వాల్తేర్ వీరయ్య - కథ - కథనం - విశ్లేషణ


 


వాల్తేర్ వీరయ్య - కథ - కథనం - విశ్లేషణ  


వింటేజ్ చిరంజీవి అంటూ వీరయ్య మొదలు పెట్టినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఈ మధ్యన వచ్చిన సినిమాలు ఆచార్య పూర్తిగా నీరసం తెప్పించేయ్యగా, గాడ్ ఫాదర్ తో ఎదో పర్వాలేదు అనుకునేలా మమ అనిపించేసినా కూడా అభిమానుల అందరి ఎదురు చూపులు వీరయ్య కొరకే. స్వతహాగా ఫ్యాన్ ఐన డైరెక్టర్ బాబీ ఒక అభిమానిగా ఎలా ప్రెసెంట్ చెయ్యాలో అలాగే చేశా అని చెప్పటం తో, ప్రీ రిలీజ్ చిరంజీవి గారి కాంఫిడెన్స్ తో, ఆల్రెడీ హిట్ ఐన రెండు మాస్ సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఈ మధ్యనే ధమాకా తో సప్రైజ్ హిట్ కొట్టిన రవితేజా కూడా తోడవ్వటం ఇంక పూనకాలు లోడింగ్ కాక ఏముంటుంది చెప్పండి. హిట్ కొట్టాలి అనే అంచనాలు ఒక వైపు, చాలా రోజుల తర్వాత బాలయ్య సినిమా తో పోటీ వలన సంక్రాంతి విన్నర్ అవ్వాలి అనే పోటీ ఒక వైపు, వీటి మధ్య లో వచ్చిన వీరయ్య విన్నర్ మెటీరియల్ అనిపించుకున్నాడా? వింటేజ్ చిరంజీవి వరకు ఓకే అని సరిపెట్టుకున్న కనీసం కథ లో అయినా కథనం లో అయినా ఏమైనా కొత్తదనం ఉండే ఉద్దేశం ఉందా లేక అది కూడా వింటేజ్ కథేనా? అంత దమ్ము ఉన్న కథ - కథనం ఈ వీరయ్య కి తోడు అయ్యాయా ? విశ్లేషించుకుందాం.


వరసపెట్టి సినిమాలు చేస్తున్న చిరంజీవి గారితో పని చేస్తున్న ప్రతి డైరెక్టర్ చెప్పేది ఒకటే, నేను అయన అభిమానిని, ఆయనని చూసే ఇండస్ట్రీ కి వచ్చాను, ఆయన్ని మీరు ఎలా చూడాలి అని కోరుకుంటున్నారో అలాగే చూపించబోతున్నాను అని. బాబీ గారు కూడా దీనికి అతీతం కాదు. అయన మెప్పించిన సినిమాలు చాలా ఉన్నాయి, అందులో ఎం తీసుకొని ముందుకి వెళ్ళాలి అంటే అయన చేసే ఫన్ అనేది చాలా మందికి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. అందులో కూడా బోలెడు వేరియేషన్స్ ఉన్నాయి, రౌడీ అల్లుడు, అన్నయ్య, అందరివాడు, శంకర్ దాదా, జై చిరంజీవ ఎవరి ఛాయస్ లు వాళ్లకు ఉంటాయి అని సరిపెట్టుకోవాలి ఏమో కానీ ఎక్కువ అందరివాడు గోవిందరాజులని చూసినట్టే అనిపించింది.


కథ: సింపుల్ గా చెప్పాలి అంటే, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన తన తమ్ముడి మీద పడ్డ నిందని తప్పు అని నిరూపించి అతని చావుకి తగిన గౌరవం దక్కేలా చేసే ఒక అన్న కథ.  ఎలా చెప్పుకున్నా ఎటునుంచి చెప్పుకున్నా మూలకథ అయితే మాత్రం ఇదే, దీని దీనిని మెగా ప్యాకేజీ మాస్ మసాలా కమర్షియల్ సినిమా చేసిన విధానం గురుంచి కథనం లో చెప్పుకుందాం. 


కథనం - ఫస్ట్ ఆక్ట్ - బిగినింగ్ (మిడిల్) 


ఇది కూడా ఫ్లాష్ బ్యాక్ కథ అవ్వటం వలన, ఎప్పుడో వీరయ్య చిన్నప్పుడు మొదలై మనం ప్రస్తుతం చూడబోతున్న మిడిల్ నుంచి మనకి కనిపిస్తుంది అన్నమాట. వింటేజ్ మాస్టర్ మెగాస్టార్ లోగోతో మొదలవుతుంది. 


ఇంటర్నేషనల్ డ్రగ్ డాన్ బాబీ సింహ, తనను పట్టుకొని ఉంచిన రాజేంద్ర ప్రసాద్ గారి పోలీస్ స్టేషన్ లో అందర్నీ చంపేసి తప్పించుకుంటాడు. అయన సస్పెండ్ అవుతారు. తన కొలీగ్స్ చావుకి ప్రతీకారంగా బాబీ ని పట్టుకోడానికి తన బావమరిది వెన్నెల కిషోర్ తో కలిసి సరైన వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటాడు. దానికి వాల్తేర్ వీరయ్య కరెక్ట్ అని నిర్ణయించుకుంటాడు, ఇంతకీ ఎవరు ఈ వీరయ్య?  ఆయన గొంతు వింటే కరుడుగట్టిన రౌడీలు కూడా వణికిపోతూ ఉంటారు, కోస్టల్ గార్డ్స్ (మీరు కరెక్ట్ గానే చదివారు), జాలరి పేట వచ్చి వీరయ్య గారు వచ్చి స్మగ్లర్స్ ఎత్తుకెళ్లిన మా కోస్టల్ గార్డ్స్ ని కాపాడాలి అని రిక్వెస్ట్ చేస్తారు (మీరు కరెక్ట్ గానే చదివారు). ఎంట్రీ ఫైట్ అండ్ బాస్ పార్టీ సాంగ్.  వీరయ్య మీద కోర్ట్ లో కేసు నడుస్తూ ఉంటుంది, దాని గురుంచి డబ్బు అవసరం పడుతుంది, అదే టైం లో రాజేంద్ర ప్రసాద్ గారు డీల్ అంటూ వస్తారు. 


మిడిల్ లో మిడిల్ - మలేషియా కి బయల్దేరతారు. వీరయ్య కి వెర్టిగో ప్రాబ్లెమ్ ఉంది అని, పైకి ఎక్కాలంటే భయం, కిందకి చూడాలంటె భయం అని ఒక సీడ్ వేస్తారు. సముద్రం లో అంత పెద్ద జంప్ చేసి ఫస్ట్ ఫైట్ చేసాడు కదా అని అడగకండి అక్కడ మర్చిపోయారు ఏమో కానీ, సినిమాలో ఈ పాయింట్ ని ఎక్కడెక్కడ వాడాలో అక్కడ పర్ఫెక్ట్ గా వాడుకున్నారు.  బాబీ సింహ హోటల్ లోనే దిగి అతన్ని ఎలా పట్టుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. అక్కడ హీరోయిన్ శృతి గారితో కామెడీ పేరుతో ప్రేమాయణం. ఈ మొత్తం ఎపిసోడ్ ని చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ తో, డైలాగ్స్ తో నెట్టుకొచ్చేసినా కూడా, అయన స్థాయి ని స్థానం ని మర్చిపోయినట్టు అనిపిస్తుంది. అయన పాటలకి ఆయనే డాన్స్ వేసుకోవటం ని ఏమనాలి? ఫాన్స్ ని అలరించటం అని సరిపెట్టుకోవాలా? అయన పాటలకి బన్నీ చరణ్ సాయి తేజ్ ఆఖరికి రజినీకాంత్ గారు  అందరు డాన్సులు వేస్తే ఒక అందం, అయన పాటకి అయన గెట్ అప్ లో ఆయనే డాన్స్ వెయ్యటం అయన స్థాయికి సరిపోదు. దీని గురుంచి లాస్ట్ లో చెప్పుకుందాం. కామెడీ పేరుతో శృతి మించుతున్న అని అర్ధం అవ్వటానికి ఎంతో సేపు పట్టదు. అసలు విషయానికి రాకుండా ఈ సోది ఏంటి అని వెన్నెల కిషోర్ రియాక్షన్ ఏ ఒక సగటు ప్రేక్షకుడు కి కూడా కలుగుతున్న టైం లో, తన లోకల్ కాంటాక్ట్ ద్వారా బాబీ సింహ గురుంచి తన అన్న ప్రకాష్ రాజ్ గురుంచి తెలుసుకుంటారు. తన తమ్ముడి జోలికి వచ్చిన వారి కోసం ఎంత దూరం అయినా వెళ్లే క్రూరుడు ప్రకాష్ రాజ్. అలాంటి డేంజరస్ ఫెలోస్ ని మన వీరయ్య అండ్ గ్యాంగ్ ఢీ కొట్టబోతున్నారు అన్నమాట. తన హోటల్ లోనే కిడ్నప్ చేద్దాం అని ప్లాన్ చేసుకుంటారు కానీ కొన్ని కారణాల వలన అది ఫెయిల్ అవుతుంది. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ గారు బాబీ సింహ కి దొరికిపోతారు. వాళ్ళని తప్పించటానికి వీరయ్య బాబీ తో వ్యాపారం చెయ్యటానికి డీల్ ఇస్తాడు. బాబీ వెరిఫికేషన్ లో వీరయ్య ఒక డేంజరస్ స్మగ్లర్ అనే నిజం తెలుస్తుంది. 


బాబీ మీద జరిగే మర్డర్ అట్టెంప్ట్ లో తనని కాపాడి ఇంకా దగ్గర అవుతాడు వీరయ్య. ట్విస్ట్ ఏంటి అంటే ఆ అట్టాక్ చేసింది శృతి ది రా ఏజెంట్ అఫ్ ఇండియన్ గవర్నమెంట్ అన్నమాట. ఒక టీం తో ఆవిడ బాబీ ని పట్టుకోటానికే ఆ హోటల్ లో పని చేస్తుంది. తాను కూడా బాబీ కి దొరికిపోతుంది. తనని కాపాడే ప్రాసెస్ లో వీరయ్య ప్రకాష్ రాజ్ ఒకర్ని ఒకరు చూసుకోవటం జరుగుతుంది. బాబీ నా ఎర - ప్రకాష్ రాజ్ ఏ నా సొర అని షాక్ ఇస్తాడు వీరయ్య. ఈ కథ మొత్తం రాజేంద్ర ప్రసాద్ ది కాదు, నా కథలోకి మీరొచ్చారు. బాబీ ని చంపి ప్రకాష్ రాజ్ ని రప్పిస్తా అని ఛాలెంజ్ చేసి, పెద్ద ఫైట్ చేసి చంపేస్తాడు. ఆ విధంగా సీతాపతి కథ కి ముగింపు అని, తన కథకి ఇది ఆరంభం అని చెప్తాడు. ఇంటర్వెల్ - పూనకాలు లోడింగ్ 


పెర్ఫార్మెన్స్ పరంగా డైలాగ్ డెలివరీ పరంగా చాలా వరకు అలరించినా, కొన్ని చోట్ల ఫోర్స్డ్ గా అనిపించింది. సీరియస్ డైలాగ్స్ మాములుగా చెప్పేస్తూ కామెడీ టైంలోనే స్లాంగ్ కి ఫిక్స్ అయినట్టు ఉన్నారు. తనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉన్నప్పుడు, ఇంటర్వెల్ టైం కి ఇది నా కథ అని చెప్పినప్పుడు దానికి తగ్గ సీడ్స్ అక్కడక్కడా ఇవ్వాల్సి ఉంటుంది, ప్రేక్షకులని ప్రిపేర్ చెయ్యాల్సి ఉంటుంది. జై చిరంజీవ లో డాక్టర్ మీద కత్తి ఎత్తినట్టు అంతర్లీనం గా వేరే కారణం ఉంది అన్నది చూపెట్టకుండా కామెడీ చేయించుకొని లాగేస్తే, కామెడీ వరకే గుర్తుంటుంది. కథ నాది మీది కాదు అన్నప్పుడు అమాయకులు అయిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని జల్సాలు చెయ్యటం పాత్ర ఔచిత్యం ని దెబ్బ తీస్తుంది. రా ఆఫీసర్స్ టీమ్స్ అన్ని రోజులు గా అక్కడ కష్ట పడుతుంది బాబీ ని ప్రాణాలతో పట్టుకొని ఇండియా కి తీసుకు రావటానికి, వాళ్ళ ముందే చంపేస్తుంటే కాల్చి పారెయ్యాలేమో కానీ మనతో పాటు నేల టికెట్ లో కూర్చున్న ప్రేక్షకులు లా చూస్తూ ఉంటారు. బాస్ గ్రేస్ అలాంటిది - బాస్ ఈజ్ బ్యాక్, కోస్టల్ గార్డ్స్ అయినా, పోలీస్ లు అయినా, రా ఆఫీసర్స్ అయినా సలాం కొట్టాల్సిందే. ఇక్కడితో నా కథ ఆరంభం అంటాడు, అంతకు ముందేమో నా కథలోకి మీరొచ్చారు అంటాడు


సినిమా మొదలు అయినప్పటి నుంచి పూనకాలు ఎప్పుడెప్పుడు లోడింగ్ అవుతాయా అని వెయిట్ చేసిన మనకి ఇంటర్వెల్ ఏ పూనకాలు అనుకుంటే, కాదు అసలు పూనకాలు సెకండ్ హాఫ్ లో లోడింగ్ అని అర్ధం అవుతుంది. 


శవం దగ్గర పెట్టుకునే ప్రకాష్ రాజ్ అక్కడికే వచ్చేవాడు అప్పుడు పట్టేసుకోవచ్చు కదా అని మనకి అనిపిస్తుంది కానీ డైరెక్టర్ కి అనిపించక, బాబీ శవం ఎక్కడో సెపరేట్ గా పెట్టి ప్రకాష్ రాజ్ గారి ఆలోచనల్లోంచి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తారు. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ లో జరిగే సగం సినిమా ఆయనకి తెలిసే అవకాశమే లేనప్పుడు అయన ఆలోచనల్లోంచి ఎందుకు ఓపెన్ చేసినట్టు? 


డాషింగ్ ఫైట్ తో రవి తేజ ఎంట్రీ, తెలంగాణ మాండలీకం కూడా ఫోర్స్డ్ గానే అనిపించింది. పూనకాలు లోడింగ్ సాంగ్ - ఏ లిరిక్ గిరిక్ పక్కన పేట్, బీటు గీటు లపేట్ లపేట్. ట్రాన్స్ఫర్ మీద వైజాగ్ వచ్చిన రవి తేజ జాలరిపేట లో మొత్తం అందర్నీ పిలిచి, అక్కడ జరుగుతున్న  డ్రగ్స్ కేసు లింక్ గురుంచి వార్నింగ్ ఇస్తాడు. చిరంజీవి సినిమా లో కామెడీ పండాలి అంటే డ్రింక్స్ సీన్ లేకుండా ఎలా? దానికి టాగోర్ సినిమా ఫ్లాష్ బ్యాక్ లోని బూతులు మింగేయ్ రిఫరెన్స్ ఆడ్ అయితే ఎలా ఉంటుంది. ఇంతలో ఆ డ్రగ్స్ వ్యాపారం చేస్తుంది ప్రకాష్ రాజ్ ఏ అని - దాని గురుంచి వీరయ్య కి తెలియదు అని మనకి తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ సీన్, నెమ్మదిగా రవి తేజ గారు కొడుకు చిరంజీవి లా సీరియస్ గా చేస్తుంటే, తండ్రి గోవిందరాజులు లా వీరయ్య మారిపోతూ ఉంటాడు. ఈ తతంగం అంతా ఒక పావు గంట కామెడీ పేరుతో నడుస్తూ ఉంటుంది. అసలు మనం ఫస్ట్ హాఫ్ లో చూసిన వీరయ్య ఈయన ఒకరేనా? కోస్టల్ గార్డ్స్ వచ్చి అడిగిన వీరయ్య గారు, ఫోన్ లో పేరు చెప్తే పంచె జారిపోయేలా రౌడీ లు సైతం పరిగెత్తే వీరయ్య గారు. అప్పటికి మనకి అర్ధం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, సెకండ్ హాఫ్ మొదలయ్యాకే మనకి సెకండ్ సినిమా మొదలు అయ్యింది అని. ఒకే టికెట్ మీద రెండు సినిమాలు బోలెడన్ని వేరియేషన్స్. తండ్రికి పిండం పెట్టె దగ్గర కూడా కామెడీ ట్రై చెయ్యటం మాములు విషయం కాదు.  


డ్రగ్స్ కేసు సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్న రవి తేజ కి ప్రకాష్ రాజ్ దొరికినట్టే దొరికి తప్పించుకుంటాడు. ఇక్కడొక ముఠామేస్త్రి బిల్డుప్ ఎపిసోడ్ తో మొదలు పెట్టి పోలీస్ స్టేషన్ లో గోవిందరాజులు కామెడీ ఎపిసోడ్ తో ముగిస్తారు. ఫస్ట్ హాఫ్ లో తన ప్రయత్నం ని కామెడీ తో కవర్ చేసేసినట్టు, సెకండ్ హాఫ్ లో తన తమ్ముడి ప్రయత్నాన్ని కూడా కామెడీ తో కమ్మేసారు. తమ్ముడు కి అన్నకి ఒకరంటే ఒకరికి పడదు అని మాత్రమే తెలిసిన మనకి, వీరయ్య కి తన తమ్ముడు అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది అలాగే తన తమ్ముడు తనని ఎందుకు ద్వేషిస్తాడో కూడా ఒక చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ తో మొదలవుతుంది. ఇదంతా మనం చూస్తుంది ప్రకాష్ రాజ్ ఆలోచనల్లోంచి అని మర్చిపోకండి. చెట్టు కొమ్మ మీద చిక్కుకున్న తన తమ్ముడిని తనకి ఉన్న వెర్టిగో ప్రాబ్లెమ్ వలన కాపాడలేక పోవటం వలన అపార్థం చేసుకొని పిన్ని తమ్ముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి ఆ దూరం అలాగే దూరంగా ఉండిపోయింది అన్నమాట. అప్పటి వరకు కామెడీ తో నెట్టుకొచ్చేసిన ఫ్లాష్ బ్యాక్ - డ్రగ్స్ ఉన్న ఐస్ స్కూల్ పిల్లలకి వెళ్లి - 20  మంది పిల్లలు చచ్చిపోవటం తో సీరియస్ నోట్ కి మారుతుంది. అది వీరయ్య ఫ్యాక్టరీ లో తయారు అవ్వటం వలన, ప్రకాష్ రాజ్ తప్పించుకోటం వలన, వీరయ్య ని అరెస్ట్ చేస్తారు. ఎన్కౌంటర్ చేసి చంపేద్దాం అనే ప్లాన్ లో వీరయ్య ని తప్పించి ఆ ప్లేస్ లో వెళ్లిన రవి తేజ పోరాడి చచ్చిపోతాడు. మొత్తం సినిమా లో ఇద్దరు మాస్ హీరోస్ ని పెట్టుకొని, ఇద్దర్ని కలిపి ఒక కంబైన్డ్ మాస్ ఎపిసోడ్ లేకుండా చేసారు, పూనకాలు లోడింగ్ సాంగ్ లో మాత్రం ఒక స్టెప్ ఏయించి పండగ చేస్కో అన్నారు


ఇక్కడ ఇంప్రెస్స్ చేసే రైటింగ్ ఎక్కడ కనపడుతుంది అంటే - చని పోయే ముందు రవితేజ ని వీరయ్య అంటే ఎంత ఇష్టమో చెప్తూ, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండటం వలన నీతో ఫ్రీగా ఉండలేకపోయాను అని చెప్పించారు. అలాగే నీ స్మైల్ కి నేను ఫ్యాన్ ని జీవితాంతం నువ్వు నవ్వుతూనే ఉండాలి అనేది చివరి కోరిక గా చెప్పించారు. వీటి వలన వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ కి సమాధానం ఇస్తూనే, ఇంత సీరియస్ లాస్ జరిగినా కూడా అంత ఫన్నీ గా ఫస్ట్ హాఫ్ లో ఎలా ఉండగలిగావ్ వీరయ్య అనే ప్రశ్న కి కూడా సమాధానం ఇప్పించారు. వెర్టిగో గురుంచి మనకి మొదట్లో వేసిన సీడ్స్ కి పే ఆఫ్ రెండు మూడు ఇంపార్టెంట్ సీన్స్ లో వాడుకున్న తీరు కూడా మెచ్చుకోదగినదే


రవితేజ మీద డ్రగ్స్ మాఫియా తో లింక్ ఉందని - అతడు పోలీస్ డిపార్ట్మెంట్ కె మచ్చ అని ప్రచారం జరుగుతుంది. ఆ పేరు తొలగించి తన తమ్ముడి నిజాయితీ నిరూపించటమే వీరయ్య లక్ష్యం. ఇప్పుడు ప్రకాష్ రాజు కోర్ట్ కి వచ్చి నిజం చెప్తేనే అది జరుగుతుంది అని తన ఫ్లాష్ బ్యాక్ చిరంజీవి గారు చెప్పగా ముగుస్తుంది (మీరు చదివింది కరెక్ట్ ఏ) ప్రకాష్ రాజ్ ఆలోచనల్లోంచి మొదలు పెట్టిన ఫ్లాష్ బ్యాక్ చిరంజీవి గారు ఫినిష్ చేస్తారు. ఇంకో 2  డేస్ లో ప్రకాష్ రాజ్ ఏ నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళు అని బ్రతిమాలెలా చేస్తాను శపధం చేస్తాడు. ఈ మొత్తం ప్రాసెస్ లో స్లాంగ్ మర్చిపోయి మాములుగా మాట్లాడేస్తాడు లెండి అది వేరే విషయం. అంతా బాగానే ఉంది కానీ ఇంకో మాస్ సాంగ్ ఉండాలి కదా అది ఎక్కడ ప్లేస్ చెయ్యాలో మర్చిపోయారు అని సడన్ గా గుర్తొచ్చినట్టు రా ఆఫీసర్ శృతి ని తనకున్న కాంటాక్ట్స్ ద్వారా ఇండియా కి పంపించేస్తాను అని ఒక సాంగ్ ఏసుకుంటాడు


థర్డ్ ఆక్ట్ - ముగింపు :  ఇంటర్వెల్ దగ్గర చెప్పిన పూనకాలు లోడింగ్ అనేది క్లైమాక్స్ లో ఏమో మనం ఎదురు చూసే టైం ఆసన్నమయింది. (మధ్యలో మనం చూసింది అంతా ఫ్లాష్ బ్యాక్ కదా). పైన చెప్పుకున్నా సాంగ్ కి ముందే థర్డ్ ఆక్ట్ స్టార్ట్ అయ్యింది. పాటని తీసుకొచ్చి ఇక్కడ ఇరికించారు, పాట కి ముందు - పాట తర్వాత కూడా ఒక సీరియస్ ప్లానింగ్ జరుగుంతుంది. అది క్లైమాక్స్ ఫైట్ కి దారి తీస్తుంది. ఇక్కడ కూడా స్లాంగ్ మర్చిపోయి మాములుగా మాటాడేస్తారు అనుకోండి. ప్రకాష్ రాజ్ కి అతని పార్టనర్ కి మధ్య లో గొడవ పెట్టి - నన్నే బ్రతిమాలించుకుంటాను అని శపధం చేసిన వీరయ్య - వచేస్తావా, నాతో వస్తావా ఇక్కడే చస్తావా, తేల్చుకో, ఆలోచించుకో అని బేరాలాడి కోర్ట్ కి వస్తే నిజం చెప్తాను అని మాట తీసుకొని సేవ్ చేస్తాడు. అప్పటి వరకు ఆహ ఓహో అని అనుకున్న ప్రకాష్ రాజ్ కూడా ఈ మొత్తం ఆక్ట్ లో డమ్మి అయిపోయి ఒప్పేసుకుంటాడు లేక పోతే ఇంకో పావు గంట సినిమా లెంగ్త్ పెరిగేది ఏమో. తన తమ్ముడి కోరిక మేరకు కోర్ట్ లోనే ప్రకాష్ రాజ్ ని నరికేసి జైలు కి ఎల్లిపోతాడు. 


చివరిగా: రవి తేజ కి తన పాత్ర ప్రారంభం అయిన దగ్గర నుంచి ఒక ఆశయం ఉంది - డ్రగ్స్ లింక్ కనిపెట్టాలి - అయిపోయాక అన్నయ్య తో సెటిల్ అయిపోవాలి. ప్రకాష్ రాజ్ పాత్ర ప్రారంభం అయిన దగ్గర నుంచి ఆశయం ఉంది - డ్రగ్స్ డాన్ గా ఎదగాలి - వైజాగ్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఎదిగిన గ్రోత్ ఉంది - తమ్ముడు చచ్చిపోయాడు అనే లాస్ ఉంది - వీటన్నిటికీ కారణం అయిన వీరయ్య ని చంపెయ్యాలి అని కసి కూడా ఉండే ఉంటుంది. వీరయ్య పాత్ర లో వింటేజ్ చిరంజీవి ఉన్నాడు. మాస్ స్లాంగ్ ఉంది, స్వాగ్ ఉంది, ఫైట్స్ లో బాడీ లాంగ్వేజ్ ఉంది, డాన్స్ లో గ్రేస్ ఉంది, డైలాగ్ డెలివరీ లో ఫన్ ఉంది, కామెడీ టైమింగ్ అదిరింది, పేస్ లో మునుపటి గ్లామర్ ఉంది, తమ్ముడు చనిపోయిన తర్వాత ఆశయం క్రియేట్ అయ్యింది. అన్న తమ్ముళ్ల మధ్య వన్ సైడెడ్ గా అయినా కొంచెం అనురాగం చూపించి ఉంటె బావుండేది, మొత్తం అంతా ఒకే ఒక సీన్ కి పరిమితం చెయ్యకుండా - అప్పుడు వీరయ్య ఆశయం కి ప్రేక్షకులు కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉండేది. ఇంటర్వెల్ లో ఇది నా కథకి ఆరంభం అని చెప్పి ఆక్టివేట్ అయినా క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ రూపం లో క్లైమాక్స్ వరకు టైం తినెయ్యటం వలన పూర్తిగా పాసివ్ అయిపోయింది. జస్ట్ క్లైమాక్స్ కి తిరిగి ఆక్టివేట్ అవుతుంది. ఇంతకీ ఇంటర్వెల్ లో చెప్పిన పూనకాలు ఎక్కడ లోడ్ అయ్యాయి?  అటు ఫ్లాష్ బ్యాక్ లోను అవ్వలేదు, చప్పబడిపోయిన క్లైమాక్స్ లోను అవ్వలేదు.  వింటేజ్ చిరంజీవిని చూసిన ఫాన్స్ కి ఏమైనా లోడ్ అయ్యాయేమో కానీ, సగటు ప్రేక్షకులు వీరయ్య పార్ట్ 2 వరకు వెయిట్ చెయ్యాలి ఏమో.


ఒక రకంగా ఇది చిరంజీవి గారి అభిమానుల్ని సంతృప్తి పరచటానికి వాళ్ళ కోసమే తీసిన సినిమాలా అంటుంది, అందు వలన వాళ్ళ సైడ్ నుంచి ఎం కంప్లైంట్స్ ఉండవ్, ఈ ఏజ్ లో కూడా చలాకీగా వాళ్ళని అలరిస్తుంటే ఎన్ని ఆచార్య లు వచ్చినా క్షమించేస్తారు, మాకు ఇది చాలు బాసు అంటూ దాసోహం అయిపోతారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే చిరంజీవి గారు ఇన్ని సంవత్సరాల కెరీర్ లో చెయ్యని పాత్రలు, వేరియేషన్లు అంటూ ఎం ఉండకపోవచ్చు ఆలా అని చెప్పి ఆయనతో స్పూఫ్ లు చేయించటం ఎంత వరకు కరెక్ట్. జారుమిఠాయి పాటలు, జర్నలిస్ట్ డైలాగ్ లు, ట్విట్టర్ లో పేస్ బుక్ లో ట్రెండ్ అయ్యే జోక్ లు, ఇలాంటివి చెయ్యటానికి వేరే కామెడీ హీరోస్ ఉన్నారు. వింటేజ్ వింటేజ్ అని రజినీకాంత్ గారు చేసిన తప్పు మీరు కూడా చెయ్యకండి, అనవసరపు కామెడి తో అలరించే ప్రాసెస్ లో హుందాతనం మిస్ అయ్యే ప్రమాదం ఉంది అని గుర్తించండి అని మరొక్క సారి వేడుకుంటూ






0 comments:

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views