CINEMA CINEMA CINEMA - STORY - CONCEPT - SYNOPSIS




సినిమా సినిమా సినిమా - కథ - కథా విస్తరణ 

 మనలో సినిమా పిచ్చ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, రిలీజ్ ఐన ప్రతి సినిమా ని చూస్తూ ఏదో ఒక రోజు నేను కూడా సినిమా కి కథలు రాయాలి అని కలలు కనే వాళ్ళు ఉన్నారు. ఆశక్తి ఉండి ఎం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఎక్కడ మొదలు పెట్టాలో డిసైడ్ అవ్వలేని వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగ పడాలి అనే ఉద్దేశం తో నాకు తెలిసిన, నేను చదివిన, నేను విన్న సినిమా పరిజ్ఞానం గురుంచి టూకి  గా రాద్దాం అనే ఆలోచనే నా ఈ "సినిమా, సినిమా, సినిమా" ఆర్టికల్ సిరీస్ ముఖ్య ఉద్దేశం.



అసలు ఈ సిరీస్ మొదలు పెట్టినప్పుడు ముందుగా మనం చెప్పుకోవాల్సింది కథ గురుంచి, కానీ దాని కంటే ముందు ఇంకొన్ని చెప్పాల్సి వచ్చింది. ఎందుకు ఏమిటి అనేది ఎండ్ లో మాట్లాడుకుందాం. 

ఏదైనా సినిమా గురుంచి మనం చెప్పుకునే అప్పుడు తరచుగా వినిపించే పదం, కాన్సెప్ట్ - బేసిక్ లైన్ - స్టొరీ లైన్, ఎలా పిలుచుకున్నా వాటి వెనక ఉండేది ఒకటే, అదే స్టార్టింగ్ పాయింట్. సినిమాలకు ఇలాంటి కథలే ఎంచుకోవాలి అని రూల్ ఎం లేదు, పేపర్ లో వచ్చే న్యూస్ ఐటెం కూడా ఒక్కోసారి మంచి కథ పుట్టటానికి ప్రేరణ కావొచ్చు. ఈ కాన్సెప్ట్ అనేది మనం చదివే పుస్తకం లో ఒక విషయం కావొచ్చు, చూసే పర బాష చిత్రం లో ఒక మంచి సన్నివేశం కావొచ్చు, ఫ్రెండ్స్ తో మాట్లాడుకునే బాతాకాని కావొచ్చు, ఎక్కడ నుంచి అయినా మనకి స్ఫూర్తి దొరకొచ్చు. మనకి తెలిసిన వ్యక్తుల జీవితాల నుంచి తెరకెక్కిన సినిమాలు ఈ మద్యనే వచ్చిన వీరప్పన్ తో సహా ఎన్నో, అలాగే మనం ఇంతకు ముందు చూసిన సినిమాల నుంచి స్ఫూర్తి పొందిన సినిమాలు కూడా ఎన్నో,  ఉదాహరణ కి విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు పసివాడి ప్రాణం చూస్తుంటే భజరంగి కథ దొరికింది అంట. వసంత కోకిల క్లైమాక్స్ నుంచి సింహాద్రి ఇంటర్వెల్ ఎపిసోడ్ పుట్టింది అంట, ప్రేమాభిషేకం పాత్రలు తిరగ రాస్తే బొబ్బిలి సింహం అయ్యింది అంట.  టూటౌన్ రౌడీ - వర్షం అయినట్టు, స్టేట్ రౌడీ - పోకిరి అయినట్టు, ఇలా చెప్పుకుంటే బోలెడు ఉన్నాయి.  

ఇందుమూలం గా సింపుల్ గా చెప్పొచ్చేది ఏటంటే, "ఇలా ఉంటె వ్యక్తి లైఫ్ లో అలా జరిగితే?" అనే స్టార్టింగ్ పాయింట్ ఏ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ అయిడియా ని ఒకటి లేదా రెండు లైన్స్ లో చెప్పటమే "బేసిక్ లైన్" - "ప్లాట్ లైన్". దీనికి  సింపుల్ ఉదాహరణ

కాన్సెప్ట్: ఎనిమిదేళ్ళ కుర్రాడు సడన్ గా 28 ఏళ్ళ యువకుడు గా మారిపోతే? 

బేసిక్ లైన్ : అమ్మ మీద అలిగిన ఒక బాబు ని సైంటిస్ట్ 28 ఏళ్ళ కుర్రాడు గా మార్చేస్తాడు. ఆ కుర్రాడు అమ్మాయి ప్రేమలో పడి పెళ్లి చేసుకునే వరకు వెళ్తాడు, ఇంతలో అమ్మ బాధ గురుంచి తెలుసుకొని బాబు లా మారిపోదాం అనుకునే టైం కి ప్రయోగం ఫెయిల్ అయ్యి పగలు చిన్న పిల్లాడిలా రాత్రుళ్ళు కుర్రాడిలా మారిపోయే పరిస్థితి వస్తుంది

మరికొన్ని కాన్సెప్ట్ లు: 

సాఫీగా సాగిపోతున్న మద్య తరగతి కేబుల్ ఆపరేటర్ జీవితంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుని తన ఫ్యామిలీ నే కాపాడాల్సి వస్తే? - దృశ్యం 

ఎండ తగిలితే చనిపోయే చిత్రమైన వ్యాధి ఉన్న కథానాయకుడు ఒకమ్మాయి ప్రేమలో పడితే? - సూర్య vs  సూర్య 

ఒక పేద కుర్రోడు, పెద్దింటి అమ్మాయిని ప్రేమిస్తే, ఆమె తండ్రి వొప్పుకోక, ఇతని తండ్రి ని చంపేసి, అక్కని చంపి ఆ హత్య నేరం లో ఇతనిని ఇరికిస్తే? - ఖైది

మతిమరపు వున్న వ్యక్తి ప్రేమలో పడితే? ఆ వ్యక్తికి ఎదురయ్యే సమస్యలు, వాటిని సమయస్ఫూర్తితో పరిష్కరించుకునే విధానాలు? - భలే భలే మగాడివోయ్

తండ్రి పాటించిన విలువల్ని తండ్రి చనిపోయినా ఆయన పేరు మాత్రం ఎల్లప్పటికీ నిలిచిపోవాలనుకునే వాడు.. దాని కోసం ఏం చేసాడు? - సత్యమూర్తి 

చిన్నప్పుడే తల్లి చనిపోయి, తండ్రి కి దూరం అయిపోయి అనాధ గా ఉన్న పేద అబ్బాయి లైఫ్  లో కి అమ్మాయి వస్తే? ఆ అమ్మాయి కి కాన్సర్ ఉంటె? - జాని

ఆవారా గా తిరిగే ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు సిన్సియర్ కమీషనర్ కూతుర్ని ప్రేమిస్తూ వెంట పడితే? బుద్ధి చెపుదాం అనుకున్న కమీషనర్ ఈగో ని టచ్ చేస్తే ? - ఇడియట్ 

(సరదాగా) మగధీర ని కొట్టే లాంటి బొమ్మ కావాలనిపిస్తే - శక్తి , పోకిరి ని దాటిపోయే బొమ్మ తీయాలనిపిస్తే - కంత్రి , బీబత్సమైన టైటిల్ చేతిలో ఉండి, భయంకరమైన కాన్ఫిడెన్సు ఉండి, భారతీయుడు సీడీ చేతిలో ఉంటె - ఒక్క మగాడు, ఏం తీద్దాం అనుకుంటున్నామో మనకే తెలియక పోతే - కొమరం పులి , ఏం తీసినా చూస్తారు లే అనుకుంటే - ఆగడు (సరదాగా)

ఇలా ప్రతి సినిమా కి ఒక లైన్ లోనే కాన్సెప్ట్ ని చెప్పుకోవచ్చు, ఇంకా చెప్పాలి అంటే ఇలాంటి ఒక లైన్స్ నుంచి పుట్టినవే రెండున్నర గంటల సినిమాలు. ఏదైనా కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ముందుగా చెక్ చేసుకోవాల్సిన విషయాలు - ఇది కొత్త కాన్సెప్ట్ ఆ? ఇంతకు ముందు వచ్చేసి ఉంటె, ఎలా తీసారు? కొత్తగా ఎలా తీయవచ్చు? కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా? ఎవరికీ సెట్ అవుతుంది? జనర్ ఏంటి? ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏంటి? మన లైన్ ట్రెండ్ కి తగ్గట్టుగానే ఉందా? ట్రెండ్ సెట్ చేస్తుందా? ఈ కథ పర్పస్ ఏంటి? కథలో కాన్ఫ్లిక్ట్ ఏంటి? 

అన్ని చెక్ చేసుకున్నాక ఈ కాన్సెప్ట్ ఇచ్చిన ప్రేరణ తో బేసిక్ అవుట్ లైన్ వ్రాసుకోవటం జరుగుతుంది. పైన చెప్పుకున్నట్టు ఒక నాలుగు యిది వాక్యాలలో కథని చెప్పటం. ఈ విషయం పై క్లారిటీ కావాలి అంటే, మీరు రెగ్యులర్ గా చదివే సినిమా రివ్యూ లలో స్టొరీ సెక్షన్ చూస్తే మీకే అర్ధం అవుతుంది. రివ్యూ కి ఉండే స్పేస్ పరిమితి వలన కథని సింపుల్ గా జనాలకి అర్ధం అయ్యేలా నాలుగు ముక్కల్లో చెప్తారు. కాన్సెప్ట్ ని బేసిక్ లైన్ గా మార్చుకునే ప్రాసెస్ లో రివర్స్ ఇంజనీరింగ్ చేసి మీరు చూసిన సినిమాలలో కాన్సెప్ట్ అండ్ బేసిస్ లైన్ ని విశ్లేషించటం మొదలు పెట్టండి. 

రెండు గంటలు చూసిన సినిమా ని నలుగు ముక్కల్లో ఎంత సింపుల్ గా చెప్పగలరు? సినిమా మొత్తం చూసేసారు కాబట్టి మీకు సినిమా ఏంటో తెలుసు, ఎం చెప్పాలి ఎం చెప్పకూడదు అని ఆలోచిస్తారు కాబట్టి ఎంత వరకు చెప్పాలో అంత వరకు చెప్తారు. అదే రివర్స్ లో కాన్సెప్ట్ ని ఎలా డెవలప్ చెయ్యాలి? కాన్సెప్ట్ అనేది ఒక చిన్న ఆలోచన దానిని నాలుగు లైన్స్ కి,  నాలుగు పేజెస్ కి, రెండున్నర గంటల సినిమా కి మార్చటం ఎలా? నాలుగు లైన్స్ కథని నాలుగు పేజెస్ కథ గా వ్రాసుకుంటే సినాప్సిస్ అవుతుంది. నాలుగు పేజెస్ అనేది లెక్క కాదు, మనం సిరీస్ లో మొదటి ఆర్టికల్ లో చెప్పుకున్నట్టు సాధారణం గా తెలుగు సినిమా నిడివి140 నిముషాలు, రఫ్ గా 60 నుంచి 80 సీన్ లు. మనకి ఇంటర్వెల్ కూడా ఉంటుంది కాబట్టి, ప్రారంభం 35 నిముషాలు, మద్యయం 70 నిముషాలు (ఇందులో సగం టైం కి అంటే 35 నిమిషాలకి ఇంటర్వెల్) అండ్ ముగింపు 35 నిముషాలు. ఈ లెక్కన నాలుగు పేజెస్ / పారగ్రాఫ్స్ లో మనం నాలుగు ఆక్ట్ గురుంచి వ్రాసుకోవాలి (2 ఆక్ట్ ని 2 గా మార్చుకొని).

"The hardest thing about writing is knowing what to write - Syd Field"

అది సినిమా స్టొరీ అయినా, వేరే స్టొరీ అయినా, రివ్యూ అయినా ఆఖరికి ఆర్టికల్ అయినా ముందుగా మనం ఎం వ్రాస్తున్నాం అనే దానిపై మనకి అయిడియా ఉండాలి, అన్నిటికంటే ముఖ్యం గా ఎండింగ్ విషయం లో క్లారిటీ ఉండాలి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విషయం లో క్లారిటీ లేక పోత కథ అతుకుల బొంత లా మిగిలిపోతుంది. మన కాన్సెప్ట్ ని, బేసిక్ లైన్ గా డెవలప్ చేసుకున్నప్పుడే మనకి ఇందులో కాన్ఫ్లిక్ట్ ఏమిటి? పాత్ర ఎటు వంటిది? దాని ఆశయం ఏంటి? అనే విషయాలు తెలుస్తాయి కాబట్టి దానిని ఇంకోముంచెం ముందుకి తీసుకు వెళ్లి ఆక్ట్ గా వ్రాసుకోవాలి. ఇక్కడ కామెడీ గురుంచో, సాంగ్స్ గురుంచో, ఫైట్ గురుంచో, డైలాగ్ గురుంచో స్పెసిఫిక్ గా వ్రాయవలసిన అవసరం లేదు, మెయిన్ స్టొరీ లో నాలుగు లేక అయిదు ఇంపార్టెంట్ పాత్రల చుట్టూ వ్రాసుకోవటమే. మన కథాంశం (theme) కి తగ్గ ఇతివృత్తం (plot) ఉండేలా చూసుకోవాలి.

ఇక్కడ చెప్తే మళ్లీ రిపీట్ చేసినట్టు అవుతుంది, ఇలా వ్రాసుకోవటానికి, ఎక్కడ ఎం చెప్పాలి అనే అవగాహన కి, కథ / పాత్రలకి ఉండాల్సిన లక్షణాల గురుంచి, కథ వ్రాసే ముందు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాల గురుంచి, కథని ఇంటరెస్టింగ్ గా మలిచే టెక్నిక్స్ గురుంచి, ఈ సిరీస్ లో ఇంతకు ముందు వచ్చిన ఆర్టికల్స్ లో చెప్పిన పాయింట్స్ ఇచ్చిన ఉదాహరణలు హెల్ప్ అవుతాయి అని ఆశిస్తున్నా. మొదట్లో చెప్పినట్టు కథ అనే మెయిన్ టాపిక్ కంటే ముందు అవన్నీ వ్రాయటానికి కారణం కూడా ఇదే. ఏమైనా సందేహాలు ఉంటె కామెంట్స్ లో చెప్పండి. డిస్కస్ చేసుకుందాం. 

ఉదాహరణ కి మనకి అందరికి తెలిసిన రామాయణం కథ ని కమర్షియల్ సినిమా గా వ్రాసుకుంటే? "పితృవాక్య పరిపాలన - తండ్రి మాట కోసం రాజ్యం ని త్యాగం చేసి వనవాసం వెళ్ళాల్సి వస్తే?" అనే కాన్సెప్ట్ తో, తండ్రి మాట జవదాటని కొడుకు రాజ్యం వదిలి 14 ఏళ్ళు వనవాసం వెళ్ళాల్సి వస్తే? తమ్ముడు వచ్చి నీ రాజ్యం ని నేను పాలిచటం ఏంటి, మళ్లీ నువ్వు వచ్చే వరకు నీ పాద రక్షలతో పాలిస్తా అంటే? వనవాసం లో ఉండగా తన భార్య ని ఒక రాక్షషుడు ఎత్తుకెళ్ళి పోతే? తిరిగి రాజ్యం కి వెళ్ళాల్సి వచ్చే లోపు భార్య ని కాపాడి, రాక్షషుడు ని సంహరించి, సింహాసనం ని ఎలా అధిష్టించాడు? అనేది బేసిక్ అవుట్ లైన్. దీనిని డెవలప్ చేసుకుంటే.. 

ఆక్ట్ 1 : దశరధ మహారాజు, అయన భార్యలు, పిల్లలు. పిల్లలు పెద్దవాళ్ళు అవ్వటం, ఫైట్ లు అవి నేర్చుకోటం. రాముడు, రావణుడు సెపరేట్ గా సీతా స్వయంవరం కి రావటం, రాముడు గెలవటం, పెళ్లి. అంతా సాఫీగా ఉండగా, రేపు పట్టాభిషేకం అనగా, కైకేయి కోరిక పై దశరధుడు రాముడిని వనవాసం వెళ్ళమని ఆగ్నాపించటం. ఇక్కడ అలా ఎలా కుదురుతుంది అని రాముడు ప్రశ్నిస్తే కాన్సెప్ట్ ఏ దెబ్బ తినేస్తుంది కాబట్టి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకోవాలి. 

ఆక్ట్ 2a : రాముడి తో పాటు సీత, లక్ష్మణుడు రావటం. భరతుడు నేను పాలించాలేను అని చేతులు ఎత్తేయ్యటం, అయినా కూడా రాముడు రాక పోవటం. కైకేయి ఫీల్ అవ్వటం. చేంజ్ అఫ్ లొకేషన్ , చేంజ్ అఫ్ మూడ్, సబ్ ప్లాట్ టైం. హ్యాపీ గా వెళ్ళిపోతున్న రాముడు లైఫ్ లో కి, విలన్ చెల్లి వచ్చింది, బుద్ధి చెప్పి పంపేసాడు. ఇంతలో ఇంటర్వెల్ బాంగ్ కి రంగం సిద్దం. రావణాసురుడు ట్రాప్ వేసాడు. రాముడు , లక్ష్మణుడు లేని టైం చూసి సీత ని ఎత్తుకెళ్ళి పోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన రాముడు పై ఇంటర్వెల్ కార్డు. ఇక్కడ లీడ్ సీన్ సీత బంగారు లేడి ని అడగటం


ఆక్ట్ 2b : ఇప్పుడు సీతని తెచ్చుకోవటం రాముడు అసలు ఆశయం అయ్యింది. అసలు షాక్ లో నుంచి బయటికి వచ్చిన రాముడు సీతని ని వెతకటం, దొరకక పోవటం, బాధ పడుతూ ఉండటం. ఇంతలో హనుమంతుడు హెల్ప్ కి రావటం. (సడన్ గా వచ్చేయ్యకుండా ఫస్ట్ హాఫ్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకోవాలి). సీత ఎక్కడుందో కనుక్కోవటం, సీతని కలిసి, విలన్ కి వార్నింగ్ ఇచ్చి, ఇంక అంతా అయిపొఇన్ది అనుకున్న రాముడికి సీత జాడ చెప్పటం తో సెకండ్ ఆక్ట్ ముగుస్తుంది.

ఆక్ట్ 3 : సముద్రం లో బ్రిడ్జి కట్టేసి, యుద్ధము, రావణ సంహారము, ఇక్కడితో సెకండ్ ఆశయం పూర్తి అవుతుంది కాబట్టి, అయోధ్యకు రాక, పట్టాభిషేకము తో ది ఎండ్. 

క్రాస్ చెకింగ్: 

అసలు భర్త తో పాటు రాజ్యం వదిలి అడవులకి వచ్చిన సీత "బంగారు లేడి" ని అడగటం ఏంటి? అలా అడగక పోతే రాముడు వెళ్ళడు, లక్ష్మణుడు వెళ్ళలేడు, అ టైం లో రావణాసురుడు వచ్చేసి ఉంటె అప్పుడే రాముడు చంపేసి ఉండేవాడు, అసలు సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ ఉండేది కాదు, అందుకే లాజిక్ కి అందక పోయినా అది చాలా ఇంపార్టెంట్ అండ్ లీడ్ సీన్ అయ్యింది. హీరో కి రెండో ఆశయం, స్టొరీ కి డ్రామా ని ఆడ్ చేసింది. హనుమంతుడు ని చూడగనే, గోడ దూకేసి సీత వచ్చేసి ఉంటె? రాముడి ఆశయం హనుమంతుడు తీర్చినట్టు, అందుకే ఆవిడ రాను అంటుంది. రావణాసురుడికి ఒక టచ్ ఇవ్వటానికి లంక దహనం చేసిన హనుమంతుడు పెద్ద ఫైట్ చేసి విలన్ ని లేపేసి ఉంటె? అలా కాకుండా రావణా, నీకు రాముడు ఎవరో తెలియక సీత ని తీసుకోచ్చేసావ్, అసలు రాముడు ఇది అని హనుమంతుడు చెప్పినప్పుడు, మనకెందుకు వచ్చిన గోల లే అని రావణుడు సీతని వదిలేస్తే?  రాముడి హీరోయిజం ఏమైపోవాలి? ఇలా ఎక్కడికి అక్కడ ప్రతి లైన్ కి, దాని పర్పస్ ఏంటి ? కథకి ఆ లైన్ వలన ఉపయోగం ఏంటి అనేవి బేరీజు వేసుకుంటూ ఉంటె, కథ కొంతలో కొంత పకడ్భందీ గా వచ్చే అవకాశం ఉంటుంది. సింపుల్ కథ అయినా సరే, ఎంత పకడ్భందీ గా కథనం అల్లుకున్నాం అనే దానిపైనే కమర్షియల్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. 

ఈ సినాప్సిస్ వ్రాసుకోటానికి చెక్ చేసుకోవాల్సిన విషయాలు టూకీగా, ఆక్ట్ 1 లో మెయిన్ పాయింట్ గురుంచి ఎస్టాబ్లిష్ చేసామా? పాత్రల పరిచయాలు చేసుకున్నామా, ఫస్ట్ ప్లాట్ పాయింట్ (మలుపు) వ్రాసుకున్నామా. ఆక్ట్ 2 లో కథని ముందుకు నడిపించే సందర్భాలు ఉన్నాయా? మెయిన్ పాత్ర ఆశయం కి సరైన ప్రతిబంధకాలు ఉన్నాయా? హీరో ఆశయం దెబ్బ తిని, అన్ని కోల్పోయే స్టేజి కి ప్రతి నాయకుడు అండ్ సందర్భాలు ఉన్నాయా? ఆక్ట్ 3 లో మరీ రొటీన్ అయిపోకుండా ఆశయం చేరుకునేలా ఏమైనా చెయ్యగలమా? ఇక్కడ మనకి టైం లాక్ లాంటి టెక్నిక్స్ ఉపయోగ పడుతూ ఉంటాయి. 

ఇది కేవలం నాకు ఉన్న లిమిటెడ్ నాలెజ్ లో నేను రాసింది, ఈ ఆర్టికల్ చదివే అనుభవజ్ఞులు వారి అభిప్రాయాలు సూచనలు సలహాలు షేర్ చేసుకుంటే రుణ పడి ఉంటాను.





4 comments:

Nagaraja Reddy said...

As usual, iragadeesaru Raju garu. ☺

aditya said...

Superb baa :) Ramayanam exmple untundi ani expect cheyaledu usual ga edanan movie ni teesukuntavu anukunna

kiran said...

Sir ee series lo articles anni chadivaka mee reviews pai RESPECT (GOURAVAM) perigindi sir

mee knowledge ki writing skills ki naa hats off

Anonymous said...

arachakam antey

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views