My Take on TADAKHA



తమిళ్ సినిమా ఇండస్ట్రీ ని ఎవరు ఎలా ఫాలో అయినా బెల్లంకొండ గారు అయిన రేంజ్ లో ఇంకెవరు అవ్వరేమో, సినిమా పొరపాటున హిట్ అయితే వెంటనే కర్చీఫ్ వేసేస్తారు, అది కుదిరితే రీమేక్ లేదంటే డబ్బింగ్ చేసి వదిలేస్తారు, ఈ లెక్క లో అప్పుడెప్పుడో వేసిన కర్చీఫ్ ఏ తడాఖా . మాధవన్, ఆర్య కలిసి నటించిన వెట్టై ని సునీల్, నాగ చైతన్య ల తో తడాఖా  చేశారు అనేది బహుసా ఎవరికీ తెలియని విషయం కాదేమో. తమిళం లో నే ఒక మాదిరి గా ఆడిన ఈ సినిమా మీద ఈ కాస్టింగ్ తో, ఆ డైరెక్టర్ తో, డేర్ చేశారేమో అని మొదట్లో అనిపించినా ట్రైలర్ వచ్చాక పర్వాలేదు అనిపించి, ఆడియో వచ్చాక ఓరినాయనో అనిపించి, చూద్దామా వద్దా అని ప్రేక్షకులనే ఆలోచించుకునే లా చేసి  రిలీజ్ ఐన ఈ సినిమా లో ఏముంది, ఎలా ఉంది, ఆ మద్య ప్రెస్ మీట్ లో చెప్పినట్టు వాళ్ళు చూపించిన తడాఖా ఏంటో తెలుసుకోవాలని ఉందా ?

ముందగా ఒక మాట, సినిమా ని చూసేసిన వాళ్ళు మాత్రమే సమీక్ష చదవండి, చూడాలి అనుకునే వాళ్ళు చూసిన తర్వాత చదవండి, చూడం కానీ చదువుతాం అనుకునే వాళ్ళు మీ టైం వేస్ట్ చేసుకోకండి .. ఈగో ఏమైనా హర్ట్ అయి  నువ్వేంది రా మాకు చెప్పేది చదివే తీరాలి  అంటారా ? ఐ వాంట్ థిస్  కసి .. కమాన్ .. కుమ్మేద్దాం ... 



కళాకారుల పనితీరు :

తమ్ముడు: నాగ చైతన్య ఇంతకు ముందు సినిమాలకి ఈ సినిమా కి ఎంతో కొంత ఇంప్రూవ్ అయ్యాడు అనే చెప్పొచ్చు, వరస ఫ్లాప్స్ వచినప్పటికి కొత్త ఎనర్జీ తో మన ముందుకి వస్తున్నాడు, కానీ ఇంకా ఇంప్రూవ్  అవ్వల్సింది చాలా ఉంది. ఫైట్ల లో ను, కామెడీ లో ను కొంచెం ఇంప్రూవ్ అయినప్పటికీ డైలాగ్ డెలివరీ లో అది కూడా వార్నింగ్ లు ఇవ్వాల్సిన టైం లో ను, క్లాసు లు పీకాల్సిన టైం లో ను తడబడుతున్నాడు, మంచి డైలాగ్స్ కి కూడా ఇంపాక్ట్ లేకుండా చేస్తున్నాడు, బెజవాడ, దడ లాంటి మాస్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నపటికి,  సినిమా తమిళ్ వెర్షన్ చూసి మరీ ఆర్య రోల్ చెయ్యగలను అనే నమ్మకం తో ముందు అడుగు వేసిన చైతన్య ది కాన్ఫిడెన్స్  అనే కంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలేమో. సినిమా లో రోల్ ప్రకారం  తండ్రి లేనందుకు అమాయకుడు అయిన  అన్నయ్య కు అన్ని తానై ముందుకి నడిపించే పాత్ర లో పరిణితి చూపించే నటుడు ఉండాలి,  . చాల చోట్ల బ్లాంక్ గా ఉండిపోయాడు, కొన్ని సీన్స్ లో బిగుసుకు పోయి చాలా అసహనం గా కడుల్తునట్టు కనిపించాడు, ఇంకా డాన్సు విషయానికి వస్తే అప్పుడెప్పుడో వారసుడు రక్షణ టైం లో నాగ్  చేసిన రేంజ్ డాన్సులు కూడా చెయ్యకుండా రగడ లో స్టెప్స్ ఏస్తే ఎలా బాబు ? కొంచెం కస్టపడి ఉంటె పక్కన సునీల్ కి సపోర్ట్ ఇచ్చి ఉంటె ఫస్ట్ సాంగ్ అండ్ లాస్ట్ సాంగ్ కి సినిమా హాల్ లో మోత మొగిపోయి ఉండేది, ఈ ఏజ్ లో ఇంకొంచెం హార్డ్ వర్క్ నీ నుంచి కోరుకోవటం తప్పు కాదు గా, ఇవన్ని తెలుసుకొని రాబోయే సినిమాల్లో కేర్ తీసుకుంటే బావుంటుంది అని చెప్పే ఉద్దేశమే తప్ప కించ పరిచే భావం లేదు అని గమనించగలరు . 

అన్నయ్య: సునీల్ కమెడియన్ గా చేసినప్పుడు పెద్దగా భాద్యత ఉండేది కాదు, టైమింగ్ తో యాస తో కుమ్మేసేవాడు, అందాల రాముడు తో హీరో అయ్యాక ఏముంది లే అలీ కూడా సినిమా చేశాడు ఇప్పుడు సునీల్ అన్నారు, మర్యాద రామన్న కి రాజమౌళి టాలెంట్ అన్నారు, పూల రంగడు తో పాస్ మార్క్ లు వేసినా, పెళ్లి కొడుకు తో నీకు సినిమాలు అవసరమా అన్నారు, కానీ ఇక్కడ గమనించాల్సిన పాయింట్, ఈ ఏజ్ లో, ఆ కమిట్మెంట్ తో, సరదాగా కాదు శ్రద్ధ తో చేస్తున్నా అని సినిమా సినిమా కి నిరూపించుకుంటున్నాడు. జోష్ లో  హీరో కి  గ చేసిన సునీల్ కి ఈ సినిమా లో అన్న గా చేసిన సునీల్ కి తేడా గమనించ గలిగితే మెచ్చుకోకుండా ఉండలేరు. ఈ సినిమా లో దొరికిన రోల్ కూడా అలాంటిది, ప్రతి తెలుగు హీరో కలలు కనే  కమర్షియల్ ఎలివేషన్ ఉన్న రోల్, అండర్ ప్లే నుంచి సూపర్ మాన్ వరకు పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాడు, కామెడీ తో అలరించాడు, కానీ ఎప్పుడు చేసే డాన్సు ల కి పక్కన తమ్ముడు సహకరించలేదు కాబట్టి ఈ సినిమా వరకు వెలితి గా మిగిలిపోయింది. అది పక్కన పెడితే పాత్ర కి అన్ని విధాలుగా న్యాయం చేశాడు. 

తమ్ముడికి వదిన: ఫస్ట్ హాఫ్ లో పావు గంట సెకండ్ హాఫ్ లో పావు గంట ఉండే రోల్ లో ఆండ్రియా చేసింది దాని గురుంచి మనం చెప్పుకోవాల్సింది ఏమి లేదు. 

అన్నకి మరదలు : తమన్నా కి ఈ రోల్ కొత్త ఎం కాదు, కానీ పెద్దగా ఇంపార్టెన్స్ కూడా లేదు, ఫస్ట్ హాఫ్ లో తమ్ముడితో కలిసి కొంచెం నవ్వించి, ఒక పాటలో అందాలు అరబోసినప్పటికి, ఏదో పాటలకి వచ్చామ అన్నట్టు సెకండ్ హాఫ్ లో చెప్పుకోటానికి ఏమి లేక పోవటం వలన తెరపై కనిపించే వరకు ఓహో ఈ అమ్మాయి కూడా ఉంది కదూ సినిమాలో అనిపిస్తుంది. 

ఇతరులు: ముందు గా చెప్పుకోవాల్సింది అశుతోష్ గురుంచి, మన విల్లన్ నిజం గా బంగారం సరిగ్గా వాడుకోవలె కానీ, తన నటనతో ఆకట్టుకుంటాడు, శ్రీనివాస రెడ్డి నవ్వించగా, బ్రహ్మానందం విసిగిస్తారు. రఘుబాబు కి సెకండ్ హాఫ్ లో మంచి సీన్ పడింది, వెన్నెల కిషోర్  నవ్వించటానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు, JP తళుక్కున మెరిసి మాయం అయిపోయాడు , తెలియని మొహాలు రెండు మూడు ఉన్నపటికీ ఏవి రిజిస్టర్ అవ్వవు. 

సాంకేతిక వర్గం:

సంగీతం: ఆడియో రివ్యూ టైం కుదరక రాయలేదు కానీ లేదంటే థమన్ ని బూతులు తిట్టేసే వాడిని ఏమో, ఒక్క పాట కూడా విన సోంపు గా లేక పోగా , ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా తెలిపాయింది, వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు, ఎక్కడ కొంచెం మేకర్స్ టైట్ గా  లేక పోతే అక్కడికి స్క్రాప్ పార్సెల్ చేస్తున్నాడు ఏమో, ఇది ఇలాగె కొనసాగితే చాలా కష్టం, ఈ మద్య వచ్చిన గ్రీకు వీరుడు లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఇంప్రెస్స్ చేసిన తమన్ ఏ నా ఈ సినిమా కి కొట్టింది అన్నట్టు ఉంది. 

ఎడిటింగ్: సింపుల్ గా, షార్ప్ గా, క్రిస్ప్ గా బావుంది, సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ ఉన్నమాట వాస్తవమే కానీ ఓవరాల్ గా గుడ్ . 

సినిమాటోగ్రఫీ: రిచ్ గా బావుంది, చైతన్య కి ఉన్న లిమిటేషన్ కి క్లోజ్అప్ లు తగ్గించి ఉండాల్సింది 

ఫైట్స్: బావున్నాయి , ఇంపార్టెంట్ సీన్స్ లో బాగా కుదిరాయి, కానీ రైన్ ఎఫెక్ట్ లో ఫైట్ ఇంకా బావుండాల్సింది, కొన్ని చోట్ల గాల్లోకి ఎగరటాలు , నేల  మీద బంప్ అవ్వటాలు మానేస్తే ఇంకా బావుండేది, పవర్ ఫుల్ గా ఉండాలి అలాగే కొట్టే వాడిని బట్టి ఫైట్ ఉంటె బావుంటుంది. చై కొడితే గాల్లోకి ఎగరాటానికి , సునీల్ చేతిలో మేళేసి  గాల్లో తిప్పటానికి తేడా ఉంది, అది ఫైట్ మాస్టర్స్ కూడా తెలుస్కోవాల్సిన అవసరం ఉంది 

మాటలు: చాల వరకు తమిళ్ డైలాగ్ లు మక్కి కి మక్కి దింపేశారు, ఓవరాల్ గా గుడ్ వర్క్. శ్రీనివాస రెడ్డి పంచ్ లు బాగా వచ్చాయి అలాగే కొన్ని చోట్ల కామెడీ డైలాగ్స్ కూడా 

కథ, కథనం: సినిమా తమిళ్ నుంచి తీసింది అయినా కొంచెం సేపు రీమేక్ అని మర్చిపోయి డిస్కస్ చేసుకుందాం. లింగుసామి సినిమా లో పెద్దగా కథ ఉండదు కానీ కట్టి పడేసే కథనం ఉంటుంది, అది సిక్స్త్ గేర్ లో పరిగెడుతుంది, ఈ సినిమా కూడా అంతే, చేసిన మార్పులు కూడా పెద్దగా లేకుండా ఒరిజినల్ ని అలాగే ఉంచి మంచి పని చేశారు. పాత్రల పరిచయాలు అయిన వెంటనే సునీల్ పోస్టింగ్ తో కథ రెండో అంకం లో కి మొదలు అవుతుంది, ఒక చేంజ్ తో కామెడీ తో ముందుకి నడుస్తూనే వచ్చిన అడ్డంకులు దాటుకుంటూ వెళ్తున్న కథకి మంచి ఇంటర్వెల్ బాంగ్ సెట్ అయింది , ఆ ఎపిసోడ్ మొత్తం బాగా కుదిరి ఫస్ట్ హాఫ్ లో నే హిట్ సినిమా కళ ని సొంతం చేసుకుంటుంది, అక్కడ నుంచి నువ్వా నేనా అన్నట్టు గా సాగల్సింది పోయి, నేను కాదు అన్నయ్య సమాధానం చెప్తాడు అనే ఛాలెంజ్ దగ్గరలో మూడవ అంకం కి వెళ్లి, రఘుబాబు ఉత్ప్రేరకం గా చివరి అంకం ఓపెన్ అవుతుంది, కాకా పోతే అక్కడక్కడ కొంచెం ఓవర్ లాపింగ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ చెప్పెకోవాల్సింది పాత్రల స్కెచ్ లు, ఇద్దరు హీరో లు ఉన్నపుడు ఇద్దరినీ బాలన్స్ చెయ్యటం అంత సులువు కాదు, ఇక్కడ అదే జరిగింది, అన్నయ్య కోసం తెర చాటున ఉండి నడిపించే పాత్ర లో పాసివ్ అయిపోయిన తమ్ముడి రోల్ కంటే, సినిమా మొత్తం తన చుట్టూ తిరుగుతున్న అన్నయ్య రోల్ బాగా ఎలేవేట్ అయిపొయింది. చేసేది తమ్ముడే అయినా కూడా సీన్ ఎండింగ్ లో క్రెడిట్ అన్నయ్య కీ చెందటం వలన అటు సినిమా లో మిగతా పాత్రలకి ఇటు ప్రేక్షకులకి కూడా తమ్ముడి పాత్ర పాసివ్ గానే మిగిలిపొతుంది. మొదటి నుంచి చివరి వరకు ఒకేలా ఉండే తమ్ముడి పాత్ర మొదటి సగం లో ఆకట్టుకున్నా అన్నయ్య పాత్ర కి ఆఖరున వచ్చే ఎలివషన్ ముందు తమ్ముడి పాత్ర పూర్తిగా తేలిపోతుంది, అమాయకుడి గా మొదలై, అదే లిమిటేషన్ తో కామెడీ చేసి, నిస్సహాయ స్థితి లో దెబ్బలు తిని చచ్చి బతికాను రా అని డ్రాప్ అయిపోయిన టైం లో ప్రేరణ పొంది, మనశికం గా శారీరకం గా ఎదిగి నిజమైన హీరో లా ముగిసే అతి చక్కని తెలుగు సినిమా కమర్షియల్ హీరో రోల్ లో అన్నయ్య పాత్ర నిజమైన హీరో గా గుర్తుండి పోతుంది, దానికి తోడు సునీల్ అద్బుత నటన తో ఆల్మోస్ట్ సునీల్ తడాఖా గా మిగిలిపొతుంది. చిన్న పిక్చర్ లో చెప్పుకోవాలి అంటే కింద ఉన్న బొమ్మ చూడండి మీకే అర్ధం అవుతుంది. 



మొదట్లో అన్నింటిలో డామినేటింగ్ గా ఉండే తమ్ముడి పాత్ర ఫస్ట్ హాఫ్ వరకు అలరించినా అప్పటి వరకు అండర్ డాగ్ గా ఉన్న అన్నయ్య పాత్ర రైజ్ అవ్వటం అన్ని దాటుకొని పీక్స్ కి వెళ్ళటం ఫాలోయింగ్ లో మంచి ఎపిసోడ్స్ పడటం, అంతెందుకు ఈ ఆర్టికల్ కి ఎంచుకున్న వాల్ పేపర్ చూడండి సినిమా చూడక పోయిన ఆ సీన్ లో ఎవరు ఎలివేట్ అవుతున్నారో తెలిసిపోతుంది


దర్శకత్వం: కొంచెం ఇష్టం కొంచెం కష్టం తీసిన డాలీ ఏ ఈ సినిమా తీశారా అనిపిస్తుంది, క్లాసు బొమ్మ లే కాదు, మాస్ బొమ్మ కూడా తీయగలడు అనే నమ్మకం కలిగించారు డాలీ గారు. ఒరిజినల్ నుంచి దూరం గా వెళ్ళకుండా మంచి పని చేశారు, సేఫ్ జోన్ కి దగ్గరలోనే మార్పులు చేసుకున్నారు, మార్పులు చెయ్యగలిగే అవకాశం ఉన్నా కూడా ఎందుకో మరి ఆ జోలికి వెళ్ళలేదు. అన్నిటికి మించి సునీల్ లో మార్పు కలిగే సీన్ ఒరిజినల్ నుంచి  తీసుకోక పోగా నాగ చైతన్య తో క్లాస్  పీకించి తేల్చేశారు అది ఎంత ఇంపార్టెంట్ సీన్ అసలు , అలాగే ముసలాయనతో కాల్పించాల్సింది పోయి సునీల్ తో కాల్పించారు. ఏది ఏమైనా  మంచి సాంగ్స్ ఎంచుకోవటం లో, కొంచెం ఇష్టం కొంచెం కష్టం కి హైలైట్ అయిన బ్రహ్మానందం కామెడీ ని ఈ సినిమా లో సరిగ్గా రాసుకోలేక పోవటం, హీరోఇన్స్ కి ఒరిజినల్ లో లాగానే ఇంపార్టెన్స్ లేకుండా తెల్చేయ్యటం తడబడ్డ డాలీ తర్వాత రాబోయే సినిమాలలో ఇంకొంచెం కేర్ తీసుకుంటారని ఆశిద్దాం. 

అంతా బాగానే ఉంది మరి ఎక్కడ ఎం మిస్ అయింది? పైన చెప్పుకున్న కొన్ని పాయింట్స్ కారణాలు అనుకునట్టు  అయితే మన సినిమా పిచ్చ సంతృప్తి పొందదు గా, అందుకే ఈ కింద సెక్షన్ 

ఎలా తీసి ఉండాల్సింది: అసలు ఈ సినిమా ని ఇలాగె ప్రభాస్ అండ్ వెంకటేష్ ల తో తీసినా కూడా బ్లాక్ బస్టర్ అయ్యుండేది, వాళ్ళ కోసమే రాసుకున్న కథలా అనిపించింది నాకు. ఇప్పుడు తీసిన వాళ్ళని ఏదో అనేయ్యాలి అని కాదు, ప్రభాస్ లేక వెంకటేష్ అంటే మోజు కూడా కాదు జస్ట్ అనిపించింది, ఒక వేల మీలో ఎవరికైనా ఇలాగె అనిపించి నా, వేరేలా అనిపించినా చెప్పగలరు.  ఈ కథ లో ఉన్న ఇంకో చిన్నమేటర్ ఏంటి అంటే సునీల్ ప్రేరణ పొంది ఎంత స్ట్రాంగ్ గా అయినా కూడా, ఎప్పుడు తనని సేవ్ చేసే తమ్ముడు బాగానే ఉన్నాడు కాబట్టి సునీల్ కి ఏమైనా కూడా తమ్ముడు కాపాడతాడు లే అనే ఒక ధైర్యం ఉంటుంది సో ముందుకి దూసుకు పోతాడు, కానీ తనని కాపాడిన తమ్ముడిని + తనని కూడా తనే కాపాడుకోవాలి అనే పరిస్తితి సునీల్ కి వచ్చి ఉంటే, డు ఆర్ డై అంటారు గా అలంటి పరిస్తితి వస్తే,  ఆ టైం లో సునీల్ రివెంజ్ కి వెళ్తే ఆ పాత్ర ఇమేజ్ ఇంకే రేంజ్ లో పెరిగి ఉండేది .... 

 చివరిగా : ఫాస్ట్ గా ఉండే ఫస్ట్ హాఫ్, కొంచెం స్లో అయిన కూడా పతాక సన్నివేశానికి ఊపు అందుకునే సెకండ్ హాఫ్, మొత్తం కాక పోయిన మెజారిటీ గా అలరించే కామెడీ, అస్సలు ఆకట్టుకొని సాంగ్స్, అన్ని వెరసి చూడొద్దు అని చెప్పటానికి లేదు, ఇప్పుడే చూసెయ్యండి అని చెప్పేసే మేటర్ కాదు, ఈ సమ్మర్ కి కాలక్షేపం సినిమా, ఖాలీగా ఉన్నపుడు కులాసాగా ఉన్నపుడు సరదాగా చూసెయ్యండి, మీ టైం మీకు తెలియకుండానే పాస్ అయిపోతుంది 

ప్రతి సారి అనుకునేదే, చిన్నదిగా రాద్దాం అని, కానీ నా కంట్రోల్ తప్పి ఇలా చిరిగి చేట అయి చాప అయింది .. ఓపికగా చదివిన వాళ్ళకి  నా లాల్ సలాం, మీ విలువైన కాలం వృధా ఐ ఉంటె క్షమించగలరు 

ఇట్లు మీ 
హరి కృష్ణ రాజు 

1 comments:

Aravind Putrevu said...

tega sorry lu chepthunnav anna !! enduku avasaram ledhu...

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views