కబాలి - కథ కథనం - విశ్లేషణ
జనరల్ గా స్టార్ హీరో మూవీస్ కి ముందు సినిమాలు ప్లాప్ అయినా డిసాస్టర్ అయినా రాబోయే సినిమా కి ఉండే క్రేజ్, అంచనాలు ఎప్పటి లాగానే ఉంటాయి. మరి అలాంటిది సూపర్ స్టార్ సినిమా అంటే? దానికి మరణ మాస్ టీజర్ అండ్ పబ్లిసిటీ తోడు అయితే - టికెట్ ముక్క దొరకాలి అంటే చొక్కా చిరగాల్సిందే (లేదా జేబు కి చిల్లు పడాల్సిందే). ఖఛ్చితం గా కబాలి కి అదే జరిగింది. ఆడియో ఫంక్షన్ లేదు, థియేట్రికల్ ట్రైలర్ లేదు, ఇంటర్వూస్ లేవు, జస్ట్ ఒకే ఒక టీజర్ తో ఆకాశాన్ని తాకే రేంజ్ పబ్లిసిటీ దొరికింది. జస్ట్ అప్పటికి రెండు సినిమాలు తీసిన డైరెక్టర్ చేతిలో సూపర్ స్టార్? అది కూడా ఆర్ట్ డైరెక్టర్ అని పేరు ఉన్న డైరెక్టర్ కి అసలు సూపర్ స్టార్ ని హేండిల్ చెయ్యగల కెపాసిటీ ఉందా అనేది పెద్ద ప్రశ్న అయ్యింది. మహా మహా తలలు పడిన కమర్షియల్ డైరెక్టర్స్ కే అది సాధ్యం కాని సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది టీజర్ వచ్చాక ఇది సూపర్ స్టార్ సినిమా నే అని జనాలు ఫిక్స్ అయిపోయారు. ఈ టీజర్ తప్ప ఇంకో ట్రైలర్ ఎందుకు వదలటం లేదు, ఆడియో ఏంటి తేడా గా ఉంది అని రంధ్రాన్వేషణ చేసే వాళ్ళకి రంజిత్ ఇంటర్వ్యూ కొంచెం క్లారిటీ ఇచ్చింది. నేను రాసుకున్న కథలోకి సూపర్ స్టార్ వచ్చారు తప్ప ఇది సూపర్ స్టార్ సినిమా కాదు అని మనల్ని ప్రిపేర్ చెయ్యటానికి గట్టిగానే ట్రై చేసాడు కానీ టీజర్ ఇఛ్చిన ఊపు ముందు ఇవేవి పనికి రాలేదు. అంత గొప్ప అంచనాల మధ్య వచ్చినప్పుడు టాక్ తేడా రావటం సహజమే కానీ టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్స్ సృష్టిస్తున్న ఈ కబాలి కలెక్షన్స్ సైడ్ పక్కన పెట్టి కథ కథనం గురుంచి విశ్లేషించుకుందాం.
ఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు
కథ : మలేషియా లో వలస కూలీలు అణిచి వేయబడ్డ వర్గం గా ట్రీట్ చేయబడుతున్న రోజుల్లో, వేతన సమానత్వం కోసం పోరాడిన నాయకుడు, డాన్ గా ఎదిగి, గ్యాంగ్ వార్స్ లో వైఫ్ ని పోగొట్టుకొని 25 సంవత్సరాలు జైలు జీవితం తర్వాత బయటికి వఛ్చి, చనిపోయింది అనుకున్న భార్య ని కూతుర్నికలుసుకొని గ్యాంగ్ పై రివెంజ్ తీర్చుకుంటాడు. ఒక పక్కా కమర్షియల్ హంగులు తో పాటు మెసేజ్ చెప్పటానికి స్కోప్ ఉన్న స్టోరీ ని రజిని సర్ ఒప్పుకోవటం లో తప్పు ఉన్నట్టు అనిపించదు. పెద్ద డైరెక్టర్స్ తో కార్టూన్ అయిపోయిన లింగా కంటే కసి ఉన్న కుర్రోడి తో చెయ్యటం బెటర్ అని అయన ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఇందులో ఇంకో గమ్మత్తయిన కథ కూడా దాగి ఉంది, అది లాస్ట్ లో చెప్పుకుందాం.
ఇదే కథ ని పైన చెప్పుకున్నట్టు ప్లైన్ గా తీసేసినా చెల్లిపోయేది, కానీ కథనం కి వచ్చేసరికి గ్యాంగ్ వార్ చెయ్యాలా, ఫామిలీ డ్రామా చెయ్యాలా, జనాలకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలా, మలేసియా లో జరుగుతున్నది చూపించి వదిలేయాలా? నాయకుడు ని చెయ్యాలా అని చాలా మధనం జరిగినట్టు ఉంది.
కథనం: రజిని సర్ సినిమాలలో చాలా వరకు స్టాండర్డ్ టెంప్లేట్ ఉంటుంది, ఒక సాదా సీదా వ్యక్తి గా మొదలై, ఒక రేంజ్ కి ఎదిగి, అక్కడ ఒక చిన్న దెబ్బ తిని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు. ఒకటికి పది సార్లు ఇది రజిని మూవీ కాదు రంజిత్ మూవీ అని డైరెక్టర్ అనుకున్నాడు ఏమో సీనిక్ ఆర్డర్ తో - ఎడిటింగ్ తో ఆడుకున్నాడు. సీనిక్ ఆర్డర్ గురుంచి సొంత పైత్యం లో చెప్పుకుందాం. ముందు కథనం లో కి వెళ్ళిపోదాం. మెయిన్ కథనం లోనికి వెళ్లే ముందు, రంజిత్ గురుంచి తెలియని వాళ్ళ కోసం - రంజిత్ మూవీస్ లో దళితిజం గురుంచి అండర్ కరెంటు గా బోలెడు మేటర్ ఉంటుంది. డైరెక్ట్ గా ఇది అని చెప్పారు కానీ, ఇవ్వాల్సిన రిఫరెన్స్ లు అన్ని ఇస్తాడు. అలాంటివి మద్రాస్ తో బాగా పాపులర్ అవ్వగా (అక్కడ స్టోరీ తో కలిసిపోవడం వలన) ఈ సినిమాలో బోలెడు ఉన్నట్టు లేనట్టు ఎందుకున్నాయి అని అర్ధం కానట్టు ఉన్నాయి.
ఆక్ట్ 1: ఆరంభం: మలేషియా లో ఇప్పుడు ఉన్న గ్యాంగ్స్ అండ్ గ్యాంగ్ 43 స్టేటస్ చెప్తూనే, ఇలాంటి టైం లో రిలీజ్ అయితే ప్రమాదం మరి కబాలి ని రిలీజ్ చేద్దామా అంటే? ముసలోడు ఎం చేస్తాడు లే, ఒకవేళ ఏమైనా జరిగినా మన పద్దతిలో మనం డీల్ చేద్దాం అని డిసైడ్ అయ్యి రిలీజ్ కి పర్మిషన్ ఇస్తుంది డిపార్ట్మెంట్. "మై ఫాదర్ బాలయ్య" బుక్ చదవటం మధ్యలో ఆపేసి బస్కీ లు తీసి వచ్చిన కబాలి కి జాగ్రత్త కూడా చెప్తాడు ఒక పోలీస్ ఆఫీసర్. ఇంతకీ ఆ పుస్తకం ఎందుకు చూపించినట్టు? దానిని అక్కడే ఎందుకు వదిలేసినట్టు? అన్నా రెండు నెలల్లో బయటికి వచ్చి నీ వెనక నిలబడతా అని చప్పట్లు కొట్టిన వాళ్ళు ఏమైపోయారు? బయటికి వఛ్చిన కబాలి పక్షిని స్వేచ్ఛ గా వదిలేయ్ చావో బ్రతుకు అదే డిసైడ్ చేసుకుంటుంది అని ఎందుకు చెప్పాడో ఎవర్ని ఉద్దేశించి చెప్పాడో తెలియక పోయినా, డైరెక్ట్ ఎటాక్ మొదలు పెడతాడు. ఇంట్రో లో ఉండాల్సిన కమర్షియల్ అంశాలు ఉంచుతూనే క్యారెక్టర్ ని పరిచయం చేసిన విధానం ఇది. ఇక్కడ ఉంకో క్యాచ్ పాయింట్, ఫస్ట్ తాను ఎటాక్ చెయ్యడు, అవతలి వాడు ఎటాక్ మొదలు పెట్టక రియాక్ట్ అవుతాడు. అప్పుడే ఎటాక్ చెయ్యకండి, వాడు రెడీ గా ఉన్నాడు, వెయిట్ చెయ్యండి అని విలన్ అన్నప్పుడే ఇది ఇక్కడితో వెళ్తుంది సుమీ అని మనకి అనిపించక మానదు. అక్కడ నుంచి అందర్నీ పలకరించి ఇంటికి వెళ్లిన కబాలి కి భార్య జ్ఞాపకాలు వెంటాడుతాయి. అన్ని అవతలి వాళ్ళ ద్వారానే తెలుస్తూ ఉంటాయి కబాలి కి, ఇక్కడే పాత్ర పాసివ్ గా మారిపోయింది. ఇక్కడ నుంచి సినిమా మొత్తం పాసివ్ గానే మిగిలిపోయింది. దానికి తోడు అంతకు ముందు ఎం జరిగింది అనే దాని గురుంచి మనకి తెలియక పోవటం వలన, 25 సంవత్సరాల ముందు ఎలా వెళ్ళాడో అలాగే వచ్చాడు అని చెప్పు అని పెద్దాయన చెప్తుంటే, అసలు ఎలా వెళ్లారు, ఎందుకొచ్చారు అని మనం కూడా బిత్తర చూపులు చూడటమే. ఐ సినిమా టైపు లో రివెంజ్ పర్పస్ తెలియక పోతే, ఆడియన్స్ ఎప్పటికి కనెక్ట్ అవ్వలేరు. ఇక్కడ అదే జరిగింది. చాలా పాత్రలు, వాటి పరిచయాలు, ఏవేవో అయిపోతూ ఉంటాయి, తెలిసిన మొహాలు లేక పోవటం వలన చాలా మందికి అవి రిజిస్టర్ కూడా అవ్వవు. మోసపోయి ఒంటరి బ్రతుకు బతుకున్న ఒకప్పటి టాపర్ కొడుకు, తన కూతురి వయసు ఉండే ఒక అమ్మాయి కష్టం, గన్స్ మోజు లో పడి గ్యాంగ్ భారిన పడ్డ టైగర్ ఇలా ఎన్నో పాత్రలు, అన్ని పై పైన టచ్ చేసి వదిలేసినవే. తన గ్యాంగ్ లో కూడా డ్రగ్స్ గురుంచి తెలుసుకున్న కబాలి, అసలు మనం దీని గురుంచి ఆ కష్టపడ్డాం? నా దగ్గర టైం చాలా తక్కువ ఉంది, కానీ చెయ్యాల్సిది చాలా ఉంది అంటూ సెకండ్ ఆక్ట్ లోకి మొదలు అవుతుంది.
ఆక్ట్ 2: సమస్యాత్మకం : పెద్దగా టైం వేస్ట్ చెయ్యకుండా, తన గ్రూప్ మెంబెర్ ద్వారా డ్రగ్ డీల్స్ గురుంచి తెలుసుకొని లోగు దగ్గరకి వెళ్తాడు, ఎదో మాటాడుకుంటారు (మనకి అర్ధం కాదు), కార్ తో చంపేస్తాడు, నిప్పు రా... నిజం గా అర్ధం కాగానే జనాలు అరవటం కూడా మర్చిపోయారు. దెబ్బ తిన్న విలన్ కబాలి ని చంపే కాంట్రాక్టు ఒక అమ్మాయి కి ఇస్తాడు. మొదటి వ్యక్తి ని చంపినప్పుడు దొరికిన క్లూ తో రెండో వ్యక్తి గురుంచి వెతుకుతాడు కబాలి. మళ్ళీ అర్ధం కాదు. అక్కడ నుంచి ఇంకో క్లూ దొరుకుతుంది. మధ్య లో భార్య జ్ఞాపకాలు, ఇంతలో కబాలి పై అట్టాక్ అవుతుంది. అప్పటి వరకు పక్కనే ఉంది పేల్చేసే ఛాన్స్ ఉన్న కూడా ఎక్కడో బయట చంపుదాము అని ప్లాన్ వేసిన తెలిసిన వాడి కొడుకు. అయినా కూడా ఈ పాత్ర కూడా లాస్ట్ వరకు కబాలి పక్కనే ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇంకా నా జీవితం లో ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో అని పెద్దాయన అంటుంటే, మేము ఇంకా రెండు గంటలు మాత్రం చూసి తీరాలి అని మనం అనుకోవాలి. ఇంకా జనాలకి సస్పెన్సు వద్దు అనుకున్నారో ఏమో, ఒక పెద్ద "ఓపెన్ హార్ట్ విత్ కబాలి" పెట్టి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసారు. ఫ్లాష్ బ్యాక్ తో కనెక్ట్ అయ్యే టైం కి ఇక్కడ ఇంటర్ కట్, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ ఇంటర్ కట్. గాంస్టర్ అవ్వటం తో మొదలు పెట్టి, ముఖ్యమైన నాయకుడు తో కలిసి, అయన చంపబడ్డాక అయన స్థానం లో కి వఛ్చి, సూట్ ఏసుకోవటం మొదలుపెట్టి, గ్యాంగ్ వార్స్ లో భార్యని కోల్పోయి, జైలు కి వెళ్ళటం వరకు కవర్ చేసారు. కానీ ప్రేమ ని ఎస్టాబ్లిష్ చెయ్యలేదు, ప్రాబ్లెమ్ ని ఎస్టాబ్లిష్ చెయ్యలేదు. వాళ్ళ మధ్య ఉన్న నాయకత్వ పోరు తప్ప మనకి జనాల బాధలు కనిపించవు అక్కడక్కడా అంబెడ్కర్ ఫోటో లు, సూట్ గురుంచి డైలాగ్ లు తప్ప. ఫ్లాష్ బ్యాక్ అయ్యాక ఇంకొకడు వచ్చి ఇంకో క్లూ ఇస్తాడు, అక్కడికి వెళ్తే అక్కడ ఒక ఫైట్, ట్విస్ట్, తన కూతురు తనే వఛ్చి నాన్న అని పిలిచి సేవ్ చేస్తుంది, పాసివ్ కబాలి మనలాగానే చూస్తూ ఉంటాడు, ఇంతలో ఇంకో కూతురు రోడ్ మీద కనిపిస్తుంది, ఇక్కడ ఉంది ఏంటి అని వెళ్తే కాల్చేస్తారు, ఇంటర్వెల్. ఈ ఫస్ట్ హాఫ్ అయ్యే సరికి సగం ఓపిక నశించి, అసలు ఎం జరుగుతుంది అని ఆలోచించే ఇంట్రస్ట్ కూడా మిగలకుండా, ఒక పఫ్, పాప్ కార్న్, కూల్డ్రింక్ కోసం ఆశగా పరిగెడతాం.
లెంగ్త్ పరంగా ఫస్ట్ హాఫ్ పెద్దది, అందులో ఏ ఒక్క అంశము హైలైట్ అవ్వక, హీరోయిజం ఉండక, ప్రాబ్లెమ్ తెలియక, మెయిన్ కథానాయకుడు లక్ష్యం ఏంటి అనేది అర్ధం కాక అగమ్య గోచరం గా తయారు అయ్యింది.
కబాలి పోయాడు అని న్యూస్, మెయిన్ విలన్ ఎంట్రీ విత్ డైలాగ్, ఇంతలో నేను బ్రతికే ఉన్నాను అని ఒక వార్నింగ్, ఇక మొదలు అవుతుంది అనే టైం కి, కూతురి ఫ్లాష్ బ్యాక్, భార్య బ్రతికే ఉంది అని కూతురు చెప్తుంది. ఒక్క సారిగా షాక్ అయినా కబాలి ఏడ్చి మనల్ని నవ్వించి భార్య కోసం వెతకటం మొదలు పెడతాడు, ఇండియా వచ్చి ఎక్కడ ఫ్రాన్స్ కి వెళ్ళిపోతాడో అనుకునే టైం కి ఇండియా లోనే భార్య ని కనుక్కుంటాడు. అక్కడ కూడా తాను చేసింది ఎం ఉండదు, మిగతా అందరు పాటు పడుతుంటే వెయిట్ చెయ్యటం తప్ప. ఆల్మోస్ట్ 30 నిమిషాల ఈ ఎపిసోడ్ వాళ్ళ 25 సంవత్సరాల ఎడబాటు ని గుర్తు తెస్తున్నట్టు గా సాగుతుంది ఎస్ సాగుతూనే ఉంటుంది. అంత ప్రేమించుకున్నారు, ఇంత గొప్ప ప్రేమ అని డైలాగ్స్ లో కంటే విజువల్స్ లో చూపిస్తే ఉండే ఇంపాక్ట్ వేరు. అదే స్ట్రాంగ్ గా ఎస్టబ్లిష్ అయ్యి ఉంటె ఈ ఎపిసోడ్ కొంచెం అయినా రక్తి కట్టించేది ఏమో. అంతా బావుంది అని ఒక స్లో మెలోడీ సాంగ్ వేసుకున్నాక ఎటాక్, ఫైట్, షిఫ్ట్ టు థర్డ్ ఆక్ట్. డాన్ అనే అంటే అన్ని తానే చెయ్యాల్సిన అవసరం లేదు అని, పక్కన ఉన్న పెరఫార్మెర్ కం డైరెక్టర్ చేస్తే చాలు లారెన్స్ అప్పట్లో మనకి చూపించాడు, కానీ ఇక్కడ డాన్ కి ఇన్ఫర్మేషన్ మాత్రం పక్క వాళ్ళు ఇస్తూ ఉంటారు, ఈ వయసులో కూడా పెద్దాయన కష్టపడి వేసేస్తూ ఉంటారు.
ఆక్ట్ 3 : ముగింపు : తన గ్యాంగ్ మెంబెర్స్ ని విలన్ ఎం చేసాడో వివిధ ఫ్లాష్ బ్యాక్ ల ద్వారా మనం తెలుసుకుంటాం. తాడో పేడో తేల్చుకోటానికి కోట్ ఏసుకొని ఫైనల్ ఫైట్ కి రెడీ అవుతాడు. ఎం జరుగుతుందో అనుకునే కంటే ఎప్పుడు అయిపోతుందా అనే రేంజ్ లో క్లైమాక్స్ ని ప్లాన్ చేసారు. అయినా ఇండియా వెళ్లిన కబాలి కి అక్కడ ఎం జరుగుతుందో తెలియదు, అక్కడికి వెళ్ళాక ఎవరో చెప్తే తప్ప. అలాగే ఫైనల్ డాన్ పార్టీ గురుంచి కూడా ఇంకొకడు చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో ఒకసారి, క్లైమాక్స్ లో ఒక సారి డాన్ పార్టీ లు ఏవైతే ఉన్నాయో అవి తెర మీద చూసి ఎంజాయ్ చెయ్యాల్సిందే. మెయిన్ విలన్ ని చంపగానే సినిమా అయిపోయింది అనుకునే మనకి, ఒక చిన్న "నాయకుడు" రేంజ్ ఎపిసోడ్ పెట్టి, ముగింపు పలికారు సదరు రంజిత్ గారు. నాయకుడు తో పోల్చదగ్గ ఎపిసోడ్ అయితే కాదు, అక్కడి భావోద్వేగాలు ఇక్కడ మచ్చుకి అయినా లేవు. మొదట్లో చెప్పినట్టు, ఒకవేళ బయటికి వఛ్చిన కబాలి తిరగబడితే ఎలా డీల్ చెయ్యాలో అలా డీల్ చేస్తారు పోలీస్. ఫైనల్ గా కూడా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు, నేను ఎం చెయ్యాలి అని మీరు ఆశిస్తున్నారు అని జనాల్ని అడుగుతాడు కబాలి, పాసివ్ క్యారెక్టర్ పాసివ్ గానే మిగిలిపోయింది అనటానికి ఇది పరాకాష్ట. ఈ సినిమాలో రంజిత్ ని మెచ్చుకునేలా చేసిన కొన్ని సీన్స్/షాట్స్ నా వరకు నచ్చినవి, ఇంట్రో ఎపిసోడ్, కార్ తో గుద్ది రివర్స్ చేసే షాట్, ఫ్లాష్ బ్యాక్ లో నాజర్ ని చంపే షాట్, తర్వాత షూటింగ్ ఎపిసోడ్, హీరో హీరోయిన్ కలుసుకునే ఫైనల్ షాట్స్, లాస్ట్ లో అందర్నీ చంపేసాక ట్విన్ టవర్స్ బ్యాక్ డ్రాప్ లో షాట్ అండ్ నడుచుకు వెళ్లే షాట్.
అసలు కథ ప్రకారం, కబాలి పోరాటం చేసి సాధించింది ఏంటి? డాన్ అవ్వాలి అని కాదు కదా పోరాటం మొదలు పెట్టింది మరి అక్కడ ఇబ్బంది పడిన వలస కూలీల కష్టాలు ఎక్కడ తీరాయి? కూలీల నుంచి అణగారిన వర్గాల బాగుకు పాటుపడిన కబాలి ఎం సాధించాడు? అసలు అక్కడ వాళ్ళ కష్టాలు ఏంటి? వాళ్ళ పోసిషన్ ఏమైనా మెరుగు పడిందా? వేరే గ్యాంగ్ వాళ్ళకి వేళ్ళ గ్యాంగ్ వాళ్ళకి ఉన్న పోరు తప్పితే సామాన్య జనాలు ఏమైపోయారు? చెడిపోతున్న యువత కోసం తీసుకున్న మార్గదర్శకాలు ఏంటి? విలన్ ని చంపటమే మెయిన్ ప్లాట్ అనుకున్నప్పుడు మెయిన్ విలన్ ని అయినా అగర్బతిలు వెలిగించుకుంటూ గుడి దగ్గర తిరిగే వాడిలా కాకుండా పవర్ ఫుల్ గా చూపించాల్సింది. అసలు మొత్తం మీద చూస్తే ఈ సినిమాలో దాగి ఉన్న గమ్మత్తయిన కథ "అనగనగా ఒక కబాలీశ్వరన్, తన భార్య అడిగింది అని కోట్ ఏసుకున్నాడు, అది ఎప్పుడు వేసుకునే వేరే వాళ్ళకి నచ్చక కోట్ తీసేమన్నారు, తీయొద్దు కబాలి అని భార్య చెప్పగా, ఆమెని చంపేశారు, కోట్ తీసేసి జైలు కి పంపించారు, జైలు నుంచి రాగానే కోట్ ఏసుకొని భార్యని వెతుక్కొని, ఇంకో కొత్త కోట్ ఏసుకొని వచ్చి కోట్ విలన్ ని చంపేస్తాడు, కానీ కోట్ లో ఉండగానే చచ్చిపోతాడు. కోటి అని పేరు పెట్టి కోటీశ్వరన్ (కోట్ + ఈశ్వరన్) గా తీయాల్సిన సినిమా ఏమో ఇది"
చివరిగా: ఎదో చెప్పాలి అనే తపన ఉన్నప్పటికీ, ఎలా చెప్పాలి అనే సందిగ్ధత డైరెక్టర్ ని బాగా ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది దాని వలన తన ఇంతకు ముందు సినిమాలో ఉన్న స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా ఇందులో లేకుండా పోయాయి. అనుభవ రాహిత్యం వలన, సూపర్ స్టార్ ఇమేజ్ ని బేరీజు వేసుకోలేక పోవటం వలన, ఇటు సూపర్ స్టార్ సినిమా లాగాను కాక రంజిత్ సినిమాగాను కాకుండా మిగిలిపోయింది. ఇందులో ఇది కథ అయ్యి ఉంటుంది అని మనం అనుకోవటం తప్ప ఒక పూర్తి స్థాయి కథ కానీ పకడ్బందీ కథనం కానీ లేక పోవటం బాధాకరం. హార్డ్ కోర్ ఫాన్స్ కి మినహా మిగతా వాళ్ళకి సహన పరీక్ష. ఈ కంటెంట్ తో ఈ సినిమా రాబడుతున్న ప్రతి పైసా పై సూపర్ స్టార్ బొమ్మ ఉండాల్సిందే. అప్పట్లో లింగేశ్వరన్ ఇప్పుడు కబాలీశ్వరన్ ఈ ఈశ్వరన్ సెంటిమెంట్ ఏంటబ్బా?
సొంత పైత్యం:
అసలు ఇంత కాంప్లికేట్ చేసే బదులు, ఇదే కథనం ని సీనిక్ ఆర్డర్ మర్చి తీస్తే? కబాలి రిలీజ్ గురుంచి పోలీస్ డిస్కషన్, రేపు హయ్యర్ అథారిటీ మాట్లాడి డిసైడ్ అవుదాం అని అనుకుంటారు. రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న కబాలి అనుచరుల మధ్య డిస్కషన్ లో పిల్లలకి కబాలి ఎవరో అని ఫ్లాష్ బ్యాక్ మొదలు పెట్టి. అసలు ప్రాబ్లెమ్ చూపించి, లవ్ ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ జైలు కి వెళ్లే వరకు చూపించి, ఈ కబాలి కోసమే మేము వెయిటింగ్ అనే టైం కి ఓల్డ్ గెట్ అప్ లో రజిని సర్ ఎంట్రీ ఇచ్సి, రావటం రావటం వార్నింగ్ ఇస్తాడు. గ్రూప్ టేబుల్ మీటింగ్, నెక్స్ట్ నైట్ బాంబు, నెక్స్ట్ కార్ తో గుద్దేసే ఫైట్. దెబ్బకి మెయిన్ విలన్ దిగుతాడు. నేను మేనేజ్ చేస్తాను అని కూతురు కి సుపారీ ఇస్తాడు విలన్, మెయిన్ విలన్ ఒక వార్నింగ్ ఇస్తాడు కబాలి కి ఇంటర్వెల్.
కూతురు గురుంచి ఆచూకీ, ఫైట్, కూతురు ట్విస్ట్, కబాలి మీద ఎటాక్, మెయిన్ విలన్ కి వార్నింగ్. వైఫ్ గురుంచి ఇన్ఫర్మేషన్, విలన్ కి కూడా తెలిసి, హీరో కంటే ముందే దానిని చంపేస్తా అని హీరో కి వార్నింగ్, హీరో సెర్చ్ అండ్ ఐడెంటిఫికేషన్. కట్ చేస్తే ఎటాక్, ఇంటికి వెళ్తే ఈ గ్యాప్ లో హీరో గ్యాంగ్ ఎలిమినేషన్. ఇంకా లాభం లేదు అని, పోలీస్ తో చెయ్యి కలిపి విలన్ గ్యాంగ్ ని అంతమొదించి అల్టిమేట్ డాన్ గా ఎదగటం. ఇక పై ఎలాంటి కష్టాలు ఉండవ్ అని ఒక భరోసా తో ది ఎండ్.
ఇదే కథని చేతిలో పెట్టుకొని ఇక్కడ చెప్పినట్టు తీస్తే చాలదా రజిని ఫాన్స్ కి? నచ్చక పోతే నొచ్చుకోకండి, మన్నించెయ్యండి.
3 comments:
Excellent baa,
story idhi ani at least main character development etc emi ledhu anduke feel undadhu, correct ga cheppav
Super andi
Super andi
Post a Comment