టెంపర్ - కథ, కథనం - ఒక విశ్లేషణ
ఫ్లాప్స్ లో ఉన్న హీరో అండ్ డైరెక్టర్, ఇంతకు ముందు ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా డిసాస్టర్, అయినా కూడా టెంపర్ కి వచ్చిన బజ్ అసాధారణం. ఆడియో కి స్పందన అంత అంత మాత్రం, అయినా సరే సినిమా కి వచ్చిన ఓపెనింగ్స్ సూపర్. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా జనాల్లో క్రేజ్ ని మైంటైన్ చేస్తూ వస్తున్న ఎన్టీఆర్ కి ప్రతి సినిమా లాగానే ఈ సినిమా ఒక పరీక్ష లాంటిదే అనుకున్నారు అందరు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 50 కోట్ల మైలు రాయి ఈ సారి కూడా కొన్ని కిలోమీటర్స్ దూరం లో అందుకోలేక పోయినా (చేరదు అనే అంటున్నారు మరి పండితులు) గత చిత్రాల కంటే మంచి పేరు బెటర్ కలెక్షన్స్ సంపాదిస్తున్న టెంపర్ కథ కథనం ని విశ్లేషించుకుందాం. కొన్ని పర్సనల్ కమిట్మెంట్స్ వలన అలాగే ఎక్కువ మంది చూసిన తర్వాత రాస్తే బావుంటుంది అని అనుకోవటం వలన ఆర్టికల్ లేట్ అయింది అని మనవి చేసుకుంటున్నాను.
కథ: ఇది బేసిక్ గా క్యారెక్టర్ బేస్డ్ స్టొరీ. హీరో ఒక అనాథ, డబ్బు సంపాదన కోసం పోలీస్ జాబు ఏ బెటర్ ఆప్షన్ అని చిన్న వయసు లోనే ఫిక్స్ అయ్యి, కరప్టడ్ పోలీస్ ఆఫీసర్ గా ఎదిగి విలన్ తో చేతులు కలిపి తనకి సహాయం చేస్తూ సంపాదిస్తూ ఉంటాడు. ప్రేమించిన అమ్మాయి అడిగింది అని ఇంకొక అమ్మాయి ని కాపాడే విషయం లో విలన్ తో నే గొడవ పెట్టుకుంటాడు. ఆ అమ్మాయి ఫ్యామిలీ లో జరిగిన అన్యాయం గురుంచి తెలుసుకున్నాక మారిపోయి ఆ ఫ్యామిలీ కి న్యాయం చెయ్యటనికి ఎంత దూరం వెళ్ళాడు అనేదే కథ. మాములుగా అయితే ఇది సింపుల్ కథ, ఇంతోటి కథా పూరి రాసుకోలేక వక్కంతం దగ్గర తీసుకున్నాడా అనిపించొచ్చు, అయినా వారం రోజుల్లో బీచ్ వొడ్డున కూర్చొని స్క్రిప్ట్స్ రాసేసే పూరి కి ఇది గొప్ప విషయం కాదు, కానీ అసలు విషయం అంతా కథనం లో నే ఉంది. మీరు చాల చోట్ల ఇది కథా భలం ఉన్న సినిమా అని విని ఉంటారు, సింపుల్ కథ అయినా సరే మంచి కథనం తోడు అయితే ఇంపాక్ట్ బావుటుంది, ఆ కథనం గురుంచి కూడా చెప్పుకుందాం.
కథనం: చాలా వరకు మెయిన్ క్యారెక్టర్ పాయింట్ అఫ్ వ్యూ లో ను, లాస్ట్ లో డైరెక్టర్ / రైటర్ పాయింట్ అఫ్ వ్యూ లో ను నరేషన్ ఉంటుంది. మొత్తం అంతా ఒకే నరేషన్ లో చూపెట్టే కంటే ఇలా ఫ్లాష్ బ్యాక్ లో ఓపెన్ చెయ్యటం వలన అసలు ఎం జరిగి ఉంటుంది అని ఒక కుతూహలం ప్రేక్షకులకి ఉంటుంది. ఇది పూరి వరకు ఫస్ట్ టైం అనుకుంటా. అసలు ఫస్ట్ షాట్ చూసి ఇదేదో ఘర్షణ సినిమా లో బీచ్ పక్కన పడిపోయిన షాట్ లా ఉందే, పూరి సినిమా ఏ నా అనుకొని తేరుకొని సర్దుకొని చూడటం మొదలు అయ్యింది. లక్కీ గా సినిమా లో గౌతమ్ స్టైల్ నెరేటివ్ కాకుండా అక్కడ ఓపెన్ చేసి ఫ్లాష్ బ్యాక్ అయ్యాక కట్ చేసి మంచి పని చేసారు. ఈ ఓపెనింగ్ షాట్ వలన మాస్ హీరో కి పడాల్సిన బీబత్సమైన ఎంట్రీ ఆప్షన్ మిస్ ఐంది.
పాయింట్ కి వస్తే, జానీ భాయి దగ్గర పని చేస్తూ, వేరే దగ్గర దొంగతనం చేసి దొరికిపోయిన హీరో (ఎక్కువ డబ్బు కి ఆశ పడి) జానీ దగ్గర పవర్ లేదు అని తెలుసుకొని, పవర్ అండ్ డబ్బులు ఉండాలి అంటే పోలీస్ అవ్వాలని డిసైడ్ అవుతాడు. పోలీస్ సినిమాలు కూడా చూస్తాడు, ఇక్కడ ఏమో కొండవీటి సింహం, రౌడీ ఇన్స్పెక్టర్, సీతయ్య లాంటి సిన్సియర్ రీల్స్ చూపించకూడదు, అవి చూసిన వాడు వాళ్ళ లాగ సిన్సియర్ అవుతాడేమో అనే ఇంప్రెషన్ పాస్ అయ్యే ప్రమాదం ఉంది కదా, అయినా సరే ఫాన్స్ కోసం ఆ మాత్రం తప్పలేదు అనుకోవాలి. అక్కడ నుంచి ప్రకాష్ రాజ్ ని పరిచయం చేసి, మినిస్టర్ ని ఫ్రెండ్ అని చెప్పి, తమ కోసం పని చేసే పోలీస్ అవసరం ని ఎస్టాబ్లిష్ చేసి హీరో ని పరిచయం చేసారు. నీచ్, కమీన్, కుత్తే టైపు లో మనీ సెటిల్మెంట్ సీన్ తో సినిమా కి రావాల్సిన టెంపో ని తీసుకురావటమే కాకుండా, అవసరం లేక పోయినా రఘు బాబు (జానీ భాయి) కి డబ్బులు ఇప్పించి ఎంత ఎదవ అయినా ఈడి లో మానవత్వం ఉంది అనిపించే లా చూపించారు, ఆ సీన్ అక్కడ మనం అంతా గా నోటీసు చెయ్యక పోయినా ఓవరాల్ గా హీరో లో వచ్చే మార్పు కి ఇది ఒక ఉదాహరణ లా మిగిలిపోయింది.
హీరో ఇగో ని ఇబ్బంది పెడుతూ ఎప్పటికప్పుడు హీరో ని మార్చటానికి ట్రై చేసే క్యారెక్టర్ గా కథని ముందుకి నడిపించటానికి పోసాని క్యారెక్టర్ ఏ డ్రైవర్ అయ్యింది. ముందుగ అనుకునట్టు నారాయణ మూర్తి గారు చేసి ఉంటె ఇంకా అద్దిరేది. సెల్యూట్ అనే చిన్న రీసన్ తో ఆడుకున్న విధానం ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్ తో హీరో కి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఒకరి అవరసం ఉన్కోకరికి ఉంది కాబట్టి ఇద్దరు సర్దుకు పోతారు అని ఫస్ట్ సీన్ లో నే చూపించటం జరిగింది. బిజినెస్ మాన్ లో మహేష్ కి రాణి అవసరం అయినట్టు ఇక్కడ హీరో మ్యూజిక్ సిస్టం కోరుకుంటాడు. బేసిక్ గా అనాధ, కంత్రి కాబట్టి హీరోయిన్ మీద మనసు పడ్డ కూడా మనకి అది ఫీల్ లా అనిపించదు, ఈడి క్యారెక్టర్ ఏ ఇంత అనుకుంటాం. అనిమల్స్ నే అంత ప్రేమిస్తున్న అమ్మాయి మొగుడ్ని ఇంకా ఎంత బాగా చూసుకుంటుందో అని హీరో ప్రేమించటం లో ఒక అర్ధం ఉంది అనుకున్నా హీరోయిన్ కి హీరో మీద ప్రేమ కలగటానికి సరైన థ్రెడ్ లేదు. మొత్తం సినిమా కి ఇదే ఆయువుపట్టు, చాలా కేర్లెస్ గా రాసినట్టు అనిపిస్తాయి ఈ సీన్స్. సినిమా లో 35 టు 40 నిమిషాల (3 ఆక్ట్ టైపు లో) మద్య లో తల్లి క్యారెక్టర్ స్టేషన్ కి వస్తుంది, ఈ మద్య రెగ్యులర్ గా ఇవే ఫార్మటు సీన్స్ చూసేయ్యటం వలన మనకి అది పెద్ద మార్పు గా అనిపించదు కూడా. కానీ సినిమా లో అతి పెద్ద మార్పు కి ఈ సీన్ ఏ నాంది. అక్కడ నుంచి భరణి గారి సెటిల్మెంట్ సీన్, తర్వాత వచ్చే పోసాని సీన్ లో నే చెప్పాల్సిన దాని కంటే ఎక్కువే చెప్పారు. ఒక పక్క చేసేది చెడ్డ పని అయినా కూడా, ఆ పెద్దాయనకి అది తప్ప వేరే సొల్యూషన్ లేదు అని హీరో చెప్పే విధానం, అయినా నేను ఎమన్నా రేప్ లు మర్డర్ లు చేసే వాళ్ళని వదిలేస్తున్ననా అని పోసాని తో చెప్పే డైలాగ్ ఏ మిగిలిన సినిమా. హీరోయిన్ మీద ఎటాక్ అయినా, తన ప్లేస్ లో వేరే అమ్మాయి ఉండి ఉంటుంది తనని కాపాడు అని హీరోయిన్ అడిగినా, దానికి హీరో స్పందించి విలన్ తో ఛాలెంజ్ చేసినా మనకి అంతా ఇంపాక్ట్ అనిపించక పోవటానికి కారణం పేలవమైన లవ్ థ్రెడ్. ప్రేమ లో ఫీల్ ఉంటె వార్నింగ్ లో ఇంపాక్ట్ ఉండేది. హీరో ఆశయం ఏదో అలా బ్రతికేస్తూ హీరోయిన్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవటం అయితే, అది ఇప్పుడు ఇంకొక అమ్మాయి ని కాపాడే ఆశయం గా మారిపోయింది. అయినా ఆ అమ్మాయి ని కపడక పోయినా హీరో కి వచ్చే నష్టం లేదు, కన్నింగ్ వేషాలు వేసి పెళ్లి చెడగొట్టిన వాడు, ఇక్కడ ఏదో ఒకటి చేసి ప్రేమ కంటిన్యూ చేసుకునే వాడు, కాని అలా అయిపోతే సినిమా నే లేదు కాబట్టి క్యారెక్టర్ కి వ్యతిరేకం గా వార్నింగ్ వరకు వెళ్ళాడు. ఇక్కడే మనం జానీ భాయి ఎపిసోడ్ గుర్తు చేసుకోవాలి, ఎదవ అయినా కూడా మానవత్వం ఉంది కాబట్టి అలా రియాక్ట్ అయ్యాడు. ఇవన్ని ఆలోచించే ఓపిక కంటే సినిమా లో ఉండాల్సిన కిక్ మిస్ అవ్వటం వలన ఫస్ట్ హాఫ్ చప్పగా ఉంటుంది.
సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి హీరో క్యారెక్టర్ లో మార్పు లేదు అన్నట్టు, భరణి గారికి వాడినట్టు ఇక్కడ కూడా సమర్దిన్చుకునే లాజిక్ తో మళ్లీ విలన్ తో కలిసిపోయి, తనకి కలసిన ప్రూఫ్ ఇచ్చేసి అమ్మాయి ఫ్యామిలీ ని సేఫ్ గా పంపించేద్దాం అనుకునే పాయింట్ తో మళ్లీ ట్రాక్ లో కి వచ్చేస్తుంది సినిమా. లాజికల్ గా కూడా ఇదే బెస్ట్ సొల్యూషన్. అలా కాకుండా రివర్స్ అయ్యి ఉంటె సినిమా దరిద్రం గా తయ్యారు అయ్యేది, మంచి రైటింగ్ కి ఇదొక ఉదాహరణ. ఈ ప్రాసెస్ లో కొంచెం టైం తీసుకొని డ్యూయెట్ పెట్టడం వలన జస్ట్ స్లో అయ్యింది అంతే. బేసిక్ గా నే విలన్ అయిన ప్రకాష్ రాజ్ కూడా ప్రూఫ్ దొరికింది అంటే ఇంకో కాపీ ఉంది ఏమో దానిని ఎత్తుకోచ్చేయ్ అనకుండా ఫ్లైట్ టికెట్స్ కొంటాడు ఏంటి అని అనుమానం రాకుండా ఈ ప్రపంచం లో నేను నమ్మేది నిన్ను ఒక్కడినే అనే డైలాగ్ కూడా చెప్పించేసారు. ఎయిర్పోర్ట్ సీన్ లో తన చెల్లికి జరిగిన విషయం చెప్పిన తర్వాత హీరో ఏ కాదు అంతకంటే చెత్త క్యారెక్టర్ కూడా చలించిపోయే సన్నివేశం అవ్వటం వలన హీరో లో మార్పు కి జస్టిఫికేషన్ పర్ఫెక్ట్ గా కుదిరింది. అంతకు ముందు పోసాని తో రేప్ అండ్ మర్డర్ డైలాగ్ పడటం వలన, ఒక వేల అలా జరిగి ఉంటె నేను ఇలా ఉండేవాడిని కాదు అని హీరో చేతనే చెప్పించటం ఇక్కడ ప్లస్ అయ్యింది. అదే టైం లో పోసాని తో పోలీస్ స్టేషన్ సీన్ అంతా బాగా రావటానికి అప్పటి వరకు వాడుకున్న సెల్యూట్ పాయింట్ పర్ఫెక్ట్ గా పే చేసింది. హీరో ఆశయం మారింది అనే దానికి కారణం దొరికింది. ఫస్ట్ హాఫ్ లో ఓపెన్ గా వదిలేసినా భరణి థ్రెడ్ ని కంప్లీట్ చేసి తను చేసిన తప్పు ని సరిదిద్దుకునే హీరో ఈ సన్నివేశానికి కధ లో నిజమైన హీరో గా మారతాడు. సినిమా ఫ్లో తో సంబంధం లేక పోయినా మార్పు ని చూపించటానికి భరణి గారి రెండు సీన్స్ చాలు రైటింగ్ సత్తా ని చూపిస్తాయి. టెంపర్ టెంపో ని అమాంతం పెంచేసిన ఈ సందర్భం లో డాన్సు ఉన్న టైటిల్ సాంగ్ పడటం ఏ కమర్షియల్ హీరో కి అయినా వరం. ఇటు ఫాన్స్ తో పటు అటు అందర్నీ అలరించి సినిమా మీద నమ్మకం ని పెంచే సందర్భం. ఇక్కడ వరకు ఎవరైనా రాసేయ్యోచు, ఇక్కడ నుంచి అది క్యారీ చెయ్యటం కత్తి మీద సాము.
కోర్ట్ సీన్ లో సాక్ష్యం మారిపోవటం హీరో కి అతి పెద్ద దెబ్బ, ఇక్కడ క్యాటలిస్ట్ లేక పోయినా హీరో తెలివి గా హేండిల్ చేస్తాడు. స్ట్రెయిట్ నరేషన్ లో 3 ఆక్ట్ మొదలు అవ్వాల్సిన సమయం.ఈ సినిమా వరకు 3 ఆక్ట్ కొంచెం అటు ఇటు గా ముందుకి వెళ్ళింది, ఎందుకంటే మనం ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో నే ఉన్నాం కాబట్టి. అప్పటికే చెయ్యి దాటిపోయింది, కాపీ కూడా లేదు, వాట్ నెక్స్ట్ అనే సందర్భం లో దేవుడా సాంగ్ పర్ఫెక్ట్ సాంగ్. లిరిక్స్ లో హీరో క్యారెక్టర్ మొత్తం కనపడుతుంది, కానీ మనకి ఫస్ట్ డే ఫస్ట్ షో లో అందులో డాన్సు మంత్రమే కనపడుతుంది. తప్పు జరిగిపోయింది, ఇంక రిపేర్ చేసుకోవాలి అని డిసైడ్ అవుతాడు, ఫైట్ అండ్ సాంగ్ ఈ సందర్భం లో హేండిల్ చెయ్యటం కష్టం, ఒక పక్క కోర్ట్ సీన్ లో ఉన్న ఇంట్రెస్ట్ ఇటు ఫైట్ కానీ అటు సాంగ్ కానీ ఏ మాత్రం బోర్ కొట్టించినా మొదటికే మోసం వస్తుంది. మందు బాటిల్ డైలాగ్ తో ఆ టెంపో ని అలాగే నిలబెట్టి ఫ్లాష్ బ్యాక్ ఫినిష్ చేసారు. అప్పటి వరకు తను ఎలాంటి వాడు అని చెప్పి, ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పి మూడ్ ని పర్ఫెక్ట్ గ సెట్ చేసి కోర్ట్ సీన్ ఓపెన్ చేసారు. మూవీ కి ఆ స్టార్టింగ్ ఎందుకు ఎంచుకున్నారో ఈ పాటికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనే అనుకుంటున్నా, మరొక్క సారి రైటింగ్ ని పొగడకుండా ఉండలేక పోతున్నా. సినిమా లో 3 ఆక్ట్ మొదలు అయ్యింది.
కోర్ట్ సీన్ లో హీరో ట్విస్ట్ ఇచ్చి జడ్జి ని ఒప్పించే సందర్భం లో డైలాగ్ లు బాగా రాసుకున్నారు. మళ్లీ పోసాని కి చెప్పిన డైలాగ్ రిఫరెన్స్ తో నువ్వు చచ్చిపో నువ్వు నమ్మిన నిజం బ్రతుకుతుంది కదా అని, అది తనకి వర్తిస్తుంది అని హీరో డెసిషన్ కి న్యాయం జరిగేలా చూపించారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ ఒక ఎత్తు, ఈ ఒక్క సీన్ చాలు ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడు అని చెప్పుకోటానికి. అంతా బాగానే ఉంది కాని తీర్పు వచ్చిన తర్వాత జరిగే సన్నివేశాలు బాగా తేలిపోయాయి. అన్ని సెక్షన్ లు, అన్ని ఫిట్టింగ్ లు గురుంచి మాట్లాడిన హీరో, జనాలకి కూడా హింట్ ఇచ్చేసాడు, ఉరి శిక్ష అనేది అంత పెద్ద విషయం అయినప్పుడు, జాగ్రత్త గా హేండిల్ చెయ్యటం మానేసి, సినిమా కోసం ఇక్కడ లిబర్టీస్ తీసుకొని రియాలిటీ కి దూరం గా వెళ్ళిపోయారు. ఇంత కంటే గొప్ప ముగింపు ఉండదా అనిపించేలా చేసారు. అప్పటి వరకు మెచ్చుకున్న రైటింగ్ ని ఇలాంటి సిల్లీ క్లైమాక్స్ తో పొంగుతున్న పాల పై నీళ్ళు చల్లేలా చేసారు. అభిలాష లాంటి ఉరి శిక్ష నరేషన్, ఇంకో కాపీ ఉంది అంటూ టీవీ ముందుకి రావటం అనేవి పాతకాలం సినిమాలని తలపించాయి. ఏది ఏమైనా ఫస్ట్ హాఫ్ లో వేస్ట్ అనుకున్నా సీన్స్ ని కూడా సెకండ్ హాఫ్ లో కలిపిన విధానం బాగా కుదిరింది, డిన్నర్ మెనూ తో సహా.. 3 ఆక్ట్ అనేది సినిమా కి ఎంత ఇoపార్టెంట్ అనేది మరొక్క సారి గుర్తు చేసి అప్పటి వరకు పెంచిన అంచనాలని అక్కడే ఆపేసారు. సినిమా మొత్తం విందు భోజనం అయితే క్లైమాక్స్ కిళ్ళి లాంటిది, అందులో సున్నం ఎక్కువ అయితే అప్పటి వరకు ఉన్న ఫీల్ పోతుంది అని ఒక పెద్దాయన అన్నట్టు, ఇక్కడ ఇంచుమించు అదే జరిగింది.
చివరిగా: పేలవమైన లవ్ థ్రెడ్, దాని వలన ఎమోషన్ లేని పవర్ లెస్ ఫస్ట్ హాఫ్ అండ్ క్లైమాక్స్ వలన సినిమా స్థాయి తగ్గినప్పటికీ, మనకి తెలియకుండానే మంచి రైటింగ్ కి కనెక్ట్ అవ్వటం వలన (సెకండ్ హాఫ్ లో అన్ని సీన్స్ ని కలిపిన తర్వాత), దానికి మంచి నటన తోడు అవ్వటం వలన, టెంపర్ డిసప్పాయింట్ చెయ్యదు. పెర్ఫార్మన్స్ అండ్ సెకండ్ హాఫ్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ అవ్వగా, సాధారణ ప్రేక్షకుడి కి పైసా వసూల్ అయ్యింది. రిపీట్ వేల్యూ తక్కువ గా ఉన్న ఈ కధ కి ఇంక మంచి సాంగ్స్ అండ్ లవ్ థ్రెడ్ తోడు అయి ఉంటె బాక్స్ ఆఫీసు దగ్గర అద్బుతాలు చేసేది ఏమో. ఈ మద్య తగ్గిన ఊపు ని తిరిగి ఇచ్చిన ఎన్టీఆర్ తొందరలోనే మైల్ స్టోన్ కూడా రీచ్ అవుతాడు అని ఆశిస్తూ
చిట్ట చివరిగా (సరదాకి); అదేంటి సినిమా లో విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటేనే కదా హీరో కి ఎలివేషన్ కుదిరేది, వన్ సీడెడ్ గా ఉంది కదా దయ గాడి దండయాత్ర అనొచ్చు మీరు, సినిమా మొత్తం దయ గాడు మనకి చెప్పిన ఫ్లాష్ బ్యాక్ ఏ గా, డార్లింగ్ లో ప్రభాస్ లా తన క్యారెక్టర్ అలా రైజ్ చెయ్యటానికి మిగిలిన క్యారెక్టర్ లు ఇలా తగ్గించేశాడు ఏమో :)
మీ
హరి కృష్ణ రాజు
10 comments:
mee story & screenplay tho cinema eppdu choodochu !! all the best
mee Sivaji
Maku Antha scene ledu Mahaprabho
As usual excellent review / write up Hari garu
kummesaru mastaru your reviews are always special
good one hari
kummesav darling . superb valid points tho kottav
late aina kuda mammlani disappoint cheyyaledhu guruvu garu. mee review kosam enni rojulu aina wait chestham
me detailing chala chala bavuntundi andi
Super baa :)
naaku kooda aa rakhee type lo police lu permission ivvadam etc tho climax fight nacchale, vallu paripotunattu choopinchi appudu hero champesinattu choopiste bagundedhi
inka love track puri gari paityaniki parakaastha, kukkatatvam anta aadu aadi paithyam kakapote :(
superb one raju garu
Post a Comment