జై లవ కుశ - కథ కథనం విశ్లేషణ
పాత్ర ఏదైనా , ఘట్టం ఏదైనా అందులో ఒదిగిపోవటానికి ఎన్టీఆర్ ఎప్పుడు రెడీ. తేడా వచ్చేది కథలు ఎంచుకోవటం లోనే, ఒకప్పుడు చేసిన తప్పులు నుంచి నేర్చుకున్నాడో ఏమో కానీ టెంపర్ తో రూట్ మార్చేసి వరసగా విభినమ్మైన సినిమాలు ఎంచుకుంటూ మళ్లీ తన స్లాట్ ని ఆక్రమించుకున్నాడు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా సంపాదించుకున్నాడు. జనతా తర్వాత ఎం సినిమా ఉండబోతుంది అనుకున్న వాళ్ళకి బాబీ ని ఎంచుకొని సర్ప్రైస్ చేసాడు. ట్రిపుల్ రోల్ తో జై లవ కుశ గా మన ముందుకి వచ్చాడు. మరి మూడు పాత్రలకి ఎంత వరకు న్యాయం చేసాడు? తాను బాబీ మీద పెట్టుకున్న నమ్మకం ని బాబీ ఎంత వరకు నిలబెట్టుకునట్టు? అనేది విశ్లేషించుకునే ప్రయత్నమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఈ సినిమా రిలీజ్ కి ముందు బాబీ కథ చెప్పినప్పుడు వారం రోజులు టైం తీసుకున్నాను నేను చేయగలనా లేదా అని ఎన్టీఆర్ చెప్పారు, అదే వారం రోజులు కథ గురుంచి కానీ, కథనం గురుంచి కానీ, ఈడు తీయగలడా అని కూడా అలోచించి ఉంటె బావుండేదేమో?
"సినిమా చూడని వాళ్ళు, చూడాలి అనుకునే వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిది" అని నా అభిప్రాయం. ఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు.
కథ : బేసిక్ థీమ్ తీసుకుంటే, ట్రైలర్ లో చూపించినట్టు, ఏ తల్లికైనా ముగ్గురు మగ బిడ్డలు పుడితే రామ - లక్ష్మణ - భరతులు అవ్వాలి అని కోరుకుంటుంది, కానీ దురదృష్ట వశాత్తు ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ, రామ - లక్ష్మణులు అయ్యారు. అసలు వాళ్ళు ఆలా అవ్వటానికి దారి తీసిన పరిస్థితులు, ఆ తర్వాత జరిగిన పరిణామాల సమాహారమే కథ.
డిటైల్డ్ గా చెప్పుకోవాలి అంటే, తల్లి ఆరోగ్యం బాగోక మేనమామ దగ్గర పెరుగుతున్న ముగ్గురిలో జై కి ఉన్న నత్తి కారణం గా అందరిచేత అవమానించి బడతాడు. ఇంకో పక్క లవ కుశలకి నాటకాలలో మంచి పేరు వస్తుంది. ఆ అవమానం అగ్ని లా దహించి వేసిన జై పగ తీర్చుకోటానికి నాటకం జరుగుతున్న స్టేజి తగలబెట్టేస్తాడు. ఎవరికీ వాళ్ళు ఆ ఆక్సిడెంట్ లో మిగతా అందరు చనిపోయారు అనుకుంటారు. 25 ఇయర్స్ తర్వాత లవ బ్యాంకు మేనేజర్ గాను, కుశ దొంగ గాను, జై రావణ మహారాజ్ గాను సెటిల్ అవుతారు. అనుకోని ప్రాబ్లెమ్ వలన లవ కుశ కలుస్తారు, ఆ టైం లో ఒక అవసరం వచ్చిన జై వీళ్ళిద్దర్నీ తన దగ్గరకి రప్పించుకొని చిన్నప్పటి కసి ని తీర్చుకుందాం అనుకుంటాడు అలాగే తన అవసరం తీరిపోయాక మట్టుబెడదాం అనే ప్లాన్ లో ఉంటాడు. ఈ ప్రాసెస్ లో అన్నదమ్ముల మధ్య ఎం జరిగింది అనేది ఒకప్పటి పాత తెలుగు చిత్రాల మూస ఫార్ములా లో తెలుసుకుంటాం. కమర్షియల్ గా మేజిక్ చెయ్యగల మంచి పాయింట్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఉన్న ఈ కథ ని విస్తరించి మనకి వడ్డించిన తీరు కథనం లో చెప్పుకుందాం.
కథనం :
చిన్న పిల్లల నాటకాలతో మొదలు పెట్టి, ఎక్కువ లేట్ చెయ్యకుండా జై ప్రాబ్లెమ్ ని తాను పేస్ చేస్తున్న సిట్యుయేషన్ ని బ్యూటిఫుల్ గా ప్రెసెంట్ చేసారు. ఈ ఎపిసోడ్ మొత్తం జై క్యారెక్టర్ ని జస్టిఫై చెయ్యటానికి అద్భుతం గా పనికొచ్చింది. రావణాసుడు ఎందుకు రామ లక్ష్మణులని ఏడిపించాడు అంటే, వాళ్ళు తన చెల్లి ని అవమానించి నందుకు అని తెలుసుకొని అసలు సూర్పనఖ ఎం చేసింది అనే క్వశ్చన్ వదిలేసి రావణాసురుడే రైట్ అని ఫిక్స్ అవుతాడు. నాటకం జరుగుతున్న స్టేజి తగలబెట్టేస్తాడు. పది నిముషాలు పాటు ఉండే ఈ ఎపిసోడ్స్ తో మనలో జై పట్ల ఒక సానుభూతి ని కలిగించారు.
ప్రారంభం:
కుశ - పరిచయం - సమస్య : అభిమానుల దాహం తీర్చటానికి ఎనర్జిటిక్ కుశ పాత్ర తో సాంగ్ అండ్ కామెడీ ఫైట్ (నమ్మాల్సిందే అది కామెడీ ఏ). ఇక్కడ దోచుకుంటే మిగిలే దానికంటే అమెరికా లో దోచుకుంటే మిగిలేది ఎక్కువ అని ఎలా అయినా అమెరికా వెళ్ళాలి అని ఏజెంట్ కి డబ్బులు ఇచ్చే టైం కి నోట్ల రద్దు గురుంచి తెలిసి ఆ ఫ్రస్ట్రేషన్ లో డ్రైవ్ చేస్తూ ఆక్సిడెంట్ చేసి లవ బ్రతికే ఉన్నాడు అని తెలుసుకుంటాడు.
లవ - పరిచయం - సమస్య: అమాయకుడు ఐన లవ తన తోటి బ్యాంకు ఎంప్లాయిస్ చేతిలో మోస పోతాడు. తన కోసం సంబంధాలు చూస్తున్న రాశి ఒక సంబంధం సెట్ చేస్తుంది. ఆల్రెడీ పెళ్లి సెట్ అయ్యి ఎంగేజ్మెంట్ జరిగే టైం లో రాశి కి ప్రొపొసె చేస్తాడు. అటు ప్రేమ వర్క్ అవుట్ అవ్వక ఇటు బ్యాంకు లో మనీ ప్రాబ్లెమ్ తో సతమతమవుతూ ఉంటాడు. ఈ మొత్తం ఎపిసోడ్ ఒకింత టెంపో డౌన్ చెయ్యటమే కాకుండా ఎదో పాత కాలం సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది.
డ్యూయల్ రోల్ సినిమాల్లో జరిగే పాత్రల మార్పు ఇక్కడ మొదలు అవుతుంది. నేను దూసుకెళ్తా అని ఒకరు నేను దోచుకెళ్తా అని ఇంకొకరు కోన స్టైల్ లో కుమ్మటం మొదలు అవుతుంది. కామెడీ పేరుతో ఒకింత అసహనం మొదలు అవుతుంది. ఇటు లవ ట్రాక్ లో ఎనర్జీ లేక, అటు కుశ ఎనర్జీ వేస్ట్ అవుతూ ఉండగా ఎప్పుడెప్పుడు మనకి జై పరిచయం అవుతుందా అని ఎదురు చూడటం మొదలు పెడతాం. ఈ గ్యాప్ లో ఒక ఫైట్ చేసి కుశుడు ఒక సాంగ్ ఏసుకొని లవుడు (సాఫ్ట్ లవుడు ట్రింగ్ ట్రింగ్ అనే పడాల్సిన అవసరం వచ్చింది అంటే అది కమర్షియల్ కిచిడి కాక మరేమిటి, ఇక్కడ స్లో సాంగ్ పెడితే కష్టం అని ఇలా కానిచ్ఛేసి ఉంటారు) వాళ్ళ వాళ్ళ టార్గెట్ లు రీచ్ అవుతారు.
మిడిల్ (సమస్యాత్మకం) : ఇలా సాగిపోతున్న వాళ్ళ లైఫ్ లో ఒక ట్విస్ట్. కుశుడి డబ్బులు లవ లవర్ మిస్ అవుతారు.సాయి కుమార్ గారి ఎంట్రన్స్ తో ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే లో చలనం వస్తుంది. ఆయన్ని ఆల్రెడీ మనం ట్రైలర్ లో చూడటం వలన అది మనకి ట్విస్ట్ అనిపిస్తుంది అని ఎలా అనుకున్నారో కానీ, అవేవి ఆలోచించని అభిమానుల అరుపులు కేకలు మాత్రం మనకి ఉపశమనం ఇస్తాయి. రావణ్ మహారాజ్ ఎంట్రన్స్ తో అప్పటి వరకు జరిగిన నస ని మర్చిపోతూ మనల్ని మనం మైమరచిపోతాం. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ డైలాగ్ కానీ ఒక ఊపు ఊపేస్తోంది. అదే టైం లో ఇలాంటి సీన్ అసలు బోయ పాటి చేతుల్లో పడి ఉంటె దమ్ము కి పది రెట్లు ఉండేది ఏమో అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ ఫైట్ ఇంకా బాగా ప్రెసెంట్ చేసి ఉండాల్సింది. అక్కడ నుంచి కట్ చేసి ప్రెసెంట్ కి తీసుకొచ్చి వేయాల్సిన ఇంటర్వెల్ కార్డు అక్కడే వేసేసి ఇకపై రావణం అని మొదలు పెట్టారు.
జై - పరిచయం - సమస్య : తన గుర్తింపు ని వెతుకుంటూ బయల్దేరిన జై ఒరిస్సా ఎల్లిపోయి డాన్ అయిపోయిన విధానం మనకి మెయిన్ విలన్ ని పరిచయం చేస్తుంది. ఈ సినిమా కి మెయిన్ విలన్ అవసరమా ? జై లాంటి పవర్ఫుల్ నెగటివ్ క్యారెక్టర్ ఉంటె విలన్ ఇంకా ఎంత పవర్ఫుల్ గా ఉండాలి? ఈ లాజిక్ మిస్ అయ్యారు. జై పాత్ర మొత్తం అభిమానులకి పండుగ. గుర్తింపు ఎప్పుడు గెలిచినా వాడికి ఉంటుంది, గెలిపించిన వాడికి కాదు అనే మాట తో పొలిటికల్ ప్రపోసల్ తో జై పాత్ర కి రావాల్సిన సమస్య కి పునాది మొదలు అవుతుంది. తన కుడి బుజం చావు ఇంటికి వెళ్లి అతని చెల్లెల్ని చూసి ప్రేమిస్తాడు. ఎలక్షన్ ప్రచారం లో వచ్చిన రెస్పాన్స్ కి సమస్య లో పడిన జై కి తమ్ముళ్ల గురుంచి తెలుస్తుంది. వాళ్ళకి కావాల్సిన వాటిని తీసుకొచ్చేస్తాడు. జై ఫ్లాష్ బ్యాక్ వరకు ఉన్న టెంపో ని ఆ తర్వాత నిలబెట్టడం లో బాబీ నిరాశపరిచాడు.
మిడిల్ కొనసాగింపు : ఒకరికి ప్రేమ ఛాలెంజ్ ఇంకొకరికి ఎలక్షన్ ఛాలెంజ్. రావణుడు తన చెల్లి కి జరిగిన అవమానం కోసం సీతని ఎత్తుకొస్తే, ఇక్కడ రావణ్ మహారాజ్ తన కి చేతకానిది సాదించుకోటానికి ఎత్తుకొస్తాడు అనేది రియలైజేషన్ కోసం వాడుకొని తమ్ముళ్ల మీద పగ తీర్చుకోవటం ని కథని ముందుకి నడిపించటానికి వాడుకున్నారు. అప్పటి వరకు డామినెటే చేసిన రావణ్ బ్యాక్ సీట్ తీసుకొని తమ్ముళ్ల చేతుల్లోకి కథ వెళ్తుంది. ఇక్కడ నుంచి సినిమా అని మర్చిపోయి ముగ్గురు కలిసి ఉన్న సీన్స్ ఒక నాటకం చూసిన ఫీలింగ్ మొదలు అవుతుంది. పొలిటికల్ ఇమేజ్ బిల్డింగ్ సీన్స్ పాత చింతకాయ పచ్చడిలా సాగగా, ప్రేమ సీన్స్ వాటితో పోటీ పడుతూ ఉంటాయి. నిజం గా లవ్ లో పడెయ్యటం అండ్ పొలిటికల్ గా వర్కౌట్ అవ్వటం చూపెట్టిన విధానం చూస్తే దీనికోసం ఈళ్ళని ఎత్తుకొచ్చింది అని నవ్వుకోవాల్సి వస్తుంది. లవ కి చిన్ననాటి జ్ఞాపకాలతో అన్న వేల్యూ తెలిసొచ్చే సీన్స్ మనకి ఉపశమనం. అడపా దడపా జై నటన తో చెల్లిపోతాయి సీన్స్ మచ్చుకి "మనం అనేది అబద్దం". మోస్ట్ ఎనర్జిటిక్ కుశ కి స్లో సాంగ్ తో సెకండ్ హాఫ్ స్లో సాంగ్ అనే కమర్షియల్ సూత్రం ని తూ చ తప్పకుండ పాటించారు. సెకండ్ హీరోయిన్ లంక లో ఎంటర్ అవ్వటం, సీన్స్ ఎంత చిరాకు పెడతాయో ఎన్టీఆర్ నటన అంత ఆశ్చర్య పరుస్తూ బాలన్స్ చేస్తుంది. జై కి నిజం తెలియటం తో ఐటెం సాంగ్ అయ్యాక ఇంక క్లైమాక్స్ వైపు మొదలు అవుతుంది. జై క్యారెక్టర్ కి ఐటెం సాంగ్ పెట్టాలి అనే ఐడియా ఏదైతే ఉందొ, ఆ సాంగ్ లో డాన్స్ వేసేఅప్పుడు ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్ అంత గొప్ప గా ఉంది.
ముగింపు: ఓడిపోయాను అని లవ ఫీల్ అవ్వటం లో అర్ధం ఉన్నప్పటికీ కుశ లో వచ్చిన మార్పు కి కారణాలు మనకి తెలియక పోయినా, నాటకం ఎపిసోడ్ తో ఎన్టీఆర్ తో పెర్ఫార్మన్స్ తో మళ్లీ అలరించారు. అప్పటి వరకు 90 ఫార్మటు లో ఉన్న స్క్రీన్ ప్లే 80 ఫార్మటు లోకి ఎంటర్ అవుతుంది. తమ్ముళ్ళని చంపెయ్యాలి అనుకోవటం, బాంబు పెట్టడం, బాంబు ఉంది అని తెలిసి చావుకి సిద్ధం అయ్యి వెళ్ళటం, తెలిసే వెళ్లారు అని తెలిసి ఈయన వెళ్ళటం, నేనే రావణ్ నేనే రావణ్ అని ఒకర్ని మించి ఒకరు త్యాగానికి పోటీ పడటం, ఇవన్నీ మనం ఆలోచించుకునే లోపే మన ముందే జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడో సెకండ్ హాఫ్ మొదలు ఐన కొద్దీ సేపటికే ఈ కథని ని వదిలేసి ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ ని ఎంజాయ్ చెయ్యటం మొదలు పెట్టిన వారు లక్కీ ఫెలోస్ అనుకోవచ్చు.
చివరిగా: ఒక్క ఎన్టీఆర్ ఉంటేనే ఫాన్స్ కి పండగ అలాంటిది ముగ్గురి రూపం లో చెలరిగేపోతుంటే వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండక పోవచ్చు, ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ వలన సినిమాలో వచ్చే సిల్లీ సీన్స్ కొంత వరకు కవర్ అయినా, ఒక మంచి పొటెన్షియల్ ఉన్న పాయింట్, పేలవమైన కథనం తో కిచిడి లా తయారు అయ్యింది, ముగ్గుర్ని ఒక సారి చూసే వరకు ఉండే ఉత్సాహం, వాళ్ళని చూసేసిన తర్వాత కథ వైపు కథనం వైపు ఎదురు చూస్తుంది అని ఊహించలేక పోయారా? . జై ఉన్న సీన్స్ లో కొన్ని తప్ప ఇంపాక్ట్ కలిగించే సీన్స్ లేక పోవటం ఒక లోటు. మూడు కారక్టర్లు ఉన్నాయ్ అన్న విషయం తో కథ లేక పోయినా నడిచిపోతుంది అనుకున్నారేమో కానీ, అసలు జై లాంటి పాత్ర ఒక మాస్ మసాలా కమర్షియల్ డైరెక్టర్ చేతిలో పడి ఉంటె అద్భుతం గా పండేది. ఎన్టీఆర్ తన వంతు గా 200 % న్యాయం చేసాడు , తాను పెట్టుకున్న నమ్మకాన్ని బాబీ 50 % అందుకొని ఉండొచ్చు. అయినా జై పాత్ర లో ఉండే బెస్ట్ అంతా టీజర్ లోను ట్రైలర్ లోను చూపించేసారు, ఇంకేదో ఉంటుంది సినిమాలో అనుకోవటం మా తప్పు అని మాత్రం అనకండి. ఈ మధ్య కాలం లో ఇలా ట్రైలర్ లో బొమ్మ చూపించి థియేటర్ లో పడుకోవటం మాకు అలవాటు అయిపోయింది.
ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈ సినిమా చెయ్యటానికి ధ... ధ... ధైర్యం ఉండాలి, తీయటానికి తె... తె.... తెగింపు ఉండాలి, అలాగే చూడాలి అంటే మాత్రం ఓ.... ఓ..... ఓపిక ఉండాలి.
8 comments:
awesome bhayya kummesaru as usual ga
Very good analysis sir
Excellent article dude
ఎన్ని రివ్యూస్ వచ్చినా మీ విశ్లేషణ కోసం ఎదురుచూస్తూ ఉంటాం హరి గారు. ప్రతి పోస్ట్ లో ఎదో ఒక కొత్త యాంగిల్ లో ప్రెసెంట్ చేస్తారు. మీ ప్రయత్నం కి మా జోహార్లు
Usually I do not read post on blogs, however I wish to say that this write-up very pressured me to take a look at and do it!
Your writing style has been surprised me. Thanks, quite nice post.
చాలా బాగా చెప్పారు.
చాలా బాగా చెప్పారు.
Post a Comment