రంగస్థలం - కథ, కథనం - విశ్లేషణ




రంగస్థలం - కథ, కథనం - విశ్లేషణ 

బ్రూస్ లీ దెబ్బ కి రూట్ మార్చిన చరణ్ ధ్రువ తర్వాత సుకుమార్ తో సినిమా ని ఎంచుకొని మంచి పని చేసాడు అని చాలా మంది అనుకున్నారు. సుకుమార్ సినిమాలు ఎలా ఉన్నా సుకుమార్ సినిమాలో హీరోస్ కి పేరు వస్తుంది అనే మినిమం గారంటీ ఉంటుంది కాబట్టి. సుకుమార్ గారితో ఒకే భయం ఏంటి అంటే అయన విజ్ఞాన ప్రదర్శన ఒక పక్క అబ్బురపరుస్తూనే ఇంకో పక్క జుట్టు పీక్కునేలా చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఈ సినిమా విషయం లో కూడా నా వరకు అలాంటి భయం లేక పోలేదు, దానికి తోడు కొన్ని పోస్టర్స్ అండ్ టీజర్  లో కొన్ని షాట్స్ కి ఇది ఎదో అరవం లో తీసి డబ్బింగ్ చెయ్యాల్సిన సినిమా ని తెలుగులో స్ట్రెయిట్ గా తీసేసారా అనిపించిన మాట కూడా వాస్తవం. పాటలు విన్న తర్వాత ఆ భయాలు తగ్గి అచ్చ తెలుగు సినిమానే అనే భావం మొదలు అయ్యింది. ట్రైలర్ తో ఈ సినిమా టెక్నికల్ గా ఎలా ఉండబోతుంది అనే క్లారిటీ వచ్చింది. సినిమా గురుంచి అప్పుడప్పుడు బయటికి వచ్చిన ఆసక్తికర విషయాలు, చెక్కుతూ చెక్కుతూ పండగ నుంచి సమ్మర్ వరకు వెయిట్ చేయించిన విధానం, ప్రీ రిలీజ్సీ ఫంక్షన్ తీసుకొచ్చిన ఊపు, సీజన్లో మొదటి పెద్ద సినిమా అవ్వటం, ఓపెనింగ్స్ వరకు ఢోకా లేదు అనిపించినా, రిలీజ్ రోజు నుంచి ఈ రోజు వరకు నాన్ స్టాప్ కుమ్ముడు @ బాక్సాఫీస్ ఏదైతే ఉందొ అది మాత్రం అరాచకం. ఎప్పటి లాగానే మనకి సంబంధం లేని సబ్జెక్టు కాబట్టి దానిని అనలిస్ట్ లకి వదిలేసి, కథ కథనం ని విశ్లేషించుకుందాం. 

"సినిమా చూడని వాళ్ళు, చూడాలి అనుకునే వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిది" అని నా అభిప్రాయం. ఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు. 

కథ : 1980 ల ప్రాంతం లో జరిగిన కథ. అప్పటి ప్రాంతం లో జరిగే కథ అని చెప్పి ఆ రోజుల్లోకి తీసుకెళ్లిపోయే ప్రయత్నం అయితే చేసారు కానీ, అప్పటి కాలం నాటి కథనే చూపించారు. ఇది మనం ఇంతకు ముందు ఎన్నో సార్లు చూసేసిన కథ అయినప్పటికీ ఈ రోజుల్లో అప్పటి వాతారణం ని సృష్టించి అలరించే విధంగా చెప్పటానికి ట్రై చేశారు. కథ విషయానికి వస్తే, ఒక లైన్ లో , రంగస్థలం అనే ఊరిలో,  1980 ల నాటి భూస్వామి వ్యవస్థ కి ఎదురు తిరిగిన అన్నయ్య చంపివేయ్యబడితే, దానికి పగ తీర్చుకున్న తమ్ముడి కథ. కొంచెం డీటైల్డ్ గా చెప్పుకోవాలి అంటే, అనగనగా రంగస్థలం అనే ఊరిలో, నల్ల త్రాచు లాంటి ప్రెసిడెంట్ కోరల్లో నలిగిపోతున్న సామాన్య ప్రజానీకం, సొసైటీ ద్వారా రుణాలు ఇస్తూ, అధిక వడ్డీ పేరుతో జనల భూములు ఆక్రమించుకుంటూ, అడ్డొచ్చినా వాళ్ళని లేపేస్తు, అడిగిన వాళ్ళ నోళ్లు మూయిస్తూ, 30 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యం చేస్తూ ఉంటాడు. అదే ఊరిలో చిట్టిబాబు అనే చెవిటి వాడి ఫామిలీ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఉండగా, ఒకానొక సందర్భం లో ప్రెసిడెంట్ ని ప్రశ్నించి, అవమాన పడి, జనం లో చైతన్యం కోసం ఆయనకి ఎదురు తిరిగి చిట్టి బాబు అన్నయ్య  ఎలక్షన్ లో నామినేషన్ వేస్తే, ఇంతకు ముందు ఇలా ఎదురు తిరిగిన వాళ్ళకి పట్టిన గతే అన్నయ్య కి కూడా పడుతుంది, కానీ చిట్టి బాబు ఇది నా ఖర్మ అని వదిలేసుకోకుండా తన అన్నయ్య చావుకి ప్రతీకారం తీర్చుకుంటాడు. ఈ ప్రాసెస్ లో అసలు నిజాలు కూడా తెలుసుకొని ప్రతీకారం ని పరిపూర్ణం చెయ్యటం తో కథ ముగుస్తుంది. 

ఈ కథని ఇలాగె చెప్పుకుంటే ఇందులో ఏముంది అనిపిస్తుంది. అసలు ఈ కథ కి హీరో చెవిటి వాడు అనే పాయింట్ ఆడ్ చేసి, మెషిన్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అనుకోకుండా కొంచెం ఈగో కలసి వచ్చేలా ఒక లవ్ స్టోరీ పెట్టి, అందులోనే ఎమోషన్స్ పండించి ఒక ఫుల్ లెంగ్త్ నరేషన్ ఇస్తే తప్ప ఒప్పించలేని కథ. ఆ నరేషన్ ఎలా ఉండి ఉండొచ్చు అని కథనం లో చెప్పుకుందాం. 

కథనం: ఫస్ట్ సీన్ విషయానికి వస్తే, ఆవేశం తోనో, ఆత్రుత తోనో, భయం తోనో వెళ్తున్న హీరో, ఒక ఆక్సిడెంట్, అతని ప్రాణాలు పోతాయి ఏమో అనే భయం తో హాస్పిటల్ లో జాయిన్ చేసి, అయన కి ఏమి కాదు అనే ఆశతో, కాకూడదు అనే కోరికతో, ఎందుకో తెలియని కోపం తో  చిట్టిబాబు ఎదురుచూస్తుంటే, కొన్ని నెలల క్రితం అంటూ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ ఒక్క సీన్ చాలు పైన చెప్పిన అన్ని ఎమోషన్స్ ని పండిస్తూ రామ్ చరణ్ నటుడిగా ఒకేసారి పది మెట్లు పైకి ఎక్కేసాడు అని చెప్పుకోటానికి. ఆలా చూస్తూ ఉండిపోయేలా మైమరపించాడు అనేది అతిశయోక్తి కాదు, అక్కడ మొదలు ఐన నటనా చెడుగుడు సినిమా మొత్తం చెలరేగిపోయాడు. 

రెండో సీన్ విషయానికి వస్తే, నల్ల త్రాచు పాము ని చంపటం కోసం తిరుగుతున్న చిట్టి బాబు కి వాచీ దొరకటం అనేది మనకి మొదట్లో తెలియక పోయినా అండర్ కరెంటు గా సుకు గారి మార్క్ అనేది సినిమా అయిపోయాక ఆలోచించినా, సెకండ్ టైం చూసినప్పుడు ఐన తెలుసుకుంటాం. కథని ముందుకి నడిపించటానికి, ప్లాంటింగ్ అండ్ పే ఆఫ్ టెక్నిక్కే గా ఉపయోగించుకోటానికి కూడా ఈ సీన్ పనికొస్తుంది అనేది, డిటైలింగ్ ఏ రేంజ్ లో చేసారు (కొన్ని సీన్స్ వరకు) అని మనం గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. 

రివర్స్ లో చూసుకున్నా అల్టిమేట్ టార్గెట్ ఐన ప్రకాష్ తో మొదలు అయ్యి, పాము లాంటి ప్రెసిడెంట్ మీదుగా (జగపతి) ఆ నిజం తెలియ చెప్పే వాచీ టాపిక్ తో కట్ చేసినవీ సీన్స్. 

మొదటి అంకం - పరిచయాలు : అసలు కథ ఇప్పుడు మొదలు అవుతుంది పాత్ర పరిచయం తో, అతడి లోపం పరిచయం తో, లిప్ రీడింగ్ కెపాసిటీ పరిచయం తో, శిష్యుడి పరిచయం తో, రంగమ్మత్త పరిచయం తో, ఊరి పేరు పరిచయం తో, అక్కడ ప్రాబ్లెమ్ పరిచయం తో. చేతికొచ్చిన పంట సొసైటీ లాగేసుకోవటం, ఆ రైతు కొడుకు చనిపోవటం, పరామర్శ కి వచ్చిన ప్రెసిడెంట్ డబ్బులు ఇవ్వటం, అయన గురుంచి తెలుసుకోలేని జనాలు ఆయనకి మొక్కటం ఆ విధం గా పాత్ర పరిచయం. ఊరిలోనే ఉంటూ తన పని తాను చేసుకునే చిట్టి బాబు, ఇంటికి వస్తూ దారిలో జరిగే అన్యాయం ని ప్రశ్నించే అన్నయ్య మరియు చిట్టి బాబు ఫామిలీ పరిచయాలు. అక్కడ నుంచి అన్నయ్య ప్రేమ పరిచయం. ప్రెసిడెంట్ నిజ స్వరూపం పరిచయం. హీరోయిన్ పరిచయం కూడా పాముని వెతుకుంటూ ఎందుకు జరిగింది అంటే, రేపు ఆ పాము కి ఎదురు తిరగటానికి ఒక కారణం హీరోయిన్ ఏ అని చెప్పటం కూడా అనుకోవచ్చు. ఇలా 2  సాంగ్స్ అయిపోయే వరకు మొదటి అంకం పర్ఫెక్ట్ మీటర్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో కి ప్రేమ పుట్టడం, ఉప కథ. ఈ ఉప కథ లో భాగం గానే ఏడిపించిన వాళ్ళని కొట్టడం, ప్రేమని చెప్పటానికి ఇంటికి వెళ్ళటం, అవమాన పడటం. మాములుగా అయితే ఇలాంటి ఉపకథ మొదలు అయ్యే టైం కి మనం రెండో అంకం లో ఉండాలి. కథానాయకుడికి ఎదురయ్యే  సమస్య పరిచయం అవ్వాలి, కానీ ఆ సమస్య ఇంకా సమయం తీసుకొని మనల్ని సరదా కాలక్షేపం లోనే ఉంచుతుంది. ఒక బాంగ్ తో స్టార్ట్ ఐన సినిమా, ఆ బాంగ్ మర్చిపోయి కాలక్షేపం చేసేలా చేస్తూ , ఎం జరిగి ఉంటుందా అని ఆలోచించుకునే టైం ప్రేక్షకుడి కి ఇవ్వకూడదు, తీరా జరగాల్సింది జరిగేలోపు వాళ్ళే ఊహించుకునే ప్రమాదం ఉంది. 

స్క్రీన్ ప్లే వాడుక బాషలో, సేవ్ ది క్యాట్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. కథకి సంబంధం లేక పోయినా హీరో క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చెయ్యటానికి ఉపయోగించే సన్నివేశం అన్నమాట. అప్పట్లో దీని గురుంచి నవతరంగం లో ఒక పెద్ద సిరీస్ అఫ్ ఆర్టికల్స్ వచ్చాయి, అతడు సినిమా లో మహేష్ బాబు పూజారిని ని రక్షించుట అంటూ... ఇక్కడ విషయానికి వస్తే, తనకి సంబంధం లేక పోయినా, గోదారిలోకి దూకి చచ్చి పోదాం అనుకున్న బాబాయి ని కాపాడటం. అటు హీరోయిజం తో పాటు, తన ఫీలింగ్స్ ని, తనపై ప్రేమ కలిగించటం కోసం వాడుకున్న విషయం. అసలు సమస్య కి నాంది పలుకుతూ ఒక క్యాటలిస్ట్ గా కూడా ఉపయోగపడిన సీన్ ఇది. ఎమోషన్ కూడా బ్రహ్మాండం గా పండింది. అక్కడ నుంచి అయినా మెయిన్ పాయింట్ కి వెళ్లకుండా ఇంకో పాట పెట్టి కాలక్షేపం చేసారు. 

రెండవ అంకం - సమస్యాత్మకం : జనరల్ గా సమస్య తో మొదలు అవ్వాల్సిన అంకం, సమస్య లోకి హీరో ఫామిలీ డైరెక్ట్ గా ఎంటర్ అవ్వటం తో మొదలు అవుతుంది. పాట ముందు సీన్ ని కంటిన్యూ చేస్తూ సొసైటీ ని హీరో అన్నయ్య క్వశ్చన్ చెయ్యటం తో మొదలు అవుతుంది. ఇక్కడితో ఉపకథ అయిన హీరో ప్రేమించిన అమ్మాయి కథ మెయిన్ కథ లోకి ఎంటర్ అవుతుంది. మనకి ఎక్కడా డీవియేషన్ ఉండకుండా మొత్తం పాత్రలు అన్ని మెయిన్ కథ లో పార్ట్ అవ్వటం మొదలు అవుతుంది. ఇక్కడ నుంచి కథలో సీరియస్ నెస్ మొదలు అవుతుంది పూర్తి స్థాయి లో. సమస్య వచ్చినప్పుడు కథానాయకుడు డైరెక్ట్ గా ఇన్వొల్వె అవ్వకుండా మనకెందుకు అనే ధోరణి పాటించటం, తన వరకు వచ్చిన తర్వాత రంగం లోకి దిగటం తెలుగు సినిమా వరకే కాదు ప్రపంచ సినిమా వరకు ఫక్తు కమర్షియల్ ఫార్ములా. పంచాయితీ సీన్ తో మొదలు అయ్యి, హీరో వార్తలు అప్డేట్ చేసే వాడి ద్వారా నిజం తెలుసుకొని, తిరగబడి , ప్రేమని అర్ధం చేసుకొని, స్టేషన్ కి వెళ్లి, అవసరం అయినప్పుడు ప్రెసిడెంట్ హ్యాండ్ ఇచ్చి, హీరో బయటికి వచ్చి, అన్నయ్య నామినేషన్ వేసి (అప్పటి వరకు హీరోయిజం అనేకంటే అన్నయ్య అంటే ప్రేమ వున్న తమ్ముడి  గానే చిట్టిబాబు ని చూస్తాం. సీరియస్ నెస్ తెలియకుండా దమ్ము సినిమా లో తొడకొట్టిన NTR టైపు హీరోయిజం అన్నమాట ఇది.), ప్రకాష్ హెల్ప్ చేసాడు అని చెప్పి... ప్రెసెంట్ కి కట్ చేసి ఇంటర్వెల్ ఇవ్వటం. ఆల్మోస్ట్ ఒక పెద్ద సినిమా చూసేసిన ఫీల్ అప్పటికే కలిగించినా కూడా (లెంగ్త్ వలన), ఈ ఎపిసోడ్స్ అన్ని మనకి కనెక్ట్ అయ్యే విధం గా ప్రెసెంట్ చెయ్యటం వలన ఫస్ట్ హాఫ్ కి ఒక మంచి ఫీల్ మనకి, మనకి అనుమానం రాకుండా డైవర్ట్ చేసిన ఫీల్ దర్శకుడికి / కథకుడికి మిగులుస్తూ సెకండ్ హాఫ్ కి ఎంటర్ అవుతుంది. 

ఎక్కడ ఆపారో అక్కడ మొదలు ఐన సెకండ్ హాఫ్ మనకి ఆరవ సినిమా చూపిస్తున్న ఫీల్ మిగులుస్తూ కథ లోకి వస్తుంది. పిచ్చొడి రూపం లో హీరో కి హింట్ ఇస్తూ భయం కలిగిస్తుంది. అప్పటి వరకు అన్నకు అండగా నిలిచినా కూడా అన్నని కోల్పోతాను ఏమో అనే భయం మొదలు అవుతుంది. తన అన్న ఆశయం నల్లేరు మీద నడక అనుకున్న హీరో కి రియాలిటీ తెలుస్తుంది. కథానాయకుడి అన్న ఆశయం కి స్పందన కరువు అవుతుంది. మనం అనుకున్నట్టు గానే సీన్స్ ముందుకి నడుస్తూ ఉంటాయి. ఒకప్పుడు శత్రువులు అనుకున్న వారు మనతో కలవటం మొదలు పెట్టక ఆశలు చిగురిస్తాయి. ఈ గట్టుకోస్తావా సాంగ్ పర్ఫెక్ట్ సిట్యుయేషన్ లో పడి కథలో ఊపుని పెంచుతుంది. ఇంతలో రంగమ్మ ఫ్లాష్ బ్యాక్ తో హీరో లో భయం మళ్ళీ మొదలు అవుతుంది. మోడల్తో ప్లాంట్ చేసిన వాచ్ సీన్ కి పే ఆఫ్ అవుతుంది. ఈ ఎమోషన్స్ తోనే రంగస్థలం మనల్ని సీట్ లో కూర్చోబెడుతుంది. ప్రకాష్ రాజ్ మీటింగ్ సీన్ మనకి నార్మల్ గానే అనిపిస్తుంది కానీ సినిమా అయిపోయాక చాలా ప్రశ్నలు రేకేస్తుంది. అది తర్వాత మాట్లాడుకుందాం. హీరో డబ్బులు తీసుకోవటం అనే సీన్ అవసరం లేక పోయినా, జగపతి కి వార్నింగ్ ఇచ్చే సీన్ రూపం లో హీరోయిజం పండే అవకాశం కలిపించింది అనుకోవచ్చు. అసలు సినిమా మొత్తం హీరో తన అన్న పై చూపించే ప్రేమ అయితే, అదే ప్రేమ నీకు నా మీద ఉన్నప్పుడు చెప్పు అని హీరోయిన్ ని అడిగే సీన్ ఒక రైటర్ మాస్టర్ స్ట్రోక్ అనుకోవచ్చు. సినిమా చూస్తున్నప్పుడు అది రిజిస్టర్ అవ్వక పోవచ్చు కానీ, డిటైలింగ్ లో పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ వున్న సీన్ ఇది. అనవసరపు ఐటెం సాంగ్స్ పెట్టి లెంగ్త్ ఇంకా పెంచటం జరిగిన మాట వాస్తవం అది కూడా హీరోయిన్ ప్రేమ చూపించే సీన్ లో ఇంతకు ముందు పొగిడిన రైటర్ ని ఏమనాలో మరి. ఆది మర్డర్ సీన్ తో సెకండ్ ఆక్ట్ కి ముగింపు పడుతుంది. అసలు ఈ సీన్ ద్వారా హీరో కి మెషిన్ వాడాల్సిన అవసరం ఏంటో తెలిసి వచ్చేలా చేసారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎంత కమర్షియల్ మీటర్ ప్రకారం ఆలోచించినా ఈ  సినిమా వరకు హీరో పాత్ర అన్నయ్యది అవుతుంది దానికి పగ సాగించే పాత్ర తమ్ముడి పాత్ర గా మిగిలిపోతుంది. ఇక్కడ నుంచి థర్డ్ ఆక్ట్ కి డైరెక్ట్ గా వెళ్లిపోవాల్సినా కూడా, అప్పటికే హీరో అయ్యన్న పై తన ప్రేమ ని మనకి చెప్పినా కూడా ఒక ఫుల్ లెంగ్త్ సాంగ్ తో దహన సంస్కరాలు చూపించి చాలా టైం తీసుకున్నారు. ఇదే ఆరవ సినిమా అయినా, అక్కడ నుంచి డబ్ సినిమా చూసే మన వాళ్ళు తెలుగు లో ఎందుకు చూడరు అనే కసి తో తీసినట్టు ఉంటుంది. ఈ టైం ని మాంటేజ్ రూపం లో వాళ్ళ చిన్నతనం చూపించినా బావుండేది ఏమో, మన ఎనర్జీ మొత్తం స్ట్రా పెట్టి లాగీసే సందర్భం ఇది. 

మూడవ అంకం: ఫలప్రాప్తి : అన్నయ్య అంటే సర్వస్యమ్ కోల్పోయిన హీరో కి మిగిలింది పగ ప్రతీకారం. ప్రెసిడెంట్ గా రంగమ్మ ని చేస్తాడు, పాత ప్రెసిడెంట్ ఏమయ్యాడో తెలియదు. ఇక్కడ సుకుమార్ గారి థ్రిల్లర్ లోకి ఎంటర్ అవుతుంది బొమ్మ. శ్రీమన్నాయన అనే పదం తెలుసుకోవటం, ప్రకాష్ ని కాంటాక్ట్ చెయ్యాలి అని చూడటం, సినిమా మొదటి సీన్ కి రావటం తో ఫ్లాష్ బ్యాక్ కి తెర పడుతుంది. అక్కడ నుంచి, రెండు నెలల తర్వాత అని క్లైమాక్స్ లో కార్డు పడే వరకు మనకి ఆరవ బొమ్మ కనపడుతుంది. అంత టైం తీసుకున్నది దీనికోసం అని మనం తెలుసుకొని అనుకునేలోపు ఒక ట్విస్ట్ రూపం లో సినిమా పూర్తి అవుతుంది. ఊరిలో జనల కోసం ప్రెసిడెంట్ ని, తన అన్నని చంపిన ప్రకాష్ ని చంపటం తో పగ పరిపూర్ణం అవుతుంది. మొదటి అంకం లో చెప్పుకున్నట్టు అసలు సమస్య ని లేట్ గా ఎంటర్ చెయ్యటం వలన ప్రేమ కథ కి కేటాయించిన సమయం కి ముగింపు లో సరైన జస్టిఫికేషన్ దొరికినట్టేనా? అనిపిస్తుంది. 

ఈ సినిమా కోసం పని చేసిన వాళ్ళు ఎవరికి ఈ సినిమా లో సీన్స్ కట్ చెయ్యటానికి మనసు రాకపోయి ఉండొచ్చు, కానీ ఇదే కథని ఇదే ఎమోషన్ తో ఇంత సేపు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సెంటిమెంట్ పేరుతో తీసుకున్న టైం వలన పెరిగిన ఎమోషన్స్ లేవు. క్రియేటివ్ ఫ్రీడమ్ ప్రొడక్షన్ టీం నుంచి పూర్తిగా లభించింది అనటంలో సందేహం లేదు కానీ, చెక్కుడు కార్యక్రమం పేరుతో అద్భుత మహా కావ్యం అనే ఫీల్ కెప్టెన్ కి ఉండటం వలన ఏమో చాలా తాపీగా కథని చెప్పిన ఫీలింగ్ ప్రేక్షకుడి కి మిగిల్చారు. ఇదే ఒక నవల అయ్యి ఉంటె ఇంకో ఇరవై ముప్పై పేజెస్ ఎక్కువ వ్రాసుకొని భావ వ్యక్తీకరణ చేసుకోవచ్చు. ఇంకా ప్రెసిడెంట్ పాత్ర విషయానికి వస్తే, తనకి ఫామిలీ ఉన్నట్టు గాని వారసుడు ఉన్నట్టు గాని చూపించనప్పుడు, తనకి పదవి వ్యామోహం వరకు ఓకే కానీ ఊరి జనాల ఆస్తి లాగేసుకొని ఎం సాధిస్తాడు? పాము ని చంపినట్టు ప్రెసిడెంట్ ని చంపించిన విధానం క్రియేటివ్ అనుకున్న కూడా, అక్కడ ప్రెసిడెంట్ తనకి సొంతం గా అన్యాయం చెయ్యలేదే, ఊరికోసం, రంగమ్మ కోసం, సేవ్ ది క్యాట్ కోసం హీరో చంపిన ఫీలింగ్ అనుకోవాలి. మరి ప్రతి కథానాయకుడు ఎవరు? ఈయన కాదు అన్నమాట.  అసలు ప్రకాష్ పాత్ర కి తన కూతురి ప్రేమ గురుంచి ఎప్పుడు తెలిసినట్టు ? బెయిల్ ఇప్పించే ముందా? నామినేషన్ వేసాక? బహిరంగ సభకు వచ్చే ముందా? తర్వాతా? బహుశా బహిరంగ సభకు వచ్చిన తర్వాతే అయ్యి ఉండొచ్చు, లేదంటే, ట్విస్ట్ రెవీల్ చేసే టైం లో, అసలు బహిరంగ సభలోనే మీ అన్నయ్య ని వేసేసి ఉండే వాడిని నువ్వు హడావుడి చేసావ్ కాబట్టి వదిలేసాను అని ఒక డైలాగ్ లాస్ట్ లో చెప్పించి ఉంటె ఇంపాక్ట్ ఇంకా బావుండేది ఏమో ? ఇదంతా ఆలోచిస్తే లాస్ట్ లో ఇచ్చిన ట్విస్ట్ కోసమే ఈ డిటైలింగ్ వదిలేశారా అనిపిస్తుంది. 

చివరిగా: ఆనాటి కథకి అలనాటి కథనం తో ఈనాడు ప్రెసెంట్ చేసారు. పాత సీసా లో పాత సరుకు అన్నమాట. అప్పటి కాలం లో కి తీసుకెళ్లగలిగారు, అప్పటి కథల్లోనే ఉండిపోయారు.  టెక్నికల్ గా సూపర్, పెరఫార్మన్సెస్ పరంగా అరాచకం, లెంగ్త్ విషయం లో కొంచెం కాంప్రమైస్ అయ్యి ఉంటె ఇంకా బావుండేది దానికి తోడు కొంచెం కొత్తదనం తోడు అయ్యి ఉంటె నా భూతొ న భవిష్యత్ అయ్యి ఉండేది ఏమో. వెరసి ఈ ప్రయోగం ఒక మంచి ప్రయత్నం అయ్యింది ఒక గొప్ప సినిమా కూడా అయ్యి ఉంటె ఇంకా బావుండేది. ఆడేస్తున్న సినిమాలు అన్ని గొప్ప సినిమాలు అనుకునే వాళ్ళకి మాత్రం వందనాలు.  రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ తన కెరీర్ లో ఒక మైలు రాయి టైపు లో జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేసాడు అని చెప్పటానికి సంకోచించాల్సిన అవసరమే లేదు.  



3 comments:

విద్యా చరణ్. said...

....ఈ టైము లో మాంటెజ్ రూపంలో వాళ్ల చిన్నతనం ని చూపించినా బాగుండేది., అవును అండి సినిమా లో అంతటికీ మొబైల్లో వాట్స్అప్ చెక్ చేసుకునే అవకాశం నాకు కల్పించిన ఒకే ఒక్క సీను అది,.... అసలు బహిరంగ సభలోనే మీ అన్నయ్య ని వేసేసి ఉండేవాడిని.ఇలా ఉండుంటే ఇంకా బాగుండేది. మీ విశ్లేషణ కు హ్యాట్సాప్ అండి. కానీ రంగస్థలం సినిమా ఆసాంతం బాగానే ఉన్నా ఎక్కడో చిన్న వెలితి వుంచినట్టు గానే మీ విశ్లేషణ లో కూడా 1991 లో మన తెలుగు లొనే వచ్చిన ఈతరం ఫిల్మ్స్ వారి "ఎర్ర మందారం" ప్రస్తావన లేకపోవటం శోచనీయం. ప్రెసిడెంట్ క్యారెక్టర్ నుంచి రంగమ్మత్త వరకు ప్రతి క్యారెక్టర్ దాని నుంచి స్పూర్తి పొంది తీసినట్టు గానే ఉంటుంది రంగస్థలం. ఇంకా ఇందులో కంటే ప్రిక్లైమాక్స్, క్లైమాక్స్
ట్విస్టులు 1991 లోనే 5 రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నందలు గెలుచుకున్న ఎర్ర మందారం లో అద్భుతమైనవి. అలా అని రంగస్థలం లోని రాంచరణ్ నటనని ఎవ్వరు తక్కువ చేయలేరు.మీరన్నట్టు ఒకే సారి 10 మెట్లు ఎక్కాడు నటన లో. మగధీర తో రాంచరణ్ హీరో అయ్యాడు మరియు రంగస్థలం తో నటుడు అయ్యాడు అన్న పరుచూరి మాటలు ప్రస్తావనీయము.

Anonymous said...

Great article. I'm experiencing a few of
these issues as well..

విద్యా చరణ్. said...

*5 రాష్ట్ర ప్రభుత్వ నందులు

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views