బాహుబలి 2 - కథ కథనం - విశ్లేషణ
మొదటి పార్ట్ పూర్తి అయిన దగ్గర మొదలు అయిన ఈ పార్ట్ లా, ఆ ఆర్టికల్ ని ఎక్కడ పూర్తి చేసామో అక్కడే మొదలు పెట్టుకుందాం. "ఈ సినిమా బాగా ఆడుతుంది, ఇంకా బాగా ఆడాలి, కలెక్షన్స్ పొలికేక పెట్టించాలి, ఆ కలెక్షన్స్ కొత్త ఉత్సాహం ఇవ్వాలి, ఆ ఉత్సాహం తో రెట్టించిన భాద్యత తో సెకండ్ పార్ట్ ని ఇంకా జాగ్రత్త గా మలచాలి. కలెక్షన్స్ ఈ పార్ట్ ని మించి ఉండటం తో పాటు, ఈ పార్ట్ మిగిల్చిన వెలితి ని పూరించి ఆ పార్ట్ తో పరిపూర్ణత తీసుకొచ్చి, మంచి ప్రయత్నం స్థాయి నుంచి గొప్ప సినిమా గా మలిచి సంతృప్తి చేస్తారు అని కోరుకుంటూ నెక్స్ట్ ఇయర్ రాబోయే రెండో పార్ట్ గురుంచి వెయిట్ చెయ్యటం కంటే ఇప్పటికి ఈ పార్ట్ కలెక్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ....." ఆ ఇయర్ వెయిటింగ్ రెండు ఇయర్స్ అయింది, అయినా ఆ కలెక్షన్స్ చాలా చోట్ల చెక్కు చెదరనే లేదు, అంతలోనే ఈ పార్ట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ఊచకోత మొదలు అయ్యింది. ఊహకి అందని రేంజ్ కలెక్షన్స్ తో యావత్ భారతదేశం తో పాటు ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బాహుబలి కమర్షియల్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ, ఇప్పట్లో చెరపలేని ఎన్నో రికార్డ్స్ సొంతం చేసుకోవాలి అని కోరుకుంటూ.. అప్పట్లో కోరుకున్నసంతృప్తి ని ఎంత వరకు అందించింది అనేది విశ్లేషించుకునే ప్రయత్నమే ఈ ఆర్టికల్.
ఇంతమంది ఇన్ని రోజుల కష్టం ని, ఇంత గొప్ప కమర్షియల్ విజయం ని, నాలుగు మాటల్లోనో, మూడు ముక్కల్లోనో తేల్చేసే ఉద్దేశం కాదు కానీ, ప్రతి పెద్ద సినిమాకి రాసుకొనే ప్రాక్టీసులో భాగమే ఈ ఆర్టికల్.
ఎప్పుడు చెప్పేదే అయినా, "సినిమా చూడని వాళ్ళు, చూడాలి అనుకునే వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిది" అని నా అభిప్రాయం. ఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు.
కథ: రెండు పార్ట్స్ గా వచ్చిన సినిమా కాబట్టి కథని రెండు పార్ట్స్ కలిపి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి, తల్లి నుంచి వేరు చెయ్యబడ్డ మహేంద్ర బాహుబలి, ఎదిగిన తర్వాత తండ్రి అమరేంద్ర బాహుబలి కి జరిగిన అన్యాయం, తల్లి దేవసేన అనుభవిస్తున్న శిక్ష గురుంచి తెలుసుకొని వాటికీ కారణం అయిన భళ్లాలదేవుడిని తుదముట్టించటమే కథ. సింపుల్ గా చెప్పుకుంటే ఒక పక్కా తెలుగు సినిమా కమర్షియల్ కథ. ఈ కథ చుట్టూ ఉన్న బలమైన పాత్రలు - బరువైన సన్నివేశాలు - పకడ్భంది కథనం - అబ్బురపరిచే విన్యాసాలు - అచ్చెరువొందించే వీరత్వం తోడు అయితే ఆ సినిమా రేంజ్ మారుతుంది. మరి ఈ సినిమా వరకు ఏవి ఎంతమేరకు అలరించాయి అని ఆలోచిస్తే..
ఇలాంటి జానపద కథల్లో - కథనం లో లాజిక్స్ వెతకటం కంటే, తెరపై కనిపించే మేజిక్ ని ఎంజాయ్ చెయ్యటం ఈ జానర్ కి ఉన్న సౌఖ్యం
కథనం: ప్రారంభం: ఫ్లాష్ బ్యాక్ మధ్య లో మొదలు అయిన కథనం... మూసేసి గెడ పెట్టేసి ఉన్న తలుపు వెనకాల నుంచి ఎలా వచ్చాడు అనేకంటే అబ్బా ఎం వచ్చాడు అనిపించే రేంజ్ లో ఇంట్రడక్షన్ తో మొదలు అయ్యి, ఒక పాటతో జనాల్లో ఒకడిగా మమేకం అయిన కథానాయకుడు గా ప్రేక్షకుల మదిలో అమరేంద్ర బాహుబలి ఒక ముద్ర వేసుకుంటాడు. పట్టాభిషేకం కి ముహూర్తం నిర్ణయించిన శివగామి, బాహుబలిని పిలిచి దేశాయాటన చేసి జనల బాగోగులు తెల్సుకోమంటుంది. తనకి తోడుగా కట్టప్ప ని పంపిస్తూ తిరిగి వచ్చేసరికి కోడల్ని వెతికిపెడతాను అంటుంది. ఇంతలో తన కొడుకు భల్లాలదేవుడు కి రాజు కాలేకపోయినందుకు ఏమైనా బాధ ఉంది ఏమో అనే ఆలోచనతో అతన్ని సంతృప్తి పరచాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. బయటికి వినయం నటిస్తూనే సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు భల్లాలదేవ. దేశాయాటన లో ఉన్న బాహుబలి, కుంతల దేశం యువరాణిని దేవసేన ని చూసి మనసు పారేసుకుంటాడు. తన ప్రేమ కోసం మందబుద్ధి గా అవతారం ఎత్తుతాడు. విషయం తెలుసుకున్న భల్లాలదేవుడు తనకి దేవసేన కావాలి అని శివగామి కి చెప్తాడు. తన మాట వలన, తన మాటే శాసనం అనటం వలన మూసుకు కూర్చున్న భల్లాలదేవుడు ని, సింహాసనం ని త్యాగం చేసిన మహానుభావుడు గా భ్రమించిన శివగామి మాట ఇచ్చి వర్తమానం పంపుతుంది. సారీ మేడం, ఐ యాం నాట్ ఇంటెరెస్టెడ్ అని సమాధానం చెప్పాల్సిన చోట, కొంచెం ఎక్కువ చేస్తూ శివగామి కి పొగరుబోతు సమాధానం ఇచ్చి కోపానికి గురి చేస్తుంది. దేవసేనని భందించి తీసుకురమ్మని బాహుబలి కి వర్తమానం పంపుతుంది.
జనరల్ గా ఫ్లాష్ బ్యాక్ కథల్ని రెగ్యులర్ ఫార్మటు లో చెప్పుకోలేము కానీ, మన సౌకర్యం కోసం విభజించుకుందాం. .
సమస్యాత్మకం: అది తన గురుంచి చూసిన సంబంధమే అని కట్టప్ప చెప్పటం వలన బాహుబలి కూడా ఆనందంగా తన ప్రేమని వ్యక్త పరిచే సమయం వచ్చి కుంతల దేశం పై పిండారీల మెరుపు దాడి, అక్కడ తన వీరత్వం తో అందరి మన్నలను పొంది ప్రేమ సొంతం అయ్యే టైం కి వర్తమానం అందుతుంది. అప్పటి వరకు సరదా కాలక్షేపం పేరుతో చతికిలబడ్డ కథనం కి ఊపు వస్తుంది. నా తల్లి నాకు నేర్పిన ధర్మం సాక్షిగా నీకు మాట ఇస్తున్నాను, నీ గౌరవం కి భంగం కలిగించను అని మాట ఇచ్చి దేవసేన ని బందీగా రమ్మంటాడు. తన మాట నమ్మి దేవసేన కూడా బాహుబలి వెంట నడుస్తుంది. సినిమా మొత్తానికి ఆయువు పట్టు లాంటి డ్రమాటిక్ సిట్యుయేషన్ కి తెరలేస్తుంది. వచ్చిన వెంటనే సారీ చెప్పిన దేవసేన ని క్షమిస్తూ, నీకు పెళ్లి ఫిక్స్ చేసింది భళ్లాలదేవుడితో అంటుంది. దేవసేన తిరగబడుతుంది. బాహుబలి కూడా ఎదురు తిరిగి ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా మాట ఇచ్చి తప్పు చేసావ్ అమ్మా అంటాడు. ఇఛ్చిన మాట కోసం నమ్మిన న్యాయం కోసం ధర్మస్థాపన కోసం ఎవరినైనా ఎదిరించు చివరికి ఆ దేవుడిని ఐన సరే అదే ధర్మం అని నువ్వు చెప్పిన ధర్మం కోసం నేను నిలబడతాను అంటాడు. ఇచ్చిన మాట కోసం నిలబడటం ధర్మం అయితే రాజమాత కూడా మాట ఇచ్చింది. మనసు తెలుసుకోకుండా మాట ఇవ్వటం తప్పు అయితే, తనకి సంబంధం చూస్తాను అన్న అమ్మ మాటకి విలువ ఇచ్చి దేవసేనపై మనసు పడిన వెంటనే ఆ విష్యం అమ్మకి చెప్పాల్సి ఉంది, దేవసేన కి మాట ఇచ్చే ముందు, అమ్మ వేరే ఎవరికైనా మాట ఇచ్చి ఉంటె అది తనకి అవమానం అని అలోచించి ఉండాల్సి ఉంది. తన ప్రేమని అమ్మ కాదు అనదు అనే నమ్మకం తో బాహుబలి మాట ఇచ్చినప్పుడు, బాహుబలి ప్రేమ గురుంచి తెలియక తన కొడుకు కి మాట ఇవ్వటం కూడా న్యాయమే? కానీ ఇక్కడ బాహుబలి అడిగాడు, శివగామి అడగకుండా ఊరుకుంది. ఇదంతా వెనక నుంచి నడిపించిన భల్లాలదేవుడు తన తండ్రి పావుని నడుపుతాడు. శివగామి ఇగో ని రెచ్చగొడతాడు. సింహాసనమా - దేవసేన అని ఆఫర్ చేసిన శివగామి కి సింహాసనం కోసం నేను ఇచ్చిన మాట తప్పితే అది నీ పెంపకాయినికే అవమానం అమ్మ అంటాడు. భళ్లాలదేవుడిని రాజుగా ప్రకటిస్తూ బాహుబలి ని సైన్యాధక్షుడు గా నియమిస్తుంది. అప్పటి వరకు శివగామి పై ప్రేక్షకులకి ఉన్న అభిప్రాయం కొంచెంగా మారుతుంది. ఈ పాత్ర ఇలా ప్రవర్తిస్తుంది ఏంటి అనిపించేలా చేస్తుంది. ఒకవేళ మీకు కూడా అలా అనిపిస్తే అది రైటర్ విజయం అనే చెప్పుకోవాలి. ఈ కథని ముందుకి నడిపించి ఫ్లాష్ బ్యాక్ ముగించటానికి ఇదొక్కటే మార్గం, దానికి ఈ సన్నివేశమే బీజం. ఈ డ్రామా పండించిన విధానం ఫస్ట్ హాఫ్ కీ అద్భుతం గా మిగిలిపోతుంది. పాత్రలకి క్రియేట్ చేసిన సందర్భాలు, వాటి మధ్య సంఘర్షణ తెరకెక్కించిన విధానం, పెర్ఫార్మన్స్ అమోఘం. అక్కడ నుంచి మొదలు అయిన పట్టాభిషేకం ఎపిసోడ్ ఇంటర్వెల్ వరకు ఒకప్పటి రాజమౌళి గారి ఇంటర్వెల్ బాంగ్ ని ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్ లో ఎంజాయ్ చేసిన రోజులు గుర్తుకి తెస్తుంది. ఈ సన్నివేశంకి స్ఫూర్తి అయిన పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని ఒకప్పుడు తిట్టుకున్నా వాళ్ళు సైతం పిచ్చి పీక్స్ కి ఎక్కించి చొక్కాలు చింపేసుకునే రేంజ్ ఎలివేషన్. ఇంతకీ బాహుబలి అంటే జనాల్లో ఎందుకు అంత క్రేజ్? యుద్ధం లో జనాల్ని కాపాడాడు అని? మదపుటేనుగు నుంచి కాపాడెడు అని? జనాల్లో ఒకడిగా కలిసిపోయాడు అని? ఆయనే రాజు అని ఫిక్స్ అయిపోవటం వలన? అమ్మ కి ఎదురు చెప్పటం వలన? అవన్నీ మాకు తెలియవు కానీ ఇంటర్వెల్ బాంగ్ కి ఆ ఎమోషన్ అలా సెట్ అయిపొయింది అంతే.
రగిలిపోతున్న భల్లాలదేవుడి కోపం తో స్టార్ట్ అయిన సెకండ్ హాఫ్, బాహుబలి పెళ్లి తో, దేవసేన సీమంతం తో నెక్స్ట్ స్టెప్ కి వెళుతుంది. అదే అవకాశం గా బాహుబలిని పదవి నుంచి తప్పించిన భల్లాలదేవుడి నిర్ణయాన్ని శివగామి సాక్షిగా దేవసేన ప్రశ్నిస్తుంది. నేనే సైలెంట్ గా ఉంటే నీకెందుకే అని అడుగుదాం అనుకుంటుండగా బాహుబలి ని రాజుని కమ్మని కోరిక కోరుతుంది. డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతున్న దేవసేన ని చూస్తూ, ఈవిడకి బాగా నోరు ఎక్కువ మాస్టారు, అందుకే ఫస్ట్ పార్ట్ లో ఆ రేంజ్ లో హింసించాడు భల్లాలదేవ అనుకుంటూ ఉండగా, విచారణ ఘట్టం మొదలవుతుంది. ఆటవికులు సైతం ఆశయించుకునే ల ఉన్న ఈ పద్ధతులే మీ శిక్షాస్మృతి అయితే మీ శాసనాలు మంటల్లో తగలబెట్టండి .. మతిలేని ఈ రాజ్యానికి మహిస్మతి అని ఒక పేరు ఒకటి అని దేవసేన ప్రశ్నిస్తుంటే ప్రేక్షకుడు కూడా అదే ఫీల్ అవ్వటం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎం జరిగింది అని ప్రేక్షకులకి తెలుసు కానీ సభలో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి, ఎవరు ఎలా రియాక్ట్ అయినా అప్పటికే ఒక ఊహ కి వచ్చేసిన ప్రేక్షకుడు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. శివగామి కి దేవసేన కి మధ్య సంభాషణలు అదిరిపోతాయి. అప్పుడు ఎంటర్ అయిన బాహుబలి కూడా హద్దులు అతిక్రమిస్తాడు. ఆడదాని ఒంటిమీద చెయ్యి వేస్తే నరకాల్సింది చెయ్యి కాదు దేవసేన తల అని కత్తి తీసి నరుకుతుంటే రోమాలు నిక్కబొడుచుకోవటం మన వతుంది అవుతుంది. భల్లాలదేవుడు రియాక్ట్ అయ్యే టైం కి శివగామి ఎంటర్ అయ్యి, ఇది రాజద్రోహం అని తీర్పు ఇస్తూ మహోన్నతమైన మాహిష్మతి న్యాయశాస్త్రం ప్రకారం అదే MPC సెక్షన్ 150 ప్రకారం బహిష్కరణ శిక్ష వేస్తుంది. వెంటనే వచ్చే దండాలయ్యా సాంగ్ లో మనకి బాహుబలి లో ఇంజనీర్ పరిచయం అవుతాడు. సివిల్ ఆ మెకానికల్ ఆ అని అడగకండి అప్పట్లో అన్ని బ్రాంచ్ లు లేవేమో. అక్కడ నుంచి దేశం ఎదురు చూసిన ప్రశ్నకి సమాధానం దిశగా భల్లాలదేవుడు పావులు కదుపుతాడు. తన కొడుకు శక్తి ఏంటో తెలిసిన శివగామి కూడా, హత్య ప్రయత్నం లాంటి విషయాన్నీ నమ్మటం కొంచెం ఆలోచించాల్సిన విషయమే అయినప్పటికీ ఇంక ఫ్లాష్ బ్యాక్ ఎలా అయినా అయిపోవాలి అని కట్టప్ప ని బాహుబలి ని చంపని పురమాయిస్తుంది. ఈ డ్రామా అంతా మనం ఇంతకు ముందే చూసేసిన పాత సినిమాల ఎత్తుల ఫీలింగ్ కలిగించినప్పటికీ ఆ సీన్ కోసం రాసుకున్న లీడ్ చేసే లాక్స్ ని ప్రెసెంట్ చేసిన విధానం బావుంది. ఇంత త్యాగం ప్రజల కోసం చేసి బాహుబలి చనిపోయి ఉంటే ఒకలా ఉండేది. కట్టప్ప వచ్చి నిజం చెప్పిన తర్వాత తన తప్పు తెలుసుకున్న శివగామి బాహుబలి కొడుకు ని రాజుగా ప్రకటిస్తుంది. దేవసేన బందీ గా కట్టప్ప బానిసగా మిగిలిపోతారు. అప్పటికే చాలా టైం తీసేసుకోవటం వలన భల్లాలదేవుడి వైఫ్ గురుంచి ప్రస్తావించలేదు ఏమో కానీ సినిమా క్లైమాక్స్ కి వచ్చేస్తుంది.
ముగింపు: అప్పటి వరకు భరువైన సన్నివేశాలతో సెకండ్ హాఫ్ ఎలా ఉంది అని ఎటు తేల్చుకోలేని కొంత మంది ప్రేక్షకులకి ఈ సినిమా ఎలా ఉంది అని డిసైడ్ అయ్యే సమయం, అప్పటి వరకు అద్భుతం అని ఫీల్ అయిన ప్రేక్షకులకి ఇకపై ఎం ఉంటె ఏంటి లే ఇది చాలు మాకు అని ఫీల్ అయ్యే సమయం, ఎంతటి కమర్షియల్ సినిమా కి అయినా ఆయువుపట్టు లాంటి సమయం. ఇక్కడ విషయానికి వస్తే, అప్పటి వరకు సీన్స్ కి ఇచ్చిన టైం కి, ఈ క్లైమాక్స్ బాగా తొందర పడుతూ తీసేసి చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. 25 ఏళ్ళ తర్వాత పగ తీర్చుకునే అవకాశం అంటే, అది ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే అంచనా ఉండటం సహజం. రెండు పార్ట్స్ లో కలిపి చూసేసిన ఫైట్స్ అవ్వటం వలనో, శాతకర్ణి లో కూడా చూసి ఉండటం వలనో, క్లైమాక్స్ ఫైట్ ఇవ్వాల్సిన కిక్ ఇవ్వలేదు (నా వరకు). అసలు డైరెక్ట్ గా హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ కి వచెయ్యకుండా, ఫ్లాష్ బ్యాక్ ని ఇంకా ముందు ముగించి, ఈ పాత్రల మధ్య కొన్ని సీన్స్ కి చోటు ఇచ్చి ఉంటె ఎలా ఉండేదో కానీ, షీల్డ్ ఇప్పేసి గొలుసులతో కొట్టించుకున్న భల్లాలదేవ లా, ఇంటర్వెల్ కి చించేసుకున్న నాలాంటి వాళ్ళని ఫెడేల్ ఫెడేల్ మని కొట్టి పంపించారు. ఇది జస్ట్ నా ఫీలింగ్ ఏ కానీ, థియేటర్ లో అదే ఫైట్ కి వచ్చిన విజిల్స్ ఇంకా కళ్ళముందు కనిపిస్తున్నాయి, అప్పటి వరకు ఉన్న డ్రామా కి, ప్రేక్షకులు ఎదురు చూసిన యాక్షన్ ఎపిసోడ్ కనెక్ట్ అయిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేసారు.
చివరిగా: మొగటి పార్ట్ లో విజువల్స్ తో అలరించి, రెండో పార్ట్ లో ఎమోషన్స్ తో కట్టి పడెయ్యటానికి ప్రయత్నించారు. మొదటి పార్ట్ లోని వెలితి పూరించే క్రమం లో పరిపూర్ణత్వం కి దగ్గరగా వచ్చి మంచి ప్రయత్నం కంటే ఒక మెట్టు ఎక్కారు. కథ కథనం పరంగా ఊహాజనితం అయినప్పటికీ దృశ్య పరంగా అలరించారు. సాహోరే రాజమౌళి అండ్ టీం. ఊహించటమే కష్టం అనిపించే సీన్స్ ని తెలుగు సినిమాగా మన ముందు ఆవిష్కరించిన రాజమౌళి గారిని ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది. ఆయన ఊహలు రెక్కలు తొడిగి ఇంకా ఇంకా పైకి ఎగరాలని మన కీర్తి పతాకాన్ని ఇంకా ఎత్తున ఎగరెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
2 comments:
BB ni champmani order chese Mundu..why didn't sivagami order for some prosecution?
Why did they tie Kattapa?when they send him to kill BB?
There will be civil war even if Kattapa kills BB? Is sivagami foolish ,not to know that?
Just some questions bro
as usual :thumb:
Pelli matter lo main point entante manaki anushka love chestundi bahubali ani ani telusu..
so Amarednra aa tappu dialogue cheppagane baga connect avuddi.. akkada ramyakrishna vartamanam pampinodu OA and koduku peru kooda prastavinchakapovadam bhale set chsadu ground..
Yes WKKB rajyam lo edho anischithi type godavallo Amarendra out ai unte anni rojulu ga tama kosam tyaagam chesina manishini gurtunchukuni, bhalla chetil himsalu padutunan janam ane emotion kooda create ayyedhi..
But puranala inspiration tho Rajamoui ekkuvaga kotalo rajakeeyale nadipinchadu..
Post a Comment