బ్రూస్ లీ - కథ, కథనం - ఒక విశ్లేషణ




 బ్రూస్ లీ - కథ, కథనం - ఒక విశ్లేషణ

శ్రీను వైట్ల తీసిందే తిప్పి తిప్పి తీసినా మినిమం ఆడేసే బొమ్మ తీస్తాడు, ఇది ఆగడు కి ముందు మాట. చరణ్ చేసిందే చేసి బాక్స్ ఆఫీసు దగ్గర నెట్టుకొచ్చేస్తున్నా కొత్తదనం లేక బోర్ కొట్టేస్తున్నాడు, ఇది గోవిందుడు కి ముందు మాట. ఆగడు శ్రీను వైట్ల ని ఆలోచిన్చుకునేలా చేస్తే, గోవిందుడు అనుకున్నంత కాక పోయినా చరణ్ కి కొత్త ఉత్సాహం ని ఇచ్చింది. మారిన చరణ్, నేను కూడా మారిపోయాను అని చెప్పుకున్న వైట్ల కలిసి బ్రూస్ లీ అనే యాక్షన్, కామెడీ, రొమాంటిక్, సెంటిమెంటల్, ఎమోషనల్, ఎంటర్టైనర్ ని మనకి అందించారు. చిరంజీవి గారి గెస్ట్ రోల్ కొత్త ఆకర్షణ గాఆడియో ఫాన్స్ కి ఊపు తెప్పించగా, డాన్సు మూవ్స్ అందర్నీ అలరించాయి. ట్రైలర్ ఎప్పటిలాగానే ఉన్నా కూడా, ఆగడు నుంచి నేను లెస్సన్ నేర్చుకున్నాను, నా ముందు సినిమాలకంటే భిన్నమైన సినిమా తీశాను, అసలు ముందు కథ ని బాగా రాసుకొని దానికి కొత్త ఎంటర్టైన్మెంట్ ఆడ్ చేశాను అని డైరెక్టర్ ఇంటర్వ్యూ లో అంటే, ఓహో అని నేను అనుకున్నాను కాని జనాలు అనుకోలేదు అన్నమాట. ఎందుకంటే జనరల్ గా టాక్ వచ్చిన తర్వాత కలెక్షన్స్ డల్ అవ్వటం చూశాం, కానీ ఓపెన్ అవ్వటమే డల్ కలెక్షన్స్ తో ఈ మద్య కాలం లో ఓపెన్ అయిన బ్రూస్ లీ బాక్స్ ఆఫీసు గురుంచి చర్చించుకునే పని లేదు, మనకి చేత కాదు కాబట్టి, ఎప్పటిలాగానే కథ కథనం ని విశ్లేషించుకుందాం. 

ఆగడు సినిమా కి మిస్ అయిన కోనా అండ్ గోపి ద్వయం ఈ సినిమా కి పక్కన చేరారు. ఎవరి ఇన్పుట్ ఎంతో, ఎవరి డెసిషన్ ఏంటో తెలియదు కాబట్టి, ఇది కలెక్టివ్ ఎఫర్ట్ అని ఫిక్స్ అయిపోయి ముందుకి పోదాం. 

సినిమా చూసినా చూడకపోయినా ఈ ఆర్టికల్ చదవటం వలన మీ అనుభూతి అయితే దెబ్బ తినదు అనే అనుకుంటున్నా, అయినా సరే, సినిమా చూసిన తర్వాత చదవమని ప్రార్ధన

కథ : తండ్రి ఆశ, అక్క ఆశయం కోసం తన జీవితాన్నే పణం గా పెట్టిన ఒక కుర్రోడు, వాళ్ళకి ఎదురైన సమస్యలని ఎలా అధిగమించాడు అనేది వన్ లైన్ స్టొరీ. ఇంకొంచెం డిటైల్డ్ గా చెప్పాలి అంటే, మద్య తరగతి కుటుంబం కు చెందిన తండ్రి రావు రమేష్ కి తన ఇద్దరు పిల్లల్ని పెద్ద స్కూల్ లో చదివించే స్తోమత లేక, కొడుకు ని మాత్రమె అక్కడ చదివించి కలెక్టర్ ని చేద్దాం అనుకుంటాడు, కానీ తన అక్క కలెక్టర్ అవ్వాలి అనుకుంటుంది అని తెలుసుకున్న చరణ్, అక్కని కలెక్టర్ చెయ్యటమే లక్ష్యం గా, అక్క కోసం తను చదువు పక్కన పెట్టేసి తండ్రి ద్రుష్టి లో యూస్లేస్స్ ఫెలో గా ఉంటూ అక్క కి హెల్ప్ చేస్తాడు. అనుకోకుండా ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్న అక్క ఇంక కలెక్టర్ అయ్యే అవకాశం పోయినట్టే అని నిరాశ చెందితే ఆ ప్రాబ్లం ని చరణ్ ఎలా పేస్ చేసి సాల్వ్ చేసాడు అనేది మూల కథ. 

కథ కొంచెం ఓల్డ్ గా అనిపించిందా? కథనం కూడా అలాగే ఉంటుంది లెండి. అసలు బేసిక్ కథని పక్కన పెట్టేసి, కథనం ని పట్టాలు తప్పించేసి, సెకండ్ హాఫ్ ని చెడగొట్టిన విధంబెట్టిదనిన..... 


కథనం: 
ప్రారంభం : పాత్రలు పరిచయాలు: ఆక్ట్ 1:  ఈ మద్య వస్తున్న శ్రీను వైట్ల సినిమాల లాగానే చిన్నప్పటి సీన్స్ తో మొదలు పెట్టి, మంచి డైలాగ్స్ తో కథ ని బాగా ఎస్టాబ్లిష్ చేసారు. శ్రీను వైట్ల మనసు పెట్టి రాసుకునేది ఈ పోర్షన్ ఏ ఏమో అనిపిస్తూ ఉంటుంది . ప్రేమ, భాద్యత గురుంచి ఎక్ష్ప్లైన్ చేస్తూ కథానాయకుడు లక్ష్యం / గోల్ ఏంటో మొదటి రీల్ లో నే చెప్పించేసారు. "తన అక్కని కలెక్టర్ చెయ్యటమే" చరణ్ లక్ష్యం. మంచి స్కూల్ లో చదివించటానికి తండ్రి ఉన్నాడు, అక్క కలెక్టర్ అవ్వటానికి తిను కష్టపడి చదవాల్సిన అవసరం లేదు, మరి ఈ గోల్ రీచ్ అవ్వటానికి ఉన్న ప్రాబ్లం ఏంటి? దానిలో హీరో చెయ్యాల్సిన సాహసం ఏంటి? అని మనకి అప్పుడే అర్ధం కాదు. ఈ ప్రాసెస్ లో తండ్రి తో కొడుకు రిలేషన్ గురుంచి కూడా చూపించారు, ఆ విధంగా అక్క కలెక్టర్ అవ్వుద్ది, హీరో గొప్పతనం తండ్రి కి తెలుస్తుంది అనేది క్లైమాక్స్ అని మనకి తెలుస్తుంది, కానీ ఇది ఎలా జరగబోతుంది అనేది ఎంత ఇంటరెస్టింగ్ గా చూపించారు అనే దానిపై సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. 

హీరోయిన్ ఎంట్రీ, పోలీస్ అంటే ఇష్టం, కట్ చేస్తే పోలీస్ డ్రెస్ లో హీరో ఎంట్రీ,  డైలాగ్స్, ఫైట్, హీరోయిన్ ఇంప్రెస్స్ అవ్వటం, ఇంట్రడక్షన్ సాంగ్ ఒక స్టాండర్డ్ టెంప్లేట్ వేసుకుంటూ పోతుంది ముందుకి. ప్రాబ్లం ని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ లో హోటల్ ఎపిసోడ్ మొదలు పెట్టారు. పోలీస్ ఆఫీసర్ కి హీరో కి లింక్ ఉండేలా పెదనాన్న కొడుకు అనే స్ట్రాంగ్ బాండ్ ఉన్న కూడా ఆ థ్రెడ్ ని డెవలప్ చెయ్యక పోవటం శోచనీయం. కనిపించ కుండా పోయింది అన్నయ్య కొడుకు అని ఇటు హీరో ఫాదర్ కి, అన్నయ్య అని అటు హీరో కి కనీసం ఒక్క ఎమోషనల్ సీన్ కూడా లేక పోవటం దారుణం. అసలు భరణి గారి క్యారెక్టర్ ని ఎలా ఎండ్ చేసారో కూడా గుర్తు లేదు అంటే ఆలోచించండి అది ఎంత వీక్ థ్రెడ్ అని. ఇంకోపక్క సంపత్ ఫ్యామిలీ ని ఇంట్రడ్యూస్ చేసారు. వీళ్ళు కాకుండా కమెడియన్స్, సినిమాలోని సినిమాలో షూటింగ్ లో హీరో, డైరెక్టర్, హీరోయిన్ ఫ్యామిలీ అంటూ  అబ్బో బోలెడు మంది పరిచయం అయిపోతారు

లక్ష్యానికి అడ్డంకులు: ఆక్ట్ 2: అక్క కి "రావు అకాడమి" లో సీట్ దొరకటం అనేది ప్రాబ్లం, దానిని శక్తి తో సాదించేది కాదు, యుక్తి తో సాదించేది కాదు, సింపతి తో సాదించాల్సింది అని చూపెట్టినప్పుడు నవ్వు తప్ప ఎమోషన్ కలగదు కదిలించదు. ఇంత కంటే బెటర్ ఐడియా రాలేదా అని అనుకోవటం తప్ప ఏమి చెయ్యలేం. ఏదైతేనేం సీట్ వచ్చేసింది, నెక్స్ట్ ప్రాబ్లం కి వెళ్ళే లోపు కాలక్షేపం గా హీరో కి ప్రేమ. లవ్ థ్రెడ్ లో ఎప్పుడు వీక్ గా ఉండే వైట్ల స్క్రిప్ట్ ఈ సినిమా లో ను అలాగే ఉండిపోయింది. వీడియో తీసి అప్లోడ్ చేసింది అని కోపం గా వెళ్లి పాప చూసి పడిపోవటం, అబద్దం ని కొనసాగిస్తూ ప్రొసీడ్ అవ్వటం చిరాకు కలిగించేవి కాక పోయినా టైం తెలియకుండా చేస్తాయి. ఇదే ప్రాసెస్ లో విలన్ కి హీరో కి కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చెయ్యటం అంటే విలన్ వ్యాపారాలపై దెబ్బ తీయటం కూడా మొదలు పెట్టారు. ఈ తొందర చూస్తుంటే సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ లో నే అయిపోతుంది ఏమో అన్నట్టు ఉంటుంది. ఇక్కడ హీరోయిజం పండాల్సిన టైం లో ఫైట్ అయితే పెట్టగలిగారు కానీ అది పండించలేక పోయారు. దానికి కారణం, హీరో కంటే ముందే హీరోయిన్ అక్కడికి వెళ్ళిపోవటం, అసలు ఎందుకు చేస్తున్నాడో కూడా తెలియకుండానే హీరో ఫైట్ లు చెయ్యటం. స్క్రీన్ టైం ని కవర్ చెయ్యటానికి అన్నట్టు ఉంటాయి. ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే అవకాశం కూడా పొరపాటున ఇవ్వలేదు. దానికి తోడు అరుణ్ విజయ్, తన చుట్టూ ఉండే బఫూన్ బ్యాచ్ కనీసం సీరియస్ నెస్ ని దగ్గరానికి రానివ్వరు. సేవ్ చేసినప్పుడు ఒక పాట, అందులో డాన్సు తో లాగేసారు. ఇక్కడ హీరో కి రోడ్ మీద తండ్రి ని చూసినప్పుడు హిందీ లో మాట్లాడించి వీడు వేరే అని సీడ్ వేసారు, ఆ మద్యన చెప్పుకున్న ప్లాంట్ ఇన్ అండ్ పే ఆఫ్ లో భాగం గా. మనం అది కామెడీ అనుకున్నాం, దానిని సెకండ్ హాఫ్ లో వాడుకున్నారు. 

కథనం కి సీరియస్నెస్ తీసుకొచ్చే సీన్, నాగబాబు గారితో మొదలు అవుతుంది, అక్కడ నుంచి మళ్లీ ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తుంది, కారణం ఆ ఎపిసోడ్ అక్క ఆశయం కి సంబందించినది కావటం. మనం కూడా కనెక్ట్ అవుతాం. సినిమా ఫస్ట్ హాఫ్ లో ఫ్యామిలీ సీన్స్ అన్నీ బావుండటానికి రైటింగ్ తో పాటు మనకి స్టార్టింగ్ లో నే కలిగించిన ఇంపాక్ట్ ముఖ్య కారణం అని ఇక్కడ గమనించగలరు. ఆ సీన్స్ తప్ప మిగత వాటిలో నవ్వు వస్తే ఓకే లేదంటే నస అన్నట్టు ఉంటాయి. అక్కకి వచ్చిన ప్రాబ్లం, దాని వలన ఆశయం కి పడిన అడ్డంకి, ఇక్కడ వాడాల్సింది సింపతీ కాదు శక్తి అనే టైమింగ్, అన్ని కలిసి మంచి యాక్షన్ బ్లాక్ పడింది, అప్పటి వరకు ఫైట్ లు ఉన్నప్పటికీ ఈ ఫైట్ కి రెస్పాన్స్ రావటానికి కారణం, ఈ ఫైట్ కి ఒక పర్పస్ ఉండటం, అది హీరో సొంత ప్రాబ్లం అవ్వటం. అక్కడ నుంచి ట్విస్ట్ ఇచ్చి ఒక సాదా సీదా ఇంటర్వెల్ ఇచ్చారు. ఆ ఇంటర్వెల్ ఇచ్చే అవకాశమే లేకుండా అక్కడితో సినిమా కూడా ఆపేసి ఉన్దోచు, క్లైమాక్స్ లో లా అక్క కలెక్టర్ అయినట్టు చూపించేస్తే ఒక పని అయిపోయేది. ఫస్ట్ హాఫ్ లో ఒకప్పటి శ్రీను వైట్ల మార్క్ లేక పోయినా, మంచి సాంగ్స్ తో, ఫ్యామిలీ సీన్స్ తో, ఫిఘ్త్స్ తో టైం పాస్ కి ఢొఖా లేదు అన్నట్టు వెళ్ళిపోతుంది. 

ఈ సినిమా ఎలా ఉన్నా, కమర్షియల్ రిజల్ట్ ఏమయినా, చరణ్ కి మాత్రం పెర్ఫార్మన్స్ పరంగా  హెల్ప్ అయినట్టే చెప్పుకోవాలి. కృష్ణ వంశి సాన పట్టిన టైమింగ్ ని వైట్ల గారు పదును పెట్టారు. కామెడీ టైమింగ్ , సప్తగిరి - హీరోయినే తో ఉండే సీన్స్ లో, రావు రమేష్ తో మాట్లాడే సీన్స్ లో చరణ్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇలాంటి టైం లో గురుజి త్రివిక్రమ్ గారి చేతిలో పడితే ఒక పరిపూర్ణత వస్తుంది ఏమో. ఈ సినిమా లో రకుల్ కూడా మంచి మార్క్స్ కొట్టేస్తుంది, అటు అందాల ఆరబోత లో అయినా, నటన లో అయినా అన్ని వర్ఘాలని అలరించింది.  

సెకండ్ హాఫ్ లో ఎక్కడ పొరపాటున మళ్లీ శ్రీను గారు పాత ఫార్ములా కి వెళ్లి పోతారేమో అని మనం అనుకుంటూనే ఉంటాం. దానికి తగ్గట్టు గానే సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే మళ్లీ కుప్పలు తెప్పలుగా పాత్రలు ఇంట్రడ్యూస్ అయిపోతాయి.   సెకండ్ వైఫ్ అని ఓపెన్ అవ్వటం, చరణ్ కి హీరోయిన్ ఫాదర్ ని కలవాల్సి రావటం. ఇక అక్కడ నుంచి గతి తప్పినది. ఇంటి అడ్రస్ కనుక్కొటానికి హకెర్ ని వాడటం అనే బ్రిలియన్సు నుంచి, డి ఎన్ ఏ టెస్ట్ చేస్తే దొరికిపోయే దానికి ఒక మిషన్ ని క్రియేట్ చేసే ఇంటలిజెన్స్ ఆఫీసర్ వరకు అబ్బో అబ్బో అబ్బో అసలు ఎం జరుగుతుందో ఆలోచించే లోపు కళ్ళు మూసి జెల్ల కొట్టేసారు. మొత్తం తెలుసు కానీ ఎలా ప్రూవ్ చెయ్యాలో తెలియక చరణ్ కి మిషన్ అప్పచెప్పారు అని అనుకోమంటే నేల టికెట్ జనాలు కూడా జాలి పడటం తప్ప ఏమి చెయ్యలేరు. పోసాని సీన్ తోనే సంపత్ క్యారెక్టర్ లో స్త్రెంగ్థ్ చచ్చిపోయింది. పృథ్వి పాత్ర తో నదియ హుందాతనం పోయింది. జనరల్ గా  సెకండ్ హాఫ్ కామెడీ తో పాస్ అయిపోయే వైట్ల ఈ సారి టెంప్లేట్ మారింది అనే భ్రమ లో తిప్పి తిప్పి అదే తీసేసారు. సుజుకి గా బ్రహ్మానందం అలరించక పోగా సహన పరీక్ష పెడతారు. ప్రతి సినిమాలో అయన బకరా అవుతారు, ఈ సినిమాలో ఆయనకి తెలిసి జరుగుతుంది అంతే.   హీరో ఒక సారి సంపత్ ఇంట్లోకి వచ్చి పడ్డాక, శాడిస్ట్ హస్బెండ్ ఎపిసోడ్ మొదలు అయ్యాక, పీక్స్ కి వెళ్ళిపోయి, ఒకప్పుడు కామెడీ పండించిన త్రిమూర్తులేనా ఈ థ్రెడ్ రాసుకున్నది అనిపించక మానదు. సంపత్ పాత్ర దిగజారిపోతు ఉంటుంది, అరుణ్ విజయ్ కోమా లో ఉంటాడు, అసలు కలెక్టర్ పరీక్ష అయ్యాక ఇంటర్వ్యూ ఏమయ్యిందో తెలియదు, అన్నయ్య ఎక్కడికేల్లాడో ఐడియా లేదు, పెదనాన్న డేట్స్ అయిపోయి ఉంటాయి, ఇన్ని సమస్యలు వదిలేసి డ్యూయల్ రోల్ డ్రామా మొదలు అవుతుంది . మొదట్లో వేసుకున్న ప్లాంటింగ్ కి  పే ఆఫ్ అన్నట్టు, కానీ దానిని సరిగ్గా వాడుకోకుండా షర్టు మారిస్తే చాలు అన్నట్టు గా వాడుకోవటం శోచనీయం. ఇలా వ్రాసుకుంటూ పోతే, సినిమా చూస్తున్నప్పుడు కలిగిన ఫీలింగ్ ఏ కలుగుతుంది, ఎప్పుడు ఆపుతావు రా బాబు అన్నట్టు. అక్కడ నుంచి మళ్లీ ట్విస్ట్ ఇచ్చి క్లైమాక్స్ కి దారి వేశారు.

ముగింపు: ఆక్ట్ 3: ఎక్కడో మొదలు పెట్టి, ఎక్కడికో తీసుకేల్లిపోయిన కథనం కి ఇంకేదో ముగింపు ఇవ్వటం అనేది బహుశా ఈ సినిమా లోనే సాధ్య పడింది ఏమో. షిప్ ఫైట్ తో అయిపోయిన సినిమా ని, అయ్యో అసలు విషయం మర్చిపోయాను అన్నట్టు, తండ్రి కి కొడుకు గొప్ప తనం చెప్పేలా ఒక సీన్ వేసుకొని, పోనీ అక్కడ అయినా అయిపోయిందా అంటే అక్కడ నుంచి కిడ్నాప్ డ్రామా మొదలు పెట్టి చిరంజీవి గారి సీన్ కి లీడ్ వేసారు. ఎంత ఘోరం కాక పోతే, జస్ట్ స్టంట్ మాన్ ఫోన్ చేస్తే 150 సినిమా ఫోటో షూట్ లో ఉన్నా మెగాస్టార్ వచ్చెయ్యటం ఏంటి? కనీసం బ్యాక్ స్టొరీ లో అయినా, బ్రహ్మాజీ కి అవార్డు వచ్చింది నీ వాళ్ళ అని ఇండస్ట్రీ లో చెప్తున్నారు, నీ వర్క్ బావుంది, నా 150 కి నువ్వే ఫైట్ మాస్టర్ అని ఒక డైలాగ్ చెప్పించినా బావుండేది. స్క్రీన్ మీద చిరంజీవిని చూసాం అనే సంతృప్తి, సినిమా అయిపోబోతుంది అనే ఆనందం తప్ప పర్పస్ లేని సీన్ అది. 

ఫస్ట్ హాఫ్ వరకు ఎలాగోలా మేనేజ్ చేసినా, సెకండ్ హాఫ్ డీల్ చెయ్యటం లో క్లారిటీ లేక, మూల కథ ని పక్కన పెట్టేసి, ఏదేదో చేసేసి, క్లైమాక్స్ లో చిరంజీవి చూసుకుంటారు లే అని చుట్టేసినట్టు అనిపిస్తుంది. విలన్ అనే వాడికి హీరో అనేవాడు తన శత్రువు అని, అసలు దేనికోసం ఇదంతా చేస్తున్నాడు అని క్లైమాక్స్ వరకు తెలియదు, అప్పటికే స్త్రెంగ్థ్ లేని ఆ పాత్ర క్లైమాక్స్ ని ఎలా నిలబెడుతుంది.  అసలు సెకండ్ హాఫ్ లో ఇదంతా చెయ్యాల్సిన అవసరమే లేదు. సాఫ్ట్ గా ఉంటూనే, అసలు కలెక్టర్ అవ్వాల్సిన అక్క ఇంటర్వ్యూ టైం లో విలన్ అడ్డంకులు సృష్టించటం, అక్కడ హీరో కష్టపడటం, అది కళ్లారా చూసిన తండ్రి హీరో ని అర్ధం చేసుకోవటం, అంటూ మెయిన్ థీమ్ చుట్టూనే కథని అల్లుకుని ఉంటె కనీసం ప్రేక్షకుడు అయినా కథనం తో కనెక్ట్ అయ్యేవాడు.  రెగ్యులర్ టచ్ నుంచి బయటికి రావటానికి ఇదొక మంచి లైన్ గా అయినా ఉండేది వైట్ల గారికి. ఒకే ఒక డౌట్ అయితే మిగిలిపోయింది, లాస్ట్ లో రకుల్ రెండు ఫార్మ్స్ ఇస్తుంది చరణ్ కి, దేనికి అంటే పోలీస్ అవ్వాలి కదా అంటుంది, ఒకటి ఇంటర్మీడియట్ అప్లికేషను అనుకోవాలి ఏమో (సినిమాలో ఒక దగ్గర ఇంటర్మీడియట్ ఏ పాస్ అవ్వలేదు నా కొడుకు అంటాడు రావు) మరి ఇంకోటి ఏంటి అంటారు? మన క్యారెక్టర్ గురుంచి మనమే మర్చిపోతే ఇలాంటి ఎపిసోడ్స్ ఏ రాసుకుంటాం


చివరిగా :  ఈ సినిమా వరకు డాన్సులు, ఫైట్ లు, అక్కడక్కడ నవ్వించే కామెడీ, క్లైమాక్స్ లో  వచ్చే చిరంజీవి, ఇంప్రూవ్ అయిన చరణ్ (అపరిచితుడు ఆణిముత్యం పక్కన పెడితే)  - ఇవి చాలు ఫాన్స్ హ్యాపీ గా చూసుకోటానికి, మరి మనకి?. ప్రామిసింగ్ గా స్టార్ట్ అయినా, సెకండ్ హాఫ్ లో గతి తప్పి, కొంచెం ఓపిక పడితే తప్ప చూడలేం అనిపించేలా చేసింది. ఆగడు లో విషయం వీక్ పబ్లిసిటీ పీక్ టైపు లో ఈ  సినిమా లో సెల్ఫ్ గోల్ ఒకటి ఉంది ఒక ఫైట్ మాస్టర్ (రైటర్?) తన డైరెక్టర్ గురుంచి అనుకుంటాడు మనసులో  "కంటెంట్ లేదు కానీ, క్లైమాక్స్ లో అన్ని కావాలి వీడికి". 


మొదట్లో ఒక కోట్ వేసారు, దానిని ఇలా మార్చేసి ఉంటె బావుండేది "సాఫీ గా సాగిపోయే సినిమా గురుంచి ప్రార్దించకు, ఎలాంటి సెకండ్ హాఫ్ ని అయినా  తట్టుకొని కూర్చొనే సహనం కోసం ప్రార్దించు." - ఏ శ్రీను వైట్ల వాయిస్ ఓవర్

చరణ్ మొదటి నుంచి ఒకే రకమైన సినిమాలు చేయ్యటం వలన యావరేజ్ గా నేట్టుక్కోచ్చేసినా ఫ్యాన్ బేస్ ఎక్స్టెండ్ అవ్వలేదు, కొంచెం ఆ మూస నుంచి బయటికి వచ్చి కొత్తగా ట్రై చెయ్యాల్సిన టైం ఎప్పుడో వచ్చింది అని ఇప్పటికైనా తెలుసుకుంటే బెటర్.  ఈ సినిమాలో ఒక డైలాగ్ "ఫాన్స్ అన్నాక పోసిషన్ బట్టి మారిపోరు" కాబట్టి వాళ్ళతో పాటు కొత్త ఫాన్స్ ని సంపాదించుకునే పనిలో పడాలి ఇప్పటికైనా. మెగా ఫాన్స్ అండ ఎప్పుడు ఉంటుంది, వారసుడు కాబట్టి, న్యూట్రల్ జనాలని రంజింప చెయ్యాలి, అప్పుడే బర్న్ అయిపోతున్న కెరీర్ టర్న్ అవుతుంది - జై పాతాళం బాబా




7 comments:

Unknown said...

Awesone review andi:)

Anonymous said...

Chaala teliviga bagoledu ani cheppakunda cheppav kada. Review conclusion bagole movie lage

Anonymous said...

Meru cheptunattu second half big blunder anna... Superb review

Ravi said...

As usual kunmesaru raju garu

charan fan said...

charan idi drustilo petukovali ఫాన్స్ అన్నాక పోసిషన్ బట్టి మారిపోరు

Anonymous said...

Rape chesi paresaru ga ma cinema ni

aditya said...

Hahha asalu first half ki second half ki link ye ledu

aina shiyahi shinde gaadu police offer ye ga, aadiki IB Chief Mukesh rishi illu teliyadaa

Aa Arun vijay role ne penchi, interval taruvata vaadu komalonchi lese time ki kruthi collector aipovadam etc choopionchi, first half lo laage rao ramesh/krithi tho charan ki scenes petti aa bonding inka chopinchi unte rao ramesh realise ayye scens avi etc baaga vacchevi

chiru entry kooda forced ye atleast sampath ni last lo arrest chesesinattu choopinchi, nannu lopalesav but nee heroine inko 5 mins lo out ani villain annatu choopinchi chiru entry/fight petti aa gurram shot thote ending icchian at least fans varaku anan manchi feeling tho vacchevaaru baitaki

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views