కల్కి 2898 AD - కథ - కథనం - విశ్లేషణ




కల్కి 2898 AD - కథ - కథనం - విశ్లేషణ 


 డార్లింగ్ ప్రభాస్ బాహుబలి తర్వాత అన్ని రకాల జానర్ లు ట్రై చేస్తున్నా కూడా, కటౌట్ కి తగ్గ సినిమా అంటే మధ్యన వచ్చిన సలార్ అనే చెప్పుకోవాలి, ఫాన్స్ ని కూడా అంతో ఇంతో సంతృప్తి పరిచి మంచి ఊపు తెప్పించింది. నాగ అశ్విన్ గారు మొదటి సినిమా తో మంచి పేరు తెచ్చుకోవటమే కాకుండా రెండో సినిమా మహానటి తో అంచనాలు కూడా పెంచుకున్నాడు. వాళ్ళిద్దరిలో కలయిక లో భారీ బడ్జెట్ తో కల్కి సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరి చూపు సినిమా వైపే అంటే అతిశయోక్తి కాదు. సలార్ ఇచ్చిన ఊపు కావొచ్చు, అశ్విన్ మీద అంచనాలు కావొచ్చు, అమితాబ్ గారు, కమల్ గారి లాంటి మహానటుల కాంబినేషన్ కావొచ్చు, పబ్లిసిటీ చెయ్యాల్సిన అవసరమే లేకుండా సినిమా కి ప్రీ బుకింగ్స్ లో సంచలనాలు, ఓపెనింగ్స్ లో అద్భుతాలు, వీకెండ్ కి రికార్డు కలెక్షన్స్ సొంతం అయ్యాయి. ముందు ముందు ఊపు ఇలాగె కొనసాగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తెలుగు సినిమా సాధిస్తున్న ఘనత కి గర్వ పడుతూ, పనిలో పనిగా సినిమా ని విశ్లేషించుకుందాం అనే చిరు ప్రయత్నమే ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం

 

"సినిమా చూడని వాళ్ళు, చూడాలి అనుకునే వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిది" అని నా అభిప్రాయం. ఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు

 

ఇంతకీ కల్కి సినిమా దేని గురుంచి? శ్రీ మహావిష్ణువు దశావతారం అని చెప్పబడ్డ కల్కి అవతారం గురుంచేనా? ఒక వేల దానిగురుంచే అయితే మనం విన్న / చదువుకున్న కల్కి పురాణం నుంచి తీసిందేనా అనే అనుమానం కలగటం సహజం. ఎందుకంటే, మనకి తెలిసిన చరిత్ర అయితే ఎలా తీసాడు అని చూస్తాం, తెలియని దాని గురుంచి ఉండే అంచనాలు వేరు. బేసిక్ గా చరిత్ర గురుంచి తెలుసుకోవాలి అంటే డాక్యూమెంటరీస్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, తెలిసిన చరిత్ర అయినా సరిగ్గా ప్రెజెంట్ చెయ్యలేకపోతే వచ్చే విమర్శ కంటే, ఎదో ఉండబోతుంది, ఎదో తెలుసుకోబుతున్నాం అని వచ్చే వాళ్ళని సంతృప్తి పర్చటం కత్తి మీద సాము. అవన్నీ పటాపంచలు చేస్తూ, ఇది మన పురాణాల నుంచి కొంత తీసుకొని దానిని ఆధునిక సైన్స్ ఫిక్షన్ తో జోడించి, యాక్షన్ రంగరించి ఆబాలగోపాలాన్ని అలరించటానికి చేసిన ప్రయత్నం అని అర్ధం చేసుకోటానికి ఎక్కువ సమయం పట్టదు

 

కథ : సినిమా వరకు కథా వస్తువు అంటూ ఎం లేదు, ఇదొక ఎపిసోడ్, ఎపిసోడ్ ముఖ్య ఉద్దేశం ఒక ఇంట్రడక్షన్ సెట్ చెయ్యటం మాత్రమే. కథ అంటే దానికి ఒక ప్రారంభం, మధ్యమం అండ్ ముగింపు ఉండాలి, ఒక సంఘటన కలిపించి, అక్కడ వరకు నడిపించి, అక్కడ ఒక బ్రేక్ ఇచ్చి తర్వాత పార్ట్ లో చూసుకోమనటం మధ్యన మనకి బాగా అలవాటు ఐన వెబ్ సిరీస్ అప్రోచ్ లా ఉంటుందిమంచి వెబ్ సిరీస్ లో కూడా ఎపిసోడ్ కి ఎపిసోడ్ ఒక సినిమా చూసినట్టు, ఒక కంప్లీట్నెస్ తో కూడిన ముగింపు తో పాటు ఒక టీసింగ్ ఎలిమెంట్ తో ఎండ్ అవుతుందిఅవైతే వెంట వెంట నే చూసేయ్యోచు కానీ ఇక్కడ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం రెండేళ్లు ఆగాలి ఏమో. "రేపటి కోసం" అని అందరు అంటూ ప్రాణ త్యాగాలు చేస్తుంటే, రాబోయే సినిమా పార్ట్స్ కోసం సినిమా కథ త్యాగం చేసిందా అనే  ఫీలింగ్ కలుగుతుంది.

 

స్ఫూర్తి : చావు లేని ఒక మహా యోధుడు - అపజయం ఎరుగని ఒక మహా వీరుడు తలపడాల్సి వస్తే ? మహాయోధుడు ఆల్మోస్ట్ అన్ని విద్యలు తెలిసిన చిరంజీవి అశ్వత్థామ - మహా వీరుడు ఒకప్పటి తన స్నేహితుడు ఐన కర్ణుడు అయితే ? అయితే? వినటానికి చాలా బావుంది కదా ? వాళ్లిద్దరూ అమితాబ్ అండ్ ప్రభాస్ కాబట్టి చూడటానికి కూడా చాలా బావుంది. ఎవరు గెలిచారు? ఎందుకు తలపడ్డారు? ఇలాంటివి అన్ని ఆసక్తి గా మలచడానికి సరిపడా కథనం సెట్ అయ్యిందావాళ్ళ యుద్ధానికి  హేతుకమైన కారణాలు, దారితీసిన పరిస్థితులు, ఉత్సాహం కలిగించే విధంగా కథనం లో కుదిరాయా

 

అదేంటి కమల్ హాసన్ గురుంచి చెప్పకుండా కేవలం అమితాబ్ అండ్ ప్రభాస్ ని మాత్రమే టచ్ చేసారు అంటే? ఎపిసోడ్ వరకు అయన ఒక థ్రెట్ కాదు, ఆయనకి ఒక థ్రెట్ కూడా లేదు... అది ఎలాగో కథనం విశ్లేషణలో చూద్దాం

 

కథనం

 

ఉపోద్ఘాతం: కురుక్షేత్ర యుద్ధం లో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని సంధించి, వెనక్కి తీసుకోలేక దానిని దారిమళ్లించి ఉత్తర మీద ప్రయోగించి పరీక్షిత్తుని తల్లి గర్భంలోనే చంపేస్తాడు. నువ్వు చేసింది అతి పెద్ద పాపం అని, నీకు చావు శిక్ష కాదు, అది నీకు ముక్తి. వేలాది సంవత్సరాలు చావు రాక, పాపాలు చూస్తూ, గాయాలు మానక ఒంటరిగా జీవిస్తావ్ అని శపిస్తాడు కృష్ణుడు. ఒరిజినల్ గా అయితే 3000 సంవత్సరాల శిక్ష అనుకుంట, కానీ, సిట్యుయేషన్ ని ట్రిగ్గర్ పాయింట్ గా తీసుకొని, దానిని సెటప్ కి లింక్ చేసుకునే విధం గా, శ్రీ కృష్ణుడే అశ్వత్థామ తో  ప్రాయశ్చిత్తంగా, కలియుగం లో కలి నా పుట్టుకని అడ్డుకునే సమయం లో నువ్వే నా గర్భగుడికి కాపలా కాయాలి అని చెప్తాడు. అప్పటి నుంచి సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు అశ్వత్థామ

 

ఆరువేల సంవత్సరాల తర్వాత 2898

 

ప్రారంభం: మూడు నగరాలు - మూడు సందర్భాలు 

 

 కృష్ణుడు చెప్పిన సమయం వచ్చింది అని, పురాణాల్లో చెప్పినట్టు దేవుడు అవతారం ఎత్తబోతున్నాడు అని, దేవుడిని బిడ్డలా మోస్తున్న అమ్మ కాశీలో ఉంది అని నమ్మిన రాజేంద్ర ప్రసాద్ ఆవిడని వెతుకుంటూ కాశీ కి వస్తాడు, భూమి మీద మిగిలిన ఆఖరి నగరం

 

కాశీ : నగరానికి ఉన్న ప్రమాదం అంటూ ఎం లేదు, కొంత మంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎలాగోలా బ్రతికేస్తూ ఉంటారు, ఇంకొంత మంది, ఎలాగైనా పాయింట్స్ సంపాదించి కాంప్లెక్స్ లోకి వెళ్ళాలి అని కొట్టుకు చస్తూ ఉంటారు నగరం కాంప్లెక్స్ కిందనే ఉన్నా, వీళ్ళలో వీళ్ళు కొట్టుకోవటమే కానీ, బయట నుంచి వచ్చి ఎవరో నాశనం చేస్తారు అనే భయం లేదు

 

శంబాలా : హిందూ పురాణాలలో పేర్కొనబడిన ఒక ఆధ్యాత్మిక నగరం. కొన్ని భారతీయ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లొకం ఒకటి హిమాలయాలలో ఉంది. ఇక్కడ రెబెల్స్ ఉంటారు, వీళ్ళు అయితే కాంప్లెక్స్ ని లేకుండా చేసి అందరికి అన్ని ఫెసిలిటీస్ ఇద్దాం అనే భావన లో కొందరు, దేవుడిని మోసే అమ్మ వస్తుంది, అప్పుడు కాంప్లెక్స్ పీడా విరగడ అయిపోతుంది అని కొందరు నమ్ముతూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు కాబట్టి వీళ్ళకి వచ్చిన ప్రమాదం అంటూ ఎం లేదు. 'రేపటి కోసం" అనేది వీళ్ళ నినాదం

 

కాంప్లెక్స్ : ఒక కొత్త ప్రపంచం, అన్ని వనరులు ఉన్న ప్రదేశం. ప్రదేశానికి ఉన్న ప్రమాదం అంటూ ఎం లేదు, ఎలైట్ ఫెసిలిటీస్ ఫర్ ఎలైట్ పీపుల్. రెబెల్స్ ఎవరైనా దాడి చేసినా కూడా ఎదుర్కొనే సత్తా ఉంది. వీళ్ళకి శంబాలా ఎక్కడ ఉందొ తెలిస్తే అసలు ఇంక వాళ్ళకి ఎదురు తిరగటానికి కూడా ఎవరు లేకుండా చేసేయ్యొచ్చు అని ఒక టార్గెట్ నగరానికి ప్రపంచానికి ఒకడే దేవుడు సుప్రీమ్ యాస్కిన్. యాస్కిన్ అంటే సైతాన్ అని అర్ధం వచ్చేలా పేరు పెట్టినా, ఈయన కలి అనుకుంటే, ఈయన దగ్గర ఇద్దరు కమాండర్స్ కొక అండ్ వికోక అనుకోవాలి. అయన వలన ప్రస్తుతానికి ప్రపంచానికి వచ్చిన ప్రమాదం ఎం లేదు, ఒక ల్యాబ్ లో కూర్చొని ఎక్సపెరిమెంట్స్ చేసుకుంటూ శాశ్వతత్వం కోసమో, తనని చంపగలిగే శక్తి ని గర్భం లోనే అంతమొదించటం కోసమో, ఆయనకి తప్ప ఎవరికీ తెలియని ఒక ఆశయ సాధన (దీని గురుంచి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం) కోసం అయన పని అయన చేసుకుంటూ ఉంటారు

 

కాంప్లెక్స్ లో జనాలకి ఇబ్బంది లేదురెబెల్స్ కి శంబాలా లో ఉన్నత కాలం ఇబ్బంది లేదు, కాశీ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు

 

అనుసంధానం:   మూడు నాగరాలని అనుసంధానం చేసే విషయం - కల్కి జననంమనకి తెలిసిన విషయం ప్రకారం, విష్ణువు తన అవతారమైన కల్కి గా విష్ణుయశాస్ మరియు సుమతిలకు శంభల అనే గ్రామం లో జన్మించారు అని. ఇప్పటి వరకు చెప్పుకున్న అన్నిటిని కలిపే ఒకే ఒక థ్రెడ్ "సుమతి". 

కాంప్లెక్స్ లో జరుగుతున్న ఎక్స్పరిమెంట్ వలన గర్భవతి అయిన సుమతి కి తనకి పుట్టబోయే బిడ్డని చంపుకోవటం ఇష్టం లేక, ఎలా మేనేజ్ చెయ్యాలో తెలియని సమయం లో, ఒక రెబెల్ సహాయం తో కాంప్లెక్స్ నుంచి కాశీ లో పడుతుంది

అప్పటికే కాశీ లో మోక్షం కోసం ఎదురుచూస్తున్న అశ్వత్థామ కి తాను కాపలా కాయాల్సింది సుమతి పుత్రుడికి అని అర్ధం అవుతుంది

ఇటు అశ్వత్థామ అటు రెబెల్స్ సహాయం తో శంబాలా చేరుకుంటుంది తర్వాత ఎం జరిగింది? అనేది మనం పైన కథ లో చెప్పుకున్న సంఘటన.

 

 సమస్యాత్మకం - ముగింపు

 

సమస్య 1 - ఇంత సేపు రాసిన దాంట్లో ఎక్కడ ప్రభాస్ గురుంచి రాయలేదు ఎం అని ఎవరికైనా అనిపిస్తే, సినిమా మొదలైన 30  నిమిషాల వరకు ప్రభాస్ ని చూపించలేదు అనేది కూడా అర్ధం అయ్యి ఉంటుంది. అనగనగ ఒక భైరవ. స్వార్థానికి బ్రాండ్ అంబాసిడర్. ఒక మిలియన్ యూనిట్స్ సంపాదించామా కాంప్లెక్స్ లో సెటిల్ అయిపోయామా అనేది వారి ఆశయం. పోని అలా అని ఈయన దగ్గర తొమ్మిది లక్షల యూనిట్స్ ఉన్నాయి జస్ట్ ఒక లక్ష బాలన్స్ అనుకుంటే అరెరే లక్ష ఎప్పుడొస్తాయో ఎప్పుడు వెళ్ళిపోతాడో అని ప్రేక్షకుడు కూడా కుతూహలం ఫీల్ అవుతాడు. ఈయన గారి బాలన్స్ ఇంట్రడక్షన్ టైం కి 250 . దానికి తోడు ఊరంత బద్ధకంఅసలు ఈడు కాంప్లెక్స్ కి ఎప్పుడు వెళ్ళాలి, అది జరిగే పనేనా అనే నిట్టూర్పు తప్ప కుతూహలం కలిగించలేక పోవటం ఒక పెద్ద మైనస్కాంప్లెక్స్ లో అమృతం ఉంటుందేమో అని ఆశ, ఉంటుందో ఉండదో అని అనుమానం (ఇద్దరు ముగ్గుర్ని అడుగుతాడు కూడా). ఈయనకి కాశీ ని రక్షించే భైరవుడు అని ఒక బిల్డ్ అప్, దానికి ప్లాంటింగ్ అయితే జరిగింది కానీ పే ఆఫ్ మరి పార్ట్ లో సెట్ చేసారో అశ్విన్ గారు. సుమతి అనే ఫైవ్ స్టార్ బౌంటీ అనౌన్స్ అయ్యే వరకు ఈయన పాత్ర కి చలనం లేదు. అది ఎప్పుడో సెకండ్ హాఫ్ లో కానీ జరగదు. హమ్మయ్య జాక్పాట్ దొరికినట్టే అనుకునే టైం కి అశ్వత్థామ అడ్డు పడతాడుఆవిడని శంబాలాకి తీసుకుపోతారుఇంక అంతా అయిపోయింది, కాంప్లెక్స్ లోకి వెళ్ళలేను అనుకునే టైం కి, మళ్ళీ ఒక అవకాశం వస్తే, ఇంక ఎం చేసైనా సాదించుకోకుండా ఉంటాడా

 

 సమస్య 2 - అశ్వత్థామ కి సుమతి జాడ తెలిసిన తర్వాత, తాను చెయ్యాల్సిన కర్తవ్యం తో పాటు, తనకి మోక్షం విముక్తి కలిగించే సొల్యూషన్ కనపడితేసరిగ్గా అదే సమయానికి కాంప్లెక్స్ నుంచి రైడర్స్ ఒకవైపు, భైరవ ఒక వైపు విసిగిస్తూ ఉంటారు, వాళ్ళని అడ్డుకొని సుమతి ని కాపాడాలిపెద్ద యుద్ధమే వస్తే, ఇంక తన ప్రతాపం చూపించకుండా ఉంటాడా

సమస్య 3 - తన ఎక్సపెరిమెంట్స్ ని తట్టుకొని ఉన్న ఏకైక సుమతి ల్యాబ్ నుంచి తప్పించుకొని పారిపోయింది. కాశీ నుంచి కూడా ఎవరో కాపాడి ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. అలా తీసుకెళ్లింది వాళ్ళు ఎన్నాళ్ల నుంచో వెతుకుతున్న శంబాలా లో ఉన్నారు అని తెలిసిన తర్వాత ఇంక మొత్తం సైన్యం తో విరుచుకు పడకుండా ఉంటారా

సమస్య 4 - శంభల లో అమ్మ వచ్చేసింది అనే ఆనందం లో ఉంటె, ఇన్నాళ్లు ఎవరికీ తెలియని వాళ్ళ లొకేషన్ కాంప్లెక్స్ కి తెలిసిపోవటం తో, పెద్ద సైన్యమే యుద్ధనికి వస్తుందిఇన్నాళ్లు తాము ఎదురు చూస్తుంది కూడా కాంప్లెక్స్ ని అంతం చెయ్యాలని, అలంటి కాంప్లెక్స్ సైన్యమే యుధ్ధానికి వస్తే, తమ సైన్యం మొత్తం తో విరుచుకు పడకుండా ఉంటారాఅమ్మని కాపాడుకోకుండా వదులుకోగలరా?

అన్ని సమస్యలు వెళ్లి ఫైనల్ గా కలిసిన చోటు - క్లైమాక్స్ ఫైట్

 

 

ముగింపు - మరి ముగింపు లో మనకి సమస్యలు అన్నంటికీ పరిష్కారం దొరకాలి కదాకల్కి టైటిల్ పెట్టినందుకు అయినా కల్కి భగవాన్ జననం జరిగి ఉండాలి కదా?ఇక్కడ ఎం జరిగింది, ఇక్కడ నుంచి మనం ఉపోద్ఘాతం లో చెప్పుకున్న కురుక్షేత్ర సంగ్రామానికి వెళ్లి భైరవుడే కర్ణుడు అని ముగిసింది. అయితే ? అయితే? చూడటానికి చాలా బావుంది కదా ? చూశామా - చప్పట్లు కొట్టామా - విజిల్ వేశామా - వీడియో తీసి సోషల్ మీడియా లో పెట్టామా అన్నట్టు ఉండాలి కానీ ప్రశ్నలు అడిగితే ఎలా? కాంప్లెక్స్ లోకి వెళ్ళటానికి కాంప్లెక్స్ తరపున ఫైట్ చేస్తున్న భైరవ హీరో ఎలా అవుతాడు ? సినిమా అయిపోయాక కూడా అయన ఎవరి సైడ్ అంటే కాంప్లెక్స్ సైడ్ , సుమతి ని అప్ప చెప్పాలి, కాంప్లెక్స్ లో ప్లేస్ కొట్టాలి అంతే

 

అన్నట్టు ఇక్కడైతే అయిపోలేదండోయ్, ఇంటర్వెల్ కి ముందే దొరికిన ఒక్క డ్రాప్ ని క్లైమాక్స్ లో ఎక్కించుకున్న కమల్ గారు సుమతి కోసం నేనే వెళ్తాను అంటారు, చుక్క ఆయనకి ఇంటర్వలోనే ఇచ్చేసి ఉండాల్సింది కదా అశ్విన్ గారుమానస్ గాడు కమల్ దగ్గరకి వెళ్లి, అయ్యా ఒక డ్రాప్ దొరికింది, ఇది అదో కాదో కొంచెం కంఫర్మ్ చెయ్యండి, పారిపోయిన దానిని పట్టుకొచ్చేస్తాం అని అడిగి ఉంటె, అప్పుడే కమల్ సర్ సిక్స్ ప్యాక్ రివీల్ అయ్యిపోయి ఉండేది. క్లైమాక్స్ లో అసలు భూమి మీద నగరాలు మిగలలేదు మొర్రో అంటే "భూకంపం సృష్టిస్తాను" అని డైలాగ్ పెట్టె పని ఉండేది కాదు. సరదాగా ఇలా కామెడీ చేసుకోటానికి అనుకున్నా కూడా, కమల్ సర్ కి ఉన్న రెండు సీన్స్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ట్రై చేసినట్టు అనిపిస్తుంది. మొదట్లో ఆయనకి మనుషుల మీద ఉన్న కోపం, ఈ ప్రకృతిని మీరు నాశనం చేస్తున్నారు, బూడిద చేస్తున్నారు, అసలు మీకు ఆ రైట్ ఎవరు ఇచ్చారు? అందుకే దానిని మీకు అందనంత ఎత్తులో పెడుతున్నాను, మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చిన మారటం లేదు, అది మీ లోపం. మీ లోపానికి నేను మందు కనిపెడుతున్నాను. మరో ప్రపంచం వస్తుంది. ఇది అయన చెప్పిన శ్రీ శ్రీ "మరో ప్రపంచం" కూడా కావొచ్చు కదా. ఆయన్ని జాగ్రత్తగా అర్ధం చేసుకోలేదు కానీ మనం, అయన మన మంచి కోసమే చెప్తున్నారు, మన కోసమే కాంప్లెక్స్ లాంటి ఫెసిలిటీ కూడా కట్టారు, ఆయన్ని విలన్ అని ఎందుకు అనుకోవాలి అసలు మనం.   


ఇంక అయన చెప్పిన శ్రీ శ్రీ "జగన్నాథుని రథచక్రాలు" విషయానికి వస్తే, ఆ నారాయణుడి అవతారం రాబోతుంది, దాన్ని భూమార్గం పట్టిస్తాను (ప్రభాస్ గారు ఎదో బటన్ నొక్కేసి సుమతి ని ఏసుకొని ఎక్కడికి వెళ్లిపోయారో ఆయనకే తెలియదు కదా).. వచ్చిన తర్వాత భూకంపం సృష్టించి నాశనం చేసి పడేస్తాను అని "డెడ్లీ వార్నింగ్ టు ది ఆన్ బోర్న్ కల్కి" ఇస్తూ మనకి ఒక భరోసా ఇస్తున్నట్టు గా 


పతితులార !


భ్రష్టులార !


బాధాసర్పదష్టులార !


దగాపడిన తమ్ములార !


ఏడవకం డేడవకండి !


మీ కాంప్లెక్స్ మీకు ఉంటుంది, 1  మిలియన్ బౌంటీ కొట్టండి కాంప్లెక్స్ లో ప్లేస్ పట్టండి. 

 

ముందుగానే చూసుకొని ఉండాల్సిన కొన్ని విషయాలు:

 

కథలో లేని విషయాన్ని, కథనం తో కట్టిపడెయ్యటానికి భావోద్వేగాలు ముఖ్యం. భైరవ 2898 లో జీవిస్తున్నాడు కాబట్టి వాడికి ఎం ఫీలింగ్స్ లేవు, స్వార్థం తప్ప అని సరిపెట్టుకుందాం అన్నా ఫీలింగ్స్ లేని భైరవ పాత్ర తో కనెక్ట్ అవ్వాలనే ఫీల్ కూడా ప్రేక్షకులకి ఉండదు, చూస్తున్న ప్రేక్షకుడు 2024 వాడు, మహానటి తీసినప్పుడు పాతకాలం నాటి  మెలోడ్రామా స్టైల్ లో కాకుండా, సుబ్రహ్మణ్యం టైం లో ఫిలాసఫీ ని కూడా ఇప్పటి ప్రేక్షకుల అభిరుచి కి తగ్గట్టు మలచినట్టు, పాత్రల మధ్య భావోద్వేగాలు లేనప్పుడు తెరపై ఎం జరుగుతున్నా కళ్ళకి అద్భుతంగా అనిపించినా మనసుని హత్తుకోలేవుశంకర్ గారు తీసిన రోబో సినిమాలో కూడా, యంత్రం అని తెలిసిన కూడా, ఒక రోబో కి ఫీలింగ్స్ వస్తే అనే పాయింట్ ని మెయిన్ గా పట్టుకొని ప్రేక్షకులని కూడా లాజిక్ అడగకుండా లీనం ఐయ్యేలా చేయగలిగారుఇంక ఇక్కడ విషయానికి వస్తే నారాయణుడి దశావతారం కల్కి పుట్టుక ఎంత పెద్ద ప్రమాదం లో ఉంది అన్నది ప్రేక్షకుడిని ఎక్కడా ఆలోచించనివ్వదు. అంశం చుట్టూ తిరగాల్సిన కథ బిడ్డని మోస్తున్న సుమతి నే సీరియస్ గా తీసుకోనివ్వలేదు. అంత కష్టపడి, ఆత్మత్యాగానికి కూడా సిద్దమై కాంప్లెక్స్ నుంచి తప్పించుకున్న తర్వాత బిడ్డని ఇంకెంత జాగ్రత్త గా కాపాడుకోవాలి. ట్రక్ ఫైట్ లో అంత జరుగుతున్నా సైలెంట్ గా ఉంటుంది. నేను ఇక్కడ ఉంటె శంబాలా కి ప్రమాదం అంటుంది (కాపాడిన అశ్వథామ పక్కనే ఉండగా),  క్లైమాక్స్ లో ముందు బిడ్డ జాగ్రత్త ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఫ్లైట్ ఎక్కిస్తే దిగిపోతుంది. ఫ్లైట్ పేలిపోయింది కాబట్టి అని సర్దిచెప్పుకున్నా, ఆవిడ దూకేయ్యటం అనేది సీరియస్ నెస్ లేక పోవటం, అంత మంది త్యాగానికి అర్ధం లేక పోవటం, మూర్కత్వం. ఆవిడ గట్టిగా నిశ్చయించుకొని అక్కడ నుంచి దూరంగా వెళ్లి బిడ్డని కాపాడుకోవాలి అనుకోవాలి, అది జరగనివ్వకుండా కాంప్లెక్స్ సైన్యం అడ్డు పడాలి, అప్పుడు డ్రామా పండుతుందికల్కి అని పేరు పెట్టినందుకు అయినా కొంచెం దైవత్వం, భక్తి భావం, ఆపద, కీడు, చెడు మీద మంచి గెలవటం లాంటి టెంప్లేట్ లో వెళ్లి ఉండాల్సింది

 

అంతకు ముందు అశ్వత్థామ - భైరవ ఫస్ట్ టైం ఫైట్ చేసుకుంటుంటే, విజయేంద్ర ప్రసాద్ గారు ఇంటర్వ్యూ లో చెప్పినట్టు ఎన్టీఆర్ - రాంచరణ్ కొట్టుకుంటుంటే కన్నీళ్లు వచ్చాయి అంట ఆయనకి, కొట్టుకోవద్దు కొట్టుకోవద్దు మంచోళ్ళు రా మీరు ఇద్దరు మీరు కలిసిపోండి అని ప్రేక్షకులు ఫీల్ అవుతారు అని, అలాంటి ఫీల్ కదా ఇక్కడ కలిగించాలి అశ్విన్ గారు. భావోద్వేగాలు కొమరం భీముడొ సాంగ్ కి రెట్టింపు రేంజ్ లో కదా సెట్ చెయ్యాలి మీరు. ఫస్ట్ ఫైట్ కి కాక పోయిన కనీసం క్లైమాక్స్ టైం కి అయినా కలపటం మానేసి "రేపటి కోసం" దాచెయ్యటం ఎంత వరకు న్యాయం

 

అసలు అశ్వత్థామ కి భైరవ కి మొదట ఫైట్ పెట్టిన ప్లేస్ లోనే ప్లాట్ పాయింట్ మొదలు అయినట్టు, అది అయ్యాక అక్కడ నుంచి ఇంటర్వెల్ వరకు అన్నట్టు సెకండ్ హాఫ్ పాయింట్ ని నడిపిస్తూ, క్లైమాక్స్ ని ప్రీ ఇంటర్వెల్ ఫైట్ కింద పెట్టి, కమల్ సర్ సిక్స్ ప్యాక్ మీద ఇంటర్వెల్ బాంగ్ వేసి ఉంటె ? సెకండ్ హాఫ్ ఎలా ఉండబోయేదో అని ఊహించుకోండి. ఇంక అప్పుడు సినిమా మొత్తం ఒక పార్ట్ లో అయిపోతుంది. పావు సినిమా కే వేల కోట్లు కలెక్షన్స్ వస్తుంటే, మొత్తం సినిమా ఒకే పార్ట్ లో ఎలా తీసేస్తారు లెండి 

 

చాలా వరకు ఉన్న అతిధి పాత్రల్లో, ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్రలు అన్ని కనిపించిన 5  - 10 నిమిషాల్లో చచ్చిపోతూ ఉండటం ఎస్కేపిజం రైటింగ్ అవుతుంది. ఏదైనా ఒక ముఖ్య పాత్ర అనుకున్నప్పుడు, దానిని చంపేసినప్పుడు, అది కథలో ఒక ముఖ్యమైన మలుపు కి కారణం అయ్యి ఉండాలి లేదా కథ ని ఇంకా ముందుకి నడిపించేది అయ్యి ఉండాలి. రాజేంద్ర ప్రసాద్, మృణాల్, అన్నా బెన్, శోభన మనకి రిజిస్టర్ అయ్యేలోపు చచ్చిపోతారు చావు వలన కలిగిన ఇంపాక్ట్ అంటూ ఏమైనా ఉందా ? అసలు అంత టైం ఎక్కడ ఇచ్చారు మనకి, వాళ్ళు పోయినా మనకి ఏవిధమైన ఫీల్ ఉండకపోవటానికి ఇదొక కారణం

 

సినిమా కథనం లో దర్శకుడి నైపుణ్యం చూపిస్తూ ఆకట్టుకున్న కొన్ని అంశాలు 

 

మహాభారతం లోని కురుక్షేతం తో లింక్ చేసిన విధానం. తన కర్ర చేతిలో ఉన్నత సేపు కర్ణుడు ఆవహించినట్టు చూపించి అశ్వత్థామ ని కాపాడటం.

 

ఎప్పుడో ఫస్ట్ ఫైట్ లో బౌంటీ గా దొరికిన కుర్రాడు, లాస్ట్ లో ముఖ్యమైన శంబాలా కి దారి చూపించే క్యాటలిస్ట్ గా ఉపయోగపడటం

 

మొదట్లో వచ్చిన చిన్న పాప, అన్ని ముఖ్య పాత్రలని లింక్ చేస్తూ, చివరి వరకు ప్రయాణించటం. ముందు ముందు పార్ట్స్ లో పాత్ర ని ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి

 

ద్వాపరయుగాంతంలో అర్జునుడు తనువు చాలించే ముందు గాండీవాన్ని సముద్రంలో పడవేస్తాడు అని అనేవారు, అలా భూమి మీద సముద్రాలూ ఇంకిపోయి ఇసక లో గాండీవం దొరకటం

 

కర్ణుడు చెరువులో దొరికినట్టు, భైరవ దుల్క్కుర్ కి దొరుకుతాడు. కవచ కుండలాలు టైపు లో భైరవ ఎప్పుడు సూట్ వేసుకొని ఉంటాడు. ఒక్క ఫైట్ కూడా ఓడిపోని యోధుడు ఐన కూడా తనకి కావలసిన కాంప్లెక్స్ లో చోటు తనకి దొరకదు. అందరితో తిట్లు తింటూ ఉంటాడు. తనకి కావాల్సిన కాంప్లెక్స్ కోసం చెడు వైపు నిలబడటం

 

చివరిగా : కల్కి ఒక అభినందించ దగ్గ ప్రయత్నం, అబ్బురపరిచే కాన్సెప్ట్ కి అద్భుతమైన కల్పన తోడు అయ్యి, యాక్షన్ ఎపిసోడ్స్ వరకు అద్భుతంగా ప్రెసెంట్ చేయగలిగారు. డ్రామా కూడా సరిగ్గా సెట్ చేసి ఉండాల్సింది, అయిన చాలా వరకు ఎక్కడ బోర్ కొట్టించకుండా లాగెయ్యటం ప్లస్ అనే అనుకోవాలి. చూడాలి అనుకునే వాళ్ళు కచ్చితం గా మంచి క్వాలిటీ థియేటర్ లో మాత్రమే చూడవలసిన సినిమా

 

ఇప్పటి వరకు అయితే సినిమా బాగా ఆడుతుంది, ఇంకా బాగా ఆడాలి, కలెక్షన్స్ వీలైనన్ని రికార్డ్స్ ని ఛేదించాలి, కలెక్షన్స్ కొత్త ఉత్సాహం ఇవ్వాలి, ఉత్సాహం తో రెట్టించిన భాద్యత తో సెకండ్ పార్ట్ ని ఇంకా జాగ్రత్త గా మలచాలి. పార్ట్ మిగిల్చిన వెలితి ని పూరించి పార్ట్ తో పరిపూర్ణత తీసుకొచ్చి, మంచి ప్రయత్నం స్థాయి నుంచి గొప్ప సినిమా గా మలిచి సంతృప్తి చేస్తారు అని కోరుకుంటూ ............. 

 

ఎంత మంది గమనించారో తెలియదు కానీప్రభాస్ పాత్ర వరకు తీసుకుంటే - ఆయనకి ఉన్న సీన్స్ ఇవే 

 

అరగంట తర్వాత ఎంట్రీ ఇచ్చి, ఒక 10 నిముషాలు ఫైట్ / పాట అన్ని కలిపి చేసెయ్యటం

 

మళ్ళీ ఇంకో అరగంట తర్వాత కనిపించి హీరోయిన్ తో పాట పాడుకుంటూ ఒక 20 నిముషాలు గడిపెయ్యటం.

 

ఇంటర్వెల్ సీన్ఫస్ట్ హాఫ్ మొత్తానికి అయన మీద పడిన వర్త్ సీన్ అంటూ ఏమి కనిపించలేదు

 

తర్వాత ఒక అరగంట కి అమితాబ్ గారితో 10 నిమిషాల ఫైట్ 

 

కాంప్లెక్స్ నుంచి బాన్ అవ్వటం - సుమతి ని తీసుకొస్తాను అని కమాండర్ కి ఆఫర్ ఇచ్చే సీన్ - బుజ్జి ని రెడీ చేసుకునే సీన్ 

 

ఒక అరగంట క్లైమాక్స్ ఫైట్

 



2 comments:

Anonymous said...

superb analysis raju garu chala rojula tarvata malli writing kada sankranti tarvata. regular ga rayandi plz

వెన్నెల కుమార్ said...

చాలా రోజుల తర్వాత మీ నుండి రివ్యూ చూస్తున్నాను సార్. ఒక పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను సినిమా చూసొచ్చి మీ రివ్యూ కోసం ఎదురుచూస్తూ ఉండేవాడిని. చాలా బాగా ఎనలైజ్ చేశారు. మీరు చెప్పిన మార్పులతో సినిమా ఉంటే ఇంకా చాలా బాగుండేది.

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views