రభస - కథ కథనం - ఒక విశ్లేషణ




రభస - కథ కథనం - ఒక విశ్లేషణ 


జూనియర్ ఎన్ టి అర్ సినిమా వస్తుంది అంటే ఒక నెల ముందు నుంచి వినిపించేది "ఈ సారి అయినా కొడతాడా" సినిమా రిలీజ్ అయిన రోజు "ఈ సారి కొట్టేస్తాడు," ఒక రెండు రోజులు అయ్యాక "బెటర్ లక్ నెక్స్ట్ టైం" ఈ మద్య కాలం లో తన సినిమాలకి జరుగుతున్నది ఇదే. మిగతా హీరోస్ అందరు దాటుకొని ముందుకు వెళ్ళిపోవటం వలనో, కెరీర్ బెగినింగ్ లో నే పెద్ద హిట్స్ పడిపోవటం వలనో, అటు ఫాన్స్ నుంచి ఇటు హీరో వరకు అందరికి ఒకటే ప్రెషర్ "50 కోట్లు ఎప్పుడు". ఈ మాట గురుంచి మనం చివరిగా చెప్పుకుందాం, ముందుగా ఈ మద్యనే వచ్చిన "రభస" అనే "రొటీన్ నస" చివరికి "రసాభాస" ఎలా అయ్యిందో చూద్దాం.

సినిమా చూసినా చూడకపోయినా ఈ ఆర్టికల్ చదవటం వలన మీ అనుభూతి అయితే దెబ్బ తినదు అనే అనుకుంటున్నా, అయినా సరే, సినిమా చూసిన తర్వాత చదవమని ప్రార్ధన

కథ: అనగనగా రెండు కుటుంబాలు, అలాగే ఇంకో రెండు కుటుంబాలు, రెండు ఎవరికీ వాళ్ళు కలిసి ఉండేవారే  అయినా వేరే వేరే కారణాల వలన విడిపోతారు. మొదటి కుటుంబం లో హీరో రెండో కుటుంబం లో హీరోయిన్ ని చేసుకోవాలి అని అమ్మ కోరిక, కానీ రెండో కుటుంబం కి పెళ్లి చేసే ఉద్దేశం లేక పొగా హీరో ని చంపేద్దాం అని తిరుగుతూ ఉంటారు, హీరోయిన్ కి మూడో కుటుంబం లో ఉండే ఫ్రెండ్ పెళ్లి నాలుగో కుటుంబం లో ఉండే అబ్బాయి తో జరుగుతుంటే తప్పించి వాళ్ళ ఆపద నుంచి మొదటి కుటుంబం లో హీరో కాపాడతాడు, తన తమ్ముడి పెళ్లి చెడగొట్టి, తనని కోమా లోకి పోయేలా కొట్టాడు అని నాలుగో కుటుంబం మొత్తం హీరో ని చంపటానికి తిరుగుతూ ఉంటారు, ఇంతలో తన వలన నాలుగో కుటుంబం లో ఉండే అమ్మాయి పెళ్లి చెడిపోయింది అని తెలుసుకొని, మూడు మరియు నాలుగు కుటుంబాలని కలపటమే పని గా పెట్టుకొని, అమ్మ కోరిక కంటే ఇద్దరు అమ్మలా ఆనందమే ముఖ్యం అనుకొని, అమ్మకి ఇచిన మాటనే పక్కనే పెట్టి రిస్క్ తీసుకొని రభస చేసి ఫైనల్ గా అమ్మ మాటని కూడా నిలబెడతాడు. హ్యాపీ ఎండింగ్. నేను ఇంత సింపుల్ గా చెప్పెయ్యటం వలన మీకు సినిమా లో స్టొరీ ని అర్ధం చేసుకోవాల్సిన శ్రమ ఉండదు. అసలేం జరుగుతుంది అని ఆలోచించే అవసరం ఉండదు, హ్యాపీ గా స్కీన్ పై జరుగుతున్నది ఎంజాయ్ చేసి వచ్చేయ్యోచు కదా? ఇక్కడ రాసుకోటానికే ఈ కథ ఇంత ఇంటరెస్టింగ్ గా ఉంటె ఇంకా సినిమా లో ఎలా ఉంది ఉంటుంది? కథనం సెక్షన్ కి పోదాం.... 

కథనం: ఈ సినిమా లో చాలా వరకు ప్రేక్షకుడి పాయింట్ అఫ్ వ్యూ లో కథనం నడిపించటం జరిగింది, మెయిన్ క్యారెక్టర్ పాయింట్ అఫ్ వ్యూ నరేషన్ మనం అత్తారింటికి దారేది లో చూసాం కదా, అలాగే ఇదొక రకం అన్నమాట, కానీ అక్కడ లాగే ఇక్కడ కూడా కొన్ని చిక్కులు ఇబ్బందులు ఉంటాయి, ఎలా అంటే? ప్రేక్షకుడి పాయింట్ అఫ్ వ్యూ నరేషన్ లో జరుగుతున్నా విషయాలు జరగబోయే విషయాలు ప్రేక్షకుడి కి ముందు గానే తెలిసిపోతుంది కానీ సినిమా లో పాత్రలకి ఆ తర్వాత తెలుస్తుంది. ఉదాహరణ కి, ప్రనిత హీరో మరదలు కాదు అని మనకి తెలుసు, కానీ హీరో కి తెలియకుండా లవ్ థ్రెడ్ మొత్తం నడుస్తుంది బోనస్ గా రాకాసి పాట కూడా, అసలు ఆ హీరోయిన్ తో కట్ అయిపోద్ది అని ముందుగానే తెలిసినా "రాకాసి" లాంటి పాట ఆ హీరోయిన్ పై ఎందుకు పెట్టినట్టు?. ఇలా ప్రేక్షకుడి కి ముందు గానే తెలిసిపోవటం వలన, కథ గురుంచి లేక జరగబోయే సీన్స్ గురుంచి ముందుగానే ఒక అవగాహనా కి వచేస్తారు. వాళ్ళు అనుకుంటునట్టు గా జరిగితే "తెలిసిందే గా" అనుకుంటారు, అలా కాకుండా వేరే లా జరిగితే నచ్చక పోతే "తొక్క లే" అని, నచ్చితే "సూపర్" అని అంటారు. ఒక్కో సరి వాళ్ళు అనుకునట్టు గా జరగక పోతే హర్ట్ అవుతారు కూడా.. కానీ ఒక్కోక్కరిది ఒక్కో రకమైన అంచనా కాబట్టి అందరిని సంతృప్తి పరచటం అంతేది కత్తి మీద సాము అన్నమాట. జనరల్ గా కామెడీ వరకు ఈ నరేషన్ అద్బుతాలు చేస్తుంది "ఉదాహరణ కి : రెడీ సినిమా లో బ్రాహ్మి పాత్ర అంత బాగా వర్కౌట్ అయ్యింది" కానీ సినిమా లో మేజర్ పార్ట్శ్ కి కూడా ఈ పాయింట్ అఫ్ వ్యూ నరేషన్ అంటే... రెస్పాన్స్ ఊహించినట్టు ఉండకపోవచ్చు. ట్విస్ట్ లకి అలవాటు పడ్డ మన సగటు ప్రేక్షకులకి ఈ నరేషన్ చప్పగా ఉంటుంది.  

ఆక్ట్ 1 : నెల్లూరు లో మొదలు పెట్టి, కథ లో మెయిన్ పార్ట్ ని జోగి బ్రదర్స్ ద్వారా చెప్పించి, హైడ్ లో కట్ చేసి, హీరో ఎంట్రన్స్ ఇచ్చి, దరిద్రమైన ఫైట్ పెట్టి, తర్వాత ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి, అదేదో ఊరిలో (హీరో ఊరి పేరు ఎక్కడైనా చెప్పాడా? నేనే మిస్ అయ్యానా) సాంగ్ ఏసుకొని, ఎలా అయినా చిట్టి ని పెళ్లి చేసుకోవటం, మావయ్య గర్వం దించటమే హీరో ఆశయం అని ఎస్టాబ్లిష్ చేస్తూ ఫస్ట్ ఆక్ట్ ముగుస్తుంది, కానీ చాలా గందరగోళం గా, సీట్ లో కూర్చున్న ప్రేక్షకుడు సెటిల్ అయ్యే లోపు అంతా అయిపోతుంది. ఫస్ట్ డే ఫాన్స్ షో లో అంటే అంత ఆలోచించరు కానీ మాములుగా అయితే బ్రీతింగ్ టైం లేనట్టే. గంగి రెడ్డి , పెద్ది రెడ్డి, వాళ్ళ కొడుకులు, ధనుంజయ్ అతని తమ్ముళ్ళు, కామెడీ రఘుబాబు గ్యాంగ్ ఇంత మంది ఎవరు ఏంటో మైండ్ లో రిజిస్టర్ కూడా అవ్వరు. 

ఫైట్ ల విషయం లో ఇంకా ఇంత దారుణం గా ఎలా తీయగాలుగుతున్నారో అర్ధం కావటం లేదు, షర్టు నలగకుండా సింగల్ హ్యాండ్ తో గుంపులు గుంపుల గా గాల్లోకి తన్నేసే ఫైట్ లు ఎవరి సినిమాలో ఉన్నా లేక పోయిన ఎన్ టి అర్ సినిమాలో మాత్రం కామన్ అయిపోతున్నాయి. సినిమా లో కామెడీ ఎలా ఉన్నా పోరాట సన్నివేశాల్లో కామెడీ అద్బుతం గా పండుతుంది.  

ఆక్ట్ 2: తన ఆశయం కోసం ముందుకి వెళ్తూ సరదా సరదా గా సాగిపోవాల్సిన సమయం. ఆల్రెడీ సమంతా నే మరదలు అని మనకి తెలిసిపోతుంది, హీరో మాత్రం ప్రణిత (ఉన్నంత లో బాగానే చేసింది) అని పొరబడి లవ్ లో కి దించాలి అనుకుంటాడు, ఇక్కడ యాంటి లవర్స్ స్క్వాడ్ పేరుతో నస. మామ ని ఆటపట్టించి స్కెచ్ వేస్తే సరే కానీ, పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని ప్రేమలో దించే విషయం లో సీరియస్ నెస్ అవసరం లేదా? రేపు మన నాటకాలు తెలిస్తే మనల్ని ఛీ కొడుతుంది అనే భయం లేదా? మామ ఎదురు తిరిగితే తన పక్కన నిలబడాల్సిన మరదలు ని ప్రేమించే విధానం అదేనా? అదొక లవ్ థ్రెడ్ లా కాకుండా, మామని ఏడిపించటానికి తన కూతురిని పడేసి వాడుకొని వదిలేసే లా తీర్చిదిద్దారు. ముందుగానే తెలిసిపోవటం వలన ఎంత త్వరగా సమంతా మీదకి షిఫ్ట్ అవుతుందా ఫోకస్ అనే ఎదురుచూడటం ప్రేక్షకుడి వంతు. 

మరి హీరోయిన్ సంగతి ఏంటి అంటే, "ఫ్రెండ్ ని కాపాడిన అతన్ని ప్రేమించే మంచి హృదయం ఉన్నా హీరోయిన్, వాడు ఎవడో, ఎలా ఉంటాడో, అసలు వాడికి వేరే ప్రేమ ఉందొ, లేదో, వాడికి అసలు పెళ్లి అయిపోయిందో లేదో ఏమి తెలియకుండా, నిజాయితీ గా ప్రేమించే పాత్ర లో సమంతా కూడా బాగా చేసింది, కాక పోతే కొత్తదనం అంటూ ఏమి ట్రై చెయ్యకుండా తనకి వచ్చిందే చేసుకొని పోయింది. కోపం/చిరాకు/ టీజింగ్ కి ఒక ఎక్స్ప్రెషన్, ప్రేమ/ఏడుపు/జాలి కి ఒక ఎక్స్ప్రెషన్ తో సినిమా మొత్తం లాగేసింది. ఆమె వెనక ఉండే తండ్రి అనుచరులు అదేదో సినిమా టైపు లో హీరో ఎవరు అని తెలిసినా కూడా యజమాని కి చెప్పకుండా కామెడీ కి ట్రై చేసారు, అన్నిటికి మించి హీరోయిన్ తండ్రి పాత్ర లో షిండే ఎప్పటి లా బఫూన్ గా తేలిపోయారు. హీరో ఏకం గా ఇంటికి వచ్చి, డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చి, ఛాలెంజ్ చేసి పాట ఎసుకుంటాడు (పాట ఎసుకుంటాడు కానీ డాన్సు వెయ్యడు.. ఒకప్పుడు బాగానే వేసేవాడు, అప్పుడు మరీ ఎక్కువ వేసేయ్యటం వలన, ఇప్పుడు వేసిన వెయ్యక పోయిన అప్పటి లా అయితే సంతృప్తి పరచటం లేదు) ఇదంతా జరుగుతుంటే, అజయ్ బ్యాచ్ ఎవరి కోసమో వెతుకుంది, అది ఎవరు అనేది మనకి తెలుసు కానీ వాళ్ళకి తెలియదు. అప్పుడే తెలుస్తుంది వాడు వీడు ఒకడే అని, బీబత్సం అనుకోవాల్సిన ఈ బ్యాంగ్ తో ఇంటర్వెల్. అప్పటి వరకు రాసుకున్న సీన్స్ లో పట్టు లేక, డైలాగ్స్ లో దమ్ము లేక, ఫస్ట్ హాఫ్ "హమ్మయ్య అయ్యిపోయింది" అనిపించుకుంటుంది. ఇప్పటి వరకు కనీసం హీరో ప్రయాణం కి అడ్డు ఆపు లేకుండా పోవటం ఒక ఎత్తు, ఎంత స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటె హీరో అంత ఎలివేట్ అవుతాడు అనే బేసిక్ రూల్ ని మర్చిపోయిన కమర్షియల్ బొమ్మ 

ఎక్కడ ఆగిందో అక్కడే మొదలయ్యే సెకండ్ హాఫ్ లో, తమ తమ్ముడి పెళ్లి ఆగిపోయిన విధానం ని ఆ సీన్ చూడని హీరోయిన్ ద్వారా చెప్పించి, పారిపోయిన పెళ్లి కూతురు లవర్ చేతిలో ఉండగా, కచ్చితం గా వాళ్ళే వెనక్కి వస్తారు అని ఆలోచించకుండా చేజ్ చేసి దెబ్బలు తిండి కోమా లో కి వెళ్ళిపోయిన తమ్ముడి కోసం రివెంజ్ దిశ గా నడిపిస్తూ ఇంకా ఈ సినిమా ని ఎవ్వరు సేవ్ చెయ్యలేరు అనుకునే టైం కి బ్రాహ్మి ని రంగం లో కి దింపేశారు. ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం స్క్రీన్ప్లే లో వేసుకున్న లాక్స్. వెతుకుతున్న వాళ్ళ ఇంటిలోకే వచ్చి పడటం, వాళ్ళు ఇంట్లోకి రాలేక పోవటం, వేరే క్యారెక్టర్ ని ప్రవేశ పెట్టి ఇంట్లోకి రావటం, దాని వలన హీరో ని ఏమి చెయ్యలేక పోవటం, హీరో ప్లేస్ లో నందు ని తీసుకు రావటం ఇవన్ని బాగా రాసుకున్న లాక్స్. ముప్పావు సినిమా అయిపోతుంది అనగా హీరో ఆశయం మారిపోవటం అనేది, త్యాగం పేరుతో సెంటిమెంట్ చేసుకున్నది తల తోక, దశ దిశ లేని విధానం. కాన్ఫ్లిక్ట్ వర్కౌట్ అవ్వకుండా చేసుకున్న స్వయంకృతాపరాధం. బ్రహ్మి గారు  అంతో ఇంతో నవ్వించటం వలన ఆ టైం లో ఆలోచించక పోవచ్చు కానీ, తర్వాత ఆలోచిస్తే తెలిసే విషయం ఏంటి అంటే బ్రహ్మి పాత్ర ఎంత సేపు నవ్వించటానికే తప్ప కథని ముందుకు నడిపించటానికి ఉపయోగపడదు.లాజిక్ విష్యం లో ఊహకి అయినా అందని ఈ కథనం లో అరిగిపోయిన అల్లరి అల్లుడు, కింగ్ కామెడీ ని వాడెసుకొటానికి కూడా మొహమాట పడలేదు. హీరో మంచి తనం కి ఇంట్లో వాళ్ళు అందరు ఫాన్స్ అయిపోగా, హీరోయిన్ కూడా పడిపోగా, రెండు మూడు కెమెరా షాట్స్ తో తీసిన ఒక ఫోన్ వీడియో తో హీరో కి లాక్ ఇస్తారు

ఈ కథనం మొత్తం సింపుల్ గా గూగుల్ మ్యాప్ లో ఎసుకుంటే... (వైజాగ్ వాసులు కి అర్ధం అవుతుంది, మిగతా వాళ్ళు క్షమించగలరు)




ఎన్ ఏ డి జంక్షన్ లో మొదలు అయ్యి, గాజువాక మీదుగా సింధియా లో ఇంటర్వెల్ ఎయించుకొని, కాన్వెంట్ జంక్షన్ లో లెఫ్ట్ తీసుకొని ఎన్ ఏ డి వచ్చి గోపాలపట్నం వెళ్లినట్టు  ఉంటుంది. (ఇష్టం వచ్చిన రూట్ లో వెళ్ళిపోతూ)

ఆక్ట్ 3: ఎప్పుడు మొదలు అయ్యిందో తెలుసుకునే లోపు, సెంటిమెంటల్ డైలాగ్స్ తో, (మర్చిపోయా ఇంతకు ముందు ఎసుకున్న సాంగ్ లో ఎప్పుడో ఫస్ట్ సాంగ్ దగ్గర కనపడిన పేరెంట్స్ కూడా సీన్ లో కి వచేస్తారు,) డైరెక్ట్ గా క్లైమాక్స్ ఓపెన్ చేస్తారు. ఇంట్లో కి అంత మంది ఎందుకు ఎలా వచ్చారు అని మనకే కాదు సినిమా లో పెద్ది రెడ్డి కి కూడా తెలుసుకోవాలి అనే తపన ఉండదు, ఎందుకు ఏమిటి ఎలా అని అడగకుండా చరిత్ర లో నిలిచిపోవటం గురుంచి చెప్పిన డైలాగ్ తో సినిమా అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ నుంచి గమనిస్తే రెండు హల్ఫ్స్ కి ఇద్దరు వేరే వేరే రైటర్స్ (ఘోస్ట్) పని చేశారేమో అనిపించవచ్చు, లేక పోతే అలాంటి ఫస్ట్ హాఫ్ కి ఇలాంటి సెంకండ్ హాఫ్ ఎలా సాధ్యం అవుతుంది. 

మొత్తం మీద, ఆ కథ కి ఇలాంటి కథనం తో రభస చెయ్యకుండా నస తో విసిగించినా అంతో ఇంతో నవ్వించే కామెడీ ఒక సారి చూడొచ్చు అనే భరోసా ని ఇస్తుంది. కామెడీ సీన్స్ లో కదం తొక్కిన ఎన్ టి అర్ నటన, మొత్తం సినిమా ని భుజాలపై మోసిన తీరు అభిమానుల్ని అలరిస్తుంది అనటం లో అతిశయోక్తి లేదు కానీ కథల ఎంపిక లో ఇంకా గాడిన పడినట్టు లేదు బండి.. త్వరగా ట్రాక్ ఎక్కేస్తే బెటర్, ఇంత కంటే దిగాల్సిన లోతు లేదు అని నా ఫీలింగ్. 

చివరిగా : ఫస్ట్ లో వదిలేసిన టాపిక్ దగ్గరికి వస్తే - అయినా మనం డౌన్ లో ఉన్నప్పుడు తాడో పేడో తేల్చుకొని టాప్ పోసిషన్ పై కన్నేసి దమ్ము ఉన్న సినిమాలు ఎంచుకోవాలి కానీ, ఇలా మినిమం గ్యారంటీ అని దిగితే "మూస లో పడిపోయి, సినిమా సినిమా కి మన మార్కెట్ పడిపోవటం తప్ప సాదించేది ఎం ఉండదు". ముందు ఆ 50 కోట్లు ట్యాగ్ పక్కన పెట్టి 100 కోట్లు టార్గెట్ గా పెట్టుకుంటే ఎంతో కొంత పని అయ్యే అవకాశం లేకపోలేదు. Aim for the 11th Mile... 

నాకు ఉన్న లిమిటెడ్ నాలెజ్ లో నేను రాసింది ఎంత వరకు కరెక్ట్ అనేది నేను అయితే చెప్పలేను కానీ, ఈ ఆర్టికల్ చదివే అనుభవజ్ఞులు వారి అభిప్రాయాలు సూచనలు సలహాలు షేర్ చేసుకుంటే రుణ పడి ఉంటాను.

ఇట్లు 
మీ 
హరి కృష్ణ రాజు 




6 comments:

Anonymous said...

superb article hari garu

Anonymous said...

Excellent Sir.... Regular ga raayandi...btw sincere ga oka request.... meeru screenplay rayatam try cheyochu kada....

Anonymous said...

Bagundi review...prati cinema ki raayandi

aditya said...

super baa :)

Asalu interval twist adhi anukunnapudu ajay and gang ni akkade introduce cheyali gani first e choopedite em twist untundi :D

basic knowledge lenattu isthtamocchinattu teesadu, illness valla director lenapudu hero and co ishtamocchinattu kelikesaru emo

shiyaji shinde ni negative character kakunda, just ego or misunderstanding valla vidipoinattu choopinchi, first half lo praneeta lekunda sam ni love lo padeyadam plus mama ni convince cheyadam all happy anukune dashalo ee ajay gang entry pedite bagundedhi

i mean samanta lovers ki help chese episode lo ntr ni invovle cheyakunda,sam ye help chesinattu aa pelli koduku vallu pelli aagipoyela chesinanduku sam ni kidnap cheyadam interval ga pettina oka artham edisedhi :D

appudu hero aa intlo ki enter avadaniki undadaniki oka strong base undedhi

brahmi ni mari last minute lo irikincharu ani telisipotundi clear ga :D

Anonymous said...

Well said sir. Nenu NTR abhimanine. AA fighhts endhi baboiiii....

burra dobbithe ilanti cinema le theestharu.....

3 'A' rated movies out of last 4...

Baadsha tharuvatha evadanna image penchukovalani choosthada... leda dobbinchukovalani choosthada...

eediki baagupade lakshnalu levu...

NTR Fan said...

Anna as usual mee style lo kummesaru mammlani ekkada hurt cheyyakunda

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views