మెగా స్టార్ - బాస్ ఈజ్ బ్యాక్ - విశ్లేషణ




మెగా స్టార్ - బాస్ ఈజ్ బ్యాక్ - విశ్లేషణ

ఆ రోజుల్లో, అంటే నాలాంటోడికి సినిమా ప్రపంచం గురుంచి ఊహ తెలుస్తున్న రోజులు అన్నమాట, మా ముందు జనరేషన్ కి మాకు మధ్యలో ఉన్న (వయసులో చిన్న వాళ్ళు అయినా వరసకి బాబాయ్ లు, మావయ్యలు) వాళ్ళ ద్వారా మాకు పరిచయం అయిన ప్రభంజనం మెగా స్టార్ చిరంజీవి.  అయన సినిమా రిలీజ్ అంటేనే ఒక జాతర, ముందు రోజులు నుంచి థియేటర్ బయట పడిగాపులు కాచే ఫాన్స్, థియేటర్ దగ్గర వాల్ పెయింటింగ్స్ అండ్ బ్యానెర్లు, బ్లాక్ లో టికెట్ కొనటానికి కూడా కొట్టుకునే మార్నింగ్ షోస్, లోపల సినిమా అవుతుంటే గేట్ బయట నిలబడి గోలని వింటూ టాక్ డిసైడ్ చేసేసే ఆత్రుత, ఇవన్నీ ఎవరో చెప్పగా విన్నవి. ఈయన సినిమాలలో కొన్ని తప్ప పెద్దగా ఆలోచించే పని ఎం ఉండదు, ఆరు పాటలు అందులో ఎలాగూ మూడు డాన్స్ నంబర్స్, మూడు ఫైట్ లు, కొంచెం కామెడీ, కావాల్సినంత హీరోయిజం ఉంటె చాలు, కథ జోలికి ఎవడు వెళ్ళడు జస్ట్ కలెక్షన్స్ గురుంచి మాట్లాడుకుంటారు అంతే

అలాంటి బాస్ కి కూడా బ్రేక్ పడింది, డిజాస్టర్స్ పడ్డాయి, గ్యాప్ వచ్చింది, ఒక రకమైన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు అయ్యింది. అప్పటికి మాకు కూడా అయన సినిమాని మార్నింగ్ షోస్ చూసే స్టేజి వచ్చింది. అప్పట్లోనే బాస్ వస్ బ్యాక్ టైపు లో మళ్ళీ ప్రభంజనం మొదలు అయ్యింది. అంతకు ముందు విన్న దాంట్లో ముప్పావుశాతం మేము కూడా చూడటం జరిగింది. బాగా గుర్తుండి ఇంద్ర ఠాగూర్ టైం లో, అప్పటికే ఎదుగుతున్న యువ హీరోస్ కి దీటుగా ఈయన ప్రభంజనం చూడటం జరిగింది. నా వరకు ఠాగూర్ లాంటి హుందా పాత్ర తర్వాత ఈయన నుంచి జనాలు కూడా హుందాతనం ఆశించటం మొదలు అయ్యింది. ఆ తర్వాత ఆ రేంజ్ ఊపు నెమ్మదిగా కనుమరుగు అయిన మాట వాస్తవం కానీ, ఉనికిని మాత్రం చాటుతూ ఉండేవారు. 

తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత, మళ్ళీ బాస్ ఈస్ బ్యాక్ అన్నప్పుడు, ఎన్నో అనుమానాలు - ఎందుకంటే అయన పీక్ లో ఉన్నప్పుడు తీసుకున్న విరామం కాదు, ఎలాగూ మసకబారుతున్న ఇమేజ్, యువతరం పోటీ, కలసిరాని రాజకీయాలు మధ్య, ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత, మా నెక్స్ట్ జనరేషన్ అంటే మొదట్లో చెప్పుకున్నట్టు, వయసులో చిన్న అయినా బాబాయ్ లు మావయ్యలు మేము అయిపోయిన రోజులు - ఈయన సినిమా అంటే అవసరమా అని పెదవి విరుపులు కామన్ ఏ కదా? ఇప్పుడు ఉన్న సోషల్ నెట్వర్కింగ్ ట్రెండ్ లో కామెడీ అయిపోతాడేమో అనే అభద్రత, ఇన్నింటి మధ్య వచ్చిన ఖైదీ నెం 150 ఊహకి అందని సంచనాలు సృష్టిస్తుంది. మా స్వీట్ మెమోరీస్ ని మాకు గుర్తుకు తెస్తుంది. అయన సినిమా కి టాక్ తో పని లేదు, జస్ట్ కలెక్షన్స్ గురుంచి మాట్లాడుకుంటారు అంతే అనేది మా నెక్స్ట్ జనరేషన్ కి చెప్పుకునేలా చేస్తుంది

ఈ సినిమా వరకు కథ కథనం విశ్లేషణ అనేది పని లేని పాటు, ఎవరికి కావాలి ఇందులో లాజిక్స్? ఎవరికీ కావాలి ఇందులో కంటెంట్? ఎవరికి కావాలి ఇందులో పర్ఫెక్షన్? అందరికి కావాల్సింది ఒకటే, ఇన్ని ఇయర్స్ తర్వాత బాస్ ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నాడు? ఎలా/ఎం చేసాడు? ఇంక ఫాన్స్ కి అంటారా మళ్ళీ చిరు ని చూడబోతున్నాం అంతే... ఇందాక చెప్పుకున్నట్టు ఠాగూర్ మిగిల్చిన ఇంపాక్ట్ అయ్యి ఉండొచ్చు, వినాయక్ అండ్ చిరు కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది అదే కాబట్టి ఒక పాజిటివ్ ఫీలింగ్. బ్లాక్బస్టర్ కత్తి రీమేక్ ఒక పాజిటివ్ ఫీలింగ్, మూవీ స్టిల్స్ లో యంగ్ గా కనిపించిన చిరు ఒక పాజిటివ్ ఫీలింగ్. సాంగ్స్ అండ్ ట్రైలర్ అనుకున్నంత గా లేక పోయినా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇచ్చిన ఊపు ఒక పాజిటివ్ ఫీలింగ్. ఇన్ని పాజిటివ్ ఫీలింగ్స్ మధ్య వచ్చిన సినిమా ప్రీ బుకింగ్స్ ఒక సంచలనం, ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు చెడుగుడు ఆడుకుంటున్న బాక్స్ ఆఫీస్ ఏ దానికి నిదర్శనం. 

కానీ 150 లాంటి మైల్ స్టోన్ మూవీ కి అయన ఎంచుకున్న కత్తి  సబ్జెక్టు కరెక్ట్ ఏమో కానీ, దానిని మార్చి మనకి వండి వడ్డించిన విధానం ఎంత వరకు కరెక్ట్? ఠాగూర్ కి ముందు రమణ చూసే అవకాశం మాకు కలగలేదు కానీ, ఖైదీ కి ముందు కత్తిని చాలా సార్లు చూడటం జరిగింది. తెలుగు ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు మార్పులు అనే పేరుతో మేగాకరించి పారేసారు, అదే ఎంతో మంది అతిరధ మహారధులు కలిసి మెగా స్టార్ సినిమా చేసేశారు. ఈ ప్రాసెస్ లో ఒరిజినల్ తో పోలిక విషయం చూచాయగా టచ్ చేస్తూ ఖైదీ విషయం మాట్లాడుకుందాం. 

అనగనగా కలకత్తా జైలు నుంచి పారిపోయిన శీను, బయట దేశానికీ పారిపోదాం అనుకుంటాడు, అన్ని రెడీ చేసుకున్నాక అమ్మాయి నచ్చి ఉండిపోదాం అనుకుంటాడు, అమ్మాయి మోసం చేసింది అని తెలిసి మళ్ళీ బయట దేశానికీ పోదాం అనుకునే టైం కి, తన లాగే ఉండే ఒక వ్యక్తి చావు బ్రతుకుల మధ్య ఉంటె హాస్పిటల్ లో జాయిన్ చేసి తన స్థానం తీసుకుంటాడు. ఈజీ గా డబ్బులు వస్తుంటే ఇదేదో బాగుంది అని అక్కడే కొన్ని రోజులు సెటిల్ అవుదాం అనుకుంటాడు, తాను ఇష్టపడిన అమ్మాయిని కూడా మళ్ళీ కలుస్తాడు, తనకి తెలియకుండానే వచ్చిన కోట్ల ఆఫర్ కి ఒప్పదం చేసుకుంటాడు. కరెక్ట్ గా అదే టైం లో తాను ఎవరి స్థానం లో ఉన్నదో అతను పాటు పడుతున్న ఆశయం గురుంచి తెలుసుకుంటాడు, తాను చేస్తున్నది తప్పు అని డిసైడ్ అవుతాడు, కానీ విలన్ వలన ఉన్న ముప్పు కోసం ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండాలి అని డిసైడ్ అవుతాడు. ఇదే ఫస్ట్ హాఫ్. ఒరిజినల్ లో కూడా ఇంటర్వెల్ వరకు ప్లాట్ పాయింట్ మొదలు అవ్వని ఈ కథ లో, ఫస్ట్ హాఫ్ ని మెగాకరించి ఐటెం సాంగ్ తో డాన్స్ లు, బ్రహ్మానందం తో కామెడీ ఉండేలా చూసుకున్నారు. అప్పటి వరకు ఎప్పుడెప్పుడు చూస్తామా అనుకున్న వాళ్ళకి మళ్ళీ అదే సరదా బాస్ ని చూపించారు. కథే మొదలు అవ్వని ఫస్ట్ హాఫ్ లో కంప్లైంట్స్ ఏముంటాయి, కాబట్టి మనం ఇంటర్వెల్ లో బాస్ గురుంచి, అయన బాడీ లాంగ్వేజ్ గురుంచి, డాన్స్ గురుంచి మాట్లాడుకుని హమ్మయ్య ఈ మాత్రం చాలు అనుకునేలా చేస్తుంది. 

సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి ఇంక కథలోకి వెళ్లాల్సిన అవసరం వస్తుంది, ఇప్ప్పటికైనా కాంఫ్లిస్ట్ చెప్పాల్సిన టైం వస్తుంది, అప్పటికి మనం పోసాని కామెడీ తో మేగాకరించుకునే ప్రాసెస్ లోనే ఉండిపోతాం. ఇంటర్వెల్ ఇచ్చిన బ్రేక్ వలన, బాస్ ని చూసేసాం అనే ఆత్రుత తగ్గటం వలన, సినిమాలో ఏముండబోతుంది అనే ఇంటరెస్ట్ మొదలు అయ్యే టైం వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ విన్న తర్వాత శీను లో వచ్చిన మార్పు నిజం అయితే, శీను లో సీరియస్ నెస్ పెరుగుతుంది, విలన్ ఎం చేస్తాడు అని రెయాక్టీవ్ ప్రాసెస్ నుంచి ప్రాయాక్టీవ్ ప్రాసెస్ మొదలు అవ్వాలి, కానీ మహారధులు ఇంకా మెగా మూవీ అనే ఫీల్ లో ఉండిపోవటం వలన కామెడీ ని ఎలా జొప్పించాలా అనే ప్రయత్నం లోనే ఉండిపోయారు. బాగా ఆకలి గా ఉన్నవాడికి టేస్ట్ గురుంచి పట్టింపు ఉండదు, మొదట్లో స్పీడ్ గా లాగించేస్తాడు, కొంచెం తిన్నాక టేస్ట్ కోరుకుంటాడు, ముగింపు సంతృప్తి గా కోరుకుంటాడు, ఈ చిన్న విషయం లోనే ఖైదీ అదుపు తప్పాడు. 

ఒరిజినల్ లో కూడా విలన్ క్యారెక్టర్ కొంచెం వీక్ గా ఉంటుంది, మేగాకరించే ప్రాసెస్ లో దానిని అలాగే వదిలేసారు కానీ, బాస్ వరకు దీటు అయిన విలన్ లేక పోతే ఎలా? బాస్ కి కండబలం ఉంది, ఎంత మందిని పంపించినా చిల్లర చేతిలో ఉంటె చెడుగు ఆడేస్తాడు, అందుకే కోర్ట్ సీన్ లో మెలిక వేసి, కండబలం మాత్రం సరిపోదు బుద్ధి బలం కూడా ఉండాలి అని విలన్ ట్రై చేస్తాడు. తన ఇంటిలెజెన్స్ ప్రూవ్ చెయ్యటానికి పైప్ లైన్ లో దూరిన హీరో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనేదగ్గరే మేగాకరింపుడే కనిపిస్తుంది కానీ సీరియస్ నెస్ లోపిస్తుంది, ఇంకా ఈ సినిమా గురుంచి ఎందుకులే కానీ బాస్ ని ఎంజాయ్ చేసి ఎల్లిపోదాం అనే ఫీల్ కలిగిస్తుంది. తమ్ముడు ప్లేస్ లో నిజం తమ్ముడు కళ్యాణ్ బాబు వచ్చి ఉంటె అరాచకం ఇంకో రేంజ్ లో ఉండేది ఏమో అనే ఆలోచన మిగులుస్తుంది. 

ఇంక అక్కడ నుంచి మొదలు అయిన సాగదీత కార్యక్రమం (ఇక్కడ మాత్రం ఒరిజినల్ ని ఫాలో అయిపోయారు) ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుందా, బాస్ ఈస్ బ్యాక్ అని సోషల్ నెట్వర్కింగ్ లో సందడి చేసుకుందామా అనే రేంజ్ లో ఎదురు చూసేలా చేస్తుంది. క్లైమాక్స్ విషయం లో ఒరిజినల్ వెర్షన్ ని ఫాలో అయ్యి ఉంటె నిజంగా బావుండేది అనే ఫీలింగ్ మిగిలించారు. అసలు కథిరెసన్ పాత్ర తెరవెనుక ఉండిపోవటం అనేది భావోద్వేగాలతో ఆ పాత్ర స్థాయి ని ఎంతో ఉన్నత స్థాయి లో నిలబెట్టిన సన్నివేశం అది, దానిని మనం అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అని మేగాకరించటం లో అర్ధం ఏమైనా ఉందా?

ముందుగా చెప్పుకున్నట్టు ఈ సినిమా వరకు మెగాస్టార్ రీఎంట్రీ ఏ డామినెటే చేసిన టాపిక్, ఇప్పుడు ఉన్న యూత్ పల్స్ కి ఆయనని ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తారు అనేదే పెద్ద క్వశ్చన్ అయిపోవటం వలన, అయన అన్ని విధాలా అలరించటం వలన మిగతా విషయాలు మాట్లాడుకునే స్కోప్ మిగలలేదు. ఎం చేసినా ఎలా చేసిన 60 ఇయర్స్ పైబడిన వయసులో ఇలా చెయ్యటం అద్భుతం అని మనకి మనం సర్దిచెప్పుకోవటం తప్ప మిస్టేక్స్ ఎంచాల్సిన అవసరం కనపడలేదు. అయన కామెడీ టైమింగ్ మారలేదు, డాన్స్ లో స్పీడ్ తగ్గింది ఏమో కానీ గ్రేస్ మారలేదు, అయన సినిమాలలో అప్పట్లో ఉండే కెమిస్ట్రీ విత్ ఆడియన్స్ లో మార్పు లేదు, అన్నిటికి మించి ఎనర్జీ లెవెల్స్ లో తగ్గుదల కనపడలేదు.కృషి ఉంటె మనిషులు ఋషులవుతారు అనేది మనకి తెలుసు కానీ ఎంతో కసి ఉంటె తప్ప ఈయన మెగాస్టార్ అవ్వలేదు అనేది మళ్ళీ ఈ జనరేషన్ కి కూడా ప్రూవ్ చేసారు.

ఇంత ప్రాసెస్ లో అయన గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే? నా ఫాన్స్ ని ఎంత వరకు రంజింపచేస్తాను అని ఆపెయ్యకుండా, నా లాంటి - అయన ప్రభంజనం ని ఎంజాయ్ చేసిన - వ్యక్తుల నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు కూడా మంచి సినిమాతో మీ ముందుకి వస్తున్నాను అని అలోచించి ఉండాల్సింది. నిజంగానే మంచి సినిమా అయిన కత్తిని మేగాకరించే ప్రాసెస్ లో స్టోరీ లోని సోల్ మిస్ అయ్యారు. అనవసరపు కామెడి తో అలరించే ప్రాసెస్ లో హుందాతనం మిస్ అయ్యే ప్రమాదం గురుంచి కూడా అలోచించి ఉంటె బావుండేది

చివరిగా: మీ ఫాన్స్ వరకు మీరు 200 % బ్యాక్ అయ్యారు కానీ, మాలాంటి వాళ్ళకి ఒక 60 % సరిపెట్టుకోమన్నారు. అప్పటి రోజులు గుర్తు చేసినందుకు మీకు థాంక్స్ చెప్పుకోవాలి కానీ అప్పటి రోజుల్లోనే ఉండిపోయారేమో అనే అనుమానం ని నెక్స్ట్ సినిమా తో పటాపంచలు చెయ్యాలి అని కోరుకుంటాం. ఈ సారి వేగిన పప్పు ప్రతి సారి వేగకపోవచ్చు, మేము మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూనే, మీ నుంచి నెక్స్ట్ లెవెల్ ఎక్సపెక్ట్ చేస్తున్నాం అని సవినయం గా మనవి చేసుకుంటున్నాం. 

మెగాస్టార్ 150  అనేది ఒక మైల్ స్టోన్ మూవీ లా చరిత్ర లో మిగిపోయే సినిమా కాక పోయినా ఒక మంచి మెగా కం బ్యాక్ మూవీ అయినందుకు సగం సంతోషిస్తూ.....................







4 comments:

Anonymous said...

perfect

PRAViews said...

Superb sir..
Music gurinchi comment cheyyaledhu...?

Anonymous said...

Meeru chesina soolasodhana antha avasaram ledu anipistondi Chiru 150 th movie ni fans and audience chala baga enjoy chesaru anthe kaani kodiguddu ki eekalu peekanavasaram ledu 2.30 hrs movie Common viewer enjoy chestadu nachite marosari velatadu anthe Kani prati movie ni boota addam lo chusentha time evaridaggara ledu just see and enjoy the movie.

Anonymous said...

Mee adbhutamaina randhraanveshana ki chaala santhosham.Dayachesi Dhairyam chesi GPSK kuda chudandi,chusi mee amoolyamaina bhaavanalni maatho panchukondi,chusi mallee santhoshisthaam.

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views