సర్దార్ గబ్బర్ సింగ్ - కథ, కథనం - విశ్లేషణ




సర్దార్ గబ్బర్ సింగ్ - కథ, కథనం, దర్సకత్వం - విశ్లేషణ

వారం ముందు జాని గురుంచి రాసుకొని విశ్లేషణ చేసుకున్నాం, ఈ సినిమా గురుంచి కుడా లాస్ట్ లో చెప్పుకున్నాం, అది ఎక్కడ ఆగిందో ఇది అక్కడ మొదలు అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి .. ఒక్క సారి అక్కడికి వెళ్లి వద్దాం లాంటి సెంటిమెంట్స్ ఎం లేవు, ఈ సినిమా విషయంలో గబ్బర్ సింగ్ పేరు కలిసినా కూడా పాత్రలు - కథలు వేరు అయినట్టు, ఈ విశ్లేషణ దానికి కొనసాగింపు కాదు, ఈ సినిమా ఫ్రెష్ గా చిన్న పిల్లాడినుంచి మొదలు అయినట్టు, ఈ ఆర్టికల్ కూడా ఫ్రెష్. అసలు మొదట్లో ఈ ఆర్టికల్ రాసే ఉద్దేశమే లేదు, ఒకవేళ ఎవరైనా అడిగినా జాని ఆర్టికల్ ఏ చదువుకోండి, రెండిటికి పెద్ద తేడా లేదు అని చెప్దాం అనుకున్నా, కానీ ఈ మద్య పవన్ కళ్యాణ్ గారు ఈనాడు ఇంటర్వ్యూ లో  అన్నారు "ఓ ఘట్టంలో పైకి కనిపించే కథ వేరు. లోపల పొరల్లో దాగున్న భావం వేరు. ఆ భావం ఏమిటో వెతుకుతూ చదవడం నాకిష్టం" అని, మరి జనరల్ గా పుస్తకాల ప్రియుడు అయిన కళ్యాణ్ అందించిన కథ కథనం లోపలి పొరల్లో దాక్కున్న భావం ని వెతుకుదాం అనే ప్రయత్నమే ఈ విశ్లేషణ.

ఈ సినిమా నా ఫాన్స్ కి అంకితం - పవన్ కళ్యాణ్, ఫాన్స్ కాబట్టి తప్పులు ప్రశ్నించరు, బయటి వాళ్ళు ప్రశ్నించినా అకింతం ఇచ్చింది ఫాన్స్ కి అని చెప్పుకోవచ్చు? ఎప్పటికైనా ప్రశ్నించాల్సింది నేనే అని ఏమైనా మెసేజ్ లోపలి పొరల్లో దాగి ఉండొచ్చు అంటారా?

కథ ; అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక రాక్షషుడు, జనాల్ని- రాకుమారి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, వాళ్ళని రక్షించే ఒక కథా నాయకుడు, ఆ రాక్షషుడు ని ఎలా తుద ముట్టించాడు, రాకుమారిని ఎలా సొంతం చేసుకున్నాడు అనేది కథ. చందమామ పుస్తకం లో చదివిన కథ లా ఉంది కదు? ఇది కూడా అలాంటిదే, ఇంగ్లీష్ సినిమా బాష లో అయితే ఒక రాబిన్ హుడ్, ఒక కౌబాయ్ సినిమా టైపు కథ. లోపలి పొరల్లో భావం ? (కేవలం కల్పితం) అప్పుడే విడిపోయి అంధకారం లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ (తల్లి తండ్రుల నుంచి దూరమై బ్రతుకుతున్న రాకుమారి), జగన్ లాంటి అవినీతి పరుల చేతుల్లోకి వెళ్తే ప్రజలు ఇబ్బంది పడతారు అని, పవర్ లో లేక పవర్ కోసం పాటు పడుతున్న ముకేష్ రుషి లాంటి చంద్ర బాబు కి తోడుగా నిలిచి, అధికారం సంపాదించి పెట్టిన ధీరుడు కథ :) రాకుమారిని ఎలుకోటానికి కాపు కాచే కులం అడ్డు కాదు అని ముకేష్ ఋషిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు (కానీ ఇక్కడ జనాలని ఒప్పించాల్సిన అవసరం కూడా ఉంది)

కథనం : బేసిక్ గా పైన చెప్పుకున్న కథ లో పెద్ద విషయం ఎం లేదు, ఒకప్పటి ఆర్ట్ కథ మిగిల్చిన అనుభవం లో నుంచి పుట్టుకొచ్చిన కమర్షియల్ కథ. అప్పట్లో హిట్ సినిమాల విషయాలు కథనం లో పొందు పరిచినట్టు, ఇప్పటి గబ్బర్ సింగ్ ఎలెమెంట్స్ ఇందులో పొందు పరిస్తే చాలు అనుకున్నారు ఏమో. అక్కడ ఎనర్జీ రుచి చూపించాం, ఇక్కడ ఎనర్జీ తో బఫెట్ పెడదాం, దానిని ఆదరించిన వాళ్ళు దీనిని ఆదరించక పోతే తప్పు తప్పే పెద్ద తప్పే అనుకున్నారు ఏమో? అక్కడ కథ లో ఉన్న బేసిక్ ఎమోషన్ లాంటి పాయింట్ ని ఒక్కటి కూడా ఈ కథలో కథనం లో పెట్టుకోలేక పోయారు. మొదట్లో నాంది అని పడితే, ఇదేదో ఇంగ్లీష్ సినిమాల సినిమాల ప్రభావం చాలా ఉన్న పవన్ ఈ సారి చాప్టర్స్ లా చెప్తారేమో అనుకున్నా, ముగింపు పడ్డాక అర్ధం అయ్యింది, అలాంటిది ఎం లేదు అని. మరి అలా ఎడిటింగ్ చెయ్యటానికి టైం సరిపోలేదో. జాని టైం లో ట్రెండ్ క్యాచ్ చెయ్యలేక ఫెయిల్ అయిన పవన్ ఈ సారి కూడా అదే తప్పు చేసాడు. సమకాలీన సినిమాలు చూడక పోవటం వలన, తనకు నచ్చింది, తనకు వచ్చింది మాత్రమె చేస్తాను / చెయ్యగలను అని గిరి గీసుకు పెట్టుకోవటం వలనో, అయన ఐడియా లో ను కొత్తదనం లేదు, కథనం లో కూడా లేకుండా పోయింది.  సినిమా మొత్తం మీద తనకి వచ్చినవి అన్ని చేసేలా పెట్టుకుంటూనే ఇప్పటి రాజయకీయ అంశాలని కూడా టచ్ చేస్తూ సినిమా కి కథనం రాయటం జరిగింది.

ఆక్ట్ 1 : ప్రారంభం : ఒక గ్రామం లో ఒకడి అరాచకాలు, జనాల నుంచి భూములు లాక్కొని అక్రమ మైనింగ్, జనాలకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్న రాజకుమారి ఫ్యామిలి కి ఇబ్బందులు, వాళ్ళ కష్టాలని తీర్చే హీరో కోసం ఎదురు చూస్తున్న టైం లో గబ్బర్ సింగ్ ఎంట్రీ. కంచెలో చిక్కుకొని అచేతనం గా పడి ఉన్న విప్లవం (రెడ్ టవల్) హీరో భుజం ఎక్కుతుంది. లవ్ సీన్స్ లో తప్ప ? అన్ని సీన్స్ లో హీరో భుజంపైనే ఉంటుంది, కానీ దానిని ఎక్కడ ఎలివేట్ చెయ్యాలో అక్కడ చేసి ఉంటె అది ఉన్నదుకు ఒక అర్ధం ఉంది ఉండేది. 

ఆక్ట్ 2 : ఉపకథ : సమస్యాత్మకం : అక్కడ ప్రాబ్లం తెలిసిన తర్వాత అక్కడికి వచ్చిన గబ్బర్ వెంటనే పనిలోకి దిగడు, అలా అని తనకి విషయం తెలియకుండా అక్కడికి రాలేదు, మరి దేనికి ఆలస్యం? వెంటనే మీద పడిపోతే ఆవేశం అంటారు, మన గబ్బర్ కి ఆవేశం కంటే ఆలోచన కూడా ఎక్కువ అనేది మనం ఇక్కడ లోపలి పొరల్లో గమనించాల్సిన విషయం. రాకుమారి పరిచయం, అక్కడ ఆవిడే రాకుమారి అని తెలియక పోవటం, కనీసం వేసుకునే బట్టలు అయినా, బాడీ లాంగ్వేజ్ లో అయినా ఆవిడ పనిమినిషి అని ఫిక్స్ అయ్యేలా చెయ్యటం ఒక భారమైన కామెడీ థ్రెడ్ కి లీడ్ చెయ్యబోతుంది అని మనకి ఇచ్చిన లీడ్. ఫీల్ లేని ప్రేమకథ లోని లోపలి పొరలు మాత్రం ఎంత వెతికినా అర్ధం కాలేదు. మళ్లీ మళ్లీ చూస్తే క్లారిటీ వస్తుంది ఏమో. అంత్యాక్షరి సీన్స్ కి రెస్పాన్స్ కి ఇంప్రెస్స్ అయ్యి ఈయనే పాడేసి విలన్ ముందు డాన్సు చేసేసి హీరోయిజం ని పక్కన పెట్టేసారు. స్కూల్ విషయం లో సీరియస్ నెస్ ని అన్దిన్చుపుచ్చుకుంటుంది. ఊపు కలిగించే తోబ సాంగ్, ఫైట్ తో గబ్బర్ లైన్ లో పడుతున్నాడు అనుకుంటాం. కానీ రాజగోపురం లో పనిమనిషి తో ప్రేమ కంటే ఈ సమస్య ఎక్కువ కాదు అనుకోని రెడ్ టవల్ పక్కన పడేసి ప్రేమాయణం లో పడిపోతాడు, అప్పుడు పదిపొఇన కథనం, ఇంటర్వెల్ ముందుకి లేస్తుంది. అప్పటికే హీరో సీరియస్ నెస్ చూసేయ్యటం వలన ఆ సీన్ కూడా పెద్దగ పండింది లేదు. ఆడెవడన్నా వీడెవడన్నా గబ్బర్ సింగ్ కి అడ్డెవడన్నా అని పాట వస్తుంటే, నిజంగానే ఆయనకి ఎవరు అడ్డు చెప్పక ఇలా తయ్యారు అయ్యింది ఏమో అని జాలి పడాల్సి వస్తుంది. 

అప్పటి వరకు తెర నిండా ఎంతో మంది ఆర్టిస్ట్ లు నిండిపోయినా, కనీసం సింగల్ డైలాగ్ కూడా లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పని ఏంటి అంటే? పవన్ కామెడి చేస్తే నవ్వాలి, డాన్సు చేస్తే చప్పట్లు కొట్టాలి, ఫైట్ చేస్తే విజిల్ వెయ్యాలి, కనీసం వాళ్ళని చూసి అయినా ధియేటర్ లో జనాలు ఇలా రెస్పాండ్ అవ్వాల్సిందే లేదంటే తప్పు తప్పే, పెద్ద తప్పే అని యూనిట్ మొత్తం ఫీల్ అయ్యి ఉంటారు. 

అప్పటి వరకు యువరాణి దగర చలాకి గా ఉన్న హీరో కి నిజం తెలిసిపోయి, ప్రేమ కాస్త భాద్యత గా మారుతుంది, హీరో కి నీరసం వస్తుంది, హీరోయిన్ ని ప్రేమించే అంత తాహతు తనకు లేదు అని తన నోటితో తనే అంటాడు, కానీ కేస్ట్ గురుంచి వచ్చినప్పుడు మాత్రం డైలాగ్స్ చెప్తాడు. అక్కడ నుంచి విలన్ ఎత్తుగడ వేసేవరకు ఎం చెయ్యాలో గుర్తులేక, ఎం తీసారో తెలియక, ఎం చూపిస్తున్నమో అర్ధం అవ్వకుండా చేసారు. విజయవాడ ఆకాశవాణి ఎపిసోడ్స్ లోపలి పొరల్లో లోతు మాత్రం దొరకలేదు. అప్పటికే విలన్ ని ఎదిరించేసి వెనక్కు వెళ్ళేలా చేసిన హీరో కి, ఇంకా సరైన ప్రత్యర్ధి ఎవరు లేరు అనటం తో ఇంటర్వెల్ లోనే అయిపొయింది సినిమా. గుర్రాన్ని లొంగ తీసుకునే ఎపిసోడ్ అసహనం కలిగించగా, కాపు డైలాగ్ లు అయోమయం కి గురి చేస్తాయి. ఇదే ఎనర్జీ తో అత్తారింటికి సెకండ్ హాఫ్ ని లాగిన కళ్యాణ్ కి ఇక్కడ మాత్రం సింక్ దొరక్క పేలవమైన షో గా తయ్యారు అయ్యింది. ఈ గ్యాప్ లో టీవీ లో ఆగడు సినిమా చూసొచ్చిన విలన్ హీరో ని ట్రాప్ చేస్తాడు. అప్పుడే నిద్ర లేచిన వాడిలా 72 గంటలు టైం లాక్ పెట్టి విలన్ విజ్రుమ్బిస్తాడు, హీరోయిన్ తో పెళ్ళికి ఒప్పించే సీన్ చాలా బాగా తీసారు.  

ఆక్ట్ 3 : ముగింపు : పదనివి కోల్పోయి, అరెస్ట్ కి దగ్గరగా ఉంది, ఇంకోపక్క హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయిపోయి, అన్ని దారులు మూసుకు పోయాయి అనే సిచువేషన్ కల్పించిన విధానం పాతది, ఇంతకు ముందే చూసేసింది అయినా, ఈ సినిమా వరకు బాగా కుదిరిన ఎపిసోడ్ అయితే అదే. అప్పుడు కూడా అహల్య అమాయకురాలే ఎపిసోడ్ టైపు లో సంగీత్ ఎపిసోడ్ తో మూవీ పీక్స్ కి వెళుతుంది అనుకోని ఉంటారు. కానీ అందులో ఎంచుకున్న సాంగ్స్ విషయం లో మాత్రం టేస్ట్ మరీ ఘోరం, ఇంకా కమర్షియల్ గా తయ్యారు చెయ్యాల్సిన స్లాట్ అది కానీ మనం ఎం చెయ్యగలం ఆడెవడన్నా వీడెవడన్నా గబ్బర్ సింగ్ కి అడ్డెవడన్నా. అక్కడ నుంచి ఇంకా మగతాది అంతా లాంచనమె. గన్స్ మీద ఉన్న మోజు సినిమా మొత్తం కనిపిస్తూ ఉంటుంది, క్లైమాక్స్ లో విలయ తాండవం చేస్తుంది. సినిమా మొత్తం చూసిన డాన్సు ని ముగింపు తర్వాత కూడా చూడమంటే అందులో కిక్ ఉంటుంది అని ఆశపడి ప్లాన్ చేసుకొని ఉంటె, దాని కోసం పేపర్స్ దాచుకోమని లేదంటే చొక్కా చిన్చుకోవాల్సి వస్తుంది  సలహా ఇస్తే, .... ఆ బాధ లోపల పొరలు వరకు చొచ్చుకొని పోతుంది అని అలోచించి ఉండరు బోనస్ గా జుత్తు కూడా పీక్కోవాల్సి వస్తుంది

గబ్బర్ సింగ్ ని ఆదరించారు అని సర్దార్ ని ఆదరిస్తారు అనుకోని ఉంటారు అని చెప్పుకున్నాం కదా, దూకుడు ని ఆదరించం అని ఆగడు ని ఆదరిస్తాం అనుకుంటే తప్పు తప్పే పెద్ద తప్పే, తప్పు తప్పే సుద్ద తప్పే అని ప్రేక్షకులు కూడా తిప్పి కొట్టేసారు, సాచి పెట్టి కొట్టేసారు. ఒక మంచి కథ/కథనం ని స్టార్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళి నిలబెడతాడు కాని, స్టార్ మాత్రమె ఏమి చెయ్యలేడు, ఓపెనింగ్స్ రాబట్టడం తప్ప అని మరొక్కసారి నిరూపించబడింది. ఈ సినిమా కి రాసుకున్న మెయిన్ ట్విస్ట్ ఆగడు లో వచ్చేసింది అని, కథనం ఆల్రెడీ వచ్చేసిన సినిమాలని పోలి ఉంది అని పవన్ కళ్యాణ్ కి హరీష్ పాయ్ కి తెలిసి ఉండక పోవచ్చు? మరి బాబి ఎం చేస్తున్నట్టు? టీం మొత్తంలో ఎవరికీ తెలియలేదా? తెలిసి చెప్పలేదా? చెప్పినా వినలేదా?

ఇక్కడ నేను చెప్పుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది, ఇది చెప్పటం నా భాద్యత. ఇలా రాసే దానికి ఆ రోజు అలా ఎందుకు ట్వీట్ వేశావ్ అని అడిగే వాళ్ళు ఉండొచ్చు, ఆ రోజు కూడా ఫాన్స్ ఏ బాలేదు అంటే మీ ట్వీట్ ఏంటి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఆ ట్వీట్ లోపలి పొరల్లోకి వెళ్లి చూసి ఉండాల్సింది. కంప్లీట్ గా ఫాన్స్ ని దృష్టిలో పెట్టుకొని , తీసి , వాళ్ళకి అకింతం ఇచ్చిన సినిమా (ఫాన్స్ కి మాత్రమె), పవన్ కళ్యాణ్ ఎనర్జీ ని రెండు గంటలు చూడాలి అంటే చూసేయ్యల్సిందే (మళ్లీ ఎనర్జీ ఉన్న కమర్షియల్ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు), ఇక పోతే ఫైనల్ గా "నాలాంటి వాడికి ఒక సారి కి ఓకే". ఈ సినిమా కి ముందు జాని విశ్లేషణ లోనే చెప్పాల్సింది అంతా చెప్పేసాను, సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాలకే ఇది ఎలా ఉండబోతుంది అని ఒక అండర్స్టాండింగ్ కి వచ్చేసాను. సో అన్నిటిని పక్కన పెట్టి, గబ్బర్ సింగ్ టీం లో కానిస్టేబుల్ లా ఎంటర్టైన్ అయిపోయాను. అన్ని ఫిక్స్ అయిన వాడికి ఇది పర్వాలేదు అనిపించే సినిమా, చెత్త అయితే కాదు అనేది ఒక భావన. వెన్ యు కాంట్ రేసిస్ట్ రేప్, లై డౌన్ అండ్ ఎంజాయ్ ఇట్. దీనిని మీరు ఎలా అర్ధం చేసుకున్నా పర్లేదు. నో హార్డ్ ఫీలింగ్స్.

రాజా సర్దార్ గబ్బర్ సింగ్ రాకపోతేనే మంచిది అని అనుకుంటూ, ఒకవేళ వచ్చినా దానికి కథ కథనం మాత్రం ఈయన లైట్ తీసుకోవాలి అని భావిస్తూ, ఎర్ర తువ్వాలు సాక్షి గా ఖండిస్తూ, ఇంతకంటే లోపలి పొరల్లోకి వెళ్ళే చూసే ఓపిక లేదని తెలియజేసుకుంటూ .......... 







3 comments:

Anonymous said...

Chala Bavundhi...Nenu Pawan Kalyan abhimani ni ee article lo kuda okkasari gurthu chesi unte inka bavundedhemo..

aditya said...

Punch saripoledu baa, inka esukuntaav anukunna i think opika nashinchindi neeku :D :D

asalu vachetapudu emi crystal clear ga chepparu le hero ki

adi vadileste interval ala antha pedda incident ayyaka villain gaadu gammuna untadu itu sardaoorodu recharge aipoina battery la dull aipotadu akkade dhadel mandi cinema, aa 30 yrs pruthi etc gang ni vadukuni edanna comedy game unna bagundedi villain ni debbeteeyadaniki ebbe nela rojullo 2nd half teeste ittage untadi mari bonus ga pk creative gang maa daridraaniki

Anonymous said...

lopali porala varalu vellakunda paipaine telchesaru ga

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views