వారసుడు - కథ - కథనం - విశ్లేషణ
విజయ్ - తమిళనాట ఈయన ఒక సంచలనం. కెరీర్ లో నే హైయెస్ట్ పీక్ స్టేజి లో ఉన్న స్టార్. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ తో మేజిక్ చేస్తూ కాంపిటీషన్ లేని ఫస్ట్ పోసిషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. వరస పెట్టి తెలుగులోకి కూడా డబ్బింగ్ చేసుకుంటూ 7 నుంచి 12 మధ్యలో ఒక స్టాండర్డ్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. రిలీజ్ కి ముందు ఇచ్చిన ఇంటర్వూస్ లో దిల్ రాజు స్టేట్మెంట్స్ సంచనాలకు తెర తీయటమే కాకుండా పక్క సినిమా కి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆడియో ఈవెంట్ లో అయన స్పీచ్ కి తమిళనాడు లో కూడా అయన చాలా ఫేమస్ అయిపోయారు. సోషల్ మీడియా లో స్టార్ అయిపోయారు. వేరే వేరే కారణాల వలన తెలుగు వెర్షన్ లేట్ గా రిలీజ్ అయినా కూడా, తమిళ్ జనాల టాక్ వచ్చేసినా కూడా, పక్కన రెండు మాస్ సినిమాలు ఉన్నా కూడా, పండగ రోజుల్లో వారసుడు బాగానే పెర్ఫర్మ్ చేసింది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. డైరెక్టర్ వంశి ఈ సబ్జెక్టు తో తెలుగు హీరోస్ తో చేస్తే ఎలా ఉంటుందో మనకి తెలుసు, మరి తమిళ్ సూపర్ స్టార్ తో సినిమా చేసే అవకాశం వస్తే ఏ రేంజ్ లో చేసి ఉండాలి, ఎం చేసాడు, ఎలా చేసాడు అనేది విశ్లేషించుకుందాం.
అంతకు ముందు ఎం జరిగి ఉండొచ్చు అని ఊహించుకుంటే
మనం విజయ్ సర్ తో ఒక పడం చెయ్యాలి
తెలుగులోనా సర్
కాదయ్యా తమిళ్ లోనే చెయ్యాలి
ఎంద మాదిరి పడం సర్
ఒరు కుటుంబం పడం మన స్టైల్ లో
తమిళ్ లో చూస్తారు అంటారా
మూవీ నో లాంగ్వేజ్, ఈజ్ ఏ బిజినెస్, ఒరు పెరియ కుటుంబం కథ విత్ ఈజ్ ఫైట్స్, యాక్షన్, ఈజ్ సాంగ్స్, విజయ్ సర్ మేనరిజమ్స్ అన్ని ఇరుక్కునుం
(ఇప్పుడు అన్ని కుటుంబం పడంలు చూడాలా అని మనసులో అనుకుంటూ) ఒరు నెల టైం కుడుంగా సర్
సరే నేను పోయి ఒరు పెరియ బంగ్లా, రోల్స్ రాయిస్ బెంట్లీ కార్లు, హెలికాఫ్టర్ లు బుక్ పండ్రె
కట్ చేస్తే
సర్, ఇంత పడం ఒరు పెరియ కుటుంబం పడం సర్, ఆ కుటుంబం కి మీరుదా వారిసు సర్
పర్లేదు డైరెక్టర్ సర్, తెలుగులో చెప్పెయ్యండి
కథ - కొడుకు దిద్దిన కాపురం టైపు లో ఆఖరి కొడుకు దిద్దిన కుటుంబం. ఇంకా డీటెయిల్ గా చెప్పుకోవాలి అంటే వద్దు అనుకున్న ఆఖరి కొడుకు, దారి తప్పుతున్న అన్నలని చక్కదిద్ది తన తండ్రి కష్టార్జితం పరుల పాలు కాకుండా కాపాడే అసలు సిసలైన వారసుడు కథ.
ఏంటి అంతేనా? ఇంకేం లేదా?
సాంగ్స్ వేనుమా సాంగ్స్ ఇరుకు
ఫైట్స్ వేనుమా ఫైట్స్ ఇరుకు
విజయ్ సర్ బాడీ లాంగ్వేజ్ వేనుమా అదు ఇరుకు
ఫైనల్లీ ఎమోషన్ ఆల్సో ఇరుకు - హోల్ సం ఎంటర్టైన్మెంట్ ఈజ్ వారిసు - గోయింగ్ టు బిగ్ విన్నర్.
మనం సినిమా చేద్దాం సర్, కానీ కొంచెం కథ డీటెయిల్ గా చెప్పండి
శరత్ కుమార్ ఒక పక్క తన కోట్ల ఆస్తి కి వారసుడు అయ్యే అర్హత ఇద్దరు కొడుకులలో ఎవరికీ ఉందొ అని అనలైజ్ చెయ్యటానికి వాళ్ళకి చెరొక వ్యాపారం అప్పచెప్పి చూసుకుంటూ ఉంటాడు. మూడో కొడుకు తన కంటే ఎక్కువ చదివేసుకున్నాడు అని, తన మాట వినటం లేదు అని కోపం. ఇంకో పక్క తన మీద ఆధిపత్యం సంపాదించటానికి బిజినెస్ శత్రువు ఐన ప్రకాష్ రాజ్ ఎదురు చూస్తూ ఉంటాడు. అంద మాదిరి టైం లో ఇంద మాదిరి ఒరు పెరియ కష్టం. తండ్రికి కాన్సర్, తల్లికి ఆ విషయం తెలియదు, పెద్దన్న కి ఎఫైర్, చిన్న అన్న ఒక పిచ్చి మాలోకం, అన్న కూతురు కిడ్నాప్, కంపెనీ టేక్ ఓవర్ కి విలన్ ప్రయత్నం, వీటన్నిటికీ మన వారసుడు ఎం చేసాడు అనేది కథ.
రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు టెంప్లేట్ లో కొట్టుకుపోయినా పర్లేదు కానీ, కుటుంబ కథ చిత్రాలకి ఇవే పాత చింతకాయ టెంప్లేట్ అంటే చెల్లదు అనే విషయం ప్రొడక్షన్ టీం కి కూడా తెలుసు, అందుకే తీస్తుంది పులిహోర అని తెలిసి కూడా, ఉప్పు - పులుపు సమ పాళ్ళలో ఉంటె చాలు అనుకున్నారు. మిగతా భారం మొత్తం విజయ్ మీద వేసేసారు. కుటుంబం కథ లో కుటుంబం విలువల గురుంచి గాలికొదిలేసి హీరోయిజం ఎపిసోడ్స్ తో - కామెడీ కోసం వింటేజ్ విజయ్ మేనరిజం తో ప్యాక్ చేస్తే చాలు అనుకున్నారు.
కథనం - ఫస్ట్ ఆక్ట్ - ప్రారంభం
ఒక హెలికాప్టర్, రేంజ్ రోవర్ కార్లు - ప్రకాష్ రాజ్ ఒక డీల్ మొదలు పెడతాడు. ఇంకో రెండు మూడు కాస్టలీ కార్ లు పాత్రల పరిచయాలు ఇంట్లో పని చేసే వర్కర్ తో సహా. డీల్ అయితే ఫెయిల్ అయ్యి శరత్ కుమార్ గెలుస్తాడు. ఒక్కసారి కూడా తనపై గెలవలేని ప్రకాష్ రాజ్ కి ఒక హింట్ ఇస్తాడు, నన్ను గెలవాలి అంటే ముందు నా ఇద్దరు కొడుకుల్ని గెలవాలి అని. జయసుధ గారు, శ్రీకాంత్ ఫామిలీ, శామ్ ఫామిలీ, ప్రభు గారు ఫామిలీ డాక్టర్, సుమన్ గారు ఇన్వెస్టర్. ఇంతలో మీ మూడో కొడుకు ఎక్కడ అని ఒక ప్రశ్న, దానికి 10 రియాక్షన్స్, వాడు ఉన్నదో లేదో కూడా తెలియదు అని సమాధానం దానికి ఇంకో 10 రియాక్షన్స్. ఒక TV సీరియల్ ఎపిసోడ్ లా మొదలు అయినా ఈ కథనం ఫస్ట్ రెండు సీన్ లో నే క్లైమాక్స్ వరకు ఎం ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అని ఒక క్లియర్ ఐడియా ఇచ్చేస్తుంది. ప్రేక్షకులు కూడా రిలాక్స్డ్ గా సీట్ లో జారబడి AC ఎంజాయ్ చేస్తూ ఇంకో రెండున్నర గంటలకు పైగా భరించాల్సిన దాని గురుంచి ప్రిపేరేడ్ గా ఉండొచ్చు. ఈ సినిమా వరకు ఉన్న ఇంకో కంఫర్ట్ ఏంటి అంటే, పొరపాటున రిలాక్స్ అవుతూ పడుకుండిపోయి లేచిన కూడా కథలో ఎం మిస్ అవ్వము, ఆలా డైలాగ్స్ వింటూ కూడా తెరపై ఎం జరుగుతుందో ఊహించుకోగలము. ఇంతకు ముందు చూసిన రియాక్షన్స్ ప్రకారం జయసుధ గారు విజయ్ గారు ఫోన్ లో టచ్ లో నే ఉంటారు. ఇంటికి రావా అంటే, రానే రాను అంటూ ఉంటాడు. హీరో గారి ప్రాబ్లెమ్ ఏంటి అంటే, తండ్రి చాటు బిడ్డగా మిగిలిపోకుండా, సొంతం గా ఎదగాలి అని ఒక అప్ తయారు చేసుకొని ఇన్వెస్టర్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. తండ్రి ప్రాబ్లెమ్ ఏంటి అంటే, తనే తెలివైన వాడు, తాను ఎంతో సంపాదించాడు, పెద్ద చదువు చదివాడు అని చెప్పి విజయ్ ని వారసుడు ని చెయ్యను, ముగ్గురు కొడుకుల్లో ఎవరు తోపు అని తెలుసుకొని వాడికే ఇస్తాను అంటాడు. అయినా ముగ్గురు కొడుకులు ఉంటె ముగ్గుర్ని మూడు చూసుకోమనాలి, అందరికి సమానం గా పంచి పెట్టాలి అని ఆలోచించాలి కదా. ముగ్గురుకి రేస్ పెడితే వాళ్లలో వాళ్ళు కొట్టుకుంటారు కదా నవాబ్ సినిమా టైపు లో. ఈ ఒక్కడినే వారసుడు గా ప్రకటించటం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందొ అది అంద మాదిరి ఒరు కాన్సెప్ట్ అన్నమాట. మనకే ఇలా అనిపిస్తే ఇంకా హీరో విజయ్ కి ఎందుకు అనిపించదు, నేను శ్రీమంతుడు చూసాను - నీ బిజినెస్ నాకు వద్దు అని వెళ్ళిపోతాడు. ఇంతలో ఒక షాక్, శరత్ కుమార్ గారికి కాన్సర్. ఇలా ఒక ముక్క లో చెప్పేసినట్టు కాదు ఒక 5 నిముషాలు సీన్ కాకపోతే మధ్య లో యాడ్స్ ఉండవ్ అంతే. కాకపోతే ఈ విషయం ఇంకెవరికి తెలియదు.
మిడిల్ - తల్లి కోరిక మేరకు ఇష్టం లేక పోయినా విజయ్ ఇంటికి వస్తాడు. అప్పటి వరకు సీరియస్ మోడ్ లో చూసిన విజయ్ ని సరదాగా వింటేజ్ విజయ్ గా మార్చేసే టైం వచ్చింది అన్నమాట. ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని ఒకటి తర్వాత ఒకటి హీరో కి అర్ధం అవుతూ ఉంటాయి. అప్పటి వరకు సింహంలా ఉన్న శరత్ గారు నీరసం గా మారిపోతారు. పెద్దన్నయ్య ఎఫైర్ లు, చిన్న అన్నయ్య అప్పులు, వాళ్ళిద్దరి గొడవలు. ఇంత సేపు అయ్యాక కూడా హీరోయిన్ రాకపోతే ఎలా, సాంగ్ కోసం అయినా రావాలి కదా, కాదు సాంగ్ కోసమే రావాలి. వాళ్ళిద్దరి మధ్య ట్రాక్ రాసుకోటానికి వేరే సినిమా రిఫరెన్స్ దొరకలేదు అని ఏమో వదిలేసారు. మొదటి సారి ప్రకాష్ రాజ్ గెలుస్తాడు. మళ్ళీ రష్మిక మళ్ళీ సాంగ్. ఇంతలో ఇద్దరు కొడుకులు ఎంత వెదవలు అని శరత్ కి తెలుస్తుంది. నువ్వే నా బిజినెస్ ని చూసుకో అని విజయ్ ని అడిగితే, ఇంటర్వెల్ వరకు ఆగమంటాడు. ఇంతలోనే తండ్రి కి కాన్సర్ అని తెలుసుకొని ప్రొడ్యూసర్ కి చెప్పి ఒక రోల్స్ రాయిస్ రెడీ చెయ్యమంటాడు. వారసుడుగా ఎంట్రీ ఇస్తాడు. ఇంటర్వెల్.
ది బాస్ రిటర్న్స్ - అంతకు ముందు ఈయన బాస్ కాదు మరి రిటర్న్స్ అంటాడేంటి ఇదేమన్నా బాస్ ఈజ్ బ్యాక్ అనుకున్నాడా లేక ఐ యాం వెయిటింగ్ అని చెప్పి బోర్ కొట్టిందా. ఇన్ని ఆలోచించే మానసిక స్థోమత మనకి ఉండదు, అప్పటికే వరస పెట్టి బ్రేక్ లేకున్నా 20 ఎపిసోడ్స్ చూసేసిన ఫీల్ లో ఉంటాం ఏమో, స్నాక్స్ కౌంటర్ వైపు పరుగులు పెడతాం. మాటకి పదిసార్లు సీరియల్ అని ఎందుకు అంటాం అంటే, ఒక డైలాగ్ నాలుగు రియాక్షన్స్, మేకప్ ఏసుకొని కూడా ఏడ్చే పాత్రలు, అర్ద రాత్రులు కూడా పట్టు చీరలు కట్టుకొని పెడుకొనే లేడీస్ బాగా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సీరియల్స్ లో నే కనపడతారు.
మీ చివరకి కొడుకే వారసుడు అయితే మేము ఎవరం అని ఇద్దరు కొడుకులు అలిగి వెళ్ళిపోతారు. ఆ ఇద్దరిలో ఒకరు వారసుడు అయినా కూడా రెండో వాడి పరిస్థితి అదే ఏమో. వాళ్ళని ఆలా పెంచిన తండ్రికి కాన్సర్ కాబట్టి ఆ పాత్ర మీద సింపతీ వచ్చేసి ఆలా తయారు అయిన కొడుకుల మీదకి ప్రాబ్లెమ్ తోసేస్తే దీనిని కన్వీనియెన్స్ గా ఎస్కేప్ అవ్వటం అంటారు. పాపం జయసుధ గారు ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు విజయ్ లేడు, ఇప్పుడు విజయ్ వచ్చాడు అనే టైం కి మిగతా ఇద్దరు లేరు, అందరు కలిసే క్లైమాక్స్ టైం కి శరత్ గారు ఉండరు, ఇంద మాదిరి ఒరు కష్టం పగోడికి కూడా వెండా. ఇక్కడ నుంచి ఒక్కో ప్రాబ్లెమ్ ని సాల్వ్ చెయ్యటానికి హీరో కి ఒక్కో ఎపిసోడ్ ప్లాన్ చేసుకున్నారు. ప్రతి ఎపిసోడ్ లో హీరోయిజం తో పాటు కామెడీ తో పాటు విజయ్ బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యి ఉండేలా ప్యాక్ చేసుకున్నారు. అప్పటి వరకు సినిమాలో ఉన్న టెంపో ని ఒక్కసారిగా టాప్ గేర్ లోనికి తీసుకెళ్లారు.
పోర్ట్ లో కంటైనర్ ఎపిసోడ్ - హీరో ని అంత తేలిగ్గా అంతం చెయ్యలేం
బోర్డు మీటింగ్ ఎపిసోడ్ - తన దగ్గర నుంచి పవర్ ని లాక్కోలేం
SJ సూర్య ఎపిసోడ్ - ప్రకాష్ రాజ్ కి మళ్ళీ ఓటమి
తలపతి సాంగ్ - చాల సేపు అయ్యింది కదా సాంగ్ లేక - హెలికాప్టర్ లేక పోతే ఎలా
చైల్డ్ ట్రాఫిక్ ఎపిసోడ్ - పెద్ద అన్న అండ్ వదిన లో మార్పు
రంజితమే సాంగ్ - విజిల్ పోడు
ఆల్మోస్ట్ ఒక గంట సేపు ఫాన్స్ కి నాన్ స్టాప్ గా ఫుల్ మీల్స్ పెట్టేసారు. తండ్రి కాన్సర్ తల్లికి తెలియటం తో ఇంక క్లైమాక్స్ కి చేరుకుంటుంది కథ.
ముగింపు - ఇంక మిగిలింది రెండో కొడుకు మారటమే కాబట్టి ఇంటికొచ్చేయ్యరా బాబు ఆడియన్స్ కూడా ఇంటికెళ్ళిపోతారు అని బ్రతిమలతాడు. మళ్ళీ విజయ్ సర్ తో సినిమా చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో ఏంటో ఇంకో అరగంట ఎక్సట్రా తీసేసుకుంటే సరిపోద్ది అని అనిపించిందో ఏంటో, తప్పి తిప్పి అదే పాయింట్ దగ్గర తిప్పారు. క్లైమాక్స్ ఫైట్ పేరుతో ఇంకో పవర్ ప్యాకెడ్ డిజర్ట్ పెట్టేసారు. మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామో, అదే సీరియల్ బాటకి వచ్చేసి తండ్రి బ్రతికుండగానే మనశాంతి ని, పోయిన తరవాత అయన ఆత్మ కి శాంతి కలిగేంచేలా చేసి నిజమైన వారసుడు గా విజయ్ నిలిచాడు.
సినిమా మొత్తం మీద, ఎక్కడ మొదలు అయ్యిందో ప్రీ క్లైమాక్స్ వరకు సీన్స్ అక్కడే తిరుగుతూ ఉంటాయి, ఇది ప్రాబ్లెమ్ అని మొదట్లో చెప్పేసి, ఇది మార్పు అని క్లైమాక్స్ వరకు దాచేసి మధ్య లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంచేస్తే వచ్చే సమస్య ఇది. మరీ మన సినిమాకి మనమే రిఫరెన్స్ లు ఇచ్చుకోవటం ఎందుకు అని మొదట్లోనే ఆపేసాను కానీ, ఆల్మోస్ట్ అన్ని సీన్స్ మనం ఎదో ఒక సినిమాలో చూసిన ఫీలింగ్ ఏ కలుగుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎం జరగబోతుందో తెలిసినప్పుడు అంత సేపు జనాలని కదలకుండా కుర్చోనివ్వాలి అంటే, సెకండ్ హాఫ్ లో ఉన్న ఆ గంట వింటేజ్ విజయ్ రూపం లో తన భుజాలపైన మొయ్యబట్టే అనుకోవాలి. తమిళనాడు లో కూడా బాగా ఆదరిస్తున్నారు, తెలుగులో కూడా ఒక మోస్తరుగా చూస్తున్నారు, దిల్ గారి నమ్మకాన్ని నిలబెట్టి లాంగ్ రన్ లో అన్ని రికార్డ్స్ ని లేపెయ్యాలి అని కోరుకుంటున్నా
ప్రీవియస్ విజయ్ సర్ పడంస్ త్రీ పడంస్ ఫేవరెట్ పడంస్ లవ్ స్టోరీస్, లాస్ట్ ఫిలిమ్స్ హి డూయింగ్ ఓన్లీ మాస్ ఫిలిమ్స్. వై నాట్ థిస్ స్టోరీ లైన్ విల్ టెల్ విజయ్ గారు ఇఫ్ హి ఈజ్ లైక్ ఇట్ వి కెన్ డు థిస్ మూవీ. సింగల్ సిట్టింగ్ లో ఓకే ఆయిచి ఇంద స్టోరీ.
కమర్షియల్ సినిమాలు, మాస్ సినిమాలు టెంప్లేట్ లో తీసి మెప్పించటం ఒక ఎత్తు, కుటుంబ చిత్రాలని కూడా టెంప్లేట్ లో తీసి, ఇది పక్కా తమిళ్ పడం, ఇది పక్కా తమిళ్ సాపాడు అని చెప్పి తమిళ్ వాళ్ళకి తెలుగు సినిమాని విజయ్ స్టైల్ లో చూపిస్తే, తెలుగు వాళ్ళకి తెలుగు సినిమాని తెలుగులో డబ్ చేసి చూపించారు అంటే అది వంశి వల్లనే సాధ్యం అనుకోవాలి ఏమో. వంశి గారు చెప్పినట్టు ఇదు ఒరు పడం ఇల్లై - ఇది ఒరు నంబికై - ఇది దిల్ రాజు గారు , విజయ్ గారు నా టీం నా మీద పెట్టుకున్న నమ్మకం.
0 comments:
Post a Comment