సోగ్గాడే చిన్నినాయనా - కథ కథనం విశ్లేషణ





సోగ్గాడే చిన్నినాయనా, ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడే, సోగ్గాడు -  మనకి తెలిసిన పాట
ఒక్క సెంటరైన వదలకుండా (ఓవర్ ఫ్లొస్ తో) కొడుతున్నాడే సోగ్గాడు - ఇది మనం చూస్తున్న ఆట

సంక్రాంతి బరి లో, బోలెడు చిత్రాల మద్య, ధియేటర్ లు తక్కువ దొరికినా, వస్తున్నాం - కొడుతున్నాం అనే నమ్మకం తో వచ్చేసాడు, చెప్పినట్టే ఎవరు ఊహించని రీతిలో కలెక్షన్స్ కొల్లగొట్టాడు. ఈ మద్య కాలం లో, పెద్ద హీరో సినిమాలలో, రూరల్ బేస్డ్ కామెడీ బొమ్మ లేదు, ఇప్పుడు ఉన్న ట్రెండ్ కి తీసినా చూస్తారు అనే నమ్మకం లేదు, అందులోనూ ఫాంటసీ ఎలిమెంట్స్ తో, కొత్త డైరెక్టర్ తో, సొంత బ్యానర్ లో అంటే - సాహసమే అని చెప్పుకోవాలి. కానీ కథని నమ్మాడో, కామెడీ ని నమ్ముకున్నాడో, కొత్త డైరెక్టర్ అయినా తీయగలడు అనుకున్నాడో తెలియదు కానీ తన కాన్ఫిడెన్సు ని నమ్మి ఈ సినిమా తీసి ఉండాలి. ఏది ఏమైనా ఫాన్స్ మెచ్చేలా, ఫ్యామిలీస్ ని ధియేటర్ కి రప్పించెలా, కొన్న వాళ్ళు అందరికి లాభాలు తెచ్చేలా మన ముందుకి వచ్చిన సోగ్గాడి సక్సెస్ ని ఎలాగు ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి దానిని కొంచెం పక్కన పెట్టి, సినిమా పరంగా , కథ కథనం ని విశ్లేషించుకునే ప్రయత్నం మొదలు పెడదాం. 

ఎప్పుడు చెప్పేదే అయినా, "సినిమా చూడని వాళ్ళు, చూడాలి అనుకునే వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిది" అని నా అభిప్రాయం. ఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు

కథ : ఈ సినిమా కథ వరకు నాకు ఒక కన్ఫ్యూషన్ ఉంది, తప్పో ఒప్పో తెలియదు కానీ, ఈ సినిమా కథ అయితే మాత్రం - అనగనగా శివాపురం అనే ఊరు, కజిన్ బ్రదర్స్, శివాలయం లో ఆభరణాలు, కొట్టేద్దాం అని ఆశతో తమ్ముడిని చంపేసినా, తమ్ముడి వంశం మాత్రమె ఓపెన్ చెయ్యగల లాక్ ని ఓపెన్ చేద్దాం అని ట్రై చేసి దానిని కాపాడుతున్న పాము చేతిలో చచ్చిపోయిన అన్నయ్య. మూడు పుష్కరాల తర్వాత మళ్ళి ఓపెన్ చేసే అవకాశం వారసులకి వస్తుంది, ఈ సారి ఓపెన్ చేసే ముందు కాకుండా, ఓపెన్ చేసిన తర్వాత లేపేద్దాం అని ప్లాన్, అప్పటికే వేరే పని మీద వచ్చిన తండ్రి ఆత్మఅమాయకుడు ఐన చిన్న వాడిని, తన ఫ్యామిలీ ని కాపాడటం తో సుఖాంతం. 

ఉపకథ : సబ్ ప్లాట్ : ప్రతి సినిమా లో మెయిన్ కథ తో పాటు (ఉదాహరణ కి హీరో రివెంజ్) ఉపకథ ఉంటుంది (ప్రేమ, పెళ్లి లాంటివి). ఈ సినిమా వరకు అయితే, డాక్టర్ గా బిజీ గా ఉంటూ, అదే ద్యాస లో గడుపుతూ, భార్య ని నిర్లక్ష్యం చేస్తున్న రాము తో విసిగిపోయి విడాకులు తీసుకుందాం అని శివాపురం వస్తుంది సీత. వీళ్ళని ఇలా చూసి బాధ పడుతూ సత్య చనిపోయిన బంగార్రాజు ని పిలుస్తుంది. యమ ధర్మ రాజు పర్మిషన్ తో కిందకి వచ్చిన బంగార్రాజు ఆత్మ తన భార్య కోరిక పై కొడుకు ని కోడలు ని కలుపుతుంది. 

జనరల్ గా కథ గురుంచి చెప్పుకుంటాం తప్ప ఉపకథ గురుంచి కథనం లో నే మాట్లాడుకుంటాం. నేను చూసినంత వరకు చాలా మంది రాము కథ గానే మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ సినిమా వరకు ఇది రాము సీత కలవటం అనే కథ కంటే బంగార్రాజు కథ గానే చెప్పుకోవాలి అని నా ఉద్దేశం. అది ఆత్మ అయినా, ఒరిజినల్ అయినా. (యముడికి మొగుడు తీసుకున్నా, అది కాళి అనేవాడే కథే తప్ప, చచిపోయి ఆత్మ అయ్యి ప్రవేశించిన బాలు కథ కాదు అని నా అభిప్రాయం).  

కథనం: ప్రారంభం: మూడు పుష్కరాల క్రితం ఒక దొంగతనం కోసం ప్రయత్నించటం, పాము కాటు కి చనిపోవటం తో బేసిక్ విషయం తెలియక పోయినా ఏదో ఉంది అని కుతూహలం కలిగించారు. అక్కడ నుంచి ప్రెసెంట్ కి వచ్చేసి రాము - సీత ప్రాబ్లం గురుంచి క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసారు. కానీ ఇక్కడ ముందుగా ఎస్టాబ్లిష్ చెయ్యల్సింది మెయిన్ కథ లో ని ప్రాబ్లం గురుంచి. ఇలా చెయ్యటం వలన మెయిన్ కథ పక్క కి వెళ్ళిపోయి ఇదే మెయిన్ కథ కాబోలు అనుకునేలా మొదలు అయ్యింది. అక్కడ నుంచి ఆ ప్రాబ్లం తాలుకు మూలం వరకు అప్పుడే చెప్పేసారు. చిన్నపాటి నుంచి ఎంత జాగ్రత గా పెంచాల్సి వచ్చింది అని, చదువు తప్ప ఇంకో ద్యాస లేదు అని, ముఖ్యం గా వాళ్ళ నాన్న లా కాకూడదు అని. ప్రాబ్లం ఇంకా బాగా రిజిస్టర్ అయ్యేలా చేసారు. ఇంతలా రిజిస్టర్ చేసిన ప్రాబ్లం కోసమే బంగార్రాజు ఆత్మ వచ్చినట్టు మనకి చూపించారు. ఇక్కడ స్క్రీన్ప్లే లో మేజిక్ కనిపిస్తుంది మనకి, ఆ సందర్భం లో  ఇక్కడ టైం లాక్ వెయ్యాల్సిన అవసరం ఏ లేదు అని మనం అనుకుంటాం కానీ యముడు మన బంగార్రాజు కి ఒక డెడ్ లైన్ ఇస్తాడు. ఫలానా టైం కి నువ్వు ఏ పోసిషన్ లో ఉన్న వచ్చి తీరాల్సిందే అంటాడు. అలాగే మనకి మద్య మద్య లో మెయిన్ కాన్సెప్ట్ గురుంచి హింట్స్ ఇస్తూనే ఉన్నారు. "పిలవటానికి ఆవిడ ఎవరు, పంపటానికి నేను ఎవర్ని, ఇదంతా ఒక దైవ నిర్ణయం" అని యముడి తో చెప్పించారు. అంటే బంగార్రాజు భూమి మీదకి వస్తుంది ఒక్క రాము ప్రాబ్లం గురుంచి మాత్రమె కాదు ఇంకేదో ఉంది అని. పోసాని ఫస్ట్ టైం నాజర్ ని డబ్బులు అడుక్కునేవడిలా కాకుండా డిమాండ్ చేసినట్టు అడుగుతాడు, తాగుబోతు - పిచ్చోడు అని కవర్ చేసినా అది కూడా ఒక హింట్ ఏ. ఇవన్ని రిజిస్టర్ అవ్వక పోగా మన ద్యాస అంతా రాము ప్రాబ్లం, బంగార్రాజు రసికత్వం గురుంచి తెలుసుకోవాలనే కుతూహలం మీదనే ఉంటుంది. బంగార్రాజు ఆత్మ రాక కామెడీ వరకు మనకి ఓకే అనిపించినా దాని పర్పస్ మాత్రం చాల లేట్ గా తెలుస్తుంది.

ఒక డాక్టర్ కి ఎంత వర్క్ బిజీ ఉన్నా, పెళ్లి అయ్యాక, 36 ఏళ్ళు వచ్చాక (మూడు పుష్కరాలు మరి), మూడు ఇయర్స్ లో మూడు సార్లు మాత్రమే డిక్క డిక్క డం డం అనేది చాలా సిల్లీ ప్రాబ్లం - బేసిక్ గా బాడీ లో ప్రాబ్లం లో ఉంటె తప్ప. అలాంటి ప్రాబ్లం సాల్వ్ చెయ్యటానికి తండ్రి ఆత్మ కొడుకు లో దూరటం అనేది వినటానికి చాలా ఎబ్బెట్టు గా ఉన్నా సినిమాలో ఎక్కడ హద్దు దాటనివ్వలేదు. నిద్ర పోతున్నప్పుడు ఆత్మ దూరిన తెలియక పోవటం ఓకే కానీ మాములుగా ఉన్నప్పుడు కూడా దూరిపోయి ఏవేవో చేస్తుంది స్వతహాగా డాక్టర్ అయినా రాముకి తేడా తెలియక పోవటం కొంచెం ఆశ్చర్యం.

మధ్యమం: బంగార్రాజు రమ్య కృష్ణ అన్యోన్యత చూపిస్తూనే, రాము లో మార్పు తీసుకు రావటానికి బంగార్రాజు పడే పాట్లు కామెడీ ని పండిచాయి. బ్రహ్మానందం ట్రాక్ కామెడీ ని అంతగా పండించక పోయినా ఆ పాత్ర కి ఒక పర్పస్ ఉంది అని మనం సెకండ్ హాఫ్ లో తెలుసుకునప్పుడు ఆ పాత్ర ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అర్ధం అవుతుంది. మద్య లో కొంచెం ఊపు ఉన్న సాంగ్స్ తో సరదాగా సాగిపోతు ఫస్ట్ హాఫ్ అలరిస్తుంది.అసలు ఈ మొత్తం ప్రాసెస్ లో బంగార్రాజు ఏదో ఆక్సిడెంట్ లో పోయాడు అనే మనకి చెప్పించారు. కానీ సినిమా అన్నాక విలన్ ఉండాలి, నాజర్ కాక పోయిన సంపత్ అయినా అయ్యి ఉండాలి, కాబట్టి ఇదేదో తేడా కేక అయ్యి ఉండాలి అని ఆల్రెడీ ఫిక్స్ అయ్యిపోయిన ప్రేక్షకులకి ఇంటర్వెల్ పెద్ద ట్విస్ట్ లా అనిపించక పోవచ్చు. ఇలాంటి చోట్ల ప్రేక్షకుడి ద్రుష్టి కోణం లో నరేషన్ బాగా హెల్ప్ అవుతుంది. సినిమాలో పాత్రలకి విషయం తెలియక పోయినా ప్రేక్షకుడికి తెలియ చేసేస్తే, అది సినిమాలో పాత్ర కి తెలిసినప్పుడు దాని ఇంపాక్ట్ ఇంకా గట్టిగా ఉంటుంది. బంగార్రాజు తో పాటు  మనం కూడా సినిమాలో నిజాలు ఒకే సారి తెలుసుకోవటం వలన వచ్చిన ఉపయోగం ఎం లేదు, ఓసోస్ ఇదేనేటి జరిగింది అనుకోటం తప్ప.  ఉదాహరణ కి : రమ్య కృష్ణ లాస్ట్ లో చేతికి ఉన్న తాడు గురుంచి మనకి తెలుసు, కానీ తను తెలుసుకునే సీన్ కి ధియేటర్ లో రెస్పాన్స్ గుర్తుందా? అదే టైం లో మనం కూడా తెలుసుకొని ఉంటె ఆ రెస్పాన్స్ ఉండేదా?

ఇంటర్వెల్ లో వేసుకున్న లాక్ అయితే హత్య అని తెలుసు కానీ ఎవరు చంపారో తెలియదు. మొదట్లో యముడు ఇచ్చిన డెడ్ లైన్ గురుంచి మర్చిపోయినా, కామెడీ ని ఇంకాస్త నడిపించటానికి కోడలు రూపం లో డెడ్ లైన్ పెట్టుకున్నారు. జెలస్ ఫీల్ అయ్యేలా చేస్తే పని అయిపోతుంది అనే పాత చింతకాయ పాయింట్ తీసుకున్నారు. అప్పటి వరకు బంగార్రాజు ఆంటీస్ కామెడీ చూసిన మనకి, మా బావ ఇలాంటి వాడు అని తెలిసి కుడా బంగార్రాజు గెట్ అప్ లో వచ్చిన రాము కోసం మరదళ్ళు ఎగబడటం, అత్త - మావయ్య ల ముందే వాళ్ళని పిలవటం ఏదో పాట కోసం శ్రుతి మించినట్టు ఉంటుంది. సినిమాకు ముందు ట్రైలర్ లో ఊరించిన కృష్ణ కుమారి ఎపిసోడ్ కూడా తేలిపోయింది. పర్పస్ లేక పోగా, టైం కిల్ చెయ్యటానికి అనుకునట్టు సాగింది. ఇంత మంది పిట్టల్ని మన కళ్ళ ముందే కొడుతున్నా, ఒక్క పిట్టనైన కొట్టలేని సోగ్గాడే అని వాళ్ళు పాడటం, ధియేటర్ లో జనాలు విజిల్ వెయ్యటం చూస్తే ముచ్చటేస్తుంది. అంతకు ముందు వరకు ఇంటికి వచ్చిన ఒకలా మాట్లాడిన బావ వాళ్ళ ఇంటికి వెళ్తే వేరేల మాటాడుతున్నాడు ఏంటి ఎవరు అడగరు? అసలు ఇంత తతంగం పెట్టి బంగార్రాజు సాదించింది ఏంటి? నా వల్ల కావటం లేదు, భర్త తో ఎలా మసులుకోవాలో కోడలకి చెప్పు అంటాడు. ఇంతోటి దానికి అసలు బంగార్రాజు ఆత్మ రావటం దేనికి. మొదట్లోనే రమ్య కృష్ణ ఈ క్లాసు పీకేసి ఉంటె అప్పుడే సెటిల్ అయిపోయేది గా?. 

ముగింపు: కొడుకు కోడలు కలిస్తే సినిమా అయిపోతుంది అని, ఆలయం లో ఉత్సవం అని, నాజర్ ని మళ్ళి పిక్చర్ లో కి తీసుకువచ్చారు. ఇక్కడ క్యాటలిస్ట్ గా బ్రహ్మి ని వాడుకున్నారు. స్క్రీన్ప్లే లో ప్లాంటింగ్ అండ్ పే ఆఫ్ టైపు లో ఆత్మలతో మాట్లాడే కామెడీ ఏంటి మొదట్లో అనుకున్నా, అదే నిజాన్ని రెవీల్ చెయ్యటానికి ఉస్ చేసుకున్న విధానం బావుంది. అసలు విషయం తెలిసింది, ఇంకేముంది మళ్ళి సినిమా అయిపోతుంది అనుకునే టైం కి ఇంకో లాక్ వేసుకున్నారు. చక్రం వేసి భందిన్చేసారు, మిగతా వాళ్ళు అందరికి చేతికి తాడు కట్టేసారు, ఫైట్ కి కావాల్సిన సరంజామా సర్దేసుకున్నారు, అప్పుడప్పుడు హాయ్ చెప్పిన పాము కి ఒక పర్పస్ ఇచ్చారు, గుడిలో ఫైట్, అక్కడే కోడలకి గాయం, తాడు తెగిపోవటం, ఆత్మ ఎంట్రీ, అసలు ఫైట్, ఆపరేషన్ చెయ్యటం తరవాత క్లోసింగ్ షాట్. మాములుగా అయితే అసలు సిసలు కమర్షియల్ ఫార్ములా లో సాగిపోతుంది. కానీ అంత టైం ఇవ్వలేదు మనకి, గాభరా గా, కామెడీ మూడ్ నుంచి సీరియస్ మూడ్ కి షిఫ్ట్ అయ్యేలోపు మొత్తం అంతా మన బుర్రలోకి ఎక్కించేద్దాం అని క్లైమాక్స్ ని లోడ్ చేసేసారు.  

అసలు ప్రారంభం లో మొదలు అయిన కథ, ముగింపు కి వచ్చేసరికి కొత్తగా ఉంటుంది. అదే మొదటి నుంచి దానిని అలాగే ఉంచుతూ, సబ్ ప్లాట్ తో కామెడీ చేసుకుంటూ ఉంటె, కథ కి ఇంకాస్త అందం వచ్చేది. అసలు మూడు పుష్కరాల తర్వాత ఏదో కారణం వలన రాము ఊరికి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేదంటే విలన్ చేసింది ఏముంది? అసలు మొదట్లోనే ఆ ప్లాన్ ఉన్న విలన్, హీరోయిన్ ద్వారా లేక వేరే ఎలా అయినా ప్లాన్ చేయించి, రాము ని ఆ టైం కి ఊరికి రప్పించి, చంపేద్దాం అని ప్లాన్ చేసి అప్పుడు ఆత్మ వచ్చి కాపాడి ఉంటె? ఎందుకంటే ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళి మూడు పుష్కరాలు ఆగాలి, అప్పటికి ఆ వంశం లో సంతానం లేక పోతే? ఆ భయం కాని, బంగారం ఎలా అయిన సాదించాలి అనే తపన కానీ విలన్ లో కనపడవెం? వీటిపై కొంచెం ద్రుష్టి పెట్టి ఉంటె బావుండేది ఏమో అనిపించింది. 

చివరిగా: ఈ పైన మనం చెప్పుకున్నవి ఏవి మనం ధియేటర్ లో కూర్చున్నప్పుడు ఆలోచించం. అలా ఆలోచించే టైం ఇవ్వకుండా ఎంగేజ్ చేసారు. అలా అని బయటికి వచ్చి మనం ఎంజాయ్ చేసిన సీన్ గురుంచి మాట్లాడుకుందాం అంటే డిస్కస్ చేసుకునే అంత గొప్ప సీన్స్ కూడా లేవు అక్కడ. చెప్పొచ్చేది ఏంటంటే, హాల్ లో ఉన్నంత సేపు ఎంగేజ్ చేసే సినిమా, కొంచెం కథనం ఇంట్రెస్ట్ గా చేసి ఉంటె లాస్ట్ 40 నిమిషాల్లో గాభరా, గందరగోళం, సాగాతీసిన ఫీలింగ్స్ ఉండక పోయేవి మూవీ కి కంప్లీట్ నెస్ వచ్చేది. నాగార్జున, సినిమా కి ఎంచుకున్న రూరల్ బ్యాక్ డ్రాప్, గోదావరి యాస లో కామెడీ అలరించగా - ఊహించినట్టుగానే సాగిన సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ కొంత నీరసం కలిగించాయి.  ఫాన్స్ సంగతి పక్కన పెడితే, సగటు ప్రేక్షకుడి కి అయితే అన్ని తానై భుజాల మీద మోసిన బంగార్రాజు కోసం అయినా ఫ్యామిలీ తో పాటు వెళ్లి చూసేయ్యల్సిన సినిమా........... ఒక సారికి ఓకే. 



2 comments:

aditya said...

Yes movie choostunantha sepu ala vellipotundi pedda story kanee highlight scenes kaanee levu

lead pair madya aa final moments superb ga vacchai ,alantivi inka emotional scenes undacchu aa Villains track mottham inka baga workout cheyacchu,strong content undedhi

main ga village based movies vacchi chalarojulaindi and aa bangarraju character ni expect chesindanikante ekkuva receive chesukunnaru audience

Emaina NAG ee Rang Blockbuster kottinanduku manam happies ye ga :)

vicky said...

excellent write up sir

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views