జనతా గ్యారేజ్ - కథ కథనం - విశ్లేషణ
స్వతహాగా రైటర్ అయిన కొరటాల శివ సినిమాలలో కథలు ఎలా ఉన్నా కథనం తో, ఒక మెసేజ్ తో, కమర్షియల్ వాల్యూస్ తో, మిర్చి అండ్ శ్రీమంతుడు లాంటి కమర్షియల్ హిట్స్ సొంతం చేసుకున్నారు. మూస సినిమాల తో ట్రాక్ తప్పిన ఎన్ టి ఆర్, ట్రాక్ మార్చి, టెంపర్ అండ్ నాన్నకు ప్రేమతో సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు అభిమానులని అలరించాడు. వీళ్లిద్దరి కలయిక లో సినిమా అనౌన్స్ చేసిన రోజే ఒక పాజిటివ్ ఫీలింగ్, దీనికి కారణం కొరటాల శ్రీమంతుడు ఇఛ్చిన కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్, బ్యాక్ టు బ్యాక్ డీసెంట్ మూవీస్ ఇచ్చిన హీరో, మోహన్ లాల్, నిత్యా, సమంతా లాంటి కాస్టింగ్, ఫఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు తీసుకు వచ్చిన హైప్, ఇవన్నీ వెరసి జనతా పై అంచనాలను అమాంతం పెంచేసాయి. ఎలివేషన్ సీన్స్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసే కొరటాల కి ఎన్ టి ఆర్ లాంటి మాస్ హీరో తోడు అయితే, ఆ కమర్షియల్ ఎపిసోడ్స్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆత్రుత సగటు ప్రేక్షకుడికి కలిగింది అంటే కారణం కొరటాల శివ పై పెట్టుకున్న అపారమైన నమ్మకం. మరి ఆ నమ్మకం ని అయన ఎంత వరకు నిలబెట్టుకున్నాడు? ఎంత వరకు అలరించాడు? వస్తున్న కలెక్షన్స్ చాలవా నీ ప్రశ్నలకి సమాధానం అని అనుకునే అభిమానుల ఎమోషన్స్ ని, బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ ని పక్కన పెట్టి, సినిమా పరంగా, కథ - కథనం ని విశ్లేషించుకునే ప్రయత్నమే ఈ ఆర్టికల్.
"సినిమా చూడని వాళ్ళు, చూడాలి అనుకునే వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిది" అని నా అభిప్రాయం. ఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు
కథ : "ఇది ఒక కుటుంబం కథ, కష్టాల్లో ఉన్న కుటుంబాల కన్నీళ్లు తుడిచే ఒక కుటుంబం కథ". ఇది మోహన్ లాల్ కుటుంబం కథ. కాబట్టి ఈ కథని ఎన్.టి.ఆర్ ని దృష్టిలో పెట్టుకొని చెప్పుకోలేం? సింపుల్ గా, హైదరాబాద్ లో గ్యారేజ్ పెట్టుకొని వాహనాలతో పాటు, సామజిక సమస్యలని కూడా రిపేర్ చేస్తున్న సత్యం, తన తర్వాత తన బాధ్యత ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ చేస్తున్న ఆనంద్ కి అప్ప చెప్తే, తన సొంత కొడుకే తాను చెయ్యాల్సిన రిపేర్ అయితే? ఎం చేసాడు? బేసిక్ గా అయితే ఇదే కథ, కానీ ఈ కథ లో ఎన్.టి.ఆర్ లేడు కాబట్టి, ఇదే కథని వేరేలా చెప్పుకుందాం. ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ చేస్తున్న ఆనంద్, నేచర్ ని ఎవడు డిస్టర్బ్ చేసినా వదలడు, అనుకోకుండా హైదరాబాద్ వచ్చి, జనతా గ్యారేజ్ గురుంచి తెలుసుకొని బాధ్యతలు మోయాల్సి వస్తే? ఎం చేసాడు? ఇలా చెప్పుకున్న కథ లో కంప్లీట్ నెస్ లేదు, ఈ సోది అంతా ఎందుకు అంటే, ఈ సినిమా కి వన్ లైన్ లో చెప్పుకునే కథ లేదు అని చెప్పాలి కాబట్టి. రెండు స్టోరీ లు కలిపి ఒక లైన్ లో చెప్తే అసలు కథలో అర్ధమే ఉండదు. ఈ కథ బహుశా ఒక సినాప్సిస్ గానో లేక వన్ లైన్ సీనిక్ ఆర్డర్ గానో పుట్టింది ఏమో.
సినాప్సిస్ : తాను సెటప్ చేరిన జనతా గ్యారేజ్ కి కష్టం అని ఎవరు అయినా తన వస్తే, తన అనుచరులతో కలిసి దానిని రిపేర్ చేసే సత్యం ఫాలోయింగ్ తో పాటు ఎనిమీస్ ని కూడా సంపాదించుకుంటాడు. తనపై ప్లాన్ చేసిన ఎటాక్ లో, తమ్ముడు అతని భార్య చనిపోతే, తమ్ముడు కొడుకు ని బావ మరిది కి ఇచ్ఛేసి తన నీడ కూడా పడకుండా పెంచుకోమంటాడు. ముంబై లో పెరిగిన ఆనంద్, పర్యవరణ పరిశోధన చేస్తూ, దానిని కాపాడుకోవటానికి ఎంత దూరం అయినా వెళ్తూ ఉంటాడు. ఇక్కడ సత్యం కి కూడా వయసు అయిపోయి, కొడుకు వారసత్వం తీసుకోటానికి రెడీ గా లేడు అని తెలుసుకొని, గ్యారేజ్ ఫ్యూచర్ గురుంచి ఆలోచిస్తూ ఉండగా, ఒక ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆనంద్ అనుకోకుండా జనతా గ్యారేజ్ వ్యవహారం లో ఇన్వాల్వ్ అవుతాడు. అక్కడ నుంచి గ్యారేజ్ బాధ్యత తీసుకుంటాడు, మావయ్య కంటే పెదనాన్న కి తన అవసరం ఎక్కువ ఉంది అని డిసైడ్ అవుతాడు. అలాంటి టైం లో సత్యం కొడుకు తాను రిపేర్ చెయ్యాల్సిన ప్రాబ్లెమ్ అని తెలుస్తుంది. ఎం చేసారు?
ఇదే కథ ని ఎవరైనా కొత్త డైరెక్టర్ చెప్పి ఉంటె పట్టించుకునే వారు కాదు కానీ, కొరటాల చెప్పినప్పుడు తాను తీసిన పాత సినిమాల కథలు, తీసిన విధానం, అవి ఇఛ్చిన రిజల్ట్స్ రిఫరెన్స్ గా చూసుకొని ఓకే చెప్పేసి ఉండాలి మరి.
కథనం : "జనతా గ్యారేజ్ ఎవ్వరిని వదిలి పెట్టదు, కన్న కొడుకు అయినా సరే" అనే ఒకే ఒక పాయింట్ తీసుకొని, అక్కడనుంచి ముందుకి లాక్కొచ్చిన కథనం అని అనిపిస్తుంది. ఏ కథ / కథనం కి ఐన ముఖ్యమైన విషయం కాన్ఫ్లిక్ట్.
All Drama is Conflict,
Without Conflict - there is no Action,
Without Action - there is no Character,
Without Character - there is no Story,
Without Story - there is no Screenplay - SydFiled.
ఏ కథ కి అయినా కాన్ఫ్లిక్ట్ ముఖ్యం, సంఘర్షణ అనేది తాను ఎంచుకున్న మార్గానికి ఎదురైన ప్రతిబంధకం. అదొక సమస్య రూపం లో అయినా, వ్యక్తి రూపం లో అయినా, అది ఎంత బలం గా ఉంటే కథనం అంత నిలబడుతుంది. సులువుగా చెప్పుకోవాలి అంటే...
సంఘర్షణ అనేది మనిషికి - మనిషికి, మనిషికి - వ్యవస్థ కి, మనిషి కి - ప్రకృతి కి, మనిషికి - విధి కి, మనిషి కి - సాంకేతిక విజ్ఞానం కి, మనిషికి - తనతో తనకే ఇలా ఏదైనా కావొచ్చు. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది, స్ట్రక్చర్ ప్రకారం ఫస్ట్ ఆక్ట్ ముగిసే టైం కి ఎస్టాబ్లిష్ అవ్వాలి ఒక ప్లాట్ పాయింట్ గా అని చెప్పుకున్నాం, ఈ సినిమా వరకు ఫస్ట్ హాఫ్ అయిపోయినా అది ఏంటో మనకి తెలియదు, ఇలాంటి కథనం ని "మిడిల్ మిస్సింగ్" సోల్స్ అంటారు. బిగినింగ్ ఉంటుంది, బిగినింగ్ మాత్రమే ఉంటుంది, మిడిల్ కానీ, ఎండింగ్ కానీ ఉండవ్, కథకి ఎండింగ్ లేకుండా ఆలా కొనసాగుతూనే ఉంటుంది, ఎదో ఒక స్టేజి లో ఆగుతుంది అంతే. దీనిని ఏకసూత్రత (the state of being well-knit) లోపించిన విధానం అంటారు, సెంట్రల్ పాయింట్ అనేది దేని చుట్టూ ఉన్నట్టు? కుటుంబం చుట్టూ? గ్యారేజ్ చుట్టూ? ఎన్విరాన్మెంట్ చుట్టూ? ప్రేమ ? పగ? ఆన్సర్ అయితే గ్యారేజ్ చుట్టూ నే, కుటుంబం లో కాన్ఫ్లిక్ట్ ఉంది, కానీ గ్యారేజ్ విషయం లో ఎక్కడ కాన్ఫ్లిక్ట్ కనపడదు? పోనీ కాన్ఫ్లిక్ట్ ఉన్నా కుటుంబం చుట్టూ తిరిగే కథ కూడా కాదు. స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ టైపు లో, ఒక ప్రాబ్లెమ్ - దానిని సాల్వ్ చేసుకోవటం, రెండో ప్రాబ్లెమ్ దానిని సాల్వ్ చేసుకోవటం, ఇంకో ప్రాబ్లెమ్, ఇలా ఎంత కాలం కావాలంటే అంత కాలం తీసుకోవచ్చు.
ఈ కథనం ని త్రీ ఆక్ట్ స్ట్రక్చర్ లో చెప్పుకోటానికి లేదు, ఎలా చూసామో ఆలా చెప్పుకోవటమే
బిగినింగ్: 1980??, ఇద్దరు ఫ్రెండ్స్, ఒకడు సివిల్ సర్వీసెస్ లో జాయిన్ అయ్యి సర్వీస్ చేస్తా అంటాడు, జాయిన్ అవుతాడు. ఇంకొకడు మా అన్నయ్య సత్యం తో గ్యారేజ్ పెట్టిస్తా అంటాడు పెట్టిస్తాడు. గ్యారేజ్ ప్రజల పక్షం తీసుకునే ముందే ఇచట అన్నీ రిపేర్లు చేయబడును అనే స్లోగన్ తో మొదలు అవుతుంది. ఇంతలో ఒకరికి కష్టం, సత్యం పోలీస్ ఫ్రెండ్ ని ఆశ్రయిస్తాడు, పని అవ్వలేదు అని చట్టం ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. సర్వీస్ చెయ్యటానికి కంకణం కట్టుకున్న ఫ్రెండ్ తిరగబడతాడు అనుకుంటే, ఇవి ఆపెయ్యండి - మీరు కొంచెం జాగ్రత్త గా ఉండండి అంటాడు, ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చెయ్యటానికి అవసరం అయిన సెటప్ వేస్ట్ అయ్యింది. అక్కడ నుంచి లాస్ట్ వరకు చెప్తానే ఉంటాడు, మానెయ్యండి - జాగ్రత్తగా ఉండండి అని. ఇంతలో విలన్ వచ్చి వార్నింగ్ ఇద్దాం అనుకుంటాడు, కానీ అక్కడే సైలెంట్ అయిపోతాడు, సత్యం తమ్ముడిని - భార్య ని చంపేసి పిల్లాడిని వదిలేస్తారు. మళ్ళీ పోలీస్ ఫ్రెండ్ వస్తాడు, ఇవి ఆపెయ్యండి - మీరు కొంచెం జాగ్రత్త గా ఉండండి అంటాడు. తమ్ముడి కొడుకు ని బావ మరిది కి అప్ప చెప్పేసి, తీసుకెళ్లిపొండి, ఇవి ఆపం అంటాడు. జనాల కోసం జనతా గ్యారేజ్ కష్టపడుతూనే ఉంటుంది అంటాడు, గోల్ సెట్ అయ్యింది అన్నమాట. ఆలా ఇచ్చేయ్యటం వలన సత్యం కి వచ్చిన నష్టం లేదు, తమ్ముడు పోయాడు, తమ్ముడి కొడుకు వెళ్ళిపోయాడు, నేను - నా కొడుకు - నా గ్యారేజ్ అంతే.
బిగినింగ్: 1980, ముంబాయి, నిజమే అనుకుంట, టైం అక్కడే ఉంది, కానీ పెళ్లి అయిపోయి పిల్లాడు పుట్టేసాడు, పేరెంట్స్ పోయారు, స్టోరీ షిఫ్ట్. ప్రెసెంట్ కి కట్ చేస్తే, 36+ ఏళ్ళ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ స్టూడెంట్ ఆనంద్ పరిచయం. మరదలు పరిచయం. ఏదైనా కెరీర్ గురుంచి ఆలోచించారా అంటే, ఐ అం ఇన్ సీరియస్ కెరీర్, "ఎన్విరాన్మెంట్ ని కాపాడటం" అంటాడు. గోల్ సెట్ అయ్యింది అనుకోవాలి. అంత కాపాడాలి అనుకున్న వాడివి సైకిల్ ఏసుకొనో, నడుచుకొనో పోవాలి కానీ, రాయల్ గా పొల్యూట్ సేస్తే ఎలా? అక్కడ నుంచి జనతా కి షిఫ్ట్ ఐన విధానం చూసి, మంచి ఇంటెర్లింకింగ్ తో స్క్రీన్ప్లే వ్రాసుకునట్టు ఉన్నారు అనిపిస్తుంది. ఆ థాట్ అక్కడితో ఆగిపోతుంది.
బిగినింగ్: స్టార్ట్ - స్టాప్: సత్యం కొడుకు ఏవో పెద్ద కలలు కంటున్నాడు అని, అవి సత్యం కి ఇష్టం లేవు అని చూపించారు, కానీ కొడుకు ని దారి మళ్లించటం గురుంచి ఆలోచించడు. ఇంతలో అల్ పార్టీ మీటింగ్ కి సత్యం ని పిలిచిన సీఎం. ఒక స్టేట్ సీఎం, పైన హై కమాండ్ ఉందొ లేదో తెలియదు కానీ, ఇంత పాసివ్ క్యారెక్టర్ ఆ ? సీఎం ఏ ఆలా ఉంటె, పోలీసులు ఇలా ఉండటం లో తప్పు లేదు. రెండు వందల యాఫై ఎకరాలు కాంట్రాక్టు క్లోజ్. ఆ తర్వాత ఆ కాంట్రాక్టు మళ్ళీ తెరపైకి రాదు.
ఫిల్లెర్స్: దీపావళి - నిత్యా ఎంట్రన్స్, సమంతా మీద హీరో కి ఉన్నా ప్రేమ తెలిపే సీన్స్, ఎన్విరాన్మెంటల్ గురుంచి సీన్స్, ప్లాస్టిక్ కవర్స్, రోడ్ ట్రిప్, సాంగ్, ఆ సాంగ్ ద్వారా కూడా ఎం చెప్పాలి అనుకున్నారో తెలియదు. హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను అని హీరో అనటం, సురేష్ భయపడి వద్దు అనటం, ఎన్విరాన్మెంట్ ఎక్కడ అయినా ఎన్విరాన్మెంట్ ఏ అని అనుకోని హీరో ఉండి పోవటం. రెఫ్యూసల్ అఫ్ ది కాల్ హీరో తరపున కాకుండా, హీరో కి వేరే పాత్ర ద్వారా ఆగిపోతుంది అంతే, సో మోటివేషన్ కూడా ఆ పాత్ర కె ఉండాలి మళ్ళీ హీరో ని పంపటానికి, ఆ విధం గా ఆగు అంటే ఆగిపోయి, వెళ్ళు అంటే వెళ్లే క్యారెక్టర్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ పాత్ర కి ఎదురు తిరిగే అంత సాహసం చెయ్యలేని పాత్ర గా మిగిలిపోతుంది.
బిగినింగ్: స్టార్ట్ - స్టాప్: మధ్య లో అంత గ్యాప్ లేక పోతే ఈ ఆక్సిడెంట్ బాగానే పండేది కానీ, మధ్య లో నస వలన ఒక ఆక్సిడెంట్, మళ్ళీ పోలీస్ ఫ్రెండ్ వస్తాడు, ఇవి ఆపెయ్యండి - మీరు కొంచెం జాగ్రత్త గా ఉండండి అంటాడు. కట్ చేస్తే ఎదో జాగర్స్ పార్క్ ఇష్యూ, నేచర్ ఫైట్, సందర్భం ఏదైనా కూడా, ఈ ఇష్యూ కూడా ఇక్కడితో క్లోజ్. సాంగ్. ఫైట్ వలన ఎక్కడికైనా పంపాల్సి రావటం, టికెట్ తీసి హైదరాబాద్ తగిలెయ్యటం.
లీడ్ టు ఇంటర్వెల్: రాజీవ్ కనకాల రావటం, మేము చెయ్యటం లేదు అని చెప్పి పంపెయ్యటం. విషయం తెలిసిన సత్యం తన కొడుకు ని చూసుకోమనటం, కొడుకు నా వల్ల కాదు అనటం. పోనీ నచ్చ చెపుదాం అనుకోడు, 35 ఇయర్స్ గా నా షెడ్ లో ఉన్నా ఎవడో ఒకడికి అప్ప చెపుదాం అనుకోడు, ఇంతలో కొడుకు పెళ్లి. హైదరాబాద్ వఛ్చిన హీరో, మైనింగ్ ఆపటం ఫైట్. 200 కోట్లు ప్రాజెక్ట్ ఒక ఫైట్ తో ఆగిపోతుంది, అక్కడితో ఆ ఇష్యూ కూడా ఆగిపోతుంది. జనతా గురుంచి తెలుసుకోవటం. మీరు మంచి అని నమ్మి వచ్చాను, నటిస్తున్నారు అని తెలిస్తే మిమ్మల్ని రిపేర్ చేస్తా అని ఇంటర్వెల్.
వీళ్లిద్దరి మధ్య అపార్ధాలు, హీరో తిరగబడటం, తప్పుగా అర్ధం చేసుకున్నాడు అని తెలుసుకొని రియలైజ్ అవ్వటం, అప్పుడు తన ఆశయం పక్కన పెట్టి జనతా పక్కన నిలబడటం, తర్వాత సత్యం గారే పెదనాన్న అని తెలుసుకోవటం, ఈ ఆశయం లోనే పేరెంట్స్ చనిపోయారు అని తెలుసుకొని ఉంటె ఇంకా గట్టిగా ఉండేది ఫౌండేషన్, మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంది?
ఆఫ్టర్ ఎఫెక్ట్స్: నువ్వు వచ్చినప్పుడు అడిగితే బాగోదు అనుకున్నాడో ఏమో, సత్యం కాలేజీ కి వెళ్లి ఆనంద్ ని జనతా గ్యారేజ్ బాధ్యతలు తీసుకోమంటాడు. రెండు షాట్స్ లో బాగా లో అలోచించి ఆనంద్ ఓకే అంటాడు. ఎం అలోచించి ఉంటాడు? ఎందుకు ఓకే అని ఉంటాడు? అసలు తాను ఎంచుకున్న సీరియస్ కెరీర్ నుంచి ఇది ఎంచుకోవాల్సి అవసరం ఏమొచ్చింది? తన గోల్ ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది?
కథానాయకుడి గోల్ మారటానికి బలమైన కారణం అయినా ఉండాలి, లేదా, తాను అప్పటి వరకు చేస్తున్న దాని కంటే చెయ్యాల్సింది ఎంతో ఉంది అని తెలుసుకోవటం వలన అయినా అయ్యి ఉండాలి, ఉదాహరణ కి అప్పటి వరకు ఇంటిని కాపాడుతున్న వాడు, ఊరిని కాపాడాల్సి రావటం కావొచ్చు.
నువ్వెంత, నేనెంత, రవ్వంత అనే నాయకుడు, అంత పెద్ద పర్యావరణం ని వదిలేసి గ్యారేజ్ ని ఎంచుకోవటం అంటే, JEE టాప్ 10 లోపు ర్యాంక్ వచ్చిన వాడు, ఎంసెట్ లో వచ్చిన 2 ర్యాంక్ కి యూనివర్సిటీ లో సీట్ ఎంచుకోవటం తో సమానం. ఏదైతేనేం జాయిన్ అయిపోయాడు. ఎక్కడ ఆగిందో అక్కడే మొదలు పెడతా అన్నాడు, సినిమా మొత్తానికి కొరటాల స్థాయి సీన్ అంటే GHMC సీన్ అనే చెప్పుకోవాలి, ఆ సీన్ కి ఒక బెగినింగ్ ఉంది, మిడిల్ ఉంది, ఎండ్ ఉంది. మొదట్లో ప్రాబ్లెమ్ వచ్చినప్పుడు పట్టించుకోలేదు, ఇంటి వరకు వచ్చాక జనతా ని నమ్ముకున్నాడు, ఆలా అని హీరో కూడా వెంటనే ఒప్పుకోలేదు, ఏ రోజు కలవక పోతే ఎం చేసేవాడివి అంటే, చచ్చిపోదాం అనుకున్న అంటాడు, హీరో కి మోటివేషన్ దొరికింది, ముందు వైఫ్ భయం ని పోగొట్టాడు, తర్వాత ఆఫీస్ లో సాల్వ్ చేసాడు, అసలు తనపై గ్యారేజ్ బ్యాచ్ కి ఒక నమ్మకం కలిగించాడు, అన్ని విధాలుగా కరెక్ట్ గా కుదిరిన సీన్ ఇది. కానీ గ్యారేజ్ మనుషుల్లో మార్పు / నమ్మకం మంచి డైలాగ్స్ చెప్తున్నప్పుడు కంటే, దెబ్బలు కొడుతుంటే రావటం బలే కామెడీ గా ఉంటుంది. ఎంత కామెడీ గా అంటే, దేవుడు పంపిన సైనికులు అని పాటలో లిరిక్ వాస్తు ఉంటె, అందరు వాలీ బాల్ ఆదుకునే అంత కామెడీ గా.
ఈ సారి పోలీస్ ఫ్రెండ్ పిలుస్తాడు, ఇవి ఆపెయ్యండి - మీరు కొంచెం జాగ్రత్త గా ఉండండి అంటాడు.
డ్రామా : స్టార్ట్ - స్టాప్: సురేష్ వచ్చి నిలబడతాడు, నా కూతురు కావాలా - గ్యారేజ్ కావాలా తేల్చుకో అంటాడు, దేవుడు నన్ను ఇంత గొప్ప ఫ్యామిలీ నుంచి దూరం చేసాడు, ఇప్పుడు వీళ్ళని వదిలి ఎలా వస్తా అంటాడు, మావయ్య అంటే గౌరవం, నువ్వు లేక పోతే బ్రతకలేను అని హీరోయిన్ తో అంటూనే, గ్యారేజ్ లేక పోతే జీవితమే లేనట్టు అనిపిస్తుంది అంటాడు. డైలాగ్స్ పరం గా, నటన పరం గా, ఇది ఇంకొక మంచి సీన్, కానీ దానికి తగ్గ ఫౌండేషన్, ఉపోద్గాతం లేక పోవటం వలన అక్కడ తారక్ పెర్ఫార్మన్స్ ఒకటే కనిపిస్తుంది. దాని గురుంచే మాట్లాడుకుంటాం కానీ GHMC టైపు లో సీన్ గురుంచి మాట్లాడుకోము. ఈ సీన్ పెట్టింది సాంగ్ కోసమా? అంత బాధ కలిగించే సాంగ్ పెట్టింది నిత్యా తో కామెడీ సీన్ కోసమా? నిజమైన కథానాయకుడు, ఒక దాని కోసం ఇంకోటి వదులుకోడు - ఎందుకంటే అంత గోల్ ని వదిలేసుకొనే అవసరం కానీ, ప్రేమని త్యాగం చేసే సందర్భం కానీ కలిగించలేదు, కదిలించలేదు - రెండు సాదించుకుంటాడు, ఎందుకంటే అంత గోల్ ని వదిలేసుకొనే అవసరం కానీ, ప్రేమని త్యాగం చేసే సందర్భం కానీ కలిగించలేదు, కదిలించలేదు మాములుగా అయితే మూడు, ఒకటి తన పర్యావరణ కెరీర్, ఇంకోటి ప్రేమ, మూడోది గ్యారేజ్, కానీ ఇక్కడ మన కథానాయకుడు ??
బిగినింగ్ : ఫస్ట్ టైం మెయిన్ విలన్ వచ్చి ఆనంద్ ని కలుస్తాడు, నేను పులి ని అంటాడు, కాదు నేనే పులిని అని హీరో అంటాడు. ముప్పై అయిదు ఏళ్ల ముందు ఎలా వెళ్లిపోయాడో, అలాగే వెళ్ళిపోతాడు విలన్. హీరోయిన్స్ తో పాటు గెస్ట్ రోల్ వేసిన విలన్ ని ఈ సినిమా లో చూస్తాం. మరీ తేలిపోయిన విలన్ అటు ముసలోడి, ఇటు కుర్రోడికి ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయాడు. సత్యం కొడుకు ని తన కూతురు కి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు అయినా ఏదైనా డ్రామా ఉంటుంది ఏమో అని మనం అనుకుంటాం తప్ప ఎం ఉండదు. ఇంకా సీన్ కి వస్తే, గ్యారేజ్ పద్ధతులు మారాయి, కష్టం ఉంది అని తెలిస్తేనే ఎగబడి వెళ్ళిపోతున్నాం అంటారు కానీ ఎవరైనా గ్యారేజ్ కి వస్తేనే కదా రేపైర్లు చేస్తున్నారు? కట్ చేస్తే మళ్ళీ CM తో కామెడీ.
క్లైమాక్స్ కి బిగినింగ్; ఇంకా లాభం లేదు, CM తో పని అవ్వదు, సీఎం ని మార్చెయ్యాలి అంటే ఎం చెయ్యాలి ? బాంబు బ్లాస్ట్ ప్లాన్ చెయ్యాలి అని సత్యం కొడుకు ఐడియా, బేసిక్ గా విలన్ మొదటి నుంచి అమాయకుడు (సెన్సార్) ఆడు సత్యం కొడుకు (ఇంకో అమాయకుడు) మాట వినటం, అంత క్రియేటివ్ ఐడియా వాళ్ళకి రావటం నిజం గా చివరి ఘట్టానికి గంట మోగడం తో సమానం. 35 ఇయర్స్ క్రితం 25 ఇయర్స్ బాయ్ అనుకున్నా 60 ఇయర్స్ టైం లో అజయ్ కి పెళ్లి, ఐటెం సాంగ్, బాంబు బ్లాస్ట్. అజయ్ చావు, పోలీస్ ఫ్రెండ్ ఏ అలసి పోయి న్యాయం కోసం జనతా కి రావటం.
అసలు ఈ సినిమాలో ఉన్న ఇద్దరు పవర్ ఫుల్ హీరోస్ కి ఉన్న క్యారెక్టర్ గ్రాఫ్ నాకు ఎలా అర్ధం అయ్యింది అంటే
క్లైమాక్స్ : అన్ని దారులు మూసుకు పోయింది పోలీస్ ఫ్రెండ్ కి, సత్యం కానీ ఆనంద్ కానీ అజయ్ కేసు వదిలేస్తే బాంబు బ్లాస్ట్ గురుంచి కూడా పట్టించుకోరు? చనిపోయింది అజయ్ కి కాబోయే వైఫ్ అయినందుకు ఐన పట్టించుకోవాలి కదా? మొదట్లో తమ్ముడు పోయినప్పుడు కూడా అంతే, కనీసం రివెంజ్ ఐన తీర్చుకోవాలి అనే థాట్ వీళ్ళకి రాదు ఎందుకు? ఇంతలో ట్విస్ట్, అజయ్ ని చంపింది సత్యం కొడుకు అని తెలుసుకుంటాడు. ఈ తెలుసుకొనే ప్రాసెస్ లో కూడా తాను చేసింది ఎం ఉండదు, ఆటోమేటిక్ గా క్లైమాక్స్ రావాలని హీరో కి తెలిసేలా చేసారు అంతే. ఎం చేద్దాం అనుకుంటున్నావు అని సత్యం అంటే, చంపేస్తా అంటాడు ఆనంద్. ఇంతలో ఇంట్లో వాళ్ళు అందరు డ్రామా మొదలు పెడతారు, అసలు ఆ ఇంట్లో సత్యం కి తప్ప ఎవరికీ గ్యారేజ్ గురుంచి, దాని వెనుక ఆశయం గురుంచి తెలిసినట్టు ఉండదు. ఒక వేల తెలిసి ఉంటె, తమ్ముడు పోయినప్పుడే వెనక్కు తగ్గే ప్రసక్తి లేదు అన్నప్పుడే సత్యం గురుంచి అర్ధం చేసుకొని ఉండాలి. సత్యం కొడుకు ని చంపటం తో క్లైమాక్స్ ముగుస్తుంది. అయినా ఊరిని ఉద్ధరించే వాడు, చిన్నప్పటి నుంచి కొడుకు ని ఉద్దరించుకోక పోతే ఎలా? తన తర్వాత అయినా గ్యారేజ్ బాధ్యతలు తీసుకునేలా పెంచక పోతే ఎలా? తప్పు చేసినప్పుడే నాలుగు పీకి సెట్ చేసుకొని ఉంటె, చేతులారా చంపుకొనే వరకు రాదూ కదా?
అయినా ఈ కథ ఇక్కడితో ఆపెయ్యాలి అని లేదు, రేప్ చేసిన తమ్ముడు పోయాడు, రెండు వందల యాఫై ఎకరాల ప్రాజెక్ట్ పోయింది, మైనింగ్ ప్రాజెక్ట్ స్టాప్ అయింది, హాస్పిటల్ పర్మిషన్ రాలేదు ఇవి మనం చూసినవి, ఇంకా కావాలంటే పైరేటెడ్ సీడీ లు, డ్రగ్స్, వ్యభిచారం, కిడ్నాప్ లు ఇలా ఎన్ని కావాలంటే అన్ని స్టార్ట్ అండ్ స్టాప్ ఎపిసోడ్స్ ఆడ్ చేసుకుంటూ తీసుకోవచ్చు.
మళ్ళీ బిగినింగ్ : ఏ రోజు దీపావళి నాన్నా...... అక్కడ ఇంకొకరి ఇంట్లో దీపం వెలగటం లేదు అమ్మా.....ఇలాంటి క్లైమాక్స్ లు అప్పుడే డ్యూటీ ఎక్కిన హీరో కి బావుంటాయి, వీడు డ్యూటీ ఎక్కేసాడు అని చెప్పటానికి, ఆల్రెడీ డ్యూటీ లో ఉన్నోడు, క్లైమాక్స్ లో కూడా డ్యూటీ కే పోతున్నాడు, ఇందులో వింత ఏముంది. అయినా ఇంత కథా విలన్ ని చంపటానికా? పోనీ ఈ పని అయిపోయింది అని పర్యావరణానికి గోల్ మారిందా? లేదు, ఇదే బావుంది అని ఇక్కడే సెటిల్ అయిపొయింది, ఎక్కడ మొదలు అయిందో అక్కడికే వచ్చింది.
చివరిగా: కమర్షియల్ సినిమా లో హీరో కి తగ్గ విలన్ ఉండాలి అనే బేసిక్ రూల్ ని వదిలేసి, గాడ్ ఫాదర్ లాంటి కథ తో (దీని కథ అనే కంటే వ్యధ అనో గాధ అనో సీరియల్ అనో చెప్పుకోవచ్చు) , అతుకుల బొంత లాంటి స్ట్రక్చర్ లేని కథనం తో, బేసిక్ గా రైటర్ అయిన శివ నుంచి ఇంత పేలవమైన వర్క్ ఎదురు చూడక పోవటం వలన కొరటాల శివ నా లాంటి వాడిని డీప్ గా డిసప్పాయింట్ చేసారు అనే చెప్తాను. మోహన్ లాల్ అండ్ తారక్ శక్తి వంచన లేకుండా తమ వంతు న్యాయం చేసినా, వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ కి తగిన కాన్వాస్ దొరకలేదు అనిపించింది.
అభిమానుల ఎమోషన్స్ అండ్ బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే, సినిమా లో ఉన్న విషయం కంటే ఎక్కువ ఆడెయ్యటం మంచిదే, (అమ్మిన వాళ్ళకి - కొన్న వాళ్ళకి) కానీ ఒక్కోసారి, ఇలా తీసినా కూడా ఆడేస్తుంది అంటే, ఎలా తీసినా ఆడేస్తుంది అనే ఆత్మ విశ్వాసం పెరిగిపోయే అవకాశం ఉంది. ఈ విజయం బహుశా కథ వలన - కథనం వలన అని భావిస్తే అది అమాయకత్వం (సెన్సార్), ఈ బలమైన స్టేట్మెంట్ కి కారణం తెలుసుకోవాలి అంటే, ఒక సారి మోహన్ లాల్ అండ్ తారక్ ని పక్కన పెట్టి ఈ సినిమా చూడండి, ఈ కథ లో బలం ఏంటో, ఈ కథనం లో సత్తా ఏంటో, ఈ పాత్రల చిత్రణ లోని వెలితి ఏంటో తెలిసిపోతుంది. ఒక విజయానికి స్టార్ పవర్, రిలీజ్ డేట్ ఇలా ఎన్నో హెల్ప్ చేస్తాయి, ఆలా అని స్టార్ పవర్ మాత్రమే సరిపోతుంది ఎలా తీసిన చూసేస్తారు అనుకుంటే అప్పుడప్పుడు సర్దార్ లు - బ్రహ్మోత్సవాలు కూడా వస్తాయి.

9 comments:
Sir nakkuda OK anipinchingi because of two main role performance ki kani 1980ani cheppadu 1980dasakam lo antadu adi1989 kuda kaavachhu
Nee opika endhi mastaruu :D
basic ga iddaru heroes aa presence valla no aaya scenes vallano oka flow aite undi cinema lo
but yes 100 holes are there, unni mukundam role ni penchi aadine main vilain ga set chesi, ikkada mohan lal age aipoi ye help leka inka garage pani aipoindhi anuukune time ki buddodu enter ayi charage teesukunnattu choopoiste aa okka scene saripoyedhi mottham cinema ki :)
inka last lo kooda ajay role ala anvasaramga pelli ani chavu ani kakunda bomb blast plan devayaniki telisi ameni champesinattaite emotion workout ayyedhi
Nuvvu theesi chudu cenima ....memu rastam kurchoni....
Excellent Raju garu, superb analysis
Super analysis
Nuv rayochu kada oka storu nuv cheppina conflicts and 'sangharshana' LA tho.nuv cheppina points lo oka 2 or 3 points tappa migilinivanni baseless and invalid..kani avanni explain chesentha time ledu nilaga..and more over antha khali ga unte negativitity spread cheyatam kaadu spend time for positive things
Sir ye mata ki aa mata please serious ga writing ni career ga teesukondi.. You will definitely rock it.. One of the best best best ever analysis on Janatha Garage
Intha detailed ga rayali ante asalu movie ni enni sarlu choodali? Antha opika ekkadidi andi babu meeku
arachakam one of the best writeup i have ever come across
Post a Comment