వీర సింహ రెడ్డి - కథ - కథనం - విశ్లేషణ



వీర సింహ రెడ్డి - కథ - కథనం - విశ్లేషణ  


అఖండ తో అన్ స్టాపబుల్ బాలయ్య - క్రాక్ తో తిరిగి ట్రాక్ లో కి వచ్చిన గోపిచంద్ మలినేని, జోరుమీద ఉన్న థమన్ - ఊపు మీద ఉన్న మైత్రి మూవీ మేకర్స్, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ - అచొచ్చిన డ్యూయల్ రోల్ - సంక్రాంతి సీజన్, వెరసి మన వీర సింహ రెడ్డి మేకింగ్ టైం లోనే మినిమం గారంటీ సినిమా అనిపించుకుంది. ఫస్ట్ లుక్ నుంచి, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని ఒక పాజిటివ్ ఫీల్ ఏ కలిగించాయి. అన్నిటికి మించి, చాలా గ్యాప్ తర్వాత తిరిగి సంక్రాంతికి చిరంజీవి సినిమా తో పోటీ పడుతున్న బాలకృష్ణ సినిమా, ఒక రోజు ముందే రిలీజ్ అవ్వటం తో అందరి కళ్ళు ఈ సినిమా పైనే పడ్డాయి. మరీ ఎక్కువ పడిపోవటం వలన దిష్టి ఏమైనా తగిలింది ఏమో కానీ కథ - కథనం విషయం లో మాత్రం ఈ సింహ గర్జనలు ఊహించిన స్థాయి లో లేవు.  టెంప్లేట్ మాస్ సినిమా అయినా కూడా కొన్ని లెక్కలు ఉండాల్సిందే, తగిన మోతాదు లో దినుసులు పడాల్సిందే, పెద్ద మాస్ హీరో తో కమర్షియల్ సినిమా చేసే సువర్ణ అవకాశం ని మలినేని ఎంత వరకు సద్వినియోగం చేసుకున్నాడు అని విశ్లేషించుకుందాం  


బాలయ్య అభిమాని కి బాలయ్య తో సినిమా తీసే అవకాశం వస్తే, అప్పటి వరకు బాలయ్య చెయ్యని - బాలయ్య ని తాను ఎలా చూడాలి అనుకుంటున్నాడో అలాంటి సినిమా చెయ్యాలి అనుకోవటం సహజం లోకేష్ కనకరాజ్ టైపు లో. కానీ తాను బాలయ్య ని ఎలా చూసి ఎంజాయ్ చేసాడో అలాగే ఇంకోసారి చూసుకోవాలి అనుకోటం ఇంకో పద్ధతి కార్తీక్ సుబ్బురాజ్ టైపు లో. ఇక్కడ మలినేనిగారు కూడా బాలయ్య సినిమాకు వేరే రేసీ స్క్రీన్ ప్లే తో కూడిన ఓ కథను అనుకున్నామని, కానీ అఖండ తరువాత కచ్చితంగా లార్జ‌ర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ అవసరం క్లారిటీగా కనిపించిందని, దాంతో ఆ కథను పక్కన పెట్టి ఈ లైన్ చెప్పా అన్నారు. కనకరాజ్ దగ్గర మొదలు పెట్టి సుబ్బురాజ్ అయ్యారు అన్నమాట. 


బాలయ్య సినిమా అనే కంటే, మాస్ మసాలా కమర్షియల్ సినిమా విత్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అంటే కొన్ని లెక్కలు ఉంటాయి, పవర్ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే సాంగ్స్, మంచి ఫైట్స్, మధ్యలో కామెడీ, ఒక ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ ఎక్కడెక్కడ సెట్ చెయ్యాలో డైరెక్టర్ కాదు మన తెలుగు సినిమా ప్రేక్షకులే చెప్పేస్తారు. వాటిని రొటీన్ అనరు, ప్రతి సరి ఆదరిస్తూనే ఉంటారు. ఇదే టెంప్లేట్ లో వేరే హీరో చేసినా, మన సినిమా మన హీరో ఏ మళ్ళీ చేసిన చూసేస్తూ ఉంటారు. ఈ లెక్క దాటి ఏమైనా కొత్తగా చేద్దాం అంటే మాత్రం కొంచెం ఆలోచించుకోవాల్సిందే. ప్రేక్షకుడు వాడికి కావాల్సింది వాడికి ఇచ్చేసినా కంప్లైంట్ చెయ్యడు కానీ, వాడు అనుకున్నది కాకుండా వేరే చూడమంటే మాత్రం వాడి ఈగో హర్ట్ అవుతుంది. ఎన్నో సినిమాల ఉదాహరణలు కూడా మనకి ఉన్నాయి.  


వీరసింహ రెడ్డి టైటిల్ కూడా సమరసింహా రెడ్డి స్టైల్ లో, పక్కన లోగో ఏమో నరసింహ నాయుడు స్టైల్ లో


కథ - తాను ఎంతగానో ప్రేమించే చెల్లి, తనని అపార్ధం చేసుకొని, ద్వేషం పెంచుకొని తన చావుకే ఎదురుచూస్తూ ఉంటె, ఆ చెల్లి చేతుల్లోనే ఆనందంగా చచ్చిపోయే ఒక అన్న కథ? తన తండ్రి చావుకి కారణం అయిన వాడిని చంపాలి అనే ఆశయం తో, అతని చెల్లిని పెళ్లి చేసుకొని, తన ఆశయం - శోభనం ఒకే సారి పూర్తి చేసుకోవాలి అని 30 ఏళ్ళు వెయిట్ చేసి చివరికి పగ తీర్చుకొని - శోభనం చేసుకోకుండానే శత్రువు కొడుకు చేతుల్లో ప్రాణం పోగొట్టుకున్న దునియా కథ? పెళ్లి చేసుకోకుండానే తన తల్లిని - తల్లి చేసిన తండ్రి మీద ద్వేషం లేక పోగా, కళ్ళముందే తండ్రి ని చంపిన మేనత్తని వదిలేసి, మేనమామ ని చంపేసే చిన్న బాలయ్య కథ? ఒకే కుటుంబం మధ్యలో జరిగే ఈ కుటుంబ కక్షల కథ గురుంచి ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది, వీర సింహ రెడ్డి అని పేరు పెట్టారు కాబట్టి ఇది అన్న కథ. మరి అన్న చనిపోవటం ఏంటి ? ఇక్కడే ఇగోలు హర్ట్ అవుతాయి. ఎలా అని కథనం లో చూద్దాం. 


కథనం - ఫస్ట్ ఆక్ట్ - ప్రారంభం (మిడిల్)


ఫ్లాష్ బ్యాక్ తో ముడిపడి ఉండే కథ కాబట్టి, ప్రస్తుతం లో స్టార్ట్ చేసారు. నిజమైన ప్రారంభం ఫ్లాష్ బ్యాక్ లోనే. మనం చూసిన విధానంలోనే తెలుసుకుందాం. 

తన కంటి చూపుతో ఈ సీమని ఏలుతున్న తల మన పెద్ద బాలయ్య ని 30 ఏళ్ళ నుంచి చంపాలి అని ఎదురు చూస్తున్న దునియా విజయ్ ఎంట్రీ తో మొదలవుతుంది. అతను ఎంత క్రూరుడో మనకి చూపించాలని ఒక ఫైట్, మరి వీడు బాలయ్య ని ఎందుకు చంపలేక పోయాడు అనే కుతూహలం. నన్ను బ్రతికిస్తుంది నా పగ అన్నప్పుడే మనం ఇంకా చెన్నకేశవ రెడ్డి టైంలోనే ఉండిపోయాము అనిపించకపోతే ఇంకా ముందు ముందు చూడాల్సినవి తట్టుకోవటం కష్టం. కట్ చేస్తే ఇస్తాంబుల్ లో  30 ఇయర్స్ (ఇండస్ట్రీ కాదు - ఒరిజినల్ ఏజ్) బాలయ్య ఎంట్రీ  - ఫైట్ - హీరోయిన్ పరిచయం - ఫైట్ -  ప్రేమ - పాట. జస్ట్ ఒక స్టాండర్డ్ టెంప్లేట్. నో కంప్లైంట్స్. పెళ్లి గురుంచి మాట్లాడటానికి హీరో తల్లి తండ్రితో రమ్మంటారు. పాపం వాళ్ళకి తెలియదు కదా బాలయ్య కి నాన్న లేడని. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే 30 ఇయర్స్ బాలయ్య కి కూడా తెలియదు తనకి తండ్రి లేడు అని. లేడు అంటే పోయాడా? ఎలా పోయి ఉంటాడు? పోనీ ఉండి మనతో లేదా అనే డౌట్స్ ఆ పసి హృదయానికి వచ్చి ఉండవ్ ఇన్ని సంవత్సరాలు. పెద్ద బాలయ్య ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం అన్నట్టు ఈ సందర్భం కోసమే వెయిట్ చేస్తున్న తల్లి ద్వారా తండ్రి ఉన్నాడు అని తెలుసుకుంటాడు. పెద్ద బాలయ్య ఎంట్రీ - దునియా విజయ్ దండయాత్ర - ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్. ఏ మాట కి ఆ మాట - పెద్ద బాలయ్య గెట్ అప్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ అద్భుతంగా సెట్ అయ్యింది. సింహ లో ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసేలా డైలాగ్స్ - ఇది సమయం కాదు - భయం న బయోడేటా లో లేదు (అక్కడ మా కాంపౌండ్ లో కుక్క కి కూడా తెలియదు). అయినా కూడా విజిల్స్ పడతాయి, గూస్ బంప్స్ వస్తాయి. సగటు ప్రేక్షకుడి సగటు రియాక్షన్ అది.  తప్పు లేదు. నో కంప్లైంట్స్. అవకాశం వచ్చినా చంపకుండా, నీ పెళ్ళానికి చెప్పు నేను పసుపు కుంకుమ పంపించానని అంటాడు. అప్పుడు మనకి తెలుస్తుంది వరలక్ష్మి గురుంచి. దునియా కష్టం గురుంచి. కంచం నిండా వడ్డించి తిననివ్వదు - మంచం .............. వద్దులెండి పాపం 30 ఇయర్స్ నుంచి శోభనం లేదు అని. పగ తీర్చలేదని పక్క ఎక్కనియ్యని పవర్ఫుల్ క్యారెక్టర్ గా వరలక్ష్మి పరిచయం


వీరసింహ రెడ్డి ని కొట్టాలంటే వాడి వెనక ఉన్న జనం ని కొట్టాలి కాబట్టి తాను పెట్టించిన ఫ్యాక్టరీ ని మూయించటానికి ప్లాన్ చేస్తారు. వీళ్ళకి ఒక ఆశయం ఉంది, పగ ఉంది, దాని గురుంచి పోరాటం ఉంది. అటు పెద్ద బాలయ్య కి కానీ 30 ఇయర్స్ బాలయ్యకి కానీ ఒక ఆశయం ఉన్నట్టు తెలియదు మనకి. వాళ్ళు ఎదో వాళ్ళ డైలీ ఆక్టివిటీస్ చేసుకుంటూ ఎవరైనా ఎటాక్ చేస్తే లుంగీ ఎగిరేలా ఫైట్ చెయ్యటమే డ్యూటీ లా చేసుకుంటూ ఉంటారు. సినిమా మొదలైన గంట లో మూడో సారి దునియా విజయ్ పెద్ద బాలయ్య మీద ఎటాక్ చేస్తాడు - పెద్ద ఫైట్ - కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయ్యాలి డూడ్ డైలాగ్ ఒకటే తక్కువ. మళ్ళీ షరా మాములే దునియా ఓడిపోతాడు. హోమ్ మినిస్టర్ తో మీటింగ్ పెడతారు. మరి గవర్మెంట్ మీద డైలాగ్స్ రాసుకున్నవి అన్ని ఇక్కడే వాడెయ్యాలి కదా - రాయలసీమ గురుంచి కొన్ని డైలాగ్స్ (సీడెడ్ లో బ్రేక్ ఈవెన్ గారంటీ అని ఆ రోజే డిసైడ్ అయ్యి ఉంటారు). ఎక్కడ కథ అక్కడే ఉండిపోతూ తిరిగి తిరిగి అదే చూస్తున్న ఫీల్ కలుగుతుంది. మనకి కంప్లైంట్స్ మొదలు అవుతాయి. 


పెద్ద బాలయ్య ఎదో పెళ్లి కి బెంగుళూరు వెళ్దాం అనుకుంటే - ఇంకో సారి ఎటాక్ ప్లాన్ చేస్తాడు దునియా. అప్పుడు మోగుతుంది ఫోన్. అప్పటి వరకు రొటీన్ గా ఉన్న తన లైఫ్ లో, నాలుగు ఫైట్ లు ఎనిమిది పంచ్ డైలాగ్స్ అరడజన్ పంచెలు తప్ప ఏమి లేవు అనిపించే టైం లో ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం తాను వదిలేసిన తన ప్రేయసి - అసలు బ్రతికి ఉందొ లేదో, ఎక్కడ ఉందొ, తనకి తెలుసో తెలియదో మనకి తెలియదు - నీకో విషయం చెప్పాలి ఇస్తాంబుల్ రావయ్యా అని పిలిచినా పిలుపు కి అటు బయలేరతాడు. 


సెకండ్ ఆక్ట్ - మిడిల్ ఇన్ ది మిడిల్ 


అక్కడికి వెళ్ళాక అచ్ఛం తనలాగే ఉన్న తండ్రి కొడుకులు ఇద్దరు ఒకర్ని ఒకరు చూసుకొని కలుసుకొని మురిసిపోతూ ఉంటారు. ఇద్దరు ఒకేలా ఉన్నారు కాబట్టి తండ్రి కొడుకులు అని ఒకరికి ఒకరు అర్ధం చేసుకొని ఉంటారు. ఇన్నాళ్లు నాకెందుకు చెప్పలేదు అని తండ్రి అడగడు, ఇన్ని రోజులు ఏమైపోయావ్ అని కొడుకు అడగడు. అమ్మా నీ పెళ్లి ఆల్బం నాకు చూపించు అని కానీ, మన ఇంట్లో నాన్న ఫోటో ఎందుకు లేదు అని కానీ, ఎప్పుడో అడిగి ఉంటె అప్పుడు అసలు నిజం తెలిసేది. అప్పుడు అయినా తండ్రిని నిలదీసేవాడో వదిలేసేవాడో అని ఒకటే టెన్షన్ టెన్షన్. వాళ్లిదరు బావ మరదలు అని, వాళ్ళ మధ్య ఎదో గతం ఉంది అని మనకి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, అసలు నిజం చెప్తారు. వాడు మా పిల్లాడే కానీ మాకు పెళ్లి అవ్వలేదు అని. ఈ రోజుల్లో ఇదంతా సహజం అనుకున్నా కూడా అది జరిగింది ముప్పై ఏళ్ళ ముందు. అప్పట్లో ఒక మనోభావాలు దెబ్బ తిన్న రాత్రి తొందరపడ్డాం అనుకున్నా కానీ, ఆ తర్వాత ఏమి జరగనట్టు ఎలా ఉండిపోయాడు. పాత్ర ఔచిత్యం దెబ్బతిన్నట్టే కదా. ఇక్కడ మనకి తెలిసే ఇంకో నిజం ఏంటి అంటే పెద్ద బాలయ్య చచ్చిపోవాలి అని కోరుకునే గుంపు లో 30 ఇయర్స్ బాలయ్య వాళ్ళ మావగారు కూడా ఒకడు. పెద్ద బాలయ్య ఇస్తాంబుల్ లో ఉన్నాడు అని తెలిసి, ఇక్కడ పీకలేనోడు దునియా బెంగుళూరు కి పట్టుకెళ్ళాల్సిన కత్తులు ఏసుకొని ఇస్తాంబుల్ వెళ్తాడు.  పరాయిదేశం లో కూడా మన ఫైటర్స్ తో అవే కత్తులతో ఇంకో రణరంగం చూసాక, ఇంకా ఈ దునియా గాడితో పని అవ్వదు అని డైరెక్ట్ గా వరలక్ష్మి రంగంలోకి దిగి నాకు పతి బిక్ష పెట్టావా అని వేడుకుంటూ వెన్నుపోటు పొడిచి అన్నయ్యని చంపేస్తుంది. ఇంటర్వెల్. అప్పటి వరకు మనకి కూడా తట్టదు కానీ, ఇంతోటి దానికి 30 ఇయర్స్ వెయిట్ చెయ్యటం ఎందుకు, ఎదో ఒక రోజు అన్నయ్యా అని ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లి అన్నం లో విషం కలిపి చంపేసి ఉండాల్సింది. దునియా ని చంపకుండా ఆగటానికి బాలయ్య కి ఒక కారణం ఉంది, చెల్లి మొగుడు అని, కానీ అన్నని తనే చంపకుండా ఉండటానికి వర మేడం కి ఏ కారణం లేదే? 30 ఏళ్ళ ముందే చేసి ఉంటె హాయిగా దునియా అండ్ వర మేడం డ్యూయెట్ కూడా చూసేవాళ్ళం ఏమో. 


ఒక హీరో పాత్ర చచ్చిపోవటం అంటే దానికి ఎంతో సంఘర్షణ కావాలి, ఆ చావు కథని ముందుకి తీసుకెళ్ళేదిగా ఉండాలి, అందుకే మెయిన్ క్యారెక్టర్ పోయాడు ఎన్ని ఫ్లాష్ బ్యాక్ అంతా అయ్యాక ప్రీ క్లైమాక్స్ లో చెప్తారు అవసరం అయితే, అంతే కానీ, అది కూడా టైటిల్ రోల్ లో పెట్టిన పాత్రని ఇంటర్వెల్ కి చంపెయ్యటం అంటే అది మాములు సాహసం కాదు.  చెల్లి అనుకునే అమ్మాయి ఇచ్చిన విషం తాగేసినా కూడా సమరసింహా రెడ్డి చచ్చిపోలేదే,  ప్రేమగా అపురూపంగా చూసుకునే అమ్మాయి గునపం తో గుండెల్లో గుచ్చినా కూడా సింహాద్రి చావలేదే, ఏ కోమాలోనో ఉండి కథ చెప్పారు, తండ్రి కొడుకు వేసిన పాత్రలు సమకాలీన సమయం లో చనిపోవటం ఏంటి? ఎప్పుడో ఫ్లాష్ బ్యాక్ లో సింహ పోతే, ఆ తర్వాత దాని గురుంచి తెలుసుకున్న బుల్లి సింహ రివెంజ్ తీర్చుకోవాలి. ఆ చంపేదెదొ తల్లి పాత్రని చంపేస్తే, ఇన్నాళ్ల తర్వాత దొరికిన మరదలిని చంపి ప్రశాంతత లేకుండా చేసాం అని దునియా హ్యాపీ, ఇద్దరు బాలయ్య కి దునియా ని చంపటానికి కూడా ఒక కారణం ఉండేది


ఇక్కడితో సినిమా అయిపొయింది. వీరసింహ రెడ్డి చచ్చిపోయాడు. దునియా పగ తీరిపోయింది బహుశా శోభనం కూడా ప్లాన్ చేసుకొనే ఉంటాడు. ఇన్ని రోజులు అసలు ఉన్నాడో లేడో తెలియని నాన్న ఇప్పుడు నిజంగా లేడు. చివరి కోరిక నన్ను సీమలో తగలెట్టు - నా చెల్లి జాగ్రత్త అంటాడు. ఇంకా అక్కడ మిగిలి ఉన్న కథ లేదు, ఆశయం లేదు, ఆశ లేదు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఎం జరిగితే ఏంటి? ఎవడికి కావాలి? కానీ సెకండ్ హాఫ్ వుంది. 


చచ్చిపోయి ఉండడులే, ఎన్ని సినిమాలు చూడలేదు, సెకండ్ హాఫ్ లో చూసుకుందాం అని కూర్చున్న ప్రేక్షకుడి ఇగో ని హర్ట్ చేస్తూ దహన సంస్కారాలు జరుగుతాయి. దానికి తండోప దండలుగా జనాలు వచ్చినట్టు చూపిస్తారు, ఇది ఒక పర్ఫెక్ట్ క్లైమాక్స్ షాట్ అయ్యి ఉండేది. సినిమా లో ఫాదర్ తరపున కొడుకు పగ తీర్చుకున్నాక తన తండ్రి ఆత్మ కి శాంతి కలిగేలా చేసి ఉంటే చెల్లిపోయేది. శవయాత్ర అయిపోయాక ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఆరిపోయిన దీపానికి నూనె వేస్తున్నట్టు


ఫ్లాష్ బ్యాక్ (ప్రారంభం)30 ఇయర్స్ బాలయ్య తాత చేసిన తప్పు - సవతి చెల్లి వరలక్ష్మి. (మనసులో అనుకోని ఉంటాడు, మా తాత చేసిన తప్పు మా అత్త, మా తండ్రి చేసిన తప్పు నేను, ఆ చరిత్ర ని కొనసాగించడానికే పుట్టానేమో అని). పెద్ద బాలయ్య తనే తండ్రి అయ్యి తన చెల్లిని అపురూపంగా పెంచుకున్నాడు. పక్క ఊరిలో విక్రమార్కుడు లాంటి ఒక విలన్, వాడి కొడుకు దునియా.  విక్రమార్కుడు లో కొడుకు అయితే ఇక్కడ తండ్రి, వాళ్ళ ఆగడాలకు అడ్డు ఆపు లేకుండా పోతుంది, ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ లో దునియా చెప్పేసాడు కాబట్టి తన చేతితోనే తన తండ్రిని నరికేలా చేస్తాడు జై బాలయ్య. అక్కడ చెప్పక పోతే ఇక్కడ సర్ప్రైస్ అయ్యి ఉండేది ఏమో. లండన్ నుంచి వచ్చిన మరదలు బావ తో పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకో పక్క దునియా తన తండ్రి చావుకి పగ తీర్చుకుందాం అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో బావ మనోభావాలు దెబ్బ తినటం, తొందరపడటం అన్ని జరిగిపోతాయి. 


మిడిల్ మొదలు - ఇంతలో చెల్లి నవీన్ ని  ప్రేమించాను అంటుంది, తనతో పని చేసే వాడి కొడుకే కదా అని ఓకే అంటాడు. అనుకోని సంఘటన జరిగి వాడు ఒక తప్పు చేస్తే, ఊరంతా వదిలెయ్యమన్నా కూడా పెద్ద బాలయ్య శిక్షిస్తాడు. అసలు ఇంత గొడవ జరిగే టైం లో, నవీన్ ని కొట్టే బదులు, ఊరి నుంచి వెలేస్తే, వాడితోనే బ్రతకాలి అనుకుంటున్న తన చెల్లి కూడా తనతో పాటు వెళ్ళిపోతా అని నిర్ణయించుకుంటే, ఒక బొబ్బిలి బ్రహ్మన్న, ఒక పెదరాయుడు లాంటి ఎమోషన్ ని కూడా టచ్ చేసిన వాళ్ళు అవుతారు.  నొచ్చుకున్న నవీన్ ఉరి వేసుకొని చచ్చిపోతాడు.  చెల్లి అపార్ధం చేసుకుంటుంది, దూషిస్తుంది, ద్వేషిస్తుంది, నీ చావు చూస్తాను అని అరుస్తుంది. చెల్లి మీద ప్రేమతో అక్కడే చచ్చిపోయేవాడేమో కానీ మరదలు దగ్గరకి వెళ్తాడు. నా చెల్లి ప్రేమని చంపేసాను, నేను ప్రేమకి పనికిరాను నిన్ను పెళ్లిచేసుకోను అంటాడు. హీరోయిన్ మనోభావాలు దెబ్బతింటాయి అని మర్చిపోయి ఉంటాడు. తాను కూడా అర్ధం చేసుకొని, తిరిగి లండన్ ఎల్లిపోతే తెలిసిపోతుంది అని ఇస్తాంబుల్ వెళ్ళిపోతుంది. నాకు వీరసింహ రెడ్డి చావు కావాలి అని దునియా ని పెళ్లాడుతుంది వరలక్ష్మి. ఇలా చేస్తుంది అని హింట్ ఇచ్చి ఉన్నా కూడా పాపం బాలయ్య మరదలిని వదిలేసేవారు కాదేమో.  పెళ్లి అయితే అయ్యింది కానీ దునియా కి ఫస్ట్ నైట్ అవ్వనివ్వదు. ఒకవేళ అది తాను నవీన్ మీద ఉన్న ప్రేమని మర్చిపోలేక అనుకున్నా, 30 ఇయర్స్ దునియా కి అవకాశం ఇస్తూ వాడేదో చంపుతాడు అని ఎదురు చూడటం కూడా కామెడీ. ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా తనే పగ తీర్చేసుకుంటే బావుండేది. ఇటు తనకి సుఖం లేక, దునియా కి సుఖం పంచక, అటు బావ మరదళ్ళకి సుఖం లేక నాలుగు అశాభంగమైన సోల్స్ 30 ఇయర్స్ ఉండటం ఏదైతే ఉందొ, అది నా భూతొ నా భవిష్యత్. ఫ్లాష్ బ్యాక్ కట్ ఐంది 30 ఏళ్ళ క్రితం అని తెలుసు, సినిమా స్టార్ట్ ఐంది ప్రస్తుతం అని తెలుసు, మధ్యలో ఎం జరిగింది అని మాత్రం గాలికొదిలేశారు. మనకి చూపించిన దాంట్లోనే ఒక 6 నుంచి 7 టైమ్స్ దునియా ఎటాక్ చేసి ఉంటాడు, ఆ ముప్పై ఏళ్ళు కూడా అదే అయ్యింది అనుకోవాలి ఏమో. మొత్తం పగ తీరిపోయింది కాబట్టి, చిన్న బాలయ్య ని కూడా చంపేస్తే పార్ట్ 2 తీయటానికి అవుద్దో అవ్వదో అని హ్యాపీ గా నాన్ వెజ్ తింటూ - శోభనం కి సిద్ధం అవుతాడు దునియా. 


థర్డ్ ఆక్ట్ - ముగింపు :  శవయాత్ర చేసేసాం, ఫ్లాష్ బ్యాక్ ఎదో చెప్పారు వినేసాం, నెక్స్ట్ ఇక్కడ చెయ్యటానికి ఏముంది అని 30 ఇయర్స్ బాలయ్య ఆలోచిస్తూ ఉండగా (ఎందుకంటే ఈ పాత్రకి అసలు భావోద్వేగాలు ఎక్కడ సెట్ అవ్వలేదు. తండ్రి తో అటాచ్మెంట్ లేదు, తల్లి తో హ్యాపీ గా ఉన్నాడు, తండ్రి గొప్పోడు - ఓకే - చనిపోయాడు, నెక్స్ట్ ఏంటి అనే గోల్ లేదు.), ఫ్యాక్టరీ ని కాపాడుకోలేక పోయిన ఓనర్ కోసం, తన తండ్రి పెట్టించిన ఫ్యాక్టరీ కోసం రంగంలోకి దిగుతాడు జయసింహ రెడ్డి సన్ అఫ్ వీర సింహ రెడ్డి. అప్పుడు అసలు సిసలు ట్విస్ట్ - నవీన్ ని చంపింది దునియా - వరలక్ష్మి లో మార్పు. మేనల్లుడు దగ్గరకి వచ్చి క్షమించమని అడుగుతుంది. తాను చచ్చిపోతుంది. సొంత చెల్లి అయినా సవతి చెల్లి అయినా ఆన్నయ్య ని చంపటం ఏంటి ? ఫైనల్ గా తనని తానూ చంపేసుకోవటం ఏంటి.  చెల్లి జాగ్రత్త అని అడిగిన పెద్ద బాలయ్య ఒకే ఒక కోరిక కూడా 30 ఇయర్స్  బాలయ్య తీర్చలేక పోతాడు. తాను వెళ్లి దాడి చెయ్యాల్సింది పోయి, తన మీదకి దాడికి వచ్చిన దునియా ని చంపేస్తాడు. సినిమాలో 6 ఫైట్ లు ఉంటే అన్ని ఫైట్ లు ఒకడితోనే ఉంటే - ప్రతి ఫైట్ లో ను తలలు ఎగిరిపడుతుంటే ఇంకా చెప్పటానికి ఎం వుండదు జస్ట్ శుభం. 


ఇంటర్వెల్ కార్డు నుంచి క్లైమాక్స్ వరకు అన్ని కరెక్ట్ గా కుదరాలి అంటే ఉన్న ఒకే ఒక్క గోల్డెన్ ఛాన్స్, అక్కడ పెద్ద బాలయ్య కళ్ళు / కాళ్ళు పోగొట్టుకొని అయినా సరే బ్రతికి ఉండాలి, ఏ ఊరి జనల మధ్య తన అన్నని అపార్ధం చేసుకుందో అదే జనల మధ్య తన తప్పు తెలుసుకొని ఆన్నయ్య దగ్గరకి చెల్లి తిరిగి రావాలి, నీ భర్త ని నేను చంపను, కంసుడి వధ కృష్ణుడు చేసినట్టు మేనమామ ని నా 30 ఇయర్స్ చూసుకుంటాడు అని ఉండాల్సింది. వీటికి మధ్యలో నరసింహ లో నీలాంబరి టైపు లో వరలక్ష్మి మేడం బాలయ్య ని బాడ్ చెయ్యటానికి - ఎక్సపోజ్ చెయ్యటానికి ఎత్తుగడలు వేస్తూ, ఊరందరి ముందు అవమానిస్తూ, వాటిని ఎప్పటికప్పుడు బాలయ్య తిప్పి కొడుతూ, ఎత్తుపల్లాలు చూస్తూ - క్యాట్ అండ్ మౌస్ గేమ్ నడిపించి ఉండాల్సింది. ముందుగా చెప్పుకున్నట్టు మన మాస్ మసాలా ప్రేక్షకులకి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తే నో కంప్లైంట్స్, ఇలా కొత్తగా అది కూడా వాళ్ళకి తెలిసిన గ్రౌండ్ లో ఎక్స్పరిమెంట్ చేస్తాను అంటే మాత్రం కష్టం. ఇప్పుడు ఏమైంది ? సీమ కోసం బ్రతికిన వీరసింహ రెడ్డి చెల్లి కోసం ఇంటర్వెల్ లో చచ్చిపోయాడు. అంతే. .. సినిమా కూడా ...... 





0 comments:

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views