మహారాజ - కథ - కథనం - విశ్లేషణ

 


మహారాజ - కథ - కథనం - విశ్లేషణ


తెలుగు వారికి ప్రత్యేకం గా పరిచయం అక్కరలేని విలక్షణ నటుడు "విజయ్ సేతుపతి". 2004  లో తమిళ్ సినిమాలలో బాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి, 2012 కి నెగటివ్ రోల్ లో నటించి అవార్డు సంపాదించటమే కాకుండా అదే సంవత్సరం హీరోగా కూడా పిజ్జా తో పరిచయం అయ్యాడు. కథ / పాత్ర నచటమే ఆలస్యం, అది హీరో నా, విలన్, వయసు మీరిన పాత్ర ఇలాంటివి ఎం పట్టించుకోకుండా తన పని తానూ చేసుకుంటూ తనకంటూ ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. తన 50 చిత్రం గా "మహారాజ" మన ముందుకి వచ్చింది.  అసలు ఈ రేంజ్ కి వస్తాను అని ఎప్పుడు ఊహించుకోలేదు అని చెప్పే సేతుపతి గారి లాండ్మార్క్ సినిమా అంటే ఎదో ఒకటి ప్రత్యేకంగా ఉండాలి అని మనం ఊహించుకుంటాం, కానీ తనకి సంబంధించి ఇది జస్ట్ ఇంకొక సినిమా. కథ నచ్చి ఒప్పుకున్నా ఒక సినిమా అది 50 వ సినిమా అయ్యింది అంతే. ఎందుకంటే ఈ సినిమా డైరెక్ట్ చేసిన నిథిలన్ స్వామినాథన్ కి ఇది జస్ట్ సెకండ్ మూవీ. అతను తీసిన ఫస్ట్ సినిమా "కురంగు బొమ్మై" ఎప్పుడో 2017 లో వచ్చింది (ఈ సినిమా చూడని వాళ్ళు ఎవరు అయినా ఉంటె, వీలుచేసుకొని చూసెయ్యండి - ఒక చిన్న లైన్ తో సినిమా మొత్తం ఇంటరెస్టింగ్ గా కట్టిపడేసేలా ప్రెసెంట్ చేసారు). 


సేతుపతి కావాలి అనుకుంటే ఒక పెద్ద డైరెక్టర్ తో ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ కి చేసుకొని ఉండొచ్చు, కానీ కేవలం దర్శకుడుని నమ్మి ఈ సినిమా ఒప్పుకున్నాడు. ఈ మధ్యకాలం లో చెప్పుకోదగ్గ హిట్స్ కూడా లేవు, ఫాన్స్ కూడా కం బ్యాక్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం లో వచ్చిన "మహారాజ" అటు ఫాన్స్ తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకులని కూడా అలరించింది. ఈ సంవత్సరం వచ్చిన తమిళ్ సినిమాలలో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా 100 కోట్ల క్లబ్ లో చేరిన 50 వ సినిమా కథ - కథనం ని విశ్లేషించుకుందాం.  


"సినిమా చూడని వాళ్ళుచూడాలి అనుకునే వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిదిఅని నా అభిప్రాయంఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు


ఈ సినిమా కథ గురుంచి చెప్పుకునే ముందు, ఎప్పుడో చదివిన ఒక విషయం గుర్తు చేసుకోవాలి అనిపిస్తుంది. "సినిమాలకు ఇలాంటి కథలే ఎంచుకోవాలి అని రూల్ ఎం లేదు, ఎలాంటి కథలనైనా ఎంచుకోవచ్చు. పేపర్ లో వచ్చే న్యూస్ ఐటెం కూడా ఒక్కోసారి మంచి కథ పుట్టటానికి ప్రేరణ కావొచ్చు. వేరే సినిమా చూస్తున్నప్పుడు మనకి నచ్చిన ఎదో ఒక అంశం ఒక కొత్త సినిమా కి ప్రేరణ కావొచ్చు" ఇదంతా ఎందుకు అని మనం లాస్ట్ లో చెప్పుకుందాం, అలాగే "సుమారుగా ఉండే కథలు అయినా కథనం తో రక్తి కట్టిస్తే అద్బుతాలు చేస్తాయి"


ప్రేరణ - "ఇలా ఉంటె వ్యక్తి లైఫ్ లో అలా జరిగితే?" అనే ఒక సింపుల్ ఐడియా కూడా ఒక సినిమా కథకి ప్రేరణ కావొచ్చు, ఈ సినిమా వరకు వస్తే "ఇద్దరు తండ్రులు - వేరు వేరు జీవితాలు (మంచి - చెడు)  - ఒక అనుకోని కలయిక - దాని పర్యవసానాలు" వారిద్దరి జీవితాలు చుట్టూ తిరిగే సినిమా. చివరకి కర్మ సిద్ధాంతం ఎలాంటి పరిస్థితి కల్పించింది అనేది ముగింపు. ఈ సినిమా వరకు ప్రేరణ ఏమైఉండొచ్చు అని ఆర్టికల్ చివరిలో చెప్పుకుందాం. 


ఈ సినిమా కథనం నాన్ లీనియర్ నేరేషన్ లో ఉంటుంది కాబట్టి, విశ్లేషణ లో కూడా కొంచెం ముందు వెనుక చెప్పుకోవాల్సి వస్తుంది. 


కథ: ఒక లైన్ లో చెప్పుకోవాలి అంటే, క్రైమ్ అండ్ పనిష్మెంట్ కాన్సెప్ట్ తో, తన కూతురుకి జరిగిన అన్యాయానికి, ప్రతీకారం తీర్చుకునే తండ్రి కథ. 


దీనినే ఒక నాలుగు లైన్స్ లో చెప్పమంటే, భార్యని పోగొట్టుకొని, కూతురే లోకంగా బ్రతుకున్న మహారాజ జీవితంలో, ఒక రోజు తన కూతురుకి జరగరాని అన్యాయం జరిగితే, అది ఎవరో కనిపెట్టడానికి, పోలీస్ స్టేషన్ కి వెళ్లి, తన ఇంట్లో దొంగలు పడి తనని చితకబాది, లక్ష్మి ని ఎత్తుకుపోయారు, ఎలా అయిన కనిపెట్టమని కంప్లైంట్ ఇచ్చి, అవసరం అయితే 7 లక్షలు ఇస్తానని ఆశ పెడతాడు, మరి ఆ పోలీసులు చెత్తడబ్బాని వెతికి పట్టుకోగలిగారా? ఈ ప్రాసెస్ లో అసలు సూత్రధారులు ఎవరో మహారాజ తెలుసుకోగలిగాడా, తెలుసుకొని ఎలా పగతీర్చుకున్నాడు అనేది కథ.


సింపుల్ గా ఇలాగె సినిమాలో కూడా చెప్పేసి ఉండుంటే, ఫస్ట్ హాఫ్ మొదలు అయిన పావు గంటకే ఓహో ఇదన్నమాట క్లైమాక్స్ అని అందరికి అర్ధం అయిపోయే అంత సింపుల్ లైన్ ఇది. ఈ కథని ఆశక్తికరమైన కథనంగా మలచటం లోనే దర్శకుడి లోని మొత్తం ప్రతిభ తెలుస్తుంది, ఈ విషయం లో నిథిలన్ స్వామినాథన్ మంచి మార్క్స్ తో పాస్ అయిపోయాడు. స్క్రీన్ ప్లే లో వాడాల్సిన టూల్స్ అండ్ టెక్నిక్స్ ని చాలా ఎఫెక్టివ్ గా వాడుకున్న విధానం కథనం లో చూద్దాం. 


కథనం: ముందుగా చెప్పుకున్నట్టు ప్లైన్ నరేషన్ లో కాకుండా నాన్ లీనియర్ నరేషన్ లో ఈ కథని ప్రెసెంట్ చేసారు. దానికి రెండు టైం లైన్లు (గతం - వర్తమానం), అలాగే ఒక టైం లైన్ లో రెండు మూడు సందర్భాలు (నేరం జరిగే వరకు - విచారణ మరియు శిక్ష)  అన్నిటిని కలగలిపి ఒక ఆర్డర్ లో చెప్పగలిగారు. 


గతం


G1 & G2 - అనగనగా ఒక దొంగ, వాడికి పార్టనర్స్, డబ్బున్న వాళ్ళ ఇంట్లో దోచుకోవటమే కాదు, వండుకొని తినటం తో పాటు, అనుభవించి చంపటం. 


G3 - తన పాప పుట్టిన రోజు కోసం ఒక లాకెట్ ఆర్డర్ ఇవ్వటం 


G4 - పుట్టిన రోజు నాడు లాకెట్ కలెక్ట్ చేసుకొని సెలూన్ కి వెళ్ళటం 


G5 - పేపర్ లో వాళ్ళు చేసిన క్రైమ్ గురుంచి న్యూస్ వచ్చింది అని తెలుసుకోవటం, దానిని మహారాజ వినటం 


G6 - ఇంటికి మహారాజ రావటం, పోలీస్ రావటం, ఫైరింగ్ జరగటం, అరెస్ట్ అవ్వటం 


G7 - ఒక ప్రమాదం లో భార్యని కోల్పోవటం - ఒక పాప బ్రతకటం 


వర్తమానం 


V1 - మహారాజ - పాప మధ్య అనుబంధం, పాప కోసం ఎంత దూరం ఐన వెళ్ళటం 


V2 - పాప స్పోర్ట్స్ టూర్ కి వెళ్ళటం 


V3 - పాప తిరిగి రావటం. ఘోరం జరగటం 


V4 - పాపని హాస్పిటల్ లో జాయిన్ చెయ్యటం, తప్పు చేసిన వారు ఎవరో కనుక్కోవడానికి ప్రయత్నించటం 


విచారణ మరియు శిక్ష :


S1 - టోల్ గేట్ స్లిప్ దొరకటం, దానిని వెతుకుంటూ బార్ కి వెళ్ళటం, నిందితుడు 1 ని పట్టుకోవటం చంపెయ్యటం, రెండవ వాడు పోలీస్ స్టేషన్ లో ఉంటాడు అని తెలుసుకోవటం 


S2 - పోలీస్ స్టేషన్ కి వెళ్ళటం, కంప్లైంట్ ఇవ్వటం, డబ్బులు ఇస్తాను అని చెప్పటం, పోలీస్ లు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం. 


S3 - డూప్లికేట్ చెత్తబుట్ట కోసం పోలీస్ లు ట్రై చెయ్యటం, నిందుతుడు 2 తనకి తెలియకుండానే ఈ ప్రాసెస్ లో ఎంటర్ అవ్వటం 


S4 - డూప్లికేట్ చెత్తబుట్ట రెడీ అవ్వటం, డబ్బులిస్తే నేరం వొప్పుకోటానికి నిందితుడు 2 సిద్ధం అవ్వటం 


S5 - కంప్లైంట్ ని మళ్ళీ హీరో తో చెప్పించటం, జరిగిన ఘోరం గురుంచి నిందితుడు 2 గురుంచి ప్రేక్షకులకి తెలియటం. 


S6 - క్రైమ్ సీన్ రెక్రీట్ చెయ్యటం,  నిందితుడు 2 గురుంచి మహారాజ కి తెలియటం, పోలీస్ హెల్ప్ చెయ్యటం, రివెంజ్. 


S7 - క్లైమాక్స్, ట్విస్ట్, ముగింపు.


ఫిల్లర్లు :


F1 : కార్ లో కూలింగ్ గ్లాస్సెస్ మిస్ అయ్యాయి అని షెడ్ కి వచ్చి గొడవ పెట్టుకోవటం, నిందుతు 1 ఏ దానికి కారణం అని తెలుసుకొని వార్నింగ్ ఇవ్వటం 


F2 : నిందితుడు 1 బార్ కి వచ్చి గొడవ పడటం, కౌన్సిలర్ ని కొట్టడం 

  

F3 : నిందితుడు 1 మిస్సింగ్ అని తన స్నేహితుడు పోలీస్ స్టేషన్ కి రావటం 


F4 : నిందితుడు 1 మిస్సింగ్ కేసులో కౌన్సిలర్ ని స్టేషన్ కి పిలవటం, ఆ కేసు ని ఇన్వెస్టిగేట్ చెయ్యటం. 


పైన చెప్పుకున్న ముఖ్యమైన సీన్స్ కలుపుకొని నాకు గుర్తున్న వరకు ఈ ఆర్డర్ లో చూపించటం జరిగింది. 



ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో పాటు ఉపయోగించిన టూల్స్ అండ్ టెక్నిక్స్ గురుంచి చెప్పుకుంటే 


టైం లాక్ : "you inject an urgency into your story that can give it additional drive to heighten audience involvement and anxiety" - పాప వారం రోజుల్లో తిరిగొచ్చేస్తుంది, ఈ లోపు లక్ష్మి ని కనిపెట్టాలి అని ఒక అర్జెన్సీ క్రియేట్ చెయ్యటం. మధ్యలో తాను పాప వీడియోస్ చూసుకుంటూ అది నిజమే అని ప్రేక్షకుడు కూడా నమ్మేలా చూపించటం.   


ఫోర్ షాడోయింగ్/ముందస్తు సూచిక: ఒక్కొక్క సారి ప్రేక్షకులని ప్రిపేర్ చెయ్యటానికి ముందుగానే హీరో కి ఫైట్ వచ్చినట్టు చూపించటానికి ఇంట్రడక్షన్ ఫైట్ పెట్టినట్టు, అలాగే ఏదైనా స్పెషల్ టాలెంట్ గురుంచి ఎస్టాబ్లిష్ చెయ్యటానికి కూడా ఈ టెక్నిక్ వాడుతూ ఉంటారు, కాలేజీ లో సీన్ కానీ, పోలీస్ స్టేషన్ లో మొదట్లో ఉడుంపట్టు పట్టేసే సీన్ కానీ, హీరో లో ఒక బలవంతుడు ఉన్నాడు అని మనకి చెప్పటానికే.  


ట్రాన్స్ఫర్మేషన్ / Paradigm Shift : అప్పటి వరకు పోలీస్ స్టేషన్ లో దెబ్బలు, తిట్లు తింటూ ఉన్న మహారాజ ఇంటర్వెల్ ముందు ఉగ్రరూపం లో విజృంభించటం.  సింగం పులి లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని నిందితుడు 2 గా రెవీల్ చేసే అంశాలు.


Planting & Payoff  / Setup and Reveal  : ఇది ఒక రకమైన ఫోర్ షాడోయింగ్ టూల్. ఫోర్ షాడోయింగ్ లో మొత్తం ఓపెన్ గా చెప్పేస్తే, ప్లాంటింగ్ లో ప్రేక్షకులకి తెలిసి తెలియనట్టు, అదేదో ఇంపార్టెంట్ విషయం కాదు అన్నట్టు గా జరగాలి. అప్పుడు పే ఆఫ్ అందం గా ఉంటుంది. ప్లాంటింగ్ అనేది నోటీస్ చెయ్యకుండా ఉండటానికి ఇంపార్టెంట్ సీన్ లో సింపల్ గా కట్ చెయ్యాలి. ప్లాంటింగ్ ఎంత స్మూత్ గా జరిగిపోతే, జనాలు అంత త్వరగా మర్చిపోతారు, పే ఆఫ్ కి ఎక్సైట్ అవుతారు. "చంటి పాప కి వీపు మీద ఉన్న గాయం" "డాక్టర్ తో ఫ్రెండ్షిప్, పాప కి ఘోరం జరిగిన తర్వాత అదే డాక్టర్ సహాయం" "ఇన్స్పెక్టర్ కి ఒక పాప ఉండటం, లాస్ట్ లో హీరో కి హెల్ప్ చేసినప్పుడు, మన ఇంట్లో ఇలా జరిగితే ఊరుకుంటామా అని సర్ది చెప్పటం  "


ప్రతికూలత: మహారాజ కి జరిగిన అన్యాయం గురుంచి మాత్రమే తెలుసు, ఆ తర్వాత ఎం చెయ్యాలి ఎలా చెయ్యాలి తెలియని సందర్భం లో ఒక టోల్ స్లిప్ దొరకటం, అక్కడ నుంచి నిందితుడు 2 ని పట్టుకొని, ముగ్గురిలో ఒకడు పోలీస్ స్టేషన్ లో ఉంటాడు అని చెప్పటం. వాడి వీపు మీద ఉన్న గుర్తు ఒకటే క్లూ, దాని గురుంచి లక్ష్మి కథ అల్లి స్టేషన్ లో ఉండిపోయి, ఒక లిస్ట్ రాసుకొని, అందర్నీ వెతుకుతూ ఉండటం, ఈ మధ్యలో ఎన్ని అవమానాలు వస్తున్నా స్టేషన్ లోనే ఉండిపోవటం, ఫైనల్ గా వాడు దొరకటం, వాడి ద్వారా మూడోవాడు దొరకటం. ఈ మొత్తం ప్రాసెస్ సులువుగా అయిపోలేదు, హీరో పాత్ర కి ఎంతో క్లిష్టమైన ప్రయాణం ఇది. 


Climactic Moments: Build to a climax that delivers a powerful emotional payoff, making the journey feel worthwhile . ప్రేక్షకులకి, నీడ్ టు నో బేసిస్ లో ఎంత వరకు చెప్పాలో అంత వరకు చెప్తూ, మొత్తం కథని ఒక పజిల్ లో ముక్కలు లా పేర్చుకుంటూ, రెవీల్ చేసే టైం కి సరిపడా బిల్డ్ అప్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా చేర్చుకుంటూ పోతే, క్లైమాక్స్ టైం కి ప్రేక్షకుడు పూర్తి సంతృప్తి తో బయటికి వస్తాడు. క్లైమాక్స్ కి వచ్చేసరికి, పోలీస్ మహారాజ కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం, తాను చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని నెత్తిమీద నరికెయ్యటం ఇలాంటి వాటికీ థియేటర్ లో విజిల్ పడుతుంది అంటే ప్రేక్షకుడు హీరో పాత్ర కి జరిగిన అన్యాయానికి ఎంత కనెక్ట్ అయ్యాడు అనేది అర్ధం చేసుకోవచ్చు. అక్కడ ఏది నీతి, ఏది న్యాయం అని ఆలోచించరు - నరికెయ్ నా కొడుకుని ని నెల టికెట్ లో కూర్చొని అరుస్తాడు. లాస్ట్ లోకి వచ్చేసరికి కొంచెం హడావుడిగా ముగించేసిన ఫీలింగ్ ఉంది అనుకోండి అది వేరే విషయం.


టీజింగ్స్ : తెలిసి చేసినా - తెలియకుండా వచ్చేసిన, కొన్ని సీన్స్ లేక షాట్స్ ఉంటాయి, ప్రేక్షకులకి ఒక హింట్ టైపు లో


ఫస్ట్ టైం షాప్ నుంచి ఇంటికి వెళ్తున్నట్టు చూపించిన మహారాజ, షాప్ దగ్గర బయలుదేరినప్పుడు ఎం ఉండవ్ కానీ, ఇంటికి వచ్చే సరికి బైక్ లో కాళ్ళ దగ్గర బాగ్స్ ఉంటాయి, షూస్, అవి మనం ముందుగా నోటీసు చెయ్యం.


పోలీస్ స్టేషన్ లో లక్ష్మి కథ చెప్తున్నప్పుడు, ఇంటికొచ్చి బాగ్ తీసి కిందన పెట్టాను అంటాడు, అప్పటి వరకు ఒక బాగ్ మోస్తున్నట్టు మనకి ఎప్పుడు కనిపించడు. బహుశా తాను చెప్తుంది తన కూతురు కిందన పెట్టిన బాగ్ 


పోలీస్ స్టేషన్ లో, ఎంత సేపు తన కూతురు పాత వీడియోస్ చూస్తూ ఉంటాడు తప్ప, లైవ్ లో కాల్ మాట్లాడుతున్నట్టు కనిపించడు. పాప కూడా నా ఫోన్స్ ఎందుకు ఆన్సర్ చెయ్యటం లేదు అని అడుగుతుంది, తాను ట్రిప్ లో ఉన్నపుడు ఫోన్ ఆన్సర్ చెయ్యటక పోవటం ఎందుకు ఉంటుంది అసలు. కూతుర్ని వదిలి ఉండలేనివాడు కాల్ ఎత్తకుండా ఉంటాడా. 


అనురాగ్ ఇంట్లో లక్ష్మి డస్ట్ బిన్ ఉండటం, అది మనకి గతం అని తెలియకపోవటం, అప్పటికే తాను దొంగ అని మాత్రం తెలియటం


ముందుగానే చూసుకొని ఉండాల్సిన కొన్ని విషయాలు:


 అసలు మహారాజ అనేవాడు పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు, దానిని విచారణ చెయ్యాలి అని డిసైడ్ అయినప్పుడు, కూతురు గురుంచి ఎందుకు ఆలోచించరు పోలీస్ లు? అసలు నిజంగానే వీడికి కూతురు ఉందా? ఒకవేళ ఉంటె నిజంగానే టూర్ లో ఉందా ? అని విచారణ మొదలుపెట్టి ఉంటె సినిమా నే ఉండేది కాదేమో. 


టూర్ నుంచి వచ్చినప్పుడు, పాప ని ఆలా ఎలా వదిలేసి వెళ్తుంది టీచర్. మీ నాన్న రాలేదా పిక్ అప్ చేసుకోటానికి అని ఐన అడిగి ఉంటె, పర్వాలేదు మేడం నాకు అలవాటే నేను వెళ్ళిపోతే మీకు లేట్ అవుతుంది అని పాప తో ఒక మాట అయిన చెప్పించి ఉండాల్సింది. 


అంతకు ముందే హీరోయిజం బేస్ చేసుకున్న ట్రాన్స్ఫర్మేషన్ చూసేసాక, ఇంటర్వెల్ అయిపోయాక, ఇంకా పోలీస్ స్టేషన్ లో దెబ్బలు తింటూ అండర్ ప్లే చెయ్యటం కథనం పరంగా ఏ విధమైన ఉపయోగం లేని విషయం, అప్పటికే ఉగ్రస్వరూపం చూసెయ్యటం వలన. 


క్లైమాక్స్ లో పోలీస్ ఆఫీసర్ సడన్ గా ఇచ్చే ట్విస్ట్ కి సరిపడా బాక్గ్రౌండ్ వర్క్ కూడా చూపించి ఉండాల్సింది, ఆ టైం కి ఆ ట్విస్ట్ ఒక సినిమాటిక్ లిబర్టీ అంతే.



ఇంతకీ ఆ పాము ఎందుకు ఉన్నట్టు ? 


ఇప్పటికే ఎక్కువైన ఆర్టికల్ లెంగ్త్ దృష్టిలో పెట్టుకొని, ఇక్కడితో ఆపుతున్నాను, మేజర్ పాయింట్స్ అన్ని కవర్ చేసినట్టే అనుకుంటున్నాను. 


చివరిగా : రెగ్యులర్ రివెంజ్ డ్రామా అయిన సింగల్ లైన్ ని తీసుకొని, కథనం తో దానికి మేజిక్ ని యాడ్ చేస్తే, చూసిన ప్రేక్షకులకి ఒక సంతృప్తికరమైన అనుభూతి మిగుల్తుంది. మహారాజ అలాంటి ఒక అనుభూతి. కంప్లైంట్స్ లేవు అని చెప్పను కానీ, ఇది ఖచ్చితం గా అభినందించదగ్గ ప్రయత్నమే కాబట్టి, కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ని పక్కన పెడితే, ఔత్సాహిక రైటర్స్ కి ఈ సినిమా స్క్రీన్ ప్లే ఒక చక్కటి పాఠం గా ఉపయోగపడుతుంది. మితిమీరిన రక్తపాతం, కలవరపరిచే కొన్ని సన్నివేశాలు కథలో భాగం గా తప్పదుకాబట్టి ఉన్నాయి, అవి అంటే పడనివాళ్ళు దూరంగా ఉండటమే మంచిది. ఇంత సీరియస్ కథలో కూడా కామెడీ ని సింపుల్ గా జోడించడం ఒక కొసమెరుపు

  

ప్రేరణ (నా దృష్టిలో) -  "తాను చేసిన తప్పు కి శిక్ష అనుభవించి బయటికి వచ్చిన ఒక తండ్రి, తన స్థితి కి కారణం అయిన వాడిమీద పగ తీర్చుకుంటున్నాను అనుకుంటూ - తాను ఎంతగానో ప్రేమించిన కూతురి పాలిట కాలయముడు అయితే". ఇలాంటి సిమిలర్ నేపథ్యం ఉన్న కొన్ని సినిమాలు "ఇరట్టా (మలయాళం), ఓల్డ్ బాయ్ (కొరియన్), నో మెర్సీ (2010 కొరియన్)" 



3 comments:

Anonymous said...

అసలు నిజంగానే వీడికి కూతురు ఉందా? ఒకవేళ ఉంటె నిజంగానే టూర్ లో ఉందా ? అని విచారణ మొదలుపెట్టి ఉంటె సినిమా నే ఉండేది కాదేమో / excellent point raju garu anduke me reviews ani special meru cinema choose vidhaname veru. superb analysis

Kiran said...

superb analysis as usual rajugaru

Anonymous said...

Excellent review anna 🙏 chaduvuthuntae cinema malli chusina feeling vachindi ..

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views