గౌతమీపుత్ర శాతకర్ణి - కథ, కథనం - విశ్లేషణ




గౌతమీపుత్ర శాతకర్ణి - కథ, కథనం - విశ్లేషణ

కొన్ని సినిమాలు కొందరు మాత్రమే చెయ్యగలరు అనేలా ఉంటాయి, అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ వరకు ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపించేలా చేస్తాయి, అలంటి కోవకి చెందేదే గౌతమిపుత్ర శాతకర్ణి. అది బాలయ్య 100 వ సినిమా అవ్వటం ఇంకొక ప్రత్యేక ఆకర్షణ. ప్రతిష్టాత్మక 100వ సినిమా కి ఎన్నో కథలు విని, ఎన్నో కాంబినేషన్స్ డిస్కస్ చేసుకొని, ఆ భాద్యత ని క్రిష్ చేతిలో పెట్టారు. బాలయ్య మాస్ కి క్రిష్ క్లాస్ కి సెట్ అయ్యే పనేనా? లాంటి అనుమానాల్ని పటాపంచలు చేసే రేంజ్ టీజర్ అండ్ ట్రైలర్ తో, అతి తక్కువ  రోజుల్లో, భారీ చారిత్రాత్మక చిత్రం గా మన ముందుకి తీసుకొచ్చారు. మార్కెటింగ్ విషయానికి వస్తే - మనకి తెలియని మన సంస్కృతి, మనకి తెలియని మన కథ, మన జాతి గొప్పతనం - అని మొదలు పెట్టి, తెలుగు జాతి గర్వ పడే సినిమా వరకు సరైన ప్లానింగ్ తో వచ్చారు. సంక్రాంతి బరిలో బాలయ్య 100వ సినిమా, అటు పక్క చిరంజీవి గారి 150వ సినిమా లాంటి కమర్షియల్ అంశాల జోలికి పోకుండా, మన పని మనం చేసుకుందాం. ఈ సినిమా కథ కథనం ని విశ్లేషించుకుందాం. అఖండ భారతావని చక్రవర్తి కథ అంటే అయన వీరత్వం, మేధస్సు, పరిపారల దక్షత, చేసిన సంస్కరణలు లాంటి ఎన్నో లక్షణాల కలబోత అని ఊహించుకోవటం రివాజు. మరి మనం చూసింది అలాంటి చక్రవర్తి కథేనా?

మనకి తెలిసిన చరిత్ర అయితే ఎలా తీసాడు అని చూస్తాం, తెలియని దాని గురుంచి ఉండే అంచనాలు వేరు. తెలిసిన చరిత్ర అయినా సరిగ్గా ప్రెజెంట్ చెయ్యలేకపోతే వచ్చే విమర్శ కంటే, ఎదో ఉండబోతుంది, ఎదో తెలుసుకోబుతున్నాం అని వచ్చే వాళ్ళని సంతృప్తి పర్చటం కత్తి మీద సాము. చారిత్రక సినిమా వరకు చాలా రీసెర్చ్ జరిగి ఉంటుంది, మొత్తం చరిత్ర ని ఎలాగూ సినిమాల తీయలేం కాబట్టి మనం చేసిన రీసెర్చ్ నుంచి ముఖ్యమైన ఘట్టాల నుంచి కథ వస్తుంది పుడుతుంది. బేసిక్ గా చరిత్ర గురుంచి తెలుసుకోవాలి అంటే డాక్యూమెంటరీస్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, కానీ శాతకర్ణి విషయం లో లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ తో ఒక వ్యక్తి ని స్ఫూర్తిగా తీసుకొని అల్లుకున్న కథ మాత్రమే ఉంటుంది. దానిని క్వశ్చన్ చెయ్యటానికి మన దగ్గర ఎలాగూ ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి, ప్రెజెంటేషన్ వరకు మాత్రమే మాట్లాడుకోగలం.  ఇదే సినిమా ని రాజమౌళి గారో, వినాయక్ గారో అనౌన్స్ చేసి ఉంటె, అదొక కమర్షియల్ సినిమా గా ఎదురుచూసేవాళ్ళం, కానీ క్రిష్ పేరుతో అంచనాలు ఆలోచనలు మారుతాయి. ఎందుకంటే క్రిష్ సినిమా లో అయితే భావోద్వేగాలు, లేదా అంతర్లీనంగా సందేశం ఉంటుంది. ఎలాగూ చరిత్ర కి సంబందించిన కథలు ప్రయోజనం తో ముడి పెట్టుకొని ఉంటాయి, స్ఫూర్తి ని రగిలించే సత్తా ఉన్న కథలకి గుర్తింపు ఎక్కువ ఉంటుంది, ఒక వేళ అది మిస్ అయితే సినిమా...హాల్ లో ఉన్నంత వరకు మాత్రమే దాని గురుంచి మాట్లాడుకొని మర్చిపోవటం జరుగుతుంది. ఉదాహరణ కి ఇన్ని రోజుల తర్వాత ఈ సినిమా గురుంచి ఆర్టికల్ ఏంటి అనుకునే వాళ్ళు ఆల్రెడీ మర్చిపోయారు అని అర్ధం.

సినిమా చూడని వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిది. ఇది కేవలం నా వ్యూ మాత్రమే

కథ: ఈ సినిమా లో చూపించిందే మనకి కథ కాబట్టి, ఈ సినిమా కథ శాతకర్ణి కల, దేశమంతటిని ఒకే రాజ్యం కిందకి తేవాలని, అప్పుడు యుధ్ధాలు ఉండవనే ఒక చిన్న బాలుడి కల. ఆ కల ని సాకారం చేసుకోటానికి శాతకర్ణి చేసిన యుధ్ధాలే కథాంశం. ఒకే ఒక యుద్ధం, మహా యుద్ధం చేసేస్తే పని అయిపోతుంది అనుకుంటే, ఇంటర్వెల్ కె సినిమా అయిపోతుంది, ఆ తర్వాత పొంచి ఉన్న ప్రమాదాలు, దానిని కాపాడుకోవటం కూడా కథ అయితే సినిమా అయిపోయాక కూడా కథ ఇంకా మిగిలిపోతుంది? మహాయుద్ధం ఒకటి ఉంది అని మొదట్లోనే చెప్పి ఉంటె, అది గెలిచినా మళ్ళీ యుద్ధం రాదు అని నమ్మకం లేదు నాయనా, నువ్వు మొత్తం ఒక రాజ్యం చేసిన తర్వాత బయట రాజ్యాల నుంచి కూడా ప్రమాదం ఉంటుంది, భారతావని అంటే ప్రపంచం కాదు, మనకి సామంత రాజ్యాలు ఎలాగో ఎలాగో ప్రపంచ రాజ్యాలకి భారతావని అలాగే అని చెప్పి ఉంటె కల అప్పుడే డ్రాప్ అయిపోయేది ఏమో,లేదంటే రెట్టించిన ఉత్సాహం తో ఇంకా బలంగా ఉండేది ఏమో.

కథనం : యుధ్ధాలు, దాంపత్య జీవితం లో సమస్య, పిల్లాడి తో సెంటిమెంట్, అమ్మ (స్త్రీలను) గౌరవించుకోవడం లాంటి అన్ని రకాల అమాశాలతో కమర్షియల్ వంటకం వండేశాడు క్రిష్. హీరో బాలయ్య కాబట్టి అయన మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని, హీరోయిజం ని ఎలేవేట్ చేసేలా డైలాగులు, సన్నివేశాలు వ్రాసుకోవటం లో మంచి పనితనం కనపరిచాడు. భలమైన కథానాయకుడు, మహోన్నతమైన కల, మరి అంతటి రేంజ్ ఉన్న ప్రతినాయకుడు? ప్రతిబంధకాలు? మొత్తం సినిమాని నాలుగు ఎపిసోడ్స్ గా విభజించుకోవచ్చు. (మనం ప్రతి సరి వ్రాసుకునే త్రీ ఆక్ట్ టైపు లో కాదు సుమండీ). స్టార్ట్ - మిడిల్ - స్టాప్ లా కాకుండా స్టార్ట్ - స్టాప్ అనేలా. కళ్యాణ దుర్గం యుద్ధం, సౌరాష్ట్ర నహపాణుడి యుద్ధం, రాయసూయ యాగం, గ్రీకు వీరుడి తో మహాయుద్ధం.  ఇలా స్టార్ట్ అండ్ స్టాప్ టైపు లో వెళ్ళిపోతూ, ఎక్కడి ఎమోషన్ ని అక్కడే వదిలేస్తూ కంటిన్యూటీ లేకుండా ముందుకి పోతుంది. ఒక ఎపిసోడ్ నుంచి ఇంకో ఎపిసోడ్ ట్రావెల్ అవ్వాల్సిన డ్రామా మిస్ అవుతుంది. ఈ సినిమాలో హీరో పాత్ర కి ఉన్న ఏకైక కాన్ఫ్లిక్ట్ తన అర్ధాంగి ఆలోచనలు.

కల్యాణదుర్దం యుద్ధం వరకు: చిన్న పిల్లాడి కల తో మొదలు అయిన కథ, హీరో ఇంట్రడక్షన్ సీన్ అద్భుతం గా వ్రాసుకున్నారు. అటు భరణి గారు, ఇటు శుభలేఖ సుధాకర్ గారు ఒక రేంజ్ లో లేపెయ్యగా యుద్ధం సీన్ తో మొదలు అయిన సీన్ ఒక పర్ఫెక్ట్ మాస్ మసాలా కమర్షియల్ సీన్. లేఖ లో ఇచ్చిన వార్నింగ్ నుంచి మొదలు అయిన సీన్ ఫైట్ ఎండ్ అయిన వరకు సీట్ లో కూర్చున్న జనాలని రోలర్ కోస్టర్ రైడ్ కి రెడీ చేసినట్టు గా కట్టిపడేసారు. బాలయ్య మాస్ ఇమేజ్ కి తగినట్టు డైలాగ్ తో, ఫాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులని కూడా అలరిస్తూ.... అద్భుతమైన టేక్ ఆఫ్ అనిపిస్తుంది. 

నహపాణుడి యుద్ధం (ఇంటర్వెల్) వరకు: అప్పుడే రిలాక్స్ అవుతున్న మనకి శాతకర్ణి ఇంటికి రావటం తో మొదలు అయిన ఈ ఎపిసోడ్, కొంచెం రిలాక్స్ అవుతూ పాట వైపు పయనిస్తోంది. ఎకిమీడ అని సాంగ్  మొదలు పెడితే, ఒక పక్క సాహిత్యం ని అభినందిస్తూనే, ఇంకో పక్క మనలో ఉన్న మాస్ ప్రేక్షకుడు నిద్ర లేచి కింగ్ సినిమా డైలాగ్ గుర్తు చేసుకుంటాడు "ఆపరా శాస్త్రి, దరహాసం, నాకే అర్ధం కావటం లేదు ఇంకా ఆడియన్స్ ఎం అర్ధం అవుతుంది, మన స్టైల్ లో ఒకటి వదులు.. తడిక తడిక తడిక..లడకి లడకి లడకి... నువ్వు తెరచినావే దిల్ కి కిటికీ" (ఇక్కడ శాస్త్రి అన్నది సినిమా లో డైలాగ్ మాత్రమే, మన గురువుగారు శాస్త్రి గారిని ఉద్దేశించి కాదు). యుధ్ధాలు మాత్రమే కాదు ప్రియసఖి కోరికలు తీర్చే కింగ్ గా మనకి కనిపించిన శాతకర్ణి దాని వెనక ఉన్న కారణం మనకి తెలుస్తుంది. అక్కడ నుంచి యుద్ధం వరకు జరిగిన సంఘటనలు హీరోయిజం ని పీక్స్ కి తీసుకెళ్లగా, వ్యూహ ప్రతివ్యూహాలతో నడిచే యుద్ధం - బాగా లెంగ్త్ అయినా కూడా - మనల్ని రంజింప చేస్తూ, అప్పుడే ఇంటర్వెల్ వచ్చేసిందా అనిపించేలా, ఫస్ట్ హాఫ్ ని బాగా ఎంజాయ్ చేసిన ఫీలింగ్ మిగులుస్తుంది. ముఖ్యంగా కొడుకుతో యుద్దానికి వెళ్లే ఎపిసోడ్, దానికి కారణాలు చూపించిన విధానం అద్భుతం గా ఆకట్టుకుంటుంది

అంత వరకు ఎంత ఎంజాయ్ చేసినా ఇంటర్వెల్ బ్రేక్ వచ్చిన తర్వాత కొంత లో కొంత ఆలోచింప చేసిన విషయం : "శఖారంభం అనే పదం ఉందా? అది శకారంభం ఏమో కదా" ఇలాంటి చిన్న తప్పులు ఎంత ఫుల్ మీల్స్ అయినా ఎక్కడో ఒక పంటి కింద రాయి తగిలిన ఫీలింగ్ 

రాజసూయ యాగం అండ్ తర్వాత డ్రామా: హై వోల్టాజ్ యాక్షన్ సీన్స్ తర్వాత స్టార్ట్ అయిన ఇంటర్వెల్, ఏ మాత్రం స్లో అయినా కొంచెం తగ్గినా ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ అదే జరిగింది. ఎమోషనల్ జర్నీ మొదలు అవుతుంది. దేశాన్ని జయించిన వాడికి భార్య ని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం రావటం, తల్లి గురుంచి మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్పటం కోసం మహిళలపై తనకి ఉన్న గౌరవం ని చాటి చెప్పాల్సి రావటం. మొత్తం డైలాగ్ సహకారం తో బాగా చెప్పటం జరిగింది. ఆడదాని కడుపున నలిగి  నిలిచి వెలుగుచూసిన  రక్తపు ముద్ధవి నీకున్న అర్హత తల్లికి  లేదా? తండ్రిని మించిన కొడుకులుంటారు కానీ తల్లిని మించిన కొడుకులుంటారా? అనే అద్భుతమైన డైలాగ్ తో గౌతమిపుత్ర శాతకర్ణి అవుతాడు. ఇక్కడ ఒక నానుడి ఉంది అండోయ్, క్రిష్ గారు అద్భుతం గా మలిచినప్పటికీ, అప్పటిలో పేరు ముందు తల్లి పేరు చేర్చేది, రాజు గారి బహుభార్యత్వం వలన, ఎవరి పిల్లలు ఎవరో తెలుసుకోవటం కోసం ఆలా సంభోదించేవారు అని. ఇంతలో తనపై ఎటాక్ అవ్వటం తో, ఇక్కడితో నీ పని అయిపోలేదు, ముందు ముందు ఇంకా మ్యూజిక్ ఉంది అనే పాయింట్ ఎస్టాబ్లిష్ చేసారు. కానీ ఉన్న కాన్ఫ్లిక్ట్ అయిన భార్య ని ఎలా ఒప్పిస్తాడా అనిపిస్తుంది. అప్పటి వరకు మనం చూసిన దానిని బట్టి అంచనాలు పెట్టుకోవోటాం కూడా తప్పు కాదు అనిపిస్తుంది. కానీ ఇక్కడే నిరాశ మొదలు అవుతుంది.  

అసలు అంతటి చక్రవర్తి భార్య యుధ్ధాలు మానెయ్యమనటం, అలగటం, ఈగో కి పోవటం, ఆవిడ పాత్ర స్థాయి పెంచటానికి పనికొస్తాయి ఏమో కానీ, హీరో పాత్ర ని తగ్గిస్తాయి. అంత గొప్పగా లేపుదాం అనుకున్న ఆవిడ పాత్ర కూడా సామంతుల భార్య ద్వారా భర్త గొప్ప తనం తెలుసుకోవటం తో ఆవిడ పాత్ర కూడా తేలిపోతుంది. 

అక్కడే విష ప్రయోగం దాని విరుగుడు గురుంచి కూడా ప్రస్తావించటం తో ఇంక ఎం జరగబోతుంది అనే దానిపై అవగాహనా కూడా వచ్చేస్తూ ఉండటం తో మనం లాస్ట్ ఎపిసోడ్ కి వెళ్తాము. ఇది ఇక్కడ రెవీల్ చెయ్యకుండా, అయన యుద్ధం లో ఉండగా ఈవిడకి కల వఛ్చి, అప్పుడు దానికి విరుగుడు తెలుసుకొని వేరే ఒకరి ద్వారా దానిని యుద్ధ రంగం కి పంపిస్తూ, ఒక పక్క ఆయన చావు బ్రతుకుల మధ్య ఉంటె డ్రామా ఇంక బాగా పండేది ఏమో?

మహాశాంతి యుద్ధం: అప్పటికే ఒక అవగాహన వచ్చిన మనకి, గడవబోయే నలభై నిముషాలు భారం గా మారిపోయాయి. అప్పటికే రెండు యుధ్ధాలు, ఒక ఎటాక్ ఫైట్ చూసేసిన మనకి ఇంకో యుద్ద్ధం ఎక్సైట్ చెయ్యటం మాట అటు ఉంచి అప్పుడే క్లైమాక్స్ కి వచ్చేసారా అనే ఫీలింగ్ మిగులుస్తుంది. సైనికులలో స్థైర్యం నింపటానికి తనే డాన్స్ వెయ్యటం, విష ప్రయోగం అన్ని ఒక సినిమా స్థాయి ని సాధారణ స్థాయి కి దించేసాయి. ఇంక లాస్ట్ ఫైట్ సాగిన విధానం, దానికి కేటాయించిన సమయం, మనలో ఆత్రుత ని పెంచే స్థాయి నుంచి ఇంక ఎప్పటికి అవుతుంది అనే స్థాయి కి తీసుకువచ్చిన అనుభూతిని కలిగించింది. గుర్రాలకి గంతలు కట్టడం ఒక అద్భుతమైన వ్యూహం గా వాళ్ళు ఊహించుకున్నారు ఏమో కానీ, ఎలాగోలా దీనిని ఎండ్ కి చేర్చటానికి వేరే మార్గం దొరకలేదు అనిపిస్తుంది. ఆలోచన మొదలు అవుతుంది. అసలు మొదటి నుంచి ఈయన యుద్ధం చేసి, ఈయన కష్టపడి, ఈయన కత్తి పడితేనే కానీ పని అవ్వలేదు అంటే, ఈయన ఒక యోధుడు అవుతాడు ఏమో కానీ నాయకుడు ఎలా అవుతాడు? వెనక ఉండి అవసరం అయినప్పుడు రంగం లోకి దిగే హీరోయిజం ముందు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెమట ఓడ్చాల్సిన నాయకుడి పై జాలి మాత్రమే గా కలిగేది? ఇదే మా శివగామి తల్లి అయి ఉంటె, శాతకర్ణి ని మాహిష్మతి కి సర్వ సైన్యాధక్షుడు గా నియమించేది. 

చివరిగా: అతి తక్కువ కాలం లో, ఇంత ఔట్పుట్ ఇచ్సిన క్రిష్ ని, తన కలం తో అబ్బురపరిచిన బుర్ర సర్ ని, ప్రొడక్షన్ వాల్యూస్ ని, బాలయ్య నటన ని అభినందించక పోవటం అనేది మహాపరాధం. తన 100 వ చిత్రం గా ఈ కథాంశం తో మన ముందుకి వచ్చిన బాలయ్య ని నీరాజనాలు. సాహో శాతకర్ణి యూనిట్. బాలయ్య అభిమానులు గర్వం గా చెప్పుకునే చిత్రాలలో ఒకటి గా నిలుస్తుంది అనటం అతిశయోక్తి లేదు. కాక పోతే ఈ సినిమా ద్వారా శాతకర్ణి గురుంచి తెలిసిన వివరాలు ఎం ఉండవ్, అయన చేసిన యుధ్దాలు తప్ప. ఫస్ట్ హాఫ్ లో ఉన్న పంచ్ సెకండ్ హాఫ్ కి చల్లబడిపోయే సరికి, గొప్ప సినిమా అనే స్థాయి కి కొంచెం దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది ఏమో అనే ఫీలింగ్ కలిగించింది. మ‌నం క‌థ‌లు చెప్ప కూడ‌దు...మ‌న క‌థ‌లు జ‌నం చెప్పుకోవాలి లాంటి పవర్ఫుల్ డైలాగ్ ఉన్న సినిమా కథలు కథలు గా చెప్పుకొనే స్టేజి కి వెళ్లకుండా ఒక కథ గా మిగిలిపోయింది ఏమో అనిపించింది. 


సినిమా చూడక ముందు మనం అనుకున్న / ఊహించుకున్న "అఖండ భారతావని చక్రవర్తి కథ అంటే అయన వీరత్వం, మేధస్సు, పరిపారల దక్షత, చేసిన సంస్కరణలు లాంటి ఎన్నో లక్షణాల కలబోత" విషయం ని పక్కన పెట్టేసుకొని, శాతకర్ణి కథ రూపం లో అతను చేసిన యుధ్ధాలు, చక్రవర్తి అయిన విధానం తో సరిపెట్టేసారు, మిగతా విషయాలని అక్కడక్కడా డైలాగు రూపం లో చెప్పించి వదిలేసారు, ఇలా తీయటం వలన ఏమైనా ప్రాబ్లెమ్ ఉందా అంటే? రేపటి తరాలు వంగవీటి అంటే నాలుగు మర్డర్ లు అని, శాతకర్ణి అంటే మూడు యుధ్ధాలు అని అనుకోనంత వరకు ఎలాంటి ప్రమాదం లేదు. వీరప్పన్ సినిమా తీసినప్పుడు క్లారిటీ గా కిల్లింగ్ వీరప్పన్ అని పెట్టినట్టు, ఈ సినిమాకి గౌతమీపుత్ర శాతకర్ణి యుధ్ధాలు అని పెట్టి ఉంటె సరిపోయేది.


4 comments:

abhimani said...

chala rojula tarvata oka rakaimaina positive articles mee blog lo. general ga aithe eki paaresevaremo kada, any ways, keep rocking sir

Anonymous said...

అద్భుతః

Anonymous said...

Aditya :)

Sorry baa choodaledu ee article ee roje choosa,as usual super analysis. :)

yes First half avaraku oka flow lo untundi taruvata emi ledu story, aa bharya hto godava adhanta waste asalu, dani badulu tana kala ane daniki problems kooda unnattu choopinchalsinid, ante just yuddhale kaadu aslau deshamantha oa taatiki ravadam etc aa point ni chinna size speehces laaga itara saamanthulaku explain cheyadam etc etc..

Anonymous said...

Awesome rajugaru

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views