నాన్నకు ప్రేమతో - కథ, కథనం - విశ్లేషణ
జనరల్ గా మనకి ఒక్కో డైరెక్టర్ నుంచి వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది అని ముందుగానే కొన్ని అభిప్రాయాలుంటాయి, కానీ కొందరు డైరెక్టర్ల నుంచి వచ్చే సినిమా అనేసరికి ఈ సారి ఎం తీస్తాడో, ఎలా తీస్తాడో అనే ఆత్రుత ఉంటుంది. ఆ కొందరు డైరెక్టర్లలో సుకుమార్ సర్ ఒకరు. చాలా వరకు సినిమాలు అలా కూర్చోబెట్టి కాలక్షేపం చేసి పంపెస్థాయి, కానీ సుకుమార్ గారి కొన్ని సినిమాలు మన మెదడు కి పని పెడతాయి. కమర్షియల్ లైన్స్ ఎంచుకుంటారు, టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో ప్రెసెంట్ చేస్తారు, కాక పోతే "విజ్ఞాన ప్రదర్శన" చేస్తూ ఉంటారు. అతి చిన్న విషయాల వరకు వెళ్లి డీటైలింగ్ చేసే విధానం అబ్బుర పరుస్తుంది కానీ ఒక్కోసారి ఇంత చిన్న విషయాన్నీ అంత కాంప్లికేట్ చెయ్యలా అనిపిస్తుంది. నేనొక్కడినే తర్వాత ఎన్ టి అర్ తో నాన్నకు ప్రేమతో అనేసరికి ఎవరి అంచనాలు, ఎవరి భయాలు వాళ్ళకి ఉన్నాయి. దానికి తగ్గట్టు గానే టాక్ కూడా రకరకాలుగా వచ్చింది. దీనితో పాటు రిలీజ్ ఆయిన కమర్షియల్ సినిమాలు, వాటి టాక్ లు, వాటితో కంపారిజన్ లు, ఆ హడావుడి అంత సద్దుమనిగే వరకు ఆగటం మంచిది అనిపిచింది. ఈ విశ్లేషణ మొదలు పెట్టె ముందు నా ఎమోషన్ జీరో ఉండాలి అని, మిగతా సినిమాల ఎమోషన్ ఇక్కడ రాకూడదు అని వాటి విశ్లేషనలు ముందు పూర్తి చెయ్యాల్సి వచ్చింది. నౌ మై ఎమోషన్ ఈస్ జీరో.
ఎప్పుడూ చెప్పేదే అయినా ఈ సారి కొత్త గా "ఈ సినిమా పై మీ ఎమోషన్ జీరో అయితేనే ఈ విశ్లేషణ చదవండి, అది ప్రేమ అయినా, కోపం అయినా, నిరాశ అయినా వేరే ఏదైనా సరే ముందు ఆ ఎమోషన్ ని జీరో చేసుకొని వచ్చి అప్పుడు చదవండి". లేదు కాదు కూడదు అంటే చదివిన తర్వాత వేరే ఎమోషన్స్ ఇక్కడ చూపించకండి :) జీరో ఎమోషన్స్, జీరో అంచనాలు...
కొంచెం అతిగా అనిపించొచ్చు కానీ అయన సినిమా అనేసరికి మనకి ఆటోమేటిక్ గా విజ్ఞాన ప్రదర్శన చెయ్యాలనిపిస్తుంది మరి
కథ : సింపుల్ గా చెప్పాలి అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న రెగ్యులర్ రివెంజ్ స్టొరీ. తండ్రి ని మోసం చేసిన వాడిని దెబ్బ తీసిన కొడుకు స్టొరీ. అది తండ్రి చివరి కోరిక అయినప్పటికీ అన్నలు పెద్దగా పట్టించుకోక పోవటం, మోసం చేసిన వాడు ఆస్తి లో బిజినెస్ లో కొడుకు అందుకోలేని అంత ఎత్తుకి ఎదిగి ఉండటం, బాగా ఇంటెలిజెంట్ అవ్వటం, అసలు వాడి పతనం అనేది 30 రోజులలో జరిగిపోవాలి అనే టైం లిమిట్ ఉండటం ఇవన్ని ప్రతిబంధకాలు.. కొడుకు ఎలా సాదించాడు అనేది సినిమా. ఇదే లైన్ ని మాస్ హీరో ని పెట్టి మంచి మసాలా సినిమా తీయటం సొమ్ములు చేసుకోవటం పెద్ద మేటర్ కాదు కానీ, రిస్క్ అయినా కూడా ఇంటలిజెన్స్ ని ఆయుధం గా వాడటం ఈ సినిమా ని సుకుమార్ గారి సినిమాగా మార్చేసింది.
కథనం: చెయిన్ రియాక్షన్స్ - బట్టర్ ఫ్లై ఎఫెక్ట్స్ (దశావతారం మూవీ కొంచెం అటు ఇటు గా దీనిని బేస్ చేసుకునే ఉంటుంది) అని చెప్పి గొలుసు కట్టు స్క్రీన్ప్లే విధానం ని ఎంచుకున్నారు. లాస్ట్ లో జరగాల్సిన దానికి ఒక్కొక్క సీన్ ముందుకి పేర్చుకుంటూ వచ్చేసారు. టైటిల్స్ కి ఆ డిజైన్ ఎందుకు ఎంచుకున్నారు అని సినిమా అయ్యాక తెలుస్తుంది, ఈ విషయం లో సుకుమార్ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేం అనిపిస్తుంది. ఈ సినిమా వరకు క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్, మన ప్రశ్నలు అన్నిటికి సమాధానం దొరకాల్సిన చోటు అదే. అప్పటి వరకు మనకి ఉన్న ప్రశ్నలు అన్ని క్లైమాక్స్ లో సాల్వ్ ఐనట్టే ఉన్నప్పటికీ బయటికి వచ్చి కూర్చొని ఆలోచిస్తే మిగిలిపోయిన ప్రశ్నలు కూడా ఉంటాయి. ఈ విశ్లేషణ ని కూడా సినిమాలో చూసిన సీనిక్ ఆర్డర్ లో కాకుండా, ఓవరాల్ గా ఎపిసోడ్స్ గా చెప్పుకొటం బెటర్ అని నా ఉద్దేశం.
ప్రారంభం : ఎక్కడ ఎమోషన్ అక్కడే తీర్చేసుకోవాలి అని ఉదాహరణ చెప్తూ హీరో ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సినిమా కథ మొత్తం ప్రధమ పురుషుడు ద్రుష్టి కోణం లో నడుస్తుంది (మెయిన్ క్యారెక్టర్ పాయింట్ అఫ్ వ్యూ) అందుకే చాల వరకు సీన్స్ మనము కూడా హీరో కోణం లోనే చూస్తాం. అక్కడ నుంచి హీరో కంపెనీ పెట్టడం, దానిలో జాయిన్ అవ్వటానికి లండన్ స్టాక్ ఎక్స్చేంజి లో ఆడిన గేమ్ - వన్ పౌండ్ కి ట్రేడింగ్ చెయ్యొచ్చా? - అక్కడ మోసం చేసి (ఇది గుర్తు పెట్టుకోండి, లాస్ట్ లో మాట్లాడుకుందాం) - ఆక్సిడెంట్ ఫేక్ అని వీడియో చూస్తే తెలియక పోవచ్చు కానీ కొడుకు ని అడిగితే తెలుస్తుంది గా ఆ తల్లి కి ? - ఒకతని తో పెట్టుబడులు పెట్టించి తను నమ్మకం సంపాదించుకోవటం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చెయ్యటం. ప్రాబ్లం ని ఎస్టాబ్లిష్ చేసే ముందు హీరో ని ఎస్టాబ్లిష్ చేసారు. ఇంతలో తండ్రికి వొంట్లో బాగోలేక పోవటం, తండ్రి నెల రోజులు కంటే బ్రతకటం కష్టం అని తెలుసుకోవటం. చిన్నప్పటి నుంచి తండ్రి డైరీ చదివి అంత బాధ ని దిగమింగి నవ్వుతు కనిపించిన నాన్న కి ప్రేమతో అయన చివరి కోరిక తీరుస్తా అనటం తో ప్రాబ్లం ఎస్టాబ్లిష్ చేసారు. జనాలతో పెట్టుబడి పెట్టిచిన రమేష్ చంద్ర ప్రసాద్ వెంచర్ ని ప్రభుత్వం ఎకో జోన్ గా ప్రకటించటం వలన కంపెనీ దివాలా తీసేస్తుంది. ఇదంతా వెనకా ఉంది నడిపించింది కృష్ణ మూర్తి. అప్పటి నుంచి ఐడెంటిటీ మార్చుకొని సుబ్రహ్మణ్యం గా బ్రతుకుతున్న తండ్రి చనిపోయే లోపు కృష్ణ మూర్తి పతనం చూడాలి అనుకుంటాడు, రమేష్ చంద్ర గా చచ్చిపోవాలి అని ఆశపడతాడు. ఇక్కడ క్యాచ్ చెయ్యాల్సిన ఒక పాయింట్, హీరో కి చిన్నప్పుడే గ్రాండ్ మాస్టర్స్ తో చెస్ నేర్పించాడు తండ్రి. (సీడ్ - ప్లాంటింగ్)
సమస్యాత్మకం : పెద్దన్నయ వొప్పుకోడు, రెండో అన్నయ్య ఉన్నా పట్టించుకోడు, చివరి కొడుకుగా ఆ భాద్యత బుజాలపై వేసుకుంటాడు. (ఒకడే కొడుకు అయ్యి ఉంటె సుమారు గా ఉండేది, ఇద్దరు కొడుకులు అయ్యి ఉంటె వాళ్ళిద్దరూ గొడవలు పడే వాళ్ళు, ముగ్గుర్ని పెట్టి, మద్య లో వాడు ఒక్కోసారి అటు ఒక్కోసారి ఇటు చెప్తూ ఉంటె ఇద్దరు చేసేది కరెక్ట్ ఏ అని మనం కూడా కన్విన్సు అవుతాం). ఇప్పుడు రివర్స్ స్క్రీన్ప్లే వేసుకుంటే, కృష్ణ మూర్తి తెలివైన వాడు అని తెలుసు, అతనిని డైరెక్ట్ గా కలవలేము అని తెలుసు, తన ఫేక్ కంపెనీ లో పెట్టుబడులు పెట్టించాలి, తండ్రి చెప్పిన సత్పాల్ సింగ్ ఉన్నాడు, కృష్ణ మూర్తి ఆస్తి కొట్టెయ్యాలి, అంటే బ్యాంకు ఎకౌంటు హ్యాక్ చెయ్యాలి, అంటే ఆఫీసు లో కెమెరా పెట్టాలి, కూతురు ని వాడుకోవాలి, కూతురు ని కలిసాక తెలిసిన విషయం కెమెరా పెయింటింగ్ లో పెట్టొచ్చు, అది అక్కడ పెట్టాలి అంటే సీట్ పోసిషన్ మర్చ్చాలి. దానికి సోర్స్ కావాలి, సో ఫస్ట్ టార్గెట్ కూతురు. ఆపరేషన్ జీరో.
హీరోయిన్ కి కాఫీ మిస్ అయ్యింది, హీరో ని కలిసింది, కాఫీ మళ్లీ మిస్ అయ్యింది మళ్లీ హీరో ని కలిసింది, మూడోసారి కలవాల్సి వచ్చింది, ఇదంతా ట్రాప్ లా ఉంటుంది తప్ప లవ్ లా ఉండదు. ఈ మొత్తం ప్రాసెస్ లో హీరో ఇంటెలిజెంట్ అని ప్రూవ్ చెయ్యటానికే అన్నట్టు ఉంటుంది. మేజిక్ చేస్తే ఇంప్రెస్స్ అవుతారు కానీ లవ్ చెయ్యరు టైపు లో నే. ప్రకృతి హెల్ప్ చెయ్యాలి అప్పుడు నమ్ముతాను అంటుంది. అలాంటి సందర్భం వస్తుంది, ప్రకృతి కూడా హెల్ప్ చేస్తుంది - హీరో ప్రేమ కి కాదు కానీ పగ కి - హీరోయిన్ కోసం వెతుకుతున్న హీరో ని చూస్తుంటే ప్రేమ కంటే తిను నా సోర్స్, నేను మిస్ అయితే ఏది సాధించలేను అనే తపన కనపడుతంది. ఫైట్ పెట్టాల్సిన దగ్గర 45 డిగ్రీస్ - ఆంటి క్లాక్ తిప్పమని టెస్ట్ పెడతాడు, ఆక్సిస్ చెప్పక పోయినా, ప్రొట్రాక్టర్ లేక పోయినా కరెక్ట్ గా పెట్టేస్తుంది. ఆ యాంగిల్ మారిపోయి ఉంటె ఏమయ్యేదో. మొత్తం మీద కృష్ణ మూర్తి ని కలిసే అవకాశం సంపాదిస్తాడు. అప్పటి వరకు కొంచెం అతిగా అనిపించే సీన్స్ ఉన్నా కూడా, సాంగ్స్ కూడా ఉండటం వలన సాఫీగానే వెళ్ళిపోతుంది మన లైఫ్.
ఫస్ట్ లుక్ లో నే హీరో మోటివ్ పట్టెస్తాడు తెలివైన కృష్ణ మూర్తి. తను ఎప్పుడు ఆడే బాల్స్ ఆట ముందు పెడతాడు. గోల్డ్ తీస్తే అమ్మాయి నీదే అంటాడు. హీరో గోల్డ్ తీస్తాడు. ఆ లాజిక్ గురుంచి కొంచెం
తెలివి తక్కువ వాడు : ఫస్ట్ బ్లఫ్; ముందు ఉన్న బాల్ లో గోల్డ్ ఎందుకు ఉంటుంది లే అని వెనకది తీసుకుంటాడు - వొడిపోతాడు
తెలివైన వాడు : డబల్ బ్లఫ్: ముందున పెడితే గోల్డ్ లేదు అనుకుంటాను అనేది నీ ప్లాన్ కానీ అందులోనే గోల్డ్ ఉంది అని నాకు తెలుసు అనుకోని ఫస్ట్ ది తీస్తాడు - వొడిపోతాడు
అతి తెలివైన వాడు : ట్రిపుల్ బ్లఫ్ (సేమ్ యాస్ బ్లఫ్): సెకండ్ లాజిక్ కంటే ఎక్కువ ఆలోచిస్తున్న అనుకోని ఫస్ట్ లాజిక్ ట్రాప్ లో పడిపోతాడు - వొడిపోతాడు
హీరో ; మూడవ లాజిక్ ని నెగటివ్ గా అలోచించి సెకండ్ ఆప్షన్ ఎంచుకొని ముందు ఉన్న బాల్ తీసి గెలుస్తాడు. రివర్స్ బ్లఫ్
అక్కడ ఉన్నవి రెండే కాంబినేషన్ లు మిగతా అన్ని పెర్ముటెశన్ లు
అక్కడ ఉన్నవి రెండే కాంబినేషన్ లు మిగతా అన్ని పెర్ముటెశన్ లు
అప్పటికే వేడి తో బుర్ర ని కూల్ చెయ్యకుండా, ఇంకా అడుగు ముందుకేసి, కంప్యూటర్ లో ఎకౌంటు చూపించటం (పాస్వర్డ్ కి డివైస్ చూసుకోకుండా), హీరో నవంబర్ 1 ఛాలెంజ్ చెయ్యటం, ఎకౌంటు హ్యాక్ చేయ్డడం అని డిసైడ్ అవ్వటం, హీరో దగ్గర డబ్బులు అయిపోవటం - ఇదంతా కృష్ణ మూర్తి బగ్ పెట్టుకొని వినటం తో ఇంటర్వెల్. జనరల్ ఇంటర్వెల్ బ్యాంగ్ కి అలవాటు పడిన మనకి ఈ 20 నిమిషాల తతంగం టూ మచ్ టు టేక్ ఇన్సైడ్ అవుతుంది. అది సుక్కు స్టైల్. హీరో పాయింట్ అఫ్ వ్యూ లో నడిచే కథ కాబట్టి బగ్ ఎప్పుడు పెట్టారు ఏంటి అని చెప్పకుండా, బగ్ అయితే పెట్టారు అనేది హీరో కి తెలుసు అని మాత్రమె చూపించారు.
ఇదేదో ఇద్దరు తెలివైన వాళ్ళ మద్య జరగబోతున్న ఒక అతి తెలివైన వాడి కంటే తెలివైన డైరెక్టర్ తీయబోతున్న మైండ్ గేమ్ అని మనం సెకండ్ హాఫ్ కి రెడీ అవుతాం.
ప్రాబ్లం ని ఇంకా పెద్దది చేసేలా, తండ్రి హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సి రావటం, అప్పటి వరకు అరకొర గా ఉన్న అన్నయ్య సపోర్ట్ కూడా పూర్తిగా పోవాల్సి రావటం జరుగుతాయి. తండ్రి కి తన మీద ఉన్న నమ్మకమే హీరో కి మోరల్ సపోర్ట్. అప్పటి వరకు ప్రేమ గురుంచి మాట్లాడని హీరో తండ్రి తో నాకు ప్రేమ దొరికింది అంటాడు, అంటే తను ప్రేమించక పోయినా (తనకి సంబందించినంత వరకు హీరోయిన్ తనకి ఒక సోర్స్) తనని ప్రేమించే అమ్మాయి దొరికింది, సో తనని వదులుకోకూడదు అనేది సెకండ్ టార్గెట్ అయ్యింది. తను ముందు చూసిన స్క్రీన్ లో ఎకౌంటు నెంబర్ హీరో చెప్పెయ్యటం మనకి ఎక్కువ అనిపించొచ్చు కానీ, పడి మంది గ్రాండ్ మాస్టర్స్ తో చెస్ ఆడిన వాడికి, పడి బోర్డ్స్ లో పోసిషన్ అండ్ మూవ్స్ చిన్న వయసులోనే గుర్తు పెట్టుకున్న వాడికి అది పెద్ద విషయం కాదు ఏమో. కెమెరా పెట్టింది ఎకౌంటు హ్యాక్ చెయ్యటానికి అనుకున్నప్పుడు, పాస్వర్డ్ డివైస్ గురుంచి తెలియక పోవటం వలన హీరో అర్ధ రాత్రి డబ్బుల కోసం కృష్ణ మూర్తి ఇంటికి వెళ్ళాడు అనుకుందాం. అప్పటి వరకు తెలివైన వాడిలా కనిపించిన కృష్ణ మూర్తి బగ్ వలన ప్లాన్స్ తెలిసి బెడిసి కొడుతునట్టు చూపించారు కానీ, తను ఆడిన మైండ్ గేమ్ లా ఏది చూపించలేక పోయారు. ఈ ఎపిసోడ్ వలన హీరోయిన్ ప్రేమ ఫెయిల్ అయినట్టు, అప్పటికే తన ప్రేమ తెలుసుకున్న హీరో తన కోసం వెనక పడినట్టు చూపించటానికి ఉపయోగ పడింది. ఇలా సింపుల్ గా చెప్పేసుకున్నా, దీని తర్వాతే ఆపరేషన్ LEAD మొదలు అవుతుంది. రైటింగ్ లో అద్బుతం ఇక్కడ కనిపిస్తుంది. లవ్ గురుంచి అప్పటి వరకు ఉన్న డౌట్స్ ని క్లియర్ చేసేసే ఎపిసోడ్. సెకండ్ టార్గెట్ ని ఫస్ట్ టార్గెట్ ని కలిపి కొట్టిన దెబ్బ.
ఆపరేషన్ లీడ్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా - మూడు రోజుల ముందే వస్తే, ఆ రోజు ఎయిర్పోర్ట్ కి ఎందుకు వచ్చినట్టు - తను కెమెరా పెట్టాడు, తన దగ్గర బగ్ ఉంది అన్న విషయం కూడా తనకి తెలుసు, ఇది తను వేసిన ట్రాప్. చెస్ ప్లేయర్ గా తనే ఎదుటి వాళ్ళకి లీడ్ ఇచ్చి, వాళ్ళతో స్టెప్ వేయించి, తనకి కావాల్సిన స్టెప్ వేసాడు అంతే. అసలు ఆ గ్యాస్ ప్రాజెక్ట్ ఆపించటం తన ప్లాన్ ఏ కాదు, ఆ మొత్తం ఆపరేషన్ ఏ D అంటే తన సెకండ్ టార్గెట్ ఏ. చాలా ఇంపార్టెంట్ అయిన ఈ ఎపిసోడ్ మొత్తం తొందరగా చుట్టేసినట్టు అనిపిస్తుంది, మద్య లో కామెడీ అని అనవసరం గా స్రీన్ టైం వేస్ట్ చేసినట్టు, అన్నిటికి మించి D అంటే డ్రీం అని మంచి పే ఆఫ్ ఉన్న సీన్ ని సాంగ్ కి వాడుకున్నారు. అసలు హీరోయిన్ కి చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ లేదు, కనీసం అమ్మ ఎలా ఉంటుంది నాన్న అని ఒక ఫోటో కూడా అడిగి ఉండదా?. హాస్పిటల్ లో ఫైట్ ప్లేస్ లో ఈ ఎపిసోడ్ డెవలప్మెంట్ చూపించినా బావుండేది.
ముగింపు: సెకండ్ టార్గెట్ కూడా పూర్తి అయిన హీరో కి ఇంక మిగిలింది మెయిన్ టార్గెట్, ఈలోపు అన్నయ్య కి రియలైజేషన్ సీన్ బాగా వ్రాసుకున్నారు, హడావుడి లో డేట్ తప్పు చెప్పించారు. అక్కడ ఫైట్ పెట్టి అంత టైం తీసుకునే బాధలు క్లైమాక్స్ లో ఇంకాస్త టైం స్పెండ్ చేసి ఉండాల్సింది. షాపింగ్ లు అవి అయ్యాక, ఫైనల్ గా చేసింది హ్యాకింగ్. సింపుల్ గా తేల్చేసారు. అప్పటి వరకు ఉన్న ఇంటలిజెన్స్ అక్కడ మిస్ ఐన ఫీలింగ్. ఎం పర్లేదు నాకు గ్యాస్ ఫీల్డ్ ఉంది అంటే అది సిలిండర్ అన్నారు. ఇంతకి రమేష్ చంద్ర గా చచ్చిపోవాలి అన్న నాన్న కోరిక ఎక్కడ తీరింది? అయన మోసగాడు కాదు, అవన్నీ చేసింది కృష్ణ మూర్తి అని ఎక్కడా ప్రూవ్ చెయ్యలేదు. అప్పటి వరకు ఉన్న ప్రశ్నలకి సమాధానం ఇచ్చేసారు అని ఫీల్ అయ్యి టపి మని తేల్చేసి లేపేసారు. అసలు అక్కడ లైసెన్స్ ఇచ్చిన గవర్నమెంట్ ప్రొవెన్ రేజేర్వ్ లేకుండా ఎలా ఇచ్చినట్టు ? అది కూడా సిలిండర్ పెట్టి మేనేజ్ చేసారా? గవర్నమెంట్ ని మేనేజ్ చేసారా? మరి కోట్లు ఖర్చు పెట్టిన కృష్ణ మూర్తి ఆ మాత్రం బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా దిగిపోయాడా? అసలు ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ ఐడియా ఉన్నవాళ్ళకి ఇది చాలా సిల్లీ గా ఉంటుంది. హీరోయిన్ మదర్ ఫాలో అప్ ఏది? అసలు హీరో ఫాదర్ కి సన్స్ కి మద్య రిలేషన్ - బాండింగ్ ఏది? అయన చేసిన బిజినెస్ - పతనం, ఆ తర్వాత అయన పాట్లు ఇంకా డిటైల్డ్ గా చూపించాల్సిన అవసరం లేదా? మైన స్టొరీ పాయింట్ అయిన కృష్ణ మూర్తి - రమేష్ చంద్ర మద్య ఎక్కువ సీన్స్ అవసరం లేదా? ఎయిర్పోర్ట్ లో ఒక పాసెంజర్ డ్రగ్స్ తో దొరికితే ఆవిడతో వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి బ్యాక్ గ్రౌండ్ ఆరా తీయరా? అంత ఇంటెలిజెంట్ కృష్ణ మూర్తి మొత్తం డబ్బులు ఒక దగ్గరే పెట్టుకున్నడా? ఎక్కడో దగ్గర బ్లాకు లో దాచుకొనే ఉంటాడు గా (హీరో తండ్రి లా నిజాయితి పరుడు కాదు గా). సో ఇప్పుడు వచ్చిన నష్టం ఎం లేదు, అక్కడికి వెళ్లి బ్రతికేస్తాడు?
ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, అవన్నీ ఇంకో పార్ట్ తీసి సమాధానాలు అందులో చూపిస్తారేమో వెయిట్ చెయ్యాలి.
మొదట్లో ఏదో గుర్తు పెట్టుకోమన్నాను ఏంటి అది, హీరో చేసిన మోసం, ఇప్పుడు అక్కడ లవర్ కం సెక్రటరీ చేయించిన సంతకం వలన లాస్ అయిపోయి, ఆస్తులు పోయి, అయన వదిలేస్తే రోడ్ మీద పడిపోయిన ఆవిడ కొడుకు, అమ్మ కి ప్రేమతో అని రివెంజ్ కి బయల్దేరితే ఇంకో పార్ట్ తీసుకోవచ్చు ఈ సినిమా కి పైన ప్రశ్నలకి కూడా డిటైల్డ్ గా సమాధానాలు ఇవ్వొచ్చు.
చివరిగా : ఇంటలిజెన్స్ మీద పెట్టిన శ్రద్ధ ఎమోషన్ ఎస్టాబ్లిష్ చెయ్యటం మీద పెట్టి ఉంటె ఇంకా బావుండేది. ఒక రెగ్యులర్ రివెంజ్ డ్రామా కి సుకుమార్ స్పార్క్స్ తోడై అక్కడక్కడా అబ్బురపరిచినా, కంప్లీట్నెస్ మిస్ అయ్యింది. ఎన్ టి అర్ వరకు కొత్తగా డేరింగ్ గా ట్రై చేసే అవకాశం దొరికింది, దానికి తగ్గట్టు గా తన వంతు లోపం లేకుండా నటించి మెప్పించాడు. ఓపెన్ ఐటమ్స్ పక్కన పెడితే, ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం చూసినప్పుడు (ఓపిక ఉంటె) ఇంకా బాగా ఎంజాయ్ చెయ్యగల స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. మెదడు కి పని పెట్టె ఈ సినిమా రెగ్యులర్ మాస్ మసాలా మూవీ లవర్స్ కంటే ఎన్ టి అర్ కి ఇప్పటి వరకు దూరం గా ఉంటున్న క్లాసు ప్రేక్షకులకి తనని దగ్గర చేస్తుంది.
P.S; రివ్యూ పోస్ట్ చేసే ముందు ఒక వెబ్సైటు లో వచ్చిన పోస్ట్ మార్టం చదవటం జరిగింది, సుకుమార్ గారు చెప్తేనే తప్ప అర్ధం కానీ విషయాలు కొన్ని ఉన్నాయి అందులో, అలాగే అయన తీయాలి అనుకోని వేరే కారణాల వలన తీయలేని అండ్ సినిమాలో తీసేసిన సీన్స్ గురుంచి కూడా చెప్పారు. ఒక మాస్టర్ కి చెప్పే అంత స్టూడెంట్ ని కాదు కానీ, మనకి సబ్జెక్టు మొత్తం తెలిసి ఉండొచ్చు, కానీ పరీక్ష మూడు గంటల్లో మనం ఎం వ్రాస్తే దానికే మార్క్స్ పడతాయి. ఎక్షామ్ అయిపోయాక నేను ఇలా వ్రాద్దాం అనుకున్నాను, అడిషనల్ షీట్ దొరకలేదు అంటే కుదరదు. అయినా మార్క్స్ మిస్ అయినంత మాత్రాన సబ్జెక్టు లేని వాళ్ళు అని ఉండదు, ఆ పరీక్ష లో మన పెర్ఫార్మన్స్ అనుకున్న స్థాయి లో లేదు అని మాత్రమె.
7 comments:
As usual super analysis
Main ga Father/Son emotional bonding ye sarigga establish cheyaledu adhey minus
aa Dream episode waste, daniki continuation ga okka scene kooda ledu alantapudu aa episode lepesi, hero-villain mind games pettalsindhi
Climax ki simple ga hacking tho gelavadam valla kick ledhu
one of the best and detailed write up i have ever seen. kudos to your passion sir
as usual ga kummesaru raju garu mukyam gaa last part kevvu keka
very well written and detailed article on nannaku prematho
SUPERB WRITE UP
ULTIMATE LINES
"మనకి సబ్జెక్టు మొత్తం తెలిసి ఉండొచ్చు, కానీ పరీక్ష మూడు గంటల్లో మనం ఎం వ్రాస్తే దానికే మార్క్స్ పడతాయి. ఎక్షామ్ అయిపోయాక నేను ఇలా వ్రాద్దాం అనుకున్నాను, అడిషనల్ షీట్ దొరకలేదు అంటే కుదరదు. అయినా మార్క్స్ మిస్ అయినంత మాత్రాన సబ్జెక్టు లేని వాళ్ళు అని ఉండదు, ఆ పరీక్ష లో మన పెర్ఫార్మన్స్ అనుకున్న స్థాయి లో లేదు అని మాత్రమె."
superb article sir kani meru ranu ranu baga late chesthunnaru, okkosari writing or not kuda teliyatam ledhu. please konchem regular ga rasthu undandi
Post a Comment