1 Nenokkadine - Vishleshana

నేనొక్కడినే - అబద్దం ఐతే బావుంటుంది అనిపించే నిజం

"ముందు ఉన్న అంచనాలు, రిలీజ్ రోజు వచ్చిన భయంకరమైన టాక్, సోషియల్ నెట్వర్కింగ్ సైట్స్ లో యుధ్ధాలు, మొదటి వారపు దారుణమైన కలెక్షన్స్, పబ్లిసిటీ, కొన్ని రివ్యూ లు, మరికొన్ని ఆర్టికల్లు, ఇంకా కొన్ని ఇంటర్వ్యూలు, ఫాన్స్ డిస్కషన్ బోర్డ్స్ లో థ్రెడ్ లు, చెప్పుకుంటూ పోతే బోర్ కొట్టే అంత మ్యాటర్ జరిగింది ఈ పది రోజుల్లో... సుకుమార్ గారి వరకు ఈ సినిమా రాసుకున్నప్పుడు క్ల్యారిటీ ఉంది, తీసిన తర్వాత చూసుకునప్పుడు ఉంది, మరి ఆడియెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు మిస్ అయ్యింది? కమర్షియల్ ఫార్మ్యాట్ లో ట్రై చేసిన డిఫరెంట్ స్క్రీన్ప్లే బేస్డ్ సినిమాని ఇంత ఖర్చు పెట్టి తీసి ఈ సీసన్ లో తీసుకురావటం ఒక కారణమా? అసలు పాటలు తీసేసి గంటన్నర లో సినిమా ప్లాన్ చేసి ఉంటే ఇండస్ట్రీ హిట్ కొట్టేశేది ఏమో కదా? మంచి సౌండ్ సిస్టమ్, ప్రొజెక్షన్ మన బీ అండ్ సీ సెంటర్స్ లో లేక పోవటం వలన వాళ్ళు ఎంజాయ్ చెయ్యలేక పోతున్నారు ఏమో లేదంటే ఈ సినిమా నచ్చక పోవటం ఏంటి? ఓవర్సీస్ లో బాగా వస్తున్నాయి కలెక్షన్స్ అంటే వాళ్ళకి వేరే నేనొక్కడినే చూపిస్తున్నారా లేక వాళ్ళకి మాత్రమే సినిమా అర్ధం అవుతుందా? ఇవేవీ కాక ఓవర్సీస్ లో ఉండి సినిమా కన్ఫ్యూసింగ్ గా ఉంది అంటే బాగోదు అని మొహమాట పడి సినిమా ని ఆడించేస్తున్నారా?". -  అసలు ఈ ఆర్టికల్ టైటల్ ఏంటి, నువ్వు రాయాలి అనుకున్నది ఏంటి? ఈ స్టార్టింగ్ ఏంటి? అని ఎవరికైన అనిపించిందా?.  నా వరకు అయితే నేను చెప్పాలి అనుకున్నది నాకు తెలుసు, పూర్తిగా చదవకుండానే ఫర్స్ట్ ప్యారగ్ర్యాఫ్ కె అర్దం అయిపోవాలి అని మీరు అనుకుంటున్నారు, బీబత్సం గా రాసి కొత్తగా కంక్లూడ్ చేసి మిమ్మ్లని ఇంప్రెస్ చేద్దాం అని నేను అనుకుంటున్నాను.  మీకు ఓపిక తక్కువ, నాకు క్రియేటివిటీ ఎక్కువ, రాసేది నేను కాబట్టి నా స్టైల్ లో రాస్తా అంటే, అయితే నువ్వే చదువుకో అని మీరు అంటారు అని నేను తెలుసుకోక పోతే నేను సుకుమార్ అవుతాను, మీరు మాత్రం ఆడియెన్స్ పాత్ర లో నే ఉంటారు. అర్ధం అయితే కంటిన్యూ చెయ్యండి, అర్ధం కాక పోతే ఇంకో సారి చదవండి. ఫర్స్ట్ టైమ్ అర్ధం అవ్వని వాళ్ళకి సెకెండ్ టైమ్ కొంచెం క్ల్యారిటీ వస్తుంది (సేమ్ ఈ సినిమా విషయం లో కూడా ) , ఫర్స్ట్ టైమ్ ఏ ఎంజాయ్ చేసిన వాళ్ళు చదువుకున్న ఇంటెలెక్చువల్స్ (ఫాన్స్ అలాగే అంటున్నారు గా మరి :)), ఎన్ని సార్లు చదివినా అర్దం కాక పోగా మెమేదో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి నీ ఆర్టికల్ చదువుదాం అని వస్తే మా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలే అంటారా .. మీకు ఏదో సైకొలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టు లెక్క (అంటున్నారు గా మరి :))

మన ఆర్టికల్ విషయానికి వస్తే, కేవలం నేను చూసిన సినిమా కథ కి , నాకు అర్ధం అయిన సినిమా కథనం ని విపులం గా ప్రయోగాత్మకం గా రాస్తున్న ఒక ఆర్టికల్ అంతే. కథనం అనే కంటే సీనిక్ ఆర్డర్ ని డిస్కస్ చేసుకుందాం అనటం బెటర్ ఏమో, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీన్స్, వాటి పర్పస్ / ఇంపార్టెన్స్, వాటిని తీసిన విధానం, గురుంచి మాట్లాడుకోవటం (మన ౩ఆక్ట్ స్ట్రక్చర్ ఫార్మ్యాట్ లో)

సుకుమార్ జగడం సినిమా గుర్తుంటే అందులో ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది, గడప తన్నుకోని పడిపోయిన చిన్న పిల్లాడి తండ్రి ఆ గడప ని తిరిగి కొడితే నవ్వుకుంటూ తనలోని హింసా ప్రవృతి పెరగటానికి తండ్రి ఎలా కారణం అని చూపించే సీన్. ఈ నేనొక్కడినే సినిమా లో కూడా అలాంటి ఇంపార్టెంట్ సీన్ ఉంది, పిల్లలకి అబద్దాలు చెప్పకండి, నిజం ఏంటో అబద్దం ఏంటో తెలుసుకోలేక నాలా మిగిలిపోతారు అని హీరొ చెప్పే సీన్. ఆ ఒక్క సీన్ లో నే సినిమా కథ మొత్తం ఉంది, కళ్లముందే తల్లి తండ్రి ని ఛంపేస్తే, అసలు అలాంటిది ఏమీ జరగలేదు అది నీ ఊహ అండ్ నీకు ఉన్న జబ్బు అని చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఎస్ట్యాబ్లిష్ చేస్తుంటే, నిజానికి అబద్దానికి మద్య స్ట్రగల్ అవుతూ "నేను వాళ్ళని ఛంపటం అబద్దం కావొచ్చు ఏమో కానీ వాళ్ళు మా అమ్మ నాన్న ని ఛంపటం మాత్రం నిజం" అంటూనే "అందరూ అనే అబద్దానికి దూరం గా, తాను నమ్మే నిజానికి దగ్గరగా వెళ్తున్నాను" అని కట్ చేస్తే... అమ్మ నాన్న కోసం పరిగెడుతున్న గౌతమ్ ని చూస్తాం... అంటే అమ్మ నాన్నల జ్ఞాపకాలు కోసం ఆ ఆలోచనలకి దగ్గరగా వెళ్తున్న హీరొ ని చూస్తాం.. ఈ మాటల్తో ఆ సీన్స్  ప్రెసెంట్ చేసిన విధానం కి సుకుమార్ గారికి సల్యూట్ చేస్తూ సినిమా ని సీనిక్ ఆర్డర్ లో అనలైస్ చేసుకుందాం. ఆర్టికల్ లెంత్ ని దృస్టిలో పెట్టుకొని సీన్స్ ని గ్రూప్ చేసి రాస్తున్నా

సూపర్స్టార్ మహేష్ లాంటి హీరొ తో, ఈ జానర్ లో, ఆదరిస్తారో లేదో అన్న అనుమానం లేకుండా ఇంత ఖర్చు పెట్టి ఈ సినిమా చెయ్యటం నిజం గా సాహసం. ఆ సాహసం కి మనధైన ప్రోత్సాహం అందించటం కోసం "చప్పట్ట్లు"

ACT 1: ప్రారంభం : చిన్న పిల్లాడిని తరుముతున్న ముగ్గురు మనుషులు, కట్ చేస్తే అదొక కల, కట్ చేస్తే సాంగ్, అవ్వగానే మొదట చూపించిన ముగ్గురు మనుషులు లో మొదటి వాడు కనిపిస్తాడు, హీరొ వెంటపడి ఛంపేస్తాడు, తన పేరెంట్స్ ని చంపిన ముగ్గుర్నీ ఛంపేశాను అని చెప్పి సరెండర్ అయిపోతాడు, అప్పుడు హీరోయిన్ ద్వారా తెలుస్తుంది తాను ఛంపలేదు అని, ఊహించుకున్నాడు అని, తనకి ఇంటెగ్రేషన్ డిసార్డర్ ఉంది అని, అసలు అలాంటి మనుషులే లేరు అని, ఇంతలో తనపై అట్యాక్, ఆది నిజమో అబద్దమో తెలుసుకునే కంటే తాను నమ్మిన నిజానికి దగ్గరగా ఎవరికి అందకుండా ప్రశాంతం గా పారిపోధామ్ అనుకుంటాడు.

ఇంత సింపల్ గా ఉన్నా, తీసిన విధానం మాత్రం చాలా కాంప్లికేట్ చేశారు డైరెక్టర్ గారు. మొత్తం అంతా చాలా ఫాస్ట్ గా, కన్ఫ్యూసింగ్ గా, ప్యాక్డ్ / టైట్ గా వెళ్ళిపోతూ ఉండటం వలన అసలు ఎం జరుగుతుందో తెలుసుకుందాం అని ఆలోచించే టైమ్ ఆడియెన్స్ కి లేకుండా చేశారు. హీరొ సమస్య ని బాగా ఎస్ట్యాబ్లిష్ చెయ్యగలిగిన డైరెక్టర్ హీరొ ఆశయం ని ఎస్ట్యాబ్లిష్ చెయ్యటం లో కన్ఫ్యూస్ అయ్యాడు. ఇలా ఎందుకు అంటున్నాను అని మనం లాస్ట్ ఆక్ట్ లో చెప్పుకుందాం. హీరొ గోవా కి వెళ్ళటం తో సెకెండ్ ఆక్ట్ కి అడుగుపెడతాం.

జాగ్రతగా గమనిస్తే హీరొ ఊహించుకునే సీన్స్ అన్నిటికి డిఫరెంట్ ఎడిటింగ్ ఉంటుంది, సెకెండ్ టైమ్ చూసినప్పుడు మనం ఇంకా క్లియర్ గా గమనించవచ్చు అండ్ ఆది ఫర్స్ట్ టైమ్ ఎలా మిస్ అయ్యామో ఆలోచించుకోవచు, కొన్ని మాత్రం సిల్లీ లెండి.   చిన్న గౌతమ్ ని తరుముతున్న ముగ్గురిలో సెకెండ్ ప్రదీప్ ఉంటాడు, ఇది ఇంటెన్షనల్ గా ఆడియెన్స్ ని కన్ఫ్యూస్ చెయ్యటానికి పెట్టినట్టా? ఇంటెన్షనల్ గా పెట్టినా ఇదొక బ్లండర్, ఎందుకంటే ఒరిజినల్ గా ఆ సీన్ లో ఉండాల్సింది నాజర్. లేక హీరొ కి వచ్చిన డ్రీమ్ తప్పా? సాంగ్ అవ్వగానే పరిగెత్తుకు పోయిన రాక్ స్టార్ ని హీరోయిన్ మాత్రమే చేస్ చేస్తుంది? ఇంక డాక్టర్ ట్రీట్మెంట్ అలా ఉంటుంది అని బహుశా సినిమా చూస్ వరకు మనకు కూడా తెలియదు కదా. ఒక సైకియాట్రిస్ట్ అనేవాడు కేస్ ఎంత సీరీయస్ అయినా సిల్లీ అయిన ఆ కేస్ ని అర్థం చేసుకోవాలని, విశ్లేషించాలని చూడాలి తప్ప కామెడీ చేస్తే అసలు ఆ పాత్ర తాలుకు ఎమోషన్ తో ఆడియెన్స్ ఎలా కనెక్ట్ అవుతారు?  

ACT 2: ప్రశాంతం గా ఉన్న హీరొ కి హెరోయిన్ ఇంటర్వ్యూ కోసం వెంట పడటం, ఊహించుకోవటం, అట్యాక్స్ జారుగ్తు ఉండటం, నిజమో అబద్దమో తెలుసుకునే కన్ఫ్యూషన్ లో ప్రేమలో పడటం, అసలు నిజం తెలుసుకోటం, ఊహల నుంచి బయటికి వచ్చి నిజం లో బతకటం, ఆశయ సాధన కి దారులన్ని మూసుకుపోవటం. ఇది సింపల్ గా సెకెండ్ ఆక్ట్. హీరొ సమస్య ఏంటో తెలిశాక ఆది ఎంత తీవ్రమైందో, దానిని అధిగమిస్తూ తన ఆశయం కోసం ఎం చేశాడు అనేది ఉండాల్సింది ఈ ఆక్ట్ లో.

హెరోయిన్ కరెక్ట్ గా గోవా వెళ్లేముందు ఒక వీడియో క్లిప్ ఎడిట్ చేస్తూ ఉంటుంది, సీడ్స్ గురుంచి, ఆది అయ్యాక జరిగే అట్యాక్స్ హెరోయిన్ మీద కూడా కావొచ్చు అని చాలా తక్కువ మంది ముందుగా ఊహించి ఉంటారు. మనకి హెరోయిన్ ఆడుతుంది నాటకం అని చూపిస్తూనే బీచ్ లో కెలీ తో హీరొ మాట్లాడినట్టు ఊహించుకునట్టు చూపిస్తాడు (లేదంటే హీరొ కి జబ్బు తగ్గిపోయింది అని మనం ఫీల్ అవ్వకుండా). ఆ తర్వాత ప్లాన్ చేసిన చేస్ ఇంకాస్త ఇంట్రెస్ట్ గా తీసి ఉంటే బావుండేది, సడన్ గా ఐల్యాండ్ లో ప్రేమ పుట్టుకొచెయ్యటం దానిని సరిగ్గా ఎస్ట్యాబ్లిష్ చెయ్యలేకపోవటం వలన పర్ఫార్మెన్స్ లు ఎంత బావున్నా కనెక్ట్ అవ్వలేక పోతాం. గోవా వచ్చిన దగ్గర నుంచి ఈ ఐల్యాండ్ సీన్ వరకు కంప్లీట్ గా రివిసిట్ చేసి ఉండాల్సింది. మూడు అట్యాక్స్ ప్లాన్ చేశారు, రెండు సాంగ్స్ ప్లాన్ చేశారు, ఒక ఫైట్ ప్లాన్ చేశారు కానీ ఎమోషన్ ని మరీచారు.  కానీ ఒక సారి ఐల్యాండ్ లో అట్యాక్ తన మీద కాదు అని తెలుసుకున్న సీన్ నుంచి మహేష్ నటన విశ్వరూపం చూస్తాం. అక్కడ మనకి మహేష్ కనిపిస్తాడు కానీ సీన్స్ కనిపించవ్, అంటే సీన్స్ ని మహేష్ డామినేట్ చేసేసాడు అన్నమాట. ఇంటర్వల్ సీన్ ఐతే సినిమా మొత్తానికి అద్భుతం గా పండిన సీన్. కానీ ఇక్కడొచ్చిన ఇంకో చిక్కు ఏంటి అంటే, గతం లేదు అని నమ్మినప్పుడు, ఫైట్ నిజం అని తెలిసినప్పుడు, టాయ్లెట్ లో కెలీ కనిపిస్తే ఛంపల్సిన అవసరం ఏముంది, ఆది హెరోయిన్ కి నచ్చదు అని చెప్తునే బయటికి వచ్చి మళ్లీ ఛంపేశాను అనటం ఎంత వరకు కరెక్ట్, ఒక వేల ఊహే అయితే ఛంపినా మళ్లీ వస్తాడు అని రీయలైస్ అయ్యాడు కదా అయినా ఎందుకు ఛంపుతాడు. స్టార్టింగ్ లో కెలీ ని ఛంపగానే హీరొ పోలీకుల దగ్గరకి వెళ్ళి మిగిలిన ఒక్కాడ్నీ కూడా ఛంపేశాను అంటాడు..అంటే హీరొ కెలీ ని ఛంపినట్టు ఊహించుకోవటం అదే ఫర్స్ట్ టైమ్ అని మనం అనుకోవాలి. కానీ ఇంటర్వల్ సీన్ లో హీరొ కెలీ తో దీనికి ముందర నిన్ను చాలా సార్లు ఛంపేశాను అంటాడు? కామెడీ బాగానే పండటం వలన అంత పట్టించుకోము అనుకోండి, ఇవేవీ ఆలోచించానంత అద్బుతాం గా ఆ ఇంటర్వల్ సీన్ పండింది. ఇంతకీ హీరొ కి నిజం తెలిసే ఐల్యాండ్ సీన్ లో హెరోయిన్ హాండ్ బాగ్ సడన్ గా ఎలా వచ్చి పడింది? 

ఫైనల్ గా ఫర్స్ట్ హాఫ్ లో నిజం తెలుసుకున్న హీరొ తన ఆశయం అయిన మిగతా వాళ్ళని ఛంపాలని అనుకుంటాడు, నాజర్ ఫోన్ నంబర్ పట్టుకునే సీన్ బాగా పండింది. అక్కడ నుంచి ఫ్ల్యాష్బ్యాక్ తెలుసుకుంటాడు, నాన్న ఇచ్చిన బ్యాగ్ లో ఉన్న బ్రిటిష్ కోఇన్ ఆధారం గా లండన్ వెళ్తాడు, అక్కడికి వెళ్ళగానే అట్యాక్, ఇవెంట్ మ్యానేజర్ కూడా చనిపోయాక ఇంకా ఆల్మోస్ట్ డెడ్ లాక్ లాంటి సిచుయేషన్ లో క్యూబ్ ని సాల్వ్ చేసి థర్డ్ ఆక్ట్ కి వెళ్తాడు

నాజర్ ద్వారా ఆ రోజు ఎం జరిగిందో చెప్పించి, నాన్న తనకి ఇవ్వమన్న బాగ్ ని అందుకున్న హీరొ కి కీ దొరుకుంటుంది. ఆ కీ పట్టుకొని లండన్ వెళ్ళగానే అట్యాక్ అవుతుంది, వెంటనే సాంగ్ వెంటనే డెడ్ లాక్. అంటే సెకెండ్ ఆక్ట్ చాలా ముందుగా ఐపోతుంది. అందులో నే రెండు సాంగ్స్ ని కూడా ఇరికించేశారు. కానీ ఇక్కడ పోసాని ద్వారా హీరొ తన అమ్మ నాన్న గురుంచి తెలుసుకోవాలి అనుకుంటున్నాడు అని చెప్పించారు. అప్పటి వరకు ఆడియెన్స్ చూడని పాయంట్ అధి. అంటే ఆది ప్లాన్ చేసుకునే టైమ్ కి క్లైమ్యాక్స్ లో రైమ్ ప్లాన్ చేసుకొని ఉంటారు, కానీ అదే చిక్కు గా వచ్చి పడింది.  

అసలు ఆ బాంక్ లండన్ బాంక్ ఐనప్పుడు, నాజర్ లండన్ వాడే అయినప్పుడు, ఆది జస్ట్ నంబర్ బేస్డ్ అకౌంట్ అని తెలియదా, అలా తెలిసి ఉంటే ఆ క్యూబ్ ని ముందే సాల్వ్ చేసుకొని ఉండాల్సిందే. పోనీ హీరొ స్పెషల్ గా మద్య లో డిఫరెంట్ కలర్ వచ్చేలా సాల్వ్ చేస్తాడు సో రెగ్యులర్ గా సాల్వ్ చేసినా అర్ధం కాలేదు అనుకున్నా, ఆ ప్రయత్నం కూడా మనకి చూపించడే, అంత కాలం వెయిట్ చేసే కంటే ఒక నెల పాటు ట్రేల్ అండ్ ఎరర్ మెతడ్ లో సాల్వ్ చేసినా పని ఐపోయేది ఏమో . చేస్ లు, మర్డర్ లు అన్ని జరుగుతున్న పోలీస్ అనే వాడు కనిపిన్చడు లండన్ లో. పోలీస్ లు కార్ ఆఫర్ చేస్తే వదిలెయ్యటం లాంటి సినిమ్యాటిక్ లిబర్టీ లు బాగానే తీసుకున్నారు.

3rd ACT: బాంక్ లో రైస్ గ్రేన్ దొరకటం, అట్యాక్, వెనక ఎవరు ఉన్నారో ఎర వేసి పట్టుకోవటం, అసలు కారణం తెలుసుకోవటం, ఛంపటం, నాన్న అమ్మ ల జ్ఞాపకాలు కనుగొనటం, నాన్న ఆశయం ని సాదించటం తో ముగుస్తుంది

బాంక్ దగ్గర అట్యాక్ అంత ఎఫెక్టివ్ గా లేక పోయినా, తన డిసార్డర్ ని యూస్ చేసుకొని ట్రాప్ వెయ్యటం, వెనక పడె వాళ్ళని కనుక్కోటం ఎపిసోడ్స్ చాలా బాగా పండాయి. అసలు ట్విస్ట్ రివీల్ చేసిన విధానం కూడా బావుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నాజర్ తో మాట్లాడే సీన్ పర్ఫార్మెన్స్ తో టాప్ సీన్ గా నిలుస్తుంది, ఆ తర్వాత ప్లాన్ చేసిన రైమ్ ఐడియా, ఆ సాంగ్ ని కట్ చేసిన విధానం, సింపల్ గా సుపర్బ్. ఇవన్ని ఇంత బావుంటే మరి ఎందుకు మనం కనెక్ట్ అవ్వలెఢు.? ఇక్కడ మనం ఫర్స్ట్ ఆక్ట్ లో వదిలేసిన విషయాన్ని డిస్కస్ చేద్దాం.  ఆక్ట్ ౩ లో ఎలా ఎండ్ చెయ్యబోతున్నావో ముందే తెలుసుకో, అప్పుడు ఆక్ట్ 1 ని బాగా పండించగలవ్ అన్నారు పెద్దలు. అసలు నాజర్ అనేవాడు ప్రదీప్ ని ఎంధుకు ఛంపాలి? ఎవరో రాక్ స్టార్ ప్రదీప్ తో మాట్లాడుతుంటే వీడు ఎందుకు గుద్దెయ్యాలి, వీడికి ఎలా తెలుసు ఆ రాక్ స్టార్ ఏ చిన్నప్పటి గౌతమ్ అని, ఒక వేల వాడు నిజం చెప్పేస్తే నన్ను ఛంపేస్తాడు అని భయపడి ఛంపేశాడా? మరి టీవీ లో పోలీస్ స్టేషన్ న్యూస్ చూసి  ఇండియా కి వచ్చిబాగ్ అందిచటం ఏంటి, నాజర్ ఏ  అసలు విలన్  సస్పెన్స్  ఉంచటానికి మొతం స్క్రీన్ప్లే ని కింద మీద పడేసి తొక్కెశారు.

ఎప్పటికైనా అమ్మ నాన్న వివరాలు కనుక్కొవటం వాళ్ళని చంపిన వాళ్ళని ఛాంపెయ్యటం హీరొ ఆశయం అని మనకి క్లైమ్యాక్స్ లో తెలుస్తుంది. అలాంటప్పుడు అమ్మ నాన్న డీటేల్స్ ని ఫర్స్ట్ మర్డర్ చేసినప్పుడు ఎందుకు అడగలేదు, డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళిపోయాడు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లొంగిపోవటం అన్నది ఓన్లీ స్టోరీ ని రివీల్ చెయ్యటానికి వాడిన పాయంట్ తప్ప దానికి జస్టిఫికేషన్ అనేది లేదు, అంటే వాళ్ళని ఛంపటం మాత్రమే ఆశయమా? పోసాని ద్వారా ఇంకో ఆశయాన్ని, రైస్ గ్రేన్స్ ద్వారా ఇంకో ఆశయాన్ని అంత సేపు దాచిపెట్టి లాస్ట్ లో చూపించటం అనేది ఖలేజా సినిమా లో జరిగిన తప్పు లాంటిది. ఇవన్ని మనకి ముందునుంచీ ఇంజెక్ట్ చెయ్యలేక పోవటం, మనం కనెక్ట్ అవ్వక పోవటానికి ఇంకో కారణం. అందుకే మనకి లాస్ట్ లో గాబారాగా చుట్టేసీనట్టు, సాగుతునట్టు అనిపిస్తుంది.నాజర్ ని ఛంపగానే సినిమా అయిపోయింది అనుకున్నారు అందరు, ఎందుకంటే అమ్మ నాన్న ఎలా ఉంటారో తెలుసుకోటం హీరొ ఆశయం అని వాళ్ళకి తెలియదు. అప్పటి వరకు ఆ ఫీల్ కలగానివ్వలేదు. ఒక వేల ఆ రైమ్ కాన్సెప్ట్ ఏ తీసుకున్న, మిగత పిల్లలు అందర్నీ పేరెంట్ రిసీవ్ చేసుకుంటుంటే, అంత దూరం లో ఇల్లు పెట్టుకొని నువ్వు ఇంట్లో ఎం చేస్తున్నవే అమ్మా అని ఆలోచించే అంత అసహనం కూడా కలుగుతుంది. అదే పరుగు లో అడవులు, పెద్ద పెద్ద బ్రిడ్జ్ లు చూడటానికి బావుంటై కానీ, అలా ఎలా ఒంటరిగా వదిలేశారు అనేది బ్యాక్ ఆఫ్ ద మైండ్ అయితే తొలిచేస్తూ ఉంటుంది గా.  అన్నిట్కి మించి ఎండింగ్ లో లోకొద్దరకుడు ల గోల్డెన్ రైస్ అంటూ అప్పటి వరకు లేని సొది తో ఎండ్ చెయ్యటం జరిగింది. చ్చు. ఈ పాయంట్ ఆఫ్ కంక్లూషన్ ని లాస్ట్ మినిట్ వరకు టచ్ చెయ్యక పోవటం, మొదట్లో హెరోయిన్ రిసర్చ్ చేసిన సీడ్స్ గురుంచి మద్య లో నే వదిలెయ్యటం వలన కథ సరిగ్గా ఎస్ట్యాబ్లిష్ అవ్వక లాస్ట్ కి వచ్చే సరికి కనెక్షన్ మిస్ అవుతుంది. ఇదంతా ముందుగా ప్లాన్ చేస్తుకున్న క్లైమ్యాక్స్ మార్చటం వాలనో, స్టోరీ ఇంప్రువైసేషన్స్ లో లింక్ మిస్ అవ్వటమ్ వలనొ జరిగి ఉండొచ్చు . 

Overall Ga:

ఈ సినిమా వరకు మనకు ఒహో ఇలాగా లేక పోతే అలాగ అయి ఉండొచ్చు లే అని అనుకోవాల్సిన / సర్ధి చెప్పుకోవాల్సిన పాయంట్స్ / సీన్స్ చాలా ఉన్నాయి, మొన్న ఈ మద్యనే ఎక్కడో చదివా, మొదట్లో మూకీ సినిమాలు థియేటర్ లో ఆడుతుంటే ఒక కార్నర్ లో మైక్ పట్టుకొని సీన్స్ ఎమోషన్స్ ఎక్స్ప్లేన్ చేసేవారు అని, ఈ సినిమా కి కూడా సుకుమార్ మైండ్ లో ఎగ్స్యాక్ట్ గా ఏముంది అని అలా ఎక్స్ప్లేన్ చేసి ఉండాల్సింది థియేటర్ లో (సినిమా రిలీస్ అయిన తర్వాత ఎక్స్ప్లనేషన్ ఇస్తూ ఏదో రిలీస్ చేద్దాం అనుకుంటున్నారు అని ఇంటర్వ్యూ లో చెప్పారు గా) 

ఇంత మంచి హీరొ క్యారక్టర్ తో వండర్స్ చెయ్యొచ్చు, అద్బుతమైన సీన్స్ కొన్ని ఉన్నప్పటికీ, లెంత్ ఎక్కువ అవటం, మంచి సినిమ్యాటోగ్రఫీ ఉన్నప్పటికీ డార్క్ టోన్ అవ్వటమ్, సాంగ్స్ అవసరం లేక పోయినా ఇరికించటం,  మొదటి 15 నిమిషాల్లోనే మొత్తం గందరగోళం చేసేయ్యటం, అక్కడ నుంచి సాగించి సాగించి నస పెట్టిన మంచి ఇంటర్వల్ ఇచ్చినప్పటికీ, గతి తప్పిన ౩ర్డ్ ఆక్ట్ ఓవరాల్ ఎక్స్పీరియెన్స్ ని దెబ్బ తీసింది. మన కమర్షియల్ సినెమాలలో మైండ్ గేమ్స్ అంటే, ఎంత సేపు హీరొ అట్యాక్స్ నుంచి పరిగెత్తడం, బుర్ర మీద చేతులు పెట్టుకొని ఆలోచించటం మాత్రమే కాకుండా లాస్ట్ లో వేసిన ట్వెస్ట్ లాంటివి రెండు మూడు పడాలి, అసలు ప్రతి అడుగు విలేన్ వేయించిన అడుగు అయి ఉండి, హీరొ ప్రతి ఆక్షన్ విలన్ ముందుగానే ప్లాన్ చేసింది అయి ఉండి, హీరొ అనేవాడు ట్రాప్ లో ఉండి డిసార్డర్ తో బ్రతుకుతున్న  హీరొ కి నిజం తెలిసి తిరగబడి తాను ఎవరో, తన పేరెంట్స్ ఎవరో తెలుసుకోవాలి, తనని ఇలా చేసిన వాళ్ళని ఛంపాలి అనే ఆశయం ఉంటే ఫౌండేషన్ ఇంకా బావుండేది ఏమో అని నా ఒపీనియన్.

తెలిసో తెలియకో ఇన్వాల్వ్ అయ్యే అవసరం అభిమానులకి ఉంటుంది ఏమో కానీ అందరు ప్రేక్షకులకి ఉండదు. క్యారక్టర్ రాసుకున్న ఎగ్సైట్మెంట్ లో ఏదో చేసెద్దం అని మొదలు పెట్టి, తెలివిగా చేస్తున్నాం అనుకున్నారు కానీ అర్ధం అయ్యేలా తీస్తున్నామా అని ఆలోచించుకోలేక పోయారు. క్లాస్ లో కొందరికి మాత్రం అర్ధం అయ్యేలా చెప్తే ఆది గొప్ప లెసన్ అయిపోదు, ఆల్మోస్ట్ అందరికి అర్ధం అయ్యేలా చెప్పగలిగితే ఆ లెసన్ అందరికి రీచ్ అవుతుంది అండ్ చెప్పిన మాస్టరు కి కూడా పేరొస్తుంది.  ఇలాంటి సినిమా ని ఎంజాయ్ చెయ్యాలి అంటే ఇంట్రెస్ట్ గా చూడగలగాలి, అలా చూడాలి అంటే స్క్రీన్ప్లే కట్టి పడేసేలా ఉండాలి, కన్ఫ్యూస్ చేసేలా ఉంటే కొంచెం సేపు ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కానీ, కూర్చున్నంత సేపు అంటే అయితే నిద్ర లేదంటే హాహాకారాలు మిగులుతాయి.

గొప్ప ప్రయత్నం అనను కానీ, ఒక మంచి ప్రయత్నం గా నిలిచిపోవాల్సింది, బోరింగ్ బొమ్మ గా మిగిలిపోయింది.

అందుకే ఈ నేనొక్కడినే సినిమా ఇలా తీయటం అబద్దం అయి ఉంటే బావుంటుంది అనిపించే నిజం.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
నాకు ఉన్న లిమిటెడ్ నాలెజ్ లో నేను రాసింది ఎంత వరకు కరెక్ట్ అనేది నేను అయితే చెప్పలేను కానీ, ఈ ఆర్టికల్ చదివే అనుభవజ్ఞులు వారి అభిప్రాయాలు సూచనలు సలహాలు షేర్ చేసుకుంటే రుణ పడి ఉంటాను.

12 comments:

vidyasagar said...

Great article!!

Suraj said...

idhi oka chettha vishleshana

Vishleshanalu jayaparajayala ku atheethamga rayali. Hit cinema padithe janalu connect ayarani Act1,Act2,Act3 raayadam kadu!!
world cinemalu chusthe ee Acts enduku paniki ravu ani ardham avthundi!!

1 is one of such movie which can be hailed as close to world cinema barring telugu commerical trappings made in the movie

Grand Masti/Nayak/Eerojullo emi acts unnayani aadaranukuntunnaru!!
movies ki chese promotions/release time also matters watever stupid ACTS the script has!!

Anonymous said...

Champi avatalesav bhayya....

Anonymous said...

thappantha sukumar dhe. intha manchi actors,cinematographer, budget unna kuda sarigga tiyyalekapoyadu. anavasaram ga confusion create chesadu story lo twist lu petti. vachina avakasanni waste cheskunnadu.

dazzlinggopi said...

Sarigga chuste ee cinima lo ghajini cinima ki daggara polikalu unnayi .. kakapote mana telugu vaallu surya ni aa character lo uhinchukogalaru kani mahesh ni uhinchukoleru .. mana hero lu perfect ga undali .. heroine kukkala atani venaka padali .. atanu andarni iraga kottali .. atanu vese plans lo andaru padipovali .. bramhanandam ni kottali .. oka edupu scene undali (reality ki daggaraga oka expression and oka kanneeti bottu kakunda buta buta edavali manollaki ardham kavalante)..oka section janalaki nachalante hero pawan kalyan/arjun/(any dog from mega family)kavalai .. inko varganiki nachalante Jr NTR/Mahesh avvali .. okadu oka hero ki fan ite vere cinimalu nacha kudadu .. edo okati chesi vadi cinimaninasanam cheyali. Oka hero inko hero meeda satirelu veyali ..manaki manchi cinima kavali .. adi ela undalante dash dash dash ..
Poni kshana Kshanam loemaina confusion unda boss/Rudraveena lo edaina confusion unda? manollaki kavalasindi vache varaku edo oka vanka pettadam alavatu.. asalu vaallaki kavalaisndi kaltmakamaina cinima kadu .. vaallu either navvukovali or eduti hero meeda manam goppa ani chupinchukovali

HKR said...

idhi oka chettha vishleshana// Thanks for your feedback

Vishleshanalu jayaparajayala ku atheethamga rayali. Hit cinema padithe janalu connect ayarani Act1,Act2,Act3 raayadam kadu!!
world cinemalu chusthe ee Acts enduku paniki ravu ani ardham avthundi!! // acts introduce cehsinde world cinema.. syd field books kani speeches veelaithe choodandi.. screen play gurunchi Acts structure gurunchi start chesindi ayane.. btw. hit or flop pakkana pedithe cinema ki connect ayyama leda annadi main ga important.. anduke konni cinemalu bavunna (i mean connect ayina0 commercial ga flops avuthai..

1 is one of such movie which can be hailed as close to world cinema barring telugu commerical trappings made in the movie

Grand Masti/Nayak/Eerojullo emi acts unnayani aadaranukuntunnaru!!
movies ki chese promotions/release time also matters watever stupid ACTS the script has!!// acts anedi mana telugu cinema varaku infact indian cinema varaku entha varaku follow avutunnaru anedi pakkana pedithe.. idi just explanation ki use chesukunna oka method anthey.. i even dont know whether vallu exact ga ilage anukonu script rasukunnara ani... successful films lo unde oka formula ni andaru follow avutu untaru.. adi telisi ayina teliyaka aina.. aa formula nunchi generate chesinde ee acts ane structure.. anyways.. mimmlani educate cheyyalani em cheppaledu.. world cinema lo acts ye levu ante respond avvalsi vachindi.. thanks for reading

aditya said...

neeku teliyani vishayama baa, yelanti genre aina daniki tagattu logics/cinematic liberties untai, chinna teda untundiga, ee cinemaki taggatu konni cinematic liberties teesukunnadu like aa nazar/pradeep rawat role swap in first scene

aina akkada clear ga emi choopinchadu rawat ni oka bit lo moham choopstaru, inkosari kalla varaku nazar and rawat ni marchi choopistaru, and hero ki mugguru gurtunnaru

inka amma nannalani choodali anedhi nazar fb cheppaka asalu kadha idhi ani telisaka mottam oka plan set chesukuntadu atu vallani eseyadam plus valla amma nannalani gurtinchadam

aa goa episode oka 10 mins tagginchi, fights ni baga effective ga present chesi oka song ara cut chesi climax aa golden rice dhi inka konchem explain chesi unte inka bagundedhi

naaku aithe baga nacchindi oka10-15 mins sodhi tapap superb movie,

4 times choosanu ippatiki .

aditya said...

asalu startin glone nazar main villain ani auidience ki reveal chesi mahesh ni trap chestunnattu choopiste bagundedhi, appudu pre climax lo hero telusukunadpu inka kick vacchundedhi.unnecessary confusion taggi undedhi

Unknown said...

Article seems to be good and you already mentioned in the end that you wrote this one with your limited knowledge. Yes, some logic were missed. But that does not mean its a boring film. Even if you take any sensational movie even Hollywood there are many loop holes.
Thriller movies are all with slow narration. First champinappudu, valla muggguru accidental gane chanipotharu. Intervel lo chala sarlu champanu ninnu ante, anni sarlu manaki chupinchalsina avasaram ledu. Golden rice concept valla parents ki sambandhinchi na viashayalu telistene telustundi. Idi thrilling factor, so alana unchali.
Moreover thriller movies lo ilanti vi last varaku teliyavu.
Yes I do agree with you, there is a confusion regarding some dialogues like neeku parents leru? naaku parents unnaru?

Ika idi janalu recive enduku chesukoledante,
Nuvu cheppinattu class andarki ardam avalante ... idi kastam? Edo marumula B.Tech college lo class ki IIT professor na pampithe ... vallu professor cheppedi ardam ardam chesukovadaniki kaneesam chala class lu waste avuthayi ... but ade class lo unde top 3 or 4 members ki ardam ayyiddi.

But e example tho nenu 1 Nenokkadine top notch film anadam ledu ... ala ani mana audience vedhavulu andam ledu ... Marumula collelo students ... valla professor cheppe vidhananiki alavatu paddru... valla thappemi ledu ... ala ani iit professor vallaki chepetappudu ... aa professor vallaki ardam ayettu cheppaledu ani vadahava analemu ...
aa students ayanni ardam chesukone range ki vachentha varaku class lu wwste avuthune untayi. Ayana cheppeve vallaki enduku ardam kavadam ledo vallaki telusu kaani ... andulo konthamandi meela ... ayaniki cheppadam raadu ani ila blogs raastu untaru ani naa feeelig. class lo ardam ayina memu ... ee vedhavulu eppudu ardam chesukuntaru ani memu ila nee comments raastuntam ...

Manavallu (telugu audience) ela alavatu paddaro telusu.... anni moddu cinemalu ... Simha, Businessman, Racha, nayak ilanti movies ni hit chesaru ... Khaleja, andari bhanduvayya, oosaravelli lanti cinemalu fail chesaru ... Wooden expressions iche actor lu kuda BoxOffice daggara hulchal chepistu ... Nijaniki abaadaniki theda teliyani vallu ani prove chestu unnaru ...

Ilanti vallu chudaledani ... ee cinema pi neelanti vallu bolg lu raaayadam kuda abaddamithe bagundu ... FYI, RestOfIndia, OS motham adariki nachindi. Collections kavalante okksari boxofficeindia websitesloki velli collections multiplex collections chudu ardam ayindi migathavallu ela recive chesukuntunnaroo...

Straight narration istu... okka manchi ga acting chesina scens okkati kuda lukunda super duper hit ayina cinemmallo ... chetha logic lu/worst expressions/worst diaologues chala unnayi ... vaati mundu ee cinemalo unna negatives thakkuva ...

Y it failed? Over expectations (Makers did not publisized properly and not prepared the audience for diffrent kind of narration), new type of narration, bad mouth talk (okka scene lo dialogue miss ayina, story ardam kaadu, first roju chusina janalaki mana daggara emi ardam ayiddi , dantho fans kuda chethaga undi ani cehpparu adi main draw back) and manavallu inka alavatu paadali ilanti cinemalaki. Appativaraku ilanti movies pothune untayi....

Nani Yalamanchali said...

Nazar lives in Belfast,Northern Ireland,Nazar ni Belfast lo ne champutadu...Mahesh parents stay in Whitehead,Northern Ireland.

Wikipedia lo Whitehead population and School details.

Whitehead is classified as n intermediate settlement by the NI Statistics and Research Agency (NISRA) (i.e. with population between 2,250 and 4,500 people). On Census day (29 April 2001) there were 3,702 people living in Whitehead. Of these:
20.3% were aged under 16 years and 24.1% were aged 60 and over
15.4% were from a Catholic background and 76.8% were from a Protestant background
2.7% of people aged 16–74 were unemployed.

One primary school exists within the town - Whitehead Primary School. Another school, Lourdes Primary School, operated until June 2011.

Gautham parents iddaru working anukovacchu kada;so kid ni picking possible kadu anukovacchu kada(OOHINCHUKONDI)..okate primary school whitehead lo undi kabatti kid ni school ki pampadam mandatory,intlo kusupetti chadvinchalemu kada...aa illu kuda evaru occupy cheyyaleda 20 years nundi ani nuvvu adigina akkada andaru employed,okka 3 percent tappa..so land grabbing lantivi undavu anukondi..

Anonymous said...

Article seems to be good and you already mentioned in the end that you wrote this one with your limited knowledge. Yes, some logic were missed. But that does not mean its a boring film. Even if you take any sensational movie even Hollywood there are many loop holes.
Thriller movies are all with slow narration. First champinappudu, valla muggguru accidental gane chanipotharu. Intervel lo chala sarlu champanu ninnu ante, anni sarlu manaki chupinchalsina avasaram ledu. Golden rice concept valla parents ki sambandhinchi na viashayalu telistene telustundi. Idi thrilling factor, so alana unchali.
Moreover thriller movies lo ilanti vi last varaku teliyavu.
Yes I do agree with you, there is a confusion regarding some dialogues like neeku parents leru? naaku parents unnaru?

Ika idi janalu recive enduku chesukoledante,
Nuvu cheppinattu class andarki ardam avalante ... idi kastam? Edo marumula B.Tech college lo class ki IIT professor na pampithe ... vallu professor cheppedi ardam ardam chesukovadaniki kaneesam chala class lu waste avuthayi ... but ade class lo unde top 3 or 4 members ki ardam ayyiddi.

But e example tho nenu 1 Nenokkadine top notch film anadam ledu ... ala ani mana audience vedhavulu andam ledu ... Marumula collelo students ... valla professor cheppe vidhananiki alavatu paddru... valla thappemi ledu ... ala ani iit professor vallaki chepetappudu ... aa professor vallaki ardam ayettu cheppaledu ani vadahava analemu ...
aa students ayanni ardam chesukone range ki vachentha varaku class lu wwste avuthune untayi. Ayana cheppeve vallaki enduku ardam kavadam ledo vallaki telusu kaani ... andulo konthamandi meela ... ayaniki cheppadam raadu ani ila blogs raastu untaru ani naa feeelig. class lo ardam ayina memu ... ee vedhavulu eppudu ardam chesukuntaru ani memu ila nee comments raastuntam ...

Manavallu (telugu audience) ela alavatu paddaro telusu.... anni moddu cinemalu ... Simha, Businessman, Racha, nayak ilanti movies ni hit chesaru ... Khaleja, andari bhanduvayya, oosaravelli lanti cinemalu fail chesaru ... Wooden expressions iche actor lu kuda BoxOffice daggara hulchal chepistu ... Nijaniki abaadaniki theda teliyani vallu ani prove chestu unnaru ...

Ilanti vallu chudaledani ... ee cinema pi neelanti vallu bolg lu raaayadam kuda abaddamithe bagundu ... FYI, RestOfIndia, OS motham adariki nachindi. Collections kavalante okksari boxofficeindia websitesloki velli collections multiplex collections chudu ardam ayindi migathavallu ela recive chesukuntunnaroo...

Straight narration istu... okka manchi ga acting chesina scens okkati kuda lukunda super duper hit ayina cinemmallo ... chetha logic lu/worst expressions/worst diaologues chala unnayi ... vaati mundu ee cinemalo unna negatives thakkuva ...

Y it failed? Over expectations (Makers did not publisized properly and not prepared the audience for diffrent kind of narration), new type of narration, bad mouth talk (okka scene lo dialogue miss ayina, story ardam kaadu, first roju chusina janalaki mana daggara emi ardam ayiddi , dantho fans kuda chethaga undi ani cehpparu adi main draw back) and manavallu inka alavatu paadali ilanti cinemalaki. Appativaraku ilanti movies pothune untayi....

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views