ఐ - కథ, కథనం - విశ్లేషణ - అంతకు మించి?
రోబో తర్వాత శంకర్ తీసిన స్నేహితులు గురుంచి ఎంత మంది పట్టించుకున్నారో కానీ ఐ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి దాని గురుంచి ఎన్నో కథనాలు. విక్రం ఏదో జంతువు లా మారిపోతాడు అంట, ముసలోడు అయిపోతాడు అంట, రోబో ని మించిన గ్రాఫిక్స్ అంట, రెండు పెద్ద జంతువుల మద్య క్లైమాక్స్ ఫైట్ అంట, ఐ స్టొరీ ఇది అని ఫార్వర్డ్ మెసేజ్ లు, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ని ఒక ఊపు ఊపేసాయి. ఇంతలో ఒక రోజు మోషన్ పోస్టర్ అండ్ ఇంకో రోజు ట్రైలర్ వచ్చేసాయి. అప్పటి వరకు సినిమా గురుంచి మాట్లాడింది కూడా నిజమే అనేలా బీస్ట్ షాట్ తో ట్రైలర్ స్టార్ట్ అయి, అన్ని గెటప్స్ చూపిస్తూ "అసలు ఎం తీసారు సర్ శంకర్ గారు" అనుకునేలా చేసాయి. జనరల్ గా ప్రతి సినిమా కి సంబందించిన విషయాలు గోప్యం గా ఉంచే శంకర్ ఈ సారి కొంచెం ఓపెన్ అయి, రిలీజ్ కి ముందే సగం సాంగ్స్ ని కూడా వదిలేసారు. నేను ఫస్ట్ టైం తీసిన రొమాంటిక్ థ్రిల్లర్ ఈ సినిమా అని స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంకొంచెం లెంగ్త్ ఉన్న ట్రైలర్ లో అంతా గజిబిజి గా అనిపించింది, సినిమా లెంగ్త్ మూడు గంటల పైనే అని తెలిసింది. అవన్నీ తెలిసినా వాటి గురుంచి ఆలోచించే అంత టైం లేని మనం శంకర్ సర్ మీద ఉన్న నమ్మకం తో ఎగేసుకొని ఓపెనింగ్ రోజు లైన్ లో నిల్చున్నాం.. ఆ తర్వాత ఎం జరిగింది? ఎందుకు అలా జరగాల్సి వచ్చింది? ఊహించని రియాక్షన్ తో టాక్ వచ్చినా సినిమా ఎందుకు ఇరగ ఆడేస్తుంది? అంతకు మించి ఏమైనా ఉందా?
ఈ సినిమా కి కూడా రాయటం అవసరమా అనుకునే వాళ్ళు ఇక్కడితో ఆపెయ్యండి, అంతకు మించి ఏముందో తెలుసుకోవాలి అనుకుంటే టైం చూసుకొని చదవండి అది కూడా సినిమా చూసిన వాళ్ళు మాత్రమే సుమీ, చూడని వాళ్ళు చదివినా ఉపయోగం ఉండక పోవచ్చు
కథ - బాడీ బిల్డర్ లింగేశ మోడల్ దియా ని ఆరాదిస్తూ ఉంటాడు, ఆమె వచ్చి సహాయం అడిగితే తన గోల్ ని పక్కన పెట్టి మరీ లీ గా తనతో మోడలింగ్ లో కి వెళ్తాడు. సక్సెస్ అవుతాడు. అది ఓర్వలేక కొందరు, వేరే కారణాల వలన కొందరు, మొత్తం మీద అందరు కలిసి లీ ని చంపటం కంటే మించిన నష్టం కలిగించాలి అని, ఐ వైరస్ ని లీ కి ఎక్కిస్తారు. మొదట్లో జెనెటిక్ ప్రాబ్లం అనుకున్న లీ కి అది కొందరు కావాలని తనని నాశనం చెయ్యటానికి తన నుంచి దియా ని వేరు చెయ్యటనికి చేసిన పని అని తెలుసుకొని వాళ్ళ భారి నుంచి దియా ని కాపాడి వాళ్ళకి చావు కి మించిన శిక్షలు విదిస్తాడు. శివాజీ, రోబో అండ్ ఐ కథలని భారతీయుడు సినిమా టైం లో రజిని కాంత్ కి చెప్పారు అంట శంకర్, అయన ముందు రెండు ఓకే అని ఈ సినిమా న వాళ్ళ కాదు అని అన్నారు అంట, 19 ఇయర్స్ ముందు వచ్చిన థాట్ - డెవలప్మెంట్ కూడా ఆ కాలం లో చేసుకున్నదే ఏమో
ట్రైలర్ లో చూపించినట్టు, లవ్ తో మొదలు అయి, పెయిన్ కలిగించిన డెవిల్ పై రివెంజ్ తీర్చుకోటమే మొత్తం సినిమా, కానీ మనం ట్రైలర్ లో విజువల్స్ ని, గెటప్స్ ని, మ్యూజిక్ ని, ఫైట్ ని మాత్రమే ఎక్కించుకొని సినిమాకి వెళ్ళిపోయి ఉంటాం.
కథనం - ఫ్లాష్ బ్యాక్ లేని శంకర్ సినిమాలు ఒక ఫార్మటు లో ఉంటాయి, హై లో చూపించి, కష్టాల్లో పడేసి, అక్కడ నుంచి మళ్లీ లేపుతారు. అదే ఫ్లాష్ బ్యాక్ ఉంటె హై లో చూపించి, కష్టాల్లో పడేసి, ఫ్లాష్ బ్యాక్ చూపించి, క్లైమాక్స్ కి వచ్చేస్తారు. చాలా వరకు అయన సినిమాల్లో హీరో పోరాటం సమాజం మీద, అవినీతి మీద, సోషల్ ఇష్యూ మీద ఉంటుంది, వాటిలో మనము ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అయ్యి హీరో తో ట్రావెల్ చేస్తాం, మనకి తెలియకుండానే లీనం అయిపోతాము. ఇవన్ని ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఇవన్ని పక్కన పెట్టి కొత్త గా లవ్, పర్సనల్ రివెంజ్ ని అయన ఐ లో చూపించారు కాబట్టి. కథ లో అంతకు మించి ఏమి లేక పోవటం వలన కథనం లో కొత్తదనం చూపిద్దాం అనుకున్న శంకర్ గారు నాన్ లినియర్ ఫార్మటు ఎంచుకున్నారు. తికమక గా అనిపించినా, చిరాకు అనిపించినా ఈ సినిమా కి ఈ ఫార్మటు ఏ పర్ఫెక్ట్. ఇది తప్ప వేరే ఎలా తీసినా ఇంకా ఇబ్బంది గా ఉండేది సినిమా. ప్లయిన్ గా ఓపెన్ చేసి మొదటి నుంచి లాస్ట్ వరకు లాగలేరు, అలా అని మొత్తం ఫ్లాష్ బ్యాక్ ని ఒక దగ్గర పెట్టలేరు, ఈ రెండిటికి ఒకటే ఆన్సర్ ఎందుకంటే, కురూపి గెటప్ ని ఎక్కువ సేపు స్క్రీన్ మీద ఉంచకూడదు కాబట్టి. పై రెండు విధానాల్లో కురూపి రివెంజ్ వరసగా అందరి మీద చూపించాల్సి వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఉన్న కురూపి బిట్స్ కె మనకి అప్పుడప్పుడు చిరాకు పుట్టింది అంటే ఇంకా ఒకే స్ట్రెచ్ లో ఆ క్యారెక్టర్ ఉండి ఉంటె ఎలా ఉండేదో ఊహించుకోండి. అందుకే ఈ ఫార్మటు లో మొత్తం 12 సీన్స్ (ఉదాహరణ కి) అనుకుంటే 5-1-6-2-7-3-8-4-9-5-11-12 ఆర్డర్ లో చూపించారు, సీన్స్ మారే విధానం లో ఆడ్స్ ని వాడుకున్నారు. టీవీ లో ఆడ్స్ భరిచలేక జనాలు టీవీ చూడటం తగ్గిస్తున్న ఈ రోజుల్లో సినిమాలో ఆడ్స్ ని రిసీవ్ చేసుకుంటారు అని ఎలా అనుకున్నారో కానీ ఈ కథ కి అది తప్ప వేరే ఆప్షన్ లేదు అన్నది కూడా వాస్తవం.
ఫస్ట్ పెళ్లి సీన్ లో నే గెస్ట్స్ లో అందరు విలన్స్ ని చూపించేసారు, కానీ వాళ్ళు మనకి ముందుగా తెలియదు కాబట్టి మనం పట్టించుకోము, కొంచెం ముందుకి వెళ్ళాక బాడీబిల్డర్ రవి అడ్డు తగిలినప్పుడే వీడు సురేష్ గోపి పెళ్లి లో ఉన్నాడు కదా అనే అనుమానం మనకి వచ్చి ఉండాలి, సో సురేష్ ఏ విలన్ అనేది మన వరకు సీక్రెట్ గా దాయాలని కూడా అనుకోలేదు అన్నమాట? సురేష్ విలన్ అనేది సినిమా పరంగా విక్రం కి మాత్రమె ట్విస్ట్? అలాగే విలన్స్ కి విదించే శిక్ష లు కూడా స్టార్టింగ్ లోనే కంప్యూటర్ లో చూపించేసారు, ఎం జరగబోతుందో మనకి తెలియదు కాబట్టి ఇంకేదో ఉంటుంది అని మనం ఊహించుకొని వెయిట్ చేస్తూ ఉంటాం. అబ్బే ఇంతేనా అనుకుంటాం. ఇవి మనకి తెలియకుండా మనకి చూపించి తీరా ఆ సీన్స్ వచ్చినప్పుడు మనం గుర్తుకు తెచ్చుకునే విషయాలు
కురూపి క్యారెక్టర్ లో కిడ్నాప్ తర్వాత సడన్ గా వచ్చే ఫస్ట్ సాంగ్ మనకి అబ్రుప్ట్ గా ఉంటుంది కానీ హీరోయిన్ మోడల్ అని, ఉపేన్ పటేల్ తో చాలా చేసింది అని, చెప్పటానికి ఆ సాంగ్ ని వాడుకున్నారు అనిపిస్తుంది. లేదంటే దాని గురుంచి ఇంకో రెండు సీన్స్ వేస్ట్ చెయ్యాల్సి వచ్చేది. ఇదే విధం గా అయిల అయిల సాంగ్ లో విక్రం అండ్ అమీ హాట్ పెయిర్ గా ఎదగటం అనే టైం ఫ్రేమ్ ని చాల ఆడ్స్ తో సింపుల్ గా చూపించారు. ఫ్లాష్ బ్యాక్ లో మిస్టర్ ఇండియా కాంపిటీషన్ టైం లో పెట్టిన ఫైట్ ఇంతకి అవ్వక పోగా విసిగించింది. హీరో కి ఫైట్ చెయ్యటం వచ్చు అని మనకి చెప్పటానికి ఇంట్రడక్షన్ ఫైట్ పెట్టడం ఆనవాయితి, కానీ ఇక మిగతా ఫైట్లు కూడా ఇలాగె ఉండబోతున్నాయి అని ఇదొక హింట్. (ఇటు చైనా ఫైట్ లో ను, అటు ముసుగు ఫైట్ అండ్ ట్రైన్ ఫైట్ లో ను డూప్ వాడినట్టు క్లియర్ గా తెలిసిపోతుంది, అంతోటి దానికి అంతా లెంగ్త్ ఎందుకు ఫైట్ లో?) అక్కడ నుంచి తను ఆరాదించే దియా ని కలవటం, తనకి కష్టం వస్తే తన కోసం సొంత ఆశయం వదిలేసుకోవటం, మోడల్ లీ గా మారటం వరకు బాగానే అనిపించినా, కథ చైనా వెళ్ళాక సినిమా ఎక్కడికి వెళ్తుందో అర్ధం కాకుండా చేసింది. విక్రం అండ్ దియా మద్య లవ్ డెవలప్ చెయ్యటానికి అయితే మాత్రం ఆ స్టైలిస్ట్ పాత్ర అవసరమే లేదు, ఇంకో సెకండ్ హీరోయిన్ ని పెట్టుకుంటే రొటీన్ అయిపోతుంది అనుకున్నారో ఏమో స్టైలిస్ట్ ని పెట్టి చిరాకు పెట్టించారు. శంకర్ సర్ సినిమా ఈ చూస్తున్నామ అనిపించేలా చేసారు, కామెడీ పేరుతో వస్తున్న బూతు సినిమాలకి శంకర్ సినిమాలకి తేడా ఉండాలి అని అనుకోవటం వలన వచ్చిన చిరాకు అయి ఉండొచ్చు. బాడీ బిల్డర్ రవి బాడీ కాల్చేసి, స్టైలిస్ట్ అందం చెడగొట్టి శిక్ష విదించిన కురూపి నడుచుకు వెళ్తుంటే ఐ మిషన్ ఇచ్చారు శంకర్ సర్. అప్పటి వరకు ఎం చెప్పాలి అనుకుంటున్నారో తెలియక, చూపించింది గొప్పగా లేక, అంతా చప్పటి ఇంటర్వెల్ బాంగ్ ఈ మద్య ఏ సినిమాలోనూ లేదు అన్నటు గా తయ్యారు చేసారు. ఇది పూర్తిగా రైటర్ వైఫల్యం.
కెరీర్ నష్టపోయిన రవి, హీరోయిన్ ని అనుభవించాలని చూసే తోటి మోడల్ ఉపేన్ తనకి దక్కనిది ఎవడో అనామకుడికి దక్కుతుంది అని కోపం, కూతురు వయసు ఉన్న హీరోయిన్ పై ఆశపడ్డ సురేష్ గోపి (మెయిన్ విలన్ గురుంచి ముందు ముందు మాట్లాడుకుందాం), నేను లేక పోతే వేడికి మోడలింగ్ కెరీర్ ఏ లేదు, బ్రహ్మ కూడా వేడిని ఇంత అందం గా పుట్టించలేదు అందుకు వీడు నాకే చెందాలి అని హీరో పై ఆశ పడే హిజ్రా స్టైలిస్ట్, తన కంపెనీ మోడల్ వలన తనకే నష్టం వస్తే వాడిని నాశనం చెయ్యాలి అని ఆలోచించే రామ్. ఇంత మందిని పెట్టుకోవటం వలన అనుకుంటా ఏ క్యారెక్టర్ ని పూర్తిగా డెవలప్ చెయ్యకుండా, ఇంత వీక్ విలన్స్ ఈ సబ్జెక్టు ని ఎలా లేపగలరు? బఫూన్స్ లా తయ్యారు చేసారు అందర్నీ.
సెకండ్ హాఫ్ కి వస్తే, అసలు కథ అంతా ఇక్కడే ఉండటం వలన మనకి ఫస్ట్ హాఫ్ మీద ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఒకరిని ఒకరు లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ రొమాన్స్ అంతా ఆడ్స్ లో చూపిస్తే అది నటన అనుకోవాలా నిజం అనుకోవాలా? ఆ పెయిర్ రొమాన్స్ ని మనం ఎలా ఫీల్ అవ్వాలి? సరే పోనీ ఫీల్ అవుదాం అనుకునే టైం కి విక్రం కి తనలో వచ్చే మార్పులు గురుంచి తెలుస్తుంది. ఈ సీన్స్ లో విక్రం నటన కి చేతులెత్తి మొక్కోచ్చు. తనది జబ్బు అనుకోని చచ్చిపోదాం అనుకునప్పుడు "నిన్ను చావకుండా దేవుడు కాపాడేడు అంటే నువ్వు చెయ్యల్సింది ఏదో మిగిలి ఉంది" అనేది రియల్ శంకర్ మూమెంట్ సినిమా లో. అలాగే "నాకు ఇదే పరిస్థితి వస్తే నువ్వు నన్ను వదిలేస్తావ" అని హీరోయిన్ అడిగే సందర్భం కూడా. తనది జబ్బు కాదు అని, వైరస్ అని, అది చేసింది వెళ్ళే అని విక్రం తెలుసుకుని "మీరు తప్పులు చేసి నా జీవితాన్ని నాశనం చేసారు కదా రా" సీన్ హీరో రియల్ పైన ని చూపించి సానుబూతి కలిగించేలా చేస్తాయి. కానీ ఆ సీన్ కి విలన్స్ డైలాగ్స్ ఎంత బాడ్ అంటే, ఆ ఫీల్ ని నెక్స్ట్ సెకండ్ లో నే మన నుంచి తీసుకేల్లిపోయే అంత. ఇక్కడ మనం అసలు చెప్పుకోవాలి అంటే సురేష్ గోపి లవ్ కి విక్రం లవ్ కి మద్య పోరాటమే సినిమా, సురేష్ సాఫ్ట్ గా నటిస్తూ, దియా ని కిస్ చేసిన కుర్రాడిని లిప్స్ కాల్చేసాడు, ఉపేన్ కి వార్నింగ్ ఇచ్చి వదిలేసాడు, ఉపేన్ సైడ్ అయిపోయాడు అనుకున్న టైం లో వచ్చిన విక్రం ని డైరెక్ట్ గా హేండిల్ చేస్తే ఇమేజ్ పోతుంది అని వైరస్ ఎక్కించి వేరే శవం కాల్చేసి మాస్టర్ ప్లాన్ వేసి కంప్లీట్ గా అడ్డు తొలగించుకుంటాడు, ఈ క్యారెక్టర్ ని ఇంకా బాగా చూపించాల్సింది పోయి మిగతా అందరి మీద టైం వేస్ట్ చేసారు శంకర్ గారు. అందర్నీ ఎప్పటికప్పుడు తెల్చేయ్యకుండా, మళ్లీ ఎండ్ లో వాళ్ళ పోసిషన్ చూపిస్తూ కంక్లుడే చేసే విధానం కి మాస్ సెంటర్స్ లో రెస్పాన్స్ బావుంటుంది. సినిమా మొత్తం కింద సెంటర్స్ ని టార్గెట్ చేసుకొని చాలా లిబర్టీస్ తీసేసుకొని, ఎక్ష్పొసింగ్ తో, డబల్ మీనింగ్ కామెడీ తో, కురూపి ఆటిట్యూడ్ చూపించే సీన్స్ తో, చాలా వరకు లాజిక్ కి అందకుండా తేల్చేసారు.
మనోహరుడు టైటిల్ కి, అందం అంటే బాహ్య సౌందర్యం కాదు అని మెసేజ్ ని ఈ సినిమా ద్వారా శంకర్ సర్ ఇవ్వాలి అనుకున్నారు అనేది మనకి ఎండ్ టైటిల్స్ ఓపిగ్గా చూస్తే అర్ధం అవుతుంది. అప్పటి వరకు ఓపిక ఉన్నదీ ఎవరికీ?
ఒక పాట కి పరిమితం అయిన బీస్ట్ ని టీజర్ లో ఫస్ట్ షాట్ లో ను, ట్రైలర్ లో లాస్ట్ షాట్ లో ను చూపించి, ఘర్జించి, మనల్ని హైప్ కోసం మిస్ లీడ్ చేసారు. ఉదాహరణ కి ఖలేజ ట్రైలర్ లో దుమ్ములో నుంచి దెబ్బలతో వచ్చే ఫైట్ చూపించి సినిమా లో కామెడీ చూపించినట్టు. అయిన అసలు ఎం తీశామో మనకి తెలిసినప్పుడు, జనాలకి అది కాకుండా వేరేది చూపించి హైప్ తెచ్చుకోవటం ఎందుకు? కథ లో విషయం లేనప్పుడు, థ్రిల్లర్ గా తీద్దాం అనుకునప్పుడు అంత లెంగ్త్ ఎందుకు? రొమాంటిక్ థ్రిల్లర్ అని చెప్పి రొమాన్స్ పండించక, థ్రిల్స్ కలిగించక మమ్మల్ని నిరాశ పరచటం ఎందకు? ఈ టైం లో శంకర్ సర్ ఒక క్లియర్ ఇంటర్వ్యూ ఇచ్చి అయన చెప్పాలి అనుకున్నది అయన తీసింది ఎక్ష్ప్లైన్ చేస్తే ఇంకో వారం రోజులు మళ్లీ కలెక్షన్స్ కుమ్మేస్థాయి
చివరిగా: కొండంత అంచనాలతో వెళ్ళినా? అబ్బే నాకు అంచనాలు లేవు అని బయట జనాలకి చెప్పుకొని వెళ్ళినా, ఆశ పడ్డ వాళ్ళకి నిరాశ మిగిల్చింది ఐ. సినిమా చూసి శంకర్ సర్ నన్ను మోసం చేసారు, డిసాస్టర్ తీసారు అంటే, కిందన ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా మెడికల్ పాలసీ తీసుకున్న అంత పాపం. మనకి ఆడియో ద్వారా, ధియేటర్ ట్రైలర్ ద్వారా, సాంగ్స్ వీడియోస్ ద్వారా చాలా హింట్స్ ఇచ్చారు, అవేవి కాకుండా సినిమా లో కూడా ఇలా ఉండబోతుంది అని హింట్స్ ఇచ్చారు, మనమే ఆశగా శంకర్ సినిమా అంటే ఏదో ఉండే ఉంటుంది లే అని, కనీసం మేకింగ్ వీడియో అయిన ఎండ్ టైటిల్స్ లో ఉంటుంది అని ఎదురు చూసాం తప్ప ఎం చెప్పాలి అనుకుంటున్నారు అని అర్ధం చేసుకోలేదు. ఏది ఏమైనా P.C శ్రీరామ్ గారి కెమెరా పనితనం అండ్ విక్రం కష్టం కోసం అయిన ఒక సారి చూడాల్సిన బొమ్మ
P.S: ఈ టాక్ వచ్చిన సినిమా థర్డ్ డే కి పడిపోకుండా ఇలా ఆడుతుంది అంటే ఇందులో అంతకు మించి ఏమైనా ఉందా అని ఆలోచిస్తే తట్టినదే నేను ఇక్కడ రాసింది. ఇంకోసారి చూడాలి అనుకుంటున్నా కాబట్టి చూసే ముందే రాసేస్తే సెకండ్ టైం ఏమైనా కొత్త గా అనిపించిందో లేదో తెలుసుకోటానికి ఇదొక రిఫరెన్స్ గా ఉంటుంది అని రాసుకున్నదే ఇది. ట్రైలర్ లో బీస్ట్ ని చూపించి హైప్ కోసం మిస్ లీడ్ చేసిన శంకర్ సర్ లాగే టైటిల్ లో "అంతకు మించి" అని పెట్టి మిస్ లీడ్ చేశాను తప్ప, ఇందులో అంతకు మించి అయితే ఏమి లేదు అని ఎండ్ టైటిల్స్ లో తెలియజేసుకుంటున్న
మీ
హరి కృష్ణ రాజు
5 comments:
Anthaku Minchi rayadaniki kashtpaddav ga ee sari :D
asalu aa main villain suresh gopi ni pettadam, heroine meeda aadu aasha padadam endho dadram aa inners teesukune scene and stethoscope scene tv serial type vi avi :D
ala kakunda at least aa I virus tho society ki damage cheyalani chooddam,daniki first Vikram meeda test cheyadam atlantidi line pettina bagundedi
konni scenes ala ala bagunan overal Rodddddddd movie
nuvu rendosari choostava baa, nee opika ki lal salaaam :)
Attarintiki daredi cinema ki anta baaga feed back ichav mari identi ee cinema ki? Aa cinema story 2 lines. Aa cinema lo hero ni establish cheyyakunda aadu topu ani chupistadu. Indulo hero food habits nundi chupinchi real body chupistadu. Asalu ide role pk cheyyagalada? The visuals in this movie stand in all time top 3. Review a movie based on its content but not based on your expectation. Come out of that shell and review movies honestly. Last year sankranthi movie one ki kooda ilage raasav. Nee opinion matrame raaste daaniki website enduku. 150 crores top director national award winning actor nee review maatram AD kanna bad cinema annatlu raasav.
Cinema lo chaala chotla Shankar mamulu ga tadabadaledu.. prema kanna pain ekkuva chupinchi nasanam chesesaaru... iddari Madhya prema entha undi anedi telisinappude kada vidipoyinappudu pain telisedi..
intha chinna vishayam aayana ela marchipoyaro leda aa stylish china track lo entha premincharo cheppesa anukunnada .. ani anipinchinappudu he needs to reboot himself and verify again anukuntunna
nijam ga ne a back and forth screenplay enti chiragga a advertizement lu enti chiragga anukunna sir, me review chadivaka ardham aindi adi enduku pettalsi vachindi ani. thank you so much
as usual ga chimpesav annai cinema kante mee review ne bavundi
Post a Comment