సినిమా సినిమా సినిమా - పాత్రల చిత్రణ
మనలో సినిమా పిచ్చ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, రిలీజ్ ఐన ప్రతి సినిమా ని చూస్తూ ఏదో ఒక రోజు నేను కూడా సినిమా కి కథలు రాయాలి అని కలలు కనే వాళ్ళు ఉన్నారు. ఆశక్తి ఉండి ఎం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఎక్కడ మొదలు పెట్టాలో డిసైడ్ అవ్వలేని వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగ పడాలి అనే ఉద్దేశం తో నాకు తెలిసిన, నేను చదివిన, నేను విన్న సినిమా పరిజ్ఞానం గురుంచి టూకి గా రాద్దాం అనే ఆలోచనే నా ఈ "సినిమా, సినిమా, సినిమా" ఆర్టికల్ సిరీస్ ముఖ్య ఉద్దేశం.
ఒక వేల చదివి ఉండక పోతే ఈ సిరీస్ లో ఫస్ట్ పోస్ట్ - స్టొరీ అండ్ 3 ఆక్ట్ స్ట్రక్చర్ (కొన్ని ఉదాహరణలతో) చదివిన తర్వాత ఇది చదవమని మనవి.
ఇదొక సిరీస్ లా స్టార్ట్ చేద్దాం అని అనుకున్న నాకు ఫస్ట్ పోస్ట్ అయిన తర్వాత ఎక్కడ మొదలు పెట్టాలి అని తోచక చాలా రోజులు వాయిదా వేసుకుంటూ వచ్చాను. చెప్పుకోవాలి అంటే చాలా ఉన్నాయి, కానీ ఏ ఆర్డర్ లో చెప్పుకోవాలి అనే దానిపై క్లారిటీ లేదు. ఆర్డర్ ఏదైతేనేం మొదలు పెడితే అదే ఆర్డర్ అవుతుంది అని డిసైడ్ అయ్యి మళ్లీ ఇలా మొదలు పెడుతున్నా.
సినిమాలకు ఇలాంటి కథలే ఎంచుకోవాలి అని రూల్ ఎం లేదు, ఎలాంటి కథలనైనా ఎంచుకోవచ్చు. పేపర్ లో వచ్చే న్యూస్ ఐటెం కూడా ఒక్కోసారి మంచి కథ పుట్టటానికి ప్రేరణ కావొచ్చు. సినిమా కథ రాసుకోటానికి కి వెళ్ళే ముందు సినిమా ని విశ్లేషించు కోవటం అవసరం అని చెప్పుకున్నాం. సినిమా నేను పుట్టక ముందు నుంచి ఉంది, అప్పట్లో ఉన్నట్టు ఇప్పుడు లేదు, ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచి కి తగ్గట్టు మారుతూ ఉంది. మన తెలుగు ప్రేక్షకులు ఆదరించని జొనెర్ లేదు, పౌరాణికాలు (ఇప్పుడు వచ్చినా), సాంఘికాలు, జానపదాలు (అప్పట్లో), అసలు ఏ విధమైన విషయం లేని కమర్షియల్ బొమ్మలు. ఒకప్పుడు క్షేమంగా వెళ్లి లాభం గా రండి లాంటి ఫ్యామిలీ కామెడీ ట్రెండ్ ఉండేది, ఫ్యాక్షన్ ట్రెండ్ గురుంచి చెప్పాల్సిన పని లేదు అనుకుంటా, కృష్ణా రెడ్డి గారిది ఒక ట్రెండ్, ఈ వి వి గారిది ఒక ట్రెండ్, ఇలా బోలెడు ఉన్నాయి. మాతృదేవోభవ, ఆమె లాంటి సినిమా లు కూడా జనం ఎగబడి చూసేవారు అదే ఇప్పుడు అంటే కొంచెం వెనుకాడుతారు. ఏది ఏమైనా సరే సగటు ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా ఆడుతుంది అనేది వాస్తవం. మనం రాసుకోవాల్సింది ట్రెండ్ కి తగ్గట్టు గా ఉండాలి అంటే ట్రెండ్ ని ఫాలో అవ్వాలి, లేదు నేను ట్రెండ్ క్రియేట్ చేసే వాడిని అనుకున్నా కూడా ట్రెండ్ ఏంటో తెలియాలి కాబట్టి ఎలా అనుకున్నా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చూడాలి, వాటి గురుంచి చర్చించాలి, విశ్లేషించాలి. గుడ్ అర్ బాడ్ ప్రతి సినిమా ఒక లెసన్ అని మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. విశ్లేషణ అంటే 3 ఆక్ట్ స్ట్రక్చర్ ఒకటే కాదు, అన్ని సినిమాలు 3 ఆక్ట్ ఫాలో అవ్వాలి అని లేదు, ముఖ్యం గా తెలుగు సినిమాలలో చాలా వరకు స్ట్రక్చర్ ఉండదు కూడా. ఒక్కో సినిమా కి ఒక్కో స్త్రెంగ్థ్ ఉంటుంది. మనం సినిమాలలో గమనించాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
ఎంత మంచి కథ ఎంచుకున్నా కథనం బాగోక పోతే ఏమి చెయ్యలేం. సుమారుగా ఉండే కథలు అయినా కథనం తో రక్తి కట్టిస్తే అద్బుతాలు చేస్తాయి. ఈ రెండిటితో పాటు గమనించాల్సిన ఇంకొక విషయం ఉంది, కథ కథనం ఎంత గొప్పగా, ఇంటరెస్టింగ్ గా ఉన్న కూడా పాత్రల చిత్రీకరణ (characterization) రొటీన్ గా మూస టైపు లో ఉంటె సినిమా దెబ్బ తింటుంది. అదే రివర్స్ లో పాత కథ కథనం అయినా పాత్రల చిత్రణ అద్బుతం గా కుదిరితే ఒక పోకిరి లాంటి బొమ్మలు వస్తాయి. అదే ఒక మంచి/కొత్త కథ కథనం కి కొత్త పాత్ర చిత్రణ తోడు అయితే ? అద్బుతాలు జరుగుతాయి. హీరో తో పాటు ఉండే ఉద్బోధక పాత్ర (motivator) ఉత్ప్రేరక పాత్ర (catalyst), హీరోయిన్, విలన్, చుట్టూ పక్కల ఉండాల్సిన పాత్రలు వాటి స్వభావాలు సైతం ముఖ్యం. మనం సినిమా చూస్తూ ఉన్నప్పుడు కూడా అన్ని పాత్రలని గమనించాలి.

జనరల్ గా సినిమాలు అన్ని హీరో ఓరియెంటెడ్ ఏ ఉంటాయి కాబట్టి హీరో పాత్ర పరంగా ఆలోచించాల్సిన విషయాలు. ఇవి హీరో ఓరియెంటెడ్ అయినా హీరోయిన్ ఓరియెంటెడ్ అయినా కామన్ గా ఉండే విషయాలే అని గమనించగలరు.
ATTITUDE (స్వభావం) : జనరల్ గా ప్రేక్షకులు తమని తాము ఐడెంటిఫై చేసుకునే టైపు స్వభావం ఉన్న క్యారెక్టర్ కి ఈజీ గా కనెక్ట్ ఐపోతారు. గమనించాల్సినవి ఎమోషన్స్ కి రియాక్ట్ అయ్యే తీరు, పాజిటివ్, నెగటివ్, సిన్సియర్. రియలిస్టిక్, హెల్పింగ్, డిపెండెంట్, ఇండిపెండెంట్ etc . సినిమా థీమ్ కి ఈ క్యారెక్టర్ డిజైన్ కి ఉన్న సంబంధం? ఇలా లేక పోతే వచ్చే నష్టం? అసలు ఇలా ఉండటానికి గల కారణం? ఇవన్ని ఎంత డిటైల్డ్ గా ఎస్టాబ్లిష్ చేస్తే అంత బాగా ఆ పాత్ర తో ట్రావెల్ చెయ్యగలం. తెలుగు లో కంటే తమిళ్ సినిమా లు ఎక్కువ గా ఈ వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాయి. కంటెంట్ బేస్డ్ సినిమాలు, చిన్న సినిమాలు, వెరైటీ సినిమాలు ఎక్కువ రావటం వలన, వాటిని ఆదరించే వాళ్ళు ఉండటం వలన తమిళ్ వరకు బోలెడు స్కోప్ ఉంది. తెలుగు వరకు యునిడైమెన్షనల్ అయిపోయి హీరోయిసం తప్ప ఇంకోటి ఉండదు.
GOAL (లక్ష్యం) : కథ లో హీరో లక్ష్యం ఏంటి? పగ తీర్చుకోవటం? నిర్దోషి అని నిరూపించుకోవటం? విడిపోయిన ఫ్యామిలీ ని కలపటం? ప్రేమ? డబ్బు? పవర్? దుష్ట శిక్షణ? న్యాయ రక్షణ? అలాగే విలన్ లక్ష్యం, హీరోయిన్ లేదా మిగతా ముఖ్య పాత్రల లక్ష్యం? ఇవన్ని ఎంత క్లియర్ గా చెప్పగలిగితే ప్రేక్షకుల ఇన్వొల్వెమెంట్ కూడా మొదటి నుంచి ఉంటుంది. ఒక్కో సారి కథా గమనం లో లక్ష్యం మారుతూ ఉండొచ్చు, దానికి దారి తీసిన పరిస్థితులు, జస్టిఫికేషన్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా ఉంటె అంత మంచిది, లేదంటే దశ దిశ లేకుండా సినిమా అలా వెళ్తూ ఉంటుంది అండ్ ఎప్పుడు పూర్తి అవుతుంది రా బాబు అనే ఫీలింగ్ ఏ మనకి మిగులుతుంది.
MOTIVATION (ప్రేరణ) : అసలు హీరో లక్ష్యం కి బ్యాక్ గ్రౌండ్ ఏ ఈ మోటివేషన్ అనేది. అసలు ఆ గోల్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, అ గోల్ కి ఉన్న ప్రతికూలత ని సైతం పోరాడటానికి మోటివేషన్ ఏంటి? వ్యక్తి గత కారణాలా? సొంత ఆశయమా? ఆశా? అత్యాశ? ప్రేమ కోసమా? సమాజం కోసమా? కుటుంబం కోసమా? ఈగో కోసమా? తన వలన నష్టపోయిన వాళ్ళ కోసమా? జాలి వలన? ఇలా ఏదైనా కూడా మోటివేషన్ ఎంత పర్సనల్ అయితే ప్రేక్షకులకి అంత దగ్గర అవుతుంది, పండుతుంది. ఈ ప్రేరణ కోసమే ఉద్బోధక పాత్ర లు ఉంటాయి, హీరో పక్కన ఉండే బ్యాచ్ లో ఎవరో ఒకరు మోటివేట్ చేస్తూ ఉంటారు. పోసాని గారు ఎన్టీఆర్ ని చేసినట్టు, జనరల్ గా హీరో కి ప్రాబ్లం వచ్చినప్పుడు కంటే ఆ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేస్తున్నాడు అనేదానిపైనే ప్రేక్షకుడి ద్రుష్టి ఉంటుంది.
OPPOSITION (ప్రతికూలత): హీరో లక్ష్యం అనేది అంత సింపుల్ గా ఉండిపోతే ఇంతేనా అనిపిస్తుంది, అది ఎంతో కష్టమైనది అయ్యి ఉండాలి, ఆల్మోస్ట్ అందుకోలేనిది అనే ఫీల్ కలిగించాలి, లక్ష్యం సాదించే ప్రయత్నం లో సర్వస్వం కోల్పోయే ప్రమాదం ఉండాలి (అది తను ప్రేమించిన వాళ్ళు కావొచ్చు, ఫ్యామిలీ కావొచ్చు, పరువు మర్యాద కావొచ్చు), అప్పుడే ఆన్ స్క్రీన్ హప్పెనింగ్స్ లో ఇన్వొల్వెమెంట్ ఉంటుంది. లేదంటే వన్ సైడ్ సినిమా అయిపోతుంది. 2 ఆక్ట్ మొత్తం ఈ అంశం పైనే ఆధారపడి ఉంటుంది. ఈ ప్రతికూలత అనేది విలన్ వలన లేదా విలన్ కల్పించిన సందర్భాల వలన, పరిస్థితుల వలన, సమాజం వలన ఏమైనా కావొచ్చు, ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటె కాన్ఫ్లిక్ట్ అంత బాగా ఎలివేట్ అవుతుంది ఆటోమేటిక్ గా హీరోయిజం ఎలేవేట్ అవ్వటానికి స్కోప్ ఉంటుంది. ఈ ప్రతికూలత అనేది సినిమా మొదటి నుంచి చివరికి ఎక్కువ అయ్యేది అయి ఉండాలి, మొదట్లో వచ్చిన ఇబ్బంది కంటే పెద్ద ఇబ్బంది లేక చిక్కు అయి ఉండాలి. మొదట్లోనే విలన్ తో హ్యాండ్ తో హ్యాండ్ ఫైట్ పెట్టేస్తే క్లైమాక్స్ కి వచ్చే సరికి తేలిపోతుంది కదా ?
CHANGE (మార్పు/ఎదుగుదల): పైన చెప్పుకున్న వాటికీ ఇది కొంచెం డిఫరెంట్ అయినా కూడా, సినిమాల వరకు క్యారెక్టర్ లో మార్పు అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యం గా కమర్షియల్ సినిమాలకి, ఒక అండర్ డాగ్ పెద్ద హీరో గా ఎదగటం, మన ఊరిలో పనోడు పక్క స్టేట్ లో నాయకుడు గా ఎదగటం, జనల మద్య నుంచి వచ్చిన వాడు లీడర్ గా ఎదగటం, ప్రేమ అంటే ఇష్టం లేని వాడు ప్రేమదాసు అయిపోవటం లేదా ప్రేమని చులకన గా చూసేవాడు ప్రేమించటం మొదలు పెట్టడం, సెంటిమెంట్స్ లేని వాడు సెంటిమెంటల్ గా మారిపోవటం, రీసెంట్ గా వచ్చిన సినిమా లో విలన్ లాంటి వాడు హీరో గా మారటం, దేవుడు ని తిట్టే వాడు దైవ భక్తుడు అవ్వటం, ఇలాంటివి ఏవి లేకుండా ప్లయిన్ గా ఉండే క్యారెక్టర్ లు ఆకట్టుకోవు. ఇదంతా ఒక ఎత్తు అయితే మన ఇండస్ట్రీ లో ఆ మద్య ఊపు ఊపేసిన టాపిక్ paradigm shift అప్పటి వరకు ఆటో డ్రైవర్ గా ఉన్న వాడు ఒకప్పుడు బాష అని మొదలు అయిన ఈ ఊపు సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్ర ఇంకా చాలా సినిమాల్లో వాడేసుకున్నారు. అప్పటి వరకు రౌడీ గా చూసిన హీరో పోలీస్ అని పోకిరి లో చూపెట్టినట్టు, ట్విస్ట్ బేస్డ్ కథలు టాపిక్ వేరు. అది ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి. దీని గురుంచి స్క్రీన్ ప్లే టెక్నిక్స్ ఆర్టికల్ లో చెప్పుకుందాం
కథ కథనం తో పాటు పాత్రల చిత్రణ అనేది సినిమా విజయానికి దోహద పడే ముఖ్య అంశం. ఇప్పుడు మీకు బాగా నచ్చిన లేక నచ్చని, లేక బావున్నా ఈ సినిమా ఎందుకు ఆడలేదు అనిపించినా, ఎం ఉంది అని ఈ సినీమా ఇరగ ఆదేసింది అనిపించినా సినిమాలు చూసే అవకాశం మళ్లీ వస్తే ఈ క్యారెక్టర్ పాయింట్ అఫ్ వ్యూ అలాంగ్ విత్ స్ట్రక్చర్ విశ్లేషణ చేసి చూడండి. రాసుకునే వాళ్ళకి రాసుకునే అంత మెటీరియల్ దొరుకుతుంది. ఎలాగు స్ట్రక్చర్ బేస్డ్ ఎనాలిసిస్ కి ఉదాహరణలు బ్లాగ్ లో నే ఉన్నాయి కాబట్టి క్యారెక్టర్ బేస్డ్ ఎనాలిసిస్ ఒకటి ఇక్కడ రాయటానికి ట్రై చేస్తున్నాను
మహేష్ బాబు కెరీర్ లో మరపురాని మైల్ స్టోన్ గా మిగిలిన ఒక్కడు సినిమా లో అజయ్ క్యారెక్టర్ గురుంచి చిన్న విశ్లేషణ
ATTITUDE (స్వభావం) : బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి క్యారెక్టర్, అమ్మ దగ్గర చనువు, నాన్న అంటే భయం, ఫైట్ లు వచ్చు అని ఫస్ట్ ఫైట్ లో నే చూపించారు. సోడా బ్యాచ్ లో ఒకడు అమ్మాయి జడ లో పువ్వు లాగి ఏడిపిస్తుంటే అదే అమ్మాయి తో కొట్టించాడు. గొడవలు ఎందుకు రా అంటే ఊరికినే కాదు వాళ్ళు చేసే పనులు వలన అని సమర్దిన్చుకుంటాడు. లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు (స్టార్టింగ్ లో ఒక అమ్మాయి లైన్ ఏసినా పట్టించుకోడు), స్పోర్ట్స్ కోటా లో కూడా జాబు కొట్టొచ్చు అనే ధీమా. భవిష్యత్ మీద భయం లేదు, తన మీద తనకి నమ్మకం ఉంది
GOAL (లక్ష్యం) : అమ్మ కోరిక, తండ్రి ఆశ ప్రకారం, స్పోర్ట్స్ కోటా లో అయిన పోలీస్ జాబు కొట్టి వాళ్ళ నాన్న కంటే పెద్ద ఆఫీసర్ అవ్వాలి. కథ ముందు కి వెళ్తున్న కొద్ది ఓబుల్ రెడ్డి నుంచి హీరోయిన్ ని కాపాడి ఎలా అయినా యుఎస్ పంపించాలి అనేది రెండవ లక్ష్యం అవుతుంది, ఇదే మెయిన్ లక్ష్యం కాదు ఎందుకంటే అక్కడ ముందు నుంచి ప్రేమ లేదు. ఒక సీన్ లో నిన్ను అమెరికా పంపటం , కబడ్డి లో గెలవటం నా ఆశయాలు అంటాడు. ఆవిధం గా మెయిన్ లక్ష్యం నుంచి పక్కకు వెళ్ళలేదు కథ. అమరికా పంపటం వరకు అంతా అయిపోతుంది అనుకునే టైం కి తెలియకుండా బయట పడిన ప్రేమ వలన హీరోయిన్ ని పెళ్లి చేసుకోవటం గా రెండవ ఆశయం మారింది. తెలుగు ప్రేక్షకులకి కావాల్సింది కూడా అదే కాబట్టి అవుట్ అఫ్ ది బోర్డు వెళ్ళలేదు కథనం. నీ కేప్ కొనటానికి వెళ్ళినప్పుడు అజయ్ తో పాటు ప్రేక్షకులు కూడా టెన్షన్ పడతారు, ఇలా ఫ్లైట్ ఎక్కిన్చేస్తే ఎలా అని ఫీల్ అవుతారు, సో వాళ్ళు కలవటం ఎక్కువ ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతారు, కానీ కబడ్డీ గెలవటం తో లింక్ వచ్చే సరికి అన్ని రకాలుగా సంతృప్తి చెందుతారు. ఓబుల్ రెడ్డి జైలు లో నుంచి తీసుకేల్లినప్పుడు ఒక ఫైట్ పెట్టి ఓబుల్ రెడ్డి ని చంపేస్తే ఆ తర్వాత కబడ్డీ గెలిచినా గెలవక పోయిన పెద్ద ఇంపాక్ట్ ఉండదు కాబట్టి అక్కడ తెలివిగా తప్పించి, గ్రౌండ్ కి తీసుకోచి, కబడ్డీ గెలిచాక ఫైట్ పెట్టి లక్ష్యం పూర్తి చేసారు.
MOTIVATION (ప్రేరణ) : తన గోల్ కి అమ్మ నాన్న మోటివేషన్ అయితే మరి రెండవ ఆశయం కి ? కర్నూల్ రైల్వే స్టేషన్ లో దిగినప్పుడు మర్డర్స్ జరిగినప్పుడు హీరో బ్యాచ్ అక్కడే ఉన్న పట్టించుకోరు. ప్రేక్షకులు కూడా అది ఆశించరు అక్కడ, ఎందుకంటే వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వటం కాబట్టి. అదే హీరోయిన్ పరిస్థితి తెలిసిన తర్వాత, ఎలా అయిన తను తప్పించుకోవాలి అని ఫీల్ అయినప్పుడు తను మళ్లీ ఓబుల్ రెడ్డి కి దొరికిపోయాక, జుట్టు పట్టుకొని లాక్కోస్తుంటే పక్కనే ఉన్న అజయ్ రియాక్ట్ అవ్వాల్సిందే. ఆల్రెడీ ఇంతకు ముందు అమ్మాయి ని సేవ్ చేసాడు (స్టార్టింగ్ లో) సో ఈ సందర్భం లో తను రియాక్ట్ అవ్వటం, దానికి ధియేటర్ లో వచ్చిన స్పందనే నిదర్శనం. హీరోయిన్ గతం తనని ఎలా అయిన సేవ్ చెయ్యాలి అనే ప్రేరణ కలిగించింది. పాటలో హీరోయిన్ గతం తెలుసుకున్న హీరో "యుద్ధం మొదలు అయ్యాక మద్య లో వదలను, ఆడల్సింది గ్రౌండ్ లో కాదు" అని ఫిక్స్ అయ్యి ముందుకి దిగుతాడు. అక్కడ నుంచి జరిగినవి అన్ని ఆ సందర్భం కి సంబందించిన ఫాలో అప్ సీన్స్. అలా కాకుండా ప్రేమ థ్రెడ్ ని ముందే ఉన్నట్టు చూపించి, ప్రేమ కోసం ఇదంతా చేసినట్టు చెప్తే, ఆట గెలవటానికి వేల్లినోడివి నీకు ప్రేమ అవసరమా? పోయి పోయి వాడితో పెట్టుకున్నావ్ అని ప్రేక్షకుడు కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు కథనం ఇంత బాగా పండేది కాదు. ఒక వేల లవ్ థ్రెడ్ ఉంది ఉంటె.. ఇంటర్వెల్ ముందు హీరోయిన్ మెడ పై కత్తి పెట్టగలిగేవాడా?
CHANGE (మార్పు/ఎదుగుదల): స్టార్టింగ్ లో ధీమా గా అల్లరి చిల్లరి గా ఉండే అజయ్, హీరోయిన్ ని సేవ్ చేద్దాం అని డిసైడ్ అయ్యాక మెట్యురిటి తో బిహేవ్ చేస్తాడు. బాద్యత గా వ్యవహరిస్తాడు.
OPPOSITION (ప్రతికూలత): ఓబుల్ రెడ్డి లక్ష్యం ఎలా అయినా హీరోయిన్ ని పెళ్లి చేసుకోవటం, అది ముందు అజయ్ ని చంపి ఆ తర్వాత పెళ్లి కి మారుతుంది. తన ఊరిలో, తన సెంటర్ లో తనని కొట్టిన వాడిని వదలటం అనేది ఓబుల్ రెడ్డి లాంటి క్యారెక్టర్ నుంచి ఆశించేది కాదు కాబట్టి అజయ్ ని చంపటం అనే ఆశయం కూడా సబబే. అజయ్ విషయానికి వస్తే అక్కడ నుంచి ఎలా అయితే ఎం హీరోయిన్ ని తీసుకోచ్చేసాడు, కానీ ఇంట్లో చెప్పటం ఎలా? ఎక్కడ దాయాలి? సోడా బ్యాచ్ కళ్ళల్లో పడకుండా ఎలా చూసుకోవాలి, పాస్పోర్ట్ అండ్ వీసా చూసుకోవాలి? ఇవన్ని ప్రొబ్లెమ్స్. ఇంతలో హీరోయిన్ గురుంచి వెతుకుతున్న ఓబుల్ రెడ్డి అండ్ మినిస్టర్. వచ్చిన జీప్ దొరికిపోతుంది. అర్ధ రాత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన హీరోయిన్ తండ్రి కి దొరుకుతుంది. ఇంట్లో నుంచి చార్మినార్ మీదకి లొకేషన్ మారుతుంది. ఎయిర్పోర్ట్ లో ప్రేమ తెలుసుకున్నాక ఓబుల్ రెడ్డి తీసుకెళ్ళి పోతాడు. అజయ్ అరెస్ట్ అవుతాడు. ఒక పక్క మ్యాచ్, ఇంకో పక్క పెళ్లి.. అసలు ఎలా సాద్యం.. అల్ డోర్స్ క్లోసేడ్.
మగాడివి అయితే ముందు అజయ్ ని చంపు అంటే, ఓబుల్ రెడ్డి జైలు కి వెళ్లి అజయ్ మీద కేసు కొట్టేసి తీసుకెళ్లటం లైఫ్ లైన్. అజయ్ లో ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ బయటికి వస్తుంది. వైట్ డ్రెస్ డైలాగ్ చెప్పి కబడ్డీ మ్యాచ్ కి తీసుకొస్తాడు. మ్యాచ్ గెలుస్తాడు అని తెలుసు కానీ ఎలా గెలుస్తాడు? ఓబుల్ రెడ్డి అక్కడే ఉన్నాడు వాడు ఎం చేస్తాడు? శకుంతల అక్కడే ఉంది, మినిస్టర్ ని ఎలా హేండిల్ చేస్తాడు? ఇన్ని పాయింట్స్ బిల్డప్ దొరికిన క్లైమాక్స్ ఉంటె ఇంక ఎం తిరుగు ఉంటుంది కథ కి... బాక్స్ ఆఫీసు రికార్డ్స్ మోత మోగుతుంది.
నెక్స్ట్ టైం క్యారెక్టర్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో రాసుకుందాం

ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా వేరే సినిమాలకి విశ్లేషణ చేసి చూడండి. ఏమైనా సందేహాలు ఉంటె కామెంట్స్ లో చెప్పండి. డిస్కస్ చేసుకుందాం
స్టొరీ లైన్, సినాప్సిస్, సీనిక్ ఆర్డర్, స్క్రీన్ప్లే టెక్నిక్స్ లాంటి విషయాలు టైం చూసుకొని నెక్స్ట్ పార్ట్ లో రాయటానికి ట్రై చేస్తాను.
మీ
హరి కృష్ణ రాజు
స్టొరీ లైన్, సినాప్సిస్, సీనిక్ ఆర్డర్, స్క్రీన్ప్లే టెక్నిక్స్ లాంటి విషయాలు టైం చూసుకొని నెక్స్ట్ పార్ట్ లో రాయటానికి ట్రై చేస్తాను.
మీ
హరి కృష్ణ రాజు
9 comments:
innovative and informative article hari garu. kudos to your passion
excellent material raju garu
THANK YOU VERY MUCH sir
Your two articles till now about cinema are very good. keep it up.
Regards,
Kumar
thanks for the post raju garu. idoka lesson la use avutundi na lanti vallaki
chala chala bavundi sir
superb one sir, first article miss ayya ippude rendu kalipi chadivesa. next article kosam wait chesthu unta
Thank u so much saar vadu for the post :D
naa lanti interst unnolla ki eppatikaina future lo baga use avutundi
ilane veelainanni articles continue cheyi baa :)
i hope/wish u all the best in that asepct :) :thumb:
nee ee post ni veelaite sbdb lo vesta disco purpose kosam okay kada :D
excellent write up hari garu
Post a Comment