CINEMA CINEMA CINEMA - SCREENPLAY - SCENIC ORDER



సినిమా సినిమా సినిమా - కథనం - సీనిక్ ఆర్డర్

మనలో సినిమా పిచ్చ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, రిలీజ్ ఐన ప్రతి సినిమా ని చూస్తూ ఏదో ఒక రోజు నేను కూడా సినిమా కి కథలు రాయాలి అని కలలు కనే వాళ్ళు ఉన్నారు. ఆశక్తి ఉండి ఎం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఎక్కడ మొదలు పెట్టాలో డిసైడ్ అవ్వలేని వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగ పడాలి అనే ఉద్దేశం తో నాకు తెలిసిన, నేను చదివిన, నేను విన్న సినిమా పరిజ్ఞానం గురుంచి టూకి  గా రాద్దాం అనే ఆలోచనే నా ఈ "సినిమా, సినిమా, సినిమా" ఆర్టికల్ సిరీస్ ముఖ్య ఉద్దేశం.

టైం దొరికింది, కానీ విశ్లేషణ రాయటానికి సినిమా లేదు, సరే మొన్న రాసుకున్న కబాలి లో మెన్షన్ చేసిన సీనిక్ ఆర్డర్ గురుంచి వ్రాస్తే ఎలా ఉంటుంది అని ఇది మొదలు పెట్టడం జరిగింది. ఒక వేల చదివి ఉండక పోతే ఈ సిరీస్ లో ఇంతకు ముందు కవర్ చేసిన టాపిక్స్ ఇక్కడ మీకోసం మరొక్కసారి. 






ఒక ఆలోచన తో ప్రారంభం ఐన కథ, ఒక లైన్ గా, అక్కడ నుంచి నాలుగైదు లైన్ల కాన్సెప్ట్ గా, అక్కడ నుంచి నాలుగు పేజీల సినాప్సిస్ గా ఎలా అవుతుంది అని ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఒక సినాప్సిస్ కంప్లీట్ గా బౌండ్ స్క్రిప్ట్ గా ఎదిగే పరిణామ లో ముఖ్యమైన స్టెప్ సీనిక్ ఆర్డర్. ఒకే లైన్ లో చెప్పుకున్నా, నాలుగు పేజెస్ లో డిటైల్డ్ గా చెప్పుకున్నా దానిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలి అంటే, రెండున్నర గంటలకి సరిపడా సరుకు అందులో ఉండాలి, లేక పోతే, "కాన్సెప్ట్ బావుంది కానీ, సినిమా సోది" అని తేల్చేస్తారు ప్రేక్షకులు. అసలు మన కాన్సెప్ట్ సినిమా గా పనికొస్తుందా, అంత సీన్ ఉందా అని ఆలోచించుకోవాలి అంటే, ముందు సీన్స్ గా డెవలప్ చేసుకోవటం మొదలు పెట్టాలి. జనరల్ గా మన సినిమాలలో 60 నుంచి 80 మధ్యలో (అటు - ఇటు గా) సీన్స్ ఉంటూ ఉంటాయి. కచ్చితం గా ఇన్ని అని లెక్క కాకుండా, సీన్స్ అనుకున్నవి అనుకున్నట్టు వ్రాసేసుకొని పెట్టుకుంటే, ఆ తర్వాత వాటిలో ఏవి ఉంచటం, ఏవి తీసెయ్యటం, ఏ ఆర్డర్ లో వేసుకోవటం అనేది మన చేతిలో ఉన్న పేక ముక్కలు పేర్చుకోవటం అంత సులభం అవుతుంది. పేర్చుకున్న తర్వాత అందులో లైఫ్ ఉందా? ఆట అయ్యే స్కోప్ ఉందా? డ్రాప్ అవ్వాల్సిందా అని డిసైడ్ అవ్వొచ్చు. ఇక్కడ నేను ప్రస్తావించిన సీన్స్ అండ్ ఆర్డర్ అనేది బౌండ్ స్క్రిప్ట్స్ లో ఉండే సీన్స్ కాదు, వన్ లైన్ స్టోరీ లా వన్ లైన్ లో సీన్ అండ్ వాటి ఆర్డర్, దీనినే సింపుల్ గా వన్ లైన్ ఆర్డర్ అని అంటారు. సీన్ గురుంచి, దానిని డిటైల్డ్ గా ఎలా వ్రాసుకోవాలి అనే దాని గురుంచి మనం వేరే ఆర్టికల్ లో డిస్కస్ చేసుకుందాం, అక్కడికి వెళ్ళటానికంటే ముందు ఉన్న ప్రాసెస్ గురుంచి వ్రాయటమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. 

మనం చెప్పుకుంటున్న వన్ లైన్ ఆర్డర్ ముందు వ్రాసుకున్న సినాప్సిస్ లో ఉండే కథ కి ఎక్స్టెండెడ్ వెర్షన్ అవుతుంది, అక్కడ మెయిన్ పాత్రల గురుంచే వ్రాసుకుంటాం, కానీ వన్ లైన్ ఆర్డర్ కి వచ్ఛే సరికి, అందులో వుండని, కథకి కావాల్సినవి పాత్రలన్నీ వస్తాయి, కమెడియన్స్ కావొచ్చు, హీరో లేక హీరోయిన్ ఫ్రెండ్స్ కావొచ్చూ, ఇంట్లో ఉన్న చుట్టాలు కావొచ్చు, ఉండాల్సిన పని మనుషులు కావొచ్చూ ప్రాపర్టీస్ కావొచ్చు అన్నిటి గురుంచి ఒక ఐడియా కూడా వస్తుంది. వన్ లైన్ ఆర్డర్ వ్రాసుకోవటం అంటే పాటలు ఫైట్స్ తో సహా ఫుల్ మూవీ ని వ్రాసుకోవటమే అని తెలుసుకోవాలి. దీని వలన సినిమాలో ఎన్ని సీన్స్ ఉన్నాయి, మెయిన్ క్యారెక్టర్ మీద ఎన్ని సీన్స్ పడుతున్నాయి, క్యారెక్టర్ కి తగ్గ ఇంపార్టెన్స్ అండ్ స్క్రీన్ టైం దొరుకుతున్నాయా? లేదంటే వేరే సీన్స్ ఎక్కడ ఆడ్ చేసుకోవచ్చు? లాంటి ఎన్నో విషయాలపై అవగాహన వస్తుంది. 

సరే, స్టోరీ లైన్ రెడీ, కాన్సెప్ట్ క్లియర్, సినాప్సిస్ కూడా సూపర్, మరి వన్ లైన్ కి వెళ్ళటానికి ఫస్ట్ ఫస్ట్ గా వచ్చే డౌట్, ఎక్కడ మొదలు పెట్టాలి? ఫస్ట్ సీన్ ఏమై ఉండాలి? ఒక పెద్ద యాక్షన్ సీన్ తో మొదలు పెట్టాలా ? డైరెక్ట్ గా సాంగ్ వేసెయ్యాలా? హీరో ఇంట్రడక్షన్ తో మొదలు పెట్టాలా? ఇంట్లోనా? కొండల్లోనా? పార్క్ లోనా? ఇక్కడ ఆలోచించాల్సింది కథ తో మొదలు పెట్టాలా? పాత్ర తో మొదలు పెట్టాలా? పాత్ర తో అయితే విలన్ లేక హీరో ఇంట్రడక్షన్ తో మొదలు పెట్టుకోవచ్చు, అదే కథ తో అంటే సమస్య ఏంటి అనేది చూపిస్తూ మొదలు పెట్టొచ్చు. ఉదాహరణ కి శివ సినిమా లో కాలేజీ బయట జరిగే మర్డర్ తో మొదటి సీన్ మొదలు అవుతుంది, అది స్టోరీ రిలేటెడ్, పాత్ర రిలేటెడ్ కాదు, ఎందుకంటే అతను మెయిన్ విలన్ కాదు, హీరో కాదు అక్కడ చూపించాలి అనుకున్నది రౌడీయిజం గురుంచి. ఇలాంటి స్టార్టింగ్ పాయింట్స్ కి మళ్ళీ స్టోరీ లో ఇంపార్టెంట్ ప్లేస్ లో ఇంకొకసారి టచ్ చేసుకుంటూ ఇది ఇక్కడ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అదే పాత్ర రిలేటెడ్ అయి ఉంటె, ఉదాహరణ కి చంద్రలేఖ సినిమాలో రైల్వే స్టేషన్ లో నాగ్ ఎంట్రీ, ఆ సీన్ అక్కడ పాత్ర గురుంచి చూపించటానికి తప్ప ఆ సీన్ కానీ, ఆ సెటప్ కానీ సినిమాలో పెద్దగా ఉపయోగ పడక పోవచ్చు. బద్రి టైపు లో సాంగ్ తో స్టార్ట్ అయితే ఏంటి ప్రాబ్లెమ్? ఎం ఉండదు, జస్ట్ వీడికి ఎం చెప్పాలో కూడా తెలియలేదు అందుకే సాంగ్ ఏసినట్టు ఉన్నాడు అని ఫీల్ అవ్వటం తప్ప. అసలు ఆ దేశ భక్తి గీతం వలన సినిమా లో చెప్పాలి అనుకున్నది కూడా ఏమి లేదు కదా? 

స్టార్టింగ్ అనేది ఏ స్టోరీ కి అయినా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అసలు మొత్తం కథ కి నాంది పడేది అక్కడే, మూడ్ అఫ్ ది ఆడిటోరియం సెట్ అయ్యేది అప్పుడే, దానిని స్టార్ ఉన్నాడు అనో, ఇంకొకటి అనో ఇష్టం వఛ్చినట్టు ఎం తీసిన చూస్తారు లే అనుకుంటే, ఆ స్టార్టింగ్ ఒకటే మాట్లాడుకుంటారు. జనరల్ గా మొత్తం మూవీ కి స్టార్టింగ్ అండ్ క్లైమాక్స్ ఉన్నట్టే, ప్రతి ఆక్ట్ కి స్టార్టింగ్ అండ్ గమ్యం ఉంటాయి, ఫస్ట్ ఆక్ట్ గమ్యం సెకండ్ ఆక్ట్ కి నాంది పలకటం, సెకండ్ ఆక్ట్ ఇంటర్వెల్ కి నాంది పలకాలి, ఆ తర్వాత క్లైమాక్స్ కి నాంది, ఆ తర్వాత అసలైన గమ్యం చేరుకోవాలి. కథలో ప్రారంభం మద్యయం ముగింపు అని మూడు అంశాలు ఉంటాయి అని ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ప్రతి సీన్ కి కూడా ప్రారంభం మద్యయం ముగింపు ఉండాలి, ఒక వేల ముగింపు లేని సీన్ అయితే దాని కొనసాగింపు తర్వాత సీన్ లో కానీ, వేరే ఏదైనా సందర్భం లో కానీ పే ఆఫ్ అయినా ఉండాలి, లేదంటే అది ఒక ఫిల్లర్ గా మిగిలిపోతుంది అంతే. ఏ సీన్ రెండు నుంచి మూడు నిమిషాలకి మించి ఉంచకుండా చూసుకోవాలి (క్లైమాక్స్, ఇంటర్వెల్ లాంటివి తప్ప) దాని వలన ప్రేక్షకులు సహనం కోల్పోయే స్టేజి వరకు వెళ్లకుండా, నెక్స్ట్ సీన్ కి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది, సీన్స్ ని వేరొక ఆర్డర్ లో మార్చుకున్నప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా ఉంటుంది.  వ్రాసుకునే ప్రతి సీన్ అయితే కథని ముందుకి నడిపించేది అయ్యి ఉండాలి, లేదంటే ఏదైనా పాత్ర తాలూకు స్వభావం ని కానీ అందులో మార్పు ని కానీ సూచించేది అయ్యి ఉండాలి. ఇది మైండ్ లో పెట్టుకుంటే మెయిన్ పాయింట్ నుంచి డీవియేషన్ ఉండదు, కథనం కూడా కరెక్ట్ గా కుదిరే అవకాశాలు ఉన్నాయి. 

ఒకప్పుడు ప్రతి సీన్ కి కిందన దాని పర్పస్ కూడా వ్రాసుకునే వాళ్ళు అంట, దాని వలన నిజం గా ఈ సీన్ వలన ప్రయోజనం ఉందా లేదా అని ఒక క్లారిటీ ఉండి సందర్భాలు పర్ఫెక్ట్ గా కుదిరేవి, ఇప్పుడు ఉన్న కమర్షియల్ సినిమా యుగం లో ఈ రేంజ్ లో వ్రాసే వాళ్ళు ఉన్నారు అంటారా? మనం వన్ లైన్ ఆర్డర్ వ్రాసుకునే అప్పుడే, ఏ సీన్ ఎంత సేపు ఉంటుంది అని ఒక అవగాహన వస్తుంది, ఉదాహరణ కి ఒకడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకి వెళ్ళాలి అంటే, అది జస్ట్ ఇక్కడ ఒక షాట్ అక్కడ ఒక షాట్ వేసి చూపించొచ్చు, లేదా డ్రెస్ మార్చుకోవటం నుంచి మొదలు పెట్టి, అక్కడ చెప్పులు విప్పే వరకు చూపించొచ్చు, కానీ దాని వలన పర్పస్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి. సీన్ కి స్క్రిప్ట్ కి సంబంధం ఏంటి? ఆ సీన్ ప్రయోజనం ఏంటి? అది మన కథని ముందుకి తీసుకెళ్తుందా? ఆ సీన్ ద్వారా చెప్పాలి అనుకున్నది ఏంటి బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది.  

ఎప్పుడైనా సరే మన కథని ఫ్లాష్ బ్యాక్ రూపం లో చెప్పాలి అనుకున్నపుడు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఫ్లాష్ బ్యాక్ ఎప్పటికి మెయిన్ కథ అవ్వదు, మనం సినిమా ని ఎక్కడ స్టార్ట్ చేస్తున్నామో, ఎటు తీసుకు వెళ్తున్నామో, అదే రన్నింగ్ స్టోరీ, ఆ స్టోరీ కి ఒక సపోర్ట్ మాత్రమే ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ని ఫ్లాష్ బ్యాక్ లో నే అవ్వగొట్టేసి మెయిన్ కథ లోకి వచ్చేయాలి, లేదంటే ట్విస్ట్ కి కావాల్సిన లీడ్ వదిలేసి దానిని రన్నింగ్ స్టోరీ లో రెవీల్ చేసి అలరించవచ్చు. ఫ్లాష్ బ్యాక్ లో కథ ఎప్పుడు చెప్పాలి, ఎందుకు అది ఎంచుకోవాలి, అనేది మనం సింగల్ లైన్ ఆర్డర్ వేసుకున్నాక, కథనం లో బెటర్మెంట్ కోసం చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ లో డిసైడ్ అవ్వొచ్చు, దాని కోసమే కథని ఆలా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణ కి అసలు బాషా అనే సినిమా మొదటి అనుకున్నది ప్లైన్ నరేషన్, అక్కడ ఫ్రెండ్ ని కోల్పోయి, బాషా గా మారి, అక్కడ నుంచి ఆటో డ్రైవర్ గా వచ్చి.. ఇలా, వ్రాసేసుకొని, షూటింగ్ చేసేసుకొని, ఎడిటింగ్ దగ్గర కి వచ్చాక ఇప్పుడు మనం చూసిన సినిమా గా మార్చారు. ఫ్లాష్ బ్యాక్ సినిమాలకి అదొక మాస్టర్ కాపీ లా తయారు అయ్యి ఎంతో మందికి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఫార్మటు అయ్యింది. ఇంకొక ఉదాహరణ గా ఒక్కడు సినిమా గుణ శేఖర్ వ్రాసుకున్న లైన్ ప్రకారం అయితే, కర్నూల్ లో ఓపెన్ అయ్యి, ఓబుల్ రెడ్డి ని కొట్టి, భూమిక ని తీసుకు వెళ్లే అప్పుడు పది రోజులు ముందు అని ఫ్లాష్ బ్యాక్ లో మనం చూసిన ఫస్ట్ హాఫ్ ని ప్లాన్ చేసుకున్నారు అంట, అంత పెద్ద యాక్షన్ ఎపిసోడ్ తర్వాత చెల్లితో కామెడీ, వీధిలో సోడా బ్యాచ్ అంటే రసానుబూతి దెబ్బతింటుంది అని ఫైనల్ గా మనం చూసిన ప్లైన్ వెర్షన్ కి మార్చుకున్నారు. మన చేతిలో పకడ్బందీ కథనం ఉంటె, దాని ఆర్డర్ ఎలా ఐన మార్చుకునే అవకాశం ఉంటుంది. 

వన్ లైన్ సీనిక్ ఆర్డర్ మొదలు పెట్టినప్పుడు ఒక మార్గదర్శకం గా ఉండే అంశం ఏంటి అంటే స్ట్రక్చర్. ఈ సిరీస్  లో చెప్పుకున్న త్రీ ఆక్ట్ స్ట్రక్చర్, పాత్రల స్వభావం - చిత్రణ, స్క్రీన్ప్లే టూల్స్ అండ్ టెక్నిక్స్, సినాప్సిస్ అన్ని అర్ధం చేసుకొని అవలోకనం చేసుకోవాలి. ఉదాహరణ కి 60 / 80 సీన్స్ మధ్య లో మొత్తం సినిమా ఉండబోతుంది అంటే, ఫస్ట్ ఆక్ట్ (ప్రారంభం) కి 15/20, సెకండ్ ఆక్ట్ (మధ్యమం) కి 30/40, థర్డ్ ఆక్ట్(ముగింపు) కి 15/20 ఉండేలా చూసుకోవటం మంచిది.  రెండు మూడు సీన్స్ అటు ఇటు ఐన పర్లేదు కానీ, మరీ ఇంటర్వెల్ కి సెకండ్ ఆక్ట్ కి ఎంటర్ అయ్యేలా చూసుకుంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే గా తయారు అవుతుంది. మొదటి 15/20 సీన్స్ లో పాత్రలు, పరిచయాలు, కథ తాలూకు నేపథ్యం, అసలు సమస్య దానికి దారితీసిన కారణాలు, సంఘర్షణ అన్ని ఎస్టాబ్లిష్ చేశామా లేదా అని చూసుకోవాలి, మొదటి మలుపు అదే ప్లాట్ పాయింట్ మన క్లైమాక్స్ కి బీజం కాబట్టి, అది సరిగ్గా / పకడ్బందీ గా కుదిరిందా లేదా అని చెక్ చేసుకోవాలి. 

ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రధాన పాత్ర క్యారెక్టర్ ఆర్క్ చెక్ చేసుకుంటూ మిగతా సీన్స్ డెవలప్ చేసుకోవచ్చు, ఆలా ముందుకి వెళ్ళటానికి గైడ్ లైన్ గా ఈ పిక్చర్ ఉపయోగ పడుతుంది. 




ఆక్ట్ 1 : 
ఇంట్రడక్షన్ టు ఆర్డినరీ వరల్డ్ : పాత్ర పరిచయం, స్వభావం, పరిస్థితులు
కాల్ టు యాక్షన్ : తనకి ఏర్పడిన లక్ష్యం, అది అంత వరకు తాను అందనిది, తాను చేయనిది, చెయ్యాలి అనుకున్నది మాత్రమే అయ్యి ఉండాలి. తన ఆర్డినరీ వరల్డ్ ని కుదిపేసిన అడ్వెంచర్ అయ్యి ఉండాలి. 
క్రాసింగ్ ది త్రెషోల్డ్: ప్లాట్ పాయింట్ 1 దగ్గర హీరో కి ఏర్పడిన ప్రాబ్లెమ్ ని పేస్ చెయ్యటానికి రెడీ గా ఉంటె తేలిపోతుంది, అందుకే ముందు దానికి సిద్ధం గా లేనట్టు ఉండాలి, దీనినే రెఫ్యూసల్ అఫ్ ది కాల్ అంటారు, అక్కడ ఒక క్యాటలిస్ట్ లాంటి క్యారెక్టర్ ముందుకి వెళ్లేలా ప్రోత్సాహం అందించాలి, అక్కడితో సెకండ్ ఆక్ట్ కి లింక్ వేసుకోవచ్చు. 

ఆక్ట్ 2:
ఫస్ట్ ఛాలెంజ్ / ఇన్నర్ మోస్ట్ కర్వ్ / టెంప్టేషన్ :  : మారిన తన పరిస్థితుల వలన ఎదురైనా సమస్య లు, సరదాలు, సరసాలు, సరాగాలు, సమస్య మీద సమస్య నుంచి డీప్ గా ఇరుక్కుపోవడం, లేదా తిరగబడాల్సిన సందర్భం రావటం, లేదా ఎదురు దెబ్బ తినే స్థాయి కి పడిపోవటం. దీనినే మన సినిమా పరి బాషా లో లీడ్ ఫర్ ఇంటర్వెల్ బాంగ్ అనుకోవచ్చు.తర్వాత ఎం జరగబోతుంది అనే ఉత్కంఠత కలిగించే సందర్భం తో ఇంటర్వెల్. 
డార్క్ మూమెంట్ / సుప్రీమ్ ఛాలెంజ్ : అక్కడ నుంచి దెబ్బ తిన్న వాళ్ళ ఎత్తుకు పై ఎత్తులు, పెరుగుతున్న కష్టాలు, ఇంకా ముందుకి వెళ్లే దారి లేదు అనే సందర్భం. 

ఆక్ట్ 3 : 
ఫైనల్ కాన్ఫ్లిక్ట్ / రిటర్న్ హోమ్: మొదట్లో మనకి ఆక్ట్ షిఫ్టింగ్ కి ఉపయోగ పడిన క్యాటలిస్ట్ లాంటి పాత్ర సహాయం తో ఫైనల్ గా తాడో పేడో తేల్చుకోటానికి వెళ్లి తాను అనుకున్నది సాధించటం తో సుకాంతం.ఈ ముగింపు మనం ఫస్ట్ ఆక్ట్ లో చెప్పుకున్న ప్లాట్ పాయింట్ దగ్గర ఎండ్ అవుతుంది. ఆలా కాకుండా మధ్య లో మారిన లక్ష్యం ఉంటె, దానిని ప్రేక్షకుడు అర్ధం చేసుకునేలా చెప్పగలిగితే ఇంకొక ఎండింగ్ ఉంటుంది. 

ఈ పోస్ట్ లోనే ఉదాహరణలు ఉంటె బావుంటుంది అనే ఫ్రెండ్స్ సూచన మేరకు, పరుచూరి గోపాలకృష్ణ గారి 11th అవర్ పుస్తకం నుంచి చాలా మందికి తెలిసిన "ఇంద్ర" మరియు "నరసింహ నాయుడు" సీనిక్ ఆర్డర్ ని ఇక్కడ ఇమేజెస్ గా పోస్ట్ చేస్తున్నాను. 


















ఇది కేవలం నాకు ఉన్న లిమిటెడ్ నాలెజ్ లో నేను రాసింది, ఈ ఆర్టికల్ చదివే అనుభవజ్ఞులు వారి అభిప్రాయాలు సూచనలు సలహాలు షేర్ చేసుకుంటే రుణ పడి ఉంటాను.


1 comments:

Anonymous said...

Manchi commercial cinemalu these talent pettukuni, reviews rasthu time waste chestunnavemo anipistundi bayya..but neevalla okkadina manchi film maker avtadu sure...

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views