారు. సరదాగా ముందుకి నడిపించటానికి ఫాన్స్ ని అలరించటానికి ఇది అవసరమే అనుకుందాం. కానీ ముందుగా రిషి నే హీరోయిన్ వెనక పడతాడు, తర్వాత తన గోల్ కి అడ్డం అని ఫీల్ అయ్యేదానికి ముందుగా వెనక పడటం దేనికో ? నరేష్ పాత్ర లా తన వెనుక తిరిగే పాత్ర అని చూపించి ఉంటె వదిలించుకోవటం లో కూడా హీరో లోని స్వార్థం బాగా ఎలివేట్ ఐయ్యేది. హీరోయిన్ పాత్ర కూడా ముందు హీరోని ఎదవ (క్యారెక్టర్ లేదు) అని ఫిక్స్ అవుతుంది, వాడు ఎదో ప్రాబ్లెమ్ సాల్వ్ చేసాడు అని తన వెనక పడుతుంది అంటే చదువు ఉన్నవాడు ఎదవ అయినా పర్లేదు అని అనుకోవాలి ఏమో

తాను సాల్వ్ చేసిన ప్రాబ్లెమ్ క్రెడిట్ ని కూడా తన రూమ్మేట్ కి వచ్చేలా చేస్తాడు, ఇలా ఎందుకు చేసావు అని ప్రొఫెసర్ అడిగితే, తాను సాధించాల్సింది వేరే ఉంది, ఈ ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను అంటాడు. బయటికి వచ్చి హీరోయిన్ తో కాఫీ కామెడీ చేస్తాడు. సారీ చెప్పించుకోవటం ద్వారా హీరో కి ఇగో ఉంది అన్నది ఎస్టాబ్లిష్ చెయ్యటానికి ఉపయోగపడుతుంది కానీ హీరోయిన్ పాత్ర అర్ధం కాకుండా మిగిలిపోతుంది. సెమిస్టరు రిజల్ట్స్ రావటం తో కథ అల్లరి నరేష్ సమస్య వైపు వెళ్తుంది. ఇక్కడ అల్లరి నరేష్ కి ఒక కథ ఉంటుంది, ఎలా ఐన అమెరికా వెళ్లి పెద్ద బిల్డింగ్స్ మధ్య ఫోటో దిగి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని తన వాళ్ళు తన మీద పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకోవాలి అని. దానికి కావాల్సిన ప్రేరణ రిషి రూపం లో దొరుకుతుంది. తాను సాదించలేనేమో అనే అధైర్యాన్ని పక్కకి తోసేసి తనపై తనకి నమ్మకం కలిగేలా రిషి చేస్తాడు. 

గంట అయిపోతున్న సినిమాలో ఫైట్స్ లేక పోతే ఫాన్స్ హర్ట్ అవుతారు అని ఏమో, ఎంపీ ఎపిసోడ్ పెట్టారు, ఇది కథనం కి అనవసరమైన ఎపిసోడ్, దీని వలన ముందు వచ్చే ఉపయోగం కూడా వుండదు, మళ్ళీ ఎక్కడ పే ఆఫ్ అయ్యే ఎపిసోడ్ కూడా కాదు (శ్రీమంతుడు లో విషయం వేరు). ఈ ఎపిసోడ్ లో అయన కొడుకు డైరెక్ట్ గా ఉండి ఉంటె ఆ తర్వాత తాను చెయ్యబోయే పనికి ఐన ఒక రీసన్ లా ఉండేది. ఫైట్ అవ్వగానే సాంగ్ ఉండాలి కాబట్టి ఒక సాంగ్ ఉంటుంది. క్యాంపస్ ఇంటర్వూస్ లో నరేష్ కి జాబ్ వస్తుంది, రిషి తన గోల్ కి రీచ్ అయ్యే రోడ్ పడుతుంది. ఎప్పుడైతే తాను అనుకున్నది సాదించబోతున్నాను అనిపిస్తుందో, హీరోయిన్ ని వదిలించుకోవటం అయిపోతాయి. దాని గురుంచి అడిగిన నరేష్ ని కూడా "ఇదేనా నువ్వు నన్ను అర్ధం చేసుకున్నది" అని అడిగి దూరం పెడతాడు. అప్పటికి మనకి కూడా అర్ధం కాదు ఎందుకు ఇలా బెహవె చేస్తున్నాడో ఎందుకంటే మనకి అప్పటికి తానొక స్వార్థ పరుడు అనో, ఇగోయిస్టు అనో గట్టిగ ముద్ర పడక పోవటం వలన. 

బిగినింగ్ లో ఎండ్ - క్వశ్చన్ పేపర్ లీక్ అనే నింద తనపై పడటం తో, తన జర్నీ కి బిగ్గెస్ట్ హర్డిల్ పేస్ చేస్తాడు రిషి. ఇక్కడితో తన కెరీర్ ఎండ్ అయిపోయింది అనే అంత పెద్ద సమస్య, దానిని దాటుకొని పోస్టర్ లో చూపెట్టినట్టు పరుగులు పెడుతూ దూసుకు పోతాడు. 

మిడిల్ లో బిగినింగ్ - పోవటం పోవటం US వరకు ఎల్లిపోతాడు (ఫ్లైట్ లోనే లెండి). కష్టపడతాడు, ఎదుగుతాడు, ఇంతలో తండ్రి మరణ వార్త వింటాడు. ఇక్కడ యాక్టుల్ గా ఒక ట్రిక్ ప్లే చేసే అవకాశం ఉండి కూడా డైరెక్టర్ వాడుకోలేదు అనిపిస్తుంది. ఎగ్జామ్స్ అయ్యి US బయల్దేరాల్సిన రోజు తండ్రి చనిపోయి ఉంటె? బాధ్యత గల కొడుకు గా రెస్పెక్ట్ లేక పోయినా తండ్రి కార్యక్రమాలు పూర్తి చేసి వెళ్లేవాడా? ఇలా కూడా తన తండ్రి తన సక్సెస్ కి అడ్డు పడ్డాడు అని ఇది కాక పోతే ఇంకోటి అని ఫీల్ అయ్యి ఆగిపోయేవాడా?  లేక తాను స్వార్థం తో వెళ్లిపోయేవాడా? ఆగి, అవకాశం పోగొట్టుకొని, మళ్ళీ దానిని సాధించి చూపెట్టేవాడా? దీని వలన ఏమైంది అంటే, తండ్రి గురుంచి పూర్తిగా తెలుసుకోకుండానే వెళ్ళిపోయాడు అనిపించింది. అసలు అలాంటి సిట్యుయేషన్ లో ఎలా రియాక్ట్ అయ్యేవాడు అని తెలుసుకొనే అవకాశమే లేక పోయింది. తండ్రి పాత్ర కూడా అసంపూర్తిగా మిగిలిపోయింది. తనకి అవన్నీ చెప్పాల్సింది తల్లి, వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గించాల్సింది తల్లి కానీ ఇక్కడ చెప్పాల్సిన జయసుధ గారు ఎక్కడో క్లైమాక్స్ లో చెప్పటానికి దాచిపెట్టినట్టు అనిపిస్తుంది. 

సరదాగా మొదలు అయిన ఫ్లాష్ బ్యాక్ ఇలా ఎమోషనల్ ? గా ఎండ్ అయ్యి ప్రెసెంట్ కి వస్తుంది. అప్పటి వరకు ఫ్లాష్ బ్యాక్ లో కనిపించిన తండ్రి పాత్ర గురుంచి మనకి తెలిసింది మరి ఫ్రెండ్స్ ? అప్పుడు తెలుస్తుంది అసలు విషయం, తాను ఇప్పుడు ఈ పోసిషన్ లో ఉండటానికి ఒకప్పుడు నరేష్ చేసిన త్యాగమే కారణం అని. ఇది రియలైజేషన్ సీన్, అప్పటి వరకు తన సక్సెస్ కి తానే సమస్తం అని ఫీల్ అయితే నిజంగానే రియలైజేషన్. తన ఇగో, పొగరు అన్ని అణిగిపోయే రియలైజేషన్, కానీ అప్పటి వరకు మనకి ఆ ముద్ర పడక పోవటం వలన ఇంపాక్ట్ ఉండాల్సింది రేంజ్ లో లేని సీన్ గా మిగిలిపోయింది. ఇప్పుడు సంపాదిస్తున్న దాని కంటే చిన్నప్పుడు డబ్బులు లేవు అనే బాధే ఎక్కువ అని సినిమా మొదట్లో రిషి తో చెప్పించినప్పుడే తనకి జ్ఞానోదయం అయిపోయింది ఇంకా ఆ పాత్ర లో తానే సమస్తం అనే అంత ఇగో ఎక్కడ ఏడిచింది.  అవకాశం ఉండి కూడా పాత్ర చిత్రణ లో ఈ కోణం విస్మరించటం ఫస్ట్ హాఫ్ లో ఎమోషనల్ కంటెంట్ ఉన్న మనకి కనెక్ట్ లేక పోవటానికి ఒక కారణం. తనకి హెల్ప్ చేసిన ఫ్రెండ్ ఇలా అయిపోయాడా అనే సానుభూతి మాత్రమే రిషి దగ్గర మనకి కనిపిస్తుంది. అయినా కూడా అద్భుతమైన సాంగ్ పడటం వలన ఎలివేషన్ వస్తుంది. 

ఇండియా బయల్దేరతాడు. ఎందుకు? దేని కోసం ? పలుగు పార పోస్టర్ లో చూసేసాం కాబట్టి వ్యవసాయం చేస్తాడేమో ? మరి అయితే రాజీనామా చేసి వెళ్లొచ్చు కదా? జస్ట్ లీవ్ లో ఎందుకు? మన కోసం వంశి ఎదో ఒకటి ప్లాన్ చేసే ఉంటాడు లే, మనం రిలాక్స్ అయితే పోలా? సో ఈ ఫస్ట్ హాఫ్ తో ఒక కథ అయిపోయి సెకండ్ హాఫ్ లో ని ఇంకో కొత్త కథలోకి వెళ్తున్నాం.. .  

జర్నీ బిగిన్స్ అని ఇంటర్వెల్ కార్డు పడే సరికి, అప్పటికే ఒక గోల్, ఒక బిగినింగ్, ఒక సమస్య, ఒక ఎండ్ చూసెయ్యటం వలన సగం సినిమా కే పూర్తి సినిమా చూసిన ఫీలింగ్ ఇంటర్వెల్ కే కలుగుతుంది. 

సెకండ్ హాఫ్ - మిడిల్ లో మళ్ళీ బిగినింగ్  - విషయం తెలిసిన వెంటనే బయల్దేరాకుండా పాట  పూర్తి అయ్యేవరకు ఆగిన రిషి, డైరెక్ట్ గా రామవరం లో ల్యాండ్ అవ్వాల్సింది పోయి ఇంటర్వెల్ లో బయటికి వెళ్లి పాపం లైన్ లో ఉండిపోయి పాప్ కార్న్ కూల్ డ్రింక్ తెచ్చుకోవటం లేట్ అయిన వాళ్ళకోసం అన్నట్టు టైం తీసుకొని వస్తాడు. వచ్చి రాగానే ఒక గిల్ట్ ఫీలింగ్ లో తాను, చాలా రోజుల తర్వాత ఇంత గొప్ప పోసిషన్ లో ఉండి కూడా తన గురుంచి వచ్చాడు అనే ఆనందం లో నరేష్. తన తండ్రి చావుకి కూడా తానె కారణం అని ఇంకా ఎక్కువ గిల్ట్ ఉండటం వలన, ఒకప్పటి తన ఇంట్లో వాళ్ళ కోరిక అమెరికా వెళ్ళటం కాబట్టి తనతో పాటు వచెయ్యమంటాడు. ఇంత దూరం తాను వచ్చింది దగ్గరుండి తీసుకెళ్ళటానికా? స్వార్ధం తో స్నేహితుల్ని - ఫామిలీ ని పట్టించుకోకుండా సక్సెస్ కోసం పరుగులు పెట్టిన రిషి - ఇప్పుడు మహర్షి గా మారబోతున్నాడు, అంటే ఇవన్నీ వదిలేసి వాళ్ళ మధ్యకి వెళ్తాడా? అదే కరెక్ట్, అంతే కానీ అమ్మని తీసుకొచ్చినట్టు, నరేష్ ని కూడా తన దగ్గరకి తెచ్చేసుకుంటే మహర్షి ఎలా అవ్వగలడు, అసలు ఆ ప్రపోసల్ ఎలా పెట్టగలిగాడు? ఇదేనా తనకి వచ్చిన రియలైజేషన్. తనకి హెల్ప్ చేసాడు కాబట్టి తాను కూడా హెల్ప్ చేసి చేతులు దులిపేసుకుంటే సరి, మళ్ళీ పరుగు కంటిన్యూ చెయ్యొచ్చు

మిడిల్ లో మిడిల్ - ఆత్మాభిమానం ఉన్న నరేష్ నేను రాను, నువ్వేదో వచ్చి తీసుకెళ్తావ్ అని నేను ఎం చెయ్యలేదు, నువ్వు ఆగిపోకూడదు అని చేశాను, నువ్వు దానిని గుర్తు పెట్టుకునేందుకు థాంక్స్ అనాలి. నేను అక్కడ ఆలా చేసిన నువ్వు ఇచ్చిన ధైర్యం అలాగే ఉంది, నా టాలెంట్ తో నేను బావున్నాను, నాకు ఇది చాలు అనాలి. తన వ్యక్తిత్వం నిలబడుతుంది. అంత దూరం వచ్చిన రిషి కూడా, నీది తప్పు కాదు, తనకి తెలుసు ఇదంతా చేసింది MP కొడుకు, అది నిరూపిస్తా అనడు, నాతో వచ్చే అంటాడు. ఎందుకో రాలెనో చెప్పిన నరేష్ మాట విని (ఒక వేళ ఆ భూముల సమస్య లేక పోతే వెళ్లిపోయేవాడేమో) ఆ  తాను కూడా వెళ్ళను, నీ సమస్య తీర్చి వెళ్తాను అని ఆఫీస్ ఓపెన్ చేస్తాడు. ఇక్కడ సమస్య రిషి ది కాదు, తనకి పర్సనల్ గా సంబంధం కూడా లేదు, పరోపకారం అంతేయ్, ఇంకా చెప్పాలి అంటే ప్రత్యుపకారం. తనకి తెలియకుండా తన ఫ్రెండ్ చేసిన గుప్త త్యాగానికి, తిను బాహాటంగా చెయ్యబోతున్న ఉపకారం. సక్సెస్ అయినా అవ్వక పోయినా వచ్చే మార్పు లేదు. ఇక్కడే తాను చెయ్యాల్సింది ఇది మాత్రమే కాదు అని ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది, ఆలా కూడా చెయ్యకుండా ప్రస్తుతానికి ఇది టార్గెట్ అని మాత్రం చెప్పదలచుకున్నారు. నరేష్ కూడా రిషి వచ్చాడు అంటే ఎదో ఒకటి చేసి తీరతాడు అని కమర్షియల్ హీరో వర్షిప్ మోడ్ లో కి వెళ్ళిపోయి ఇద్దరి పాత్రలు పాసివ్ అయిపోయేలా చేసారు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ అరగంట వరకు హీరో కూడా బ్యాక్ సీట్ ఏసుకొని కూర్చోటమే 


పరుగులు పెట్టించాల్సిన స్క్రీన్ ప్లే లో ఇంకా అదే టెంపో ఉంటుంది. కలెక్టర్ ని, మినిస్టర్ ని, CM ని, ఇలా ఒక్కొక్కరిని కలుస్తూ ఫైనల్ గా జగపతి దగ్గరకి వస్తాడు.  అప్పటికే లేట్ అయింది అనే ఫీలింగ్ ఉండాలి కదా. పెద్ద కంపెనీ సీఈఓ టైం అంటే ఎంత వేల్యూ. తనకి ఉన్న నెట్వర్క్ తో అక్కడే కూర్చొని రెండు ఫోన్ కాల్స్ తో వెనక ఎవరు ఉన్నారో కనుక్కొని వీలైతే వల్లనే ఇక్కడికి రప్పించి మాట్లాడితే అది హీరోయిజం, ఇలాంటివి శంకర్ సర్ చేతిలో ఉంటె అద్భుతం గా ఆవిష్కరించబడతాయి. జగపతి ని కలిసిన రిషి ఈ ఒక్క ఊరు వదిలేయ్ అంటాడు, జగపతి తెలివైన వాడు అయితే, సరే, కానీ నీ కంపెనీ నుంచి నా కంపెనీ లోకి పెట్టుబడులు పెట్టించు అని బిజినెస్ డీల్ చేసేవాడు, కానీ చెయ్యడు. ఒక వేళ చేసి ఉంటె, ప్రాబ్లెమ్ సాల్వ్ అయిపోయింది పద వెళ్ళిపోదాం అని మళ్ళీ నరేష్ ని అడిగి నేను రాను నాకు ఈ ఊరే ఇంపార్టెంట్ అని ఇంకో మెలిక పెడితే అప్పుడు రిషి ఎం చేసేవాడు? అయినా పోలవరం కోసం గ్రామాలూ తరలించటం తెలుసు కానీ పైప్లైన్ ప్రాజెక్ట్ కోసం ఊరులు కాళీచేయించటం కూడా జరిగిందా మన గోదావరి జిల్లాల్లో ? జస్ట్ ఆస్కింగ్

జగపతి దగ్గర నుంచి వచ్చిన రిషి కి కూడా ఎం చెయ్యాలో అర్ధం కాదు, కంపెనీ ఓపెన్ చేస్తాడు, బిజినెస్ మీటింగ్స్ అన్ని ఇక్కడ నుంచే అంటాడు, మీడియా వస్తుంది  హీరోయిన్ కూడా వస్తుంది, హెలికాప్టర్స్ దిగుతాయి ఎగురుతాయి, ఎదో జరుగుతునే ఉంటుంది కానీ ఎం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేది అర్ధం కాదు. బహుశా నరేష్ అన్నట్టు, ఈడు వస్తే ఎదో ఒకటి చేస్తాడు అని మేకర్స్ కూడా వంశి ఇదంతా తీస్తున్నాడు అంటే ఎదో గట్టిగ చేస్తాడు అని నమ్మి ఉండవచ్చు. ఒక ప్రెస్ మీట్ పెట్టి నరేష్ వైపు మీడియా ని డైవర్ట్ చేస్తాడు (సీఎం వరకు వెళ్లినా సాల్వ్ అవ్వని ప్రాజెక్ట్ అంటే జస్ట్ మీడియా కవరింగ్ తో సాధించేది ఏముంటుంది లేక అప్పటి వరకు మీడియా అసలు ఈ విషయాన్నే పట్టించుకోలేదు అనేది తన ఫీలింగ్ ఆహ్). ఇదంతా చెయ్యకుండా కూడా డైరెక్ట్ మీడియా మీట్ పెట్టేసిన సరిపోయేది ఏమో? జనాల్లో కదలిక వస్తుంది, నరేష్ కి సపోర్ట్ పెరుగుతుంది, టెంట్ లో జనాలు పెరుగుతారు. నరేష్ లవ్ ప్రాబ్లెమ్, రైస్ మిల్ దగ్గర రెండు డైలాగ్స్ తో సాల్వ్ అయ్యిపోయే అంత ప్రాబ్లెమ్. వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ తో హీరోయిన్ దగ్గరకి వెళ్లి, ఇంత సేపు అయ్యింది సాంగ్ లేక పోతే ఫాన్స్ ఏమైపోతారు అని నిలదీయటం తో ఒక సాంగ్ పడుతుంది

మళ్ళీ సమస్య - రాజీవ్ కనకాల ఎపిసోడ్. పెరుగుతున్న సపోర్ట్ కి జగపతి ఊరికి వస్తాడు, ఈ ఊరు వదిలేస్తా అంటాడు, ఈ ఒక్క ఊరు కాదు 40 ఊర్లు వదిలేయ్ అంటాడు. వీడితో లాభం లేదు అని జనాలకి కౌంటర్ ఆఫర్ ఇస్తాడు జగపతి, జనాల్లో విభజన, నరేష్ మీద ఎటాక్, ఫైట్. దెబ్బకి హాస్పిటల్ కి పరిమితం ఐ కనుమరుగు అయిపోయే పాత్ర నరేష్. దీనికి కారణం నువ్వే అని అందరు రిషి ని బ్లేమ్ చేస్తారు, జగపతి కూడా నింద మోపుతాడు, హీరోయిన్ కూడా నువ్వు మారలేదు అంటుంది, ఇంక నా వాళ్ళ కాదు అని బయల్దేరిపోతాడు. 

ఎండ్ - బిగినింగ్ కాదు - మిడిల్ కి : అగమ్య గోచరం గా ఉన్న రిషి కి, అమ్మ పాత్ర క్యాటలిస్ట్ అవుతుంది, స్ఫూర్తి నింపుతుంది, రెగ్యులర్ తెలుగు సినిమా అయితే ఇంక 15 మినిట్స్ ఏ ఉంటుంది ఎదో ఒకటి చెయ్ అనాలి, కాక పోతే ఇక్కడ వంశి కాబట్టి ఇంకో అరంగంట ఉంది నాన్నా, నువ్వు నీ గెలుపు కి నెమ్మదిగా వెళ్ళు అంటుంది. పోనీ ఇప్పుడు ఐన కంపెనీ ని వదిలేసి వెళ్దాం అనుకోడు, ఎదో ఒకటి చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ ఉండటం వలన ఏమో? వెళ్లి టెంట్ లో కూర్చుంటాడు. అప్పుడు కూడా ఎం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియదు. కూర్చుంటే మళ్ళీ అందరు వస్తే, మళ్ళీ మీడియా వస్తే అని రెడ్డి వచ్చాడు మొదలెట్టమనలా? క్లైమాక్స్  లో మళ్ళీ ఫైట్ అంటే కుదరదు కాబట్టి ఈ సారి తన మీదకి డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళని కొట్టేస్తాడు. మళ్ళీ వెళ్లి కూర్చుంటాడు

ఎండ్ లో బిగినింగ్ - నాగలి పెట్టుకొని వెళ్తున్న తాత వెనకాల పొలం కి వెళ్లి, వ్యవసాయం నేర్పమంటాడు. పదరా పదరా సాంగ్. జగపతి బాబు ఇచ్చిన ఆఫర్ కి భూములు అమ్మేసుకుందాం అని వెళ్లిన వాళ్ళకి రిషి కౌంటర్ ఆఫర్ ఇస్తాడు. భూములు మీకే ఇస్తాను వ్యవసాయం చెయ్యమంటాడు. 

ఎండ్ లో సమస్య - మళ్ళీ ఎందుకు వ్యవసాయం మొదలు పెట్టడం, కల్తీ విత్తనాలు, నకిలీ మందులు, గిట్టు బాటు ధర లేక పోవటం, దళారుల వ్యవస్థ లాంటి ఎన్నో ప్రాబ్లెమ్ లు ఉన్నాయి అని ఒక అగ్రికల్చరల్ ఇంజనీర్ చెప్తాడు. అప్పుడు రైతుల ఆత్మహత్యల గురుంచి గూగుల్ చెయ్యటం మొదలు పెడతాడు రిషి. ఇక్కడ టచ్ చెయ్యాల్సిన ఇంకొక విషయం ఇలాంటి వాటి వలన జనాలు వ్యవసాయం వదిలేసి సిటీ కి పోతున్నారు అని. 

ఎండ్ లో ఎండ్ - ప్రెస్ మీట్, జనాలలో అవేర్నెస్, వీకెండ్ ఫార్మింగ్, జగపతి మోసం బట్టబయలు, నరేష్ ఊరికి న్యాయం ఇలా ఏవేవో జరిగిపోతూ ఉంటాయి. 


నిజమైన జర్నీ - అన్ని అయిపోయాక మళ్ళీ ఊరికి ప్రయాణం, అప్పుడు ఫైనల్ గా ఇంకో సారి రియలైజ్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. ఎం చేద్దాం అనుకుంటున్నాడు ? ఎం చెయ్యబోతున్నాడు ? లాంటి ప్రశ్నలు అడిగితే ఇంకో మూడు గంటలు సినిమా చూపించటానికైనా వంశి రెడీ, మనం ఓపిక చేసుకోవాలె కానీ.  


సినిమా మొదట్లో చూపించిన గోల్ ఇంటర్వెల్ కే పూర్తి అయిపోగా, అప్పుడే అసలు కథ మొదలు అయ్యింది అని సెకండ్ హాఫ్ లో ఇంకో రెండు సినిమాలు చూపించారు. అసలు సెకండ్ హాఫ్ లో ఇది సమస్య అని తెలిసినప్పుడు, ఇలా పరిష్కారం చూపించబోతున్నాం అని అనుకున్నప్పుడు, ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ విషయాన్నీ ఎలా విస్మరించారు అనేది అంతు పట్టని నిజం. పోనీ ఇప్పుడు సమస్య ఊర్లు ఖాళీ చేయించటమా, రైతన్నకు దక్కని గుర్తింపు గురించా? ఏది ఏమైనా లాస్ట్ 20  మినిట్స్ లో సినిమా ఎలివేట్ అయినట్టు అనిపించటానికి రీసన్, అప్పుడే కథనం లో మొదలు అయిన టెంపో, ఎన్నో విషయాలు టపా టపా కవర్ చేసెయ్యటం వలన. 


గెలుపు కోరుకునే వాడు మనిషి - గెలుపు ని పంచేవాడు మహర్షి 

ఫ్రెండ్ గెలుపు కోసం త్యాగం చేసే వాడు అల్లరి నరేష్ - ఫ్రెండ్ చేసిన త్యాగం కోసం తిరిగి సాయం చేసిన వాడు మహేష్

చివరిగా ; ఈ ఆర్టికల్ ఇంత లెంగ్త్ వస్తుంది అని నేను అనుకోలేదు, ఇంకా చాలా వచ్చింది, అందులో నుంచి కట్ చెయ్యగా ఇది మిగిలింది, కాబట్టి మధ్యలో స్కిప్ చేసి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్లి ముందు నుంచి చదవండి అని నేను అంటే ఎంత కామెడీ గా ఉంటుందో, ఈ సినిమా కి ఇంత లెంగ్త్ కట్ చేసిన డైరెక్టర్ ఏమైనా వివరణ ఇచ్చినా కూడా అంతే కామెడీ గా ఉంటుంది. కొంచెం ఓపిక పడితే కంఫర్టబుల్ గా ఒక సారి చూసేయ్యోచు కానీ, రిషి క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసి, అదే పాత్ర చిత్రణ తో వండర్స్ చేసే స్కోప్ ఉన్నా కూడా ఎంచుకున్న కథనం దానికి అవకాశం ఇవ్వలేదు. ఆల్రెడీ చూసేసిన చాలా సినిమాలు గుర్తుకు వస్తూ ఉండటం వలన కట్టి పడేసే తత్త్వం కూడా లోపించి గొప్ప సినిమా అనిపించుకోటానికి దూరంగా ఒక సాదా సినిమా గా మిగిలిపోయింది. 










12 comments:

krish said...

Good but meeru suthi ga rasaru.. akkada mahesh screen meda
kanapadagane hayi ga undi bore ga unna.. ikkada chala bore ga undi..😋

venkat said...

malli inni rojula tarvata as usual ga mee style lo kummesaru ga raju garu cheelchi chendadesaru

Anonymous said...

as usual superb one sir

Anonymous said...

babu enti ee length enduku intha kaksha

Unknown said...

Last Paragraph super andi. Aa director garu aa length prathi interview lo explanation chusthe chala chiragga undhi.Nenu Mahesh ayina naaku movie nachaledhu. Edho akkadakkada okati rendu chotla thappa ..

kiran said...

perfect analysis raju garu movie lo ekkado edo miss aindi ani feel ayyanu nenu mee article dvara telisindi em miss aindi ani. tarachuga rastu undandi sir

AD said...

Meru mention chesina points story discussion time lo matladukoni undi unte inka better product vachedi . Common audience ga mere inni points cheptunte field lo unnollu inkentha alochinchali ? Audience ni take it for granted ga teesesukoni cinemalu teesthe ilage untundi Mari. Great work sir keep it up

Anonymous said...

savagottesaru ga director ni

babu said...

raju garu back with a BANG annamata ma hero fans kuda nochukokunda vrayatam meeku butter tho pettina education. kudos to your knowledge

Anonymous said...

sir requesting you to write similar articles for all other movies as well

comrade said...

sir please write on dear comrade

Y ASHOK KUMAR said...

Roommate arrest aithe kaneesam emaipoyado kooda thelsukoleni hero? Pch 😎

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views