శ్రీమంతుడు : కథ - కథనం - ఒక విశ్లేషణ



"మగాడు" ఇది ఈ సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్ అని విన్నాను, సినిమా కి ఎంత వరకు సూట్ అవుతుంది అని పక్కన పెడితే, మహేష్ బాబు కి మాత్రం ఈ సినిమా విషయం లో ఈ టైటిల్ పర్ఫెక్ట్ అండ్ మన బాష లో అయితే "వీడు మగాడ్రా బుజ్జి" అని చెప్పుకోవాలి. బ్యాక్ టు బ్యాక్ పరాజయాల తర్వాత ఎవరైనా ఇలాంటి సబ్జెక్టు జోలికి వెళ్తారా? సందేశాత్మక చిత్రం అయినా కమర్షియల్ స్టైల్ లో చెప్పబోతున్నాం అని తెలిసి ముందగుడు వేస్తే అంతకంటే రిస్క్ ఇంకోటి ఉంటుందా? తేడా వస్తే నవ్వుల పాలు అయిపోతాం అనే భయం ఉండక్కరలేదా? మన సినిమాలు పోయిన టైం లో కొందరు హీరో లు తన కంటే ముందు దూసుకుపోతుంటే, వెనక పడిపోయాను అనే అభద్రత లేకుండా కేవలం కథని, దర్శకుడిని నమ్మి ప్రొడక్షన్ లో కూడా భాగం పంచుకోవటం కంటే డేరింగ్ స్టెప్ ఏముంటుంది? అందుకే వీడు మగాడ్రా బుజ్జి. పోస్టర్ తో అందరి ద్రుష్టి ని ఆకర్షించి, ఈ మద్య కాలం లో నే వన్ అఫ్ ది బెస్ట్ ఆల్బం తో మనముందుకి వచ్చిన శ్రీమంతుడు, అంచనాల మద్య రిలీజ్ అయ్యి, మంచి టాక్ సంపాదించుకొని (అంటే నెగటివ్ టాక్ ఎక్కడ రాలేదు కదా?) కరెక్ట్ టైం లో కరెక్ట్ డెసిషన్ తో బాబు కి కంబ్యాక్ సినిమా అనిపించుకునే రేంజ్ లో కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. కమర్షియల్ అంశాలు ఎప్పటిలాగానే పక్కన పెట్టేసి కథ కథనం విశ్లేషించుకుందాం.

వేరే వర్క్స్ వలన ఆర్టికల్ బాగా లేట్ అయ్యింది. ఎలాగు ఈ టైం కి అందరు చూసేసి ఉంటారు, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటె ఇక్కడితో ఆపేసి చూసిన తర్వాత చదవమని మనవి.



కథ : ఈ సినిమా ఆడియో వచ్చిన వెంటనే ఇన్స్టంట్ గా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఫస్ట్ హియరింగ్ లో నే మూడు సాంగ్స్ నచ్చేసాయి కూడా, కథ అని చెప్పి ఆడియో గురుంచి సోది ఎందుకంటే, ఈ ఆడియో లో ఉన్న సాంగ్స్ లో నే స్టొరీ మొత్తం ఉంది. పాటలు బాగా విన్నవాళ్ళకి సినిమా కి వెళ్ళే ముందే ఈ సినిమాలో ఎం ఉండబోతుంది అని ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ట్రైలర్ కి బాగా క్లారిటీ వచ్చింది. ఈ కథ ని సాంగ్ లిరిక్స్ అండ్ ట్రైలర్ డైలాగ్  రూపం లో చెప్పుకుందాం అని ఒక చిన్న ప్రయత్నం.

"నా పేరు హర్ష, నా దగ్గర లేనిది లేదు అని అందరు అంటూ ఉంటారు, కానీ నాకు కావాల్సింది ఇంకా ఏదో ఉంది, దాని కోసం ఎంత దూరం అయినా వెళ్ళాలి అనిపిస్తుంది"
"మా రాజైన మామూలోడు మనలాంటొడు, జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన  మహానుభావుడు" - హీరో ఎంట్రన్స్
"రాజ్యమంటే లేక్కలేదురో, అడవి బాట పట్టినాడురో, పువ్వులాంటి సక్కనోడురో సౌఖ్యమంత పక్కనేట్టేరో" - అన్ని వదిలేసి ఏదో చెయ్యబోతున్నాడు
"పద పదమని వంతేనేసి పెనుకడలి దాటినాడు,పది తలలు ఉన్నవాడిని పట్టి తాట తీసినాడు, చెడు  తలపుకి  చావు  దెబ్బ  తప్పదంటూ  చెప్పినాడురో" - అడ్డు వచ్చిన కష్టాలు అధిగమించి, విలన్స్ కి బుద్ది చెప్తాడు
"జనమొక తీరు వీళ్ళదొక తీరు, ఇద్దరోకలాంటి వారు, అచ్చు గుద్దినట్టు ఒక  కలగంటూ ఉన్నారిద్దరూ" - అర్ధం అయ్యే ఉంటుంది గా?
"గుండె దాటుకొని పండుదైన కల పసిడి దారులను తెరిచినదా, ఋణం తీర్చే తరుణము ఇది రా కిరణమై  పద పదరా"
"మరల వెనుతిరగనన్న చిరు నవ్వే నీకు తొలి గెలుపు కదా"
"వెతికా నన్నునేను, దొరికా నాకు నేను, నాలో నేనే ఎన్నో వేల మైళ్ళు తిరిగి" 
"ఏమి పట్టనట్టు బంధం తెన్చుకుంటూ మనిషే సాటి మనిషని చూడకుంటే అర్థం లేదే "
"సాయం సమాజమే నీ ద్యేయం నిరంతరం"  
"పంచేస్తాను నన్ను పరిచేస్తాను నన్ను ప్రేమై వెలిగి " 

ఈ మాత్రం హింట్ ఇచ్చినందుకు ఇదేదో బాగా పడుకోబెట్టే సినిమా అవుతుంది ఏమో అని, దానికి తోడు సెకండ్ మూవీ సెంటిమెంట్, లాస్ట్ మినిట్ లో ఈరోస్ సెంటిమెంట్ వెరసి ఈ సారి ఏమవుతుందో  అనుకున్న నాలాంటి వాళ్ళకి కరెక్ట్ టైమ్స్ లో కరెక్ట్ కమర్షియల్ ఎలెమెంట్స్ ని జోడించిన ప్యాకేజ్ ఒక సర్ప్రైజ్ అయ్యింది, అది కధనం లో చెప్పుకుందాం.  

కథనం: బేసిక్ గానే రైటర్ అయిన కొరటాల శివ కి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు, అయన ఇంతకు ముందు వ్రాసిన సినిమాలు చూసుకున్నా గొప్ప కథలు ఉండవ్ కానీ ఆసక్తికరమైన కథనం తో అలరించాయి. అయన తీసిన మిర్చి లో కూడా కథ ఎలా ఉన్నా ఎక్కడ బోర్ కొట్టించకుండా లాక్కోచ్చేసారు. శ్రీమంతుడు బేసిక్ అవుట్ లైన్ చుట్టూ ఆయన అల్లుకున్న కమర్షియల్ ఎపిసోడ్స్ ఏ ఈ సినిమా కి పేపర్ పై విజయం తీసుకోచ్చేసి ఉంటాయి. ఒకే ఫ్యామిలీ కి చెందిన ముగ్గురు విలన్స్ ని డిఫరెంట్ సిచువేషన్స్ లో హీరో ఎలివేషన్ కి వాడుకున్న తీరు ఈ సినిమా ని నిలబెట్టేసింది.  మినిస్టర్ - మినిస్టర్ కొడుకు - తమ్ముడు, ఢిల్లీ - హైడ్- విల్లెజ్, స్టార్టింగ్ - ఇంటర్వెల్ - ప్రీ క్లైమాక్స్ - ఫైనల్ గా అందరు కలిపి క్లైమాక్స్. ఈ మద్య లో మన మెసేజ్ చెప్పెసుకుంటే సినిమా చూస్తున్నంత సేపు ఎంగేజ్ చెయ్యటానికి ఇంత కంటే ఫార్మటు ఎం ఉంటుందిమరీ భజన చేస్తున్నట్టు ఎవరైనా ఫీల్ అవుతున్నారు ఏమో, కిందన ఉన్న కంటెంట్ కి ఈ మాత్రం భజన తప్పులేదు, తప్పే కాదు. 

పాత్రల పరిచయంఈ సినిమా మొత్తం అతడు సినిమా లో మహేష్ చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ కి మెట్యురిటి అవసరం, అలా అని ఆవేశపరుడు అయితే అర్ధం లేని ఆవేశం అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జనాలకి కనెక్షన్ ఉండదు, తనతో పాటు ట్రావెల్ చెయ్యలేరు, అక్కడ లా ఇక్కడ తప్పు / మోసం చెయ్యలేదు కాబట్టి భయం అవసరం లేదు. అన్నిటిని బాలన్స్ చేస్తూ అతడు క్యారెక్టర్ కి కామెడీ టైమింగ్ ఆడ్ చేసి శ్రీమంతుడు ని చేసారు . 

జగపతి బాబు కి మహేష్ బాబు కి మద్య జరిగే బిగినింగ్ సీన్ లో నే ఎవరి మనస్తత్వం అండ్ అంచనాలు ఏంటి అని చక్కగా చెప్పేసారు. ఎర్ర మట్టి నల్ల మట్టి అని వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు చూపించినా దానిని ఎక్కడ పే ఆఫ్ కింద వాడుకోలేదు మరి. "లెట్ మీ అల్సొ ఎఅర్న్ సం రెస్పెక్ట్" తో ముందుకి సాగటానికి పాత్ వేసుకున్నా, వెళ్ళాల్సింది ఎక్కడికి, చెయ్యాల్సింది ఏంటి అని చెప్పటానికి చాలా టైం వాడుకున్నారు. టీజర్ లో వాడిన డైలాగ్ సినిమా లో ఎందుకు పెట్టలేదో అర్ధం కాలేదు, అది కూడా ఉంది ఉంటె బావుండేది. అలాగే అసలు హీరో ఇలా ఉండటానికి కారణం ఏంటి అని కూడా ఎస్టాబ్లిష్ చెయ్యలేదు. దాని వలన వీడు కొంచెం తేడా అనుకోవాలే తప్ప పర్పస్ అంటూ మనకి తెలియదు. రాముడి పాట లో రాముడు మనకి మెసేజ్ ఇచ్చాడు మనం ఫాలో అవుదాం అనుకునే అర్ధం వచ్చినా మన హీరో కి చిన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లం అయితే ఉంది మరి ఎందుకో? ప్రాబ్లం అంటే ఫ్యామిలీ మెంబెర్స్ తో కలవకపోవటం, ముభావం గా ఉండటం, ఏదో భలమైన కారణం అయితే ఉండాలి గా, బొమ్మరిల్లు లో సిద్దార్థ్ కి ఉన్నట్టు 

శ్రుతి ముగ్గు వేస్తుంటే నచ్చింది అని తర్వాత మీటింగ్ అయ్యాక వెనక పడతాడు, రూరల్ డెవలప్మెంట్ కోర్స్ అనగానే ఇదేదో బావుందే అని మొదలు పెడతాడు, ఇంతలో శ్రుతి ని పట్టించుకోడు, ఫీల్ అయ్యింది అని మళ్లీ మొదలు పెడతాడు, తను వదిలేసుకుందాం అనే టైం కి ప్రపోజ్ చేస్తాడు. మోస్ట్ కన్ఫ్యుజింగ్ ట్రాక్ ఇది. జనాలకి ఈ పాత్ర అలవాటు అయ్యే లోపు పాత్ర కన్సిస్టెన్సి దెబ్బ తింటుంది. దీనినే లవ్ అనుకోవాలని, లవ్ లో పడిపోయి ఆశయం వదులుకో కూడదు కాబట్టి పట్టించుకోలేదు అని సరిపెట్టుకుందాం. ఇక్కడ మనం డీవియేట్ అయిపోతాం అని ఢిల్లీ ఎపిసోడ్, పార్టీ లో ఫైట్ తో ఊపు తెప్పించి ఉంటారు

ఆశయం / లక్ష్యం - దిశ గా అడుగులుశ్రుతి రిజెక్ట్ చెయ్యటానికి కారణం సొంతఊరు గురుంచి మహేష్ కి తెలియక పోవటం? అసలు పరిచయం ఐన అన్ని రోజుల్లో అసలు నువ్వు ఎవరు? మీ బాబు ఎవరు? ఏ ఊరు? ఎం పీకుతారు? అని అడగకుండా ఎలా ఉంది? అది కూడా సొంత ఊరు కి ఏదో చెయ్యటానికే లైఫ్ ని డెడికేట్ చేసిన శ్రుతి. నా దగ్గర బోలెడు డబ్బులు ఉన్నాయి అని మహేష్ అంటే, మరి వెంటనే తన సొంత ఊరుని దత్తత తీసుకో అని ప్రపోసల్ పెట్టలేదు? ఏదో ఒక బ్లాక్ పెట్టాలి అన్నట్టు రిజక్షన్ పెట్టారు తప్ప దాని వలన శ్రుతి క్యారెక్టర్ అపశ్రుతి పలుకుతుంది అని మర్చిపోయారు. పోనీ రిజెక్ట్ చేసింది అని ఫీల్ అవ్వకుండా మళ్లీ తన పని తను చేసుకు పోయిన హీరో అసలు నిజం గా ప్రేమించినట్టే నా? పోనీ తన తండ్రిని అయినా ఏమిటి డాడీ మన సొంత ఊరు? అసలు ఎందుకు ఎప్పుడు దాని గురుంచి మాటడరు అని అడగటానికి కూడా మనకి ఇంట్లో రిలేషన్ సరిగ్గా లేదాయే. టెండర్ వెయ్యటం, సొంతం గా సంపాదిన్చుకోమని సలహా ఇవ్వటం, తను మాత్రం తండ్రి సంపాదించింది ఖఅర్చుపెట్టేయ్యటానికి బయల్దేరటం. ఒకపక్క ఊరిలో జనాల పాట్లు, ఆ ఊరికి ఉన్న ప్రాబ్లం, ఊరిలో బ్రతకలేక కొత్తవలస టౌన్ కి వెళ్ళిపోతున్న జనం, వాళ్ళని లెక్కపెట్టే షేర్ ఖాన్ అంటూ టీవి సీరియల్ కి మించిన డ్రామా పండించారు. అసలేం జరుగుతుందో అర్ధం చేసుకునే లోపు ఇంటర్వెల్ బ్లాక్ కి కావాల్సిన యాక్షన్ ఎపిసోడ్  సిద్దం చేసి కొత్తవలస దగ్గర ఉన్న దేవరగుట్ట మీదుగా శ్రీకాకుళం వెళ్ళే హైడ్ కి చెందిన బస్సు లో  "రయి రయి" అని సెకండ్ హాఫ్ కి పరిగెత్తారు. 

 ఫస్ట్ హాఫ్ వరకు మహేష్ బాబు ని చూస్తూ అన్ని మర్చిపోయి సరదాగా కాలక్షేపం చేసుకోవచ్చు సెకండ్ హాఫ్ లో అయిన ఏదో ఉండబోతుంది అని ఎదురుచూడటానికి లేదు ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎం జరగబోతుంది అని ఎప్పుడో తెలిసిపోయింది కాబట్టి. 

ఏ మాట కి ఆ మాట, డాన్సు విషయం లో ఫస్ట్ సాంగ్ లో నాగార్జున ని లాస్ట్ సాంగ్ లో కృష్ణ గారిని గుర్తు చేసాడు. చారుసీల లో ఫాన్స్ ని అలరించినా, ఒకప్పటి ఎనర్జీ డాన్సు లో ఉండటం లేదు. అదొక్కటి కొంచెం ద్రుష్టి పెడితే బాబు కి తిరుగులేదు


ఊరికి వెళ్ళాక ఊరిలో అందరు మంచివాళ్ళు అని తెలుసుకుంటాడు, వాళ్ళు బడి గురుంచి మాటాడుతుంటే చెక్ మీద సంతకం పెడతాడు, విలన్ వచ్చి ఎంత అని చేస్తావు అంటే, చేసేద్దాం సర్ అంటాడు. ఊరిని దత్తత తీసుకుంటున్న అని అనౌన్స్ చేస్తాడు. ఒక మాంచి ఊపు తెప్పించే పాటలో లుంగీ కట్టి ఫాన్స్ ని అలరిస్తాడు, అంటే ఆ సాంగ్ స్టార్ట్ ఐన దగ్గర నుంచి ఎం చేస్తున్నాడు అనే కంటే లుంగీ లో ఎప్పుడు వస్తాడు కేకలు వేద్దాం అనే చూస్తూ ఉంటాం లెండి. అసలు ప్రాబ్లం ఇక్కడ నుంచే మొదలు అవుతుంది. ఊరిలో ఉన్న ప్రొబ్లెమ్స్ అన్ని ఒక్కొక్కటి సాల్వ్ చేద్దాం అనుకుంటాడు కానీ అసలు ప్రాబ్లం ఊరిలో జనాల్లో ఉంది అని మనకి అర్ధం అయినా శ్రీమంతుడు కి అర్ధం అవ్వదు. ఖర్చు పెట్టేది సొంతంగా సంపాదించింది అయితే తెలిసేది ఏమో, తండ్రి సొమ్ము కర్చు పెడుతూ ఎర్నింగ్ రెస్పెక్ట్ అని ఫీల్ అవుతున్నాడు ఏమో అని సగటు ప్రేక్షకుడికి అనిపించక మానదు. అసలు ఊరి జనం లో ఒక ఆలోచన ఉండదు, ఒక ఆశయం ఉండదు, ఎవడో వచ్చి ఏదో చేస్తున్నాడు అంటే బాగానే ఉంది అది కూడా చేసిపెట్టు అంటారు తప్ప వాళ్ళు సొంతం గా చేసేది ఉండదు. పోనీ చేసే హీరో అయిన ఒరేయ్ అబ్బాయిలు ఇలా ఉండిపోకండి రా, ఇలా ఇలా చేస్తే మీకు రెవిన్యూ వస్తుంది రా, నాకు రూరల్ డెవలప్మెంట్ క్లాసు లో ఇలాంటివి చెప్పారు రా, మీ కాళ్ళ మీద మీరు నిలబడండ్రా అని చెప్పడుఇంతలో శ్రుతి పాప ఊరికి వచ్చి, నాకోసమే ఇవన్ని చేస్తున్నావ్ అయినా నేను నీకు పడను అంటుంది, అప్పుడు హీరో కి సడన్ గా లవ్ చేసిన విషయం గుర్తు చెయ్యటం తప్ప మనకి ఆ ఫీలింగ్స్ మాంటేజ్ లో కూడా కనపడవ్. చేసుకుంటూ పోతే ఊరికి చేసుకుంటూ పోవటమే, వాళ్ళు కూడా వాటిని తీసుకొటానికె రెడీ గా ఉన్నారు. మహేష్ ఖలేజ లాంటి సినిమా లో ఆ గ్రామం లో జనాలు నాగరికత కి బాగా దూరం గా ఉండి దేవుడిని గుడ్డిగా నమ్ముతున్నారు అనుకోవచ్చు, ఇది అలా కాదు గా? ఒకప్పుడు ప్రయత్నించిన ప్రజానీకం ఏ గా? అయినా కూడా ఎవడో వచ్చి వాళ్ళ కోసం చేస్తుంటే చూస్తూ ఉండిపోతారు ఏంటి? ఇంతలో ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న రాజేంద్ర ప్రసాద్ తమ్ముడు కి కలిసి ఉండమని క్లాసు తీసుకుంటాడు, తను ఇప్పటివరకు కలిసి ఉండటం అంటే ఏంటో కూడా తెలియని వాడు, వీడి పక్కోడికి చెప్పటం ఏంటో అనుకోటం తప్ప ఏమి చెయ్యలేం. పోనీ అది అయ్యాక అయినా వాళ్ళ డాడీ దగ్గర కలిసి ఉందాం అని కాని, డాడీ ని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చి కలిసి ఉందాం అని కాని ఆలోచించడు. 

ఇక్కడ వరకు జరిగిన కథ కి ఒక రూపం తీసుకొచ్చింది ఫ్లాష్ బ్యాక్.  జగపతి బాబు ఎపిసోడ్ బాగా వచ్చింది. తెలిసిందే అయినా హీరో కి లక్ష్యానికి పర్సనల్ కోణం కూడా ఆడ్ అయ్యేలా ఫ్లాష్ బ్యాక్ డెవలప్ చేసారు. అదే ఫ్లాష్ బ్యాక్ కి ముందు జనాలు ఊరిలో విలన్ పై తిరగాబాడటానికి రెడీ గా ఉండీ సపోర్ట్ కోసం వెయిట్ చేసినట్టు గా ఉండి ఉంటె, ఆ టైం లో వాళ్ళకి రాజన్న లో నాగార్జున లా మహేష్ సపోర్ట్ తోడు అయితే,  ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత హీరో కి ఉండాల్సిన ఆశయం, ఇంత బాగా ఆలోచించే తండ్రి అలా ఎలా మారిపోయాడు, ఎంత మారిపోయిన లోపల మాంచి అలాగే ఉండాలి, అది తండ్రి కి తెలిసేలా చెయ్యాలి, నేను ఇన్నాళ్ళు చేసింది చూపించాలి, అదే టైం కి జనాల్లో మార్పు కూడా తీసుకు వచ్చి ఉంటె? తను కలగన్నది ఇదే అని జగపతి మెచ్చుకొని కొడుకు తో పాటు ఊరిలో ఉండిపోతాను అంటే, సొంత ఊరికి ఒక కళ, ఆశయానికి ఒక అర్ధం వచ్చి ఉండేవి ఏమో  

కానీ ఇక్కడ ఎం చేసారు ? ఇంకోటి ఏదో ఒక పని దొరికితే బావున్ను అనుకునే టైం కి చెరువు ప్రాబ్లం తెలుస్తుంది, ల్యాండ్ గ్రాబింగ్ గురుంచి తెలుస్తుంది, రెండు మాంచి యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టుకోటానికి స్కోప్ తెలుస్తుంది. అన్నిటికంటే హైలైట్ ఆ ఎపిసోడ్స్ ని పీక్స్ లో తీసారు. ఫైట్ ఉండాల్సిన సీన్ ని కట్ చేసిన విధానం సూపర్. మామిడి తోట ఎపిసోడ్ కేక. తర్వాత ఫైట్, కట్ చేస్తే హాస్పిటల్. ఊరిలోకి వచ్చిన జగపతి బాబు మాత్రం మీరు మారలేదు రా, అలాగే ఉన్నారు అంటాడు, నా కొడుకు ని వదిలేయ్ అంటాడు, కరెక్ట్ గా ధియేటర్ లో నుంచి  బయటికి వచ్చేయ్యటానికి ఇంత కంటే పర్ఫెక్ట్ టైం ఇంకోటి ఉండదు. 

ముగింపుఒకప్పటి తన ఆశయం ని కొడుకు తీర్చాడు అని ఆనంద పడడు, ఎవడ్రా నా కొడుకు మీద చెయ్యి వేసింది అని ఆవేశ పడడు (అప్పట్లో అంటే డబ్బులు లేవు కానీ ఇప్పుడు బోలెడు డబ్బులు ఉన్నాయి గా), పోనీ కొందరు మనుషుల్ని కాపలా పెడదాం అనుకోడు. ఇంటికి తీసుకెళ్ళి పోతా అంటాడు. ఊరి జనాలు కూడా నువ్వు మాకు చేసింది చాలు వెళ్ళిపో అంటారు. (ఒకవేళ ఇందాక అనుకున్న టైపు అయితే నువ్వు మాకు ఇచ్చిన ధైర్యం చాలు, ఇంకా మేము చూసుకుంటాం అని చెప్పినా ఒక అర్ధం ఉండేది). మనసులో పీకుతున్నా వెళ్ళిపోతాడు. బేసిక్ గా ఊరిలో జనాల గురుంచి తెలుసు కాబట్టి ఎవడు లేక పోతే వాళ్ళు ఎమైపొతారొ అని మళ్లీ వస్తాడు. ఈ సారి చెప్పేసి వస్తాడు. సారీ డాడి ఐ యాం బాడ్ సన్, ఈ జన్మ కి నన్ను వదిలెయ్యండి అని చెప్పి వచ్చేస్తాడు.  అప్పుడు మనకి తెలిసేది ఏంటి అంటే 520 ఫ్యామిలీ కి కలిపి అరౌండ్ 6000 ఎకరాల పొలం ఉంది అండ్ అది విలన్ లాగేసుకున్నాడు అని. ఫైట్ అండ్ రాక్షస సంహారం. ఒరేయ్ ఆడిని కూడా చంపేసాను, మా బాబు కి చెప్పి వచ్చేసాను, మీరు ఇంకా మీ కాళ్ళ మీద నిలబడండి, నేను శ్రుతి సైకిల్ ఎక్కేసి ఇంకో ఊరు ఎల్తాం అని చెప్పడు. శ్రుతి లాజిక్ ప్రకారం అయిన డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు దత్తత కంటిన్యూ చెయ్యొచ్చు కదా? బాబు లిరిక్స్ ప్రకారం పంచేసి పరిచేయ్యోచ్చు గా ఆయన్ని ?   



చివరిగా: క్యారెక్టర్ బేస్డ్ మూవీ లో పాత్ర చిత్రణ విషయం లో కన్ఫ్యూషన్ క్రియేట్ అవ్వటం వలన అండ్ కన్సిస్టన్సి లేక పోవటం వలన సినిమా చూసినంత సేపు బోర్ కొట్టక పోయినా, మిస్ అయ్యే ఫీలింగ్ అయితే మిస్ అవ్వక మానదు. ఈ సినిమా లో హీరో చెప్పినట్టు తన దగ్గర (సినిమాలో) లేనిదీ అంటూ లేదు (రొమాన్స్, కామెడీ, మెసేజ్, ఎంటర్టైన్మెంట్) కానీ మనకి కావాల్సింది ఇంకా ఏదో ఉంది? (అది ఏంటి అని విశ్లేషణ లో చెప్పటం జరిగింది) దాని కోసం రెండున్నర గంటలకు పైగా వెయిట్ చేసినా, దొరకలేదు. దాని కోసం ఎంత దూరం అయినా వెళ్ళే ఓపిక లేదు కాబట్టి రెండో సారి చూసే సాహసం కూడా చెయ్యలేదు. మహేష్ వన్ మాన్ షో గా మొత్తం అన్ని తానై మోసిన ఈ శ్రీమంతుడు సినీ ప్రియులకి ఒక సారికి ఓకే, కొన్న వాళ్ళకి తీసిన వాళ్ళకి డబల్ ఓకే అండ్ ఫాన్స్ కి ట్రిపుల్ ఓకే. మొత్తం మీద రిజెక్ట్ చేసే కంటెంట్ కాదు, ఎత్తుకొని మోసే అంత కంటెంట్ లేదు. వరస పరాజయాల్లో ఉన్న హీరో కి బ్రేక్ దొరికింది, సెంటిమెంట్స్ కి అతీతుడు గా శ్రీమంతుడు కి సక్సెస్ పడింది. 



6 comments:

aditya said...

Climax weak, Hospital scene daggara confrontation set cheyalsindi MB-JB and RP/Villagers kooda JB ni request chesinattu appudu FB Link ki manchi justification occhedi, manchi emotion pandedi appudu villgers MB tho kalisi villains ni tanniattu, elago interval li reportesrs link undi kabattu aa proofs or saakshyaalatho villains ni jail lo esinattu choopiste bagundedi

ento cinema aipoyaka malli inko climax vacchinattu untundi akkada ala cut chesi malli saagadeeste


Hero ki father/family members tho aa conflict inka clear ga cheppalsindi avunu but total minus analem

endukante first sitting scene lo JB antadu ga neeto nenu argue cheyadaniki raaledu ani ante antakumunndununde MB ala andaritho manchiga undali etc diso aindi ani

kaasta dooramga tanakantu oka lokam type pettadu but family ante ishtamega anduke aa minster ki warning scene petadu

inka love track lo enti anta logics teestunnav :D

hero father evero heroine ki teliyadaniki ala twist ga pedite aa matram cinematic liberty kooda undaddha :D :D



Villagers ki Farming gurinchi cheptadu Jago re song lo but climax nenu annatu plan chesi unte MB/JB ki villagers tho aa boding kaani aa idi kani okati create ayyedi :)

Anonymous said...

this is one of the best reviews i have ever read

Kiran said...

Sir meru intha late ga publish chesthe ela andi, tuesday varaku wait chesi inka review ledhu anukunna, malli casual ga ee roju choosthe kanipinchindi. ivanni pakkana pedithe review alladinchesaru. superb anthey

kiran said...

mee review entha balanced ga untundi ante atu fans ni itu anti fans ni oke review lo satisfy chesesaru meru. inka evvari daggara nunchi extra questions undav :P

Anonymous said...

as usual kummesav hari

ravi said...

:claps: :whistles: :salute: :kudos: :Hats-off: :bow:

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views