గోవిందుడు అందరివాడేలే - కథ కథనం - ఒక విశ్లేషణగోవిందుడు అందరివాడేలే - కథ కథనం - ఒక విశ్లేషణ 


క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ పేరు లో నే తప్ప సినిమాలలో క్రియేటివిటీ మిస్ అయ్యి చాలా రోజులు అయిపొయింది, ఒకప్పుడు ఫ్యామిలీ మూవీ తీయటం లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న వంశీ గారు గత కొన్ని చిత్రాలతో ఆల్మోస్ట్ షెడ్ కి చేక్కేసినట్టే అనుకున్నారు జనాలు (అలా అనుకునేలా చేసింది కూడా అయన తీసిన మొగుడు అనే ఖలాఖండమే). ఒకప్పుడు ఎంత గొప్ప సినిమాలు తీసినా వరసపెట్టి డిసాస్టెర్స్ ఇచ్చిన డైరెక్టర్ ని నమ్మి ఈ సినిమా ఒప్పుకోవటం చరణ్ చేసిన అతి పెద్ద సాహసం గా చెప్పుకోవచ్చు. యావరేజ్ కంటెంట్ ల తో బాక్స్ ఆఫీసు దగ్గర హిట్ బిజినెస్ చూపిస్తూ ఇంక చాలు మొర్రో అని ప్రేక్షకులు అరిచి గోలపెట్టే లోపు తనంతట తాను గా చేంజ్ కోరుకోవటం మెచ్చుకోవాల్సిన విషయం. నాలో ఇంక సత్తా ఉంది అని ప్రూవ్ చేసుకోవాల్సిన స్థితి లో డైరెక్టర్, నేను కూడా కొత్తగా చెయ్యగలను అని ప్రూవ్ చేద్దాం అనే ఆశయం తో హీరో, హీరో డేట్స్ ఇస్తే చాలు ఎంత అయినా ఖర్చు పెట్టి తీసేస్తా అనే ప్రొడ్యూసర్ వెరసి "గోవిందుడు అందరివాడేలే" గా మన ముందుకి వచ్చారు. ఈ సినిమా రిజల్ట్ గురుంచి మాట్లాడుకోటానికి ఇంకా టైం ఉంది కాబట్టి ముందు ఈ ప్రయత్నం ని విశ్లేషించుకుందాం. 
"సినిమా చూడని వాళ్ళు, చూడాలి అనుకునే వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిది" అని నా అభిప్రాయం

కథ : ఫ్యామిలీ సబ్జక్ట్స్ లో కొత్తగా చెప్పుకునే కథ ఏముంటుంది లే అనుకున్నారో, ఇంత కంటే మా వాళ్ళ కాదు అని అనిపించిందో కానీ, మనం ఇప్పటి వరకు చాలా సార్లు చాలా సినిమాలలో చూసేసిన పాత చింతకాయ పచ్చడి కథనే ఎంచుకున్నారు. ఈ మద్య నే వచ్చిన అత్తారింటికి దారేది దగ్గర నుంచి అప్పట్లో వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, రాముడొచ్చాడు, కలిసుందాం రా, మురారి, చందమామ తదితర సినిమాలని మిక్సి లో వేసి తీస్తే ఈ కథ అయ్యింది. తండ్రి కి కోపం, కొడుకు వెళ్ళిపోవటం - తప్పు తెలుసుకోవటం, నేనున్నాను గా కలపటానికి అని మనవడు తాత దగ్గరికి రావటం, చివరిగా కలిపెయ్యటం, ఇదే కథ.  ఎంచుకున్న కథ కి కొత్తదనం తో కూడుకున్న కథనం అయినా తోడు అయ్యిందా? చూద్దాం .. 

కథనం: గోవిందుడు అందరివాడేలే అంటే ఆ గోవిందుడు (కృష్ణుడు) గుర్తుకు వస్తాడు, ఆ సరసాలు, ఆట పట్టించటాలు, మాయ చెయ్యటాలు, మరి ఆ టైటిల్ కి ఉన్న వేల్యూ అలాంటిది. ఈ టైటిల్ కి కచ్చితం గా కథానాయకుడు పేరు కృష్ణుడు అనో గోవిందు అనో ఉంటుంది అని అనుకోవటం సహజం, కానీ ఇక్కడ అభిరాం అని అంటే రామ్ (ప్రకాష్ రాజ్ డైలాగ్) అని ఎందుకు పెట్టినట్టు? ఇంకా ఎక్కువ మాట్లాడితే మరీ అతి చేసినట్టు ఉంటుంది ఏమో కానీ కృష్ణ వంశీ సినిమా అన్నాక ఆ మాత్రం అతి లేక పోతే ఎలా అని సరిపెట్టుకోండి. 

ఆక్ట్ 1 : కథా పరిచయం: ఎక్కడా టైం వేస్ట్ చెయ్యకుండా ఫస్ట్ లో నే పాయింట్ కి వచ్చేసారు 
"మన పని మనమే చేసుకోవాలి
మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి 
మన కుటుంబాలు మనమే కలుపుకోవాలి" 

అదే నేను చేసేది అని మెయిన్ క్యారెక్టర్ తో ఓపెనింగ్ లో నే చెప్పించి కథ మీద అంచనా కి వచ్చేట్టు చేశారు. డీన్ కాలేక పోయినప్పుడు తండ్రి ని ఓదార్చే కొడుకు గా మెటురిటి తో ఈ సమస్య ని తీర్చే సత్తా ఉన్నోడిగా మనకి చూపిస్తూ ఫ్లాష్ బ్యాక్ లో కథ ని ఓపెన్ చేసి, టూకి గా కథ మొత్తం చెప్పేసారు. ఆ హాస్పిటల్ బిల్డింగ్ పై   1952 ఎందుకు వేసారో అర్ధం కాలేదు, దాని వలన కథ లో చాలా చోట్ల టైం ఫ్రేమ్ గురుంచి అనుమానం ఉంటుంది, అది వేరే ఏ పాత బిల్డింగ్ 1952 లో కట్టింది మార్చారు 1990 లో అయిన కూడా పాత నంబర్ ఏ ఉన్చేసారు అని మనకి మనం సర్దిచెప్పుకొని ముందుకి పోదాం. నీ తరపున వెళ్లి తాతయ్య కి సారీ చెప్తా, బ్రతి మాలుతా, అవసరం అయితే గొడవ పడతా, ఎం చేసి అయినా మిమ్మల్ని కలుపుతా అని మాట ఇచ్చి ఇండియా కి బయల్దెరతాడు హీరో, అక్కడ నుంచి ఊరికి బయల్దేరటం తో ఫస్ట్ ఆక్ట్ ముగుస్తుంది. సినిమా మొదలు అయిన 30 నిమిషాలకి (ఇంచుమించు) హీరో ఊరికి వస్తాడు. ఆక్ట్ 1 క్లోసింగ్  జనరల్ గా 40 నుంచి 50 వ నిమిషం మద్య లో ఉంటుంది. కథ ఏంటో తెలిసింది, పాత్రలు పరిచయాలు అండ్ హీరో ఆశయం తెలిసింది, ఎలా సాధిస్తాడు అనుకునే లో పు సెకండ్ ఆక్ట్ కి ఎంటర్ అవుతాం. 

ఆక్ట్ 2 : సమస్యాత్మకం: తండ్రి కి మాట ఇచ్చి ఇండియా కి వచ్చిన కథానాయకుడు కి తన లక్ష్యం ఎంత కష్టమైనది అని తెలిసే సమయం, దాని కోసం అతను ఎం చేసాడు అని చూడబోయే తరుణం. కంటెంట్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకోటానికి బోలెడు సమయం ఉంటుంది ఈ ఆక్ట్ లో. పల్లెటూరి కి వచ్చిన హీరో కి తాత ఇంట్లో సెటిల్ అవ్వటానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఇంట్లో బ్రిడ్జి లాంటివి అంత కన్విన్సింగ్ గా ఉండక పోయినా కామెడీ గా ఉంటాయి. ఇంట్లోకి వచ్చాక ఫోటో లో ముగ్గురు మేనత్తలు ఉన్నారు ఇక్కడ ఇద్దరే ఉన్నారేంటి అనే డౌట్స్ ఎం పెట్టుకోకుండా (అసలు ఇంట్లో ఎవరు పనోల్లో ఎవరు చుట్టాలో తెలుసుకునే ప్రోగ్రాం పెడితే దానికే ఇంకో సినిమా తీయాల్సి వస్తుంది లెండి) అందరితో కలిసిపోతాడు. వ్యవసాయం నేర్చుకుందాం అని వచ్చిన హీరో ఆ ఊసు ఎత్తక పోయినా ప్రకాష్ రాజ్ కూడా మర్చిపోయి కర్ర సాము తో బిజీ గా ఉంటాడు. ఇంకో పక్క కోట ఫ్యామిలీ ఉన్న కూడా సినిమా పరం గా క్లైమాక్స్ లో తప్ప దేనికి పనికిరాని పాత్రలు అవి. ఇంట్లోకి వచ్చిన హీరో తను వచ్చిన ఆశయం గురుంచి ఏ మాత్రం పట్టించుకోకుండా అవకాసం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మన తెలుగు సినిమాలకి ఎంత సేపు ప్రోయక్టివ్ గా ఉండే హీరో లు కావాలి. ఇక్కడ హీరో ఆ విషయం పక్కన పెట్టి "నిర్భయ చట్టం" కామెడీ తో కాలం నడుపుతూ ఉంటాడు. మురారి టైం లో బ్లాక్మెయిల్ కామెడీ పర్లేదు కానీ ఇప్పుడు చట్టం వచ్చేసింది కదా, అయినా ఆ ఫొటోస్ అడ్డం పెట్టుకొని ముద్దులు కూడా అంటే, అదే మేము రాయగల లవ్ థ్రెడ్ అనుకోమంటే మన ప్రగాడ సానుబూతి ని చూపించటం తప్ప ఏమి చెయ్యలేం. జయసుధ గారు నాన్న ఫోటో చూసి బాధ పడుతున్న సీన్ కి ఆ ఫోటో ని అక్కడ నుంచి తీసెయ్యటం వరకు వచ్చిన చరణ్ "మా అందరి బాధలు తీర్చావయ్యా" అన్న అదే అవకాశం ని కాష్ చేసుకొని ఓపెన్ అవుదాం అనుకోడు? ఇంకో పక్క ఎదిగిన ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అంత మందలు మందలు గా జనాలు ఉన్న ఇంట్లో అసలు కొత్తగా వచ్చిన వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అని కూడా పట్టించుకోరు జనాలు, ఈయన మాత్రం జాకెట్ ల హుక్ లు తీస్తూ, టవల్ లు తీసెయ్యమని వార్నింగ్ లు ఇస్తూ ఉంటాడు. ఇలా సాగుతూ ఉన్న ఫస్ట్ హాఫ్ ప్రకాష్ రాజ్ గారు శ్రీకాంత్ చెంప చెల్లుమనిపించాక ఇంటర్వెల్ కి నోచుకుంటుంది, మొగుడు టైపు లో ఇంకో రెండు మూడు చెంప దెబ్బలు ఉంటాయేమో అని భయం వేసింది కాని, కంట్రోల్ అని అదేదో సినిమా లో ఎం ఎస్ అనుకునే టైపు లో కంట్రోల్ చేసుకున్నట్టు ఉన్నారు. 

ఇప్పటి వరకు చెయ్యని టైపు పాత్ర లో చరణ్ బాగానే చేసినా హెవీ సీన్స్ లో తేలిపోయాడు, అర్జెంటు గా ఇదే టైం లో త్రివిక్రమ్ లాంటి వాళ్ళ చేతుల్లో పడితే ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతాడు.  ఇంకొంచెం స్క్రీన్ లెంగ్త్ దొరికితే బావున్ను అనిపించే బాబాయ్ పాత్ర లు శ్రీకాంత్ అలరిస్తాడు, ఆ పాత్ర మారిపోయే తీరు తప్ప మిగతా అంత పర్ఫెక్ట్ గా కుదిరింది. ప్రకాష్ రాజ్ అండ్ జయసుధ ఎప్పటిలాగానే అలరించారు. ఒకప్పటి మెరుపు లేక పోయినా ఉన్నంతలో కాజల్ ని బాగా చూపించారు. 

సెకండ్ హాఫ్ అపోలో హాస్పిటల్ అంటేనే టెస్ట్ లు అనే ప్రామిసింగ్ నోట్ తో స్టార్ట్ చేసారు. అప్పటికి హాస్పిటల్ వంక తో తాతయ్య కి దగ్గర అయ్యే థ్రెడ్ మొదలు పెడతారు. అసలు నువ్వు ఎవడు, దేనికి వచ్చావ్? ఇప్పుడు హాస్పిటల్ టాపిక్ ఏంటి లాంటి ప్రశ్నలు లేకుండా ముందుకు పోతారు. అసలు లవ్ ఎందుకు పుట్టింది అనే ఫీలింగ్ లేకుండా రివర్స్ బ్లాక్మైలింగ్ మొదలు అవుతుంది. ఆకు ముళ్ళు సామెత మన హీరోయిన్ కి తెలియదు అనుకుంట అందుకే ముద్దులు అడుగుతుంది. అక్కడ నుంచి లవర్స్ లా బిహావ్ చేస్తూ ఉంటారు. అలాంటి టైం లో బాబాయి తో కలిసి బాబాయి కి నిజం చెప్పె అవకాశం వస్తుంది, అవకాశం కల్పించుకోడు అవకాశం వస్తుంది అంతే. అక్కడో విండ్ మిల్ ఫైట్, మొదట్లో రగ్బీ గ్రాఫిక్స్ ఫైట్ ఇక్కడ ఇది, ఇంకా సహజమైన ఫైట్ లు ఉంటె బావుండేది కనీసం ఈ సినిమా కి అయినా. చెల్లేని ప్రవేశ పెట్టి సాదించేది ఏమి లేక పోయినా ఇంట్లో ఫంక్షన్ పేరు చెప్పి బాబాయి ని ఇంట్లోకి తీసుకోచే ప్రయత్నం. బాబాయి లో మార్పు కి కారణం తెలియక పోయిన ఇంక సినిమా ఎలాగోలా అవ్వగోట్టాలి అనో, ఫ్యామిలి సాంగ్ ఒకటి మిగిలిపోయింది అనో కలిపేస్తారు. అలా సాగిపోతున్న సినిమా లో పర్ఫెక్ట్ టైమింగ్ తో కూడిన లాక్ కాజల్ పెళ్లి చూపులు. ఫాలోయింగ్ సీన్ లో అప్పటి వరకు హీరో పడే ఇంటర్నల్ స్ట్రగుల్ ఏంటి అని చూపించే సన్నివేశం అది. ఇలాంటి సన్నివేశాలు సినిమా లో మొదటి నుంచి పడితేనే ప్రేక్షకులు కనెక్ట్ అవ్వటానికి అవకాశం అంటూ ఉంటుంది. అలాంటివి లేక పోవటం వలన సినిమా మొత్తం ఫ్లాట్ గా బాంగ్ లు లాంటివి లేకుండా ప్లైన్ గా వెళ్తున్న ఫీలింగ్ లో నే మిగిలిపోయింది. ఏది ఏమైనా సినిమా మొత్తానికి ప్రీ క్లైమాక్స్ అయినా అంత బాగా పండటానికి ఈ లాక్ ఒక కారణం. రైటర్ లో ని టాలెంట్ మొత్తం కనపడుతుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలిసిపోవటం, అక్కడితో అయిపోవాల్సిన సినిమా కానీ కృష్ణ వంశీ గారి పుణ్యమా అని గంగ చంద్రముఖి గా మారినట్టు సినిమా సీరియల్ గా మారిపోతుంది        

సినిమా ఇంకో 20 నిమిషాల్లో అయిపోద్ది అనగా ఆక్ట్ 3 కి ఎంటర్ అవుతాం   

ఆక్ట్ 3 : ఫల ప్రాప్తి : ఒక పక్క ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన హీరో, ఇంకో పక్క ఎంతో ఆశ తో ఇంటికి వస్తున్న తండ్రి, అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఎలా సాల్వ్ చేస్తాడు అనే డౌట్ కూడా రాకుండా మనం అనుకునట్టే విలన్ వచ్చి చెల్లిని తీసుకేల్లిపోవటం. ఇక్కడ అన్నిటికంటే పెద్ద దారుణం ఏంటి అంటే, ఆ విలన్ కి తను చెల్లి అవుతుంది అని మనకి తెలుసు, డైరెక్టర్ కి తెలుసు, కోట గారితో కూడా మనవడు వచ్చాడ అనే డైలాగ్ చెప్పించారు, మనవడు చెల్లి ఆల్రెడీ వచ్చింది అని వరసకి చెల్లి అని అయినా తెలిసి ఉండాలి గా, అయినా కూడా అలా హేండిల్ చెయ్యటం, ముద్దు దాక వెళ్ళటం కంటే దారుణం ఇంకోటి ఉండదు, ఆ తర్వాత ఎంత చెల్లి డైలాగ్ పెట్టినా కూడా ఇలాంటి సీన్ జోలికి వెళ్లి ఉండాల్సింది కాదు. ఇక్కడ కూడా సినిమాటిక్ గా వెంక నుంచి వెళ్తుంటే ముందు నుంచి కాల్చటం, మూసేసిన హాస్పిటల్ లో సర్జరీ చేసేయ్యటం. ప్రకాష్ రాజ్ కి ఆ టైం లో కనిపించిన విజువల్స్ ఒక 20 నిమిషాల ముందు కనిపిస్తే అప్పుడే సినిమా అయిపోయేది గా. తండ్రి ని కొడుకు ని కలపవాల్సిన సీన్ కి డైలాగ్స్ సరిగ్గా పండక ఈ క్లైమాక్స్ తేలిపోయింది. అసలు ఇదే క్లైమాక్స్ అని మనకి సినిమా  ఫస్ట్ సీన్స్ లో నే అర్ధం అయిపోతుంది కాబట్టి ఏ మాత్రం ఎఫెక్టివ్ గా లేక పోయిన కనెక్ట్ అవ్వటం కష్టం. లాస్ట్ లో ఎంత హడావుడి గా చుట్టేసారు అనేది ఈ సినిమా చూస్తే క్లియర్ గా అర్ధం అవుతుంది. ఇలాంటి సినిమా కి ఒక బొమ్మరిల్లు, ఒక అత్తారింటికి దారేది లాంటి క్లైమాక్స్ పడాలి. భరువైన డైలాగ్లు చరణ్ చెప్పలేక తేలిపోయాడు అని చెప్పి మొత్తం మీద లైట్ తీసుకున్నారు ఏమో . అన్నిటికంటే కామెడీ షష్టిపూర్తి రిఫరెన్స్,  ఇంటర్వెల్ అయ్యాక ఇంకో 25 ఈజీ గా బ్రతికేస్తారు, 100 కొడతారు అని డైలాగ్ చెప్పిస్తే వయస్సు 75 అని ఫిక్స్ అయిపోయిన నా లాంటి వాడికి షష్టిపూర్తి అనగానే నవ్వు ఆగుతుందా?  

చివరిగా: పైన ఇంత చెప్పుకున్నాక ఇంక చివరగా చెప్పేది ఏముంటుంది ? ఈ కృష్ణ వంశీ మార్క్ పులిహోర ని ఎందుకు చూడాలి అంటే, ఈ మద్య వస్తున్న చరణ్ సినిమాల కంటే చరణ్ కి కొత్తగా ఉన్న సినిమా కాబట్టి, ఇంతకు ముందు కృష్ణ వంశీ తీసి దరిద్రాలు అంత దరిద్రం గా లేదు కాబట్టి, ఈ మద్య కాలం లో రొటీన్ అయిపోయిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనెర్స్ నుంచి ఒక రిలీఫ్ లాంటిది కాబట్టి కొంచెం ఓపిక పడితే ఒక సారి చూసేయ్యోచ్చు. తన సినిమాలకి మహారాజ పోషకులు అయిన మాస్ జనాలని పెద్దగా అలరించక పోయినా తనకి దూరం గా ఉంటున్న ఫ్యామిలీ ప్రేక్షకులకి దగ్గర చేసే ఈ సినిమా తో గోవిందుడు అందరివాడు కాకుండా కొందరి వాడు గా మిగిలిపోతాడు. 

కొసమెరుపు : అభిరాం అంటే ప్రకాష్ రాజ్ గారు అన్నట్టు రామ్ అని కాదు "మనోహరమైన, సుందరమైన, లవబుల్" అని అర్ధం. ఆ విధం గా ఈ టైటిల్ కి ఈ పేరు కూడా కరెక్ట్ ఏ మరి 

మీ 
హరి కృష్ణ రాజు 


7 comments:

Anonymous said...

Dude... sexism down down ;) :D :P

There was no mention about a pub going girl kissing a stranger. But if he asks her to repeat it, its considered as a black mail !!!!

Regarding agriculture. .. there are some really colorful scenes in which prakash raj and charan ploughs thru the land.

In my hearty opinion, if u wud like to see urself as a movie analyst, u shud have bigger "acceptance" towards the scenes in which a character changes in a span of seconds.

And also... khalaakhanDam kaadu. kaLaaKhanDam. Bharuvaina kaadu. baruvaina.

.....

Inka movie vishayaaniki oste...

Raa raakumaaraa song ni krishna vamsi chaalaa richgaa stylish gaa teesaadu. (Telugu lo type chese opika ledu. Mobile nunchi type chestunnaa)

But krishna vamsi ki naa valla Negative marks ekkada paddaayante.... manam sye movie lo rubgy already chuudatam valla intro scene flat anipinchindi. And also... climax lo fight pettaali ani decide ayinappudu... anto.. intoo.. manchi fights pettachu kadaa anipinchindi.

Anonymous said...

cinema kanna nee review nae interesting ga undi.. good one hari..

Regards,
Sagar

Anonymous said...

super sir..climax episode baga rasaru

aditya said...

CLIMAX weak ye, ala mamuluga undadam valla next level ki vellaledu, srikanth flashback aa setup inka baga teesi undocchu, migata cinema decent ga ne undi, time pass aipotundi

last lo first venka nunchi takutundi bullet, malli itu tirigaka inka kaalustadu villain gadu

heroine track ante maradalu kabatti sarasamadathadu vay, varasa ne kada, edho forced ga aite cheyaledu ga :D

okappati KV teesi unte Murari vaccedi, kaneesam sagam range kooda ledu so ila calculated pulihora ne best

cineam choostunnapudu oka feel undela aite success ayyadu

nuvvu cheppinattu aa pre climax episode best cinema ki, daniki next climax kooda addirpoye level lo unte babi ki AD laga abbaikI GAV ayyedhi.

btw bhayya charan baga chesadu interval ki mundu taruvata srikanth tho scenes chaala baga chesadu, manavadinai ane daggara superb, last lo saraina scene icchi test pettalsindhi poi mamulu scene icchesi telchesaru pr tho D:

neekela anipinchdi baa ok na, next trivi tho padite inka saanabedathadu ani naa adhi idhi, nuvvemantav :D

aditya said...

aa 1952 anedhi yaa pedda mistake ye :D

btw aa bridge adhey scene lo srikanth antadu ga, ee bridege teepincheymani enni sarlu cheppalra musaloda ani so maree anta odd thing emi kaadu le adhi

aditya said...

Hero Plan simple, andari cheta manchivadu anela daggaravadam,

flashback matter teliyadu kabatti kamalini ki ishtam ledu srikant ante anukuntadu anduke pelli aaputadu, pr ni adagamantadu ga, appude pr ki heart attack vastundi, and hospital lo avasarala srinivas ni ala adagadam choosi inka thatayya ki hospital aasha chavaledu ani fix ayi, tana aim reach avadaniki adhe best way ani feel avutadu anduke aa hospital malli nenu teripista antadu

and nijam telisaka srikanth ki bail ippiddam ani vaste aa patike srikanth villains vala lo padatadu so aa situation lo tappanisari paristhithullo nijam cheppestadu, srikant just valla nanna tho godava tirugubothu pelli cheyani ani ante,kani maree migata family members ki athanu ishtame, pillala tho photo kooda digutadu paata lo :)

inka love track first ala pub lo muddu icchesariki babu ki crush start :D
anduke ooru ki vacchaka first lo kajal kallamundu kanipistundhi, same kajal ki kooda attraction untunid but ee photos valla konchem bhayapadutundi

Gulabi kallu paata lo charan muddu pettinatu oohinchukuni siggupadutundi ga, love lekunte totally reject cheyocchu hero ni

inka interva lo bava ani telisesariki fix aipotundhi .

ramesh uppari said...

Eppati laage kummesav po.

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views