తెగింపు - కథ - కథనం - విశ్లేషణ




తెగింపు - కథ - కథనం - విశ్లేషణ 

 

అజిత్ కుమార్ - మన తెలుగు వాళ్ళకి కూడా పరిచయం అక్కర్లేని పేరు. అప్పుడెప్పుడో వచ్చిన ప్రేమ లేఖ ఎంత మందికి గుర్తుందో తెలియదు కానీ, అయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ మొదలు పెట్టిన తర్వాత వచ్చిన గ్యాంబ్లర్ మన అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు తెలుగులోకి కూడా డబ్బింగ్ రూపం లో వచ్చి చేరాయి. అయన కి తమిళనాడు లో ఉన్న ఫాలోయింగ్ ని పోల్చి చెప్పాలి అంటే మన తెలుగులో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫాలోయింగ్ తో సమానం అంటే అతిశయోక్తి కాదు. రిజల్ట్ తో సంబంధం లేకుండా అయన సినిమాలకి వచ్చే ఓపెనింగ్స్ ఏ దానికి నిదర్శనం. స్టైల్ తో కూడిన స్వాగ్ అయన సొంతం. ఆయనకి తెలుగులో కూడా ఒక డైహార్డ్ కల్ట్ ఫాలోయింగ్ ఉంది. సంఖ్యా పరంగా చిన్నదే అయిఉండొచ్చు కానీ, అజిత్ కుమార్ సినిమా వస్తుంది అంటే మన తెలుగు సోషల్ మీడియా చానెల్స్ వరకు హడావుడి కూడా గట్టిగానే ఉంటుంది. అయన కట్ అవుట్ కి, ఆయనకి ఉన్న ఫాలోయింగ్ కి అయన ఎంచుకునే సినిమాలు ఎప్పుడు ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. ఎప్పుడు అయితే సాల్ట్ అండ్ పెప్పర్ మొదలుపెట్టాడో అప్పటి నుంచి రంగు లేదు, ఎంచుకునే సినిమాల్లో రుచి లేదు, పాత్రల్లో చిక్కదనం లేదు. ఉపాధి హామీ పధకం కింద వరస పెట్టి ఒకే ప్రొడక్షన్ హౌస్ కి, ఒకే డైరెక్టర్ కి మూడో సినిమా గా సంక్రాంతి కి తెగింపు తో మన ముందుకి వచ్చారు. అంతకు ముందు వచ్చిన పింక్ రీమేక్ పాస్ అయిపోయినా, మధ్యలో వచ్చిన వలిమై నలిపేసింది. అయినా కూడా బరితెగించి ఈ తెగింపు ని మన ముందుకి తోసేశారు. సినిమా చూసిన తర్వాత కలిగే మొదటి ప్రశ్న, అసలు మూడో సినిమా కూడా అవకాశం ఇచ్చే అంతలా ఈ కథ - కథనం లో ఏముంది, దాని గురుంచి విశ్లేషించే చిరు ప్రయత్నమే ఈ ఆర్టికల్ . 


కథ - ఒక లైన్ లో చెప్పుకోటానికి, ఒక పెద్ద బ్యాంకు స్కాం ని బయట పెట్టడానికి అదే బ్యాంకు లో దొంగతనం ప్లాన్ చేసిన హీరో కథ. ఇదంతా ఎందుకు చేసినట్టు ? 


దీనినే ఒక నాలుగు లైన్స్ లో చెప్పమంటే, కొంత మంది కలిసి ఒక పెద్ద బ్యాంకు లో దొంగతనం కి ప్లాన్ చేస్తారు. ప్లాన్ ప్రకారం బ్యాంకు లోనికి వెళ్లిన వాళ్ళకి, అక్కడ ఆల్రెడీ అదే పని మీద ఉన్న ఒకడు తగుల్తాడు. వీళ్ళకి తెలియని ఇంకో విషయం ఏంటి అంటే అక్కడ మూడో బ్యాచ్ కూడా ఒకటి ఉంది. పెద్దగా ఆలోచించకండి, అంతకు మించి అక్కడ సుర్ప్రైజ్లు ఎం లేవు. వీళ్ళు ఎవరు, ఎందుకొచ్చారు, అందులో మన హీరో కి కావాల్సింది ఏంటి అనేది కథ. 


బాగానే ఉంది, అసలు ఇంతకు హీరో ఎవరు ? ఈ ప్రశ్న గురుంచి పెద్దగా డిస్కషన్స్ రాలేదు అనుకుంటా, డెవలప్ చెయ్యకుండా వదిలేసారు. మనకి అర్ధం అయ్యేది ఏంటి అంటే, హీరో ఒక కాంట్రాక్టు థీఫ్, చోర్, దొంగ, అతనికి ఒక టీం.  ఒకానొక టైం లో అతని టీం మీద జరిగిన దాడి లో ప్రాణాలు పోయే స్టేజి లో కాపాడిన ఒక కుటుంబంకి జరిగిన మోసం గురుంచి తెలుసుకొని, అలాంటి ఎంతో మందికి సంబందించిన ఒక సమస్య ని కామెడీ గా ఎలా సాల్వ్ చేసాడు అనేదే కథ. మధ్యలో కామెడీ ఎక్కడ నుంచి వచ్చింది ? జస్ట్ ఫస్ట్ పేరాగ్రాఫ్ కే ఇన్ని డౌట్స్ అంటే కష్టం. అందుకే సింగల్ లైన్ లో, నాలుగు లైన్స్ లో కథలు చెప్పటం మానేశారు డైరెక్టర్స్, ఫస్ట్ సిట్టింగ్ ఏ ఫుల్ లెంగ్త్ నరేషన్ ఇస్తున్నారు అంట. మనం కూడా ఫుల్ లెంగ్త్ నరేషన్ ఏ ఇచ్చుకుందాం


కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన అసలు కథ వేరే ఉంది, క్రిష్ అనే ఒక బ్యాంకు ఓనర్, తన ఉద్యోగుల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ మందిని చేర్పించి, వాటిని బినామీ కంపెనీస్ లో పెట్టుబడి పెట్టి 25000 కోట్లు మోసం చేస్తాడు. దానిని తన బ్యాంకు లాకర్ కిందన గదిలో దాచుకుంటాడు. అక్కడ ఉంటె కష్టం అని, 18  కంట్రైనర్లు ద్వారా ఆ డబ్బు తరలించి, ఆ ప్లేస్ లో ఫేక్ నోట్స్ పెట్టి, లాకర్ లో ఒరిజినల్ మనీ కోసం దొంగతనం ప్లాన్ చెయ్యమంటాడు. ఆ డీల్ దొంగోడు అయిన హీరో కి వస్తే రిజక్ట్ చేస్తాడు, వేరే వాళ్ళతో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ఆ దొంగతనం చేసిన వాళ్ళని చంపేసి ఆ టైం లో బాంబు పెట్టి బ్యాంకు పేల్చేస్తే 25000 కోట్లు పార్టనర్స్ కి కూడా ఇవ్వకుండా క్రిష్ ఒక్కడే కొట్టేద్దాం అనుకుంటాడు. కానీ అసలు దొంగతనం ప్లాన్ తెలిసిన వాళ్లెవరు బ్రతికి ఉండకూడదు అని హీరో ని కూడా చంపేద్దాం అని ప్లాన్ చేస్తే, హీరో తప్పించుకుంటాడు. ఒక కుటుంబం సహాయ పడుతుంది. వాళ్ళ కొడుకు ఈ బ్యాంకు ద్వారా మోస పోయాడు అని తెలుసుకొని, అలాంటి ఎంతో మంది పేద ప్రజానీకం కోసం, వాళ్ళ నుంచి దోచేసిన 25000 కోట్లు వాళ్ళకి పంచెయ్యటం కోసం విలన్ ప్లాన్ చేసుకున్న దొంగతనం లోకి హీరో ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత ఎం జరిగింది అనేది వెండి తెరపై చూడమన్నాడు. 


ఇది ఏ జానర్ కి చెందిన సినిమా అని ఆలోచిస్తే, ఇదొక హేస్ట్ మూవీ - ఫస్ట్ హాఫ్ మొత్తం బ్యాంకు దోపిడీ గురుంచే కాబట్టి, హాస్టేజ్ డ్రామా - సెకండ్ హాఫ్ మొత్తం బ్యాంకు లోనే విలన్ ని తన కంట్రోల్ లో తీసుకుంటాడు కాబట్టి. పైన చెప్పిన రెండు జానర్లు గురుంచి మనకి తెలిసింది ఏంటి అంటే, వీటితో ఒక యాక్షన్ థ్రిలర్ లాంటి సబ్జెక్టు నో, మంచి సస్పెన్స్ బొమ్మనో తీసి ఉంటారు అని. అవసరమే లేదు, విజయ్ తో బీస్ట్ లాంటి నాసి రకం సినిమాలు కూడా తీయొచ్చు కామెడీ తో కలగాపులగం చేసి అని మన నెల్సన్ గారు నిరూపించగా లేనిది నేను ఎందుకు చెయ్యకూడదు అని వినోద్ గట్టిగా డిసైడ్ అయినట్టు ఉన్నాడు. ప్రొడ్యూసర్ కోసం ఉపాధి హామీ పధకం కింద, ఒకే బిల్డింగ్ లో సెట్ ఏసుకొని చాలా వరకు సింగల్ కాస్ట్యూమ్ తో లాగించేయొచ్చు, ఫాన్స్ కోసం ఎంత సీరియస్ సిట్యుయేషన్ లో అయినా కామెడీ చేసుకోవచ్చు, మన కోసం గ్రాండ్ హాలీవుడ్ క్లైమాక్స్ మాత్రం ప్లాన్ చేసుకుందాం. అక్కడ టెర్రరిస్ట్ గురుంచి, ఇక్కడ మధ్యతరగతి జనాలు బ్యాంకుల్ని నమ్మి ఎలా మోసపోతున్నారు అనే చప్పబడిపోయిన మేటర్ గురుంచి. ఇంతోటి దానికి తెగింపు అనే టైటిల్ అవసరం లేదు, అదే స్విస్ బ్యాంకు లో దాచుకున్న బ్లాక్ మనీ గురుంచో, పన్ను ఎగేసి పారిపోయిన మాల్యా గురుంచో లేక ఇంకేమైనా సమకాలీన ఆర్థిక మోసాల గురుంచో అయ్యి ఉంటె బావుండేది. 


కథనం - ఫస్ట్ ఆక్ట్ - ప్రారంభం 

ఫ్లాష్ బ్యాక్ సినిమా అవ్వటం వలన, కథ ఎక్కడో అజిత్ ఫ్లాష్ బ్యాక్ లో మొదలైపోతుంది, కానీ నరేషన్ ప్రకారం మనకి మిడిల్ లో సినిమా ప్రారంభం అవుతుంది. రెండు సమాంతరంగా జరిగే కథలు అని మనకి చివరకి అర్ధం అవుతుంది. 

షేర్ మార్కెట్ కుంభకోణం గురుంచి న్యూస్, నిందితుడు పరార్, గాలిస్తున్న సిబిఐ, పట్టుబడ్డ నిందితుడు, భారీగా RDX స్వాధీనం, ఇంకో పక్క అజయ్ తన టీం తో కలిసి బ్యాంకు దొంగతనం ప్లానింగ్. రూల్స్ కి వ్రతిరేకంగా బ్యాంకు లో ఉన్న 500 కోట్లు కొట్టెయ్యాలి అనేది ప్లాన్. లోపలకి వెళ్లిన వాళ్ళకి అక్కడే ఉన్న తల ఎంట్రీ తో షాక్. వందలాది బుల్లెట్స్ పేల్చుకుంటూ ఫాన్స్ విజిల్స్ వేసి అలసిపోయే వరకు సాగే ఒక ఇంట్రడక్షన్. ఎవరు ఎవరి తాలూకానో, ఎవర్ని ఎవరు కాలుస్తున్నారో కూడా అర్ధం కాకుండానే 15 నిముషాలు గడిచిపోతాయి. జనరల్ గా సీట్ లో కూర్చునే ప్రేక్షకులకి కొంచెం సెటిల్ అయ్యే టైం ఇచ్చి స్టార్ట్ చేస్తే వచ్చే కిక్ ఒక రకం అయితే, ఇలాంటి ఒక బాంగ్ తో స్టార్ట్ అయ్యే సినిమాలు నెమ్మదిగా సర్దుకుపోవటానికి ఎంతో టైం పట్టదు. సీరియస్ మోడ్ నుంచి హీరో కామెడీ చెయ్యటం మొదలు పెట్టాక ఎం జరుగుతుందో అనే ఆత్రుత నుంచి ఎదో జరుగుద్ది లే అనిపించటం మొదలు అయ్యే టైం అన్నమాట. తెగింపు మోడ్ నుంచి బీస్ట్ మోడ్ కి జారుకున్న తరుణం ఇదే. 


ఇంతలో తన ప్లాన్ లో ఎదో తేడా జరిగింది అని తెలుసుకున్న అజయ్ బ్యాంకు కి చేరుకుంటాడు,  ఇక్కడ హీరో గారు నేను వాళ్ళతో డీల్ చెయ్యను, ఒక కమెడియన్ తో మాత్రమే మాట్లాడతాను అంటారు. నెమ్మదిగా కథలోని సీరియస్ నెస్ కూడా సిగ్గు పడుతూ కర్టెన్ వెనక దాక్కుంటుంది. హీరో కి సహాయపడే పాత్రలో మంజు గారు ఉన్నారు అని తెలుస్తుంది. అంత పెద్ద దొంగతనం గురుంచి కానీ, లోపల నుంచి వినిపిస్తున్న బుల్లెట్ సౌండ్స్ గురుంచి కానీ బ్యాంకు బయట వాతావరణం లో హడావుడి ఏమి ఉండకపోగా,  మీడియా కామెడీ కూడా ఆడ్ అవుతుంది. షేర్ వేల్యూ పడిపోతుంది కాబట్టి లోపల ఉన్నోళ్లు ఎవరు బ్రతకకూడదు అనే వింత విలన్ పరిచయం అవుతాడు. అంతా అయోమయం గందరగోళం గా ఉంటుంది, ప్రేక్షకులకి నీడ్ టు నో బేసిస్ లో చెప్పాల్సిన విషయాలు చెప్పాల్సిన టైం లో చెప్పక పోతే, ఎం జరుగుతుందో అనే అయోమయం లోనే ఉంటాడు తప్ప కుతూహలం తో కొట్టేసుకోడు.  


అజయ్ టీం ని తనవైపు తిప్పేసుకున్న హీరో కి నెక్స్ట్ ఎం చెయ్యాలో వినోద్ సర్ చెప్పకపోవటం వలన మైఖేల్ జాక్షన్ డాన్స్ వేస్తూ ఉంటాడు. అప్పటికే న్యూస్ జనాల్లోకి వైరల్ అయినా కూడా, ఎవరికీ అది బ్యాంకు లో ఉన్న ప్రజల డబ్బు అనే భావం కొంచెం కూడా ఉండదు. బయట ఎం జరుగుతుందో ఎప్పటికప్పుడు మంజు గారి ద్వారా తెలుసుకుంటున్న హీరో, ఇటు షూటర్ లు వచ్చినా, అటు మిలటరీ వచ్చినా తన కామెడీ తాను చేసుకుంటూ ఉంటాడు. 


సెకండ్ ఆక్ట్ - మిడిల్ - సమస్యాత్మకం


విషయం సీఎం వరకు వెళ్ళటం, కమీషనర్ డైరెక్ట్ గా రంగంలోకి దిగటం లో కథనం లో కొంచెం ఊపు వస్తుంది. సినిమా బీస్ట్ మోడ్ నుంచి తెగింపు మోడ్ కి వస్తుంది. చూసే ప్రేక్షకుడు మదిలో రన్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే నిజాయితీ గా కనిపించే పోలీస్ కి సపోర్ట్ చెయ్యాలా - దొంగతనానికి వచ్చిన హీరోనా ? ఇంకో పక్క మంజు సైడ్ నుంచి సపోర్ట్ కట్ చేస్తారు. హీరో కి కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఇంతలో హీరో కి భారీగా మందుగుండు దొరుకుంటుంది. లోపల జనాలు కూడా బందీగా ఉండటం వలన పోలీస్ సైడ్ నుంచి కూడా యాక్షన్ తీసుకోలేక పోతు ఉంటారు. ఇంతలో మంజుని ట్రాక్ చేస్తారు. ఆవిడకి ఒక ఫైట్.బ్యాంకు మేనేజర్ ద్వారా ఇదంతా అజయ్ ప్లాన్ అని తెలుసుకుంటాడు కమీషనర్. అప్పుడు అజయ్ ద్వారా మన హీరో ఎవరు అని తెలుస్తుంది. అయన మాములు దొంగ కాదు ఒక పెద్ద టక్కరి దొంగ. ఎన్నో దేశాలు వెతుకుతున్న డార్క్ డెవిల్ ఏ మన తల. పోలీసుల్ని ఎడా పెడా చంపేసే కిరాతకుడు. అయన కి అజయ్ ప్లాన్ గురుంచి చెప్పినప్పుడు నేను చెయ్యను అంటాడు. అందుకని వేరే టీం తో ప్లాన్ చేశాను అని చెప్పేస్తాడు. అసలు ఆ డార్క్ డెవిల్ ఎప్పుడో చచ్చిపోయాడు ఇంకా బ్రతికి ఉండటం ఏంటి అని ఒక ట్విస్ట్. తన డిమాండ్ ఏంటి అని అడిగితే, బ్యాంకు ఓనర్ తో మాట్లాడాలి అంటాడు. అప్పుడు తెలుసుంటుంది అది 500 కోట్ల దొంగతనం కాదు అని 25000 కోట్లు అని. ఎస్ మనం అందరం వింటున్నది కరెక్ట్ ఏ. అక్షరాలా 25000 కోట్లు. అప్పటి వరకు ఉన్న సీరియస్ నెస్ కి కొంచెం రిలీఫ్ టైపు కామెడీ అన్నమాట. బ్యాంకు లో ఉన్న మూడో గ్యాంగ్ కి మెసేజ్ రావటం. వాళ్ళకి హీరో బందీగా చిక్కటం తో ఇంటర్వెల్.


అప్పటికి కూడా అక్కడ ఎం జరుగుతుందో పూర్తిగా అర్ధం కాక అయోమయం లో ఉండటం ప్రేక్షకుడి వంతు అవుతుంది. అప్పటి వరకు స్లో మోషన్ లో స్వాగ్ పేరుతో అభిమానుల్ని అలరించిన హీరో ఒక్క సరిగా విలన్ కి దొరికిపోవడం ప్రేక్షకులకి పెద్ద షాక్ అనుకోని ఉండొచ్చు కానీ అంతకు ముందు రూపాయి రెండు రూపాయిలు షేర్ తగ్గింది అని గింజుకున్నా విలన్ కి అంత సీన్ ఉంటుంది అని ఎవరు అనుకుంటారు. ఇదంతా మా తల ప్లాన్ లో భాగమే అయి ఉండాలి కదా? ఏది ఏమైనా కమిషనర్ వచ్చిన తర్వాత నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు అంతో ఇంతో ఎంగేజ్ చెయ్యగలిగినా, విషయం బోధపడని మనకి సెకండ్ హాఫ్ మీద ఆశలు పెట్టుకోవటం ఒకటే మిగులుద్ది.


లోపలకి ఎంటర్ అయిన విలన్ హీరో ని లేపెయ్యకుండా, వాడి ప్లాన్ ఏంటో కూడా చెప్పి ఇంతకీ ఎవడ్రా నువ్వు అని అడుగుతాడు. సెకండ్ హాఫ్ మీద ఎన్నో అసలు పెట్టుకున్నోళ్లకి కుర్చీ లో కూర్చొనే టైం కూడా ఇవ్వకుండా. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ టైం. హీరో ఇంట్రడక్షన్ సాంగ్. ఈ మొత్తం కథకి ప్రారంభం ఇదే అనుకోవచ్చు ఏమో. హ్యాపీ గా దొంగతనాలు చేసుకుంటూ, బోట్ లో తిరుగుతూ, నలుగురు ఆనందం గా ఉండే టీం మెంబెర్స్ లో కొందరు ఒక పెద్ద హాలీవుడ్ ఫైట్ లో చనిపోగా, హీరో అండ్ మంజు గారు తీవ్రంగా గాయపడతారు. యాక్షన్ ఎపిసోడ్స్ మీద పెట్టిన శ్రధ్ద లో సగం పాత్రల మీద వాటి మధ్య సంబంధాల మీద పెట్టి ఉండాల్సింది. అసలు మంజు అండ్ హీరో గారు ఎం అవుతారు ? ఫ్రెండ్స్ ? లవర్స్ ? లివింగ్ ? ఏమో ఒకర్ని ఒకరు పార్టనర్ అని పిలుచుకుంటారు. కోలుకున్న హీరో అసలు మొత్తం ఎం జరుగుతుందో కనిపెడతాడు. కనీసం ఈ ప్రాసెస్ లో టక్కరి దొంగ నుంచి మంచి దొంగ గా మారిపోయాడు అని చూపించి ఉండాల్సింది. ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పి ఉండాల్సింది. అలా అయినా కొందరు వాక్ అవుట్ చేసే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అయ్యేవారు. ఈ మొత్తం ప్లాన్ మన విలన్ ప్లాన్ అని తెలుస్తుంది కమీషనర్ కి. హీరో మొత్తం డబ్బులు నాకే ఇచ్చేయ్ అంటాడు. ఇంకో పక్క కమీషనర్ ఫోన్ చేసి వీలైతే నీ ప్రాణాలు కాపాడుకో అంటాడు. ఇక్కడ వినోద్ అతి పెద్ద రిస్క్ తీసుకున్నాడు. ఒక పావు గంట సేపు హీరో లేకుండా ఒక ఎపిసోడ్ రన్ చేసాడు. అసలు హీరో దేనికోసం ఇదంతా చేస్తున్నాడో చెప్పాల్సిన ఎపిసోడ్ లో హీరో లేక పోవటం ఏంటి అనేది ఆయనకే తెలియాలి. ఇప్పుడు జనాలకి తెలియాల్సిన అసలు విషయం గురుంచి ఇంకో ఫ్లాష్ బ్యాక్. ఒక బ్యాంకు మీటింగ్ లో జనాల్ని ఎలా మోసాలు చెయ్యాలో ట్రైనింగ్ సెషన్ అన్నమాట. ఇదంతా జమానా కాలం లో మనం చాలా సినిమాలలో చూసేసిందే. అందులో సిన్సియర్ గా పని చేసే ఒక ఉద్యోగి, అలాంటి వాళ్ళకి మోసగాళ్ల మధ్య చోటు ఉండదు కాబట్టి, మోస పోయాడు అని తెలుసుకొని ఎదురు తిరిగితే చంపేస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఏ ఒకప్పుడు హీరో గాయపడితే కాపాడిన వాళ్ళు. ఆ కథ తెలుసుకొని హీరో ఈ ప్లాన్ మొత్తం చేసాడు అనే విషయం తెలుస్తుంది. ఓహో ఇదా జరిగింది అనిపించాలి - అదన్నమాట అయితే కథ అనిపించకూడదు. ఎమోషనల్ గా హీరో పాత్రతో కలవాల్సిన ఎపిసోడ్ మరింత గొప్పగా ఉండాల్సింది. ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత ప్రస్తుతానికి వచ్చిన కథ ప్రీ క్లైమాక్స్ వైపు నడుస్తుంది. అప్పటి వరకు కొంచెం ఐన తెగింపు మోడ్ లోకి వచ్చింది అనుకున్న సినిమా నెమ్మదిగా మళ్ళీ బీస్ట్ మోడ్ లోకి జారుకుంటుంది. లైవ్ ఇంటర్వ్యూ పేరుతో చేసిన కామెడీ ఏదైతే ఉందొ, అది హీరోయిజం అనుకున్నారేమో కానీ, విలన్ ని మరింత బుడబుక్కలోడిని చేస్తుంది అని అలోచించి ఉండరు. అక్కడక్కడా కొన్ని సెటైర్స్ బాగానే పేలినా కూడా, కథలోని డెప్త్ ని పలుచన చేసేస్తాయి అని ఊహించి ఉండరు. ఈ మొత్తం ఎపిసోడ్ ఒక సహన పరీక్ష. ఫైనల్ గా హీరో మీద టెర్రరిస్ట్ ముద్ర వేసాక క్లైమాక్స్ కి అసలు రంగం సిద్ధం అవుతుంది.  


థర్డ్ ఆక్ట్ - ముగింపు 


అప్పటి వరకు ఎంతో కొంత ఓపిక పట్టిన వాళ్ళని కూడా ఎగ్జిట్ గేట్ చూసుకొని పరిగెత్తించే రేంజ్ క్లైమాక్స్ రాసుకున్నారు వినోద్ సర్. ఒక పక్క లైవ్ కట్ అయిపోతుంది, ఇంకోపక్క మనీ బ్యాంకు లో లేదు, మరో పక్క ఆర్మీ, నేవీ అందరు అలెర్ట్ అయిపోయారు. బ్యాంకు లో జనాలు ఉన్నారు అని చూడకుండా దానిని పేల్చేయ్యటానికి రెడీ అయిపోయారు. రెండు టన్నుల RDX, ఫైర్ ఇంజిన్ లో డబ్బులు పంచటం. అక్కడ నుంచి సముద్రం లో భారీ చేజ్. బీస్ట్ క్లైమాక్స్ కూడా చిన్నబోయేలా ప్లాన్ చేసారు. ఇది మాములు విధ్వంసం కాదు. 


కమర్షియల్ సినిమాలలో కూడా పెద్దగా లాజిక్ లు వెతకరు జస్ట్ మాస్ మ్యాజిక్ ని నమ్ముకుంటారు, కానీ తెగింపు లాంటి బొమ్మలకి కొంతలో కొంత అయినా లాజిక్ ని కామన్ సెన్స్ ని వాడుకుంటే ఎలా ? 25000 కోట్లు బ్యాంకు బిల్డింగ్ లో కిందన దాచారు, దానిని తరలించడానికి 18 కంట్రైనర్లు వాడారు. అసలు అంత అమౌంట్ దాచటానికి ఎంత చోటు కావాలి ? బేసిక్ కామన్ సెన్స్ ని క్వశ్చన్ చేసుకోవాలి కదా. విమానం ని హైజాక్ చేస్తేనే దేశద్రోహులని వదిలేసే మన ప్రభుత్వాలు, ప్రజల ప్రాణాలు తీసెయ్యమని ఎందుకు ఆర్డర్ ఇస్తుంది.  అయినా ఒక పేరు లేదు, పాత్రకి కావాల్సిన పరిచయ చిత్రణ లేదు, తనలోని మార్పు కి సరైన కారణం లేదు, ఎంచుకున్న లక్ష్యానికి చేరుకొనే ప్రాసెస్ లో నిజాయితీ లేదు, అయినా కూడా ఈ కథని ఓకే చేసారు అంటే - ఇది కదా తెగింపు అంటే. 


ఆడియన్స్ ని కనెక్ట్ చేయలేనప్పుడు మనం ఏ కథ ఎంచుకున్నా సాధించేది ఎం ఉండదు. కథలో హీరో చేసే పోరాటానికి కనెక్ట్ అయ్యేలా చెయ్యాలి అంటే, సమస్య హీరో ది అయ్యి ఉండాలి. స్వతహాగా తాను నష్టపోయి ఉండాలి, తన సొంత కుటుంబం ఇబ్బందులు పడి ఉండాలి, అప్పుడు తన తెగింపు కి ఒక అర్ధం ఉంటుంది. అది జెంటిల్ మాన్ అయినా భారతీయుడు అయినా శివాజీ అయినా... మన సొంత లైబ్రరీ కి మించిన రిఫరెన్స్ ఇంకేముంటుంది. అయితే సామాన్యులకి న్యాయం చేయడం కోసం తీసుకున్న నిర్ణయానికి కూడా ఎలాటి ఎమోషనల్ కనెక్ట్ వుండదు


ఈ కథ మొత్తానికి విలన్ క్రిష్ పాత్ర కి ఒక ఆశయం ఉంది, దానిని సాధించాలనే తపన ఉంది, దాని కోసం ఎంతో కస్టపడి ప్లాన్స్ కూడా వేసుకున్నాడు, వాటికీ ఆటంకం రూపం లో హీరో వచ్చి కూర్చున్నాడు, ఈ ప్రాసెస్ లో హీరో అడ్డు తొలగిపోయి ఉంటె తన కథ కంచికి చేరేది. ఇంకొక పక్క, హీరో కి ఆశయం లేదు, సొంత లక్ష్యం లేదు, ఎవరికో ఎదో జరిగితే ఈయనేదో ఉత్తముడు అంటూ పక్కోళ్ల కష్టానికి తాను ముందుకి పోతాడు, విలన్ బుడబుక్కలోడు కాబట్టి ఈయన గెలిచేసాడు. ఒకసారి ఇలా ఆలోచించండి, ఒకడు దొంగతమ్ ప్లాన్ చేసాడు, వాళ్ళ టీం లోపలకి వెళ్లే సరికి ఇది నా ప్లాన్ అని హీరో అంటాడు, ఆ తర్వాత వాళ్లందరికీ తెలుస్తుంది వెనక వేరేవాళ్ళ ప్లాన్ కూడా ఉంది అని. ఎవరి ప్లాన్ లోకి ఎవరు వచ్చినట్టు? అయినా మా హీరో దొంగోడు ఎందుకు అయ్యాడు, దాని వెనక ఏమైనా కథ ఉందా? పోనీ మంచోడు కింద ఎందుకు మారిపోయాడు ? అలా మారిపోయేలా చేసిన సీన్ ఏమైనా ఉందా?  ఈయన ఎంత మంచోడు అంటే, జనాలకి పంచటానికి డబ్బు దొంగతనం చేస్తూ, ఫైటింగ్ కి వచ్చిన పోలీస్, ఇండియన్ ఆర్మీ, నేవీ ఆఫీసర్స్ తో కూడా యుద్ధం చేస్తాడు. రోడ్ మీద ఫైర్ ఇంజిన్ పెట్టి డబ్బులు వెదజల్లుతాడు, ఆ డబ్బులు అన్ని పాపం బ్యాంకు ని నమ్మి మోసపోయిన వాళ్ళకి కదా తిరిగి ఇవ్వాలి అని అడగకండి. కొట్టేస్తాను మిమ్మల్ని (జయసుధ మాడ్యులేషన్ లో)



0 comments:

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views